మధుమేహం సమస్యలను నిరోధించండి: మీ మధుమేహంను నియంత్రణలో ఉంచుకోండి

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456


మధుమేహ
సమస్యలు అంటే ఏమిటి?

మధుమేహ సమస్యలు అనేవి మీకు మధుమేహం ఉన్నప్పుడు ఏర్పడే ఆరోగ్య సమస్యలు. మీ మధుమేహం నియంత్రణలో లేకపోతే, మీరు మీ రక్తంలో చాలా ఎక్కువ గ్లూకోజ్ (చక్కెర అని కూడా పిలువబడుతుంది) ను కలిగి వుంటారు.  చాలా కాలం పాటు మీ రక్తంలో చాలా ఎక్కువ గ్లూకోజ్ ను కలిగి ఉండటం అనేది ఈ క్రింది వంటి మీ శరీరం యొక్క అనేక ముఖ్యమైన భాగాలను ప్రభావితం చేయవచ్చు

  • మీ రక్త నాళాలు మరియు గుండె
  • మీ నరాలు
  • మీ మూత్రపిండాలు
  • మీ నోరు
  • మీ కళ్ళు
  • మీ పాదాలు

మీ మధుమేహంను నియంత్రణలో వుంచుకుంటే మీరు ఈ ఆరోగ్య సమస్యలను నిరోధించడానికి లేదా  ఆలస్యం చేయుటకు చాలా చేయవచ్చు.

ఈ చార్ట్ మధుమేహం ద్వారా ప్రభావితం అయ్యే శరీర  భాగాలు మరియు మరియు మీరు కలిగి ఉండగల తత్ఫలిత ఆరోగ్య సమస్యలను చూపిస్తుంది.

ప్రభావితమయ్యే శరీర భాగం మీరు కలిగి ఉండగల తత్ఫలిత ఆరోగ్య సమస్యలు
రక్తనాళాలు మరియు గుండె
  • గుండె వ్యాధి
  • గుండెపోటు
  • స్ట్రోక్
  • అధిక రక్త పోటు
  • మీ శరీరం అంతటా పేలవమైన రక్త ప్రసరణ, లేదా ప్రవాహం
నరములు
  • మీ చేతులు, భుజాలు, పాదాలు, లేదా కాళ్ళలో నొప్పి, జలదరింపు, బలహీనత, లేదా తిమ్మిరి
  •  మీ మూత్రాశయం, జీర్ణశక్తి, సెక్స్ చేయడం మరియు మీ హృదయ స్పందనలను మరియు రక్తపోటును నిలకడగా ఉంచడంలో ఇబ్బందులు
మూత్రపిండాలు
  • మీ మూత్రం ద్వారా ప్రోటీన్ నష్టం
  • మీ రక్తంలో వ్యర్ధాలు మరియు ద్రవం పేరుకుపోవడం
నోరు
  • చిగురు వ్యాధి మరియు దంతాలను కోల్పోవడం
  • నోరు పొడిబారడం
  • నోటిలో త్రష్, లేదా చాలా ఫంగస్ వృద్ధి చెందడం
కళ్ళు
  • దృష్టి కోల్పోవటం మరియు అంధత్వం
పాదాలు
  • పుళ్ళు
  • ఇన్ఫెక్షన్లు
  • విచ్ఛేదనం

నా మధుమేహ సంరక్షణలో ఎవరు నాకు సహాయం చేయగలరు?

మధుమేహం గురించి శ్రద్ధ వహించడం అనేది మీతో సహా మీ కుటుంబం, మీ ఆరోగ్య సంరక్షణ జట్టు యొక్క  సామూహిక కృషి. మధుమేహం ఆరోగ్య సంరక్షణ జట్టులో ఈ ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు ఉండవచ్చు:

  • ఒక డయాబెటాలజిస్ట్- మధుమేహంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఒక వైద్యుడు
  • ఒక నర్స్ మరియు డైటిషియన్ వంటి మధుమేహం అధ్యాపకులు
  • కౌన్సిలర్
  • ఒక ఔషధ విక్రేత
  • ఒక దంతవైద్యుడు
  • ఒక కంటి వైద్యుడు
  • ఒక పాద వైద్యుడు

మీరు ఆ జట్టు యొక్క అతి ముఖ్యమైన సభ్యుడు.

నా రక్త గ్లూకోజ్ సంఖ్యలు ఏమి అయి ఉండాలి

మీ వైద్యుడు మీకు ప్రత్యేక  లక్ష్యాలను ఏర్పరుచుటకు సహాయపడితే తప్ప, మీ రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలు ఈ  చార్ట్ లోని లక్ష్యాలను చేరుకోవాలి. లక్ష్యాలు అనేవి మీరు గురి పెట్టే సంఖ్యలు. ఈ  చార్ట్ మధుమేహం ఉన్న చాలా మంది కొరకు లక్ష్య రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలను—డెలిసిటర్ పర్ మిల్లీగ్రాములు (mg/dL) లో కొలువబడుతుంది—చూపిస్తుంది.

మధుమేహం ఉన్న చాలా మంది వ్యక్తులు కోసం లక్ష్య రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలు (mg / dL)
రోజు యొక్క సమయం లక్ష్యాలు
భోజనం ముందు మరియు మీరు మేల్కొన్నప్పుడు 70 నుండి  130
తిన్న 1 నుండి 2 గంటల తర్వాత 180 లేదా క్రింద

ఈ చార్ట్  గర్భవతి అయిన మధుమేహం గల  మహిళల కొరకు లక్ష్య రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలు చూపిస్తుంది.

గర్భవతి అయిన మధుమేహం గల మహిళల కొరకు లక్ష్య రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలు (mg/dL)  
రోజులో సమయం లక్ష్యాలు
భోజనం ముందు మరియు మీరు మేల్కొన్నప్పుడు 60 నుండి  99
తిన్న 1 నుండి  2 గంటల తర్వాత 129 లేదా క్రింద

ఈ చార్ట్ గర్భధారణ సమయంలో గర్భధారణ మధుమేహం అనే మధుమేహం అభివృద్ధి అయ్యే మహిళల కొరకు రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలు చూపిస్తుంది.

గర్భధారణ మధుమేహం గల మహిళల కొరకు రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలు (mg/dL)
రోజులో సమయం లక్ష్యాలు
భోజనం ముందు మరియు మీరు మేల్కొన్నప్పుడు 95 లేదా క్రింద
తిన్న 1 ఒక గంట తర్వాత 140 లేదా క్రింద
తిన్న 2 రెండు గంటల తర్వాత 120 లేదా క్రింద

నేను నా రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలను ఎలా తనిఖీ చేసుకోవచ్చు?

మీరు ఒక గ్లూకోజ్ మీటర్ ఉపయోగించి ఇంట్లో మీ రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలు తనిఖీ చేసుకోవచ్చు. మీ ఆరోగ్య సంరక్షణ జట్టు ఏ విధంగా ఈ క్రిందివి చేయాలి అని మీకు బోధించగలదు

  • పరీక్ష కోసం ఒక రక్త బొట్టును పొందడానికి మీ వేలును గుచ్చాలి
  • రక్తబొట్టు నుండి రక్తంలో గ్లూకోజ్ స్థాయి కనుగొనేందుకు మీ మీటర్ను ఎలా ఉపయోగించాలి

మీ రక్తంలో గ్లూకోజ్ తనిఖీల యొక్క ఫలితాలు మీరు మీ మధుమేహం మందులు, రోజువారీ భోజనం, స్నాక్స్, మరియు శారీరక శ్రమ గురించి నిర్ణయాలను తీసుకోవడానికి సహాయపడుతాయి.

మీరు ఎప్పుడు మరియు ఎంత తరచుగా మీ రక్తంలో గ్లూకోజ్ తనిఖీ చెయ్యాలి అని మీ ఆరోగ్య సంరక్షణ జట్టును అడగండి. స్వీయ పరీక్షలు సాధారణంగా భోజనం ముందు, భోజనం తర్వాత, మరియు నిద్రవేళలో  చేయబడతాయి.

మీ రక్తంలో గ్లూకోజ్ పరీక్ష ఫలితాలు రక్తంలో గ్లూకోజ్ ను  నియంత్రణలో  ఉంచడం కోసం ఒక ప్రణాళికను తయారుచేయుటకు మీకు  మరియు మీ ఆరోగ్య సంరక్షణ జట్టుకు సహాయం చేస్తాయి.

రికార్డు పేజీ ఉపయోగించడం ద్వారా మీ రక్తం గ్లూకోజ్ పరీక్ష ఫలితాలను ట్రాక్ చేస్తుండండి.

  • ఈ బుక్లెట్ చివరలోని రికార్డు పేజీ కాపీలు తయారు చేయండి లేదా ఒక రక్తంలో గ్లూకోజ్ రికార్డు పుస్తకం కోసం మీ ఆరోగ్య సంరక్షణ జట్టును అడగండి.
  • మీ ఆరోగ్య సంరక్షణ జట్టుతో మీ లక్ష్య రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను చేరుకొనుట గురించి మాట్లాడగలగడానికి వీలుగా మీ తనిఖీలకు ప్రతీసారి మీ మీ రికార్డు పుస్తకం తెచ్చుకోండి.

లేక మీరు ఇంటర్నెట్లోని లేదా మీ సెల్ ఫోన్ లోని ఒక ఎలక్ట్రానిక్ బ్లడ్ గ్లూకోజ్ ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగించగలగవచ్చు.

నేను నా రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలు మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా ఉంటే ఏమి చేయాలి?

మీ రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలు తరచుగా మీ లక్ష్యాల కంటే మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా ఉంటే, మీ ఆరోగ్య సంరక్షణ జట్టుకు చెప్పండి. మీరు మీ మధుమేహం గురించి శ్రద్ధ వహించే తీరులో మార్పులు చేయవలసిన అవసరం ఉండవచ్చు.

హైపర్గ్లైసీమియా  అని పిలువబడే అధిక రక్తంలో గ్లూకోజ్, మిమ్మల్ని ఈ క్రింది విధంగా చేయవచ్చు

  • దాహంగా
  • బలహీనంగా లేదా అలసినట్లుగా
  • తలనొప్పి కలిగినట్లుగా
  • తరచుగా మూత్రవిసర్జన చేసేటట్లుగా
  • దృష్టి పెట్టడంలో ఇబ్బంది కలిగినట్లుగా
  • అస్పష్ట దృష్టి కలిగినట్లుగా
  • ఈస్ట్ ఇన్ఫెక్షన్లు కలిగినట్లుగా

మీరు ఈ లక్షణాలలో ఏవైనా గమనిస్తే మీ ఆరోగ్య సంరక్షణ జట్టుతో మాట్లాడండి. మీ రక్తంలో గ్లూకోజ్  చాలా అధికంగా ఉన్నప్పుడు మీరు ఏమి చెయ్యాలి అని అడగండి.

హైపోగ్లైసీమియా అని పిలువబడే తక్కువ రక్తంలో గ్లూకోజ్, మిమ్మల్ని ఈ క్రింది విధంగా చేయవచ్చు

  • ఆకలిగా
  • తల తిరుగుతున్నట్లుగా లేదా అస్థిమితంగా
  • గందరగోళంగా
  • పేలవంగా
  • ఎక్కువ చెమటపట్టేటట్లుగా
  • బలహీనంగా
  • ఆత్రుతగా లేదా విసుగ్గా
  • తలనొప్పి కలిగినట్లుగా
  • వేగమైన గుండెచప్పుడు కలిగినట్లుగా

తీవ్రమైన హైపోగ్లేసిమియా మీరు అపస్మారక స్థితిలోకి వెళ్ళడానికి కారణం కాగలదు. అదే జరిగినట్లయితే, మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంలో మీకు సహాయం అవసరం అవుతుంది. మీ ఆరోగ్య సంరక్షణ జట్టు, మీకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను త్వరగా పెంచే ఒక మందు అయిన ఒక గ్లుకాగాన్ ఇంజెక్షన్ ను ఎలా ఇవ్వాలని మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు నేర్పించవచ్చు. గ్లుకాగాన్ అందుబాటులో లేకపోతే, చికిత్స కోసం సమీప అత్యవసర గదికి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఎవరైనా 85000 23456 కు కాల్ చేయాలి.

మీరు ఈ లక్షణాలలో ఏవైనా కలిగి ఉంటే, మీ రక్తంలో గ్లూకోజ్ ను తనిఖీ చేసుకోండి.   మీ సంఖ్య చాలా తక్కువగా ఉంటే,  ఈ శీఘ్ర గ్లూకోజ్ వనరులలో ఒక దానిని తీసుకోండి:

  • మూడు లేదా నాలుగు గ్లూకోజ్ మాత్రలు
  • ఒక సర్వింగ్ గ్లూకోజ్ జెల్- 15 గ్రాముల పిండిపదార్ధాల మొత్తానికి సమానమైనది
  • 1/2 కప్పు ఏదైనా పండు రసం
  • 1/2 కప్పు, రెగ్యులర్– డైట్ కాని- సాఫ్ట్ డ్రింక్
  • 1 కప్పు పాలు
  • హార్డ్ క్యాండీ ఐదు లేదా ఆరు ముక్కలు
  • 1 టేబుల్ స్పూన్ చక్కెర లేదా తేనె

ఇది మీ భోజనం ముందు లక్ష్య సంఖ్య వద్ద ఉందని నిర్ధారించుకొనుటకు 15 నిమిషాల్లో మళ్ళీ మీ రక్తంలో గ్లూకోజ్ ను తనిఖీ చేసుకోండి. మీ సంఖ్య ఇంకా చాలా తక్కువగా ఉంటే, శీఘ్ర గ్లూకోజ్ ఆహారం లేదా పానీయం మరొక సర్వింగ్ తీసుకోండి. మీ రక్తంలో గ్లూకోజ్ మీ భోజనం ముందు లక్ష్య సంఖ్య లేదా ఎక్కువ వద్ద ఉండే వరకు ఈ దశలను రిపీట్ చేయండి.

మీకు బాగా అనిపించిన తర్వాత మరియు మీ రక్తంలో గ్లూకోజ్ మీ లక్ష్య సంఖ్యకు తిరిగి వచ్చిన తర్వాత, ప్రణాళిక ప్రకారం మీ సాధారణ భోజనం, స్నాక్స్ తినండి.

A1C పరీక్ష అంటే ఏమిటి?

హిమోగ్లోబిన్ A1C పరీక్ష, HbA1c, లేదా గ్లైకో హిమోగ్లోబిన్ పరీక్ష అని కూడా పిలువబడే A1C పరీక్ష,  గత 3 నెలల్లో మీ రక్తంలో గ్లూకోజ్ సగటు స్థాయిని ప్రతిబింబించే ఒక రక్త పరీక్ష. మీ A1C పరీక్ష ఫలితం శాతాలలో ఇవ్వబడుతుంది. మీ వైద్యుడు మీ మధుమేహంను నిర్ధారించడంలో సహాయం కొరకు మీ A1C పరీక్షను ఉపయోగించవచ్చు. మీ వైద్యుడు రక్త పరీక్ష కొరకు మీ రక్తం యొక్క నమూనాను కార్యాలయంలో తీసుకుంటాడు లేదా ఒక ప్రయోగశాలకు రక్తం తీసుకొనుటకు మిమ్మల్ని పంపవచ్చు.  మధుమేహం నిర్ధారణ అయిన తర్వాత, మీరు కనీసం సంవత్సరానికి  రెండుసార్లు  A1C పరీక్ష చేయించుకుంటూ వుండాలి .

మీ A1C ఫలితం మరియు మీ రక్తంలో గ్లూకోజ్ సంఖ్యల రికార్డు మీ రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉందా లేదా అని చూపిస్తాయి.

  • మీ A1C ఫలితం చాలా ఎక్కువగా ఉంటే, మీరు మీ మధుమేహం సంరక్షణ ప్రణాళికను మార్చే అవసరం ఉండవచ్చు. మీ ఆరోగ్య సంరక్షణ జట్టు మీరు ప్రణాళిక యొక్క ఏ భాగాన్ని మార్చాలి అని నిర్ణయించడానికి మీకు సహాయపడవచ్చు. ఉదాహరణకు, మీరు మీ భోజన ప్రణాళిక, మీ మధుమేహ మందులు, లేదా మీ శారీరక శ్రమ ప్రణాళిక మార్చే అవసరం ఉండవచ్చు.
  • మీ A1C ఫలితం లక్ష్యంలో ఉంటే, అప్పుడు మీ మధుమేహ చికిత్స ప్రణాళిక పని చేస్తున్నట్లు. మీ A1C ఎంత తక్కువగా వుంటే మధుమేహ సమస్యలు కలిగి ఉండే మీ అవకాశం అంత తక్కువగా వుంటుంది.

ఈ చార్ట్ మధుమేహం కలిగిన వివిధ రకాల వ్యక్తుల కోసం A1C లక్ష్యాలు చూపిస్తుంది.

వ్యక్తుల యొక్క రకాలు A1C లక్ష్యాలు
మధుమేహం ఉన్న చాలా మంది వ్యక్తులు 7% కంటే తక్కువ
గర్భిణీ కావాలనుకునే లేదా గర్భవతిగా వున్న మధుమేహం కలిగిన స్త్రీలు   6% కంటే తక్కువ

A1C లక్ష్యాలు వీటి మీద కూడా ఆధారపడి ఉండవచ్చు

  • మీరు ఎంత కాలం మధుమేహం కలిగి వుండినారు
  • మీరు ఇతర ఆరోగ్య సమస్యలు కలిగి వున్నారా లేదా

మీకు ఏ లక్ష్యం సరైనదో మీ వైద్యుడిని అడగండి.

ఈ చార్ట్ మీ A1C ఫలితం మీ సగటు రక్తంలో గ్లూకోజ్ సంఖ్యకు ఎలా సరిపోవచ్చు అని చూపిస్తుంది.

మీ A1C ఫలితం అంటే అర్థం ఏమిటి
నా A1C ఫలితం నా సగటు రక్తంలో గ్లూకోజ్ సంఖ్య
6% 135
7% 170
8% 205
9% 240
10% 275
11% 310
12% 345

నా రక్తపోటు ఏమై ఉండాలి?

మీ రక్తపోటు 140/90  క్రింద ఉండాలి,  మీ వైద్యుడు మీకు వేరే లక్ష్యాన్ని ఏర్పరుచుటకు సహాయపడితే  తప్ప.

రక్తపోటు మీ రక్త నాళాల లోపలి  రక్త ప్రవాహం యొక్క బలం. రక్తపోటు ఒక స్లాష్ ద్వారా విడగొట్ట బడిన రెండు అంకెలతో వ్రాయబడుతుంది మరియు “140 ఓవర్ 90” అని చెప్పబడుతుంది.  పై సంఖ్య మీ గుండె కొట్టుకుంటుండగా ఉండే ఒత్తిడి మరియు మీ రక్తనాళాల గుండా రక్తాన్ని తోస్తుంది. దిగువ సంఖ్య హృదయ స్పందనల మధ్య మీ రక్తనాళాలు విశ్రాంతి తీసుకుంటుండగా ఉండే ఒత్తిడి.

అధిక రక్తపోటు  రక్తాన్ని సరఫరా చేయడానికి మీ గుండె ఒత్తిడితో పని చేయునట్లు చేస్తుంది. అధిక రక్తపోటు మీ గుండె అలసి పోవునట్లు చేయవచ్చు, రక్తనాళాలను నష్ట పరచవచ్చు,  మరియు గుండెపోటు, స్ట్రోక్, కంటి సమస్యలు, మరియు మూత్రపిండాల సమస్యల యొక్క మీ ప్రమాదాన్ని  పెంచవచ్చు.

మధుమేహం ఉన్న చాలా మంది ప్రజలు అధిక రక్తపోటును కూడా కలిగి వుంటారు.  కానీ మీ రక్తపోటును మీ లక్ష్యంలో ఉంచుకోవడం అనేది మీ గుండె, రక్త నాళాలు, మరియు మీ శరీరం యొక్క ఇతర భాగాలకు జరిగే నష్ట నివారణకు సహాయం చేస్తుంది. ఆరోగ్యకరమైన భోజన ప్రణాళిక, మందులు, మరియు శారీరక  శ్రమ మీరు మీ రక్తపోటు లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడగలవు.

ప్రతీ వైద్య సందర్శనలో మీ రక్తపోటును పరీక్ష చేయించుకోండి. మీ రక్తపోటు నియంత్రణకు మీకు మందు అవసరం వుందో లేదో మీ వైద్యుడిని అడగండి.

నా కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజెరైడ్స్ ఏమై ఉండాలి?

మీ డాక్టర్ మీకు వేరే లక్ష్యాలను ఏర్పాటు చేయడంలో సహాయపడితే తప్ప, మీ కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ సంఖ్యలు ఈ చార్ట్ లోని లక్ష్యాలను చేరుకోవాలి.

మధుమేహం కలిగిన వ్యక్తుల కొరకు లక్ష్య రక్తంలో కొలెస్ట్రాల్ సంఖ్యలు
మొత్తం కొలెస్ట్రాల్ 200 కంటే క్రింద
LDL, లేదా చెడు,  కొలెస్ట్రాల్ మీకు కార్డియో వ్యాధి లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే 100 క్రింద లేదా 70 క్రింద
HDL, లేదా మంచి,  కొలెస్ట్రాల్ పురుషుల్లో 40 పైన మరియు మహిళల్లో 50 పైన
ట్రైగ్లిజెరైడ్స్   150 క్రింద

కొలెస్ట్రాల్ అనేది మీ శరీరం యొక్క కణాలలో, రక్తంలో మరియు అనేక ఆహారాలలో కనబడే ఒక రకమైన కొవ్వు. అధిక కొలెస్ట్రాల్ కార్డియోవాస్క్యులర్ వ్యాధి అని కూడా పిలువబడే గుండె మరియు రక్త నాళ వ్యాధికి దారితీయవచ్చు. మధుమేహం కలిగిన వారికి కార్డియోవాస్క్యులర్ అతి పెద్ద ఆరోగ్య సమస్య.

LDL కొలెస్ట్రాల్. LDL  కొలెస్ట్రాల్ ను చెడు కొలెస్ట్రాల్ అంటారు ఎందుకంటే అది మీ గుండెకు రక్తం సరఫరా చేసే ధమని గోడలలో పేరుకుపోతుంది. ఒక వేళ అదనపు కొవ్వు ధమని గోడలలో పేరుకుపోతుంది,  ఒకవేళ

  • మీరు LDL కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలు తరచుగా తింటే
  • అధిక కొవ్వు మీ కుటుంబంలో వంశ పారంపర్యం అయితే

HDL కొలెస్ట్రాల్. HDL కొలెస్ట్రాల్,  లేదా మంచి కొలెస్ట్రాల్, మీ శరీరం ఇతర భాగాల నుండి కొవ్వును, మీ శరీరం నుండి కొవ్వును తొలగించే మీ కాలేయానికి తిరిగి చేరుస్తుంది.

ట్రైగ్లిజరైడ్స్. ట్రైగ్లిజరైడ్స్ మీ రక్తంలో మరియు ఆహారంలో మరొక రూపంలో ఉండే కొవ్వు.   ట్రైగ్లిజరైడ్స్  ధమని గోడలలో పేరుకుపోనప్పటికీ, కార్డియోవాస్క్యులార్ జబ్బు యొక్క మీ ప్రమాదం అధికం అనే దానికి సంకేతం కావచ్చు.

మొత్తం కొలెస్ట్రాల్. మీ మొత్తం కొలెస్ట్రాల్ సంఖ్య రక్తంలో మొత్తం కొవ్వును ప్రతిబింబిస్తుంది, కానీ మీ LDL కొవ్వు పరిమాణం కారణంగా ఎక్కువగా వుంటుంది.

మీ కొవ్వు స్థాయిల కొరకుమీ లక్ష్య సంఖ్యలను చేరుకోవడం అనేది గుండె జబ్బు, స్ట్రోక్, మరియు మీ రక్తనాళాలకు జరిగే నష్టంను నిరోధించడానికి సహాయం చేస్తుంది.  కొవ్వు స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం అనేది రక్త ప్రవాహంనకు కూడా సహాయపడవచ్చు. ఆరోగ్యకరమైన భోజన ప్రణాళిక, మందులు, మరియు శారీరక కార్యక్రమం మీ లక్ష్య రక్తంలో కొవ్వు సంఖ్యలను చేరుకోవడానికి సహాయపడవచ్చు.

మీ కొవ్వును కనీసం సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేయించుకోండి.  మీ వైద్యుడు కొలెస్ట్రాల్ పరీక్ష కోసం కొద్దిగా మీ రక్తం తీసుకొనుటకు మిమ్మల్ని ల్యాబ్ కు పంపుతాడు.  మీ కొవ్వును నియంత్రించుటకు స్టాటిన్ అనే మందు మీకు అవసరమో లేదో మీ వైద్యుడిని అడగండి.

తినడం,  డైట్, మరియు న్యూట్రిషన్

ఒక ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికను అనుసరించడం అనేది మధుమేహంతో జీవించడం మరియు మధుమేహం సమస్యలను నిరోధించడంలో కీలక దశ. మీ ఆరోగ్య సంరక్షణ జట్టు ఒక ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికను తయారు చేయడంలో మీకు సహాయం చేస్తుంది.

నేను మధుమేహం మందులు తీసుకోవలసిన అవసరం ఉందా?

మీరు ఒక ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక మరియు శారీరక శ్రమతో మీ లక్ష్యం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను చేరుకోలేకపోతే మీకు మధుమేహం మందులు అవసరం కావచ్చు. మీకు ఏరకమైన మందులు మీరు తీసుకుంటారు  అనేది మీ మధుమేహం యొక్క రకం మీద, మీ షెడ్యూల్, మీ ఇతర ఆరోగ్య సమస్యల మీద ఆధారపడి ఉంటుంది. మధుమేహ మందులు మీ రక్తంలో గ్లూకోజ్ ను లక్ష్య పరిధిలో ఉంచుటకు సహాయపడతాయి.

మీ వైద్యుడు ఇన్సులిన్ తో సహా మీకు అవసరమైన ఏవైనా మందులను సూచిస్తాడు. గ్లూకోజ్ ను మీ రక్తం నుండి మీ శరీర కణాలకు తరలించడం ద్వారా ఇన్సులిన్ మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను లక్ష్యంలో ఉంచుతుంది. ఒక వేళ మీ శరీరం ఇకపై తగినంత తయారు చేయలేకపోతే మీరు ఇన్సులిన్ తీసుకోవలసిన అవసరం వుంటుంది.

మీ వైద్యుడి నిర్దేశం ప్రకారం మీ మందులు తప్పకుండా తీసుకోండి.

ధూమపానంకు మధుమేహం సమస్యలతో ఉన్న సంబంధం ఏమిటి ?

ధూమపానం మరియు మధుమేహం అనేవి ఒక ప్రమాదకరమైన కలయిక. ధూమపానం పలు మధుమేహం సమస్యల యొక్క మీ ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు ధూమపానం విడిచి పెడితే,

  • మీరు గుండె పోటు, స్ట్రోక్, నరాల వ్యాధి, కిడ్నీ వ్యాధి, మరియు అంగ విచ్ఛేదనం యొక్క మీ ప్రమాదాన్ని తగ్గిస్తారు
  • మీ కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు స్థాయిలు మెరుగుపడవచ్చు
  • మీ రక్త ప్రసరణ మెరుగుపడుతుంది

మధుమేహ సమస్యలను నిరోధించడానికి నేను చర్యలు తీసుకోవచ్చు?

మీరు మధుమేహం సమస్యలను నివారించడానికి ప్రతీ రోజు చర్యలు తీసుకోవచ్చు.

చర్యలు
ఆరోగ్యకరమైనవి తినడం
  •  మీరు మరియు మీ వైద్యుడు లేదా డైటిషియన్ తయారు చేసిన ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికను అనుసరించండి.
  •   రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచేందుకు ఏమి తినవలయునో తెలుసుకోండి.
  •  మీరు ప్రతీ రోజు మంచి అనుభూతిని పొందుటకు సహాయంగా మరియు అవసరమైతే బరువు తగ్గడానికి తెలివైన ఆహార ఎంపికలను చేయండి.
రక్తంలో గ్లూకోజ్
  • ప్రతీ రోజు మీ రక్తంలో గ్లూకోజ్ తనిఖీ చేసుకోండి.
  • మీ ఆరోగ్య సంరక్షణ జట్టుతో పంచుకోవడానికి మీరు మీ రక్తంలో గ్లూకోజ్ ను తనిఖీ చేసుకున్న ప్రతీ సారి ఆ సంఖ్యను మీ రికార్డు పుస్తకంలో వ్రాయండి.
  • తక్కువ రక్తంలో గ్లూకోజ్ కు త్వరగా చికిత్స చేయించుకోండి.
శారీరక కార్యక్రమం
  • చిన్న శారీరక శ్రమ కూడా మధుమేహంను నిర్వహించడానికి సహాయ పడుతుంది. వారంలో చాలా రోజులు 30 నుంచి 60 నిమిషాల పాటు శారీరక శ్రమను లక్ష్యంగా పెట్టుకోండి. 10 నుంచి 17 సంవత్సరాల వయస్సు వున్న టైప్ 2 మధుమేహం గల పిల్లలు మరియు కౌమారస్తులు ప్రతీ రోజు 60 నిమిషాల శారీరక శ్రమను లక్ష్యంగా పెట్టుకోవాలి.
  •  శారీరక శ్రమ అంతా ఒకే సమయంలో చేయవలసిన అవసరం లేదు .
  •  బ్రిస్క్ వాకింగ్ వంటి మీ గుండె  వేగంగా కొట్టుకునేటట్లు చేసే మీ పెద్ద కండరాలను ఉపయోగించే ఏరోబిక్ కార్యకలాపాలు చేయండి. మీ పెద్ద కండరాలు మీ ఎగువ మరియు దిగువ చేతులు మరియు కాళ్లలో ఉండేవి మరియు తల, భుజం, మరియు హిప్ కదలికలు నియంత్రించేవి.
  • కండరాలు మరియు ఎముకను బలోపేతం చేసే చర్యలైన బరువులు ఎత్తడం లేదా సిట్ అప్స్ చేయండి. వారానికి రెండు సార్లు లక్ష్యంగా పెట్టుకోండి.
  • మీ వశ్యతను పెంచడానికి, ఒత్తిడి తగ్గించడానికి మరియు శారీరక శ్రమ తరువాత కండరాల వాపును నిరోధించడంలో సహాయం చేయడానికి స్ట్రెచ్ చేయండి.
  • TV లేదా కంప్యూటర్ వద్ద గడిపే సమయం తగ్గించడం ద్వారా రోజువారీ కార్యక్రమాన్ని పెంచండి. పిల్లలు మరియు కౌమారదశ వాళ్ళు స్కూల్కు సంబంధంలేని స్క్రీన్ సమయాన్ని రోజుకు 2 గంటల కంటే తక్కువకు పరిమితం చేయండి.  స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం అనేది మీ శారీరక కార్యక్రమ లక్ష్యాన్ని చేరుకోవడంలో మీకు సహాయం చేయవచ్చు.
  • మీరు ఒక కొత్త శారీరక కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడితో మాట్లాడండి.
మందులు
  •   మీ వైద్యుడి ఆదేశం ప్రకారం ఇన్సులిన్ తో సహా నిర్దేశించిన మీ మందులు తీసుకోండి.
పాదాలు 
  • కోతలు, బొబ్బలు, పుళ్ళు, వాపు, ఎర్రదనం, లేదా కాలిగోళ్ళ గాయాల కొరకు ప్రతీ రోజు మీ పాదాలను తనిఖీ చేసుకోండి.
నోరు
  • మీ పళ్ళను ప్రతీ రోజు బ్రష్ మరియు ఫ్లాస్స్ చేయండి.
రక్తపోటు
  • మీ రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ ను నియంత్రించుకోండి
ధూమపానం
  • ధూమపానం  చేయవద్దు

నేను నా ప్రతీ చెకప్ లో నా ఆరోగ్య సంరక్షణ జట్టుతో ఏమి చర్చించాలి?

మీ ప్రతీ తనిఖీలో మీ ఆరోగ్య రక్షణ జట్టుతో చర్చించవలసిన ముఖ్యమైన విషయాలను ఈ చార్ట్ జాబితా పరుస్తుంది.

ప్రతీ చెకప్ లో మీ ఆరోగ్య సంరక్షణ జట్టుతో చర్చించవలసిన విషయాలు నిర్ధారించుకోండి …
రక్తంలో గ్లూకోజ్ రికార్డులు మరియు మీ రక్తంలో గ్లూకోజ్ ను ఎలా తనిఖీ చేస్తారు
  • మీ రక్తంలో గ్లూకోజ్ రికార్డులు తప్పక షేర్ చేసుకోండి. మీరు అది సరిగ్గా చేస్తున్నారా అని నిర్ధారించడానికి మీ ఆరోగ్య సంరక్షణ జట్టు మీరు మీ రక్తంలో గ్లూకోజ్ ను ఎలా తనిఖీ చేసుకుంటున్నారు అని అడుగుతుంది.
  • మీరు తరచుగా తక్కువ లేదా అధిక రక్తంలో గ్లూకోజ్ కలిగి ఉంటే తప్పక నమోదుచేయండి.
బరువు
  • మీరు ఎంత బరువు ఉండాలి అనే దాని గురించి తప్పక మాట్లాడండి.
  • మీకు సరిపోయే బరువు లక్ష్యాన్ని చేరుకోవడానికి గల మార్గాల గురించి మాట్లాడండి.
రక్తపోటు
  • మీ రక్తపోటు సంఖ్యల గురించి తప్పక మాట్లాడండి.
కొలెస్ట్రాల్
  • మీ కొలెస్ట్రాల్  సంఖ్యల గురించి తప్పక మాట్లాడండి.
మందులు
  • మీరు తీసుకునే మందుల గురించి తప్పక మాట్లాడండి. మీకు ఏవైనా సమస్యలు ఉంటే ప్రస్తావించండి.
  • మీ గుండె వ్యాధి ప్రమాదాన్ని తగ్గించేందుకు మీరు ప్రతీ రోజు ఒక తక్కువ మోతాదు ఆస్పిరిన్ తీసుకోవలసి ఉంటుందా అని  తప్పక అడగండి.
పాదాలు
  • సమస్యల కొరకు మీ పాదాలను తనిఖీ చేయమని తప్పక అడగండి.
శారీరక కార్యక్రమం ప్రణాళిక
  • మీరు చురుకుగా ఉండుటకు ఏమి  చేస్తారు అనే దాని గురించి తప్పక మాట్లాడండి.
భోజన ప్రణాళిక
  • మీరు ఏమి తినాలి, ఎంత తినాలి,  ఎప్పుడు తినాలి అనే దాని గరించి మాట్లాడండి.
భావాలు
  • ఒత్తిడి నిర్వహించడానికి మార్గాలను గురించి తప్పక అడగండి.
  • మీకు విచారంగా అనిపిస్తూ వుంటే లేదా మీరు సమస్యలను ఎదుర్కోలేకపోతే, సహాయం కోసం తప్పక అడగండి.
ధూమపానం
  • మీరు ధూమపానం చేస్తుంటే, వదిలిపెట్టడంలో సహాయం కోసం తప్పక అడగండి.
నోరు
  • మీరు మీ నోటిలో మధుమేహం వలన వచ్చే సమస్యల సంకేతాలు చూసినట్లయితే, మీ వైద్యునికి  తప్పక చెప్పండి మరియు మీ దంత వైద్యుడిని తప్పక కలవండి.

నాకు మధుమేహం ఉంటే నాకు ఏ  టెస్ట్లు, పరీక్షలు, టీకాలు అవసరమవుతాయి?

కనీసం సంవత్సరానికి ఒకసారి లేదా రెండుసార్లు చేయించుకోవలసిన ముఖ్యమైన టెస్ట్లు, పరీక్షలు, టీకాలను ఈ చార్ట్  పొందుపరుస్తుంది.

కనీసం సంవత్సరానికి ఒకసారి లేదా రెండుసార్లు చేయించుకోవలసిన ముఖ్యమైన టెస్ట్లు, పరీక్షలు, టీకాలు   నిర్ధారించుకోండి
A1C పరీక్ష
  • కనీసం సంవత్సరానికి రెండుసార్లు ఈ రక్త పరీక్ష చేయించుకోండి. మీ ఫలితాలు మీ గత 3 నెలల సగటు రక్తంలో గ్లూకోజ్ ఏ స్థాయిలో ఉండినాయో అని మీకు చెప్పుతాయి.
కొలెస్ట్రాల్ పరీక్ష
  • ఇవి తనిఖీ చేసుకొనుటకు ఒక రక్త పరీక్ష చేయించుకోండి

o    మొత్తం కొలెస్ట్రాల్

o     LDL

o    HDL

o    ట్రైగ్లిజరైడ్స్

మూత్ర పిండాల పరీక్ష
  • సంవత్సరానికి ఒకసారి ప్రోటీన్ తనిఖీ కోసం ఒక మూత్ర పరీక్ష చేయించుకోండి.
  • కనీసం సంవత్సరానికి ఒకసారి, ఆరోగ్యమైన మూత్రపిండాలు శరీరం నుండి తొలగించే ఒక వ్యర్థ ఉత్పత్తి అయిన క్రియాటినిన్ తనిఖీ కోసం ఒక రక్త పరీక్ష చేయించుకోండి.
కంటి పరీక్ష
  • కనుపాపను పెద్దదిగా చేయు ఒక చుక్కల మందును ఉపయోగించే ఒక పూర్తి కంటి పరీక్ష కోసం సంవత్సరానికి ఒకసారి ఒక కంటి వైద్యుడిని కలవండి.
  •  మీరు గర్భవతిగా ఉంటే, గర్భం యొక్క మీ మొదటి 3 నెలల్లో పూర్తి కంటి పరీక్ష చేయించుకోండి. మీ బిడ్డ పుట్టిన 1 సంవత్సరం తర్వాత మరొక పూర్తి కంటి పరీక్ష  చేయించుకోండి.
దంత పరీక్ష
  • క్లీనింగ్ మరియు చెకప్ కోసం సంవత్సరానికి  రెండుసార్లు మీ దంత వైద్యుడుని కలవండి.
ఫ్లూ టీకా
  •  ప్రతీ సంవత్సరం ఒక ఫ్లూ టీకా వేయించుకోండి
న్యుమోనియా టీకా
  •  మీ వయస్సు  64 కంటే తక్కువ ఉంటే ఈ టీకా వేయించుకోండి.
  •  మీరు 64 కంటే ఎక్కువ వుండి మరియు మీరు టీకాను 5 సంవత్సరాల కంటే ఎక్కువ క్రితం,  వేయించుకొని వుంటే, మరొకటి వేయించుకోండి.
హెపటైటిస్ బి టీకా
  • మీకు 60 కంటే తక్కువ వయస్సు వుంటే మరియు మీరు ఇప్పటికే టీకా వేయించుకొని  ఉండకపోతే ఈ టీకా వేయించుకోండి.
  •  రక్త గ్లూకోజ్ మానిటర్లు లేదా ఇతర మధుమేహం పరికరాలు పంచుకోకుండా ఉండడం ద్వారా హెపటైటిస్ బి హెపటైటిస్ బి కి గురికావడాన్ని నివారించండి.

డైలీ డయాబెటిస్ రికార్డ్ ను ఎలా ఉపయోగించాలి

మీరు మీ రక్తంలో గ్లూకోజ్ పరీక్ష ఫలితాలు, మందులు, మరియు మీ రక్తంలో గ్లూకోజ్ ను ప్రభావితం చేసే విషయాలు గురించిన గమనికలను మీరు ట్రాక్ చేయగల ఒక ఖాళీ ట్రాక్ రికార్డ్ ను ఈ విభాగం అందిస్తుంది. ప్రతీ వారం కొరకు రికార్డ్ యొక్క ఒక కాపీని ఉంచుకోండి. ఈ రికార్డ్ మీ మధుమేహం ప్రణాళిక పని చేస్తుందో లేదో చెప్పుతుంది.   ప్రతీ తనిఖిలో మీ ఆరోగ్య సంరక్షణ జట్టుతో మీ రికార్డును సమీక్షించండి.

డైలీ డయాబెటిస్ రికార్డు ను పూర్తి చేసేటప్పుడు ఈ లిస్ట్ అనుసరించండి.

రక్తంలో గ్లూకోజ్ తనిఖీలు 

  • మీ రక్తంలో గ్లూకోజ్ తనిఖీ ఉత్తమ సమయాల గురించి మీ ఆరోగ్య సంరక్షణ జట్టుతో చర్చిండి— భోజనం ముందు, భోజనం తర్వాత, లేదా నిద్రవేళలో. చార్టులో మీ రక్తంలో గ్లూకోజ్ ను ఎప్పుడు తనిఖీ చేయాలో వ్రాయండి.
  • మీ లక్ష్య రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలు వ్రాయండి. అవసరమైతే, భోజనం మునుపు మరియు భోజనం తర్వాత తీసుకున్న పరీక్ష ఫలితాలను మీల్ బాక్సుల లోని లైన్ కు ఇరువైపులా రికార్డు చేయండి. ఉదాహరణకి,
  • మీరు మీ లక్ష్యం క్రింద లేదా పైన ఉన్న ప్రతీ సారీ రక్తంలో గ్లూకోజ్ ఫలితాలను సర్కిల్ చేయండి. ఉదాహరణకి,

మందులు

  • “మందులు” అనే శీర్షిక కింద మీ మధుమేహం మందులు పేర్లు మరియు తీసుకున్న మొత్తాలను వ్రాయండి.

గమనికలు

  • మీ రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలను ప్రభావితం చేసే విషయాలు వ్రాయండి. కొన్ని ఉదాహరణలు
  • మామూలు కంటే ఎక్కువ లేదా తక్కువ తినడం
  • మీ మధుమేహం మందులు తీసుకోవాలని మర్చిపోవడం
  • శారీరక కార్యక్రమం— ఏ రకం మరియు ఎంత కాలం పాటు అని వ్రాయండి
  • అనారోగ్యంతో ఉండటం
  • ఏదైనా విషయం గురించి కలత చెందడం—ఒత్తిడిలో ఉండటం
డైలీ డయాబెటిస్ రికార్డ్
నా లక్ష్య రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలు

భోజన లక్ష్యం ముందు ________ కు ________
ఒక భోజనం లక్ష్యం ప్రారంభమైన 1 నుండి 2 గంటలు తర్వాత ________ లేదా క్రింద
నా A1C లక్ష్యం ________


నా రక్తంలో గ్లూకోజ్ తనిఖీ ఎప్పుడు చేయాలి __________________
__________
నా రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే నా ఆరోగ్య సంరక్షణ జట్టు కు కాల్ చేయండి
అల్పాహారం రక్తంలో గ్లూకోజ్ మందులు మధ్యాహ్న భోజనం రక్తంలో గ్లూకోస్ మందులు రాత్రి భోజనం
రక్తంలో గ్లూకోస్
మందులు బెడ్ టైం
రక్తంలో గ్లూకోస్
మందులు ఇతర

రక్తంలో

గ్లూకోజ్

తనిఖీ

గమనికలు: (ప్రత్యేక కార్యక్రమాలు, జబ్బుపడిన రోజులు,  శారీరక  కార్యక్రమం)
సోమవారం
మంగళవారం
బుధవారం
గురువారం
శుక్రవారం
శనివారం
ఆదివారం

నా ఆరోగ్య సంరక్షణ జట్టు సభ్యులు

మీ ఆరోగ్య సంరక్షణ జట్టు సభ్యుల యొక్క సంప్రదింపు సమాచారం ను ట్రాక్ చేయడానికి ఈ చార్ట్ ను ఉపయోగించండి.

  పేరు మరియు చిరునామా ఫోన్
 మధమేహ వ్యాధి నిపుణుడు
మధుమేహ అధ్యాపకుడు
కౌన్సిలర్
ఔషధ విక్రేత
దంత వైద్యుడు
కంటి వైద్యుడు
పాద వైద్యుడు

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు