కొత్త పరిశోధన మరియు కొత్త న్యూట్రిషన్ మార్గదర్శకాల చుట్టూ ప్రచారం వున్నప్పటికీ, మధుమేహం వున్న కొంతమంది “డయాబెటిక్ డైట్” అనేది ఒకటి వుంది అని ఇప్పటికీ నమ్ముతారు. ఈ విధంగా పిలువబడే డైట్, చక్కెరను వదిలిపెట్టడం అనే దానిని కలిగి వుంటుంది అని కొంతమంది అనుకుంటారు, అదే సమయంలో కొంతమంది గ్లూకోజ్ ను నియంత్రించే ఒక ఖచ్చితమైన దారిగా దీనిని నమ్ముతారు. దురదృష్టవశాత్తూ, ఏ ఒక్కరూ పూర్తిగా సరికాదు.
“డయాబెటిక్ డైట్” అనేది టైప్ 1 లేక టైప్ 2 మధుమేహం వున్న వ్యక్తులు ఖచ్చితంగా అనుసరిస్తున్ననది కాదు. అది కేవలం మధుమేహం వున్న రోగుల కోసం భోజన ప్రణాళిక ఈ రోజు ఎలా పనిచేస్తుంది అని కాదు.
ముఖ్యమైన సందేశం ఏమిటంటే, సరైన విద్యతో మరియు ఆరోగ్యకరమైన ఆహారం యొక్క ఇతివృత్త పరిధిలో, మధుమేహంతో ఉన్న ఒక వ్యక్తి, మధుమేహం లేని ఒక వ్యక్తి తినే దేనినైనా తినవచ్చు.
మధుమేహం మరియు డైట్ గురించి ఏది నిజం?
ఒక సమతుల్య ఆహార ప్రణాళికలో భాగంగా మధుమేహం వున్న వ్యక్తుల కొరకు చక్కెర-కలిగిన ఆహారానికి ప్రత్యామ్నాయంగా ఇతర కార్బోహైడ్రేట్లను వాడవచ్చు అనేది సరైనదే అని మనకు ఇప్పుడు తెలుసు. 1990 మధ్య వాడుకలో వున్న నమ్మకాలు ఏమిటంటే మధుమేహం వున్న వ్యక్తులు “సింపుల్” సుగర్స్ అని పిలువబడే వాటిని కలిగిన ఆహారాలను ఖచ్చితంగా వదిలిపెట్టాలి మరియు వాటిని బంగాళాదుంపలు మరియు తృణధాన్యాలలో దొరికే వాటి వంటి “కాంప్లెక్స్” కార్బోహైడ్రేట్లతో భర్తీ చేయాలి. పిండిపదార్ధాల కంటే మరింత వేగంగా సాధారణ చక్కెరలు జీర్ణము అవుతాయి మరియు గ్రహించబడతాయి మరియు అందువలన అవి అధిక రక్త గ్లూకోజ్ స్థాయిలను ఉత్పత్తి చేయటానికి మరింత తగినవి అనే సిద్ధాంతానికి మద్దతు ఇచ్చేందుకు సాపేక్షంగా చాలా కొద్ది శాస్త్రీయ ఆధారం ఉంది అని ఆ సమయంలో పరిశోధన యొక్క ఒక సమీక్ష వెల్లడించింది.
మొత్తం ఎన్ని గ్రాముల కార్బోహైడ్రేట్లు వారు రోజంతా, ప్రతి భోజనం మరియు అల్పాహారంలో, తినవచ్చు మరియు అయినప్పటికీ తమ రక్త గ్లూకోజ్ మంచి నియంత్రణలో ఉంచవచ్చు అనే దానిపై దృష్టి పెట్టడాన్ని ఇప్పుడు చాలా మంది రోగులు నేర్చుకుంటున్నారు. బాగా నియంత్రించబడిన రక్త గ్లూకోజ్ ఒక ప్రథమ ప్రాధాన్యత ఎందుకంటే, ఇతర పరిశోధన అధ్యయనాలు మధుమేహం వున్న ప్రజలందరూ వారి రక్తంలో గ్లూకోజ్ ను సాధ్యమైనంత దగ్గరగా నియంత్రణలో ఉంచడం ద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల మరియు కంటి జబ్బు, నరాల దెబ్బతినడం మరియు మరిన్ని, వంటి మధుమేహ సమస్యలు అభివృద్ధి అయ్యే వారి ప్రమాదాన్ని తగ్గించవచ్చు అనే నిర్ణయానికి వచ్చాయి.
మధుమేహంతో వున్న ప్రజల కొరకు దీని అర్థం ఏమిటి?
వారు రోజంతా ఎన్ని గ్రాముల కార్బోహైడ్రేట్లు తినవచ్చు అని గుర్తించడానికి, ఒక నిపుణుడు మరియు ఒక మధుమేహ చికిత్స జట్టుతో పని చేసిన ఒక వ్యక్తి ఏ భోజనంలోనైనా వారు ఏమి తీసుకుంటారు అని నిర్ణయించగలరు అని దీని అర్థం. ఇన్సులిన్ మీద లేని మధుమేహ వ్యాధిగ్రస్తులు వారు తినే కార్బోహైడ్రేట్ యొక్క పరిమాణాన్ని రోజంతా స్థిరంగా ఉంచటం మీద దృష్టి పెట్టవలసిన అవసరం వుంది. ఇన్సులిన్ మీద వున్న వారు, ఒక భోజనంలో ఏమి తినాలి మరియు ఎంత తినాలి అనే రెండింటినీ నిర్ణయించవచ్చు (అది వారి రోజువారీ కేటాయింపును మించనంత కాలం) ఆపై దానికి అనుగుణంగా తమ ఇన్సులిన్ ను సర్దుబాటు చేయవచ్చు. పరిమితుల బయట ఉండే ఎటువంటి ఆహారాలు లేవు. బదులుగా, ఎవరికైనా రోజు అంతటిలో అతని లేదా ఆమె కార్బోహైడ్రేట్లు గ్రాములను తెలివిగా ఎలా ఖర్చు చేయాలి అని మాత్రం తెలుసుకునే అవసరం వుంది.
వారి రక్తంలో గ్లూకోజ్ మీద భోజనం మరియు చర్యల స్థాయిల యొక్క ప్రభావాలను ట్రాక్ చెయ్యడానికి తరచుగా ఇంట్లో చేసే రక్తంలో గ్లూకోజ్ పర్యవేక్షణ అప్పుడు ఉపయోగించబడుతుంది. వారి రక్తంలో గ్లూకోజ్ ను సాధ్యమైనంత వరకు సాధారణానికి దగ్గరగా ఉంచడానికి వారి యొక్క తీసుకునే ఆహారం, శారీరక శ్రమ, మరియు మందులలో సర్దుబాట్లు చేయడానికి వారు తమ డయాబెటిస్ స్పెషలిస్ట్ తో పనిచేస్తారు.
కార్బోహైడ్రేట్ లెక్కింపు ఎలా పని చేస్తుంది?
అత్యధిక ఆహారాలు-మాంసం మరియు కొవ్వు తప్ప- కొంత కార్బోహైడ్రేట్ ను కలిగి ఉంటాయి, మరియు కార్బోహైడ్రేట్ వేరే ఇతర ఆహారం కన్నా వేగంగా రక్త గ్లూకోజ్ ను పెంచుతుంది.
ఒక వ్యక్తి ప్రతి భోజనంలో లేదా ప్రతి రోజు తినగల కార్బోహైడ్రేట్ యొక్క గ్రాముల సంఖ్య ఈ క్రింది వాటి ద్వారా నిర్ణయించబడుతుంది:
– బరువు మరియు బరువు తగ్గుదల లక్ష్యాలు
– ఒక వ్యక్తి శారీరకంగా ఎంత చురుకుగా ఉన్నాడు (ఎందుకంటే శారీరక శ్రమ వారి రక్తంలో గ్లూకోజ్ ను తగ్గిస్తుంది)
– వారు ఏ మధుమేహ మందులు లేదా ఇన్సులిన్ తీసుకుంటున్నారు మరియు ఎప్పుడు
– వయసు లేదా అధిక రక్త కొవ్వులు ఉండటం వంటి ఇతర కారణాలు (లేదా వీటితో పాటు, ఏదైనా ఇతర వైద్య సమస్య)
ఉదాహరణకు, 81 కిలోలు బరువు గల మరియు తన ప్రస్తుత బరువును కొనసాగించాలని కోరుకునే మధుమేహ వ్యాధితో బాధపడుతున్న 6’2″ పొడవైన ఒక వ్యక్తి, అతను రోజంతటిలో 350 గ్రాముల కార్బోహైడ్రేట్ తినవచ్చని చెప్పబడి ఉండవచ్చు. అతను ఏ సమయంలోనైనా సరే తన రక్త గ్లూకోజ్ ను చాలా ఎక్కువ కానివ్వకుండటానికి వీలుగా రోజంతటలో ఆ గ్రాములను విస్తరించటం అతని లక్ష్యం అయి ఉంటుంది. అతను ఇన్సులిన్ లేదా నోటి మధుమేహ మందులు తీసుకుంటూ ఉంటే, అతని మందు దాని శక్త్యానుసారం పని చేస్తునప్పుడు, అతని భోజనం నుండి అతడి రక్తప్రవాహంలోకి తగినంత చక్కెర ఉండే విధంగా అతడు తన కార్బోహైడ్రేట్ ను తినేట్టప్పుడు కూడా అతను నిర్వహించవలసి ఉండవచ్చు.
సాధారణంగా ఒక బ్రౌనీ వంటి చక్కెర కలిగిన ఆహారంలో 30 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉండవచ్చు, కానీ ఆ బ్రౌనీ మీ రక్తంలో గ్లూకోజ్ మీద 2/3 కప్పు అన్నం లేదా ఒక కప్పు ఆపిల్ సాస్ తో సమానమైన ప్రభావం కలిగి ఉంటుంది, ఈ రెండింటిల్లో 30 గ్రాముల కార్బోహైడ్రేట్లు వుంటాయి అని ఇప్పుడు మనకు తెలుసు. కాబట్టి, ఒకవేళ ఒక డయాబెటిస్ స్పెషలిస్ట్ తో అభివృద్ధి చేయబడిన ఈ మనిషి యొక్క భోజన పథకం, అతను ఒక భోజనంలో 60 గ్రాముల కార్బోహైడ్రేట్ తినవచ్చు అని పేర్కొంటే, అతను ఆ 60 గ్రాములను ఎలా ‘ఖర్చు చేస్తాడు‘ అని నిర్ణయించవచ్చు. ఒక పర్యాయం అతను 2/3 కప్పు అన్నం మరియు ఒక కప్పు బటానీలు తీసుకోవచ్చు. మరో సారి, అతడి కార్బ్ ఎంపికల కోసం, బేక్ చేసిన ఒక చిన్న బంగాళాదుంప, ఒక కప్పు పాలు తీసుకుని డెజర్ట్ కోసం బ్రౌనీని తీసుకోవాలని అతడు నిర్ణయించుకోవచ్చు.
వారు 40 పైగా ఉన్నప్పుడు మధుమేహం అభివృద్ధి అయ్యే వ్యక్తులు, వారు అధిక బరువు కలిగి ఉన్నారు కాబట్టి తరచుగా దానిలో భాగంగా వారిలో మధుమేహం అభివృద్ధి అవుతుంది. అధిక బరువు కలిగి వుండటం అనేది వారి శరీరాలు ఆహారాన్ని శక్తి లాగా మార్చేందుకు ఇన్సులిన్ ను ఉపయోగించడాన్ని మరింత కష్టతరం చేస్తుంది. ఈ కారణంగా, మధుమేహంతో బాధపడుతున్న ఎంతోమంది రోగులు కూడా బరువు తగ్గుదలను ఒక లక్ష్యంగా కలిగి వుంటారు. (ప్రోటీన్ లేదా కార్బోహైడ్రేట్ యొక్క ఒక గ్రాము 4 కేలరీలు మాత్రమే కలిగి ఉండగా) కొవ్వు యొక్క ప్రతి గ్రాము 9 కేలరీలు కలిగి ఉన్నందున, కొవ్వు గ్రాము లెక్కింపు అనేది బరువు కోల్పోయే ఒక సాధనంగా పలు రోగుల కొరకు ఒక అదనపు న్యూట్రిషినల్ ఉపకరణం అవుతుంది.
తరచుగా మధుమేహంతో బాధ పడుతున్న వారిలో అధిక రక్త కొవ్వులు మరియు / లేదా కొలెస్ట్రాల్ స్థాయిలతో కూడా సమస్యలు వుంటాయి మరియు కొవ్వు కూడా తక్కువగా ఉండే భోజన పథకం వారికి సూచించబడుతుంది. కాబట్టి వారు అధిక బరువు కానప్పటికీ, కొంతమంది రోగులు ప్రతి భోజనంలో లేదా రోజంతటిలో తినే కొవ్వు యొక్క గ్రాములను లెక్కిస్తూ ఉండవచ్చు, అలాగే కార్బోహైడ్రేట్ యొక్క గ్రాములను కూడా.
చాలా ఆహారాలలో కార్బోహైడ్రేట్ మరియు కొవ్వు యొక్క ఎన్ని గ్రాములు ఉన్నాయి అని చూపించే అనేక ఆహార జాబితాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే, మీరు ఒక కిరాణా దుకాణంలో కొనుగోలు చేసే చాలా ఆహారాలు కార్బోహైడ్రేట్ మరియు కొవ్వు పరిమాణాలను జాబితా రూపంలో పొందుపరుస్తాయి.
సహజంగానే ఒక మొత్తం మధుమేహ చికిత్స ప్రణాళికలో భాగంగా న్యూట్రిషన్ ను ఉపయోగించడం అనేది ఒక పూర్తిగా డు-ఇట్-యువర్ సెల్ఫ్ (మీ అంతట మీరేచేసే) ప్రాజెక్టు కాదు. భోజనం ప్రణాళిక విధానం యొక్క ఏ రకం మీకు ఉత్తమంగా పని చేస్తుంది అని నిర్ణయించటానికి మీరు ఒక డయాబెటిస్ స్పెషలిస్ట్ తో పని చేస్తే ఇది ఉత్తమమైనది, అని ఆమె పేర్కొంటుంది.
కానీ ఆపై మిగిలినది చాలా వరకు మీ ఇష్టం. మీరు మీ భోజనం ప్రణాళిక ‘బడ్జెట్‘ పొందుతారు, ఆపై ప్రతి భోజనంలో దానిని ఎలా ఖర్చు పెట్టాలి అని మీరు నిర్ణయించుకుంటారు. మరియు మధుమేహం లేని వారి లాగానే, ఆరోగ్యంగా ఉండడానికి మీరు వివిధ రకాల ఆహారాలు తినవలసిన అవసరం వుంటుంది.