రంజాన్ మరియు మధుమేహ వ్యాధి

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456

మీ మధుమేహ వ్యాధికి సంబంధించిన సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మరియు రంజాన్ మాసంలో ఇది ఎలా ప్రభావితమవుతుందో అని చెప్పడం కోసం ఈ వ్యాసం రూపొందించబడింది.

రంజాన్ లోని ఉపవాసంలో అనేక ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. రంజాన్ మనకు అల్లాహ్ పై మన భాధ్యతలను నెరవేర్చడానికి, మన శరీరాలను మరియు ఆత్మలను శుభ్రపరచడానికి మరియు స్వీయ నియంత్రణను సాధించడానికి అవకాశాన్ని ఇస్తుంది.

మధుమేహ వ్యాధితో బాధపడుతున్న కొంతమందికి, ఉపవాసం ప్రమాదకరం కావచ్చు లేదా మీకు ఆరోగ్య సమస్యలు కలిగించవచ్చు. భారతదేశంలో ఇప్పుడు రంజాన్ వేసవిలో వచ్చింది. ఎక్కువ గంటలు ఉపవాసంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా మీకు మధుమేహ వ్యాధి ఉంటే, ఇది అదనపు ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. ఉపవాసం పాటించే ముందు, దయచేసి మీరు కింద ఉన్న సలహాలను చదివి, మీ డయాబెటాలజిస్ట్ ను సంప్రదించండి.

1. నేను ఉపవాసం చేస్తున్నప్పుడు నా శరీరానికి ఏం జరుగుతుంది?

మనము ఉపవాసంలో ఉండి తినకపోతే, మా చివరి భోజనం తర్వాత సుమారు 8 గంటలకు, మన శరీరాలు మన రక్త గ్లూకోస్ (షుగర్) స్థాయిలను సాధారణంగా ఉంచడానికి మన శరీరంలో ఉన్న శక్తులను ఉపయోగించడం ప్రారంభిస్తాయి. చాలా మందికి ఇది హానికరం కాదు. మీకు మధుమేహ వ్యాధి ఉంటే, మీ శరీరం గ్లూకోస్ ను కూడా ఉపయోగించలేదు.

మధుమేహంతో, ముఖ్యంగా మీరు కొన్ని టాబ్లెట్ లు లేదా ఇన్సులిన్ తీసుకుంటే, మీరు హైపోగ్లైకేమియా లేదా “హైపోస్” (రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు) ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. ఈ ఏడాది, ఉపవాసాలు ఎక్కువ కాలం తీసుకుంటున్నాయి మరియు హైపోగ్లైకేమియా మరియు నిర్జలీకరణ ప్రమాదాలు (నీటి లేకపోవడం) అధికంగా ఉంటాయి. మీకు మధుమేహ వ్యాధి వుంటే, ఏర్పడగల మరొక సమస్య ఏమిటంటే, మరియు ఉపవాసం ముందు మరియు తర్వాత (సుహూర్ / సెహ్రి మరియు ఇఫ్తార్ లో) మనం తినే ఆహారం తరువాత ఏర్పడే రక్తంలో అధిక చక్కర స్థాయిలు. మీకు మధుమేహ వ్యాధి ఉంటే హైపోగ్లైకేమియా, రక్తంలో అధిక షుగర్ స్థాయిలు మరియు నిర్జలీకరణ ప్రమాదకరం కావచ్చు.

2. నాకు మధుమేహ వ్యాధి ఉంది, నేను ఉపవాసం చేయవచ్చా?

మధుమేహ వ్యాధి వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న చాలా మంది వ్యక్తులు, ఉపవాసం నుండి మినహాయించబడతారు. ఉపవాసం చేయాలనేది మీ డైయాబెటాలజిస్ట్ యొక్క సలహాతో మీరు తీసుకోవలసిన ఒక వ్యక్తిగత నిర్ణయo.

ఈ క్రింద నేను మధుమేహ వ్యాధి గల వ్యక్తులను ఉపవాసంతో వచ్చే సమస్యల కొరకు ఎక్కువ ప్రమాదం, మధ్యస్థ ప్రమాదం మరియు తక్కువ స్థాయి ప్రమాదంగా విభజించాను.

మీరు తక్కువ స్థాయి ప్రమాదంలో ఉంటే (మీ మధుమేహం ఆహారం లేదా టాబ్లెట్లతో బాగా నియంత్రించబడితే మరియు మధుమేహం యొక్క ఏ సమస్యలు లేకపోతే), అప్పుడు మీరు ఉపవాసం చేయగలరు. మీరు ఎక్కువ లేదా మధ్యస్థ ప్రమాదంలో ఉంటే మీ డైయాబెటాలజిస్ట్ చెప్పేంతవరకు మీరు ఉపవాసం చేయకూడదు, ఎందుకంటే మీ శరీరం ఉపవాసం ను తట్టుకోలేకపోవచ్చు.

అధిక ప్రమాదం (ఉపవాసం చేయకూడదని సలహా ఇవ్వబడతారు)
• టైప్ 1 మధుమేహం
• మీరు ఇన్సులిన్ ఇంజెక్షన్ లు రోజుకి రెండు సార్లు కంటే ఎక్కువగా ఉపయోగిస్తే
• మీ మధుమేహ వ్యాధి పైన మీకు తక్కువ నియంత్రణ ఉంటే
• మీకు తరుచుగా ఏర్పడే రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలతో సమస్యలు ఉంటే
• గత ఆరు నెలలలో మీరు రక్తంలో అత్యధికంగా చక్కెర స్థాయి వల్ల ఆసుపత్రిలో చేరినట్లయితే
• గత ఆరు నెలలలో మీరు రక్తంలో అతి తక్కువ చక్కెర స్థాయి వల్ల ఆసుపత్రిలో చేరినట్లయితే
• ఏ లక్షణాలు లేకుండా మీకు రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు ఉంటే
• మీకు మూత్రపిండాలు, కాలేయం లేదా తక్కువ కంటి చూపు వంటి సమస్యలు ఉంటే
• మీకు డయాబెటిక్ ఫుట్ అంటువ్యాధి లేదా పాదంలో పుండుతో సహా తీవ్ర అనారోగ్యం ఉంటే
• మీరు గర్భవతి అయితే

మధ్యస్థ ప్రమాదం (మీ డైయాబెటాలజిస్ట్ తో ఒప్పందం చేసేంతవరకు ఉపవాసం చేయరాదు)
• మీకు మీ మధుమేహ వ్యాధి పై ఒక మోస్తరు నియంత్రణ ఉంటే మరియు మధుమేహ సమస్యలు ఎక్కువగా లేకుంటే
• గ్లిమీప్రైడ్ వంటి కొన్ని టాబ్లెట్ లతో బాగా నియంత్రించబడిన మధుమేహం

తక్కువ ప్రమాదం (సలహాతో మీరు ఉపవాసం చేయగలరు)
• ఆహారంతో నియంత్రించబడిన మధుమేహం
• మెట్ఫోర్మిన్, సిటాగ్లిపిన్, లినాగ్లిప్టిన్, పయోగ్లిటాజోన్ మరియు డపాగ్లిఫ్లోజిన్ వంటి కొన్ని టాబ్లెట్ లతో మరియు లిరాగ్లుటైడ్ వంటి ఇంజెక్షన్ తో నియంత్రించబడే మధుమేహం.

గుర్తించుకోండి, మీరు ఉపవాసం చేయలేనప్పుడు, మీరు ధర్మం చేయడం ద్వారా లేదా పేదలకు ఆహారం అందించడం ద్వారా మీ బాధ్యతలను పూర్తి చేయగలరు. దీని గురించి మరింత సమాచారం కోసం మీ స్థానిక ఇమామ్ తో మాట్లాడండి లేదా ముస్లిం ధార్మిక సంస్థలను ఉపయోగించుకోండి.

గుర్తించుకోండి, మీరు ఈ రంజాన్ లో ఉపవాసాలు చేయలేరంటే, ఆ తరువాత, బహుశా శీతాకాలంలో తర్వాత మీరు ఉపవాసాలు చేయవచ్చు.

మీరు ఉపవాసం చేయాలనుకుంటే, ఈ పవిత్రమైన మాసం నుండి ఎక్కువ పుణ్యం సంపాదించడానికి మరియు సురక్షితంగా ఉండడానికి మీరు మంచి సలహా మరియు మద్దతు పొందడానికై కనీసం, రంజాన్ కి రెండు నెలల ముందు మీ డయాబేటాలజిస్ట్ ను సంప్రదించాలి.
మీ రక్త గ్లూకోజ్ నియంత్రణ కోసం, ప్రత్యేకించి ఏదైనా ఔషధాలు మరియు/లేదా ఇన్సులిన్ తీసుకుంటూ వుంటే, తయారీ చాలా ముఖ్యమైనది.

3. నేను గర్భవతిని మరియు నాకు మధుమేహ వ్యాధి ఉంది, నేను ఉపవాసం చేయవచ్చా?

కాదు, మీరు గర్భవతి అయి మధుమేహo ఉంటే, మీరు ఉపవాసం నుండి మినహాయించబడతారు. మీరు ఉపవాసం చేస్తే, మిమ్మల్ని మరియు మీ పుట్టని బిడ్డను కూడా మీరు ప్రమాదంలో ఉంచుతారు. మీరు ధర్మం చేయడం ద్వారా లేదా పేదలకు ఆహారం అందించడం ద్వారా మీ బాధ్యతలను పూర్తి చేయవచ్చు మరియు మీరు ఆ తర్వాత ఉపవాసం చేయవచ్చు అని గుర్తుంచుకోండి.

4. నేను నా మందులను తీసుకోవడం కొనసాగించాలా?

అవును, రంజాన్ లో మీరు మీ మందులను తీసుకోవడం అత్యంతవసరం. అయితే, కొన్ని చికిత్సలు మీకు రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలను (హైపో) ఇవ్వవచ్చు. మీరు ఆహారం తీసుకోకుండా మరియు ఇలాంటి చికిత్సలు తీసుకున్నప్పుడు, మీరు తక్కువ రక్త చక్కెర స్థాయి ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కోవచ్చు. మీ మందుల మోతాదు మరియు సమయాలను మార్చాల్సిన అవసరం వుండవచ్చు.

మీరు మందులను తీసుకోకపొతే, రంజాన్ లో ఆహార పదార్థాల రకాల మరియు భోజన సమయాల మార్పు వల్ల మీరు రక్తంలో ఎక్కువ చక్కెర స్థాయిలను ఎదుర్కోవచ్చు.
రంజాన్ కి ముందు మీ డయాబెటాలజిస్ట్ తో మీ మధుమేహ వ్యాధి చికిత్స గురించి మీరు మాట్లాడాలి.

5. రంజాన్ లో నేను నా మధుమేహ వ్యాధితో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవచ్చు?

మీకు మధుమేహ వ్యాధి వుంటే, రంజాన్ లో మీరు మూడు ముఖ్యమైన సమస్యలను ఎదుర్కోవచ్చు.

• రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు (హైపోగ్లైకేమియా లేదా హైపోస్ అని కూడా పిలుస్తారు)
• రక్తంలో ఎక్కువ చక్కెర స్థాయిలు
• నిర్జలీకరణ

భారతదేశంలో, ఇప్పుడు రంజాన్ వేసవి లో వచ్చింది మరియు ఉపవాసాల నిడివి చాలా ఎక్కువ సేపు ఉంటుంది (18 గంటల నిడివి వరకు). ఎక్కువ సేపు ఉపవాసం వల్ల రక్తంలో తక్కువ షుగర్ స్థాయిలు మరియు నిర్జలీకరణ వంటి సమస్యల యొక్క అధిక ప్రమాదం ఎదుర్కొంటారు. వాతావరణం వేడిగా ఉన్నట్లయితే మీరు త్రాగకపోవడం నిర్జలీకరించబడవచ్చు , అది మీకు అనారోగ్యం కలిగించవచ్చు. మీరు నిర్జలీకరించబడితే మరియు/లేదా మీరు సుహూర్ లేదా ఇఫ్తార్ లో అధికంగా తింటే రక్తంలో అధిక రక్త చక్కెర స్థాయిలు కూడా సంభవించవచ్చు.
6. హైపోగ్లైకేమియా లేదా హైపో అంటే ఏమిటి?

ఇది 70 mg/dl కంటే తక్కువ రక్త చక్కెర స్థాయి. మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు, రక్తంలో తక్కువ చక్కెర స్థాయిల లక్షణాలు కనిపిస్తే, మీరు ఉపవాసం ఆపేయాలి. మీ దగ్గర బ్లడ్ గ్లూకోస్ పర్యవేక్షణ యంత్రం ఉంటే, మీరు మీ బ్లడ్ గ్లూకోస్ స్థాయి ని తనిఖీ చేసి, మీకు హైపోగ్లైకేమియా వ్యాధి ఉంటే ఉపవాసం ను ఆపివేయాలి.

తక్కువ రక్త చక్కెర స్థాయి లక్షణాలలో ఈ క్రిందివి వుంటాయి:
చమటగా అనిపించడం
మానసికంగా స్థిరత్వం లేకపోవడం
ఆత్రుతగా లేదా అనారోగ్యంగా అనిపించడం
వణకడం మరియు కంపించడం
పెదవులు జలదరించటం
ఆకలిగా అనిపించడం
పాలిపోవడం
గుండె అదరటం/గుండె దడ

7. నేను ఒక హైపోకు ఎలా చికిత్స చేయాలి?

మీ ఉపవాసం ముగింపు అవ్వాలి ఎప్పుడంటే:
• ఉపవాస సమయంలో మీ రక్త షుగర్ స్థాయి 70 mg/dl కంటే తక్కువ ఉంటే
• ఉపవాస ప్రారంభంలో మీ రక్త షుగర్ స్థాయి 70 mg/dl ఉంటే మరియు మీరు ఇన్సులిన్ లేదా గ్లిమీపైడ్ పైన ఉంటే

ఈ కిందివాటిలో మీరు అత్యవసరంగా రక్తoలో తక్కువ షుగర్ స్థాయిని చికిత్స చేయాలి:
• ఒక చిన్న గ్లాస్ స్వచ్చమైన పండ్ల రసం (150-200 ml)
• 2 స్పూన్ ల చక్కెర కలిపిన ఒక చిన్న గ్లాస్ నీరు (150-200 ml)
• గ్లూకోస్ టాబ్లెట్ లు
• స్వీట్లు లేదా చాక్లెట్లు

మీ రక్త గ్లూకోస్ ను 10 నుండి 15 నిమిషాల తర్వాత తనిఖీ చేయండి మరియు అది అప్పటికీ 70 mg/dl కంటే తక్కువగా ఉన్నట్లయితే పైన చెప్పిన చికిత్సను పునరావృతం చేయండి.

మీరు తక్కువ రక్త చక్కెర స్థాయికి చికిత్స చేసిన తర్వాత, ఇడ్లి, దోస లేదా అన్నం వంటి టిఫిన్లు తినాలి.

రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు చాలా ప్రమాదకరమైనవి మరియు చికిత్స చేయకపోతే, అపస్మారక స్థితికి గురవడం లేదా మూర్ఛ పోవడం ద్వారా ప్రమాదానికి దారితీయవచ్చు.
మీకు రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు (హైపో) ఏర్పడితే ఏ లక్షణాల కోసం చూడాలి అనేది మీ కుటుంబానికి తెలిసి ఉండాలి మరియు మీకు చికిత్స చేయగలగాలి.

మీ హైపో మరింత తీవ్రంగా ఉంటే మరియు మీకై మీరు దానికి చికిత్స చేసుకోలేకపోతే లేదా మీరు అపస్మారక స్థితిలో ఉంటే, మీ కుటుంబం లేదా స్నేహితులు వెంటనే అంబులెన్స్ ను పిలవాలి.

8. ఉపవాస సమయంలో అధిక రక్త చక్కెర స్థాయిలు ఎందుకు ప్రమాదకరం?

అధిక రక్త చక్కెర స్థాయిలు మీకు అనారోగ్యం కలిగించవచ్చు, నిర్జలీకరణం చేయగలవు మరియు నరాలు, రక్త నాళాలు మరియు మూత్రపిండాలు మరియు కళ్ళు వంటి శరీర అవయవాలకు హాని కలిగించవచ్చు. మీ రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే, మీరు స్పృహ కోల్పోవచ్చు.

అధిక రక్త చక్కెర స్థాయిలను నివారించేందుకు:
• ఎల్లప్పుడూ మీ మధుమేహ మందులను తీసుకోండి
• మీ మధుమేహ మందులు మార్చవల్సిరావచ్చు కాబట్టి రంజాన్ కి ముందు మీ డాక్టర్ ను సంప్రదించండి
• చక్కెర ఆహారాలను నియంత్రణలో తినండి
• ఇఫ్తార్ మరియు సుహూర్ మధ్య సమయంలో పుష్కలంగా ద్రవాలు త్రాగండి
• మీకు అనారోగ్యంగా ఉంటే ఉపవాసం చేయవద్దు

మీరు ఇన్సులిన్ మీద ఉంటే, మీ రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా అయ్యే ప్రమాదం వుండవచ్చు. ఇది ఆసుపత్రిలో చేరవలసిన అవసరం వుండే ప్రమాదకరమైన ప్రాణాంతక పరిస్థితులకు దారితీయవచ్చు.

అధిక రక్త చక్కెర స్థాయిల లక్షణాలు:
• చాలా దాహంగా అనిపించడం
• మూత్రం ఎక్కువగా రావడం
• తీవ్ర అలసట

మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు మరియు మీరు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మీ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధంగా తనిఖీ చేయాలి.

మీ ఉపవాసం ముగింపు అవ్వాలి ఎప్పుడంటే:
• మీ రక్త చక్కెర స్థాయి 300 mg/dl కంటే ఎక్కువగా ఉంటే
మీ రక్త చక్కెర స్థాయి ఎక్కువగానే ఉండి మరియు మీకు లక్షణాలు కనిపిస్తే, మీ డయాబెటాలజిస్ట్ తో మాట్లాడండి.

9. నేను నిర్జలీకరణ ప్రమాదంలో ఉన్నానా?

మీ శరీరంలో తగినంత నీరు లేనప్పుడు నిర్జలీకరణ అవుతుంది. ఈ రంజాన్ లో ఉపవాసాలు ఎక్కువ సేపు ఉంటాయి దీని అర్థం ఏమిటంటే ఎక్కువ గంటలు ద్రవాలను తీసుకోకుండా ఉండాలి. మీ రక్త చక్కెర స్థాయిలు అత్యధికంగా ఉన్నప్పుడు కూడా నిర్జలీకరణ అవుతుంది. మీరు నిర్జలీకరణమైతే, మీ రక్తంలో చక్కెర స్థాయిలు చాలా అధికం కావచ్చు మరియు మీరు చాలా అనారోగ్యం పాలవుతారు.

నిర్జలీకరణ ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి, మీరు:
• డయాబెటిక్ అయితే
• రక్తంలో అధిక చక్కెర స్థాయిలు కలిగి ఉన్నప్పుడు
• పెద్ద వయస్సు గల వారైతే
• గర్భవతి అయితే
• డయూరెటిక్స్ (తరచుగా అధిక రక్తపోటు కోసం తీసుకుంటారు) అనే పిలవబడే టాబ్లెట్ లను తీసుకుంటూ ఉంటే
• వేడి వాతావరణంలో వుంటే

మీరు ఉపవాసం మొదలుపెట్టే ముందు మరియు ఇఫ్తార్-సుహూర్ మధ్య సమయంలో ఎక్కువగా చక్కెర రహిత పానీయాలను తీసుకునేటట్లు చూసుకోండి.
టీ, కాఫీ మరియు కోలా వంటి కొన్ని ఫిజ్జి పానీయాలు, కెఫైన్ ను కలిగి ఉంటాయి, ఇది ఒక డయూరెటిక్ మరియు మిమ్మల్ని నిర్జలీకరణం చేస్తుంది.

నిర్జలీకరణ లక్షణాలలో ఇవి ఉంటాయి:
• మైకము
• అధోకరణం చెందడం
• స్పృహ కోల్పోవడం
• చాలా తక్కువ మూత్ర ఉత్పత్తి

మీకు పైన ఉన్న వాటిలో ఏవైనా లక్షణాలు పొందినట్లయితే, మీరు ఉపవాసం ను ఆపివేయాలి మరియు ఏదైనా త్రాగాలి.

10. నేను ఉపవాసం చేస్తే, నేను సురక్షితంగా ఎలా ఉండాలి?

రంజాన్ కి ముందు మీ డయాబెటాలజిస్ట్ ను సంప్రదించండి

• అది మీకు సురక్షితం కాకపోతే మీకు ఉపవాసం చేయరాదని సలహా ఇవ్వబడుతుంది
• మీ మందులను మార్చాల్సిన అవసరం ఉంది

భద్రత చిట్కాలు:

• ఎల్లప్పుడూ గ్లూకోస్ చికిత్స మీతో తీసుకొనివెళ్ళండి.

• ఎల్లప్పుడూ వైద్య హెచ్చరిక బ్రాస్లెట్ వంటి డయాబెటిస్ గుర్తింపును ఉoచుకోండి.

• మీ గ్లూకోస్ (చక్కెర) స్థాయిలను పర్యవేక్షించడానికి క్రమబద్ధంగా మీ రక్తం పరీక్షించండి.

• ఉపవాస సమయంలో మీరు అనారోగ్యానికి గురైనట్లయితే మీ బ్లడ్ గ్లూకోస్ స్థాయిని పరీక్షించండి.

• మీ రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా లేదా తక్కువగా ఉంటే, మీరు దీనికి చికిత్స చేయాలి.

• మీ రక్తంలో చక్కెర స్థాయి 70 mg/dl కంటే తక్కువగా ఉంటే, ఉపవాసాన్ని వెంటనే ముగించి, మరియు తక్కువ రక్త చక్కెర స్థాయిని చికిత్స చేసుకోండి

• ఉపవాస ప్రారంభoలో మీ రక్తంలో చక్కెర స్థాయి 70 mg/dl ఉంటే మరియు మీరు ఇన్సులిన్ లేదా గ్లిమిప్రైడ్ పైన ఉంటే, ఉపవాసం చేయకండి.

• మీ రక్తంలో చక్కెర స్థాయి 300 mg/dl కంటే ఎక్కువగా ఉంటే, వెంటనే ఉపవాసం ముగించండి.

• మీకు నిర్జలీకరణమైతే వెంటనే ఉపవాసం ముగించండి.

• మీరు మీ ఇన్సులిన్ ను ఎప్పటికీ ఆపకూడదు, కానీ మీ ఇన్సులిన్ ఇంజెక్షన్ ల యొక్క మోతాదు మరియు సమయాలను మార్చవలసిన అవసరం ఉండటం వలన మీరు మీ డాక్టర్ తో మాట్లాడాలి.

11. నేను ఉపవాసం చేస్తున్నప్పుడు, నా రక్త గ్లూకోస్ ను పరీక్షించడం సరేనా?

అవును, మీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధంగా పరీక్షించడం ముఖ్యం మరియు ఉపవాస సమయంలో మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది. ఇది మీ ఉపవాసంను బ్రేక్ చేయదు.

12. నేను సుహూర్/సెహ్రి కి మేల్కోవాలా?

అవును. ఇప్పుడు రంజాన్ భారతదేశంలో వేసవి లో ఉంటుంది, 18 గంటల పాటు ఉంటుంది. మధుమేహ వ్యాధితో ఉన్న ప్రజలు ఎక్కువ గంటల పాటు ఏమీ తినకుండా లేదా తాగకుండా ఉంటే, రక్తం లో తక్కువ చక్కర స్థాయిలు మరియు నిర్జలీకరణకు గురవుతారు.

సుహూర్ సమయంలో సూర్యోదయానికి కొంచెం ముందు, మరీ అర్ధరాత్రి కి కాకుండా, మీరు భోజనం చేయాలి, ఎందుకంటే ఉపవాస సమయంలో ఇది మీ చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

13. నేను ఏ రకాల ఆహారాన్ని తినాలి?

సంవత్సరం పొడవునా తెలివిగా మరియు ఆరోగ్యంగా తినాలని గుర్తుంచుకోండి కానీ రంజాన్ లో కూడా అని గుర్తించుకోండి. కార్బోహైడ్రేట్ ఆహారాలను అతిగా మరియు అధిక పరిమాణంలో తినడం అనేది మీ బరువును పెంచడమే కాకుండా మీ రక్త చక్కెర స్థాయిలలో పెద్ద పెరుగుదలలకు మరియు అసమానతలకు కూడా దారి తీస్తుంది. రంజాన్ స్వీయ నియంత్రణ మరియు క్రమశిక్షణ గురించి కూడా అని గుర్తుంచుకోండి. మరిన్ని సలహాల కోసం మీ డయాబెటాలజిస్ట్ ను సంప్రదించండి. సూర్యోదయానికి కొంచెం ముందు సుహూర్ సమయంలో, మీరు భోజనం చేయాలి, ఎందుకంటే ఉపవాస సమయంలో ఇది మీ చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

కొన్ని ఆహార చిట్కాలు:

• ఉపవాసం ను బ్రేక్ చేయడానికి 1-2 డేట్స్ మాత్రమే తీసుకోండి ఎందుకంటే దీనిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది

• మీరు పండ్ల రసం ను తీసుకోవాలనుకుంటే, ఒక చిన్న గ్లాస్ (120ml) రసం ను ఎంచుకోండి.

• సుహూర్ మరియు ఇఫ్తార్ లలో ఎక్కువ గా పిండి పదార్థము ఉన్న కార్బోహైడ్రేట్స్ ను తినండి ఎందుకంటే అవి బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రణ చేయడానికి మరియు శక్తిని నెమ్మదిగా విడుదల చేయడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు గోధుమ బియ్యం, గోధుమ చపాతి, జొన్నలు. భాగ పరిమాణాలను మితంగా ఉంచాలని గుర్తుంచుకోండి.

• ఆహారంలో సంతృప్త కొవ్వు మొత్తాన్ని తగ్గిoచడానికి లీన్ మాంసాలు మరియు చికెన్ ను ఎంచుకోండి.

• కాయధాన్యాలు, బీన్స్ మరియు పప్పుధాన్యాలు అనేవి ప్రోటీన్ యొక్క సహజమైన తక్కువ కొవ్వు మూలం.

• మీ భోజనంలో పండ్లు, కూరగాయలు మరియు సలాడ్లు చేర్చండి.

• బేకింగ్ మరియు గ్రిల్లింగ్ వంటి ఆరోగ్యకరమైన వంట పద్ధతులను ఉపయోగించడానికి ప్రయత్నించండి.

• మీ వంటలో ఉపయోగించే నూనె మొత్తంను తగ్గించండి. ఆహారంలోకి నూనెను పోయడానికి బదులుగా స్పూన్ లలో నూనెను కొలవడానికి ప్రయత్నించండి.

• నెయ్యి మరియు వెన్నను ఉపయోగించడం మానుకోండి.

• పరాఠా, పూరి, సమోసా, పకోడా, ఫ్రైడ్ కబాబ్, ఫ్రైడ్ చికెన్ మరియు చిప్స్ వంటి ఫ్రైడ్ ఆహారంను మానుకోండి

• ఊరగాయలు, ఉప్పు తో కూడిన కాయలు మరియు పులుసు వంటి అధిక ఉప్పు ఉన్న పదార్థాలను మానుకోండి

• లడ్డు, జలేబి వంటి ఎక్కువ చక్కెర ఉన్న ఆహారం ను మానుకోండి. రస్క్, కేక్, బిస్కట్స్, చాక్లెట్, మరియు బియ్యం హల్వా, ఖీర్, వెర్మిసెల్లి వంటి డెసర్ట్ లను తినకండి.

14. నేను ఏ రకాల పానీయాలను తాగాలి?

ఉపవాసం అనేది, ముఖ్యంగా మీకు రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండి, అది కాకుండా భారతదేశంలో ఇప్పుడు రంజాన్ వేసవిలో ఎక్కువ గంటల పాటు ఉపవాసంతో ప్రారంభమైనందున, మిమ్మల్ని నిర్జలీకరణ ప్రమాదంలో ఉంచుతుంది. ద్రవాలు పుష్కలంగా త్రాగండి (షుగర్-ఫ్రీ), ముఖ్యంగా సుహూర్ సమయంలో మరియు ఇఫ్తార్ తర్వాత నీరు ఎక్కువగా త్రాగండి.

పానీయాల గురించి సలహా:

• టీ లేదా కాఫీ త్రాగడం మానుకోండి, దీంట్లో కెఫిన్ కలిగి ఉంటుంది మరియు మీరు నిర్జలీకరణమైపోతారు.

• చక్కెర లేని పానీయాలను త్రాగండి.

• కోలా వంటి చక్కెర లేని పానీయాలలో కూడా కెఫిన్ ఉంటుంది అందుకే దీనిని మానుకోండి

• మీరు త్రాగే పండ్ల రసాలను 120 ml ఒక చిన్న గ్లాస్ కు పరిమితం చేయండి.

15. ఈద్-ఉల్-ఫితర్ రోజు నేను ఎలాంటి రకాల ఆహారాలను తినాలి?

అనేక వేడుక ఆహారాలలో కొవ్వు మరియు చక్కెర ఎక్కువగా ఉండవచ్చు. ఈ పవిత్రమైన రోజున తెలివిగా ఉండండి మీరు తినే మొత్తాలను మితంగా ఉంచండి.

16. నేను తరావీహ్ ప్రార్ధనించగలనా?

గుర్తుంచుకోండి, తరావీహ్ అనేది ఒక బలమైన చర్య మరియు మీరు నిర్జలీకరణ కావచ్చు లేదా తక్కువ రక్త చక్కెర స్థాయిలను కలిగి ఉండవచ్చు. తరావీహ్ ప్రార్థన కి ముందు మీ సాయంకాల భోజనంను తీసుకునేలా చూసుకోండి. ఇది తక్కువ రక్త చక్కెర స్థాయిలను నివారించడానికి మరియు సాయంత్రం మరియు రాత్రి అంతా మీ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

తరావీహ్ సమయంలో ఇబ్బందులను నివారించడానికి, మీరు వీటిని నిర్ధారించుకోండి:
• ఇఫ్తార్ లో పిండి పదార్థo గల కార్బోహైడ్రేట్ ఆహారంను తినండి ఎందుకంటే అవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి.
• ఇఫ్తార్ తర్వాత నీటిని పుష్కలంగా త్రాగండి.
• తరావీహ్ కి నీరు మరియు గ్లూకోస్ బాటిల్ ను తీసుకోనివెళ్ళండి.

తరావీహ్ అయిన తర్వాత మీకు రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు ఉంటే, మీరు మీ మధుమేహ వ్యాధి చికిత్సను సర్దుబాటు చేయవలసిరావచ్చు. మీ డయాబెటాలజిస్ట్ ను సంప్రదించాలి.

17. నేను తరావీహ్ కి నడవవచ్చా?

మీ మధుమేహ వ్యాధి కి సంబంధించిన పాద సమస్యలు ఉంటే తప్ప, తరావీహ్ కి నడవడం అనేది ఒక మంచి వ్యాయామం. గుర్తించుకోండి, మీరు ఇన్సులిన్ ను తీసుకుంటూ ఉండి మరియు చాలా దూరం నడుస్తూ ఉంటే లేదా క్రమం తప్పకుండా నడుస్తూ ఉంటే, మీరు మీ ఇన్సులిన్ మోతాదును తగ్గించుకోవలసిరావచ్చు లేదా మీ రక్తంలో చక్కెర స్థాయి తక్కువకు పడిపోవడం ఆపడానికి, నడవడానికి ముందు మీరు పండు ముక్కను తినవలసిరావచ్చు.

ప్రతిసారి మీరు హైపో చికిత్సను మీతో తీసుకువెళ్ళడం అనేది నిర్ధారించుకోండి.

18. ధూమపానం ను వదిలిపెట్టడానికి రంజాన్ సరైన సమయమా?

మీకు మధుమేహ వ్యాధి ఉంటే, ధూమపానం అనేది మీ గుండె కి సంబంధించిన సమస్యలను ఎక్కువ చేసే ప్రమాదం ఉంది. మీ స్వీయ-నియంత్రణ ను పెంపొందించడానికి మరియు ధూమపానంను వదిలిపెట్టడానికి రంజాన్ ఒక మంచి సమయం. మీకు కావాలంటే, మీ డయాబెటాలజిస్ట్ తో మాట్లాడండి.
దయచేసి, మీ డయాబెటాలజిస్ట్ ఇచ్చిన సలహాను గమనించండి. మీరు ఉపవాసం చేయకూడదని సలహా ఇచ్చినట్లయితే, దయచేసి ఈ సలహా ను గమనించండి మరియు ఉపవాసం చేయకండి.