ఇన్సులిన్ పంపిణీ చేయడానికి మరియు రక్తంలో చక్కర పర్యవేక్షించడానికి పద్ధతులు

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456


మీ
పరిస్థితిని అర్థం చేసుకోవడం

మధుమేహం అంటే ఏమిటి?

మధుమేహం అనేది మీ రక్తంలో చక్కెర (లేదా గ్లూకోజ్) స్థాయిని నిర్వహించడం మీ శరీరానికి ఇబ్బందిగా ఉండే ఒక పరిస్థితి.  ఇది మీ రక్తంలో చక్కెర చాలా అధికం కావడానికి కారణమవుతుంది.

మధుమేహంలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. మీరు ఏ రకాన్ని కలిగి వున్నారనేది మీకు అధిక రక్తంలో చక్కెర ఉండడానికి కారణమైన వాటి మీద ఆధార పడివుంటుంది.

  • టైప్ 1 మధుమేహం అంటే మీ శరీరం ఇన్సులిన్ (మీ శరీరం చక్కెరను ఉపయోగించుకొనుటకు అవసరమున్న ఒక రసాయనం)ను చాలా కొద్దిగా తయారు చేస్తుంది లేదా అస్సలు చేయదు అని అర్థం. డాక్టర్స్ దీనిని “ఇన్సులిన్ – ఆధారిత ” మధుమేహం అని కూడా పిలుస్తారు.
  • టైప్ 2 మధుమేహం అంటే మీ శరీరం తగినంత ఇన్సులిన్ ను చేయలేదు లేదా మీ శరీరంలోని కణాలు ఇన్సులిన్ ను బాగా ఉపయోగించుకోలేవు అని అర్థం. దీనిని డాక్టర్స్”ఇన్సులిన్-అనాధారిత” లేక “ఇన్సులిన్ -నిరోధక” మధుమేహం అని కూడా పిలుస్తారు. ఈ రకమైన మధుమేహం వున్న కొంతమంది ఆహారం, వ్యాయామం మరియు మందులతో తమ రక్తంలో చక్కెరను నియంత్రించుకోగలుగుతారు. ఇతరులకు ఇన్సులిన్ ను తీసుకోవాల్సిన అవసరం రావచ్చు.

మధుమేహం ఎంత సాధారణం?

ప్రస్తుతం, భారతదేశంలో (7 కోట్లు) ప్రతి 100 మందిలో 8 మందికి మధుమేహ వ్యాధి వుంది.  ఆ సంఖ్య 2050 నాటికి  ప్రతి 100 మందిలో దాదాపు 10 మందికి పెరుగుతుందని భావిస్తున్నారు.

మధుమేహ వున్న ప్రతి 100 మందిలో:

  • 5 నుంచి 10 మంది టైప్ 1 ను కలిగి వున్నారు.
  • 90 నుంచి 95 మంది టైపు 2 ను కలిగి వున్నారు.

నా రక్తంలో చక్కెరను నియంత్రించుకోవడం ఎందుకు ముఖ్యము?

మీరు మీ రక్తంలో చక్కెరను నియంత్రించడం ద్వారా మీ ఆరోగ్యం మీద మధుమేహం యొక్క ప్రభావాలను నిర్వహించగలరు.  మీ రక్తంలో చక్కెరను నియంత్రించడం అంటే మీ రక్తంలో చక్కెర చాలా అధిక స్థాయికి చేరకుండా చేయడం అని  అర్థం.

అధిక రక్తంలో చక్కెర ( హైపర్గ్లైసీమియా అని పిలువబడే ఒక పరిస్థితి) కారణంగా ఈ  తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి:

  • ధమనులు గట్టిపడడం
  • గుండె వ్యాధి
  • గుండె పోటు
  • మూత్ర పిండాల వ్యాధి
  • అంధత్వం
  • అంటువ్యాధులు పెరగడం
  • తక్కువ ప్రసరణ మరియు ఇన్ఫెక్షన్ల కారణంగా కాలి వేళ్ళు, పాదం, లేదా చేతి వేళ్లను కోల్పోవడం.

మీ అధిక రక్తంలో చక్కెరను తగ్గించుటకు చికిత్స సహాయపడగలదు. ఒక వేళ మీ రక్తంలో చక్కెర చాలా తక్కువకు చేరుకుంటే (“హైపోగ్లైసీమియా” అని పిలువబడే ఒక పరిస్థితి ), మీకు  తల తిరగటం, బలహీనం లేదా మసక బారడం (స్పృహ కోల్పోవడం) జరగవచ్చు. ఒకవేళ సరైన పద్ధతిలో చికిత్స చేయకపోతే, హైపోగ్లైసెమియా మరణానికి కూడా దారితీయవచ్చు. మీ రక్తంలో చక్కెర చాల తక్కువకు పడిపోకుండా పర్యవేక్షించడం ముఖ్యమైనది. మధుమేహం వున్న కొంతమందికి ఒక వేళ వారి రక్తంలో చక్కెర చాలా తక్కువకు పడిపోతే నారింజ రసం తాగుతారు లేదా కాండి తింటారు. హైపోగ్లైసెమియాను మీ డాక్టర్ తో చర్చించడం ముఖ్యమైనది.

మీరు మధుమేహం ఉన్నఒక మహిళ అయితే, గర్భవతి  అవడం అనేది మీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడాన్ని కష్టతరం చేయవచ్చు. గర్భధారణ సమయంలో మిమ్మల్ని  మరియు మీ బిడ్డను   ఆరోగ్యంగా ఉంచుటకు మీ రక్తంలో చక్కెరను నియంత్రించడం ముఖ్యం.

మీ ఎంపికలను అర్థం చేసుకోవడం.  

మీ రక్తంలో చక్కెరను పరీక్షించడం  

నా రక్తంలో చక్కెర ఎంత వుంది అని తెలుసుకోవడం ఎలా?

మీ రక్తంలో చక్కెర స్థాయిని చెప్పే రెండు రకాలు పరీక్షలు ఉన్నాయి:

  • A1C పరీక్ష
  • రక్తంలో చక్కెర పరీక్ష

గడచిన 3 నెలల్లో మీ రక్తంలో చక్కెర స్థాయి ఎంత ఎక్కువ అని తెలుసుకొనుటకు డాక్టర్లు A1C అని పిలువబడే ఒక ప్రత్యేక రక్త  పరీక్షను ఉపయోగిస్తారు. 7 లేక తక్కువ శాతం A1C స్థాయిని కలిగి వుండడం అంటే మీ రక్తంలో చక్కెర స్థాయి గడచిన 3 నెలల్లో బాగా నియంత్రించబడింది అని అర్థం.

రోజులో మీరు తీసుకునే ఇన్సులిన్ మొత్తాన్ని సర్దుబాటు చేయడంలో సహాయపడేందుకు-ఇన్సులిన్ తీసుకునేటప్పుడు, రక్తంలో చక్కెర పరీక్ష అని పిలువబడే ఒక ప్రత్యేకమైన పరీక్షను మీరు ఉపయోగించాల్సి వుంటుంది-ఎక్కువగా ఫింగర్ స్టిక్ తో చేయబడుతుంది.  ఈ పరీక్ష ఏదైనా ఒక సమయంలో మీ రక్తంలో చక్కెర పరిమాణాన్ని కొలుస్తుంది. ఈ కొలత మిల్లీగ్రాములు/డెసిలిటర్ (mg/dL) లలో ఇవ్వబడుతుంది. మధుమేహం లేని వ్యక్తులకు సాధారణ రక్తంలో చక్కెర స్థాయిలు ఇలా ఉన్నాయి:

  • భోజనానికి ముందు 70 మరియు 130 mg/dL మధ్యని
  • భోజనం తర్వాత 2 గంటలకు 180 mg/dL కంటే తక్కువ

మీ రక్తంలో చక్కెర స్థాయి లక్ష్యాన్ని ఏర్పాటు చేయడం గురించి మీ డాక్టర్ తో చర్చిండండి.

నేను ఎలా రక్తంలో చక్కెర పరీక్షతో నా రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేయవచ్చు?

మీ రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి:

  • స్వీయ -పరీక్ష
  • ఆటోమాటిక్ పర్యవేక్షణ

స్వీయపరీక్ష

మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిని పరీక్షించడానికి బ్లడ్ గ్లూకోజ్ మీటర్ను ఉపయోగించవచ్చు. మీ వేలు లేదా ముంజేయి నుండి ఒక చిన్న రక్తం చుక్కను ఒక పరీక్ష స్ట్రిప్ పై వుంచుతారు. మీటర్ స్ట్రిప్ ను చదువుతుంది, మరియు ఫలితం మీటర్ యొక్క తెరపై ఒక సంఖ్య వలె కనిపిస్తుంది. కొన్ని మీటర్లు అనేక నెలల వరకు ఫలితాలను నిల్వ చేస్తాయి. అనేక రకాల మరియు రీతుల బ్లడ్ గ్లూకోజ్ మీటర్లు  ఉన్నాయి.

 ఆటోమాటిక్ పర్యవేక్షణ

ఒక రియల్-టైం కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ స్వయంచాలకంగా పగలు మరియు రాత్రి మొత్తం చక్కెర స్థాయి మార్పులను ట్రాక్ చేస్తుంది. ఇది మీరు మీ బెల్ట్ మీద ధరించే ఒక చిన్న పరికరం. ఆ స్థలంలో ఒక చిన్న సూదిని వుంచి టేప్ తో మీ బొడ్డుకు అతికించబడే సెన్సార్లను ఆ పరికరం కలిగి ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రతి 1 నుంచి 5 నిముషాలంత తరచుగా మీ చక్కెర స్థాయిని తనిఖీ చేస్తుంది. మానిటర్ మీ రక్తంలో చక్కెర రీడింగులను ప్రదర్శిస్తుంది మరియు మీ డాక్టర్ కోసం వాటిని నిల్వ చేయగలదు. ఫలితాలు మీ ఇన్సులిన్ ను సరైన మొత్తం కు సర్దుబాటు చేయడానికి మీకు మరియు మీ డాక్టర్ కు సహాయపడగలవు.

ఆటోమేటిక్ మానిటర్లు మీది సెన్సార్లను తరచుగా మారుస్తుండాలి. చికాకు లేదా ఇంఫెక్షన్లను నివారించడానికి మీరు సెన్సార్లను మీ బొడ్డు చుట్టూ వివిధ స్థానాలకు మార్చడం అవసరం కావచ్చు.

రక్తంలో చక్కెరను నియంత్రించడం కష్టమైన వారికి మరియు వారి రక్తంలో చక్కెర ఎప్పుడు చాలా తక్కువకు చేరుతుందో తెలియని వారి కొరకు మాత్రమే డాక్టర్లు ఆటోమేటిక్ పర్యవేక్షణను సూచించవచ్చు.

స్వయంచాలక పర్యవేక్షణ స్వీయ-పరీక్ష అంత ఖచ్చితమైనది కాకపోవచ్చు. మీరు ఆటోమేటిక్ పర్యవేక్షణ ఉపయోగిస్తే, అయిప్పటికీ రీడింగులు నిర్దిష్టంగా ఉన్నట్లు నిర్థారించడానికి తరచూ మీరు స్వీయ-పరీక్ష చేసుకోవడం అవసరం. మీ రక్తంలో చక్కెర స్థాయిలు మారితే, అది మీ మానిటర్ మీద కనిపించడానికి 5 లేదా 10 నిమిషాలు పట్టవచ్చు. మీరు తీసుకునే ఇన్సులిన్ మొత్తాన్నిఇది ఎలా ప్రభావితం చేస్తుంది అనే దాని గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి.

ఆటోమేటిక్ పర్యవేక్షణ వర్సెస్ స్వీయ పరీక్ష గురించి పరిశోధన ఏమి చెప్తుంది?

  • ఆటోమేటిక్ పర్యవేక్షణను వుపయోగించే టైప్ 1 మధుమేహం వున్న పిల్లలు, యువత, మరియు పెద్దలు:
  • స్వీయ-పరీక్షను ఉపయోగించే వారికంటే తక్కువ హైపర్గ్లైసీమియా (అధిక రక్తంలో చక్కెర ) మరియు తక్కువ A1C స్థాయిలను కలిగి వుంటారు.
  • స్వీయ-పరీక్షను ఉపయోగించే వారి లాగానే దాదాపు అంతే సమయం వరకు హైపోగ్లైసెమియా (చాలా తక్కువగా వుండే రక్తంలో చక్కెర) కలిగి వుంటారు.
  • స్వీయ-పరీక్షను ఉపయోగించే వారి లాగానే దాదాపు ఒకే రకమైన జీవిత నాణ్యతను కలిగి ఉండవచ్చు, కానీ ఇది ఖచ్చితమని తెలుసుకోవడానికి తగినంత పరిశోధన జరగలేదు.
  • టైప్ 2 మధుమేహం ఉన్నవారి కొరకు లేదా గర్భిణీ అయ్యేముందు టైప్ 1 మధుమేహం ఉండిన గర్భిణీ స్త్రీల కొరకు స్వీయ పరీక్షతో ఆటోమేటిక్ పర్యవేక్షణను సరిపోల్చడానికి తగినంత పరిశోధన జరగలేదు.

ఇన్సులిన్ ను తీసుకోవడం

నా అంతట నేనే ఇన్సులిన్ తీసుకోగలిగిన మార్గాలు ఏమిటి?

ఇన్సులిన్ తీసుకోటానికి రెండు మార్గాలు ఉన్నాయి:

  • షాట్స్
  • ఇన్సులిన్ పంపులు

షాట్స్

రెండు మార్గాల్లో ఒక దానిలో మీకు మీరే ఇన్సులిన్ షాట్లు ఇచ్చుకోగలరు:

  • మీరు ఒక సిరంజిని ఉపయోగించి మీరు దానిలో ఎంత ఇన్సులిన్ ను ఎక్కించాలో కొలువవచ్చు.
  • మీరు ఇన్సులిన్ ముందుగా నింపిన ప్రత్యేక పెన్నులను ఉపయోగించవచ్చు. మీకు అవసరమైనంత ఇన్సులిన్ ను ఈ పెన్నులు “క్లిక్” చేయనిస్తాయి.

మీకు చికాకు లేదా కమలడంను నివారించేందుకు మీ శరీరం మీద సూది అతికించే స్థలంను మార్చవచ్చు.

ఇన్సులిన్ పంపులు

ఇన్సులిన్ పంపు అనేది ఒక సూదితో కలుపబడిన ఒక ట్యూబ్ తో గల మీ బొడ్డు మీద చర్మం కిందకు కుచ్చబడే ఒక చిన్న పరికరం. టేప్ సూదిని స్థలంలో నిలుపుతుంది. మీకు చికాకు మరియు ఇంఫెక్షన్లను నివారించడానికి సూదిని మీ బొడ్డు మీద వివిధ ప్రదేశాలకు కదిలించాల్సిన అవసరం కావచ్చు. పంప్ మీకు ఇవ్వాల్సిన ఇన్సులిన్ మొత్తాన్ని మీరు సెట్ చేయండి. అప్పుడు, పరికరం మీకు పగలు లేదా రాత్రి అంతా ఇన్సులిన్ ఇస్తుంది. భోజనం లేదా ఇతర సమయాల్లో మీకు అదనపు ఇన్సులిన్ ను ఇవ్వడానికి  కూడా మీరు పంపును ఉపయోగించవచ్చు.

రెండు రకాల ఇన్సులిన్ పంపులు ఉన్నాయి:

  • బ్లడ్ గ్లూకోజ్ మీటరు నుంచి కొలతల ఆధారంగా మీరు ఏర్పాటు చేసే పంపులు.
  • ఆటోమేటిక్ నిరంతర మానిటర్ రీడింగులను అందుకునే పంపులు. వీటిని”సెన్సార్- ఆగుమెంటెడ్ పంపులు” అని కూడా పిలుస్తారు. మానిటర్ పంపునకు రీడింగులను పంపుతుంది, అప్పుడు మీకు కావలసిన ఇన్సులిన్ ను పంపిణీ చేయడానికి పంపును ఏర్పాటు చేయుటకు రీడింగ్ లను ఉపయోగించండి.

మీకు మీరు షాట్లు ఇవ్వడం వర్సెస్ ఇన్సులిన్ పంప్ ను ఉపయోగించడం గురించి పరిశోధన ఏమి చెప్పుతుంది?

  • ఇన్సులిన్ పంపులు ఉపయోగించే టైప్ 1 మధుమేహం కలిగిన పిల్లలు లేక టీన్స్:
  • దాదాపు తమకు తాము షాట్లు ఇచ్చుకునేవారి అంతగా తమ A1C స్థాయిలను తగ్గిచ్చుకుంటారు.
  • దాదాపు తమకు తాము షాట్లు ఇచ్చుకునేవారి అంతగా బరువు పెరగడానికి అవకాశం ఉండవచ్చు, వారి లాగానే దాదాపు ఒకే రకమైన జీవిత నాణ్యతను కలిగి ఉండవచ్చు మరియు హైపోగ్లైసెమియా (చాలా తక్కువగా వుండే రక్తంలో చక్కెర)ను కలిగి ఉండవచ్చు,కానీ ఇది ఖచ్చితమని తెలుసుకోవడానికి తగినంత పరిశోధన జరగలేదు.
  • ఇన్సులిన్ పంపులు ఉపయోగించే టైప్ 1 మధుమేహం కలిగిన పెద్దలు:
  • తమకు తాము షాట్లు ఇచ్చుకునేవారి కంటే తక్కువ A1C స్థాయిలను కలిగి వుంటారు.
  • దాదాపు తమకు తాము షాట్లు ఇచ్చుకునేవారి అంతగా బరువు పెరగడానికి అవకాశం ఉండవచ్చు, వారి లాగానే దాదాపు ఒకే రకమైన జీవిత నాణ్యతను కలిగి ఉండవచ్చు మరియు హైపోగ్లైసెమియాను కలిగి ఉండవచ్చు,కానీ ఇది ఖచ్చితమని తెలుసుకోవడానికి తగినంత పరిశోధన జరగలేదు.
  • ఇన్సులిన్ పంపులు ఉపయోగించే టైప్ 2 మధుమేహం కలిగిన పెద్దలు:
  • దాదాపు తమకు తాము షాట్లు ఇచ్చుకునేవారి అంతగా తమ A1C స్థాయిలను తగ్గిచ్చుకుంటారు.
  • దాదాపు తమకు తాము షాట్లు ఇచ్చుకునేవారి అంతగా బరువు పెరగడానికి అవకాశం ఉండవచ్చు మరియు హైపోగ్లైసెమియా (చాలా తక్కువగా వుండే రక్తంలో చక్కెర)ను కలిగి ఉండవచ్చు,కానీ ఇది ఖచ్చితమని తెలుసుకోవడానికి తగినంత పరిశోధన జరగలేదు.
  • గర్భిణీ అయ్యేముందు టైప్ 1 మధుమేహం ఉండిన గర్భిణీ స్త్రీలు కొరకు ఇన్సులిన్ పంపులు మరియు షాట్లు సుమారు ఒకే అంత పని చేసినట్లు కనిపించింది.

సెన్సార్-ఆగుమెంటెడ్ పంపులు రక్త చక్కెరను నియంత్రించడంలో ఎంత బాగా సహాయం చేస్తాయి అనే దాని గురించి పరిశోధన ఏమి చెప్పుతుంది?

  • టైప్ 1 మధుమేహం కలిగిన పిల్లలు మరియు పెద్దలు:
  • స్వీయ-పరీక్షను ఉపయోగించే వారికంటే తక్కువ హైపర్గ్లైసీమియా (అధిక రక్తంలో చక్కెర ) మరియు తక్కువ A1C స్థాయిలను కలిగి వుంటారు.
  • స్వీయ-పరీక్షను ఉపయోగించే వారి లాగానే దాదాపు అంతే సమయం వరకు హైపోగ్లైసెమియా (చాలా తక్కువగా వుండే రక్తంలో చక్కెర) కలిగి వుంటారు.
  • స్వీయ-పరీక్షను ఉపయోగించే వారి అంతగా బరువు పెరగడానికి అవకాశం ఉండవచ్చు, కానీ ఇది ఖచ్చితమని తెలుసుకోవడానికి తగినంత పరిశోధన జరగలేదు.

ఒక నిర్ణయం చేయడం

నేను దేని గురించి ఆలోచించాలి?

మీ రక్తంలో చక్కెరను కొలుచుకోవడానికి లేదా మీకు మీరే ఇన్సులిన్ ఇచ్చుకోవడానికి ఉత్తమ మార్గాన్ని  నిర్ణయించేటప్పుడు పరిగణించాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి.

ఈ క్రింది వాటి గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి:

  • ప్రతి ఎంపిక మీరు కలిగి ఉన్న మధుమేహ రకం కోసం ఎంత బాగా పనిచేస్తోంది.
  • మీరు గత సంవత్సరం కాలంగా మీ రక్తంలో చక్కెరను ఎంత బాగా నియంత్రణ చేయగలిగారు.
  • పరికరాలను ఎలా ఆపరేట్ చేయాలి.
  • రక్తంలో చక్కెరను కొలవడంలో లేదా మీకు మీరే ఇన్సులిన్ ఇవ్వడంలో మీ ప్రాధాన్యతలు.
  • మీ జీవనశైలికి మరియు రోజువారీ కార్యకలాపాలకి ఏ ఎంపిక ఉత్తమంగా సరిపోతుంది.
  • ఒక ఆటోమేటిక్ పర్యవేక్షణ పరికరాన్ని ధరించడం, మీకు మీరే షాట్లు ఇవ్వడం, లేదా ఒక ఇన్సులిన్ పంప్ ను ధరించడంలో మీరు ఎంత సౌకర్యవంతంగా వుంటారు.
  • మీ భీమా పథకం పరికరం యొక్క ఖర్చును కవర్ చేస్తుందా.

పరికరాల ధర ఎంత?

మీకు ఈ పరికరాల ధర మీ భీమా పధకం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఆ పరికరాల యొక్క  మార్చవలసిన అవసరం వున్న ఏవైనా విడి భాగాలను (సెన్సార్ లాంటివి), ఆ పరికరాల కొరకు మీకు అవసరమైన ఏవైనా సప్లైలను (టెస్టింగ్ స్ట్రిప్ ల లాంటివి), మరియు మీకు అవసరమైన ఇన్సులిన్ మొత్తమును కొనవలసిన అవసరం కూడా వుంటుంది.

మానిటర్లు

  • స్వీయ-పరీక్ష అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్న ఎంపిక.
  • మానిటర్లు చాలా ఎక్కువ ఖర్చువి. వాటికి 1 లక్ష వరకు ఖర్చు కావచ్చు.*

ఇన్సులిన్ సరఫరా

  • సిరంజిలు కనీస ఖర్చుతో కూడుకున్న ఎంపిక. ప్యాకేజీలో ఎన్నివస్తాయనే దాని మీద ధర ఆధారపడి ఉంటుంది.
  • పెన్నులు సిరంజీల కంటే ఎక్కువ ధర కలిగి వుంటాయి.
  • పంపులు అత్యంత ఖర్చుతో కూడుకున్న ఎంపిక. వాటికి రూ. 3 లక్షల వరకు ఖర్చు కావచ్చు.*

 

మీ డాక్టర్ ని అడగండి

  • మీరు నా రక్తంలో చక్కెర స్థాయి బాగా నియంత్రించబడింది అనుకుంటున్నారా?
  • నా మధుమేహంను మెరుగ్గా నిర్వహించడానికి నేను మార్చుకోవలసింది ఏదైనా ఉందా?
  • నిరంతర మానిటర్ లేదా ఇన్సులిన్ పంపు నా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో నాకు సహాయం చేస్తుందా?
  • నా రక్తంలో చక్కెరను ఒక ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచుకోవడానికి నేను ఇంకా ఏమి చేయాలి?

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు