గ్యాస్ గురించి నేను ఏం తెలుసుకోవాలి

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456


గ్యాస్
అంటే ఏమిటి?

గ్యాస్ అంటే జీర్ణ వాహికలో వుండే గాలి. ప్రజలు నోటి ద్వారా త్రేన్పినప్పుడు లేదా పాయువు (మలద్వారం) – మలం శరీరాన్ని వదిలి పెట్టే జీర్ణ వ్యవస్థ చివరలో వుండే ద్వారం- ద్వారా గ్యాస్ ను వదిలినప్పుడు గ్యాస్ శరీరాన్ని వదిలి పెడుతుంది.

అందరికి గ్యాస్ వుంటుంది. త్రేన్పులు మరియు గ్యాస్ వదలడం సాదారణం. చాలా మంది వారు చాలా తరచుగా త్రేన్పుతారు లేక గ్యాస్ ను వదులుతారు అని మరియు వారు చాలా ఎక్కువ గ్యాస్ కలిగివున్నారు అని నమ్ముతారు. ఎక్కువ గ్యాస్ కలిగివుండడం చాలా అరుదు.

గ్యాస్ కు కారణాలు ఏమి?

జీర్ణ వాహికలో వుండే గ్యాస్ సాధారణంగా గాలిని మింగడం వలన మరియు పెద్ద ప్రేగులో కొన్ని ఆహారాల విచ్ఛిన్నం వలన ఏర్పడుతుంది.

సాధారణంగా మీరు తినేటప్పుడు మరియు త్రాగేటప్పుడు ఒక చిన్న మొత్తంలో గాలిని మ్రింగుతారు. మీరు మరింత గాలిని ఎప్పుడు మ్రింగుతారు అంటే

  • చాలా వేగంగా తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు
  • పొగ త్రాగేటప్పుడు
  • చూయింగ్ గమ్ నమిలేటప్పుడు
  • హార్డ్ క్యాండీ చీకేటప్పుడు
  • కార్బోనేటేడ్ లేదా “నురుగ” పానీయాలు త్రాగేటప్పుడు
  • కట్టుడు పళ్ళను వదులుగా పెట్టుకున్నప్పుడు

మీరు మింగిన గాలి లో కొంత భాగం మీరు త్రేన్చినప్పుడు నోటి ద్వారా కడుపులోనుంచి బయటికి వస్తుంది. మింగబడిన కొంత గాలి చిన్న ప్రేగులో గ్రహించబడుతుంది. కొంత గాలి చిన్న ప్రేగు నుండి పెద్ద ప్రేగులోకి పోతుంది మరియు మలద్వారం ద్వారా బయటికి పోతుంది.

ఉదరం మరియు చిన్నప్రేగు మీరు తిన్న ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేయవు. జీర్ణంకాని కార్బోహైడ్రేట్స్ – చక్కెరలు, పిండి  పదార్థాలు, మరియు అనేక ఆహారా పదార్థాలలో కనిపించే పీచు – పెద్ద ప్రేగుకు బయటికి పోతుంది. పెద్ద ప్రేగులోని బాక్టీరియా జీర్ణంకాని కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేస్తుంది మరియు గ్యాస్ ను విడుదల చేస్తుంది. ఈ గ్యాస్ మలద్వారం ద్వారా బయటికి పోతుంది.

సాధారణంగా, కొంత బాక్టీరియా చిన్న ప్రేగులో నివసిస్తుంది. చిన్న ప్రేగు బాక్టీరియా ఎక్కువ పెరగడం (SIBO) అనేది బాక్టీరియా సంఖ్యలో ఒక పెరుగుదల లేక చిన్న ప్రేగులోని బాక్టీరియా రకములో ఒక మార్పు. ఈ బాక్టీరియా ఎక్కువ గ్యాస్ ను ఉత్పత్తి చేయగలదు మరియు డయేరియా లేక బరువు తగ్గుటకు కూడా కారణం కావచ్చు. సాధారణంగా SIBO జీర్ణ వ్యవస్థను నష్టపరిచే లేక అది పని చేసే విధానాన్ని ప్రభావితం చేసే క్రోన్ ‘స్ వ్యాధి లేదా మధుమేహం వంటి వ్యాధులు లేదా రుగ్మతలతో సంబంధం కలిగి వుంటుంది.

ఆహారాలు గ్యాస్ కు కారణం అవుతాయి?

కార్బోహైడ్రేట్లను కలిగిన చాలా ఆహారాలకి గ్యాస్ కి కారణం కావచ్చు. ఒక వ్యక్తికి గ్యాస్ కలిగించే ఆహారాలు మరొకరికి గ్యాస్ కలిగించకపోవచ్చు. కార్బోహైడ్రేట్లను కలిగిన మరియు గ్యాస్ కు కారణమవగల కొన్ని ఆహారాలు

  • బీన్స్
  • బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్, ఉల్లిపాయలు, పుట్టగొడుగులు, ఆర్టిచోకెస్, మరియు తోటకూర వంటి కూరగాయలు.
  • పియర్స్, ఆపిల్, మరియు పీచెస్ వంటి పండ్లు.
  • సంపూర్ణ గోధుమ మరియు ఊక వంటి తృణధాన్యాలు.
  • సోడాలు; పండ్ల రసాలు, ముఖ్యంగా ఆపిల్ రసం మరియు పియర్ రసం; మరియు మొక్కజొన్న నుండి తయారు చేయబడిన తీపి అయిన అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ను కలిగివుండే ఇతర పానీయాలు.
  • పాలు మరియు జున్ను, ఐస్ క్రీమ్, మరియు పెరుగు వంటి పాల పదార్థాలు.
  • ప్యాకేజీ చేయబడిన ఆహారములు- బ్రెడ్, తృణధాన్యం, మరియు సలాడ్ డ్రెస్సింగ్ వంటివి – తక్కువ మొత్తంలో లాక్టోస్ కలిగినవి, పాలు, మరియు పాలతో తయారైన ఆహారములలో దొరికే చక్కెర.
  • సార్బిటాల్, మానిటాల్, మరియు జిలిటల్ వంటి షుగర్ ఆల్కహాల్ కలిగిన చక్కెర లేని క్యాండీలు మరియు గమ్స్.

గ్యాస్ యొక్క లక్షణాలు ఏమిటి?

గ్యాస్ యొక్క అత్యంత సాధారణ లక్షణాలు:

త్రేన్పడం: అప్పుడప్పుడు, ముఖ్యంగా భోజనం సమయంలో మరియు తర్వాత, త్రేన్పడం అనేది సాధారణం. మీరు చాలా తరచుగా త్రేన్పుతూ వుంటే, మీరు చాలా గాలిని మింగవచ్చు. జీర్ణ సమస్యలతో బాధపడే కొంతమంది కావాలని గాలిని మింగి త్రేన్పుతారు ఎందుకంటే త్రేన్పడం వల్ల అది వారికి బాగా అనిపించడానికి సహాయపడుతుందని వారు  నమ్ముతారు.

గ్యాస్ ను వదలడం: రోజుకు 13 నుంచి 21 సార్లు గ్యాస్ ను వదలడం సాధారణం.  మీరు దాని కంటే ఎక్కువ తరచుగా గ్యాస్ ను వదులుతున్నట్లు అనుకొంటే, కొన్ని రకాల కార్బో హైడ్రేడ్స్ జీర్ణం చేయడంలో మీకు సమస్య ఉండవచ్చు.

 ఉబ్బరం. ఉబ్బరం అనేది ఛాతీ మరియు తుంటి మధ్య ప్రాంతమైన ఉదర భాగంలో  బరువుగా అనిపించే మరియు వాపు ఉన్నట్లు అనిపించే ఒక భావన. ఇరిటబుల్ బోవేల్ సిండ్రోమ్ (IBS) వంటి రుగ్మతలు ప్రేగుల గుండా గ్యాస్ ఎలా కదులుతుంది అనే దానిని ప్రభావితం చేయగలవు.

కడుపు నొప్పి లేదా అసౌకర్యం. గ్యాస్ ప్రేగుల గుండా సాధారణంగా  పోనప్పుడు ప్రజలకు కడుపు నొప్పి లేదా అసౌకర్యంగా అనిపిస్తుంది. IBS తో బాధపడే ప్రజలు ప్రేగులలోని గ్యాస్ కుమరింత ఎక్కువగా ప్రతిస్పందించవచ్చు.

గ్యాస్ కు కారణం ఎలా కనుగొనబడుతుంది?

మీరు ఏమి తిన్నారు మరియు ఎంత తరచుగా  త్రేన్పుతున్నారు, గ్యాస్ ను వదులుతున్నారు, లేక మీరు ఇతర లక్షణాలు కలిగి ఉంటారు అనే వాటి గురించిన ఒక డైరీని నిర్వహించడం ద్వారా మీరు గ్యాస్ కు కారణాన్ని కనుగొనడానికి ప్రయత్నించవచ్చు. ఆ డైరీ మీకు గ్యాస్ ను కలిగించే ఆహారాలను గుర్తించడానికి సహాయపడవచ్చు.

మీ డాక్టర్ తో మాట్లాడండి, ఒకవేళ

  • గ్యాస్ లక్షణాలు మిమ్మల్ని తరచుగా ఇబ్బంది పెడుతుంటే
  • మీ లక్షణాలు అకస్మాత్తుగా మారితే
  • ప్రత్యేకించి మీ వయస్సు 40 కంటే పైన వుండి, కొత్త లక్షణాలను కలిగి వుంటే
  • మీరు మలబద్ధకం, విరేచనాలు, లేదా బరువు తగ్గడం వంటి ఇతర లక్షణాలు -గ్యాస్ తో పాటు కలిగి వుంటే

మీ డాక్టర్ మీ ఆహారం మరియు లక్షణాల గురించి అడుగుతాడు. మీ డాక్టర్ గ్యాస్ కు కారణమైన నిర్దిష్ట ఆహారాల కోసం మీ డైరీని సమీక్షించవచ్చు.

ఒకవేళ పాలు లేదా పాల ఉత్పత్తులు గ్యాస్ కు కారణమైతే, మీ డాక్టర్ లాక్టోజ్ అసహిష్టత (ఇంటాలరెన్స్) కోసం తనిఖీ చేయడానికి రక్త లేదా శ్వాస పరీక్షలు చేయవచ్చు.  లాక్టోజ్ అసహిష్టత  అంటే మీరు లాక్టోజ్ ను జీర్ణం చేసుకోవడంలో ఇబ్బంది కలిగివుంటారు అని అర్థం. మీ డాక్టర్ మీ గ్యాస్ లక్షణాలు మెరుగుపడడానికి కొంత కాలం పాలు మరియు పాల ఉత్పత్తులను మానివేయమని అడగవచ్చు.

మీ డాక్టర్ మీ లక్షణాలను బట్టి, ఇతర జీర్ణ సమస్యల కోసం పరీక్షించవచ్చు.

గ్యాస్ కు ఎలా చికిత్స చేయబడుతుంది?

మీకు చాలా  గ్యాస్ వుంది అనుకుంటే, మీ డాక్టర్ ని కలవడానికి ముందు, మీరే స్వంతంగా గ్యాస్ కు చికిత్స చేయడానికి ప్రయత్నించవచ్చు.

తక్కువ గాలిని మింగడం మరియు మీరు తినే వాటిని మార్చడం అనేది గ్యాస్ ను నిరోధించేందుకు లేదా తగ్గించేందుకు సహాయపడవచ్చు. ఈ క్రింది చిట్కాలను ప్రయత్నించండి:

  • మరింత నెమ్మదిగా తినండి
  • మీరు ధూమపానం చేస్తూ ఉంటే, విడిచిపెట్టండి లేదా తగ్గించండి.
  • మీకు కట్టుడు పళ్ళు పెట్టుకుంటే, మీ దంతవైద్యుడుని కలవండి మరియు మీ కట్టుడు పళ్ళు సరిగ్గా సరిపోయేటట్టు చూసుకోండి.
  • గమ్ నమలడం లేదా హార్డ్ కాండీలను పీల్చడం చేయవద్దు.
  • కార్బోనేటేడ్ పానీయాలు అయిన, సోడా మరియు బీరు వంటి వాటిని విడిచిపెట్టండి.
  • పండ్ల రసాన్ని తక్కువగా త్రాగండి, ముఖ్యంగా ఆపిల్ రసం మరియు పియర్ రసం.
  • మీకు గ్యాస్ ను కలిగించే ఆహారాలు తక్కువగా తినండి లేదా మానుకోండి.

కొన్ని ఓవర్ ది కౌంటర్ ఔషధాలు గ్యాస్ తగ్గించేందుకు సహాయపడవచ్చు:

మీరు  బీన్స్, కూరగాయలు మరియు తృణధాన్యాలు తినేటప్పుడు, ఆల్ఫా-గలక్టసిదాసే (బీనో) ను తీసుకోవడం అనేది గ్యాస్ ను తగ్గించగలదు.

గ్యాస్ వల్ల వచ్చేఉబ్బరం మరియు కడుపు నొప్పి లేదా అసౌకర్యంలను సిమేతికనే తగ్గించగలదు.

మీకు లాక్టోస్ అసహిష్టత ఉంటే, పాలు మరియు పాల ఉత్పత్తులు జీర్ణం కావడానికి లాక్టేస్ మాత్రలు లేదా చుక్కల ద్రవం సహాయపడతాయి. మీరు కిరాణా దుకాణం వద్ద లాక్టోజ్-లేని మరియు లాక్టోస్ -తగ్గించబడిన పాలు మరియు పాల ఉత్పత్తులను కూడా తెచ్చుకోవచ్చును.

ముఖ్యంగా మీరు SIBO లేదా IBS కలిగి ఉంటే, గ్యాస్ నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడే మందును మీ వైద్యుడు సూచించవచ్చు.

తినడం, డైట్, మరియు న్యూట్రిషన్

మీ ఆహారపు అలవాట్లు మరియు డైట్  మీకు వుండే గ్యాస్ యొక్క పరిమాణాన్ని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, చాలా వేగంగా తినడం మరియు తాగడం అనేవి మీరు మరింత గాలి మింగడానికి కారణమవగలవు. మరియు మీరు కొన్ని రకాల కార్బోహైడ్రేట్ల తిన్న తర్వాత మీరు మరింత గ్యాస్ ను కలిగి ఉండవచ్చు.

ఏ ఆహారాలు మీకు మరింత గ్యాస్ ను కలిగిస్తాయి అని కనుగొనడానికి మీరు తినే వాటిని మరియు మీ గ్యాస్ లక్షణాలను ట్రాక్ చేయండి. మీ గ్యాస్ లక్షణాలను కలుగచేసే ఆహారాలను వదిలిపెట్టండి లేదా తక్కువ తినండి.

గుర్తుంచుకోవలసిన పాయింట్లు

  • గ్యాస్ అనేది జీర్ణ వాహికలో వుండే గాలి.
  • అందరికీ గ్యాస్ వుంటుంది. త్రేన్పడం మరియు గ్యాస్ ను వదలడం అనేవి సర్వసాధారణం.
  • గాలిని మింగడం ద్వారా మరియు పెద్ద ప్రేగులో కొన్ని రకాల ఆహారాల విచ్ఛిన్నం ద్వారా సాధారణంగా జీర్ణ వాహికలో గ్యాస్ ఏర్పడుతుంది  .
  • కార్బోహైడ్రేట్స్ కలిగిన అత్యధిక ఆహారాలు గ్యాస్ కు కారణమవగలవు.
  • ఒక వ్యక్తికి గ్యాస్ కలిగించే ఆహారాలు మరొకరికి గ్యాస్ కలిగించకపోవచ్చు.
  • గ్యాస్ యొక్క అతి సాధారణ లక్షణాలు త్రేన్పడం, గ్యాస్ ను వదలడం, ఉబ్బరం, మరియు ఉదర నొప్పి లేదా అసౌకర్యం.
  • తక్కువ గాలి మింగడం మరియు మీరు తినేవాటిని మార్చడం అనేవి గ్యాస్ ను నిరోధించేందుకు లేదా తగ్గించేందుకు సహాయపడవచ్చు.
  • కొన్ని ఓవర్ ది కౌంటర్ ఔషధాలు గ్యాస్ ను తగ్గించేందుకు సహాయపడవచ్చు.

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు