ప్యాంక్రియాటిక్ ఐలెట్స్ మార్పిడి

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456


ప్యాంక్రియాటిక్
 ఐలెట్స్ అంటే ఏమిటి?

లాంగర్హాన్స్ ఐలెట్స్ అని కూడా పిలువబడే ప్యాంక్రియాటిక్  ఐలెట్స్, క్లోమం (ప్యాంక్రియాస్) అంతటా చెల్లాచెదురుగా వుండే కణాల యొక్క చిన్న సమూహాలు. క్లోమం కడుపు కింద వెనుక భాగంలో ఒక చేయి అంత పరిమాణంలో వుండే ఒక అవయవం.

ప్యాంక్రియాటిక్ ఐలెట్స్ హార్మోన్ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే బీటా కణాలతో సహా అనేక రకాల కణాలను కలిగి ఉంటాయి.  క్లోమం శరీరం ఆహారాన్ని జీర్ణం చేయుటకు మరియు ఉపయోగించుకొనుటకు సహాయపడే ఎంజైములను కూడా తయారు చేస్తుంది.

ప్యాంక్రియాటిక్ ఐలెట్స్ హార్మోన్ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే బీటా కణాలతో సహా అనేక రకాల కణాలను కలిగి ఉంటాయి.

భోజనం తర్వాత, రక్తంలో చక్కెర అని కూడా పిలువబడే రక్తంలో గ్లూకోజ్ యొక్క స్థాయి పెరిగినప్పుడు, క్లోమం రక్త ప్రవాహంలోకి ఇన్సులిన్ ను విడుదల చేయడం ద్వారా స్పందిస్తుంది. ఇన్సులిన్ శరీరం అంతటా వుండే కణాలు రక్త ప్రవాహం నుండి గ్లూకోజ్ ను గ్రహించి మరియు దానిని శక్తి కొరకు ఉపయోగించడంలో సహాయపడుతుంది.

క్లోమం తగినంత ఇన్సులిన్ ను తయారు చేయనప్పుడు, శరీర కణాలు సమర్థవంతంగా ఇన్సులిన్ ను వుపయోగించలేనప్పుడు, లేదా రెండూ అయినప్పుడు మధుమేహం అభివృద్ధి అవుతుంది.  ఫలితంగా, గ్లూకోజ్  శరీరంలోని కణాల ద్వారా గ్రహించబడడానికి బదులుగా రక్తంలో పేరుకుపోతుంది.

టైప్ 1 మధుమేహంలో, రోగనిరోధక వ్యవస్థ వాటి పై దాడి చేసి మరియు వాటిని నాశనం చేస్తుంది కాబట్టి క్లోమం యొక్క బీటా కణాలు ఇన్సులిన్ ను ఇక పై తయారు చేయలేవు. రోగనిరోధక వ్యవస్థ బాక్టీరియా, వైరస్లు మరియు ఇతర హానికారకం విదేశీ పదార్ధాలను గుర్తించడం మరియు నాశనం చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ నుంచి ప్రజలను రక్షిస్తుంది.  టైప్ 1 మధుమేహం వున్న వ్యక్తి జీవించడానికి ప్రతి రోజూ ఇన్సులిన్ తీసుకోవాలి. టైప్ 2 మధుమేహం సాధారణంగా ఇన్సులిన్ నిరోధకత అనే ఒక పరిస్థితితో ప్రారంభమవుతుంది, దానిలో శరీరం ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేక ఇబ్బంది పడుతుంది. కాలక్రమేణా, ఇన్సులిన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది, కనుక టైప్ 2 మధుమేహం వున్న చాలామందికి  చివరికి ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం వుంటుంది.

ప్యాంక్రియాటిక్  ఐలెట్స్ మార్పిడి అంటే ఏమిటి?

ప్యాంక్రియాటిక్  ఐలెట్స్ మార్పిడి యొక్క రెండు రకాలు

  • అల్లో- ట్రాన్స్ప్లాంటేషన్
  • ఆటో- ట్రాన్స్ప్లాంటేషన్

ప్యాంక్రియాటిక్ ఐలెట్ అల్లోట్రాన్స్ప్లాంటేషన్  అనేది మరణించిన అవయవ దాత యొక్క క్లోమం నుండి తీసుకోబడిన ఐలెట్స్ ను శుద్ధి చేసి, ప్రాసెస్ చేసి మరో వ్యక్తికి బదిలీ చేసే ఒక పద్దతి. ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నాలజీ చికిత్సా విధానంగా గుర్తించబడేంత విజయవంతమైనది అని పరిగణించబడే వరకు ప్యాంక్రియాటిక్ ఐలెట్ అల్లో-ట్రాన్స్ప్లాంటేషన్  ప్రస్తుతం ఒక ప్రయోగాత్మక విధానంగా గుర్తించబడింది  .

ప్రతీ ప్యాంక్రియాటిక్ ఐలెట్ అల్లో-ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ఫ్యూషన్ కొరకు, ఒకే మరణించిన దాత యొక్క క్లోమం నుండి ఐలెట్స్ ను తొలగించడానికి పరిశోధకులు  ప్రత్యేక ఎంజైములను ఉపయోగిస్తారు. ఐలెట్స్ ను శుద్ధి చేసి మరియు ఒక ప్రయోగశాలలో లెక్కిస్తారు. ఒక ఇన్ఫ్యూజన్ కు సగటున 400,000 నుండి 500,000 ఐలెట్స్ చొప్పున మార్పిడి రోగులు రెండు ఇన్ఫ్యూజన్లను పొందుతారు. ఒకసారి అమర్చిన తర్వాత,  ఈ ఐలెట్స్ లోని బీటా కణాలు ఇన్సులిన్ ను తయారు చేయడం మరియు విడుదల చేయడం ప్రారంభిస్తాయి.

ప్యాంక్రియాటిక్ ఐలెట్ అల్లో-ట్రాన్స్ప్లాంటేషన్ అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడం కష్టమైన టైప్ 1 మధుమేహం కలిగిన కొందరు రోగులలో నిర్వహించబడుతుంది. మార్పిడి యొక్క లక్ష్యాలు ఏమిటంటే -రోజూ వారీ ఇన్సులిన్ ఇంజెక్షన్లతో లేదా లేకుండా సాధారణ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సాధించడానికి ఈ రోగులకు సహాయం చేయడం మరియు హైపోగ్లైసీమియా అవగాహనారాహిత్యాన్ని తగ్గించడం లేదా తొలగించడం. హైపోగ్లేసిమియా అవగాహనారాహిత్యం అనేదిమధుమేహంతో ఉన్న ఒక వ్యక్తి  హైపోగ్లైసీమియా, లేదా తక్కువ రక్తంలో గ్లూకోజ్ లక్షణాలను అనుభూతి చెందలేని ఒక ప్రమాదకరమైన పరిస్థితి.  ఒక వ్యక్తి హైపోగ్లైసిమియా లక్షణాలను అనుభూతి చెందినప్పుడు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తిరిగి సాధారణ స్థితికి తీసుకుని రావడానికి చర్యలు తీసుకోవచ్చు.

ప్యాంక్రియాటిక్ ఐలెట్స్ అల్లో-ట్రాన్స్ప్లాంటేషన్ ఐలెట్స్ మార్పిడి మీద వైద్య పరిశోధన కోసం భారత ప్రభుత్వం నుండి అనుమతి పొందిన ఆసుపత్రులలో మాత్రమే నిర్వహించబడతాయి. మార్పిడులు తరచుగా రేడియాలజిస్ట్—మెడికల్ ఇమేజింగ్ లో నైపుణ్యం కలిగిన ఒక వైద్యుడు—ద్వారా నిర్వహించబడతాయి -. కాథెటర్ అని పిలువబడే ఒక పల్చని, అనువైన గొట్టాన్ని ఎగువ ఉదర భాగంలో—ఛాతీ మరియు తుంటి మధ్య ప్రాంతంలో— మరియు కాలేయం యొక్క నిర్వాహక సిర లోకి ఒక చిన్న గాటు గుండా ఉంచడంలో మార్గదర్శకత్వం చేయటానికి రేడియాలజిస్ట్ x కిరణాలు మరియు ఆల్ట్రాసౌండ్ ను ఉపయోగిస్తారు.  నిర్వాహక సిర  అనేది కాలేయానికి రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన సిర. అప్పుడు ఐలెట్స్  ఇన్ఫ్యూజ్  చేయబడతాయి లేదా కాథెటర్ గుండా కాలేయంలోకి నెమ్మదిగా నెట్టబడతాయి. సాధారణంగా, రోగి ఒక లోకల్ అనస్థటిక్ (స్థానిక మత్తు) మరియు ఒక ఉపశమనకారినిని అందుకుంటాడు. కొన్ని సందర్భాల్లో, ఒక సర్జన్ జనరల్ అనస్థీషియాను ఉపయోగించి మార్పిడిని  నిర్వహిస్తాడు.

ఇన్సులిన్ ఇంజక్షన్ల యొక్క వారి అవసరాన్ని ఆపడానికి లేదా తగ్గించటానికి తగినన్ని పని చేసే  ఐలెట్స్ ను పొందేందుకు రోగులకు తరచుగా రెండు లేదా అంతకంటే ఎక్కువ మార్పిడులు అవసరమవుతాయి .

ఇతర చికిత్సల ద్వారా నిర్వహించడం సాధ్యం కాని తీవ్రమైన మరియు దీర్ఘకాలిక, లేదా దీర్ఘకాలం కొనసాగే, పాంక్రియాటైటిస్ ఉన్నరోగులలో ప్యాంక్రియాటిక్ ఐలెట్స్ ఆటోట్రాన్స్ప్లాంటేషన్ మొత్తం ప్యాంక్రియాటెక్టమీ—శస్త్ర చికిత్స ద్వారా మొత్తం క్లోమాన్ని తొలగించడం—తరవాత నిర్వహించబడుతుంది. ఈ విధానం ప్రయోగాత్మకమైనదిగా పరిగణించబడదు. టైప్ 1 మధుమేహం కలిగిన రోగులు ప్యాంక్రియాటిక్ ఐలెట్స్ ఆటో-ట్రాన్స్ప్లాంటేషన్ ను అందుకోలేరు. ఈ ప్రక్రియ ఆసుపత్రిలో నిర్వహించబడుతుంది, మరియు రోగి సాధారణ అనస్థీషియా పొందుతాడు. సర్జన్ మొదట క్లోమమును తొలగిస్తాడు మరియు అప్పుడు క్లోమం నుండి ఐలెట్స్ తీసి మరియు శుద్ధి చేస్తాడు. గంటలలోనే ఐలెట్స్ రోగి యొక్క కాలేయంలోకి కాథెటర్ ద్వారా  ఇన్ఫ్యూజ్ చేయాడతాయి. శరీరానికి ఇన్సులిన్ ను తయారు చేయుటకు తగినన్ని ఆరోగ్యకరమైన ఐలెట్స్ ను ఇవ్వడమే లక్ష్యం.

ప్యాంక్రియాటిక్ ఐలెట్స్ మార్పిడి తర్వాత ఏమి జరుగుతుంది?

మార్పిడి తర్వాత వెంటనే ప్యాంక్రియాటిక్  ఐలెట్స్  ఇన్సులిన్ ను విడుదల చేయడం ప్రారంభిస్తాయి. అయితే, పూర్తి ఐలెట్ పనితీరు మరియు కొత్త ఐలెట్స్ నుండి కొత్త రక్తనాళాల పెరుగుదలకు సమయం పడుతుంది. మార్పిడి గ్రహీతలు సాధారణంగా ఐలెట్స్ పూర్తిగా పని చేసేంత వరకు ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకుంటారు. ఐలెట్స్ యొక్క విజయవంతమైన ఇంప్లాంటేషన్ ను  మరియు దీర్ఘ-కాల పనితీరును ప్రోత్సహించడానికి మార్పిడి ముందు మరియు తర్వాత వారు వివిధ మందులు కూడా వాడవచ్చు. అయితే, అయితే, మార్పిడి గ్రహీతల యొక్క సొంత ఐలెట్స్ ను మొదట నాశనం చేసిన స్వయం నిరోధక ప్రతిస్పందన మళ్లీ జరుగవచ్చు మరియు మార్పిడి చేయబడిన ఐలెట్స్ మీద దాడి చేయవచ్చు.  దాత ఐలెట్స్ ను ఇంఫ్యూజ్ చేయడం కోసం కాలేయం సాధారణ ప్రదేశం అయినప్పటికీ, కండర కణజాలం లేదా మరో అవయవం వంటి ప్రత్యామ్నాయ ప్రదేశాలను పరిశోధకులు పరిశోధిస్తున్నారు.

ప్యాంక్రియాటిక్ ఐలెట్ అల్లో ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క ప్రయోజనాలు మరియు ప్రమాదాలు ఏమిటి?

ప్యాంక్రియాటిక్ ఐలెట్ అల్లో-ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క ప్రయోజనాలలో మెరుగైన రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ, మధుమేహంను నియంత్రించడానికి ఇన్సులిన్ ఇంజక్షన్ల అవసరాన్ని తగ్గించడం లేదా తొలగించడం మరియు హైపోగ్లైసిమియాను నివారించడం ఉన్నాయి. ఐలెట్ మార్పిడికి ఒక ప్రత్యామ్నాయం మొత్తం అవయవ క్లోమం మార్పిడి, అది చాలా తరచుగా  మూత్రపిండ మార్పిడితో పాటు నిర్వహించబడుతుంది. మొత్తం అవయవ క్లోమం మార్పిడి యొక్క ప్రయోజనాలు ఏమిటంటే- ఇన్సులిన్ మీద తక్కువగా ఆధారపడడం మరియు అవయవ పనితీరు యొక్క సుదీర్ఘ వ్యవధి. ప్రధాన ప్రతికూలత ఏమిటంటే మొత్తం అవయవ మార్పిడి అనేది సమస్యల అధిక ప్రమాదం చివరకు మరణ ప్రమాదాన్ని కూడా  కలిగి ఉండే ఒక పెద్ద శస్త్ర చికిత్స.

ప్యాంక్రియాటిక్ ఐలెట్ అల్లో-ట్రాన్స్ప్లాంటేషన్ అనేది హైపోగ్లైసీమియా అవగాహనారాహిత్యాన్ని తొలగించడానికి కూడా సహాయపడవచ్చు. ఒక మార్పిడి తర్వాత పాక్షిక ఐలెట్ పనితీరు కూడా  హైపోగ్లేసిమియా అవగాహనారాహిత్యాన్ని తొలగించవచ్చు అని పరిశోధనలు చూపించాయి.

ఒక విజయవంతమైన అల్లో-ట్రాన్స్ప్లాంటేషన్ నుండి ఏర్పడే మెరుగైన రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ అనేది గుండె జబ్బు, కిడ్నీ వ్యాధి, మరియు నరం లేదా కన్ను దెబ్బతినడం వంటి మధుమేహ సమస్యలను కూడా నిదానించవచ్చు లేదా నిరోధించవచ్చు. ఈ అవకాశంను విశ్లేషించడానికి పరిశోధన కొనసాగుతూనే వుంటుంది.

ప్యాంక్రియాటిక్ ఐలెట్ అల్లో-ట్రాన్స్ప్లాంటేషన్, మార్పిడి పద్ధతికి సంబంధించిన ప్రమాదాలను కలిగి ఉంటుంది  —ముఖ్యంగా రక్తస్రావం మరియు రక్తం గడ్డకట్టడం. మార్పిడి చేయబడిన ఐలెట్స్ సరిగా పని చేయకపోవచ్చు లేక పూర్తిగా పనిచేయడం ఆపివేయవచ్చు. ఇతర ప్రమాదాలలో, రోగ నిరోధక వ్యవస్థ మార్పిడి చేయబడిన ఐలెట్స్ ను తిరస్కరించకుండా ఆపడానికి మార్పిడి గ్రహీతలు ఖచ్చితంగా తీసుకోవలసిన నిరోధకతను అణచివేసే మందుల (ఇమ్యునో సప్రెసివ్ మెడికేషన్స్) యొక్క దుష్ప్రభావాలు ఉంటాయి . ఒక రోగి మూత్రపిండ మార్పిడి పొందినప్పుడు మరియు ఇప్పటికే రోగ నిరోధకతను అణచివేసే మందులు తీసుకుంటూ వుంటే, అదనపు ప్రమాదాలలో ఐలెట్ ఇన్ఫ్యూజన్  మరియు అల్లో-ట్రాన్స్ప్లాంటేషన్ సమయంలో రోగ నిరోధకతను అణచివేసే మందుల యొక్క దుష్ప్రభావాలు మాత్రమే.  ఆటో- ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో రోగ నిరోధకతను అణచివేసే మందులు అవసరం లేదు ఎందుకంటే ఇన్ఫ్యూజ్ చేయబడిన కణాలు రోగి యొక్క సొంత శరీరం నుండే వస్తాయి కాబట్టి.

కొలాబరేటివ్ ఐలెట్ ట్రాన్స్ప్లాంట్ రిజిస్ట్రీ డేటా

2010 వార్షిక నివేదికలో, కొలాబిరేటివ్ ఐలెట్ ట్రాన్స్ప్లాంట్ రిజిస్ట్రీ 1999 మరియు 2009 మధ్య ప్యాంక్రియాటిక్ ఐలెట్ అల్లో-ట్రాన్స్ప్లాంట్ పొందిన 571 మంది రోగుల మీది డేటాను సమర్పించింది. అధిక భాగం పద్దతులు ప్యాంక్రియాటిక్ ఐలెట్ అల్లో-ట్రాన్స్ప్లాంట్లు మాత్రమే అయినప్పటికీ, 90 పద్దతులు మూత్రపిండ మార్పిడితో కలిపి చేయబడినవి. అధిక భాగం ఐలెట్ మార్పిడి రోగులు ఒకటి లేదా రెండు ఐలెట్స్ యొక్క ఇన్ఫ్యుజన్స్ ను పొందారు; దశాబ్దం చివరికి, ఒక ఇన్ఫ్యుజన్ కు పొందిన ఐలెట్ల సగటు సంఖ్య 463,000.

ఆ నివేదిక ప్రకారం, మార్పిడి తరువాత సంవత్సర కాలంలో, అవయవ మార్పిడి గ్రహీతలలో సుమారు 60 శాతం మంది ఇన్సులిన్ స్వతంత్రతను సాధించారు— కనీసం 14 రోజుల పాటు ఇంజక్షన్లను  నిలిపివేసే సామర్థ్యం అని నిర్వచించబడింది.

రెండవ సంవత్సరం చివరినాటికి, కనీసం 50 శాతం మంది గ్రహీతలు కనీసం 14 రోజుల పాటు ఇన్సులిన్ ను తీసుకోవడం ఆపగల్గినారు. అయితే, దీర్ఘ-కాల ఇన్సులిన్ స్వతంత్రతను నిర్వహించడం కష్టం, మరియు చివరికి చాలా మంది గ్రహీతలకు మళ్ళీ ఇన్సులిన్ ను తీసుకోవడం మొదలు పెట్టవలసిన అవసరం వుండింది.

ఆ నివేదిక గ్రహీతలకు కొరకు మెరుగైన ఫలితాలతో అనుసంధానం చేయబడిన కారకాలను గుర్తించింది, ఈ క్రింది వాటితో సహా

  • వయస్సు-35 సంవత్సరాలు లేదా అంత కంటే ఎక్కువ
  • తక్కువ ప్రీ-ట్రాన్స్ప్లాంట్ ట్రైగ్లిజరైడ్, లేక రక్తంలో కొవ్వు స్థాయిలు
  • తక్కువ ప్రీ-ట్రాన్స్ప్లాంట్ ఇన్సులిన్ వాడకం

పాక్షికంగా పనిచేసే మార్పిడి చేయబడిన ఐలెట్స్ కూడా రక్తంలో గ్లూకోజ్ నియంత్రణను మెరుగుపరచవచ్చు మరియు ఇన్సులిన్ స్వతంత్రత కోల్పోయిన తర్వాత అవసరమైన ఇన్సులిన్ మొత్తాన్ని తగ్గించవచ్చు అని ఆ నివేదిక గమనించింది.

ఇమ్యునోసప్రెసివ్ మందుల పాత్ర ఏమిటి

ఏ మార్పిడితోనైనా ఉండే ఒక సాధారణ సమస్య అయిన తిరస్కరణను నివారించడానికి ఇమ్యునో సప్రెసివ్ మందులు అవసరం.

శాస్త్రవేత్తలు ఇటీవల సంవత్సరాలలో ఐలెట్ మార్పిడిలో అనేక పురోభివృద్ధిలు సాధించారు. 2000 లో, ఎడ్మొన్టన్, కెనడా లోని అల్బెర్టా విశ్వవిద్యాలయం లోని ఐలెట్ మార్పిడి పరిశోధకులు వారి యొక్క పరిశోధనా ఫలితాలను న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ కు వెల్లడించారు. ఎడ్మొన్టన్ ప్రోటోకాల్ అని పిలువబడే వారి మార్పిడి ప్రోటోకాల్  అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్పిడి కేంద్రాల ద్వారా తగిన విధంగా సవరించబడుతుంది మరియు మెరుగుపరచడం కొనసాగుతుంది.

డాక్లిజుమాబ్, సిరోలిముస్, మరియు టాక్రోలిమస్ తో సహా యాంటీ-రిజెక్షన్ మందులు అని కూడా పిలువబడే, ఇమ్యునో సప్రెసివ్ మందుల యొక్క ఒక కొత్త కలయికను ఎడ్మొన్టన్ ప్రోటోకాల్ ప్రవేశపెట్టింది.  విజయవంతమైన మార్పిడులను ప్రోత్సహించే మెరుగైన మందుల నియమావళులతో సహా ఏడ్మొన్టన్ ప్రోటోకాల్ కు చేయబడే మార్పులను అభివృద్ధిపరచడం మరియు అధ్యయనం చేయడాన్ని పరిశోధకులు కొనసాగిస్తారు. మందుల నియమావళులు ఒక మార్పిడి కేంద్రం నుండి మరో దానికి మారుతాయి. ఐలెట్ మార్పిడిలో వాడబడే ఇతర ఇమ్యునో సప్రెసివ్ మందుల యొక్క ఉదాహరణల్లో యంటిథైమోసైట్ గ్లోబులిన్, అలెంటుజుమాబ్, బాసిలిజిమాబ్, బెలేటాసెప్ట్, ఎటనేర్సెప్ట్, ఎవరోలిమస్, మరియు మైకోఫినోలేట్ మోఫెటల్  అనేవి ఉన్నాయి. ఎక్స్నేటిడ్ మరియు సిటగ్లిప్తిన్ వంటి నాన్ ఇమ్యునో సప్రెసివ్ మందులను కూడా పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.

ఇమ్యునో సప్రెసివ్ మందులు గణనీయమైన దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి, మరియు వాటి దీర్ఘకాల ప్రభావాలు ఇప్పటికీ పూర్తిగా తెలియదు. తక్షణ దుష్ప్రభావాలలో నోటి పుళ్ళు మరియు అజీర్ణం మరియు అతిసారం వంటి జీర్ణశయ సమస్యలు ఉండవచ్చు. రోగులు ఈ క్రింది వాటిని కూడా కలిగి ఉండవచ్చు

  • పెరిగిన రక్తంలో కొలెస్ట్రాల్ లేదా రక్తంలో కొవ్వు స్థాయిలు
  • అధిక రక్త పోటు
  • రక్త హీనత, ఎర్ర రక్త కణాలు సాధారణం కంటే తక్కువ లేదా చిన్నగా ఉండే ఒక పరిస్థితి, ఇది శరీర కణాలు తగినంత ఆక్సిజన్ పొందకుండా నిరోధిస్తుంది
  • అలసట
  • తగ్గిన తెల్ల రక్త కణాల సంఖ్య
  • తగ్గిన మూత్రపిండాల పనితీరు
  • బాక్టీరియా మరియు వైరస్ ఇన్ఫెక్షన్లకు పెరిగిన గ్రహణశీలత (బారిన పడే అవకాశాలు)

ఇమ్యునో సప్రెసివ్ మందులు తీసుకోవడం అనేది కొన్ని కణితులు మరియు క్యాన్సర్లు అభివృద్ధి అయ్యే  ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

శాస్త్రవేత్తలు మార్పిడి చేయబడిన ఐలెట్స్ యొక్క రోగనిరోధక సహనశక్తిని సాధించే మార్గాలను  అన్వేషిస్తున్నారు, దీంట్లో రోగి యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ ఇకపై ఐ లెట్స్ ను అన్య పదార్థాలుగా గుర్తించదు. రోగనిరోధక సహనశక్తి  అనేది మార్పిడి చేయబడిన ఐలెట్స్ ను దీర్ఘ కాలం ఇమ్యునో సప్రెసివ్ మందులను వాడకుండా నిర్వహించడానికి రోగికి వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు, తిరస్కృతిని నిరోధించడానికి సహాయపడగల ఒక ప్రత్యేక పూతతో కప్పబడిన ఐలెట్స్ ను మార్పిడి  చేసే ఒక పధ్ధతి.

ప్యాంక్రియాటిక్ ఐలెట్ అల్లోట్రాన్స్ప్లాంటేషన్ కు అడ్డంకులు ఏమిటి?

ప్యాంక్రియాటిక్ ఐలెట్ అల్లో-ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క విస్తృత వాడకానికి దాతల నుండి ఐలెట్స్ కొరత అనేది గణనీయమైన అడ్డంకి. యునైటెడ్ స్టేట్స్లో ఆర్గాన్ ప్రొక్యూర్మెంట్ అండ్ ట్రాన్స్ ప్లాంటేష న్ నేట్వర్క్ ప్రకారం, 2011 లో 8,000 మంది మరణించిన అవయవ దాతలు అందుబాటులో ఉండినారు.

అయితే, 2011 లో కేవలం 1,562 క్లోమాలు దాతల నుంచి స్వాధీనం చేసుకోబడ్డాయి. ఇంకా, అవి ఎంపిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండవు మరియు ప్రాసెసింగ్ సమయంలో ఐలెట్స్ తరచూ దెబ్బతింటాయి లేదా నాశనం అవుతాయి కాబట్టి అనేక దానం చేయబడిన క్లోమాలు మార్పిడుల కొరకు ఐలెట్స్ ను తియ్యడానికి సరిపోవు. అందువలన ప్రతి సంవత్సరం కేవలం కొన్ని ఐలెట్  మార్పిడులు మాత్రమే చేయవచ్చు.

ఐలెట్స్ యొక్క ఈ కొరతను పరిష్కరించడానికి, డొనేట్ చేయబడిన ఒకే క్లోమము నుండి తీసుకున్న ఐలెట్స్ ను మార్పిడి చేయడం, ఒక జీవించివున్న దాత నుండి తీసుకున్న క్లోమము యొక్క ఒక భాగాన్ని మాత్రమే ఉపయోగించడం లేదా పందుల నుండి తీసుకున్న ఐలెట్స్ ను ఉపయోగించడం వంటి వివిధ విధానాలను పరిశోధకులు అనుసరిస్తున్నారు. తిరస్కరణను నిరోధించడానికి, ఒక ప్రత్యేక పూతతో ఐలెట్స్ ను కప్పడం ద్వారా లేదా మందులను ఉపయోగించడం ద్వారా, పరిశోధకులు పంది ఐలెట్స్ ను కోతులతో సహా ఇతర జంతువులలోకి మార్పిడి చేశారు.  మూల కణాలు వంటి ఇతర రకాల కణాల నుంచి ఐలెట్స్ ను సృష్టించడం అనేది వేరొక పధ్ధతి. అప్పుడు ఐ లెట్స్ ను ల్యాబ్లో పెంచడానికి కొత్త టెక్నాలజీలను అమలు చెయ్యవచ్చు.

ఆర్థిక అడ్డంకులు కూడా ఐలెట్ అల్లో-ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క విస్తృత వాడకాన్ని నిరోధిస్తాయి.  . ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నాలజీ  ప్రయోగాత్మకమైనదిగా కాకుండా చికిత్సా విధానంగా గుర్తించబడేంత విజయవంతమైనది అని పరిగణించబడే వరకు ఐలెట్ అల్లో-ట్రాన్స్ ప్లాంటేషన్ యొక్క ఖర్చులు పరిశోధనా నిధుల పరిధిలోకి రావాలి.

తినడం, డైట్, మరియు న్యూట్రిషన్

ఒక ప్యాంక్రియాటిక్ ఐలెట్ మార్పిడి చేయించుకున్న ఒక వ్యక్తి ఒక ఆరోగ్య సంరక్షణ ప్రదాత మరియు డైటీషియన్ తో కలిసి తయారు చేసిన ఒక ఆహార ప్రణాళికను అనుసరించాలి. మార్పిడి తర్వాత తీసుకోబడే ఇమ్యునో సప్రెసివ్ మందులు ఒక వ్యక్తి శరీరంలో బరువు పెరుగడం లాంటి మార్పులను కలిగించవచ్చు. మార్పిడి తర్వాత బరువు పెరుగుట, రక్త పోటు, రక్తంలో కొవ్వు, మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించుటకు ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యమైనది.

గుర్తుంచుకోవలసిన పాయింట్లు

  • లాంగర్హాన్స్ ఐలెట్స్ అని కూడా పిలువబడే ప్యాంక్రియాటిక్ ఐలెట్స్, క్లోమం (ప్యాంక్రియాస్) అంతటా చెల్లాచెదురుగా వుండే కణాల యొక్క చిన్న సమూహాలు. ప్యాంక్రియాటిక్ ఐలెట్స్ హార్మోన్ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే బీటా కణాలతో సహా అనేక రకాల కణాలను కలిగి ఉంటాయి. ఇన్సులిన్ శరీరం అంతటా వుండే కణాలు రక్త ప్రవాహం నుండి గ్లూకోజ్ ను గ్రహించి మరియు దానిని శక్తి కొరకు ఉపయోగించడంలో సహాయపడుతుంది.
  • ప్యాంక్రియాటిక్ ఐలెట్ అల్లో-ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మరణించిన అవయవ దాత యొక్క క్లోమం నుండి తీసుకోబడిన ఐలెట్స్ ను శుద్ధి చేసి, ప్రాసెస్ చేసి మరో వ్యక్తికి బదిలీ చేసే ఒక పద్దతి.
  • ప్యాంక్రియాటిక్ ఐలెట్ అల్లో-ట్రాన్స్ప్లాంటేషన్ అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడం కష్టమైన టైప్ 1 మధుమేహం కలిగిన కొందరు రోగులలో నిర్వహించబడుతుంది. మార్పిడి యొక్క లక్ష్యాలు ఏమిటంటే -రోజూ వారీ ఇన్సులిన్ ఇంజెక్షన్లతో లేదా లేకుండా సాధారణ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సాధించడానికి ఈ రోగులకు సహాయం చేయడం మరియు హైపోగ్లైసీమియా అవగాహనారాహిత్యాన్ని తగ్గించడం లేదా తొలగించడం.
  • ఇతర చికిత్సల ద్వారా నిర్వహించడం సాధ్యం కాని తీవ్రమైన మరియు దీర్ఘకాలిక, లేదా దీర్ఘకాలం కొనసాగే, పాంక్రియాటైటిస్ ఉన్నరోగులలో ప్యాంక్రియాటిక్ ఐలెట్స్ ఆటోట్రాన్స్ప్లాంటేషన్ మొత్తం ప్యాంక్రియాటెక్టమీ—శస్త్ర చికిత్స ద్వారా మొత్తం క్లోమాన్ని తొలగించడం—తరవాత నిర్వహించబడుతుంది. ఈ విధానం ప్రయోగాత్మకమైనదిగా పరిగణించబడదు. టైప్ 1 మధుమేహం కలిగిన రోగులు ప్యాంక్రియాటిక్ ఐలెట్స్ ఆటో-ట్రాన్స్ప్లాంటేషన్ ను అందుకోలేరు.
  • ప్యాంక్రియాటిక్ ఐలెట్ అల్లో-ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క విస్తృత వాడకానికి దాతల నుండి ఐలెట్స్ కొరత అనేది గణనీయమైన అడ్డంకి.
  • ఆర్థిక అడ్డంకులు కూడా ఐలెట్ అల్లో-ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క విస్తృత వాడకాన్ని నిరోధిస్తాయి. . ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నాలజీ  ప్రయోగాత్మకమైనదిగా కాకుండా చికిత్సా విధానంగా గుర్తించబడేంత విజయవంతమైనది అని పరిగణించబడే వరకు ఐలెట్ అల్లో-ట్రాన్స్ ప్లాంటేషన్ యొక్క ఖర్చులు పరిశోధనా నిధుల పరిధిలోకి రావాలి.

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు