మధుమేహము, గుండె జబ్బు, మరియు స్ట్రోక్

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456

మధుమేహం లేదా ప్రీడయాబెటస్ కలిగి ఉండడం అనేది మిమ్మల్నిగుండె వ్యాధి మరియు స్ట్రోక్  ప్రమాదంలో ఉంచుతుంది. మీరు మీ రక్తంలో గ్లూకోజ్ (బ్లడ్ షుగర్ అని కూడా పిలుస్తారు), రక్త పోటు, మరియు రక్త కొలెస్ట్రాల్ లను మంచి ఆరోగ్యానికి మధుమేహ నిపుణులు సిఫార్సు చేసిన  లక్ష్యం సంఖ్యల స్థాయికి  దగ్గరగా ఉంచడం ద్వారా మీ ప్రమాదాన్ని తగ్గించుకొనవచ్చును.  మీ లక్ష్యాలను చేరడము పెరిఫెరల్ ఆర్టీరియల్ వ్యాధి అనబడే  మీ కాళ్ళ రక్త నాళాలు కుదించుకుపోవడం లేదా అడ్డుపడటం అనే ఒక పరిస్థితిని నిరోధిస్తుంది. మీరు మీ లక్ష్యాలను ఈ క్రింది వాటి ద్వారా చేరుకొనవచ్చు

  • తెలివిగా ఆహారాలు ఎంచుకోవడం
  • శారీరకంగా చురుకుగా ఉండటం
  • అవసరమైతే మందులు తీసుకోవడం

మీరు గుండెపోటు లేదా స్ట్రోక్ ఇప్పటికే కలిగి వుంటే, మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోవడం అనేది మీ భవిష్యత్తు ఆరోగ్య సమస్యలను నిరోధించడానికి సహాయపడవచ్చు.

మధుమేహం అంటే ఏమిటి?

మధుమేహము  జీవక్రియ యొక్క ఒక రుగ్మత – మన శరీరాలు జీర్ణమైన ఆహారాన్ని శక్తి కోసం ఉపయోగించు కొనే విధానము. మనము తినే ఆహారములో అధిక భాగము రక్తములోని చక్కరగా విడగొట్టబడుతుంది. గ్లూకోజ్ శరీరం యొక్క ప్రధాన ఇంధన మూలము.

జీర్ణక్రియ తర్వాత, గ్లూకోజ్ రక్త ప్రవాహములో ప్రవేశిస్తుంది. అప్పుడు గ్లూకోజ్ శరీరము అంతటా ఉన్న కణాలను చేరుతుంది మరియు అది అక్కడ శక్తి కోసం ఉపయోగించబడుతుంది.  అయితే, ఇన్సులిన్ అనే హార్మోను గ్లూకోజును కణాలలోనికి  ప్రవేశించడానికి  అనుమతించడానికి  తప్పక ఉండాలి. ఇన్సులిన్  కడుపు వెనుక పెద్ద గ్రంధి అయిన క్లోమము ఉత్పత్తి చేసే ఒక హార్మోన్.

మధుమేహం లేని వ్యక్తుల్లో, క్లోమం స్వయంచాలకంగా సరి అయిన మొత్తములో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసి రక్తం నుండి గ్లూకోజును కణాలలోనికి ప్రవేశించేలా చేస్తుంది. అయితే, క్లోమం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనపుడు లేదా కండరాలు, కాలేయం, మరియు కొవ్వు కణాలు సరిగా ఇన్సులిన్ ను వాడనప్పుడు లేదా రెండూ వున్నపుడు మధుమేహం అభివృద్ధి చెందుతుంది.  ఫలితంగా, రక్తంలో గ్లూకోజ్ పరిమాణము పెరుగుతుంది, కణాలు శక్తి కొరకు ఆకలితో అలమటిస్తాయి.

కాలక్రమేణా, అధిక రక్త గ్లూకోజ్ స్థాయిలు నరాలు మరియు రక్త నాళాలను దెబ్బతినేవిదంగా చేసి మధుమేహ ప్రజలమరణానికి ప్రధాన కారణాలు అయిన గుండె వ్యాధి మరియ స్ట్రోక్ కు కారణము అవుతాయి. అనియంత్రిత మధుమేహం చివరికి దృష్టి నష్టం, మూత్రపిండాల వైఫల్యం, మరియు అంగచ్ఛేదం వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయవచ్చు.

ప్రీడయాబెటస్ అంటే ఏమిటి?

ప్రీడయాబెటస్ అనేది రక్త గ్లూకోజ్ స్థాయిలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా వుండి కానీ మధుమేహం వ్యాధి నిర్ధారణకు తగినంత అధికంగా వుండని ఒక స్థితి. ప్రీడయాబెటస్ ను బలహీనమయిన నిరాహార గ్లూకోస్ లేదా మరియు మందగించిన గ్లూకోస్ సహనం అని కూడా అంటారు. ప్రీడయాబెటస్ తో వున్న అనేక మందిలో 10 సంవత్సరాల లోపల టైప్ 2 మధుమేహం అభివృద్ధి చెందుతుంది  అదనంగా, వారు గుండె వ్యాధి మరియు పోటు  ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. తగినంత బరువు తగ్గడం మరియు మధ్యస్థ శారీరక శ్రమ చేయడం తో ప్రీడయాబెటస్ గల వారు టైప్ 2 మధుమేహంను ఆలస్యం చేయవచ్చు లేదా నిరోధించవచ్చు మరియు గుండె జబ్బు మరియు స్ట్రోక్ యొక్క వారి ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

మధుమేహం, గుండె వ్యాధి మరియు స్ట్రోక్ మధ్య సంబంధం ఏమిటి?

మీకు  మధుమేహము ఉంటే, మీకు గుండె వ్యాధి లేదా ఒక స్ట్రోక్  మధుమేహం లేని వారి కంటే మీకు వచ్చే అవకాశం కనీసం రెండురెట్లు వుంటుంది. మధుమేహం ఉన్న వారిలో గుండె వ్యాధి అభివృద్ధి చెందే అవకాశం లేదా స్ట్రోక్ వచ్చే అవకాశం  ఇతర ప్రజలు కంటే ముందు వయసులోనే ఉంటాయి. మీరు మధ్య వయస్కుడైన మరియు టైప్ 2 మధుమేహం కలిగి ఉంటే, కొన్ని అధ్యయనాలు గుండెపోటు కలిగి వుండే మీ అవకాశం మధుమేహం లేకుండా ఇప్పటికే ఒక గుండెపోటు వచ్చిన ఎవరికైనా వున్నంత ఎక్కువగా ఉంటుంది అని సూచించారు. మెనోపాజ్ గుండా వెళ్ళని స్త్రీలకు, సాధారణంగా అదే వయస్సున్న పురుషుల కంటే గుండె వ్యాధి యొక్క తక్కువ ప్రమాదం ఉంటుంది. కానీ మధుమేహం గల అన్ని వయసులకు చెందిన మహిళలకు గుండె వ్యాధి యొక్క అధిక ప్రమాదం ఉంది ఎందుకంటే, మధుమేహం అనేది ఒక మహిళ తన బిడ్డను పొందే సంవత్సరాలలో ఉండటం వలన  ఏర్పడే రక్షిత ప్రభావాలను రద్దు చేస్తుంది.

ఇప్పటికే ఒక గుండెపోటు వచ్చిన మధుమేహం కలిగిన వ్యక్తులలో రెండవ దానిని కలిగి ఉండే ఎక్కువ ప్రమాదం వుంది. అదనంగా, మధుమేహం ఉన్న వారిలో గుండె జబ్బులు మరింత తీవ్రమైనవి మరియు మరణానికి దారితీసే ఎక్కువ అవకాశం వుంది. కాలక్రమేణా అధిక రక్త గ్లూకోజ్ స్థాయిలను రక్తనాళం గోడల మీద పెరిగిన కొవ్వు పదార్థాల డిపాజిట్లకు దారితీస్తుంది. ఈ డిపాజిట్లు రక్తనాళాలు  మూసుకుపోయే  మరియు గట్టిపడే   (ఎథెరోస్క్లెరోసిస్) అవకాశాలు పెంచి , రక్త ప్రవాహంను ప్రభావితం చేయవచ్చు.

మధుమేహం ఉన్న వారిలో గుండె వ్యాధి మరియు స్ట్రోక్  కొరకు ప్రమాద కారకాలు ఏమిటి?

మధుమేహము గుండె వ్యాధి మరియు స్ట్రోక్  కోసం దానంతట అదే ఒక ప్రమాద కారకం. అలాగే, మధుమేహముతో  బాధపడుతున్న ఎంతోమంది ప్రజలకు గుండె వ్యాధి మరియు స్ట్రోక్ అభివృద్ధి అయ్యే అవకాశం పెంచే ఇతర పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులను ప్రమాద కారకాలు అంటారు. గుండె వ్యాధి మరియు స్ట్రోక్  కోసం ఒక హాని కారకం హృదయ వ్యాధి కుటుంబ చరిత్ర కలిగి ఉండటము.  మీ కుటుంబంలో ఒకరు లేదా ఎక్కువ సభ్యులు తక్కువ వయసులోనే (పురుషులు కోసం 55 సంవత్సరాలకు ముందు లేదా మహిళలు కోసం 65 సంవత్సరాలకు ముందు) గుండెపోటు వచ్చి ఉంటే, మీరు పెరిగిన ప్రమాదంలో ఉండవచ్చు.

మీ కుటుంబంలో గుండెవ్యాధి వంశ పారంపర్యంగా ఉంటే దానిని మీరు మార్చలేరు, కానీ మీరు ఇక్కడ  పొందుబరచిన గుండె జబ్బుల యొక్క ఇతర ప్రమాద కారకాలను నియంత్రించడానికి చర్యలను తీసుకొనవచ్చు

  • శరీర మధ్య భాగములో స్థూలకాయం కలిగి ఉండటము: మధ్య ఊబకాయం అనగా నడుము చుట్టూ అదనపు బరువు కలిగి ఉండటము అని  అర్థము, పిరుదుల చుట్టూ ఉండే దానికి వ్యతిరేకంగా. నడుము చుట్టుకొలత పురుషులలో 40 అంగుళాలు మరియు మహిళలలో  35 అంగుళాల కంటే ఎక్కువగా వుంటే మీరు శరీర మధ్య స్థూలకాయం కలిగివున్నారు అని అర్థము. మీకు గుండె వ్యాధి వచ్చే అవకాశము ఎక్కువగా వుంటుంది ఎందుకంటే పొత్తికడుపు క్రొవ్వు అనేది రక్తనాళం యొక్క గోడల లోపలి వైపు జమ అయ్యే రక్త కొవ్వు యొక్క రకం అయిన LDL (చెడు) కొలెస్ట్రాల్ ఉత్పత్తిని ఎక్కువ చేయవచ్చు.
  • అసాధారణ రక్త కొవ్వు (కొలెస్టరాల్) స్థాయిలు కలిగి ఉండటము.
  • ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ మీ రక్త నాళాలలో పేరుకొని గుండె నుండి శరీర మిగతా భాగములకు రక్తమును తీసుకొని వెళ్ళే  మీ ధమనులు కుంచించుకొని పోవటము మరియు గట్టి పడటమునకు దారి తీయవచ్చు. అప్పుడు  ధమనులు లోపల అడ్డపడటము జరగవచ్చును. అందువలన ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ యొక్క అధిక స్థాయి గుండె జబ్బు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
  • ట్రైగ్లిజరైడ్స్ అనేది మరియొక రకమైన రక్తపు కొవ్వు మరియు వాటి స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు గుండె జబ్బు యొక్క మీ ప్రమాదాన్ని పెంచుతుంది..
  • హెచ్ డి ఎల్ (మంచి) కొలెస్ట్రాల్ మీ రక్తనాళాలు లోపల వున్న డిపాజిట్లు తొలగిస్తుంది మరియు తొలగింపు కోసం వాటిని కాలేయానికి తీసుకొని వెళుతుంది. హెచ్ డి ఎల్  కొలెస్ట్రాల్ యొక్క తక్కువ స్థాయిలు మీ గుండె వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.
  • అధిక రక్తపోటు కలిగి ఉండటము: మీకు హైపర్ టెన్షన్ అని కూడా పిలువబడే అధిక రక్తపోటు ఉంటే, మీ గుండె రక్తం సరఫరా చేయడానికి కష్టంగా పని చేయాలి. అధిక రక్త పోటు, గుండెకు శ్రమ కలిగించవచ్చు, రక్తనాళాలను దెబ్బతీయవచ్చు మరియు గుండెపోటు, స్ట్రోక్, కంటి సమస్యలు, మరియు మూత్రపిండాల సమస్యల యొక్క మీ ప్రమాదాన్ని పెంచవచ్చు.
  • ధూమపానము: ధూమపానం గుండె వ్యాధి పొందే మీ ప్రమాదమును రెట్టింపు చేస్తుంది. ధూమపానం నిలిపివేయటము ప్రత్యేకంగా మధుమేహం వున్నవారి కొరకు మంచిది ఎందుకంటే ధూమపానం మరియు మధుమేహం రెండూ రక్తనాళాలు కుంచించు కొనేలా చేస్తాయి. ధూమపానం అనేది కంటి సమస్యలు లాంటి ఇతర దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అదనంగా, ధూమపానం మీ కాళ్ళ రక్త నాళాలు దెబ్బతీయవచ్చు మరియు విచ్ఛేదన ప్రమాదాన్ని పెంచవచ్చు.

జీవక్రియ వైపరీత్యం (మెటబోలిక్ సిండ్రోమ్)  అంటే ఏమిటి మరియు అది  గుండె జబ్బుతో ఎలా ముడిపడి ఉంది?

జీవక్రియ వైపరీత్యం అనేది గుండె నొప్పి మరియు టైప్ 2 మధుమేహం అనే రెండు ప్రమాదాలలో ప్రజలను ఉంచే లక్షణాలు మరియు వైద్య పరిస్థితుల యొక్క ఒక సమూహము. నేషనల్ కొలెస్ట్రాల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం దీనిని క్రింది ఐదు లక్షణాలు మరియు వైద్య పరిస్థితులలో ఏవైనా మూడింటిని కలిగి ఉండడం అని నిర్వచించింది.

లక్షణాలు మరియు వైద్య పరిస్థితులు నిర్వచనము
పెరిగిన నడుము చుట్టుకొలత నడుము చుట్టుకొలత

  • పురుషుల్లో 40 అంగుళాలు లేదా ఎక్కువ
  • మహిళల్లో 35 అంగుళాలు లేదా ఎక్కువ
పెరిగిన  ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు
  • 150 mg / dL లేదా ఎక్కువ
     లేదా
    పెరిగిన ట్రైగ్లిజరైడ్ స్థాయిల  కోసం ఔషధాలను తీసుకొనడము
HDL (మంచి) కొలెస్ట్రాల్ యొక్క తక్కువ స్థాయిలు
  • పురుషుల్లో  40 mg / dl HDL కంటే తక్కువ
  • మహిళలల్లో  50 mg/dl కంటే తక్కువ
    లేదా
    తక్కువ HDL కొలెస్ట్రాల్ స్థాయిల కోసం ఔషధాలను వాడడము
అధిక రక్తపోటు స్థాయిలు
  • 130 ఎం ఎం హెచ్ జి లేదా ఎక్కువ సిస్టోలిక్ రక్తపోటు లేక
  • 85 ఎం ఎం హెచ్ జి లేదా ఎక్కువ డయాలిస్టిక్
    లేదా
    అధిక రక్తపోటు స్థాయిల కోసం ఔషధాలను వాడడము
పెరిగిన నిరాహార రక్త గ్లూకోజ్ స్థాయిలు
  • 100 ఎంజి /డిఎల్
    లేదా
    అధిక రక్త గ్లూకోజ్ స్థాయిల కోసం ఔషధాలను వాడడము

గుండె జబ్బు లేదా స్ట్రోక్ ను నిరోధించడానికి లేదా ఆలస్యం చేయడానికి నేను ఏమి చెయ్యగలను?

మీరు గుండె వ్యాధి మరియు స్ట్రోక్ అధిక యొక్క ప్రమాదంలో ఉన్నప్పటికీ  మీరు మీ గుండె మరియు రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడవచ్చు. మీరు ఈ దశలను పాటించడం ద్వారా ఆ విధంగా  చెయ్యవచ్చు:

  • మీ డైట్ “గుండె-ఆరోగ్యకరమైనది” గా ఉండేలా నిర్ధారించుకోండి. ఈ లక్ష్యాలను చేరుకునే ఒక డైట్ ను ప్లాన్ చేయడానికి ఒక నమోదిత నిపుణుని కలవండి.
  • మీరు తీసుకొన్న ప్రతీ 1,000 కేలరీలలో కనీసము 14 గ్రాముల ఫైబర్ ను ప్రతీ రోజు చేర్చండి. ఫైబర్ అధికంగా కలిగిన ఆహారాలు రక్త కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడవచ్చు. వోట్ బ్రాన్, వోట్ మీల్, హోల్ వీట్ బ్రెడ్లు మరియు తృణధాన్యాలు, ఎండిన బీన్స్ మరియు బటానీలు (కిడ్నీ బీన్స్, పింటో బీన్స్, మరియు బ్లాక్-ఐడ్ పీస్ వంటి), పండ్లు, మరియు కూరగాయలు ఇవి అన్నీ ఫైబర్ యొక్క మంచి వనరులు. జీర్ణ సమస్యలు నివారించేందుకు మీ ఆహారంలో ఫైబర్ యొక్క మొత్తాన్ని క్రమంగా పెంచండి.
  • సంతృప్త కొవ్వును తగ్గించుకొనండి. ఇది మీ రక్తం కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. మాంసం, పౌల్ట్రీ చర్మం, వెన్న, కొవ్వుతో కూడిన పాల ఉత్పత్తులు, షార్టేనింగ్, పంది కొవ్వు మరియు పామ్ మరియు కొబ్బరినూనె వంటి ట్రోపికల్ నూనెలలో సంతృప్త కొవ్వు కనబడుతుంది. మీ డైటిషియన్ మీ రోజువారి గరిష్ట ఆహారములో ఎన్ని గ్రాముల  సంతృప్త కొవ్వు  ఉండాలి అన్నది నిర్ణయిస్తారు.
  • రోజుకు కొలెస్ట్రాల్ ను 300 మిల్లీగ్రాముల కంటే తక్కువగా మీ ఆహారం లో ఉంచండి. కొలెస్ట్రాల్ మాంసం, పాల ఉత్పత్తులు, మరియు గుడ్ల లో దొరుకుతుంది.
  • మీ ఆహారంలో ట్రాన్స్ కొవ్వు కనీసముగా ఉంచండి. ఇది రక్త కొలెస్ట్రాల్ అధికము చేసే ఆహారములో వుండే ఒక రకమైన కొవ్వు. మీరు తీసుకొనే వాటిలో క్రాకర్లు, కుకీలు, అల్పాహారాలు, వాణిజ్యపరంగా తయారు చేసిన బేకరీ వస్తువులు, కేక్ మిశ్రమము,  మీరు  మైక్రోవేవ్ పాప్ కార్న్, వేయించిన ఆహారాలు, సలాడ్ డ్రెస్సింగ్, మరియు పాక్షికంగా హైడ్రోజెన్ గల నూనెతో తయారుచేసిన ఇతర ఆహారాలు తీసుకోవడము     పరిమితము చేయండి. అదనంగా, కొన్ని రకాల వెజిటబుల్ షార్టేనింగ్ మరియు మర్గరిన్స్ లో  ట్రాన్స్ కొవ్వు వుంటుంది. ఆహార ప్యాకేజీ మీది న్యూట్రిషన్ ఫాక్ట్స్ విభాగంలో ట్రాన్స్ కొవ్వు కోసం తనిఖీ చేయండి.

మీరు పొగ త్రాగేవారు అయితే దానిని మాని వేయండి. మీ డాక్టర్ ధూమపానం మానివేసే మార్గాలు కనుగొనేందుకు మీకు సహాయపడతారు.

మీరు ఆస్పిరిన్ తీసుకోవాలో లేదో మీ వైద్యుడిని అని అడగండి. ప్రతి రోజు ఆస్పిరిన్ తక్కువ మోతాదు తీసుకొనడము వలన  గుండె వ్యాధి మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది  అని అధ్యయనాలు నిరూపించాయి. అయితే, ఆస్ప్రిన్ అందరికీ సురక్షితం కాదు. మీ డాక్టర్ మీరు ఆస్పిరిన్ తీసుకొనడము సరియినదా మరియు ఖచ్చితంగా యెంత మోతాదు తీసుకోవాలో చెప్పగలరు.

ట్రాన్సియెంట్ ఇస్కీమిక్  అటాక్స్ (TIAs) కొరకు సత్వర చికిత్స పొందండి. కొన్నిసార్లు మినీ స్ట్రోక్స్ గా పిలువబడే TIAs కోసం ముందుగానే చికిత్స తీసుకొనడము అనేది భవిష్యత్తులో స్ట్రోక్ ను నిరోధించుటకు  లేక ఆలశ్యము చేయుటకు సహాయపడవచ్చు.  TIA యొక్క చిహ్నాలు ఆకస్మిక బలహీనత, నిలకడగా ఉండలేక పోవటము, తిమ్మిరి, గందరగోళం, ఒకటి లేదా రెండు కళ్ళలో అంధత్వం, ద్వంద్వ దృష్టి, మాట్లాడములో కష్టం, లేదా తీవ్రమైన తలనొప్పి అయి ఉంటాయి.

నా మధుమేహ చికిత్స పనిచేస్తుందో నాకు లేదో ఎలా తెలుస్తుంది?

మీరు మీ చికిత్స పని చేస్తుందని నిర్ధారించడానికి మధుమేహం యొక్క ABC ల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మీ కొరకు ఉత్తమ లక్ష్యాలను గురించి మీ డాక్టరుతో  మాట్లాడండి.

A అనగా A1C (రక్త గ్లూకోజ్ నియంత్రణను కొలిచే ఒక పరీక్ష). కనీసం సంవత్సరానికి రెండుసార్లు ఒక A1C పరీక్ష చేయించుకొనండి. ఇది గత 3 నెలలుగా మీ సగటు రక్త గ్లూకోజ్ స్థాయిని చూపిస్తుంది. మీరు ఇంటి దగ్గర మీరు  మీ రక్తంలో గ్లూకోజ్ తనిఖీ చేసుకోనవలేనా మరియు అయితే అది ఎలా చేయాలో అనేదానిపై మీ డాక్టర్ గారితో మాట్లాడండి.

A1C లక్ష్యం
మీ డాక్టర్ మీకు ఏదైనా టార్గెట్ పెడితే తప్ప,  7 శాతము కంటే తక్కువ
బ్లడ్ గ్లూకోజ్ లక్ష్యాలు
  భోజనం ముందు 90 నుండి  130 mg/dL
భోజనము మొదలైన 1 నుండి 2 గంటల తరువాత  180 mg/dL కంటే తక్కువ

B అనగా బ్లడ్ ప్రెషర్ (రక్తపోటు). ప్రతి కార్యాలయ సందర్శనలో తనిఖీ చేసుకొనండి.

రక్తపోటు లక్ష్యం
మీ డాక్టర్ మీకు ఏదైనా టార్గెట్ పెడితే తప్ప, 140/80 mm Hg కంటే తక్కువ

C అనగా కొలెస్ట్రాల్. దీనిని కనీసము సంవత్సరానికి ఒకసారి తనిఖీ చేసుకొనండి.

రక్త కొవ్వు (కొలెస్టరాల్) లక్ష్యాలు
ఎల్ డి ఎల్  (చెడు) కొలెస్ట్రాల్ 100 ఎంజి/డిఎల్ కన్న తక్కువ
ట్రైగ్లిజరైడ్స్ 150 ఎంజి/డిఎల్ కంటే తక్కువ
హెచ్ డి ఎల్  (మంచి) కొలెస్ట్రాల్

పురుషులకు: 40 ఎంజి/డిఎల్ కంటే ఎక్కువ
మహిళలకు: 50 ఎంజి/డిఎల్ కంటే ఎక్కువ

 

మధుమేహం యొక్క ABC ల యొక్క నియంత్రణ వలన గుండె వ్యాధి మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మీ రక్తంలో గ్లూకోజ్, రక్తపోటు, మరియు కొలెస్ట్రాల్ స్థాయిలు లక్ష్యములో లేకుంటే, ఆహారంలో, శారీరక శ్రమలో మరియు మందులు తీసుకొనడములో ఏ మార్పులు మీరు ఈ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడతాయి అని మీ వైద్యుడిని సంప్రదించండి.

మధుమేహం ఉన్న వారిలో ఏ రకమైన గుండె మరియు రక్త నాళ వ్యాధులు సంభవిస్తాయి?

మధుమేహం ఉన్న వారిలో సాధారణంగా కనిపించే కార్డియోవాస్క్యులర్ వ్యాధి అని కూడా పిలువబడే  గుండె మరియు రక్త నాళ వ్యాధి యొక్క రెండు ప్రధాన రకాలు కొరోనరీ ఆర్టరీ వ్యాధి (CAD) మరియు సెరిబ్రల్ వాస్కులర్ వ్యాధి. మధుమేహం ఉన్న వారిలో గుండె వైఫల్యం ప్రమాదం కూడా వున్నది.     పెరిఫెరల్ అర్టేరియల్ డిసీజ్ అనే కాళ్ళపై రక్త నాళాలు కుదించుకుపోవడం లేదా మూసుకుపోయే ఒక స్థితి  కూడా మధుమేహం ఉన్న వారిలో సంభవించవచ్చు.

కరోనరీ ఆర్టెరీ డిసీజ్

ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ అని కూడా  పిలువబడే కొరోనరీ ఆర్టరీ వ్యాధి మీ గుండెకు వెళ్ళే  రక్తనాళాల గోడల మందముగా అవడము లేదా గట్టిపడటం వలన కలుగుతుంది. మీ గుండె సాధారణ స్థాయిలో పని చేయడానికి మీ గుండెకు అవసరమైన ఆక్సిజన్ మరియు ఇతర పదార్థాలను మీ రక్తము సరఫరా చేస్తుంది. కొవ్వు నిల్వల వలన  ద్వారా మీ గుండె రక్తనాళాలు కుంచించుకొని పోవడము లేదా మూసికొనిపోతే , రక్త సరఫరా తగ్గి పోతుంది లేదా ఆగిపోయి, ఫలితంగా గుండెపోటు సంభవిస్తుంది.

సెరిబ్రల్ వాస్కులర్ డిసీజ్

సెరిబ్రల్ వాస్కులర్ డిసీజ్  మెదడుకు వచ్చే రక్త ప్రవాహమును ప్రభావితము చేసి  స్ట్రోక్స్ మరియు టిఐఏ కు దారితీస్తుంది.  ఇది మెదడుకు వెళ్ళే రక్త నాళాలు సంకుచితం కావడము, అడ్డుపడడము  లేదా గట్టి పడడము వలన లేదా అధిక రక్తపోటు ద్వారా కలుగుతుంది.

స్ట్రోక్

మెదడు లేదా మెడలో రక్త నాళము అడ్డుపడడము లేదా విచ్చినము అయినపుడు మెదడుకు రక్తం సరఫరా అకస్మాత్తుగా ఆగినపుడు స్ట్రోక్ సంభవిస్తుంది. అప్పుడు మెదడు కణాలు ఆక్సిజన్ ను కోల్పోయి చనిపోతాయి. ఒక స్ట్రోక్ వలన మాట్లాడడములో  లేదా దృష్టిలో సమస్యలు ఏర్పడవచ్చు లేదా బలహీనత లేదా పక్షవాతమునకు  కారణము కావచ్చును. అధికభాగం స్ట్రోక్స్  మెదడు లేక  మెడలోని రక్తనాళాలలోని ఒక దానిని ఇరుకుగా చేసే లేదా మూసివేసే కొవ్వు నిల్వలు లేదా గడ్డ కట్టిన రక్తపు గడ్డలు -జెల్లీ మాదిరి రక్త కణాల గడ్డలు- వలన కలుగుతాయి. గడ్డ కట్టిన రక్తము గడ్డ కట్టబడిన ప్రాంతములోనే ఉండవచ్చును లేదా శరీరము లోపల ప్రయాణించవచ్చు. మధుమేహముతో వున్న ప్రజలకు రక్తము గడ్డ కట్టడము వలన ఏర్పడే స్ట్రోక్స్ యొక్క ఎక్కువ ప్రమాదము వున్నది..

TIA లు

TIA  లు మెదడుకు రక్త నాళం యొక్క ఒక తాత్కాలిక ప్రతిష్టంభన వల్ల కలుగుతాయి. ఈ  ప్రతిష్టంభన తాత్కాలిక తిమ్మిరి లేదా శరీరం ఒక వైపున బలహీనత వంటి మెదడు పని తీరులో సంక్షిప్త మరియు ఆకస్మిక మార్పుకు దారితీస్తుంది. మెదడు పనితీరులో ఆకస్మిక మార్పులు సంతులనం కోల్పవడం, గందరగోళం, ఒకటి లేక రెండు కళ్ళలో అంధత్వం లేదా ద్వంద్వ దృష్టి, మాట్లాడములో కష్టం  లేదా ఒక తీవ్రమైన తలనొప్పికి  కూడా దారితీస్తాయి. అయితే, చాలా వరకు లక్షణాలు త్వరగా అదృశ్యం అయితాయి మరియు శాశ్వత నష్టం అయ్యే అవకాశం లేదు. ఈ లక్షణాలు కొన్ని నిమిషాల్లో పరిష్కారము కాకపొతే TIA కాకుండా ఒక స్ట్రోక్ కావచ్చు. ఒక స్ట్రోక్ సంభవించింది అంటే ఆ వ్యక్తికి భవిష్యత్తులో ఒకప్పుడు ఒక స్ట్రోక్ సంభవించే ప్రమాదం వుంది అని అర్థం. స్ట్రోక్ ప్రమాదం అంశాలపై మరింత సమాచారం కోసం పేజీ 3 చూడండి.

గుండె వైఫల్యం  

గుండె వైఫల్యం అనేది గుండె రక్తాన్ని సరిగ్గా సరఫరా చేయని ఒక దీర్ఘ కాల పరిస్థితి—గుండె హఠాత్తుగా పని ఆపివేస్తుంది అని దీని అర్థము కాదు. గుండె వైఫల్యం సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందుతుంది  మరియు లక్షణాలు కాలక్రమేణా దారుణంగా మారవచ్చు.  గుండె వైఫల్యం చెందే ప్రమాదం మధుమేహం ఉన్నవారికి ఇతర వ్యక్తులకంటే కనీసం రెండు రెట్లు వున్నది. గుండె వైఫల్యం ఒక రకం కంజెస్టివ్ హార్ట్  ఫెయిల్యూర్ (రక్త ప్రసరణ ఆగి గుండె వైఫల్యము చెందడము), ఇందులో శరీర కణజాలాల లోపల ద్రవం  పేరుకుపోతుంది. ఈ పేరుకుపోవడము ఊపిరితిత్తులలో అయితే  శ్వాస తీసుకొనడము కష్టం అవుతుంది.

రక్త నాళాల ప్రతిష్టంభన మరియు అధిక రక్త గ్లూకోజ్ స్థాయిలు కూడా గుండె కండరం దెబ్బతీయవచ్చు  మరియు అపక్రమ హృదయ స్పందనలకు కారణమవవచ్చు. గుండె కండరము దెబ్బ తినడము అనగా కార్డియోమయోపతి అనే పరిస్థితితో వున్న ప్రజలకు  ప్రాధమిక స్థాయిలో ఏ చిహ్నాలు కనిపించక పోవచ్చు. కాని తరువాత వారు బలహీనత, ఊపిరి తీసుకోనలేకపోవటము, తీవ్రమైన దగ్గు, ఆయాసం, మరియు కాళ్ళు మరియు పాదముల వాపు లాంటివి ఎదుర్కొనవచ్చు. మధుమేహంతో ఉన్న వ్యక్తి గుండెపోటు యొక్క విలక్షణ హెచ్చరిక సంకేతాలను ఎందుకు అనుభూతి పొందకవచ్చు అని వివరిస్తూ, సాధారణంగా నరాల ద్వారా చేరవేయబడే నొప్పి సంకేతాలతో కూడా మధుమేహం జోక్యం చేసుకోగలదు.

పెరిఫెరల్ ఆర్టేరియల్ డిసీజ్

గుండె వ్యాధికి సంబంధించిన మరియు మధుమేహం ఉన్న ప్రజలలో సాధారణంగా వున్న మరొక స్థితి పెరిఫెరల్ ఆర్టేరియల్ డిసీజ్ (PAD) ఉంది. ఈ పరిస్థితితో కాళ్ళలో వున్న రక్తనాళాలు కొవ్వు నిక్షేపాలతో కుంచించుకొని పోవడము లేదా అడ్డుపడడము జరుగుతుంది, దీని వలన కాళ్ళకు మరియు పాదములకు వెళ్ళే రక్తము తగ్గిపోతుంది. PAD గుండెపోటు లేదా స్ట్రోక్ సంభవించే అవకాశాలను పెంచుతుంది. కాళ్ళు మరియు పాదములలో తక్కువ రక్త  ప్రసరణ విచ్ఛేదన ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కొన్నిసార్లు PAD గల ప్రజలు నడుస్తున్నప్పుడు కాలి యొక్క  కాఫ్ లేక  ఇతర భాగాలలో  నొప్పిని అభివృద్ధి చేస్తుంది,  అది కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకొంటే తగ్గిపోతుంది.

నాకు  గుండె వ్యాధి ఉందా అని నేను ఎలా తెలుసుకోగలను?

గుండె వ్యాధి యొక్క ఒక చిహ్నం ఆంజినా, గుండెకు వెళ్ళే రక్తనాళం కుదించబడి  మరియు రక్త సరఫరా తగ్గినపుడు సంభవించే  నొప్పి.  మీరు  మీ ఛాతీ, భుజాలు, చేతులు, దవడ లేదా వీపులో నొప్పి లేక అసౌకర్యము అనుభవిస్తారు, ముఖ్యంగా వ్యాయామము చేస్తున్నప్పుడు. ఈ నొప్పి మీరు విశ్రాంతి తీసుకొన్నప్పుడు లేదా అంజినాకు ఔషధం తీసుకొన్నప్పుడు తగ్గిపోవచ్చు. ఆంజినా గుండె కండరాలకు శాశ్వత నష్టం కానీయదు కానీ మీకు అంజినా వుంటే మీకు గుండెపోటు వచ్చే అవకాశము  పెరుగుతుంది.

గుండెకు వెళ్ళే  రక్త నాళము మూసుకుపోవడము వలన గుండెపోటు సంభవిస్తుంది.  ఈ   మూసుకుపోవడటం వలన  గుండె కండరాల యొక్క ఆ భాగానికి తగినంత రక్తం చేరలేదు మరియు శాశ్వత నష్ట  ఫలితాలు సంభవిస్తాయి. గుండెపోటు  సమయంలో మీరు ఈ క్రింది వాటిని కలిగి ఉండవచ్చు

  • ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం
  • మీ చేతుల్లో నొప్పి లేదా అసౌకర్యం, వీపు, దవడ, మెడ, కడుపు
  • శ్వాస ఆడకపోవడము
  • చెమట పట్టుట
  • వికారం
  • తల తిరగటం

లక్షణాలు వచ్చి వెళ్లవచ్చును. అయితే కొంతమందిలో, ముఖ్యంగా మధుమేహము ఉన్నవారిలో  వ్యాయామం, స్తబ్దత, ఒత్తిడి, లేదా నిద్ర  సమయంలో గుండె కొట్టుకొనే రేటు అదే స్థాయిలో ఉండే స్థితి వలన చిహ్నాలు తక్కువ స్థాయిలో ఉండ వచ్చును లేదా కనపడకపోవచ్చు. అలాగే, మధుమేహం కారణంగా ఏర్పడే నరాల నష్టం గుండెపోటు సమయంలో నొప్పి లేకపోవడానికి కారణం కావచ్చు.

మహిళలకు ఛాతీ నొప్పి లేకపోవచ్చు కానీ శ్వాస ఆడకపోవటము, వికారం, లేదా వెన్ను మరియు దవడ నొప్పి కలగ వచ్చును. మీకు గుండెపోటు లక్షణాలు ఉంటే, వెంటనే  85000 23456 కు కాల్ చేయండి. గుండెపోటు వచ్చిన  ఒక గంటలోనే  చికిత్స ఇవ్వగలగితే  చాలా సమర్థవంతంగా వుంటుంది.  త్వరగా చికిత్స అందించడము వలన గుండెకు శాశ్వత నష్టంను నిరోధించవచ్చు.

మీ కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు స్థాయిలను తనిఖీ చేయడం మరియు మీరు పొగ త్రాగుతారా లేదా అపరిపక్వ గుండెజబ్బులు యొక్క కుటుంబ చరిత్ర కలిగి వున్నారా అని  అడగడం ద్వారా మీ డాక్టర్  కనీసము సంవత్సరమునకు ఒకసారి గుండె వ్యాధి మరియు స్ట్రోక్ యొక్క మీ ప్రమాదాన్ని తనిఖీ చేయాలి.  డాక్టర్  గుండెజబ్బులకు మరో ప్రమాద కారకమైన ప్రోటీన్ కోసం మీ మూత్రంను కూడా తనిఖీ చేయవచ్చు. మీరు అధిక ప్రమాదములో వుంటే  లేదా గుండె జబ్బు లక్షణాలు కలిగి ఉంటే, మీరు మరిన్ని పరీక్షలు చేయించుకోవలసిన అవసరం ఉండవచ్చు.

 గుండె జబ్బు కొరకు చికిత్స ఎంపికలు ఏవి?

గుండె జబ్బు కొరకు చికిత్సలో ఒక గుండెకు-ఆరోగ్యకరమైన ఆహారంను నిర్ధారించడానికి భోజన ప్రణాళిక మరియు శారీరక శ్రమ ఉంటాయి. అదనంగా, గుండెకు జరిగిన నష్టానికి చికిత్స చేయటానికి లేదా మీ రక్తంలో గ్లూకోజ్, రక్తపోటు, మరియు కొలెస్ట్రాల్ లను తగ్గించుటకు మీకు మందులు అవసరం కావచ్చు. మీరు ఇప్పటికే ప్రతి రోజు ఆస్పిరిన్ తక్కువ మోతాదులో తీసుకోకుండా ఉంటే, మీ వైద్యుడు దానిని  సూచించవచ్చు. మీకు శస్త్రచికిత్స లేదా మరొక వైద్య విధానము కూడా అవసరం కావచ్చు.

నాకు ఒక స్ట్రోక్ వచ్చింది అని నేను ఎలా తెలుసుకోనగలను?

ఈ క్రింది సంకేతాలు మీకు ఒక స్ట్రోక్ వచ్చింది అనడానికి అర్థం అయి ఉండవచ్చును:

  • మీ శరీరం యొక్క ఒక వైపున మీ ముఖము, చేయి లేదా కాలులో ఆకస్మిక బలహీనత లేదా తిమ్మిరి గలగడము
  • ఆకస్మిక గందరగోళం, మాట్లాడములో ఇబ్బంది లేదా అవగాహనలో ఇబ్బంది
  • ఆకస్మిక మైకము, నిలకడ కోల్పోవటం లేదా నడకలో ఇబ్బంది
  • ఒకటి లేక రెండు కళ్ళ నుండి బయటకు చూడడములో ఆకస్మిక ఇబ్బంది లేదా ఆకస్మిక ద్వంద్వ దృష్టి
  • ఆకస్మిక తీవ్రమైన తలనొప్పి

మీరు ఈ లక్షణాలు ఏవైనా కలిగి ఉంటే, వెంటనే  85000 23456 నెంబరుకు కాల్ చేయండి.  మీరు ఒక స్ట్రోక్ వచ్చిన ఒక గంటలోపు ఒక ఆసుపత్రికి పోవడము ద్వారా శాశ్వత నష్టంను నిరోధించవచ్చు. మీ డాక్టర్ మీకు ఒక స్ట్రోక్ వచ్చింది అని భావించినపుడు, మీరు మీ నాడీ వ్యవస్థను తనిఖీ చేయడానికి, ఒక నాడీసంబంధ పరీక్ష, ప్రత్యేక స్కాన్లు, రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ పరీక్షలు, లేదా ఎక్సరేలు వంటి పరీక్షలు చేయించుకోవచ్చు. మీకు గడ్డ కట్టిన రక్తపు గడ్డలను కరిగించే మందులు కూడా ఇవ్వబడవచ్చు.

స్ట్రోక్ కొరకు చికిత్స ఎంపికలు ఏవి?

మీకు స్ట్రోక్ యొక్క మొదటి చిహ్నము కనబడిన వెంటనే మీరు వైద్య సంరక్షణ పొందాలి. మీ మెదడుకు వెళ్ళే రక్తనాళాలు రక్తం గడ్డకట్టడం ద్వారా మూసుకుపోతే, వైద్యుడు మీకు “క్లాట్-బస్టింగ్” మందు ఇస్తారు. మందు ప్రభావవంతంగా ఉండటానికి స్ట్రోక్ తర్వాత వెంటనే ఇవ్వాలి. స్ట్రోక్ కోసం తదుపరి చికిత్సలో మందులు వాడటము మరియు భౌతిక చికిత్స తీసుకొనడము,  అలాగే నష్టాన్ని బాగుచేయుట కొరకు శస్త్రచికిత్స కూడా ఉండవచ్చు.  భోజన ప్రణాళిక మరియు శారీరక శ్రమ మీకు కొనసాగుతున్న సంరక్షణలో భాగంగా ఉండవచ్చు. అదనంగా, మీరు మీ రక్తంలో గ్లూకోజ్,  రక్తపోటు, మరియు కొలెస్ట్రాల్  తగ్గించడము కొరకు మరియు రక్తం గడ్డకట్టడంను నివారించడానికి మీరు మందులు వాడవలసి రావచ్చును.

గుర్తుంచుకోవలసిన పాయింట్లు

  • మీకు డయాబెటిస్ ఉంటే, మీకు ఇతరుల కంటే గుండె వ్యాధి లేదా స్ట్రోక్ వచ్చే అవకాశం రెండింతలు వున్నది.
  • మధుమేహం యొక్క ABC- A1C (రక్త గ్లూకోజ్), బ్లడ్ ప్రెషర్ (రక్తపోటు), మరియు కొలెస్ట్రాల్ –లను నియంత్రించడము అనేది గుండె వ్యాధి మరియు స్ట్రోక్ యొక్క మీకు ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
  • తెలివిగా ఆహారాలు ఎంచుకోవడం, ధూమపానం మానివేయడం, మరియు (అవసరమైతే) మందులు తీసుకోవడం ఇవి అన్ని గుండె వ్యాధి మరియు స్ట్రోక్ యొక్క ప్రమాదమును తగ్గించేందుకు మీకు  సహాయపడవచ్చు.
  • మీరు గుండెపోటు లేదా స్ట్రోక్ సంబంధించిన ఏవైనా హెచ్చరిక సంకేతాలను కలిగి ఉంటే వెంటనే వైద్య సంరక్షణ  పొందండి– ఆలస్యము చేయకండి.  ఒక ఆసుపత్రి అత్యవసర గదిలో గుండెపోటు మరియు స్ట్రోక్ యొక్క తొలిదశలో జరిగే చికిత్స గుండె మరియు మెదడుకు జరిగే నష్టంను తగ్గించవచ్చు.

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు