జీవితం కొరకు మీ మధుమేహాన్ని నిర్వహించడానికి 4 దశలు

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456

దశ 1: మధుమేహం గురించి తెలుసుకోండి.

మధుమేహం అంటే ఏమిటి?

మధుమేహం యొక్క మూడు ప్రధాన రకాలు:

  • టైప్ 1 మధుమేహం – మీ శరీరం ఇన్సులిన్ తయారు చేయదు. ఇది ఒక సమస్య ఎందుకంటే మీరు తినే ఆహారాల నుండి చక్కెర (గ్లూకోజ్) ను తీసుకోవటానికి మరియు మీ శరీరం కోసం దానిని శక్తిగా మార్చడానికి ఇన్సులిన్ అవసరం. మీరు జీవించడానికి ప్రతి రోజు ఇన్సులిన్ తీసుకోవలసిన అవసరం ఉంది.
  • టైప్ 2 మధుమేహం – మీ శరీరం ఇన్సులిన్ ను తయారు చేయదు లేదా బాగా ఉపయోగించదు. మీరు మీ మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడటానికి మాత్రలు లేదా ఇన్సులిన్ తీసుకోవలసిన అవసరం ఉండవచ్చు. టైప్ 2 అనేది మధుమేహం యొక్క అత్యంత సాధారణ రకం.
  • గర్భధారణ మధుమేహం – కొందరు మహిళలకు వారు గర్భవతి ఉన్నప్పుడు ఈ రకమైన మధుమేహం వస్తుంది. చాలా సమయాల్లో, బిడ్డ పుట్టిన తర్వాత అది వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయినా కూడా, ఈ మహిళలకు మరియు వారి పిల్లలకు జీవితంలో తర్వాత మధుమేహం సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మీ ఆరోగ్య సంరక్షణ బృందంలో మీరు అత్యంత ముఖ్యమైన సభ్యులు.

మీ మధుమేహాన్ని ప్రతీ రోజు నిర్వహించేది మీరు. ఆరోగ్యంగా ఉండడానికి మీరు మీ మధుమేహాన్ని ఎలా ఉత్తమ సంరక్షణ చెయ్యాలో అనే దాని గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి. సహాయం చేయగల కొంత మంది ఇతరులు:

  • దంతవైద్యుడు
  • మధుమేహ వైద్యుడు
  • మధుమేహ అధ్యాపకుడు
  • డైటిషియన్
  • కంటి వైద్యుడు
  • పాద వైద్యుడు
  • స్నేహితులు మరియు కుటుంబం
  • మానసిక ఆరోగ్య సలహాదారు
  • నర్స్
  • ఔషధ విక్రేత
  • సామాజిక కార్యకర్త

మధుమేహం గురించి మరింత ఎలా తెలుసుకోవచ్చు?

  • మధుమేహంతో జీవించడం గురించి మరింత తెలుసుకోవడానికి తరగతులు తీసుకోండి. ఒక తరగతి గురించి తెసుకోవడానికి డాక్టర్ సుబ్రహ్మణ్యం కరుటూరి లేదా కిఫీ హాస్పిటల్ ను సంప్రదించండి. మీరు KifySugar.com ఆన్ లైన్ లో కూడా వెతకవచ్చు.
  • మీ మధుమేహాన్ని నిర్వహించడంలో తోటివారి మద్దతు పొందడానికి ఒక సపోర్ట్ గ్రూప్ KifyDiabetes.com లో చేరండి – స్వయంగా లేదా ఆన్లైన్ లో.
  • మధుమేహం గురించి ఆన్లైన్ లో చదవండి. KifySugar.com కు వెళ్ళండి.

మధుమేహాన్ని తీవ్రంగా తీసుకోండి.

మీరు జనం వారు “మధుమేహం యొక్క ఒక టచ్ కలిగి ఉన్నారు”  లేదా “వారి చక్కెర కొద్దిగా ఎక్కువగా” ఉంది అని  చెబుతుండడం విని ఉండవచ్చు. ఈ పదాలు మధుమేహం ఒక తీవ్రమైన వ్యాధి కాదు అని సూచిస్తాయి. ఆ భావన సరైనది కాదు.మధుమేహం తీవ్రమైనది, కానీ మీరు దానిని నిర్వహించడం తెలుసుకోవచ్చు.

మధుమేహం వున్న వారు ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు చేయవలసిన, ఒక ఆరోగ్యకరమైన బరువుతో ఉండవలసిన, ప్రతి రోజు ఎక్కువ కదలవలసిన, మరియు వారికి బాగా అనిపించిన్నప్పుడు కూడా వారి మందులను తీసుకోవలసిన అవసరం వుంది. చేసేవి చాలా వున్నాయి. ఇది సులభం కాదు, కానీ అది ఉపయోగకరము!

ఎందుకు మీ మధుమేహం పట్ల శ్రద్ధ వహించాలి?

మీ గురించి మరియు మీ మధుమేహం గురించి  జాగ్రత్త తీసుకోవడం అనేది మీకు నేడు మరియు భవిష్యత్తులో బాగా అనిపించడానికి సహాయం చెయ్యవచ్చు. మీ రక్తంలో చక్కెర (గ్లూకోజ్) సాధారణం కు దగ్గరగా ఉన్నప్పుడు, మీకు ఈ క్రింది వాటికి అవకాశం ఉంది:

  • మరింత శక్తిని కలిగి వుంటారు
  • తక్కువ అలసటతో మరియు దాహంతో వుంటారు
  • తక్కువ తరచుగా మూత్రం విసర్జించే అవసరం వుంటుంది
  • మెరుగ్గా కోలుకుంటారు
  • తక్కువ చర్మం లేదా బ్లాడర్ ఇన్ఫెక్షన్లను కలిగి వుంటారు

మీరు మధుమేహం కారణంగా వచ్చే ఈ క్రింది వాటి వంటి ఆరోగ్య సమస్యలను కలిగి అవకాశం కూడా తక్కువగా ఉంటుంది:

  • గుండెపోటు లేదా స్ట్రోక్
  • చూడడంలో ఇబ్బంది లేదా అంధత్వానికి దారితీసే కంటి సమస్యలు
  • నెర్వ్ డామేజ్ అని కూడా పిలువబడే మీ చేతులు మరియు పాదాలలో నొప్పి, జలదరించటం, లేదా తిమ్మిరి
  • మీ మూత్రపిండాలు పనిచేయటం మానుకోడానికి కారణం అయ్యే మూత్రపిండ సమస్యలు
  • దంతాలు మరియు చిగుళ్ళ సమస్యలు
  • మీరు చేపట్టగల చర్యలు
  • మీకు ఏ రకం మధుమేహం ఉంది అని మీ వైద్యుడిని అడగండి.
  •  మద్దతు కోసం మీరు ఎక్కడికి వెళ్ళగలరో తెలుసుకోండి.
  • మీ మధుమేహాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది మీకు నేడు మరియు భవిష్యత్తులో బాగా అనిపించడానికి ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.

దశ 2: మీ మధుమేహం యొక్క ఎబిసిలు తెలుసుకోండి.

మీ A1C, రక్తపోటు (బ్లడ్ ప్రెషర్), మరియు కొలెస్ట్రాల్ లను ఎలా నిర్వహించాలో మీ ఆరోగ్య సంరక్షణ  బృందంతో మాట్లాడండి. గుండెపోటు, స్ట్రోక్, లేదా ఇతర మధుమేహ సమస్యలను కలిగి వుండే అవకాశాలను తగ్గించడంలో ఇది సహాయం చేయవచ్చు.

అంటే A1C పరీక్ష.

ఇది ఏమిటి?

A1C అంటే గత మూడు నెలలుగా మీ సగటు రక్తంలో చక్కెర స్థాయిని కొలిచే ఒక రక్త పరీక్ష. ఇది మీరు ప్రతి రోజు చేసే రక్తంలో చక్కెర తనిఖీలకు భిన్నంగా ఉంటుంది.

ఇది ఎందుకు ముఖ్యం?

మధుమేహంతో వున్న ఎంతోమందికి A1C లక్ష్యం 7 కంటే తక్కువ. ఇది మీకు వేరే ఉండవచ్చు. మీ లక్ష్యం ఏమై ఉండాలి అని అడగండి.

బి అంటే బ్లడ్ ప్రెజర్ (రక్తపోటు).

ఇది ఏమిటి?

రక్తపోటు అంటే మీ రక్తనాళాల యెుక్క గోడకు వ్యతిరేకంగా మీ రక్తం యొక్క శక్తి.

ఇది ఎందుకు ముఖ్యం?

మీ రక్తపోటు చాలా ఎక్కువ అయితే, అది మీ గుండె చాలా కష్టపడి పని చేసేలా చేస్తుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్, మరియు మీ మూత్రపిండాలు మరియు కళ్ళు దెబ్బతినడానికి కారణం కావచ్చు.

రక్తపోటు లక్ష్యం ఏమిటి?

మధుమేహం వున్న చాలా మందికి రక్తపోటు లక్ష్యం 140/90 క్రింద ఉంటుంది. అది మీకు వేరే ఉండవచ్చు. మీ లక్ష్యం ఏమై ఉండాలో అడగండి.

సి అంటే కొలెస్ట్రాల్.

ఇది ఏమిటి?

మీ రక్తంలో రెండు రకాల కొలెస్ట్రాల్ లు ఉన్నాయి: LDL మరియు HDL.

LDL లేదా “చెడు” కొలెస్ట్రాల్ పేరుకు పోయి మీ రక్తనాళాలను మూసుకుపోయేలా చేయవచ్చు. ఇది గుండెపోటు లేదా స్ట్రోక్ ను కలిగించవచ్చు.

HDL లేదా “మంచి” కొలెస్ట్రాల్ మీ రక్తనాళాల నుండి “చెడు” కొలెస్ట్రాల్ తొలగించడానికి సహాయపడుతుంది.

LDL మరియు HDL గోల్స్ ఏమిటి?

మీ కొలెస్ట్రాల్ సంఖ్యలు ఏమై ఉండాలి అని అడగండి. మీ లక్ష్యాలు ఇతర వ్యక్తులకు భిన్నంగా ఉండవచ్చు. మీ వయస్సు 40 సంవత్సరాలకు పైబడి ఉంటే, మీరు గుండె ఆరోగ్యానికి ఒక స్టాటిన్ మందు తీసుకోవలసిన అవసరం వుండవచ్చు.

మీరు చేపట్టగల చర్యలు

  • మీ ఆరోగ్య సంరక్షణ బృందాన్ని అడగండి:
  • మీ A1C, రక్తపోటు, మరియు కొలెస్ట్రాల్ సంఖ్యలు ఏమిటి మరియు అవి ఎంత ఉండాలి. ఎంత కాలం నుండి మీకు మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మరియు మీ మధుమేహాన్ని నిర్వహించండి ఎంత కష్టం అనే దానిపై మీ ABC గోల్స్ ఆధారపడి ఉంటాయి.
  • మీ ABC లక్ష్యాలను చేరుకోవడానికి మీరు ఏమి చేయవచ్చు
  • మీ పురోగతిని గుర్తించడానికి ఈ బుక్లెట్ వెనుక రికార్డు మీద మీ సంఖ్యలు వ్రాయండి.

దశ 3: మధుమేహంతో జీవించడం ఎలాగో తెలుసుకోండి.

మీరు మధుమేహంతో జీవిస్తున్నప్పుడు, నిష్ఫలంగా, విచారంగా, లేదా కోపంగా అనిపించడం సాధారణం. ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవలసిన దశలు మీకు  తెలిసి ఉండవచ్చు, కానీ కాలక్రమేణా మీ ప్రణాళికతో అంటిపెట్టుకోవడంలో ఇబ్బంది వుంది. ఈ విభాగంలో మీ మధుమేహాన్ని ఎలా ఎదుర్కోవడం, బాగా తినడం, మరియు చురుకుగా వుండటం అనేదానిపై చిట్కాలు ఉన్నాయి.

మీ మధుమేహాన్ని ఎదుర్కోండి.

  • ఒత్తిడి మీ బ్లడ్ షుగర్ ను పెంచవచ్చు. మీ ఒత్తిడిని తగ్గించే మార్గాలను తెలుసుకోండి. లోతైన శ్వాస తీసుకోవడం, తోటపని, నడక, ధ్యానం, మీ అభిరుచి మీద పని చేయడం, లేదా మీ ఇష్టమైన సంగీతం వినడాన్ని ప్రయత్నించండి.
  • మీకు క్రుంగిపోతునట్లు అనిపిస్తే, సహాయం కోసం అడగండి. ఒక ఆరోగ్య సలహాదారు, సపోర్ట్ గ్రూప్, మతాధికారుల యొక్క సభ్యుడు, స్నేహితుడు, లేదా కుటుంబ సభ్యుడు – ఎవరు మీ ఆందోళనలు వింటారో వారు మీకు బాగా అనిపించడానికి సహాయపడవచ్చు.

బాగా తినండి.

  • మీ ఆరోగ్య సంరక్షణ బృందం సహాయంతో మధుమేహ భోజన పథకాన్ని తయారు చేయండి.
  • కేలరీలు, సాచ్యురేటేడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్, చక్కెర, మరియు ఉప్పు తక్కువ గల ఆహారాలను ఎంచుకోండి.
  • తృణ ధాన్యాలు, బ్రెడ్లు, అన్నం వంటి ఎక్కువ పీచుపదార్థం వున్న ఆహారాలను తినండి.
  • పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, బ్రెడ్ మరియు చిరుధాన్యాలు, మరియు తక్కువ-కొవ్వు గల లేదా వెన్న తీసిన పాలు మరియు జున్ను వంటి ఆహారాలను ఎంచుకోండి.
  • జ్యూస్ మరియు సాధారణ సోడా బదులుగా నీరు త్రాగండి.
  • ఒక భోజనం తినేటప్పుడు, మీ ప్లేట్ లో పండ్లు మరియు కూరగాయలతో సగం వంతు, బీన్స్, లేదా చికెన్ వంటి ఒక లీన్ ప్రోటీన్ తో ఒక పావు వంతు మరియు బ్రౌన్ రైస్ వంటి ఒక తృణ ధాన్యముతో పావు వంతు నింపండి.

చురుకుగా ఉండండి.

  • వారంలో చాలా రోజులు మరింత చురుకుగా ఉండటానికి ఒక గోల్ ను ఏర్పాటు చేసుకోండి. రోజుకు 10 నిమిషాల చొప్పున 3 సార్లు నడవడం ద్వారా నెమ్మదిగా మొదలు పెట్టండి.
  • వారంలో రెండు సార్లు, మీ కండరాల బలం పెంచడానికి పనిచేయండి, స్ట్రెచ్ బ్యాండ్లను వాడండి, యోగా చేయండి, భారీ తోటపని చేయండి (త్రవ్వించి మరియు పనిముట్లతో చెట్లను నాటండి) లేదా పుష్-అప్స్ ప్రయత్నించండి.
  • మీ భోజనం ప్రణాళికను ఉపయోగించి మరియు మరింత కదలడం ద్వారా ఒక ఆరోగ్యకరమైన బరువు వద్ద ఉండండి లేదా పొందండి.

ప్రతి రోజు ఏమి చేయాలో తెలుసుకోండి.

  • మీకు బాగా ఉన్నప్పుడు కూడా మధుమేహం మరియు ఏవైనా ఇతర ఆరోగ్య సమస్యలు కొరకు మీ మందులు తీసుకోండి. గుండెపోటు లేదా స్ట్రోక్ నిరోధించడానికి మీకు ఆస్పిరిన్ అవసరమా అని మీ వైద్యుడిని అడగండి. మీరు మీ మందులను భరించలేకపోతే లేదా మీకు ఏవైనా దుష్ప్రభావాలు ఉంటే మీ వైద్యుడికి చెప్పండి.
  • కోతలు, బొబ్బలు, ఎరుపు మచ్చలు, మరియు వాపు కొరకు ప్రతి రోజు మీ పాదములను తనిఖీ చేయండి. ఏవైనా మానిపోని పుళ్ళ గురించి వెంటనే మీ డాక్టర్ ను పిలవండి.
  • మీ నోరు, దంతాలు, మరియు చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి,ప్రతి రోజు మీ పళ్ళను బ్రష్ చేయండి మరియు ఫ్లాస్ చేయండి.
  • ధూమపానాన్ని ఆపండి. వదిలివేయడానికి సహాయం కోసం అడగండి.
  • మీ రక్తంలో చక్కెరను గమనించండి. మీరు దానిని రోజుకు ఒకటి లేదా ఎక్కువ సార్లు చెక్ చేయాలని అనుకోవచ్చు. మీ రక్తంలో చక్కెర సంఖ్యల యొక్క రికార్డును నిర్వహించడానికి ఈ బుక్లెట్ వెనుక వద్ద వున్న కార్డును ఉపయోగించండి. మీ ఆరోగ్య సంరక్షణ బృందంతో దాని గురించి ఖచ్చితంగా మాట్లాడటానికి నిర్ధారించుకోండి.
  • మీ డాక్టర్ సలహా ఇస్తే మీ రక్తపోటును తనిఖీ చేయండి మరియు దాని యొక్క ఒక రికార్డ్ను నిర్వహించండి.

మీ ఆరోగ్య సంరక్షణ బృందంతో మాట్లాడండి.

  • మీ మధుమేహం గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ వైద్యుడిని అడగండి.
  • మీ ఆరోగ్యంలో ఏవైనా మార్పులు కనిపిస్తే తెలియజేయండి.

మీరు చేపట్టగల చర్యలు

  • ఒక ఆరోగ్యకరమైన భోజన పథకం కోసం అడగండి.
  • మరింత చురుకుగా ఉండటానికి మార్గాల గురించి అడగండి.
  • మీ రక్తంలో చక్కెరను ఎలా మరియు ఎప్పుడు పరీక్షించాలని మరియు మీ మధుమేహాన్ని  నిర్వహించడానికి ఆ ఫలితాలను ఎలా ఉపయోగించాలో అడగండి.
  • మీ స్వీయ రక్షణకు సహాయంగా ఈ చిట్కాలను ఉపయోగించండి.
  • మీరు మీ ఆరోగ్య సంరక్షణ బృందాన్ని సందర్శించిన ప్రతీ సారి,మీ మధుమేహ ప్రణాళిక మీకోసం ఎలా పని చేస్తుందో చర్చించండి.

దశ 4: ఆరోగ్యంగా ఉండడానికి రొటీన్ సంరక్షణ పొందండి.

ఏవైనా సమస్యలను తొందరగా కనుగొని చికిత్స చేయడానికి కనీసం సంవత్సరానికి రెండుసార్లు మీ వైద్యుడిని కలవండి.

ప్రతి సందర్శనలో, మీరు క్రింది వాటిని చేయాలని నిర్ధారించుకోండి:

  • రక్తపోటు తనిఖీ
  • పాదాల తనిఖీ
  • బరువు తనిఖీ
  • మీ స్వీయ రక్షణ ప్రణాళిక సమీక్ష

ప్రతి సంవత్సరం రెండు సార్లు,  ఈ క్రింది దానిని చేయించుకోండి:

  • A1C పరీక్ష. ఇది 7 కంటే ఎక్కువ ఉంటే దానిని మరింత తరచుగా తనిఖీ చేయవచ్చు.

ప్రతి సంవత్సరం ఒకసారి, ఈ క్రింది దానిని చేయాలని నిర్ధారించుకోండి:

  • కొలెస్ట్రాల్ పరీక్ష
  • సంపూర్ణ పాదం పరీక్ష
  • పళ్లు మరియు చిగుళ్లను తనిఖీ చేయడానికి దంత పరీక్ష
  • కంటి సమస్యల కోసం విప్పార్చిన కంటి పరీక్ష
  • ఫ్లూ షాట్
  • మూత్రపిండాల సమస్యల తనిఖీ కోసం మూత్రం మరియు రక్త పరీక్ష

మీ జీవితకాలంలో కనీసం ఒకసారి, క్రింది వాటిని పొందండి:

  • న్యుమోనియా షాట్
  • హెపటైటిస్ బి షాట్

మీరు చేపట్టగల చర్యలు

  • వీటి గురించి మరియు మీకు అవసరమైన ఇతర పరీక్షలు గురించి మీ వైద్యుడిని అడగండి. మీ ఫలితాలకు అర్ధం ఏమిటి అని అడగండి.
  • మీ తదుపరి సందర్శన తేదీ మరియు సమయం వ్రాయండి.
  • మీ మధుమేహ చికిత్స యొక్క రికార్డును నిర్వహించడానికి ఈ బుక్లెట్ వెనుక వద్ద వున్న కార్డును ఉపయోగించండి.

గుర్తుంచుకోవలసిన విషయాలు:

  • మీరు మీ ఆరోగ్య సంరక్షణ బృందంలో అత్యంత ముఖ్యమైన సభ్యులు.
  • మీరు మీ మధుమేహాన్ని ఎలా నిర్వహించాలో తెలుసుకోవడానికి ఈ బుక్లెట్ లో నాలుగు దశలను అనుసరించండి.
  • మీ మధుమేహం ABC గోల్స్ ను ఎలా చేరుకోవాలో తెలుసుకోండి.
  • సహాయం కోసం మీ వైద్యుడిని సంప్రదించండి.

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు