ప్రియమైన ఒకరికి మధుమేహంను ఎదుర్కోవడానికి ఎలా సహాయం చేయాలి

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456

ప్రజలకు వారి కుటుంబం మరియు స్నేహితుల మద్దతు ఉన్నప్పుడు, వారు వారి మధుమేహంను బాగా నిర్వహించగలరు.  ఒంటరిగా నిర్వహించడానికి ఇది ఒక కఠినమైన వ్యాధి. మీకు ప్రియమైన ఒకరికి మధుమేహంను ఎదుర్కోవడానికి మీరు మద్దతివ్వడం ద్వారా సహాయం చేయవచ్చు. ఎలా అని ఈ టిప్ షీట్ మీకు చెబుతుంది.

మధుమేహం గురించి తెలుసుకోండి.

ప్రజలు మధుమేహంతో బాగా జీవించడం ఎలా అని నేర్చు కోడానికి చాలా అంశాలున్నాయి. మీ ప్రియమైన వారికి అతని లేదా ఆమె యొక్క మధుమేహంను నిర్వహించండంలో సహాయం చేయుటకు మీరు నేర్చుకున్న దానిని ఉపయోగించండి.

  • ఒక ప్రియమైన వారికి మధుమేహంను ఎదుర్కోవడంలో సహాయం చెయ్యడం మాట్లాడటంతో ప్రారంభమవుతుంది.
  • అతను లేదా ఆమె మధుమేహాన్ని ఎలా నిర్వహిస్తున్నారు అనే దాని గురించి మీకు నేర్పించమని మీ ప్రియమైన వారిని అడగండి.
  • మధుమేహంతో జీవించడం గురించిన ఒక సపోర్ట్ గ్రూప్ లో చేరండి- వ్యక్తిగతంగా లేక ఆన్ లైన్ లో. ఒక దానిని కనుగొనేందుకు మీ ఆసుపత్రి లేదా ఏరియా హెల్త్ క్లినిక్ ను సంప్రదించండి.
  • మీరు మధుమేహంను నిర్వహించడం గురించి మరింత తెలుసుకోవడం ఎలా అని మీ ప్రియమైన వారి యొక్క ఆరోగ్య సంరక్షణ జట్టును అడగండి.

మధుమేహం ను ఎదుర్కోవడం గురించి మరియు మీరు ఎలా సహాయ పడగలరు అని  మీ ప్రియమైన వారిని  అడగండి

ఇక్కడ కొన్ని నమూనా ప్రశ్నలు ఉన్నాయి:

  • మీరు ఎప్పుడైనా మీ మధుమేహంను నిర్వహించడానికి మీరు చేసేదంతా వృధా లేదా నిష్ఫలం అని భావించారా?
  • మీరు మీ మధుమేహంను నిర్వహించడానికి లక్ష్యాలను ఏర్పరచుకున్నారా?
  • మీ లక్ష్యాలను చేరే దారిలో ఏ విషయాలు వస్తాయని అనిపిస్తుంది?
  • నేను సహాయం చేయుటకు ఏమి చేయాలి? (ఉదాహరణకు: మీరు మధుమేహంతో జీవించడం సులభతరం చేయడానికి మీ కొరకు నేను చేయగల విషయాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ మీరు మరింత హుషారుగా  ఉండాలనుకుంటే, ఇద్దరం కలసి నడవడం అనేది సహాయ పడగలదా?)
  • మీరు మీ మధుమేహం సంరక్షణ గురించి మీ ఆరోగ్య సంరక్షణ జట్టుతో మాట్లాడారా మరియు ఎలా మీరు మీ లక్ష్యాలను చేరుకోవాలనుకుంటున్నారు?

మీరు ఎలా సహాయపడగలరు.

ఈ చిట్కాలలో కొన్నింటిని మీ ప్రియమైన వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి.

మధుమేహంతో జీవించడం అనే ఒత్తిడిని నిర్వహించడానికి మీ ప్రియమైన వారికి సహాయపడేందుకు మార్గాలను కనుగొనండి.  ఒక మంచి వినేవారుగా ఉండటం అనేది తరచుగా మీరు సహాయం చేయడానికి చాలా ముఖ్యమైన విషయం.

డాక్టర్ సందర్శనలు,  ఎప్పుడు రక్తంలో చక్కెరను తనిఖీ చేసుకోవాలి మరియు మందులు ఎప్పుడు  తీసుకోవాలి అనే దాని గురించి గుర్తుచేయాలి అని అతను లేదా ఆమె కోరుకుంటున్నారా అని మీ ప్రియమైన వారిని అడగండి.

ఆరోగ్య సంరక్షణ జట్టు కొరకు మీ ప్రియమైన వారికి ఒక ప్రశ్నల లిస్టు తయారు చేయడంలో సహాయం చేయండి.

బాగా తినండి. మీ ప్రియమైనవారికి పండ్లు, కూరగాయలు, మరియు తృణధాన్యాలు  వంటి ఆహారాలు వుండే భోజనం చేయడానికి సహాయం చేయండి.

నడక, నాట్యం, లేదా తోటపని లాంటి మీరు కలిసి చేసే పనులు కనుక్కోండి. చురుకుగా ఉండటం అనేది ఒత్తిడిని నిర్వహించడానికి ఒక గొప్ప మార్గం.

రోజువారీ కలిసి చేసే నడక మాట్లాడటానికి మరియు చురుకుగా ఉండడానికి మీకుసమయం ఇస్తుంది.

డెజర్ట్ కొరకు తాజా పండ్లు సర్వింగ్ చేయడం ద్వారా స్వీట్లను దూరంగా పెట్టండి.

మీ ప్రియమైన వారికి మధుమేహంను ఎదుర్కోడానికి సహాయం చేసేందుకు మీరు చెయ్యగల్గిన మూడు విషయాలను వ్రాయండి.

1

2

3

 తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు