మధుమేహం సమస్యలను నిరోధించండి: మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోండి

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456


నా
మూత్రపిండాలు అంటే ఏమిటి మరియు అవి ఏమి చేస్తాయి?

మీ మూత్రపిండాలు రెండు బీన్- ఆకారంలో వుండే అవయవాలు, ఒక్కోటి దాదాపు ఒక పిడికిలి పరిమాణంలో వుంటాయి. అవి పక్కటెముకకు కొంచెం క్రింద, వెన్నెముకకు ఇరుప్రక్కలా ఒకటి వుంటాయి. ప్రతి రోజు, మీ రెండు మూత్రపిండాలు వ్యర్ధాలు మరియు అదనపు ద్రవాన్ని కలిగిన 1 నుండి 2 లీటర్ల మూత్రమును  ఉత్పత్తి చేయటానికి దాదాపు 120 నుంచి 150 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. మూత్రం మీ మూత్రపిండాల నుండి మీ మూత్రాశయంనకు యురేటర్స్ అని పిలిచే గొట్టాల ద్వారా ప్రవహిస్తుంది. మీ మూత్రాశయం మూత్రవిసర్జన ద్వారా దానిని విడుదల చేసే వరకు మూత్రంను నిల్వ చేస్తుంది.

ఏవిధంగా మధుమేహం నా మూత్రపిండాలను ప్రభావితం చేయవచ్చు?

మధుమేహం వల్ల ఏర్పడిన మీ రక్తంలోని చక్కెర అని కూడా పిలువబడే చాలా ఎక్కువ గ్లూకోజ్ మూత్రపిండాల యొక్క ఫిల్టర్లను దెబ్బ తీస్తుంది. ఫిల్టర్లు దెబ్బతింటే, మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన అల్బుమిన్ అనే ఒక ప్రోటీన్, మీ రక్తంలోనుండి మీ ముత్రంలోకి లీక్ అవుతుంది. పాడైపోయిన మూత్రపిండాలు మీ రక్తం నుండి వచ్చే వ్యర్ధాలు మరియు అదనపు ద్రవాన్ని సరిగా ఫిల్టర్ చేయవు. వ్యర్ధాలు మరియు అదనపు ద్రవము మీ రక్తంలో పేరుకుపోయి, మిమ్మల్ని జబ్బు పరుస్తాయి.

మధుమేహం అనేది మూత్రపిండాల వ్యాధి యొక్క ఒక ప్రధాన కారణం. మధుమేహ మూత్రపిండాల వ్యాధి అనేది మధుమేహం వలన ఏర్పడే మూత్రపిండాల వ్యాధి కొరకు వాడే ఒక వైద్యపరమైన పదం. మధుమేహ మూత్రపిండాల వ్యాధి ఒకటే సమయంలో రెండు మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది.

ఒక వేళ మూత్రపిండాల వ్యాధి మీ కుటుంబంలో వుంటే, మీకు మూత్రపిండాల వ్యాధి యొక్క ప్రమాదం కూడా వుంటుంది. మీ కుటుంబ సభ్యులతో వారి వైద్య చరిత్ర గురించి మరియు మీ వైద్యుడితో మీ మూత్రపిండాల పనితీరును పరీక్షించడం గురించి మాట్లాడండి.

రక్తపోటు మరియు అధిక రక్తపోటు అంటే ఏమిటి?

రక్తపోటు మీ రక్త నాళాల లోపలి రక్త ప్రవాహం యొక్క శక్తి. రక్తపోటు ఒక స్లాష్ ద్వారా వేరు చేయబడిన రెండు సంఖ్యలలో వ్రాయబడుతుంది.  ఉదాహరణకు, 130/80 అనే ఒక రక్తపోటు ఫలితం “130 ఓవర్ 80”    గా చెప్పబడుతుంది. మొదటి సంఖ్య మీ గుండె కొట్టుకుని మీ రక్త నాళాల ద్వారా రక్తాన్ని నెట్టినప్పుడు మీ రక్తనాళాలలో ఏర్పడే ఒత్తిడి. రెండవ సంఖ్య గుండెచప్పుళ్ల మధ్యలో మీ రక్తనాళాలు విశ్రాంతి తీసుకునేటప్పుడు ఏర్పడే ఒత్తిడి.

అధిక రక్తపోటు మీ గుండె రక్తంను సరఫరా చేయడానికి ఎక్కువగా పని చేయడానికి ఒత్తిడి చేస్తుంది. అధిక రక్తపోటు మీ గుండెను అలసిపోవునట్లు చేయవచ్చు, మీ రక్త నాళాలను  దెబ్బతీయవచ్చు, మరియు మీ గుండెపోటు,  స్ట్రోక్, కంటి సమస్యలు, మరియు మూత్రపిండాల సమస్యల యొక్క మీ ప్రమాదాన్ని పెంచవచ్చు.

ఒకవేళ నాకు మధుమేహం ఉంటే అధిక రక్తపోటు నా మూత్రపిండాలను ఎలా ప్రభావితం చేస్తుంది?

మధుమేహం ఉన్న వారిలో అధిక రక్తపోటు అనేది మూత్రపిండముల వ్యాధికి మరొక ప్రధాన కారణం. అధిక రక్తపోటు అనేది మూత్రపిండాల వ్యాధి నుండి ఏర్పడే నష్టం యొక్క ఫలితం కూడా. ఒక వేళ మీకు అధిక రక్తపోటు వుంటే మీ మూత్రపిండాలు ఇప్పటికే దెబ్బతిని వుండవచ్చు. రక్తపోటులో ఒక చిన్న పెరుగుదల కూడా మూత్రపిండాల వ్యాధిని త్వరితంగా తీవ్రతరం చేయగలదు.

నా రక్తపోటు ఎంత ఉండాలి?

మీరు మూత్రపిండముల వ్యాధి కలిగి వున్నారా మరియు అది ఎంత తీవ్రంగా వుంది అనే దాని మీద ఆదారపడి మీ రక్తపోటు లక్ష్యం 140/80 లేదా 140/90 క్రింద ఉండాలి. మీ వైద్యునితో మీ వ్యక్తిగత లక్ష్యం గురించి  చర్చించండి.

మధుమేహం ఉన్న చాలా మంది ప్రజలు అధిక రక్తపోటు కలిగి వుంటారు.  అయితే, మీ రక్తపోటును మీ లక్ష్యంలో ఉంచుకోవడం అనేది మీ మూత్రపిండాలు, గుండె, మెదడు, రక్తనాళాలు, మరియు మీ శరీరం యొక్క ఇతర భాగాలకు జరిగే నష్టంను నిరోధించడానికి సహాయం చేస్తుంది. భోజన ప్రణాళిక, మందులు, మరియు శారీరక శ్రమ మీ రక్తపోటు లక్ష్యంను చేరుకోవడానికి మీకు సహాయపడుతాయి.

ప్రతి ఆరోగ్య సంరక్షణ సందర్శన సమయంలో మీ రక్తపోటును తనిఖీ చేయించుకోండి. మీ రక్తపోటును నియంత్రించడానికి మీకు మందు అవసరమా అని మీ వైద్యుడుని అడగండి. మీ రక్తపోటును నియంత్రించడానికి సహాయపడే మందు మూత్రపిండాల వ్యాధి యొక్క పురోగతిని నిదానపరచగలదు.

యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ (ACE) ఇన్హిబిటర్స్ మరియు యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ (ARBs) అనే రెండు రకాల రక్తపోటును తగ్గించే మందులు,  మధుమేహం ఉన్న వారిలో కిడ్నీ వ్యాధి పురోగతిని తగ్గిస్తాయని కనుగొనబడ్డాయి.

ధుమేహ మూత్రపిండాల వ్యాధి యొక్క లక్షణాలు ఏమిటి?

ప్రారంభ దశలలో, మధుమేహ మూత్రపిండాల వ్యాధికి ఎటువంటి లక్షణాలు వుండవు. మూత్రపిండాల వ్యాధి ఎంత నెమ్మదిగా మొదలవుతుంది అంటే, అనేక సంవత్సరాల వరకు మీకు జబ్బుపడినట్లుగా కూడా అనిపించకపోవచ్చు.  మీ మూత్రపిండాలు ఆరోగ్యకరమైన మూత్రపిండాలు చేసే పనిలో కేవలం సగం చేసినప్పుడు కూడా జబ్బుపడినట్లుగా మీకు అనిపించకపోవచ్చు.  కనీసం సంవత్సరంనకు ఒక్కసారి మీ మూత్రంలో ప్రోటీన్, లేదా ఆల్బుమిన్ స్థాయిని తనిఖీ చేయడం ద్వారా కేవలం మీ వైద్యుడు మాత్రమే   మీకు మూత్రపిండాల వ్యాధి ఉందా అని చెప్పగలడు.

మధుమేహ మూత్రపిండాల వ్యాధి మొదటి లక్షణం మీ శరీరంలో కొన్ని భాగాలైన, మీ చేతులు, ముఖం, కాళ్లు, లేదా చీలమండలంలలో తరచూ వాపు వస్తుంది. అలాగే, మీ మూత్రంలోని ప్రోటీన్ యొక్క అధిక పరిమాణాలు మూత్రంను నురుగులా కనిపించటానికి కారణం కావచ్చు. ఒకసారి మీ మూత్రపిండం పనితీరు తగ్గడం మొదలైన తరువాత, ఇతర లక్షణాలలో ఈ క్రిందివి ఉండవచ్చు

  • పెరిగిన లేదా తగ్గిన మూత్రవిసర్జన
  • మగతగా లేదా అలసినట్లుగా అనిపించడం
  • దురద లేదా తిమ్మిరిగా అనిపించడం
  • పొడిబారిన చర్మం
  • తలనొప్పులు
  • బరువు తగ్గడం
  • ఆకలిగా అనిపించకపోవడం
  • మీ కడుపులో జబ్బు ఉన్నట్లుగా అనిపించడం
  • వాంతులు
  • నిద్ర సమస్యలు
  • దృష్టిని కేంద్రీకరించి ఉండటంలో ఇబ్బంది
  • నల్లబడిన చర్మం
  • కండరాలలో తిమ్మిరి వంటి ఓ రకమైన పక్షవాతం

నాకు మధుమేహ మూత్రపిండ వ్యాధి ఉందా అని నేను ఎలా తెలుసుకోగలను?

కింది పరీక్షలు మీకు మధుమేహ మూత్రపిండాల వ్యాధి ఉందా అని మీకు మరియు మీ వైద్యుడుకి తెలియజేయగలవు:

  • రక్తపోటు పరీక్ష. మీ వైద్యుడు మీ రక్తపోటును తనిఖీ చేయడానికి ఒక రక్తపోటు కఫ్ ను ఉపయోగిస్తాడు. ప్రతి ఆరోగ్య సంరక్షణ సందర్శనలో మీరు ఈ పరీక్ష చేయించుకోవాలి.
  • అల్బుమిన్ మరియు క్రియాటినిన్ కొలత. మీ వైద్యుడు అల్బుమిన్ కోసం చూడడానికి మీ మూత్ర నమూనా కోసం అడుగుతాడు. మీ మూత్రంలోని అల్బుమిన్ యొక్క అధిక స్థాయి అంటే మీకు మూత్రపిండ వ్యాధి వుంది అని అర్థం కావచ్చు. అల్బుమిన్ మొత్తంను మీ మూత్రంలోని మరొక ఒక వ్యర్థ పదార్థమైన క్రియాటినిన్ మొత్తంతో పోల్చి చూసే ఒక పరీక్ష కోసం మూత్ర నమూనా ఒక ప్రయోగశాలకు పంపబడుతుంది. 30 కంటే ఎక్కువ వుండే ఒక మూత్ర అల్బుమిన్ క్రియాటినిన్ రేషియో పరీక్ష ఫలితం మూత్రపిండ వ్యాధికి ఒక సంకేతం. మీరు ఈ పరీక్షను కనీసం సంవత్సరానికి ఒక సారి చేయించుకోవాలి.
  • ఎస్టిమేటెడ్ గ్లోమెరులార్ ఫిల్టరేషన్ రేట్ (eGFR) టెస్ట్. మీ వైద్యుడు యొక్క ఆఫీసు వద్ద తీసుకోబడి ఒక ప్రయోగశాలకు పంపబడిన రక్తాన్ని మీ మూత్రపిండాలు ప్రతి నిమిషం ఎంత రక్తం శుద్ది చేస్తాయి అని కొలవడానికి పరీక్షించవచ్చు. మీ మూత్రపిండాలు తగినంత రక్తంను శుద్ది చేయకపోతే, మీ మూత్రపిండాలు దెబ్బతినడం లేదా మూత్రపిండాల వైఫల్యం కలిగి ఉండవచ్చు. మీరు కనీసం సంవత్సరానికి ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవాలి. పరీక్షా ఫలితాలు ఈ క్రింది వాటిని చూపిస్తాయి.
  • 60 లేదా పైన వుండే eGFR సాధారణ స్థాయిలో ఉంది
  • 60 క్రింద వుండే eGFR అంటే మీకు మూత్రపిండాల వ్యాధి వుంది అని అర్థం కావచ్చు
  • 15 లేదా తక్కువ వుండే eGFR అంటే మీకు మూత్రపిండాల వైఫల్యం వుంది అని అర్థం కావచ్చు

మీ రక్తం మరియు మూత్ర పరీక్ష ఫలితాలు మూత్రపిండాలు దెబ్బతినట్టు లేదా వ్యాధి వున్నట్టు రుజువు చేస్తే, దెబ్బతినడానికి  కారణాలు ఇతర ఆరోగ్య సమస్యలు కలిగి వున్నారో లేదో కనుగొనడానికి సహాయంగా మీ వైద్యుడు మీకు మరిన్ని పరీక్షలు సూచించవచ్చు.  రక్తం మరియు మూత్రం నమూనాల వంటి మరియు ఇమేజింగ్ పరీక్షలు, లేదా మీ మూత్రపిండాలు యొక్క చిత్రాల అదనపు పరీక్షలు చేస్తారు. మీ వైద్యుడుకు బయాప్సీ కుడా అవసరం ఉండవచ్చు ఇందులో మైక్రో స్కోప్ లో చూడడానికి మూత్రపిండం యొక్క ఒక చిన్న కణం ముక్కను తీసుకొంటారు.

నాకు మధుమేహ మూత్రపిండం వ్యాధి ఉంటే నేను ఏమి చేయాలి?

ఒకసారి మీకు మధుమేహ మూత్రపిండం వ్యాధి వున్నప్పుడు,  వాటిని నియంత్రణలో ఉంచడానికి మీ రక్తంలో గ్లూకోజ్ మరియు రక్తపోటు విలువలను నిశితంగా గమనించడం ద్వారా మీరు దాని వేగాన్ని తగ్గించవచ్చు లేదా దానిని మరింత ముదరకుండా ఉంచవచ్చు.

మీరు అధిక రక్తపోటు లేదా మీ మూత్రంలో ప్రోటీన్ ను కలిగి ఉంటే, మీ రక్తపోటును నియంత్రించడానికి మరియు మూత్రపిండాలు దెబ్బతినడం తగ్గించడానికి మీరు ఒక ACE ఇన్హిబిటరు లేదా ARB ని తీసుకోవచ్చు. ఒకవేళ మీరు గర్భవతి అయితే, మీరు ACE ఇన్హిబిటరు లేదా ARB తీసుకోకూడదు.

తరచుగా మీ వైద్యుడిని కలవండి. మీ మూత్రపిండాలు ఎంత బాగా పనిచేస్తున్నాయో చూడటానికి మీ వైద్యుడి సలహా మీద మీ మూత్రం మరియు రక్తాన్ని పరీక్ష చేయించుకోండి. మీరు మూత్రపిండాల వ్యాధిలో నైపుణ్యం కలిగిన ఒక నెప్రాలజిస్ట్ ను కలవవలసిన అవసరం కూడా ఉండవచ్చు.

 

తినడం, డైట్, మరియు న్యూట్రిషన్

మీ డైటిషియన్ లేదా వైద్యుడు మీ కోసం ఒక ప్రత్యేక ఆహార ప్రణాళికను సూచించవచ్చు. మీరు ప్రోటీన్, కొవ్వు, సోడియం మరియు పొటాషియం అధికంగా కల ఆహారంను నివారించవలసి ఉండవచ్చు.

ప్రోటీన్ ను తగ్గించండి, ముఖ్యంగా మాంసం వంటి జంతు ఉత్పత్తులు. పాడైపోయిన మూత్రపిండాలు మీ రక్తం నుండి ప్రోటీన్ వ్యర్థ ఉత్పత్తులను తొలగించడంలో విఫలం కావచ్చు. ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాలు మీ మూత్రపిండాలను కష్టంగా పని చేసేటట్లు చేస్తాయి మరియు తొందరగా దెబ్బతినేటట్లు చేస్తాయి.

అధిక కొవ్వు ఆహారంను మానుకోండి. అధిక కొవ్వు ఆహారాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్  అనేది మీ శరీర కణాలు, రక్తం, మరియు అనేక ఆహారాలలో కనిపించే ఒక రకమైన కొవ్వు. మీ శరీరం సరిగ్గా పని చేయుటకు కొంత కొవ్వు అవసరం. ఉదాహరణకు, మీ శరీరం కొన్ని ముఖ్యమైన హార్మోన్లను తయారు చేయుటకు మరియు నరాలు పనిచేయుటను నిర్వహించుటకు కొవ్వును ఉపయోగిస్తుంది. అయితే, మీ శరీరం దానికి అవసరమైన మొత్తం కొలెస్ట్రాల్ ను తయారు చేస్తుంది. మీరు తరచుగా కొవ్వు ఎక్కువగా వున్న ఆహారాలు తింటే, లేదా మీ కుటుంబంలో అధిక కొవ్వు వుంటే, మీరక్తంలోని అదనపు కొవ్వు కాలక్రమేణా మీ రక్తనాళాల గోడలలో మరియు ధమనులలో పేరుకుపోతుంది. అధిక రక్తంలో కొవ్వు అనేది మధుమేహం వున్న వ్యక్తుల యొక్క కొన్ని అతి పెద్ద ఆరోగ్య సమస్యలైన గుండె వ్యాధి, మరియు స్ట్రోక్ కు దారితీయవచ్చు.

అధిక సోడియం ఆహారాలు మానుకోండి. సోడియం అనేది ఉప్పు మరియు ఇతర ఆహారాలలో కనిపించే ఒక మినరల్. సోడియం యొక్క అధిక స్థాయిలు మీ రక్తపోటును పెంచవచ్చు. కొన్ని అధిక-సోడియం ఆహారాలలో క్యాన్డ్ ఫుడ్, ఫ్రోజెన్ డిన్నర్లు, మరియు హాట్ డాగ్లు ఉంటాయి. ఫుడ్ లేబుల్ మీద ఎంత సోడియం వుంది అనేది ముద్రిస్తారు కాబట్టి మీరు ఏ ఆహారాలు అత్యధిక స్థాయిలో కలిగి వున్నాయో చూడవచ్చు. మీరు సోడియంను రోజుకు ఒక టీ స్పూన్ కంటే తక్కువ లేదా దాదాపు 2,300 మిల్లీగ్రాములకు (mg) పరిమితం చేయడానికి ప్రయత్నించండి. మీరు అధిక రక్తపోటు కలిగి వుంటే లేదా ఆఫ్రికన్ అమెరికన్, మధ్య వయస్కులు లేదా అంత కంటే ఎక్కువ వయస్సున్న వారు అయితే, రోజుకు 1,500 mg సోడియం కంటే మించకుండా లక్ష్యంగా పెట్టుకోండి. మీరు ఎంత సోడియం తీసుకోవలయునో మీ వైద్యుడిని లేదా మీ డైటీషియన్ ను అడగండి.

మీకు ఎంత పొటాషియం అవసరమో మీ వైద్యుడిని అడగండి. పొటాషియం అనేది మీ గుండెకొట్టుకోవడాన్ని క్రమంగా ఉంచడానికి మరియు కండరములు సరిగ్గా పని చేయడానికి సహాయపడే ఒక ఖనిజం. ఆరోగ్యకరమైన మూత్రపిండాలు మీ శరీరంలో సరైన పొటాషియం మొత్తంను ఉంచుతాయి. అయితే, మీ మూత్రపిండాలు తీవ్రంగా పాడై పోయివుంటే, పొటాషియం యొక్క అధిక స్థాయిలు ఒక అసాధారణ గుండెలయను కలిగించవచ్చు లేదా కార్డియాక్ అరెస్ట్ అని పిలువబడే మీ గుండె ఆగిపోవునట్లు కూడా చేస్తాయి. కొన్ని అధిక-పొటాషియం ఆహారాలలో అప్రికాట్లు, అరటిపళ్లు, నారింజ పండ్లు, మరియు బంగాళాదుంపలు ఉంటాయి.

ఎక్స్ రేలు నా మూత్రపిండాలను ఎలా ప్రభావితం చేయగలవు?

మీ అవయవాల యొక్క ఒక మంచి చిత్రాన్ని ఇవ్వడానికి కాంట్రాస్ట్ మీడియం అని పిలువబడే ఒక ప్రత్యేక డై ని ఉపయోగించే ఎక్స్ రేలు మీ మూత్రపిండాలకు ఒక ప్రమాదాన్ని కలిగించవచ్చు. మీ రక్తనాళాలలోకి చొప్పించబడే కాంట్రాస్ట్ మీడియం అనేది మూత్రపిండాలకు నష్టం కలిగించగల ఒక రకం. ఒకవేళ మీకు  మీ రక్తనాళాలలోకి చొప్పించబడే కాంట్రాస్ట్ మీడియంతో వుండే  ఎక్స్ రేలు అవసరమైతే, మీ మూత్రపిండాలను కాపాడుటకు మీ వైద్యుడు ఎక్స్ రే లకు ముందు మరియు తర్వాత మీకు అదనపు ద్రవాలను మరియు మందులను ఇవ్వవచ్చు. లేదా, కాంట్రాస్ట్ మీడియంను ఉపయోగించని ఒక పరీక్షను ఆదేశించడానికి మీ వైద్యుడు నిర్ణయించవచ్చు.

మూత్రపిండాల వైఫల్యం అంటే ఏమిటి?

చివరి-దశ మూత్రపిండ వ్యాధి లేదా ESRD అని కూడా పిలవబడే, మూత్రపిండ వైఫల్యం అంటే మీ మూత్రపిండాలు ఇకపై తమ పనిని చేయడానికి తగినంత బాగా పని చేయవు అని అర్ధం. మీ మూత్రపిండాలు చేయడం నిలిపివేసిన పనిని భర్తీ చేయడానికి మీకు చికిత్స అవసరమవుతుంది.

నా మూత్రపిండాలు విఫలమైతే ఏం జరుగుతుంది?

డయాలసిస్ మరియు మూత్రపిండ మార్పిడి అనేవి మూత్రపిండాల వైఫల్యం కొరకు రెండు చికిత్సలు.

డయాలసిస్

డయాలసిస్ తో చికిత్స అనేది మూత్రపిండాల వైఫల్యానికి చికిత్స చేయడానికి ఒక మార్గం, ఇది మీ మూత్రపిండాలు చేస్తుండిన పనిలో కొంత భాగాన్ని చేస్తుంది.

హీమోడయాలసిస్ అని పిలువబడే డయాలసిస్ యొక్క ఒక రూపం, మీ శరీరం వెలుపల ఒక ఫిల్టర్ గుండా  మీ రక్తాన్ని ప్రవహింపచేయుటకు ఒక మిషన్ ను ఉపయోగిస్తుంది. మీరు హీమోడయాలసిస్ ను ఎంచుకుంటే, మీరు ఎంత ద్రవం తాగుతారు అని మీరు గమనించాలి. మీరు ప్రతి రోజు ఎంత ద్రవం త్రాగాలి అనే దాన్ని తెలుసుకొనుటకు మీ డైటీషియన్ మీకు సహాయం చేస్తాడు. అదనపు ద్రవం మీ రక్తపోటును పెంచగలదు, మీ గుండె ఎక్కువ పని చేసేటట్లు చేయగలదు, మరియు డయాలిసిస్ చికిత్సల యొక్క ఒత్తిడిని పెంచగలదు. అనేక ఆహారాలు—సూప్, ఐస్ క్రీమ్, మరియు పండ్లు వంటివి—నీటిని  కలిగి వుంటాయి అని గుర్తుంచుకోండి.  మీ దాహంను నియంత్రించే చిట్కాల కొరకు మీ డైటీషియన్ అడగండి.

పెరిటోనియాల్ డయాలిసిస్ అని పిలువబడే, డయాలిసిస్ యొక్క మరొక రూపం, మీ శరీరం లోపలి  రక్తంను ఫిల్టర్ చేయుటకు మీ పొట్ట యొక్క లైనింగ్ లేదా మీ ఛాతీ మరియు తుంటి మధ్య ప్రాంతాన్ని ఉపయోగిస్తుంది.

మీకు ఏ రకము డయాలసిస్ ఉత్తమంగా పని చేస్తుంది అని మీరు మరియు మీ వైద్యుడు నిర్ణయిస్తారు.

మీ మూత్రపిండాలు చేస్తుండిన కొంత పనిని డయాలసిస్ చేస్తుంది.

మూత్రపిండాల మార్పిడి 

మూత్రపిండాల వైఫల్యానికి చికిత్స చేయడానికి మరొక మార్గం మూత్రపిండ మార్పిడి చేయించుకోవడం. ఈ ఆపరేషన్ ఒక దాత నుండి ఒక ఆరోగ్యకరమైన మూత్రపిండాన్ని మీకు ఇస్తుంది.

ఒక దాత ఒక జీవించివున్న వ్యక్తి కావచ్చు. ఒక జీవించివున్న దాత, పేరెంట్, సోదరుడు, సోదరి, లేదా బిడ్డ వంటి రక్త సంబంధీకుడు, లేదా సన్నిహిత మిత్రుడు లేదా, జీవిత భాగస్వామి వంటి రక్త సంబంధం లేని బంధువు కావచ్చు. జీవించివున్న మూత్రపిండ దానం అనేది తక్కువ సమయంలో మంచి నాణ్యత గల మూత్రపిండంను అందిస్తుంది. మూత్రపిండ దానం చేయడం అనేది దాతను భవిష్యత్ ఆరోగ్య సమస్యల ప్రమాదంలోవుంచదు.

మీరు జీవించివున్న ఒక దాత నుండి మూత్రపిండం పొందలేకపోతే, జబ్బుపడిన దాత మూత్రపిండం లేదా అప్పుడే మరణించిన లేదా బ్రెయిన్ డెడ్ తో బాధపడిన ఒక వ్యక్తి నుండి తీసుకోబడే మూత్రపిండం కొరకు మీ పేరు జాతీయ వైయిటింగ్ జాబితాలో ఉంచబడవచ్చు. తరచుగా, జబ్బుపడిన దాత మూత్రపిండం కొరకు కంటే జీవించిన దాత మూత్రపిండం కొరకు ఎక్కువ వేచి వుండవలసి వుంటుంది.

జీవించివున్న మరియు మరణించిన దాత మూత్రపిండాలు రెండూ మీ శరీరానికి బాగా సరిపోవాలి.

ధూమపానం నా మధుమేహంను మరియు మూత్రపిండాలను ఎలా ప్రభావితం చేస్తుంది?

ఇప్పటికే మీకు మూత్రపిండాల వ్యాధి ఉంటే, ధూమపానం రక్తనాళ, గుండె, మరియు మూత్రపిండ సమస్యలను మరింత తీవ్రతరం చేయవచ్చు. ధూమపానం చేసేవారిలో మూత్రపిండ క్యాన్సర్ సర్వసాధారణం.

ధూమపానం మరియు మధుమేహం ఒక ప్రమాదకరమైన కలయిక. ధూమపానం పలు మధుమేహ సమస్యల యొక్క మీ ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు ధూమపానం విడిచిపెడితే,

  • గుండెపోటు, స్ట్రోక్, నరాల వ్యాధి, మూత్రపిండ వ్యాధి, మరియు మీ శరీరంలో ఒక భాగాన్ని తీసివేసే ఒక శస్త్ర చికిత్స అయిన అవయవ విచ్ఛేదనం యొక్క మీ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
  • మీ కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు స్థాయిలు మెరుగుపడవచ్చు
  • మీ రక్త ప్రసరణ మెరుగుపడుతుంది

నేను నా మూత్రపిండాలను ఆరోగ్యంగా ఎలా ఉంచుకోగలను?

మీరు ఈ చర్యలు చేయడం ద్వారా మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు:

  • మీ రక్తంలో గ్లూకోజ్ విలువలను మీ లక్ష్యానికి సాధ్యమైనంత దగ్గరగా ఉంచండి. మీ డాక్టర్ మీ లక్ష్య రక్త గ్లూకోజ్ విలువలను సెట్ చేయడానికి మీతో పని చేస్తాడు మరియు మీ విలువలు చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ ఉంటే ఏమి చేయాలి అని మీకు నేర్పుతాడు.
  • మీ రక్తపోటు విలువలను మీ వ్యక్తిగత లక్ష్యానికి సాధ్యమైనంత దగ్గరగా ఉంచండి. మీరు రక్తపోటు మందు తీసుకుంటే, మీ డాక్టర్ సూచించినట్లుగా దానిని తీసుకోండి.
  • ఆరోగ్యకరమైన భోజనం తినండి మరియు మీరు మరియు మీ వైద్యుడు లేదా డైటిషియన్ తయారు చేసిన భోజన ప్రణాళికను అనుసరించండి. మీకు ఇప్పటికే మూత్రపిండాల వ్యాధి ఉంటే, మీరు ప్రోటీన్, కొవ్వు, సోడియం మరియు పొటాషియం అధికంగా గల డైట్ ను నివారించవలసి ఉండవచ్చు.
  • మీరు హీమోడయాలసిస్ ను ఎంచుకుంటే, మీరు ఎంత ద్రవం త్రాగుతారు అని చూడండి. ప్రతి రోజు ఎంత ద్రవం త్రాగాలి అని గుర్తించడానికి మీ డైటిషియన్ మీకు సహాయపడతాడు.
  • మూత్రపిండాల వ్యాధి కొరకు కనీసం సంవత్సరానికి ఒకసారి ఈ పరీక్షలను చేయించుకోండి:
  • రక్త పోటు పరీక్ష
  • అల్బుమిన్ మరియు క్రియాటినిన్ కొలత
  • eGFR
  • మీ డాక్టర్ మీకు అవసరం అని భావించిన ఏవైనా ఇతర మూత్రపిండ పరీక్షలను చేయించుకోండి.
  • తరచూ నొప్పి నివారణ మందులను తీసుకోవడాన్ని నివారించండి. ఆర్థరైటిస్-రకం నొప్పి నివారణ మందులైన ఇబూప్రొఫెన్ మరియు నప్రోక్సెన్ వంటి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందుల యొక్క రోజువారీ ఉపయోగం అనేది మీ మూత్రపిండాలను దెబ్బతీయవచ్చు. మీరు ఆర్థరైటిస్ వంటి ఒక ఆరోగ్య సమస్య వలన దీర్ఘకాలిక, లేదా దీర్ఘకాలం కొనసాగే, నొప్పితో బాధ పడుతుంటే, మీ మూత్రపిండాలను ప్రమాదంలో ఉంచకుండా మీ నొప్పిని నియంత్రించడానికి ఒక మార్గాన్ని కనుగొనడానికి మీ డాక్టర్ తో పనిచేయండి.
  • మూత్రాశయ లేదా మూత్రపిండాల ఇన్ఫెక్షన్స్ కొరకు వెంటనే ఒక వైద్యుడిని కలవండి. మీకు ఈ లక్షణాలు ఉన్నట్లయితే మీకు ఒక ఇన్ఫెక్షన్ ఉండవచ్చు:
  • మీరు మూత్రవిసర్జన చేసే సమయంలో నొప్పి లేదా మంట
  • తరచుగా మూత్రవిసర్జన చేయాలనే ఒక తపన
  • చిక్కగా, ఎర్రగా, లేదా ముదురుగా కనిపించే మూత్రం
  • జ్వరం లేదా వణుకుతున్నట్లు అనిపించడం
  • మీ వీపులో లేదా మీ ప్రక్కటెముకల క్రింది వైపు నొప్పి
  • ఒకవేళ మీరు ధూమపానం చేస్తే, ధూమపానం ఆపండి.

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు