చాలా తక్కువ-కేలరీ డైట్స్

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456

చాలా తక్కువ-కేలరీ డైట్ (VLCD) కేవలం కెలోరీలు తక్కువగా ఉండేటటు వంటి ఏదో ఒక డైట్ కాదు. ఇది, ముందుగా తయారు చేయబడ్డ సూత్రాలతో, తరచుగా లిక్విడ్ షెక్ రూపంలో, మీ మొత్తం భోజనాన్ని భర్తీ చేసే ఒక ప్రత్యేక రకమైన ఆహారం.

స్థూలకాయం ఉందని భావించబడే కొందరి వ్యక్తులకు స్వల్ప కాలం కొరకు తొందరగా బరువు తగ్గడానికి VLCD ని ఉపయోగించవచ్చు.  ఆ డైట్ కు మీ ముఖ్యమైన వైద్యుడి దగ్గరి పర్యవేక్షణ అవసరం మరియు అది సాధారణంగా బరువు తగ్గే ఇతర పద్ధతులతో కలుపబడుతుంది (క్రింద స్థూలకాయానికి ఏవిధంగా   చికిత్స చేయబడుతుంది? ను చూడండి).

ఈ రకమైన డైట్ యొక్క ప్రమాదాలు మరి ప్రయోజనాల గురించి ఈ  ఫ్యాక్ట్ షీట్ మీకు మరింత  చెప్పుతుంది. మీ స్వంతంగా VLCD కి పోవద్దు. ఒక వేళ మీరు బరువు తగ్గవలసిన అవసరం ఉంటే,  మీకు ఉత్తమంగా సరిపోయే విధానాల గురించి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో మాట్లాడండి.

VLCD  అంటే ఏమిటి?   

స్థూలకాయానికి ఏవిధంగా చికిత్స చేయబడుతుంది?

ఈ క్రింది పద్ధతులలో ఒకటి లేదా ఎక్కువ వాటిని ఉపయోగించి స్థూలకాయానికి చికిత్స చేయబడుతుంది:

  • ఒక తక్కువ కేలరీలు గల డైట్
  • పెంచబడిన శారీరక శ్రమ
  • ప్రవర్తన చికిత్స(బిహేవియరల్ థెరపీ)
  • సిఫారసు చేయబడ్డ మందులు
  • బరువు-తగ్గింపు శస్త్రచికిత్స

ఒక రోజుకు 800 కేలరీల వరకు అందించే VLCD ఒక ప్రత్యేక డైట్. VLCD లు వాణిజ్య సూత్రాలను, సాధారణంగా మీ అన్ని సాధారణ భోజనాలను భర్తీ చేసే లిక్విడ్ షేక్స్, సూప్స్ , లేదా బార్స్ ను ఉపయోగిస్తాయి. ఈ సూత్రాలు మీకు కిరాణా దుకాణాలు లేదా మందుల దుకాణాలలో దొరికే ఒక రోజుకు ఒకటి లేదా రెండు భోజనాల బదులుగా వాడబడే భోజనం ప్రత్యామ్నాయాల లాంటివి కాదు.

అనేక కారకాల మీద ఆధారపడి, ఆరోగ్యకరమైన పెద్దలకు వారి రోజువారీ శక్తి అవసరాలను తీర్చటానికి వివిధ పరిమాణాల కేలరీలు అవసరం.  ఒక ప్రామాణిక పరిమాణం 2,000 కాలరీలు. చాలా మంది ప్రజలకు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి అవసరమైన వాటి కంటే చాలా తక్కువ కేలరీలను  VLCD లు  అందిస్తాయి.  ఈ రకమైన డైట్ ను తొందరగా బరువు తగ్గడానికి ఉపయోగిస్తారు, తరచుగా ఒక ఊబకాయ చికిత్సా కార్యక్రమాన్ని జంప్ స్టార్ట్ చేయటానికి ఒక మార్గం లాగా ఉపయోగిస్తారు.

VLCD సూత్రాలు మీరు తొందరగా బరువు తగ్గుటకు మీకు అవసరమైన అన్ని పోషకాలను అందించడానికి రూపొందించబడ్డాయి.  అయితే, ఈ రకమైన డైట్ ను ఒక స్వల్ప కాలానికి మాత్రమే ఉపయోగించాలి—సాధారణంగా దాదాపు 12 వారాలు.

నేను బరువు తగ్గడానికి VLCD ని ఉపయోగించాలా?

తక్కువ కేలరీల డైట్  (LCD)

ఒక LCD కేలరీలను పరిమితం చేస్తుంది, కానీ ఒక VLCD అంత కాదు. ఒక సాధారణ LCD వీటిని అందించవచ్చు

  • ఒక స్త్రీకి 1,000-1,200 కేలరీలు/రోజు
  • ఒక పురుషునికి1,200-1,600 కేలరీలు/రోజు

కాలరీల సంఖ్యను మీ వయస్సు, బరువు, మరియు మీరు ఎంత హుషారుగా వున్నారు అనే దాని మీద ఆధారపడి సవరించవచ్చు.  ఒక LCD సాధారణ ఆహారాలను కలిగి ఉంటుంది,  కాని భోజన ప్రత్యామ్నాయాలను కూడా కలిగి వుండవచ్చు. ఫలితంగా, మీరు ఒక VLCD కంటే ఈ రకమైన డైట్ ను అనుసరించడం చాలా సులభమైనది అని తెలుసుకోవచ్చు. దీర్ఘకాలంలో, LCD లు VLCD ల అంత పరిమాణంలోనే వెయిట్-లాస్ కు దారితీస్తాయని కనుగొనబడింది.

బరువు తగ్గవలసిన అవసరం వున్న ఎక్కువ మంది VLCD ని ఉపయోగించరాదు. వారిలో చాలామందికి, తక్కువ కాలరీ డైట్  (LCD) బాగా పనిచేయవచ్చు (లో కాలరీ డైట్ (LCD) ను చూడండి).

ఊబకాయం కలిగిన పెద్దలలో తొందరగా బరువు తగ్గుటకు VLCD ని ఉపయోగించవచ్చు. ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు ఒక్కొక్క కేసు ప్రాతిపదికన ప్రమాదాలను మరియు లాభాలను సమీక్షించాలి.

సాధారణంగా, VLCD లు పిల్లలకు తగినవి కావు. కొన్ని సందర్భాల్లో,  కొందరు ఊబకాయం కలిగిన యువకులకు చికిత్సలో వాటిని వాడవచ్చు.

ఎక్కువ వయస్సు పెద్దలకు బరువును తగ్గించుటలో  VLCD ల ఉపయోగం గురించి ఎక్కువగా తెలియదు. 50 సంవత్సరాలు పైబడిన కొంతమంది వైద్య సమస్యలు కలిగి వుండవచ్చు, అవి వారిని ఈ రకమైన డైట్ కు సరిపోని వారిగా చేయవచ్చు.

VLCD యొక్క ఆరోగ్య లాభాలు ఏమిటి?

VLCD వారానికి సుమారు 2 నుంచి 3 కిలోలు తగ్గుటకు మిమ్మల్ని అనుమతించవచ్చు. ఇది 12 వారాలకు సగటున మొత్తం 20 కేజీలు బరువు తగ్గుటకు దారితీయవచ్చును. ఇటువంటి ఒక బరువు తగ్గుదల మధుమేహం, అధిక రక్తపోటు, మరియు అధిక కొలెస్ట్రాల్ తో సహా ఊబకాయంతో సంబంధం కలిగిన  వైద్య పరిస్థితులను వేగంగా మెరుగుపరచవచ్చు.

ఒక VLCD లో చాలా మందికి అనుభవానికి వచ్చే వేగవంతమైన బరువు తగ్గుదల చాలా ప్రేరణాత్మకంగా ఉండవచ్చు. జీవనశైలి మార్పులను కూడా కలిగివుండే ఒక VLCD కార్యక్రమంలో పాల్గొనే రోగులు మొదటి 3 నుండి 6 నెలల సమయంలో వారి ప్రారంభ బరువులో సుమారు 15 నుంచి 25 శాతం వరకు కోల్పోవచ్చు. వారు ఒక ఆరోగ్యకరమైన ఆహారం ప్రణాళికను మరియు శారీరక శ్రమ అలవాట్లను అలవరచుకుంటే, వారు 4 సంవత్సరాల తర్వాత ఒక 5 శాతం బరువు తగ్గుదలను నిర్వహించవచ్చు.

ఒక VLCD యొక్క ఆరోగ్య ప్రమాదాలు ఏమిటి?

రోగులు తీవ్రమైన దుష్ప్రభావాలు అనుభవించటం లేదు అని నిర్థారించడానికి- వైద్యులు VLCD రోగులను అందరినీ తరచుగా పర్య వేక్షిస్తూ వుండాలి— వీలైనంత వరకు వేగవంతముగా బరువు తగ్గే ప్రారంభ కాలంలో ప్రతీ 2 వారాలకు.

VLCD లో ఉండే అనేక మంది రోగులు 4 నుంచి 16 వారాల వరకు ఆయాసం, మలబద్ధకం, వికారం, లేదా అతిసారం వంటి చిన్న దుష్ప్రభావాలను నివేదిస్తారు. ఈ పరిస్థితులు సాధారణంగా కొన్ని వారాల్లో మెరుగుపడుతాయి మరియు అరుదుగా రోగులను కార్యక్రమం పూర్తి చేయకుండా నిరోధిస్తాయి.

అత్యంత తీవ్రమైన సాధారణ దుష్ప్ర ప్రభావం పిత్తాశయ రాళ్ళు. ఊబకాయంవున్న వ్యక్తులలో తరచుగా అభివృద్ధి చెందే పిత్తాశయ రాళ్లు, ముఖ్యంగా మహిళలలో,  వేగంగా బరువు తగ్గే సమయంలో ఇంకా ఎక్కువ సాధారణంగా అభివృద్ధి చెయ్యబడి ఉండవచ్చు.  కొన్ని మందులు వేగవంతముగా బరువు తగ్గుతున్న సమయంలో పిత్తాశయ రాళ్లు  ఏర్పడటాన్ని నివారించగలవు. మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాత ఈ మందులు మీకు సరైనవా అని నిర్ణయించగలడు.

నేను తిరిగి బరువు పెరుగుతానా?

VLCD ల యొక్క దీర్ఘకాల ఫలితాలు విస్తృతంగా మారినప్పటికీ, తిరిగి బరువు పెరగడం సాధారణం. తిరిగి బరువు పెరగడాన్ని నివారించడానికి, VLCD ని బరువు తగ్గే ఇతర పద్దతులతో మరియు ఒక యాక్టివ్ ఫాలో-అప్ కార్యక్రమంతో ఎల్లప్పుడు కలపాలి.

ఊబకాయం కలిగిన చాలా మంది ప్రజలకు, పరిస్థితి దీర్ఘకాలికం మరియు ఊబకాయంకు చికిత్స చేసే ప్రామాణిక పద్దతులు ముగిసిన తర్వాత కూడా జీవితకాల శ్రద్ధ అవసరమవుతుంది. మీరు ఆరోగ్యకరమైనవి తినటం, క్రమం తప్పని శారీరక చర్యల యొక్క శాశ్వత మార్పులకు, మరియు ఆహారం గురించి ఒక మెరుగైన దృక్పథంకు కట్టుబడవలసిన అవసరం వుండవచ్చు.

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు