గర్భదారణ మధుమేహం గురించి నేను ఏమి తెలుసుకొనవలసిన అవసరము ఉంది?

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456


గర్భదారణ మధుమేహం  అంటే ఏమి?

గర్భదారణ మధుమేహం  అనే ఒక రకమైన మధుమేహం  గర్భదారణ సమయములో అభివృద్ధి చెందుతుంది. మధుమేహం  అనగా రక్తంలో చక్కర అని కూడా పిలువబడే, మీ రక్తంలో గ్లూకోజ్  ఎక్కువగా ఉండడం. మీ శరీరము గ్లూకోజ్ ను శక్తి కొరకు వాడుతుంది. మీ రక్తములో మరీ ఎక్కువ   గ్లూకోజ్ ఉండడము మీకు లేదా మీ బిడ్డకు మంచిది కాదు.

గర్భదారణ మధుమేహం సాధారణంగా గర్భదారణ సమయములో ఆలస్యంగా కనుగొనబడుతుంది.    మీకు మధుమేహం  వున్నట్లు గర్భదారణ మొదలు అయిన సమయములో కనుగొనబడితే, మీరు గర్భధారణ కాకముందే మీకు మధుమేహం  వుండి ఉంటుంది.

గర్భధారణ మధుమేహం నకు చికిత్స చేయడము అనేది మీరు మరియు మీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడవచ్చు. మీ రక్త గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి  వెంటనే చర్య తీసుకొనడము ద్వారా మీరు మీ శిశువును మరియు మిమ్ములను  కాపాడు కొనడానికి వీలు పడుతుంది.

మీకు  గర్భదారణ మధుమేహం  వుంటే, ఒక ఆరోగ్య సంరక్షణ బృందం మీ సంరక్షణలో భాగం కావచ్చు. మీ ప్రసూతి వైద్యుడు-గైనకాలజిస్ట్  లేక  ఓ బి /జి వై ఎన్ – ప్రసూతి చేసి మీ బిడ్డను ఇచ్చే వైద్యుడుతో పాటు – మీ బృందంలో మధుమేహం నకు చికిత్స చేసే ఒక డాక్టర్ , ఒక మాధమేహ ఎడ్యుకేటర్ , మరియు మీరు తీసుకొనే ఆహారాన్ని ప్రణాళిక  చేయడానికి ఒక ఆహార నిపుణుడు వుండవచ్చు.

టైప్1 మధుమేహం  లేక టైప్ 2 మధుమేహం  తో వున్న స్రీల కొరకు

మీరు టైప్1 మధుమేహం  లేక టైప్ 2 మధుమేహం  కలిగివుండి బిడ్డను కావాలనుకుంటే, మీరు గర్భము ధరించే ముందు మీ డాక్టర్ తో మాట్లాడండి. చికిత్స చేయని లేక సరిగా నియంత్రించని మధుమేహం  మీ బిడ్డకు ప్రమాదకరమైన సమస్యలకు కారణము అవుతుంది.

గర్భదారణ మధుమేహం నకు ఏమి కారణము అవుంతుంది?   

గర్భదారణ సమయములో మీ శరీరము చాలినంత ఇన్సులిన్ ను తయారుచేయక పొతే గర్భధారణ మధుమేహం  వస్తుంది. ఇన్సులిన్ అనేది మీ కడుపు వెనుక భాగములో ఉన్నటువంటి ఒక అవయవము అయిన  క్లోమములో తయారు అయ్యే ఒక హార్మోన్. ఇన్సులిన్ మీ శరీరము శక్తి కొరకు గ్లూకోజ్ ను వాడుకోవడానికి సహాయపడుతుంది మరియు మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి సహాయ పడుతుంది.

గర్భదారణ సమయములో, మీ శరీరము ఎక్కువ హర్మోన్లను తయారు చేస్తుంది మరియు బరువు పెరగడము లాంటి ఇతర మార్పులకు లోనవుతుంది. ఈ మార్పులు  మీ శరీరము యొక్క కణములు ఇన్సులిన్ ను తక్కువ ప్రభావవంతంగా వాడుకొనేలా చేస్తాయి. ఈ పరిస్థితిని ఇన్సులిన్ నిరోధకత అంటారు. ఇన్సులిన్ నిరోధకత మీ శరీరము యొక్క ఇన్సులిన్ అవసరాన్ని పెంచుతుంది. మీ క్లోమము చాలినంత ఇన్సులిన్ తయారుచేయనపుడు మీరు గర్భదారణ మధుమేహం  బారిన పడతారు.

అందరు గర్భిణి స్రీలు గర్భధారణ సమయములో ఆలస్యంగా కొంత ఇన్సులిన్ నిరోధకతను కలిగి వుంటారు. కాని కొంత మంది స్రీలు సాధారణంగా  గర్భధారణ దాల్చకముందే వారికి ఇన్సులిన్ నిరోధకత వుంటుంది  ఎందుకంటే వారు ఎక్కువ బరువు కలిగి వుంటారు. ఈలాంటి స్రీలు పెరిగిన  ఇన్సులిన్ అవసరముతో గర్భదారణ దాలుస్తారు మరియు వారికి గర్భధారణ మధుమేహం  వచ్చే అవకాశము ఎక్కువ వున్నది.

నాకు గర్భధారణ మధుమేహం  వచ్చే అవకాశాలు ఏవి?

మీకు గర్భధారణ మధుమేహం  వచ్చే అవకాశాలు ఈ క్రింది వాటిని కలిగి వుంటే ఎక్కువగా వుంటాయి.

  • అధిక బరువు
  • ముందే గర్భధారణ మధుమేహం వుండి వుంటే
  • 9 పౌండ్లు కంటే బరువైన బిడ్డకు మీరు జన్మ ఇచ్చి ఉన్నట్లయితే
  • టైప్ 2 మధుమేహం వున్న తల్లి/తండ్రి, సోదరుడు లేక సోదరి ఉన్నట్లయితే,
  • ప్రీ మధుమేహం అనగా మీ చక్కర గ్లూకోజ్ స్థాయిలు మామూలు స్థాయి కంటే ఎక్కువగా వుండి మధుమేహం  గా నిర్ణయించడానికి అవసరమైనంత స్థాయిలో ఉండక పోవటము
  • పి సి ఓ ఎస్ అని కూడా పిలువబడే పోలి సిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే ఒక హార్మోన్ రుగ్మతను కలిగి వుంటే

నాకు గర్భధారణ మధుమేహం  వచ్చే అవకాశములను నేను ఎలా తగ్గించుకోవాలి?

మీరు అధిక బరువు కలిగి వుండి గర్భధారణ కావాలని ఆలోచిస్తూ వుంటే, మీరు ఈ విధంగా గర్భధారణ మధుమేహం  పొందే అవకాశాలను తగ్గించు కొనవచ్చును.

  • అధికముగా బరువును కోల్పోవడము
  • మీరు గర్భధారణ దాల్చకముందు మీ శారీరక చర్యలను పెంచుకోడము

ఈ చర్యలు మీ శరీరము ఇన్సులిన్ ను ఎలా వాడుకుంటుంది అనే దానిని మెరుగుపరుస్తాయి మరియు మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మామూలుగా ఉండేలా సహాయ పడతాయి.

మీరు ఒక్కసారి గర్భము ధరించిన తరువాత, మీరు బరువు తగ్గించు కొనే ప్రయత్నము చేయరాదు. మీ బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి మీరు కొంత బరువు పెరగాల్సిన అవసరం వుంటుంది. అయితే, అతి త్వరగా అతి ఎక్కువ బరువు పెరగడము వలన గర్భదారణ మధుమేహం  వచ్చే అవకాశములు ఎక్కువ కావచ్చు. మీ గర్భధారణ సమయములో మీరు యెంత బరువు పెరగాలి మరియు మీకు యెంత శారీరక చర్యలు అవసరము అన్నది మీ డాక్టర్ చెబుతారు.

నేను గర్భధారణ మధుమేహం  కొరకు ఎప్పుడు పరీక్ష చేయబడతాను?    

మీరు గర్భము దాల్చిన తరువాత బహుశా 24 మరియు 28 వారముల మధ్య గర్భధారణ మధుమేహం  కొరకు పరీక్ష చేయబడతారు.

ఒకవేళ మీకు గర్భధారణ మధుమేహం వచ్చే ఎక్కువ అవకాశం ఉంటే, మీరు గర్భవతి అయి మొదటి సారి వచ్చినపుడు డాక్టరు మధుమేహం  కొరకు పరీక్ష చేస్తారు. ఆ సమయములో  మీ రక్తంలో చక్కర స్థాయి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మీరు గర్భధారణ మధుమేహం  కొరకు కంటే మధుమేహం  కొరకు పరీక్ష చేయబడతారు.

గర్భధారణ మధుమేహం  ఏ విధంగా నిర్ధారణ చేయబడుతుంది?

డాక్టర్లు గర్భధారణ మధుమేహం ను కనుగొనడానికి రక్త పరీక్షను ఉపయోగిస్తారు. అన్ని రక్త పరీక్షలకు డాక్టర్ గారి క్లినిక్ లో గాని లేక ఒక వ్యాపార సౌకర్యములో గాని రక్తము తీయడము అనేది వుంటుంది. రక్త శాంపుల్స్  ప్రయోగశాలకు విశ్లేషణ కొరకు పంపబడతాయి.

స్క్రీనింగ్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్

ఈ పరీక్ష కొరకు, మీరు ఒక పంచదార పానీయము త్రాగవలయును మరియు ఒక గంట తరువాత మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయి చెక్ చేయబడుతుంది. ఈ పరీక్ష దినములో ఎప్పుడైనా చేయవచ్చును. పరీక్ష ఫలితాలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా వుంటే మీరు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసుకొనవలసిన అవసరం వుండవచ్చు.

ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్:                                                                                                                               ఈ పరీక్ష కొరకు మీరు కనీసము 8 గంటలు ముందుగా ఉపవాసము ఉండవలసి వస్తుంది. ఉపవాసము అనగా ఏమీ తినరాదు మరియు నీళ్ళు తప్ప ఏమీ తాగరాదు. పరీక్షకు ముందు మీరు అనుసరించవలసిన ఇతర సూచనలను డాక్టర్ గారు మీకు ఇస్తారు.

పరీక్ష మొదలయే ముందు మీ యొక్క ఉపవాస రక్తంలో గ్లూకోజ్ స్థాయి చెక్ చేయబడుతుంది. ఆ తరువాత మీరు ఒక చక్కెర పానీయము తాగుతారు. మీరు మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 1 గంట, 2 గంటలు, మరియు బహుశా 3 గంటల తరువాత పరీక్ష చేయబడతాయి. మీ డాక్టర్ మీ పరీక్షా ఫలితాలను మీరు గర్భధారణ మధుమేహం  కలిగి వున్నారా అని కనుగోనేందుకు వాడతారు.

గర్భధారణ మధుమేహం  నా బిడ్డను ఎలా ప్రభావితము చేస్తుంది?

మీ గర్భధారణ మధుమేహం  నియంత్రణలో లేకపోవడము వలన మీకు అధిక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఉన్నట్లయితే మీ బిడ్డ కూడా అధిక రక్తంలో గ్లూకోజ్ కలిగి వుంటుంది. మీ బిడ్డ యొక్క క్లోమము అధిక చక్కెర గ్లూకోజ్ ను నియంత్రించేందుకు అదనపు ఇన్సులిన్ ను తయారు చేయవలసి వుంటుంది.  మీ బిడ్డ రక్తములోని అదనపు గ్లూకోజ్ కొవ్వుగా నిలువ వుంటుంది.

చికిత్స చేయని లేక నియంత్రణ లేని గర్భధారణ మధుమేహం  మీ బిడ్డకు ఈ క్రింది వంటి సమస్యలకు కారణము కావచ్చును.

  • సాధారణ శరీరము కంటే పెద్ద శరీరముతో పుట్టడం – మాక్రోసిమా అనబడే ఒక స్థితి – ప్రసవాన్ని కష్టతరము చేయవచ్చు మరియు ఇది మీ బిడ్డకు అధిక ప్రమాదకరము కావచ్చు
  • హైపో గ్లైసెమియా అని కూడా పిలువబడే, పుట్టిన వెంటనే తక్కువ రక్తంలో గ్లూకోజ్ ను కలిగి వుండడం
  • శ్వాస సమస్యలు కలిగి ఉండటము, రెస్పిరేటోరి డిస్ట్రెస్ సిండ్రోమ్ అనబడే ఒక స్థితి
  • పుట్టక పూర్వమే లేక పుట్టిన వెంటనే చనిపోవడానికి ఎక్కువ అవకాశము కలిగి వుండడం

మీ బిడ్డ జాండీస్ తో జన్మించ వచ్చును. గర్భధారణ సమయంలో మధుమేహం  వున్న తల్లుల యొక్క అప్పుడే పుట్టిన బిడ్డలకు జాండీస్ చాలా సాధారణంగా వుంటుంది.  జాండీస్ తో  చర్మము మరియు కంటిలో వున్న తెలుపులు పసుపు పచ్చగా మారుతుంది. జాండీస్ మామూలుగా వెళ్లి పోతుందికాని బిడ్డ  సహాయము కొరకు ప్రత్యేక లైట్ల క్రింద ఉంచే అవసరము రావచ్చును. మీ బిడ్డకు ఎక్కువగా తల్లి పాలు ఇచ్చేటట్టు చూడడం వలన జాండీస్ పోవడానికి సహాయము చేస్తుంది.

మీ బిడ్డ  అధిక బరువుగా గలదిగా కావచ్చు మరియు అతడు లేక ఆమె పెరగడంతో పాటు టైప్ 2 మధుమేహం  అభివృద్ధి అవవచ్చు.

గర్భధారణ సమయములో నా బిడ్డ ఆరోగ్యము చెక్ చేసుకొనడానికి నాకు అదనపు పరీక్షలు అవసరమా?

మీరు గర్భధారణ మధుమేహం  కలిగి వుంటే, డాక్టర్ మీ బిడ్డ ఆరోగ్యము చెక్  చేసుకొనడము కొరకు కొన్ని అదనపు పరీక్షలు చేయించు కొమ్మని మిమ్ములను సిఫార్సు చేయవచ్చు, ఈ క్రింది వాటి లాంటివి

  • అల్ట్రా సౌండ్ పరీక్షలు – ఇవి బిడ్డ పెరుగుదల చూడడము కొరకు మరియు బిడ్డ మామూలు కంటే పెద్దగా వున్నదా అని తెలుసుకోవడానికి శబ్ద తరంగాలను వాడుతాయి
  • ఒక ఒత్తిడి లేని పరీక్ష, మీ బిడ్డ గుండె రేటు మీ బిడ్డ చురుకుగా వున్నప్పుడు పెరుగుతున్నదా అని తెలుసుకొనడము కొరకు మీ కడుపు పైన వుంచి  ఒక మోనిటర్ ను వాడుతుంది
  • మీ బిడ్డ కదలికల మధ్య సమయమును చెక్ చేయడానికి కిక్ కౌంట్స్

గర్భధారణ మధుమేహం  నన్ను ఏవిధంగా ప్రభావితము చేస్తుంది?

గర్భధారణ మధుమేహం  ఈ విధంగా మీ అవకాశాలను పెంచవచ్చును.

  • ఎక్కువ రక్త పు పోటు కలిగి వుండి మరియు మూత్రములో అతి ఎక్కువగా ప్రోటీన్లు ఉండడము, ప్రీక్లాంప్ సియా అనబడే ఒక స్థితి
  • మీ బిడ్డ పెద్దగా ఉండడము వలన మీ బిడ్డను ప్రసవించుటకు సిజరిన్ సెక్షన్ లేక సి సెక్షన్ అనబడే సర్జరీ చేసుకొనడము
  • మానసికంగా క్రుంగి పోవడము
  • టైప్ 2 మధుమేహం అభివృద్ధి చెందడము మరియు ఆ జబ్బు వలన వచ్చే సమస్యలు

ప్రీ క్లామ్ప్ సియా

ప్రీ క్లాంప్సియా గర్భధారణ యొక్క రెండవ అర్ధ భాగము లో సంభవిస్తుంది. దీనికి చికిత్స చేయకపోతే ప్రీ క్లాంప్సియా సమస్యలు మీకు మరియు మీ బిడ్డకు  మరణమునకు కారణము కావచ్చును. ప్రీ క్లాంప్ సియా నయమయే మార్గము బిడ్డకు జన్మను ఇవ్వడమే. మీకు గర్భధారణ  సమయములో ఆలస్యంగా ప్రీ క్లాంప్సియా వస్తే, మీరు బిడ్డను ముందు ప్రసవించడానికి సిజరిన్ సెక్షన్ అవసరము కావచ్చును. మీకు ప్రీ క్లాంప్సియా త్వరగా వస్తే మీకు పడక విశ్రాంతి మరియు మందుల అవసరము వుండవచ్చు లేక ప్రసవానికి ముందే మీ బిడ్డ వీలైనంత వరకు పెరగడానికి అవకాశం కల్పించడానికి మీరు హాస్పిటల్ లో ఉండవలసిన అవసరము వుండవచ్చు.

క్రుంగిపోవడము

క్రుంగి పోవడము వలన మీ మధుమేహం ను నిర్వహించడానికి  మరియు మీ బిడ్డ గురించి శ్రద్ధ తీసుకోవడానికి ఎక్కువ అలసి పోతారు.  మీ గర్భధారణ సమయములో లేదా తరువాత మీకు ఆత్రుతగా, విచారముగా అనిపిస్తే, లేదా మీకు ఎదురయ్యే మార్పులకు అనుగుణంగా మీరు ఉండలేక పోతే, మీ ఆరోగ్య సంరక్షణ బృందంతో మాట్లాడండి. క్రుంగి పోవడము చికిత్స చేయదగ్గది. ఈ ఆరోగ్య సంరక్షణ బృందం  మీరు బాగుండడానికి  సపోర్ట్ మరియు సహాయము పొందడానికి సలహాలు ఇవ్వవచ్చును. మీ బిడ్డను గురించి జాగ్రత్తలు తీసుకోనడానికి, ముందు మీరు మీ గురించి జాగ్రత్తలు తీసుకొనవలసి వుంటుంది అని  గుర్తించుకొనండి.

చెక్ అప్ లు

మీ చెక్ అప్ లను కొనసాగించండి. బాగా వున్నాను అంటే మీరు మీ అప్పాయింట్ మెంట్లను తప్పించడము అనే అర్థము కాదు. గర్భధారణ మధుమేహం  వున్న స్త్రీలలో చాలా సార్లు లక్షణాలు కనిపించవు. మీ ఆరోగ్య సంరక్షణ బృందం గర్భదారణ మధుమేహం  నుండి వచ్చే సమస్యల కొరకు చూస్తూ వుంటుంది.

 జన్మనిచ్చిన తరువాత

మీ మధుమేహం  బిడ్డ జన్మించిన తరువాత బహుశా వెళ్లిపోవచ్చును. కాని పుట్టుక తరువాత మధుమేహం  వెళ్ళిపోయినప్పటికీ మీరు

  • మరల గర్భం దాలిస్తే గర్భధారణ మధుమేహం కలుగవచ్చును
  • మీ తరువాతి జీవితములో టైప్ 2 మధుమేహం రావడము అనేది ఎక్కువగా వుంటుంది

గర్భధారణ మధుమేహం నకు ఏవిధంగా చికిత్స చేయబడుతుంది?

గర్భధారణ మధుమేహం నకు చికిత్స అనగా మీ యొక్క  రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒక లక్ష్య  శ్రేణిలో ఉంచడము కొరకు తగిన చర్యలు తీసుకోనడమే. లక్ష్యాలు మీరు ఉద్దేశ్యించిన సంఖ్యలు. మీ డాక్టర్ గారు ఆ లక్ష్యాలు ఏర్పాటు  చేసుకోవడంలో మీకు సహాయపడతారు. మీరు మీ రక్తంలో గ్లూకోజ్ ను ఈ క్రింది వాటితో ఎలా నియంత్రించు కొనవలయునో నేర్చుకుంటారు.

  • ఆరోగ్యకరంగా తినడము
  • శారీరక శ్రమ
  • ఇన్సులిన్ షాట్స్, అవసరమైనపుడు

తినడము, ఆహారము మరియు న్యూట్రిషన్

మీ ఆరోగ్య సంరక్షణ బృందం మీకు మీ బిడ్డకు మంచివి అయిన ఎంపికలు చేసిన  ఆహారముతో కూడిన ఒక ఆరోగ్యకరమైన తినవలసిన ప్లాన్ ను చేసుకోనడములో మీకు  సహాయపడుతుంది.  ఈ ఆహార ఎంపికలు  మీ గర్భ సమయములో మరియు తరువాత మీరు మీ కుటుంబాన్ని పెంచే సమయములో కూడా మంచివిగా వుంటాయి.

ఒక  ఆర్యోగ్యకరమైన ఆహార ప్రణాళిక మీ రక్తంలో గ్లూకోజ్ మీరు ఎన్నుకున్న లక్ష్య శ్రేణిలో వుంచడానికి సహాయపడుతుంది. ఈ ప్రణాళిక మీకు ఎలాంటి ఆహారములు తినవలయును, ఏ పరిమాణములో తినవలయును మరియు ఎప్పుడు తినవలయును అని తెలుసుకొనడములో సహాయపడుతుంది. ఆహార ఎంపికలు, పరిమాణము మరియు సమయము మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మీ లక్ష్య శ్రేణిలో ఉంచడానికి ముఖ్యం.

శారీరక శ్రమ

శారీరక శ్రమ మీ యొక్క రక్తంలో గ్లూకోజ్ లక్ష్యాలను చేరుకోనడానికి సహాయ పడుతుంది. మీకు అత్యుత్తమముగా సరిపోయే శారీరక శ్రమ రకం  కొరకు డాక్టర్ గారితో మాట్లాడండి. మీరు ముందుగానే చురకుగా వుంటే మీరు ఏమి చేస్తూ ఉంటారో డాక్టర్ గారికి చెప్పండి. శారేరకంగా చురుకుగా ఉండడము వలన మీరు తరువాతి భవిష్యత్తులో టైప్ 2 మధుమేహం  మరియు దాని సమస్యలు కలిగివుండే అవకాశాలను తగ్గించడములో కూడా సహాయపడుతుంది.  మీ కొరకు మరియు మీ బిడ్డ కొరకు మంచి అలవాట్లు చేసుకొనడానికి ఇప్పుడే సమయము.

  • మీరు శారీరకంగా ఉండవలసినంత చురుకుగా వుండండి. వారములో చాలా రోజులు కనీసము 30 నిమిషముల కొరకు లక్ష్యములు ఏర్పాటు చేసుకొనండి.
  • ఏరోబిక్ చర్యలు చేయండి.ఇవి మీ గుండె వేగంగా కొట్టుకోవడము కొరకు మీ యొక్క పెద్ద కండరాలను వాడతాయి. బ్రిస్క్ వాకింగ్, ఈత కొట్టడము, డాన్స్ చేయడము లేక తక్కువ ప్రభావము కలిగించే ఎరోబిక్స్ ను ప్రయత్నించండి.
  • గర్భధారణకు ముందే మీరు చేస్తున్న కండరాలు మరియు ఎముకలను బలపరచే వెయిట్ లిఫ్టింగ్ లేక జాగింగ్ లాంటి కొన్ని ఎక్కువ తీవ్రత గల క్రీడలను కొనసాగించ వచ్చునేమో మీరు మీ డాక్టర్ ను అడగండి.
  • మీ కడుపుకు దెబ్బ కలిగించే బాస్కెట్ బాల్ లేక సాకర్ లాంటి చర్యలను మానుకోండి.
  • మీరు పడిపోవడానికి కారణము అయే గుర్రపు స్వారీ లేక కొండ దిగువకు స్కైయింగ్ చేయడము లాంటి చర్యలను మానుకోండి.
  • మొదటి త్రైమాసికం తర్వాత మీ వెనుక వైపుకు వ్యాయామం చేయకూడదు. ఈ లాంటి శారీరక శ్రమ  ఒక ముఖ్యమైన నరము పైన అతి ఎక్కువ పీడనము కలిగించి మీ బిడ్డకు రక్త ప్రసరణను నియంత్రిస్తుంది.

ఇన్సులిన్ షాట్స్         

మీకు మీ రక్తంలో గ్లూకోజ్ లక్ష్యాలను చేరుకొనడములో సమస్య వుంటే, మీరు ఒక ఆర్యోగ్యకరమైన ఆహార ప్రణాళిక మరియు శారీరకంగా చురుకుగా వుండడముతో పాటు ఇన్సులిన్ అనబడే ఒక మందును తీసుకొనవలసి వుంటుంది. మీ ఆరోగ్య సంరక్షణ బృందం మీకు మీరు ఇన్సులిన్ షాట్స్ ఎలా ఇచ్చు కొనవలయునో చూపుతుంది. ఇన్సులిన్ మీ బిడ్డకు అపాయకరము కాదు.

నా చక్కెర గ్లూకోజ్ స్థాయిలు లక్ష్యములో వు న్నాయని నేను ఎలా తెలుసుకొనగలను?

మీ ఆరోగ్య సంరక్షణ బృందం మీరే స్వంతంగా మీ యొక్క రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు చెక్ చేసుకొనడానికి  ఒక రక్త గ్లూకోజ్ మీటర్ అనబడే ఒక చిన్న పరికరమును వాడమని మీకు చెప్పవచ్చును.

  • మీటర్ ను ఎలా వాడాలి
  • ఒక రక్తపు చుక్కను పొందేందుకు మీ వ్రేలును ఎలా గుచ్చాలి
  • మీ యొక్క రక్తంలో గ్లూకోజ్ లక్ష్య శ్రేణి ఏది
  • మీ రక్తంలో గ్లూకోజ్ ను ఎప్పుడు తనిఖీ చేసుకొనవలెను

మీరు మీ రక్తంలో గ్లూకోజ్ ను ఈ సమయములో తనిఖీ చేయమని అడగబడవచ్చును

  • మీరు లేచిన వెంటనే
  • భోజనమునకు కొంచెం ముందు
  • ఉదయము ఉపాహారము అయిన 1 లేక 2 గంటల తరువాత
  • మధ్యాహ్న భోజనము అయిన 1 లేక 2 గంటల తరువాత
  • రాత్రి భోజనము అయిన 1 లేక 2 గంటల తరువాత

ఈ చార్టు గర్భధారణ మధుమేహం  వున్న  స్రీలకు రక్తంలో గ్లూకోజ్ లక్ష్యముల అంకెలను సూచిస్తుంది.

గర్భధారణ మధుమేహం  వున్న స్రీలకు  రక్తంలో గ్లూకోజ్ లక్ష్యముల అంకెలు (ఎం జి/డి ఎల్)  .
దినము యొక్క సమయము లక్ష్యాలు
 భోజనానికి ముందు మరియు మీరు లేచిన తరువాత  95 లేదా అంతకంటే  తక్కువ
 తిన్న తరువాత 1 గంటకు  140 లేదా అంతకంటే తక్కువ
 తిన్న తరువాత 2 గంటలకు  120 లేదా అంతకంటే తక్కువ

మీ డాక్టరును ఈ లక్ష్యాలు మీకు సరి అయినవా అని అడగండి.

మీరు మీ రక్తంలో గ్లూకోజ్ పరీక్ష చేసిన ప్రతిసారీ, ఒక రికార్డు బుక్ లో వ్రాసుకోనండి. ఒక రక్తంలో గ్లూకోజ్ రికార్డు పుస్తకము కొరకు మీ యొక్క ఆరోగ్య సంరక్షణ బృందం ను అడగండి లేక ఇంటర్నెట్ లో గాని లేక మీ మొబైల్ లో గాని ఒక ఎలక్ట్రానిక్ రక్త గ్లూకోజ్ ట్రాకింగ్ సిస్టంను వాడండి. మీ రక్త గ్లూకోజ్ మీటర్ మరియు మీ రికార్డు పుస్తకం మీ చెక్ అప్స్ కు ఎల్లప్పుడూ తీసుకురండి దానితో మీరు మీ లక్ష్య రక్త గ్లూకోజ్ స్థాయిలను చేరుకోవడం గురించి మీ ఆరోగ్య సంరక్షణ జట్టు తో మాట్లాడవచ్చు.

నేను ఇతర పరీక్షలు నా స్వంతంగా చేసుకోవలసిన అవసరం వుంటుందా?

మీ ఆరోగ్య  సంరక్షణ జట్టు మీ ఉదయపు మూత్రములో లేదా మీ రక్తములో కేటోన్స్ అనబడే రసాయనాల కొరకు ఎలా పరీక్ష చేసుకోవాలా అని మీకు బోధిస్తుంది. కేటోన్స్ యొక్క అధిక స్థాయిలు అనేవి మీ శరీరం మీరు తినే ఆహారము నుండి బదులుగా శరీరములోని కొవ్వును శక్తి కొరకు వినియోగిస్తుంది అనడానికి చిహ్నము. గర్భధారణ సమయములో కొవ్వును శక్తి కొరకు వాడుకోవడము సిఫార్సు చేయదగినది కాదు. కేటోన్స్ మీ బిడ్డ కు హానికారి కావచ్చును.

మీ కేటోన్ స్థాయిలు అధికంగా ఉన్నట్లయితే,  మీ డాక్టర్ గారు మిమ్ములను మీరు తినే ఆహారము రకము లేక  పరిమాణము మార్చమని సలహా ఇచ్చే అవకాశము వున్నది.

నేను బిడ్డ కలిగిన తరువాత, నేను ఇంకా మధుమేహం  కలిగి వున్నానని తెలుసుకోవడము ఎలా?

మీరు మీ బిడ్డ పుట్టిన తరువాత 6 నుండి 12 వారాలకు మీకు ఇంకా మధుమేహం  ఉన్నదా అని చూసుకొనడము కొరకు  ఒక రక్తంలో గ్లూకోజ్ పరీక్ష కొరకు మీ డాక్టర్ ను కలువవలసిన అవసరము వున్నది.  చాలా మంది స్రీలలో  ప్రసవము అయిన తరువాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సాధారణ స్థాయికి చేరుకొంటాయి. అయితే, గర్భధారణ మధుమేహం ఉన్న 5 నుండి 10 శాతం మంది మహిళల్లో రక్త గ్లూకోజ్ స్థాయిలు తిరిగి సాధారణ స్థితికి రావు . ఈ స్రీలు మధుమేహం , సాధారణంగా టైప్ 2  మధుమేహం  కలిగివున్నారని పరీక్ష చూపిస్తుంది. వారు తమ మధుహేహమును ఆహారము , శారీరక శ్రమ, మరియు అవసరమైతే మందుల ద్వారా మానేజ్ చేయవలసి వుంటుంది.

మీ  రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మీ గర్భధారణ తరువాత సాధారణ స్థాయికి వచ్చినా కూడా  మీరు మీ తరువాతి జీవితములో మీరు మధుమేహం  – సాధారణంగా టైప్ 2 మధుమేహం  –  కలిగి వుండే అవకాశములు ఎక్కువగా వున్నాయి. అందువలన, కనీసం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మధుమేహం లేదా ప్రీడయాబెటస్ కొరకు మీరు పరీక్షలు చేయించుకోవాలి.

నేను నా తరువాత జీవితములో టైప్ 2 మధుమేహం  రావడాన్ని ఎలా నివారించగలను లేదా ఆలస్యము చేయగలను?

ఈ క్రింది జీవన శైలి మార్పులు చేయడం ద్వారా మీరు టైప్ 2 మధుమేహం  రాకుండా చేయడానికి లేదా ఆలస్యము చేయడానికి చాలా చేయవచ్చును:

  • ఒక ఆరోగ్యకరమైన బరువుకు చేరండి. మీరు గర్భధారణ కంటే ముందు వున్న బరువును మీ బిడ్డ పుట్టిన తరువాత 6 నుండి 12 నెలల కాలములో చేరడానికి ప్రయత్నిచండి. అప్పుడు మీరు ఇంకా ఎక్కువ బరువుగా వుంటే, మీ శరీరం బరువును కనీసం 5 నుండి 7 శాతము వరకు తగ్గించుకొనడానికి వర్క్అవుట్ చేసి దానిని దూరంగా వుంచండి. ఉదాహరణకు మీరు 90 కిలోల బరువు వుంటే 5 నుండి 10 కిలోల బరువు తగ్గడము వలన మీరు మధుమేహం  వచ్చే అవకాశములను చాలా తగ్గించు కొనవచ్చును.
  • మీరు వారములో ఎక్కువ రోజులు కనీసము 30 నిమిషములు శారీరకంగా చురుకుగా వుండండి.
  • ఒక ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికను అనుసరించండి. ఎక్కువ ధాన్యం, పండ్లు మరియు కాయగూరలు తినండి. కొవ్వును మరియు కేలరీలు తగ్గించుకోండి. మీ ఆరోగ్య సంరక్షణ జట్టు మీకు ఒక ఆహారప్రణాళిక ను తయారు చేయడంలో సహాయపడుతుంది.
  • మీ డాక్టరును మధుమేహ మందు మేట్ ఫోర్మిన్ తీసుకోనవలయునేమో అడగండి. మేట ఫోర్మిన్  ముఖ్యంగా మీరు యుక్త వయసులో వుండి మరియు ఎక్కువ బరువు కలిగి వుండి మరియు ప్రీడయాబెటస్ కలిగి వుంటే లేక మీకు గర్భధారణ మధుమేహం  వుంటే మీకు టైప్ 2 మధుమేహం  వచ్చే అవకాశమును తగ్గించగలదు.

ఈ మార్పులు మీరు ఎక్కువ కాలము ఆరోగ్యకరమైన జీవితము గడపడానికి సహాయపడతాయి.  మీ ఆరోగ్య సంరక్షణ జట్టు ఈ మార్పులు చేసుకోనడములో మీకు సమాచారము మరియు మద్దతు ఇవ్వగలదు.

టైప్ 2 మధుమేహం  ఆలస్యము చేయడము వలన లేక నివారించడము వలన మీరు వయసు మళ్ళిన కొద్దీ వచ్చే గుండె మరియు రక్త నాళముల జబ్బు మరియు ఇతర సమస్యలు వచ్చే అవకాశమును కూడా తగ్గించగలరు.

మీరు మరియొక బిడ్డను కావాలని అనుకుంటే మీ డాక్టరుతో మాట్లాడండి. మీ బిడ్డ రక్షణ కొరకు మీరు గర్భధారణ పొందే ముందే మీ రక్తంలో గ్లూకోజ్ ఒక ఆరోగ్య కరమైన స్థాయిలో వుండే అవసరము వున్నది. మీ డాక్టర్ మీరు తరువాతి బిడ్డ కొరకు మీరు తయారుగా వున్నారని నిర్ధారించడములో సహాయ పడగలరు.

 

నేను విధంగా నా బిడ్డకు ఒక ఆరోగ్యకరమైన ప్రారంభం ఇవ్వగలను?

మీరు మీ బిడ్డకు తల్లిపాల ద్వారా ఒక ఆరోగ్యకరమైన ప్రారంభం ఇవ్వగలరు. రొమ్ము పాలు మీ శిశువుకు ఉత్తమ పోషణ మరియు కొన్ని అనారోగ్యాల నుండి రక్షణ అందిస్తుంది.

తల్లిపాలు కోసం సిద్ధ పడేందుకు సహాయం చేయడానికి,

తల్లి పాలుకు మీ ప్రణాళికల గురించి మీ ఆరోగ్య సంరక్షణ జట్టుతో మాట్లాడండి. మీరు మీ బిడ్డను ప్రసవించ దలచుకొన్న స్థలంలో విజయవంతంగా తల్లి పాలు పట్టించడానికి మద్దతు ఇచ్చేందుకు అవసరమైన ఉద్యోగులు మరియు ఏర్పాటు ఉన్నదో లేదో అడగండి.

  • తల్లిపాల తరగతి తీసుకోండి. తల్లిపాలు ఎలా పట్టాలి అనే దాని గురించి తెలుసుకునే గర్భిణీ స్త్రీలు అలా చేయని వారికంటే విజయవంతంగా ఉండే అవకాశం ఎక్కువ.
  • తల్లి పాలు పట్టించుటలో మీకు సహాయం చేయడానికి ఒక లాక్టేషన్ కన్సల్టెంట్ ను సిఫారసు చేయమని మీ వైద్యుడిని అడగండి. ఒక లాక్టేషన్ కన్సల్టెంట్ తల్లిపాలు పట్టించుటలో సహాయం ఇవ్వడానికి శిక్షణ పొంది ఉంటారు.
  • తల్లిపాలు పట్టించిన స్నేహితులతో మాట్లాడండి లేదా ఒక తల్లిపాల మద్దతు బృందంలో చేరడాన్ని పరిగణించండి.

మీకు మీ బిడ్డ పుట్టిన తరువాత, ఈ క్రింది దశలు ఒక గొప్ప ప్రారంభాన్ని పొందడానికి మీకు సహాయం చేయవచ్చు:

  • పుట్టిన తరువాత సాధ్యమైనంత త్వరలో తల్లిపాలను పట్టించండి. పుట్టిన మొదటి గంట లోపల పీల్చుకొనే సహజ ప్రవృత్తి చాలా బలంగా ఉంటుంది.
  • ఇప్పటికే మీకు ఒక లాక్టేషన్ కన్సల్టెంట్ లేకపోతే, వచ్చి మీకు సహాయపడడానికి ఆసుపత్రిలో ఒకరి కోసం అడగండి.
  • అది వైద్యపరంగా అవసరమైతే తప్ప, మీ బిడ్డకు ఇతర ఆహారం లేదా ఫార్ములా ఇవ్వద్దని ఆస్పత్రి సిబ్బందికి చెప్పండి.
  • మీరు తరచుగా తల్లి పాలు పట్టడానికి వీలుగా మీ బిడ్డను మీ ఆసుపత్రి గదిలోనే పగలు మరియు రాత్రి అంతా అనుకూలముగా వుంచండి. లేదా, పాలు పట్టడానికి మీ బిడ్డను మీ వద్దకు తీసుకుని రమ్మని మీరు నర్సులను అడగండి.
  • మీ బిడ్డ కు యే శాంతపరచేవి లేక కృతిమ నిప్పల్స్ లాంటివి ఇవ్వడము నివారించండి. ఎందుకంటే  మీ బిడ్డ మీ తల్లి పాలకు అలవాటు పడవలయును.

అనేక ప్రముఖ ఆరోగ్య సంస్థలు మీ శిశువు మొదటి 6 నెలల వరకు తల్లి  పాలు కాకుండా ఏ ఇతర ఆహారాలు లేదా ద్రవాలు తీసుకోకూడదని సూచిస్తున్నాయి. మొదటి 6 నెలల తర్వాత, పిల్లలు తల్లి పాలతో పాటు ఇతర ఆహారాలు కూడా తీసుకొనడము మొదలు పెట్టవచ్చును

నా బిడ్డ భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండడానికి నేను ఎలా సహాయపడలను?

మీరు మీ పిల్లవాడికి తను ఆరోగ్యంగా ఉండడానికి శారీరకంగా చురుకుగా ఉండడము, టి వి ముందు మరియు వీడియో గేమ్స్  ముందు తక్కువగా కూర్చోడము, ఆరోగ్యకరమైన భోజనము, మరియు ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండడము లాంటి ఆరోగ్య కరమైన  జీవన శైలి ఎంపికలను ఏవిధంగా చేసుకోనవలయునో చూపించి సహాయము చేయవచ్చును.

గుర్తుంచుకోవలసిన పాయింట్లు:

  • గర్భధారణ మధుమేహం కేవలము గర్భధారణ సమయములో వచ్చే ఒక మధుమేహం . మధుమేహం  అనగా రక్తంలోని గ్లూకోజ్ , మరియు రక్తంలోని చక్కెర ఎక్కువగా ఉండడము.
  • గర్భధారణ మధుమేహం గర్భధారణ సమయములో మీ శరీరము చాలినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేక పోవడము వలన వస్తుంది. ఇన్సులిన్ మీ ఉదరము వెనుక భాగములో వున్న క్లోమము అనబడే ఒక అవయవము లో తయారు అయ్యే ఒక హార్మోన్. ఇన్సులిన్ గ్లూకోజ్ ను శక్తి కొరకు వాడుకొనడములో సహాయపడి మరియు మీ రక్త గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.
  • మీరు బహుశా గర్భధారణ మధుమేహం కొరకు  గర్భధారణ దాల్చిన 24 నుండి 28 వారాల  మధ్య పరీక్ష చేయబడతారు.  ఒక వేళ మీకు గర్భధారణ మధుమేహం  వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే , మీ డాక్టర్ మిమ్ములను మీరు గర్భధారణ అయిన తరువాత మీ మొదటి సందర్శన సమయములో పరీక్షలు చేయవచ్చును.
  • మీరు మీ గర్భధారణ మధుమేహం నియంత్రణలో లేకపోవడము వలన అధిక రక్త గ్లూకోజ్ స్థాయిలను కలిగి వుంటే మీ బిడ్డ కూడా అధిక రక్త గ్లూకోజ్ స్థాయిని కలిగివుంటుంది.
  • చికిత్స చేయని లేక నియంత్రణ లేని గర్భధారణ మధుమేహం మీ బిడ్డకు సమస్యలకు కారణము కావచ్చును.
  • గర్భధారణ మధుమేహం నకు చికిత్స చేయడము అంటే మీ రక్త చక్కెర స్థాయిలను ఒక నిర్దిష్ట స్థాయిలో ఉంచడము.
  • మీ ప్రసవము తరువాత మీ రక్త చక్కెర స్థాయిలు సాధారణ స్థాయికి చేరుకోన్నప్పటికీ మీరు మీ తరువాతి జీవితములో మధుమేహం – మామూలుగా టైప్ 2 మధుమేహం  వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. అందువలన, మీరు మధుమేహం లేదా ప్రీడయాబెటస్ కొరకు కనీసం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష  చేయించుకోవలసి ఉంటుంది.
  • మీరు మీ బిడ్డ తల్లిపాలు ఇవ్వడము ద్వారా ఒక ఆరోగ్యకరమైన ప్రారంభము ఇవ్వవచ్చును.
  • మీరు మీ పిల్లవాడు ఆరోగ్యంగా ఉండడానికి శారీరకంగా చురుకుగా ఉండడము, టి వి లేక వీడియో గేమ్స్ ముందు తక్కువ సమయము కూర్చోడము, ఒక ఆరోగ్యకరమైన ఆహారము తీసుకొనడము, ఆరోగ్యకరమైన బరువు వద్ద ఉండడము లాంటి ఆరోగ్యకరమైన జీవన విధానమును ఎలా ఎన్నుకోవాలో చూపడం ద్వారా ఆరోగ్యంగా వుండడానికి మీరు అతనికి సహాయపడవచ్చును.

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు