టైప్ 2 మధుమేహం మరియు ఫాస్ట్ ఫుడ్

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456

ఎవరికైనా టైప్ 2 మధుమేహం అభివృద్ధి కాగలిగినప్పటికీ,  తరచుగా  ఈ రకం మధుమేహం అధిక బరువు ఉండడం మరియు శారీరకంగా చురుకుగా ఉండకపోవడం వంటి పేలవమైన జీవనశైలి ఎంపికల వలన  కలుగుతుంది.  ప్రత్యేకమైన ఫాస్ట్- ఫుడ్ ఎంపికలను తప్పించడం అనేది మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణ చేయుటలో ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది, టైప్ 2 మధుమేహాన్ని నిర్వహించేటప్పుడు తప్పనిసరైనది — మరియు అది మీరు ప్రతీ రో జూ తీసుకోవలసిన మందుల మొత్తాన్ని కూడా తగ్గిస్తుంది.

అయితే మీరు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ల మీద ఆధారపడవలసిన అవసరం ఉండడానికి  అనేక కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు, మీరు బాగా  పొద్దు పోయేంతవరకు పని చేయవచ్చు లేక సమయం సరిపోకపోవచ్చు, మరియు ఫాస్ట్ ఫుడ్ అనేది మీకు అందుబాటులో వుండే అత్యంత అనుకూలమైన లేదా ఏకైక ఎంపిక కూడా కావచ్చు. ఈ క్విక్ -బైట్ చైన్స్ ప్రతీ చోటా కనపడుతాయి అనేదాన్ని అందరూ  అంగికరించాల్సిందే.

ఈ విషయం అంత చెడ్డదేమీ కాదు.  మీరు ఒక ఫాస్ట్ ఫుడ్ జాయింట్ ను సందర్శిస్తే, మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టకుండా మీకు అవసరమైన పోషకాలను పొందే విధంగా ఏమి ఆర్డర్ చేయాలి అని తెలుసుకోవడం అనేది కీలకం .

టైప్ 2 మధుమేహం:  మెరుగైన ఫాస్ట్ ఫుడ్ ఎంపికలు

మీకు టైప్ 2 మధుమేహం నిర్ధారణ చేసిన తర్వాత మీరు అన్ని ఫాస్ట్ ఫుడ్ ను వదిలి వేయవలసివస్తే, మీరు ఆశ్చర్యపడవచ్చు. మధుమేహం వున్న వ్యక్తుల యొక్క  ప్రాధాన్యత-ఆహారాల జాబితాలో ఫాస్ట్ ఫుడ్ ఉండే అవకాశం లేదు  అని ఇంగితజ్ఞానం (కామన్ సెన్స్) చెబుతుంది.

ఒక సాధారణ ఫాస్ట్ ఫుడ్ అల్పాహారం మిమ్మల్ని కొవ్వు, కొలెస్ట్రాల్, మరియు కార్బోహైడ్రేట్ల యొక్క మీ రోజువారీ పరిమితి లేదా ఎక్కువ వద్ద  ఉంచవచ్చు.  అయితే, మీకు అవసరమైన న్యూట్రిషన్ ను పొందడానికి మరియు ఫాస్ట్ ఫుడ్ లోని సౌలభ్యం యొక్క ప్రయోజనాన్ని అందుకోవడానికి మీరు చేయగల మెరుగైన ఎంపికలు ఉన్నాయి.

స్టార్టర్స్ కోసం, ఫాస్ట్ ఫుడ్ అంటే క్రొవ్వు గల వాటిని తినడం అని అర్థం కాదు. ముందుగా ప్లాన్ చేయడం కీలకమైనది. అనేక ఫాస్ట్-ఫుడ్ చైన్లు ఇప్పుడు ఆరోగ్యకరమైన ఎంపికలను అందిస్తున్నాయి; ఇవి మీరు వెళ్లాలనుకునే రెస్టారెంట్లు.

వీలైతే, సమయానికి ముందుగా మెనును చూడండి. ఈ విధంగా, ఒక ఆరోగ్యకరమైన ఎంపిక చేయడానికి మీకు ఎక్కువ సమయం ఉంటుంది. కొన్ని చైన్ రెస్టారెంట్లు ఇంటర్నెట్ లో వారి ఆహార పదార్థాల పోషక విలువల సమాచారం (న్యూట్రిషినల్ ఇన్ఫర్మేషన్) ఇస్తాయి.  మీరు ఏదైనా సెర్చ్ ఇంజన్ లో చైన్ పేరు మరియు “న్యూట్రిషన్” పదంను టైప్ చేయడం ద్వారా వాటిని కనుగొనవచ్చును. ఉదాహరణకు, పిజ్జా హట్, ఒక ప్రత్యేక రకం పిజ్జా యొక్క ఒక సెర్వింగ్ కు సమానమైనవి మీకు ఇస్తూ, తమ ఆహార పదార్థాల కోసం ప్రత్యమ్నాయాల జాబితా కూడా ఇస్తుంది.

ఉత్తమ ఫాస్ట్ ఫుడ్ కుజీన్ ను నిర్ణయించుకునేటప్పుడు, మనస్సులో ఈ ఆలోచనలు ఉంచుకోండి:

  • నిజానికి టైప్ 2 మధుమేహం వున్న వ్యక్తులకు పిజ్జా ఒక మంచి ఎంపిక కావచ్చు; థిన్-క్రస్ట్ రకం ఆర్డర్ చేయాలని మరియు దానిని కొవ్వు అధికంగా వుండే మాంసాలు మరియు అదనపు ఛీజ్ తో కాకుండా కూరగాయలతో టాప్ చేయాలని మాత్రం నిర్థారించుకోండి.
  • టాకోస్, బర్రిటోస్, మరియు వ్రాప్స్ రుచికరమైనవి కావచ్చు మరియు మీ ఆహారంలో అనుమతించబడవచ్చు; సాధ్యమైనప్పుడు, హోల్-వీట్ టోర్టిల్లాలు కోసం అడగండి మరియు ఏవైనా వేయించిన పదార్థాలను వదిలిపెట్టండి.
  • సలాడ్ బార్లను అందించే ఫాస్ట్ ఫుడ్ ప్రదేశాలకై చూడండి. మీరు ఉపయోగించే సలాడ్ డ్రెస్సింగ్ మొత్తంను పరిమితం చేసినంత వరకు మరియు చీజ్ వంటి అధిక కొవ్వు సలాడ్ పదార్థాల మీద ఆధారపడనంత వరకు అవి మీకు మంచివి కావచ్చు.
  • వివిధ ప్రత్యేక ఆరోగ్యకరమైన ఆహార మెను అంశాలపై ఒక కన్ను వేసి వుంచండి. కొన్ని రెస్టారెంట్లు కొలెస్ట్రాల్, కొవ్వు, మరియు సోడియం తక్కువగా, మరియు అధిక ఫైబర్ ఆహారాలను అందిస్తున్నాయి. చాలా రెస్టారెంట్లు క్యాలరీలు తగ్గించబడిన సలాడ్ డ్రెస్సింగ్, తక్కువ కొవ్వు లేదా కొవ్వు రహిత పాలు, మరియు ఉప్పు ప్రత్యామ్నాయాలను అందిస్తునాయి.

టైప్ 2 మధుమేహం: ఫాస్ట్ఫుడ్ ఉచ్చులతో జాగ్రత్త

ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు మరింత వేగంగా ఎక్కువ మంది వినియోగదారులను రప్పించుకోవడం ద్వారా, ఆర్డర్ తొందరగా నిర్ణయించుకోవడానికి మిమ్మల్ని ఒత్తిడి చేయడం ద్వారా సంపాదిస్తాయి — మరియు మీకు తొందర అనిపించినప్పుడు, మీరు తప్పు ఎంపికలు చేయవచ్చు.

తెలివైన నియమాలు చేయండి మరియు వాటికి అంటిపెట్టుకుని వుండండి, జంబో లేదా సూపర్ పరిమాణాలను ఎప్పుడూ ఆర్డర్ చేయకపోవడం వంటివి. మీరు ఆర్డర్ చేసిన ఏదైనా ఆహారం యొక్క మొత్తం భాగాన్ని, ముఖ్యంగా ఒక చైన్ యొక్క “రెగ్యులర్” భాగాలు మీకు కావలసిన దానికంటే పెద్దగా వుంటే, మీరు తినవలసిన అవసరం లేదు అని గుర్తుంచుకోండి. భాగ పరిమాణాలను తగ్గించడం అనేది  మీరు తీసుకునే కెలోరీలలో ఒక పెద్ద తగ్గింపు కలిగించవచ్చు.

ఆర్డర్ చేసేటప్పుడు ఈ అదనపు చిట్కాలు ప్రయత్నించండి:

  • సింగిల్ బర్గర్స్ ఆర్డర్ చేయండి, డబుల్ లేదా ట్రిపుల్ పాటీస్ వద్దు, మరియు బీఫ్ బర్గర్స్ బదులుగా చికెన్, టర్కీ, లేదా వెజ్జీ బర్గర్స్ ఎంచుకోండి.
  • వేయించిన మాంసాలు మరియు వేయించిన చేపను కూడా మానుకోండి; బదులుగా గ్రిల్ల్ద్ లేదా బాయిల్డ్ శాండ్విచ్లు మరియు ప్లాటర్స్ ను ఎంచుకోండి.
  • అధిక కొవ్వు సాస్లు, డ్రెస్సింగ్లు, మరియు మయోన్నైస్ కు దూరంగా ఉంటూ మీ టాపింగ్స్ ను ఒక టమోటా ముక్క మరియు లెట్యూస్ వంటి కూరగాయలు లేదా సల్సా కు పరిమితం చేయండి.
  • క్రోస్సంట్స్ మరియు క్రోస్సంట్స్ బేస్డ్ శ్యాండ్ విచ్, పెద్ద మఫ్ఫిన్స్, మరియు ఐస్ క్రీం మరియు ఇతర డెసర్ట్స్, ముఖ్యంగా పైస్ వంటి కొన్ని రెస్టారెంట్ పదార్థాలను వదిలివేయాలి.

సమాచారం (మరియు నిగ్రహ శక్తి యొక్క ఒక అతి పెద్ద సెర్వింగ్ ) తో సంపన్నులై, మీరు మంచి ఎంపికలు చేయగలరు మరియు మీ ఆరోగ్యంపై అది ప్రభావం చూపకుండా ఫాస్ట్ ఫుడ్ యొక్క సౌలభ్యం యొక్క ప్రయోజనాన్ని పొందగలరు.

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు