మధుమేహం నా నోటిని ఎలా ప్రభావితం చేయగలదు?
మధుమేహం వలన మీ రక్తంలో ఏర్పడిన, చక్కెర అని కూడా పిలువబడే గ్లూకోజ్, చాలా ఎక్కువ వుండడం అనేది మీ నోటిలో నొప్పి, ఇన్ఫెక్షన్, మరియు ఇతర సమస్యలకు కారణమవగలదు. మీ నోటిలో ఇవి వుంటాయి
- మీ పళ్ళు
- మీ చిగుళ్ళు
- మీ దవడ
- మీ నాలుక, మీ నోటి పై మరియు క్రింద కప్పు, మరియు మీ బుగ్గల లోపల భాగం వంటి కణజాలాలు
గ్లూకోజ్ మీ లాలాజలంలో ఉంటుంది – మీ నోటిని తడి చేసే ద్రవం. మధుమేహం ను నియంత్రించక పోయినప్పుడు, మీ లాలాజలంలోని అధిక గ్లూకోజ్ స్థాయిలు హానికరమైన బాక్టీరియా పెరగడానికి సహాయపడతాయి. ఈ బాక్టీరియా ఆహారంతో కలిసి, గార అని పిలువబడే మృదువైన అతుక్కోనే పొరను ఏర్పరుస్తాయి. చక్కెరలు మరియు పిండి పదార్ధాలు కలిగి ఉన్న ఆహారాలు తినడం నుండి కూడా గార వస్తుంది. కొన్ని రకాల గార దంత క్షయం లేదా ఖాళీలేర్పడడానికి కారణం అవుతుంది. ఇతర రకాల గార చిగురు వ్యాధి మరియు చెడు శ్వాసకు కారణమవుతాయి.
మీకు మధుమేహం ఉంటే చిగురువ్యాధి మరింత తీవ్రతరం అవుతుంది మరియు నయం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది . దాంతో, చిగుళ్ళ వ్యాధి కలిగి వుండడం అనేది మీ రక్తంలో గ్లూకోజ్ నియంత్రించడాన్ని కష్టం చేయవచ్చు.
నా పళ్ళపై గార వుంటే ఏమవుతుంది?
తొలగించబడని గార కొంతకాలానికి టార్టార్ గా గట్టిపడుతుంది మరియు మీ చిగురు రేఖ పైన చేరుతుంది. టార్టర్ బ్రష్ చేసుకోవడాన్ని మరియు మీ దంతాల మధ్య శుభ్రం చేసుకోవడాన్ని మరింత కష్టతరం చేస్తుంది. మీ చిగుళ్ళు ఎరుపుగా మరియు వాపుగా మారుతాయి, మరియు సులభంగా రక్తం కారుతుంది- చిగురువాపు అని పిలువబడే అనారోగ్య లేదా ఎర్రబడిన చిగుళ్ళ లక్షణాలు.
చిగురువాపుకు చికిత్స చేయనప్పుడు, అది పిరియోడొంటిస్ అని పిలిచే చిగురు వ్యాధిగా వృద్ధి చెందుతుంది. పిరియోడొంటిస్ లో, చిగుళ్ళు పంటి నుండి దూరంగా లాగబడుతాయి మరియు పాకెట్స్ అని పిలువబడే ఖాళీలు ఏర్పడుతాయి, అవి నిదానంగా ఇన్ఫెక్ట్ అవుతాయి. ఈ ఇన్ఫెక్షన్ చాలా కాలం పాటు ఉండగలదు. గార విస్తరించి మరియు చిగురు రేఖకు దిగువన పెరుగుతున్నప్పుడు, మీ శరీరం బాక్టీరియాతో పోరాడుతుంది. బాక్టీరియా మరియు ఈ ఇన్ఫెక్షన్ కు మీ శరీరం యొక్క ప్రతిస్పందన రెండు ఈ ఎముకను మరియు పంటిని అదే స్థానంలో ఉంచే కణజాలంను విచ్చిన్నం చేయడం ప్రారంభిస్తాయి. ఒక వేళ చిగుళ్ళ వాపుకు చికిత్స చేయకపోతే, చిగుళ్ళు, ఎముకలు, మరియు పళ్ళకు మద్దతిచ్చే కణజాలం నాశనం అవుతాయి. దంతాలు వదులు అయి మరియు తొలగించాల్సిన అవసరం ఉండవచ్చు. మీకు చిగుళ్ళ వాపు ఉంటే, మీ దంత వైద్యుడు మిమ్మల్ని పెరియోడాంటిస్ట్ దగ్గరకు పంపవచ్చు, చిగుళ్ళ చికిత్సలో ఒక నిపుణుడు.
మధుమేహం వలన ఏర్పడే అత్యంత సాధారణ నోటి సమస్యలు ఏమిటి?
కింది చార్ట్ మధుమేహం వలన ఏర్పడే అత్యంత సాధారణ నోటి సమస్యలు చూపిస్తుంది.
సమస్య | అదేంటి | లక్షణాలు | చికిత్స |
చిగురువాపు |
|
|
|
పిరియోడొంటిస్ |
|
|
|
కాన్డిడియాసిస్ అని పిలిచే గొంతు జబ్బు |
|
|
|
జెరోస్తోమియా అని పిలువబడే పొడి బారిన నోరు |
|
|
|
నోటిలో మంట |
|
|
|
మీ నోటిలో సమస్య యొక్క ఎక్కువ లక్షణాలు
- నయం కాని పుండు, లేదా కురుపు
- మీ దంతాలలో నల్లని మచ్చలు లేదా రంధ్రాలు
- మీ నోరు, ముఖం, లేదా దవడలో తగ్గని నొప్పి
- వదులు పళ్ళు
- నమిలేటప్పుడు నొప్పి
- రుచి మారిన భావం లేదా మీ నోటిలో ఒక చెడు రుచి
- మీరు బ్రష్ చేసినప్పుడు తగ్గని చెడు శ్వాస
నాకు మధుమేహం వలన ఏర్పడే నోటి సమస్యలు ఉన్నాయా అని నేను ఎలా తెలుసుకోవాలి?
మధుమేహ సమస్యల సంకేతాల కోసం మీ నోటిని తనిఖీ చేసుకోండి. మీరు ఏ సమస్యలైనా గమనిస్తే, వెంటనే మీ దంత వైద్యుడ్ని కలవండి. చిగురు వ్యాధి యొక్క మొదటి చిహ్నాలలో కొన్ని ఏమిటంటే వాచిన, లేత, లేదా రక్తస్రావం వున్న చిగుళ్ళు. కొన్నిసార్లు మీ చిగురు వ్యాధికి ఏ లక్షణాలు ఉండవు. మీకు తీవ్రమైన నష్టం జరిగేంత వరకు కూడా మీకు అది వున్నట్టు తెలియదు. క్లీనింగ్ మరియు చెకప్ కోసం సంవత్సరానికి రెండుసార్లు మీ దంతవైద్యుడిని చూడడం మీకు ఉత్తమం.
నేను నా దంతవైద్యుడి సందర్శన కోసం ఎలా సిద్ధం కావాలి?
ముందుగా ప్లాన్ చేయండి. దంత పని సమయంలో మీ రక్తంలో గ్లూకోజ్ గురించి శ్రద్ధ వహించడానికి ఉత్తమ మార్గం గురించి సందర్శనకు ముందు మీ డాక్టర్ మరియు దంత వైద్యుడితో మాట్లాడండి.
హైగ్లూకోమా అని కూడా పిలువబడే తక్కువ రక్తంలో గ్లూకోస్ కు కారణం కాగల మధుమేహం మందును మీరు తీసుకొని వుంటూ ఉండవచ్చు. మీరు ఇన్సులిన్ లేదా ఇతర మధుమేహం మందులు తీసుకొంటూ వుంటే, మీ వైద్యుడిని కలువడానికి ముందు వాటిని ఎప్పటిలాగా తీసుకోండి మరియు తినండి. మీరు దంతవైద్యుడు కార్యాలయానికి మీతో మీ మధుమేహం మందులు మరియు మీ స్నాక్స్ లేదా భోజనం తీసుకొచ్చే అవసరం ఉండవచ్చు.
మీ రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో లేకుంటే మీరు అత్యవసరం కాని దంత వైద్యాన్ని వాయిదా వేయవలసిన అవసరం ఉండవచ్చు.
మీరు దంతవైద్యుడుని సందర్శించడం గురించి ఉద్విగ్నంగా భావిస్తే, మీ దంత వైద్యుడుకి మరియు సిబ్బందికి మీ భావాల గురించి చెప్పండి. మీ దంతవైద్యుడు మీ అవసరాలను బట్టి వైద్యం చేస్తాడు. సాధారణ చెక్ అప్స్ చేయించుకోకుండా మీ నరాలు మిమ్మల్ని ఆపేటట్లు చేయనీయవద్దు. మీ నోటిని శ్రద్ధ వహించడానికి చాలా కాలం వేచి వుండడం అనేది పరిస్థితులను మరింత దగజారవచ్చు.
నా దంత పని తర్వాత నా నోరు పుండు పడితే ఏమిచేయాలి?
దంత పని తర్వాత నోరు పుండు పడడం సాధారణం. ఒక వేళ ఇది జరిగితే, మీరు మాములుగా తినేటువంటి వాటిని అనేక గంటలు లేదా రోజుల పాటు తినలేరు లేదా నమల లేరు. మీ నోరు స్వస్థత పొందుతున్న సమయంలో మీ సాధారణ దినచర్యను ఎలా సర్దుబాటు చెయ్యాలి అనే దాని గురించి మార్గదర్శకత్వం కోసం, ఈ క్రింది వాటి గురించి మీ వైద్యుడిని అడగండి
- మీరు ఏమి ఆహారాలు మరియు పానీయాలను తీసుకోవాలి
- మీరు మీ మధుమేహం మందులను తీసుకునే సమయం మార్చుకోవలసి వుంటుందా
- మీరు మీ మధుమేహం మందుల మోతాదును మార్చుకోవలసి వుంటుందా
- మీరు మీ రక్తంలో గ్లూకోజ్ ను ఎంత తరచుగా తనిఖీ చేయాలి
ధూమపానం నా నోటిని ఎలా ప్రభావితం చేస్తుంది?
ధూమపానం మీ నోటి సమస్యలను తీవ్రతరం చేస్తుంది. ధూమపానం చిగురు వ్యాధి, నోటి మరియు గొంతు క్యాన్సర్, మరియు నోటి ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ వంటి వ్యాధులు వచ్చే మీ అవకాశాలను పెంచుతుంది. ధూమపానం మీ పళ్ళ రంగును పాడుచేస్తుంది మరియు మీ శ్వాస చెడు వాసన వచ్చేలా చేస్తుంది.
ధూమపానం మరియు మధుమేహం ఒక ప్రమాదకరమైన కలయిక. ధూమపానం అనేక మధుమేహ సమస్యలకు మీ ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు ధూమపానంను విడిచి పెడితే,
- మీరు గుండెపోటు, స్ట్రోక్, నరాల వ్యాధి, కిడ్నీ వ్యాధి, మరియు విచ్ఛేదనం వంటి మీ ప్రమాదాన్ని తగ్గిస్తారు
- మీ కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు స్థాయిలు మెరుగుపడతాయి
- మీ రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
నేను నా నోటిని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోగలను?
మీరు ఈ దశలను పాటించడం ద్వారా మీ నోటిని ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు:
- మీ రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలను మీ లక్ష్యానికి సాధ్యమైనంత దగ్గరగా ఉంచండి. మీ వైద్యుడు మీ లక్ష్యం రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలను ఏర్పరుచుటకు మీకు సహాయం చేస్తాడు మరియు మీ సంఖ్యలు చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉంటే ఏమి చేయవలయునో మీకు నేర్పుతాడు.
- ఆరోగ్యకరమైన భోజనం తినండి మరియు మీరు మరియు మీ వైద్యుడు లేదా నిపుణుడు కలిసి తయారు చేసిన భోజన ప్రణాళికను అనుసరించండి.
- కనీసం రోజుకు రెండుసార్లు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ తో మీ పళ్ళను బ్రష్ చేసుకోండి. ఫ్లోరైడ్ దంత క్షయం నుండి రక్షిస్తుంది.
- ఉదయం మొదటగా, పడుకునే ముందు, మరియు ప్రతీసారి భోజనం చేశాకా, మరియు తియ్యటి లేక పిండి పదార్థాల చిరుతిండ్ల తర్వాత బ్రష్ చేయడం లక్ష్యంగా పెట్టుకోండి.
- ఒక మృదువైన టూత్ బ్రష్ ను ఉపయోగించండి.
- టూత్ బ్రష్ ను గమ్ లైన్ వైపు వంచి మీ పళ్ళను నెమ్మదిగా బ్రష్ చేయండి.
- చిన్న, వృత్తాకార కదలికలను ఉపయోగించండి.
- ప్రతి పంటి ముందు, వెనుక, మరియు పైన బ్రష్ చేయండి. మీ నాలుకను కూడా బ్రష్ చేయండి.
- ప్రతి 3 నెలలకొక మారు లేదా టూత్ బ్రష్ అరిగిపోయినట్లు లేదా కుచ్చులు వ్యాపించినట్లు కనిపిస్తే ముందుగానే, మీ టూత్ బ్రష్ ను మార్చండి . ఒక కొత్త టూత్ బ్రష్ ఎక్కువ పాచిని తొలగిస్తుంది.
- ఫ్లోరైడ్ కలిగిన నీరు త్రాగండి లేదా దంతక్షయం నిరోధించడానికి ఒక ఫ్లోరైడ్ మౌత్ రిన్స్ ను ఉపయోగించడం గురించి మీ దంతవైద్యుడిని అడగండి.
- పాచిని నియంత్రించడానికి లేక చిగురు జబ్బును నిరోధించడానికి ఒక యాంటి-ప్లాక్ లేక యాంటి-గిన్గివిటిస్ మౌత్ రిన్స్ ను ఉపయోగించడం గురించి మీ దంత వైద్యుడిని అడగండి.
- కనీసం రోజుకు ఒకసారి మీ దంతాల మధ్య శుభ్రం చేయడానికి డెంటల్ ఫ్లొస్ ఉపయోగించండి. ఫ్లొస్సింగ్ మీ దంతాల మీద గార ఏర్పడకుండా వుండడానికి సహాయ పడుతుంది.
- ఫ్లొస్ ను పైకి మరియు క్రిందికి మరియు ప్రతి పంటి చిగురు కింద మొదలు వంపు వరకు రుద్దండి
- మీరు ఒక పంటి నుంచి మరొక పంటికి వెళ్ళేటప్పుడు ఫ్లోస్ యొక్క శుభ్రమైన భాగాలను ఉపయోగించండి
- పండ్ల మధ్య గారను తొలగించడానికి మరో మార్గం డెంటల్ పిక్ లేక బ్రష్ ను– పండ్ల మధ్య శుభ్రం చేయడానికి తయారు చేయబడిన సన్నని పరికరాలు- ఉపయోగించడం. మీరు మందుల దుకాణాలు లేదా కిరాణా దుకాణాలలో వీటిని కొనుగోలు చేయవచ్చు.
- మీరు కట్టుడు పళ్ళను ధరిస్తే, వాటిని శుభ్రంగా ఉంచుకోండి మరియు రాత్రి వాటిని బయటకు తీయండి. అవి వదులుగా లేదా ఇబ్బందికరంగా మారితే వాటిని సర్దుబాటు చేయించుకోండి.
- మీకు ఏవైనా నోటి సమస్యల లక్షణాలు ఉంటే వెంటనే మీ దంతవైద్యుడుని కలవండి.
- సంవత్సరానికి రెండుసార్లు క్లీనింగ్ మరియు చెకప్ కొరకు మీ దంతవైద్యుడుని కలవండి. మీ దంతవైద్యుడు మీకు మరిన్ని విజిట్స్ అవసరం వుంటే సూచించగలడు.
- మీ దంత వైద్యుడు యొక్క సలహాను అనుసరించండి.
- మీ దంతవైద్యుడు సమస్య గురించి చెప్పినట్లయితే, వెంటనే దాని గురించి జాగ్రత్త తీసుకోండి.
- మీ నోటిని ఆరోగ్యంగా ఉంచడానికి మీ దంతవైద్యుడు సూచించిన స్టెప్స్ లేదా చికిత్సలను అనుసరించండి.
- మీకు మధుమేహం ఉందని మీ దంతవైద్యుడితో చెప్పండి.
- మీ ఆరోగ్యంలో లేదా మందులలో ఏవైనా మార్పుల గురించి మీ దంతవైద్యుడితో చెప్పండి.
- A1C పరీక్ష లేదా పరగడుపున రక్తంలో గ్లూకోజ్ పరీక్ష వంటి కొన్ని మీ మధుమేహ రక్త పరీక్షల ఫలితాలను షేర్ చేయండి.
- ఒక వేళ మీ మధుమేహం నియంత్రణలో లేకపోతే దంత చికిత్స ముందు మరియు తర్వాత మీకు యాంటీబయాటిక్స్ అవసరం అవుతాయా అని అడగండి .
- ఒక వేళ మీరు పొగతాగుతూ ఉంటే, పొగ తాగడాన్ని ఆపండి.