డయాబెటిక్ న్యూరోపతీస్ అంటే ఏమిటి ?
డయాబెటిక్ న్యూరోపతీస్ అనేవి మధుమేహం కారణంగా ఏర్పడే నరాల వ్యాధుల యొక్క కుటుంబం. మధుమేహం ఉన్న వారిలో, కాలక్రమేణా, శరీరం అంతటా నరాల నష్టం అభివృద్ధి అవుతుంది. నరాల నష్టం గల కొంతమంది వ్యక్తులలో లక్షణాలు ఉండవు. ఇతరులలో నొప్పి, తిమ్మిరి, లేదా చేతులు, భుజాలు, పాదాలు, మరియు కాళ్లలో మొద్దుభారడం—స్పర్శ కోల్పోవడం. నరాల సమస్యలు జీర్ణ వాహిక, గుండె మరియు లైంగిక అవయవాలతో సహా ప్రతీ అవయవ వ్యవస్థలో సంభవించవచ్చును.
60 నుంచి 70 శాతం మంది మధుమేహం ఉన్న వారిలో న్యూరోపతి ఏదో ఒక రూపంలో వుంటుంది. మధుమేహం ఉన్న వారిలో ఏ సమయంలోనైనా నరాల సమస్యలు అభివృద్ధి చెందవచ్చు, కానీ వయస్సుతో మరియు మధుమేహం యొక్క ఎక్కువ వ్యవధితో ప్రమాదం పెరుగుతుంది. మధుమేహం కనీసం 25 సంవత్సరాలు నుండి మధుమేహం వున్న వారిలో న్యూరోపతి యొక్క అత్యధిక రేట్లు ఉన్నాయి. డయాబెటిక్ న్యూరోపతి రక్తంలో గ్లూకోజ్ (రక్తంలో చక్కెర) నియంత్రించడంలో సమస్యలు ఉన్నవారు, అలాగే అధిక స్థాయిల రక్తంలో కొవ్వు మరియు అధిక రక్తపోటు మరియు అధిక బరువు కలిగి వున్న వారిలో కూడా సర్వసాధారణంగా ఉన్నట్టు కనిపిస్తుంది.
డయాబెటిక్ న్యూరోపతీస్ కారణాలు ఏమిటి?
వివిధ రకాల డయాబెటిక్ న్యూరోపతి కొరకు బహుశా కారణాలు భిన్నంగా ఉంటాయి. పరిశోధకులు అధిక రక్తంలో గ్లూకోజ్ కు దీర్ఘకాలికంగా గురిఅవడం అనేది ఎలా నరాల నష్టంను కలిగిస్తుంది అని అధ్యయనం చేస్తున్నారు. నరాల నష్టం అనేది అనేక కారకాల యొక్క ఒక కలయిక కారణంగా ఏర్పడే అవకాశం ఉంది:
- అధిక రక్తంలో గ్లూకోజ్, దీర్ఘకాల మధుమేహం, అసాధారణ రక్తంలో కొవ్వు స్థాయిలు, మరియు బహుశా ఇన్సులిన్ యొక్క తక్కువ స్థాయిలు వంటి జీవక్రియ కారకాలు
- నరాలకు ఆక్సిజన్ మరియు పోషకాలను తీసుకపోయే రక్త నాళాల నష్టంకు దారితీసే న్యూరోవాస్క్యులార్ కారకాలు
- నరాలలో వాపును కలిగించే ఆటోఇమ్యూన్ కారకాలు
- కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వంటి నరాలకు యాంత్రిక గాయం
- నరాల వ్యాధి బారినపడే అవకాశాన్ని పెంచే వారసత్వ లక్షణాలు
- ధూమపానం లేదా మద్య వినియోగం వంటి జీవనశైలి కారకాలు
డయాబెటిక్ న్యూరోపతీల యొక్క లక్షణాలు ఏమిటి?
లక్షణాలు న్యూరోపతి రకం మీద మరియు ఏ నరాలు ప్రభావితం అవుతాయి అనే దాని మీద ఆధారపడి వుంటాయి. నరాల నష్టం గల కొంతమందికి లక్షణాలు అస్సలు వుండవు. ఇతరులకు, మొదటి లక్షణం తరచుగా పాదాలలో తిమ్మిరి, జలదరింపు లేదా నొప్పి. లక్షణాలు తరచుగా మొదట తక్కువగా ఉంటాయి, మరియు అధిక భాగం నరాల నష్టం అనేక సంవత్సరాలకు జరుగుతుంది, తేలికపాటి కేసులు ఎక్కువ కాలం పాటు గుర్తించబడకుండా పోవచ్చు. లక్షణములు సంవేదనాత్మక, చాలక, ప్రతిచర్యాత్మక లేదా అసంకల్పిత నాడీ వ్యవస్థలను చేర్చవచ్చు. కొందరు వ్యక్తుల్లో, ప్రధానంగా ఫోకల్ న్యూరోపతి ఉన్నవారిలో నొప్పి యొక్క ఆరంభం ఆకస్మికం మరియు తీవ్రంగా ఉండవచ్చు.
నరాల నష్టం యొక్క లక్షణాలలో ఇవి ఉండవచ్చు
- కాలివేళ్లు, పాదాలు, కాళ్ళు, చేతులు, భుజాలు మరియు వేళ్లలో తిమ్మిరి, జలదరింపు లేదా నొప్పి
- పాదాలు లేదా చేతులు యొక్క కండరాల క్షీణత
- అజీర్ణం, వికారం, వాంతులు
- అతిసారం లేదా మలబద్ధకం
- నిలబడిన లేదా కూర్చున్న తర్వాత రక్తపోటు తగ్గిపోవడం వల్ల మైకము లేదా మూర్ఛ
- మూత్రవిసర్జన సమస్యలు
- పురుషులలో అంగస్తంభన సమస్య లేదా మహిళల్లో యోనిలో పొడిబారడం
- బలహీనత
న్యూరోపతి కారణంగా సంభవించని లక్షణాలు, కానీ తరచుగా దాని వెంట వచ్చే లక్షణాలలో బరువు తగ్గడం మరియు నిస్పృహ ఉంటాయి.
డయాబెటిక్ న్యూరోపతి యొక్క రకాలు ఏమిటి?
డయాబెటిక్ న్యూరోపతిని పెరిఫెరల్, అటానమిక్, ప్రాక్సిమల్, లేదా ఫోకల్ గా వర్గీకరించవచ్చు. ప్రతీది శరీరం యొక్క వివిధ భాగాలను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది.
- డయాబెటిక్ న్యూరోపతి యొక్క అత్యంత సాధారణ రకమైన పెరిఫెరల్ న్యూరోపతి కాలి వేళ్ళు, కాళ్ళు, చేతులు, మరియు భుజాలలో నొప్పి లేదా స్పర్శ కోల్పోవడానికి కారణమవుతుంది.
- అటానమిక్ న్యూరోపతీ జీర్ణశక్తి, ప్రేగు మరియు మూత్రకోశం పనితీరు, లైంగిక ప్రతిస్పందన మరియు చెమటలో మార్పులను కలిగిస్తుంది. ఇది గుండెకు సేవలందించే మరియు రక్తపోటును నియంత్రించే నరములను, అలాగే ఊపిరితిత్తులు మరియు కళ్ళలోని నరములను కూడా ప్రభావితం చేయవచ్చు. అటానమిక్ న్యూరోపతీ అనేది ప్రజలు ఇకపై తక్కువ రక్త గ్లూకోజ్ స్థాయిల యొక్క హెచ్చరిక లక్షణాలను అనుభవించని ఒక పరిస్థితి అయిన హైపోగ్లేసిమియా అవగాహనారాహిత్యాన్నికూడా కలిగించవచ్చు.
- ప్రాక్సిమల్ న్యూరోపతి తొడలు, తుంటి లేదా పిరుదులలో నొప్పిని కలిగిస్తుంది మరియు కాళ్ళలో బలహీనతకు దారితీస్తుంది.
- ఫోకల్ న్యూరోపతి ఒక నరం లేదా ఒక నరాల సమూహంలో ఆకస్మిక బలహీనతకు కారణమయ్యి, కండరాల బలహీనత లేదా నొప్పిని కలిగిస్తుంది. శరీరంలోని ఏ నరమైనా ప్రభావితం కావచ్చు.
న్యూరోపతి శరీరమంతటా ఉన్న నరములను ప్రభావితం చేస్తుంది
పెరిఫెరల్ న్యూరోపతి వీటిని ప్రభావితం చేస్తుంది
- కాలి వేళ్ళు
- పాదాలు
- కాళ్ళు
- చేతులు
- భుజాలు
అటానమిక్ న్యూరోపతీ వీటిని ప్రభావితం చేస్తుంది
- గుండె మరియు రక్త నాళాలు
- జీర్ణ వ్యవస్థ
- మూత్ర నాళం
- లైంగిక అవయవాలు
- స్వేద గ్రంధులు
- కళ్ళు
- ఊపిరితిత్తులు
ప్రాక్సిమల్ న్యూరోపతి వీటిని ప్రభావితం చేస్తుంది
- తొడలు
- తుంట్లు
- పిరుదులు
- కాళ్ళు
ఫోకల్ న్యూరోపతి వీటిని ప్రభావితం చేస్తుంది
- కళ్ళు
- ముఖ కండరాలు
- చెవులు
- కటి మరియు వీపు దిగువభాగం
- ఛాతి
- ఉదరం
- తొడలు
- కాళ్ళు
- పాదాలు
పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఏమిటి?
డిస్టల్ సిమెట్రిక్ న్యూరోపతి లేదా సెన్సోరిమోటర్ న్యూరోపతి అని కూడా పిలువబడే పెరిఫెరల్ న్యూరోపతి అనేది చేతులు మరియు కాళ్ళలోని నరాల నష్టం. చేతులు మరియు భుజాల కంటే పాదాలు మరియు కాళ్లు ముందు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మధుమేహం ఉన్న చాలా మంది ప్రజలకు వైద్యుడు గమనించగల, కానీ ఎలాంటి లక్షణాలను తమకు తాముగా అనుభూతి చెందని న్యూరోపతి లక్షణాలు ఉంటాయి. పెరిఫెరల్ న్యూరోపతి యొక్క లక్షణాలలో ఇవి ఉండవచ్చు
- తిమ్మిరి లేదా నొప్పి లేదా ఉష్ణోగ్రత తెలియకపోవడం
- ఒక జలదరింపు, మంట లేదా గుచ్చుకున్న అనుభూతి
- తీవ్రమైన నొప్పులు లేదా తిమ్మిరి
- స్పర్శకు తీవ్రమైన సూక్ష్మ గ్రాహ్యత, స్వల్ప స్పర్శకు కూడా
- సమతుల్యత మరియు సమన్వయం కోల్పోవడం
ఈ లక్షణాలు తరచుగా రాత్రి పూట అధ్వాన్నంగా ఉంటాయి.
పెరిఫెరల్ న్యూరోపతి మీ కాలి వేళ్ళు, పాదాలు, కాళ్ళు, చేతులు, మరియు భుజాలల్లోని నరములను ప్రభావితం చేస్తుంది.
పెరిఫెరల్ న్యూరోపతి కండరాల బలహీనత మరియు ప్రతిచర్యలు కోల్పోవడానికి కూడా కారణం అయ్యి, ముఖ్యంగా చీలమండ వద్ద, ఒక వ్యక్తి నడిచే తీరులో మార్పులకు దారితీయవచ్చు. పాదాల వైకల్యాలైనటువంటి కాలి వేళ్ళు వంగడం మరియు పాద మధ్య భాగం పతనం సంభవించవచ్చు. పాదాల యొక్క తిమ్మిరి ప్రాంతాలల్లో బొబ్బలు మరియు పుళ్ళు కనపడవచ్చు ఎందుకంటే ఒత్తిడి లేదా గాయం గుర్తించబడకుండా వెళ్ళిపోతుంది. ఒక వేళ ఇన్ఫెక్షన్ సంభవిస్తే మరియు సరైన చికిత్స చేయకపోతే, ఇన్ఫెక్షన్ ఎముకకు, మరియు పాదాలకు వ్యాపించవచ్చు తరువాత అంగవిచ్ఛేదం జరగవచ్చు. చిన్న సమస్యలను కనుగొని సరైన సమయంలో చికిత్స చేస్తే చాలా అంగవిచ్ఛేదాలు నివారించగలవి.
అటానమిక్ న్యూరోపతీ అంటే ఏమిటి?
అటానమిక్ న్యూరోపతీ, గుండెను నియంత్రించే రక్తపోటును నియంత్రించే, మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే నరములను ప్రభావితం చేస్తుంది. అటానమిక్ న్యూరోపతీ, జీర్ణవ్యవస్థ, శ్వాసక్రియ పనితీరు, మూత్రవిసర్జన, లైంగిక స్పందన, మరియు దృష్టిలో సమస్యలు కలిగించి, ఇతర అంతర్గత అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది. అదనంగా, ఒక హైపోగ్లైసీమిక్ ఎపిసోడ్ తర్వాత రక్త గ్లూకోజ్ స్థాయిలను సాధారణానికి తెచ్చే వ్యవస్థ ప్రభావితం కావచ్చు, దీని ఫలితంగా హైపోగ్లైసిమియా హెచ్చరిక లక్షణాలు కోల్పోవవచ్చు.
హైపోగ్లైసీమియా అవగాహనారాహిత్యం
సాధారణంగా, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 70 ఎంజి/డిఎల్ కంటే క్రిందకు పడిపోయినప్పుడు, వణకడం, చమట మరియు దడ ఏర్పడతాయి. అటానమిక్ న్యూరోపతీ గల వ్యక్తులలో హైపోగ్లేసిమియాను గుర్తించడం కష్టతరం చేస్తూ లక్షణాలు కనిపించకపోవచ్చు. న్యూరోపతీ సమస్యలు కాకుండా ఇతర సమస్యలు కూడా హైపోగ్లేసిమియా అవగాహనారాహిత్యాన్ని కలిగించవచ్చు.
గుండె మరియు రక్త నాళాలు
గుండె మరియు రక్త నాళాలు రక్త ప్రసరణను నియంత్రించే కార్డియోవాస్క్యులార్ వ్యవస్థలో భాగం. కార్డియోవాస్క్యులార్ వ్యవస్థలోని నరాలకు జరిగే నష్టం రక్తపోటు మరియు గుండె రేటును సర్దుబాటు చేసే శరీరం యొక్క సామర్ధ్యంతో జోక్యం చేసుకుంటుంది. ఫలితంగా, కూర్చొన్న లేదా నిలబడ్డ తర్వాత రక్తపోటు గణనీయంగా పడిపోతుంది, దీనివల్ల, ఒక వ్యక్తికి తల తిరిగినట్టుగా లేదా సొమ్మసిల్లినట్టుగా కూడా అనిపిస్తుంది. గుండె రేటును నియంత్రించే నరాలకు జరిగే నష్టం అనేది, సాధారణ శరీర విధులు మరియు శారీరక శ్రమకు ప్రతిస్పందనగా పెరగడం మరియు పడిపోవడానికి బదులుగా గుండెరేటు ఎక్కువగా ఉండిపోతుంది అనే అర్థం కావచ్చు.
జీర్ణ వ్యవస్థ
జీర్ణ వ్యవస్థకు జరిగే నాడి నష్టం సాధారణంగా మలబద్ధకంనకు కారణమవుతుంది. నష్టం కడుపు చాలా నెమ్మదిగా ఖాళీ కావడానికి కూడా కారణం కాగలదు, గ్యాస్ట్రోపెరెసిస్ అనే ఒక పరిస్థితి. తీవ్రమైన గ్యాస్ట్రోపెరెసిస్ వికారం మరియు వాంతులు, కడుపు ఉబ్బరం, మరియు ఆకలి లేకపోవడంకు దారితీయవచ్చు. అసాధారణ ఆహార జీర్ణక్రియ కారణంగా, గ్యాస్ట్రోపెరెసిస్ రక్త గ్లూకోజ్ స్థాయిలను విస్తృతంగా మారేటట్టు కూడా చేయవచ్చు.
అన్నవాహికకు జరిగే నాడి నష్టం మ్రింగుటను కష్టతరం చేయవచ్చు, అయితే ప్రేగులకు జరిగే నరాల నష్టం తరచుగా, అదుపులేని అతిసారంతో మారే మలబద్ధకాన్ని కలిగించవచ్చు, ముఖ్యంగా రాత్రి పూట. జీర్ణ వ్యవస్థతో ఏర్పడే సమస్యలు బరువు తగ్గుదలకు దారి తీయవచ్చు.
మూత్ర నాళం మరియు సెక్స్ అవయవాలు
ఆటానమిక్ న్యూరోపతీ తరచుగా మూత్రవిసర్జన మరియు లైంగిక చర్యను నియంత్రించే అవయవాలను ప్రభావితం చేస్తుంది. నాడి నష్టం మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకుండా నియంత్రించి, మూత్రాశయంలో బాక్టీరియా అభివృద్ది చెందడానికి వీలు కలిపిస్తుంది మరియు మూత్రపిండాలు మరియు మూత్ర నాళం ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. మూత్రాశయం యొక్క నాడులు దెబ్బతిన్నప్పుడు ఒక వ్యక్తి మూత్రాశయం నిండినప్పుడు గ్రహించలేకపోవచ్చు లేదా మూత్రాన్ని విడుదల చేసే కండరాలను నియంత్రించలేకపోవచ్చు కాబట్టి మూత్రం ఆపుకొనలేని పరిస్థితి కలుగవచ్చు.
సెక్స్ డ్రైవ్ మారకపోయినప్పటికీ, ఆటానమిక్ న్యూరోపతీ పురుషులు మరియు మహిళల్లో లైంగిక స్పందనను కూడా క్రమంగా తగ్గించవచ్చు. ఒక వ్యక్తి అంగస్తంభనలు కలిగి ఉండలేకపోవచ్చు లేదా సాధారణంగా స్ఖలించకుండా లైంగిక క్లైమాక్స్ కు చేరవచ్చు. ఒక మహిళ ఉద్రేకం, సరళత, లేదా స్కలనం కష్టంతో కూడుకొని ఉండవచ్చు.
స్వేద గ్రంథులు
అటానమిక్ న్యూరోపతీ చెమటను నియంత్రించే నరాలను ప్రభావితం చేయవచ్చు. నాడి నష్టం స్వేద గ్రంథులు సరిగా పనిచేయకుండా నిరోధించినప్పుడు, శరీరం దాని ఉష్ణోగ్రతను అది చేయవలసినంతగా నియంత్రించలేదు. నాడి నష్టం రాత్రి పూట లేదా తినే సమయంలో విపరీతమైన చమటకు కూడా కారణమవగలవు.
కళ్ళు
చివరగా, అటానమిక్ న్యూరోపతీ కనుపాపను ప్రభావితం చేసి, వెలుగులో మార్పులకు తక్కువగా స్పందించే విధంగా చేయవచ్చు. ఫలితంగా, ఒక వ్యక్తి చీకటి గదిలో లైట్ వేసినప్పుడు సరిగ్గా చూడలేలేకపోవచ్చు లేదా రాత్రి పూట డ్రైవింగ్ లో ఇబ్బంది కలిగి ఉండవచ్చు.
ప్రాక్సిమల్ న్యూరోపతి అంటే ఏమిటి?
కొన్నిసార్లు లుంబోసక్రల్ ప్లేక్సాస్ న్యూరోపతి, ఫెమోరాల్ న్యూరోపతి, లేదా ఫెమోరాల్ న్యూరోపతి లేదా డయాబెటిక్ అమ్యోత్రోఫి అని పిలువబడే ప్రాక్సిమల్ న్యూరోపతి, సాధారణంగా శరీరం యొక్క ఒక వైపున, తొడలు, తుంట్లు, పిరుదులు, లేదా కాళ్లల్లో మొదలవుతుంది. ఈ రకమైన న్యూరోపతి టైప్ 2 మధుమేహం మరియు మధుమేహం ఉన్నవృద్ధులకు సర్వసాధారణం. ప్రాక్సిమల్ న్యూరోపతి కాళ్లలో బలహీనతను కలిగిస్తుంది మరియు సహాయం లేకుండా కూర్చున్న స్థితినుండి నిలబడే స్థితికి వెళ్ళలేని అసమర్థతను కలిగిస్తుంది. బలహీనత లేదా నొప్పి కోసం చికిత్స సాధారణంగా అవసరమవుతుంది. నరాల నష్టం యొక్క రకాన్ని బట్టి రికవరీ అయ్యే సమయం మారుతూ ఉంటుంది.
ఫోకల్ న్యూరోపతి అంటే ఏమిటి?
ఫోకల్ న్యూరోపతి హఠాత్తుగా కనిపిస్తుంది మరియు తరచుగా తల, మొండెము, లేక కాళ్ళలోని నిర్దిష్ట నరాలను ప్రభావితం చేస్తుంది. ఫోకల్ న్యూరోపతి వీటిని కలిగించవచ్చు
- కంటిని కేద్రీకరించడంలో అసమర్థత
- ద్వంద్వ దృష్టి
- ఒక కన్ను వెనుక నొప్పి
- బెల్ పాల్సి అనే ముఖం యొక్క ఒక వైపున పక్షవాతం
- వీపు దిగువ భాగం లేదా వెన్నెముక చివర భాగంలో తీవ్రమైన నొప్పి
- తొడ ముందు భాగంలో నొప్పి
- ఛాతీ, కడుపు, లేదా పక్క భాగంలో నొప్పి
- షిన్ బయట లేదా పాదం లోపల నొప్పి
- కొన్నిసార్లు గుండె జబ్బులు, గుండెపోటు, లేదా అపెండిసైటిస్ అని పొరబడే ఛాతీ లేదా కడుపునొప్పి
ఫోకల్ న్యూరోపతి బాధాకరమైన మరియు ఊహించలేని మరియు మధుమేహం గల పెద్దవారిలో సంభవిస్తుంది. అయితే, దానికదే అభివృద్ధి కావడానికి వారాలు లేదా నెలలు ఉంటుంది మరియు దీర్ఘకాల హానికి కారణం కాదు.
మధుమేహం ఉన్న వారిలో ఎన్ట్రాంప్మెంట్ సిండ్రోమ్స్ అని కూడా పిలువబడే నరాల సంపీడనాలను కూడా అభివృద్ధి కావచ్చు. ఒక చేతిలో తిమ్మిరి మరియు మొద్దుబారుటం మరియు కొన్నిసార్లు కండరముల బలహీనత లేదా నొప్పిని కలిగించే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, అత్యంత సాధారణం. ఎన్ట్రాంప్మెంట్ గురికాగల ఇతర నరాలు కాలి ముందరి భాగమున లేదా పాదం లోపలి భాగమున నొప్పిని కలిగించవచ్చు.
డయాబెటిక్ న్యూరోపతీని నివారించవచ్చా?
న్యూరోపతిని నివారించేందుకు ఉత్తమ మార్గం రక్తంలోగ్లూకోజ్ స్థాయిలను వీలైనంత వరకు సాధారణ పరిధికి దగ్గరగా ఉంచుకోవడం. సురక్షితమైన రక్తంలోగ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడం అనేది శరీరం అంతటా వున్న నరములను రక్షిస్తుంది.
డయాబెటిక్ న్యూరోపతీని ఎలా నిర్ధారణ చేస్తారు?
వైద్యులు న్యూరోపతీని లక్షణాలు మరియు శారీరక పరీక్షల ఆధారంగా విశ్లేషిస్తారు. పరీక్ష సమయంలో, వైద్యులు రక్త పోటు, గుండె రేటు, కండరాల బలం, ప్రతిస్పందనలు మరియు సున్నితత్వం, స్థాన మార్పులు, కదలిక, ఉష్ణోగ్రత, లేదా లైట్ టచ్ ను తనిఖీ చేయవచ్చు.
పాద పరీక్షలు
మధుమేహం కలిగిన వ్యక్తులు పెరిఫెరల్ న్యూరోపతీ కోసం ప్రతీ సంవత్సరం ఒక సమగ్ర పాద పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సిఫార్సు చేశారు. పెరిఫెరల్ న్యూరోపతీ నిర్దారించబడిన వ్యక్తులకు తరచుగా మరిన్ని పాద పరీక్షలు అవసరం. ఒక సమగ్ర పాద పరీక్ష పాదం యొక్క చర్మం, కండరాలు, ఎముకలు, ప్రసరణ, మరియు స్పర్శను అంచనా వేస్తుంది. ఒక చిన్నకర్ర కి జతచెయ్యబడిన ఒక జుట్టుదువ్వే బ్రష్ మీది కుచ్చులను పోలిన ఒక నైలాన్ మోనోఫిలమెంట్ తో వాటిని తాకడం ద్వారా లేదా ఒక పిన్ తో వాటిని గుచ్చడం ద్వారా, డాక్టర్ పాదముల సంరక్షిత స్పర్శ లేదా అనుభూతిని అంచనా వేయవచ్చు. పిన్ ప్రిక్ లేక మోనోఫిలమెంట్ నుండి నుండి స్పర్శ ఒత్తిడిని పొందలేని వ్యక్తులు సంరక్షిత స్పర్శ కోల్పోయారు మరియు వారికి నయం కాని పాదం పుళ్ళు అభివృద్ధి అయ్యే ప్రమాదం వుంది. కంపన అవగాహనను అంచనా వేసేందుకు, డాక్టర్ ఉష్ణోగ్రత అవగాహన కూడా తనిఖీ చేయవచ్చు లేదా టచ్ ప్రెషర్ కంటే ఎక్కువ సున్నితమైన ఒక ట్యూనింగ్ ఫోర్క్ ను ఉపయోగించవచ్చు.
ఇతర పరీక్షలు
నిర్ధారణలో భాగంగా వైద్యుడు ఇతర పరీక్షలను చేయవచ్చు
నెర్వ్ కండక్షన్ అధ్యయనాలు లేదా ఎలెక్ట్రోమయోగ్రఫి కొన్నిసార్లు నరాల నష్టం యొక్క రకం మరియు పరిధిని గుర్తించేందుకు ఉపయోగపడుతున్నాయి. నెర్వ్ కండక్షన్ అధ్యయనాలు ఒక నాడి ద్వారా విద్యుత్ ప్రసారం తనిఖీ చేస్తాయి. సమీపంలోని నరములు ద్వారా ప్రసారం అయ్యే విద్యుత్ సంకేతాలకు కండరాలు ఎంత బాగా స్పందిస్తాయని ఎలెక్ట్రోమయోగ్రఫి చూపిస్తుంది. న్యూరోపతిని నిర్ధారించడానికి ఈ పరీక్షలు అరుదుగా అవసరమవుతాయి.
గుండె రేటు వైవిధ్యం యొక్క ఒక తనిఖీ గుండె దీర్ఘ శ్వాసకు మరియు రక్తపోటు మరియు స్థితిలోని మార్పులకు గుండె ఏవిధంగా స్పందిస్తుందని చూపిస్తుంది.
అల్ట్రాసౌండ్ అంతర్గత అవయవాల యొక్క ఒక చిత్రాన్ని ఉత్పత్తి చేయడానికి ధ్వని తరంగాలను ఉపయోగగిస్తుంది. ఉదాహరణకు, మూత్రాశయం మరియు మూత్ర మార్గము యొక్క ఇతర భాగాల యొక్క ఒక అల్ట్రాసౌండ్ ను, ఈ అవయవాల నిర్మాణంను అంచనా వేయడానికి మరియు మూత్రాశయం మూత్ర విసర్జన తర్వాత పూర్తిగా ఖాళీ అవుతుందా లేదా అనేది చూపించడానికి ఉపయోగించవచ్చు.
డయాబెటిక్ న్యూరోపతీస్ కు ఎలా చికిత్స చేస్తారు?
ఇతర నరాల నష్టం నిరోధించుటకు రక్తంలో గ్లూకోజ్ ను సాధారణ స్థాయిలకు తేవడం అనేది చికిత్స మొదటి అడుగు. రక్తంలో గ్లూకోజ్ ను మానిటరింగ్ చేయడం, భోజన ప్రణాళిక, శారీరక శ్రమ, మరియు మధుమేహ మందులు లేదా రక్తంలో ఇన్సులిన్ అనేవి గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. రక్త గ్లూకోజ్ ను మొదట నియంత్రణలోకి తెచ్చినప్పుడు లక్షణాలు దిగజారవచ్చు, కానీ కాలక్రమేణా, తక్కువ రక్త గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడం అనేది లక్షణాలను తగ్గించటానికి సహాయపడుతుంది. మంచి రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ అనేది కూడా తరువాతి సమస్యల యొక్క ప్రారంభంను నిరోధించుటకు లేదా నిదానపరుచుటకు సహాయపడవచ్చు. శాస్త్రవేత్తలు న్యూరోపతీ యొక్క కారణాల గురించి మరింత తెలుసుకునే నాటికి, నరాల నష్టంను నిదానపరచడానికి, నిరోధించడానికి, లేదా చివరకు తొలగించడానికి కూడా నూతన చికిత్సలు అందుబాటులోకి రావచ్చు.
కింది సెక్షన్లలో వివరించిన విధంగా అదనపు చికిత్స నరాల సమస్య యొక్క రకం మరియు లక్షణం మీద ఆధారపడి ఉంటుంది.
నొప్పి నుంచి ఉపశమనం
వైద్యులు సాధారణంగా బాధాకరమైన డయాబెటిక్ న్యూరోపతికి ఓరల్ మందులతో వైద్యం చేసినప్పటికీ, ఇతర రకాల చికిత్సలు కొద్ది మంది వ్యక్తులకు సహాయపడగలవు. తీవ్రమైన నరాల నొప్పి గల వ్యక్తులు మందులు లేదా చికిత్సలు యొక్క ఒక కలయిక నుండి లబ్ది పొందగలరు మరియు చికిత్స ఎంపికల గురించి ఒక ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో మాట్లాడటం పరిగణించాలి.
డయాబెటిక్ నరాల నొప్పి నుంచి ఉపశమనం పొందడంలో సహాయం కొరకు ఉపయోగించే మందులలో ఈ క్రిందివి ఉంటాయి
అమిట్రిప్టిలిన్, ఇమిప్రమైన్, మరియు డెసిప్రమైన్ వంటి ట్రిసైక్లిక్ యాంటిడిప్రెస్సంట్స్
డులోక్షిటైన్, వెన్లాఫాక్శిన్, బుప్రోపియాన్, పారోక్సిటైన్, మరియు సిటాలోప్రం వంటి ఇతర రకాలైన యాంటిడిప్రెసెంట్స్
ప్రెగాబాలిన్, గబాపెంటిన్పై, కార్బామజేపైన్, మరియు లామోట్రిజిన్ వంటి యాంటికన్వుల్సంట్స్
కంట్రోల్డ్-రిలీజ్ ఆక్సికొడోన్ వంటి ఒపియోడ్ మరియు ఒపియోడ్లైక్ మందులు, ఒపియోడ్; మరియు ట్రమడోల్, యాంటిడెప్రసెంట్ గా కూడా పనిచేసే ఒక ఒపియోడ్.
డ్యూలాక్సిటీన్ మరియు ప్రెగాబాలిన్, ప్రత్యేకంగా బాధాకరమైన డయాబెటిక్ ప్రాక్సిమల్ న్యూరోపతి చికిత్స కోసం U.S. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా అనుమతి పొందాయి.
ప్రజలు వారి నరాల నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయం కోసం ఒక యాంటిడిప్రెసెంట్స్ గురించి నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. అన్ని మందులు దుష్ప్రభావాలు కలిగి వున్నాయి, మరియు కొందరు వృద్ధులకు లేదా గుండె జబ్బు వున్న వారికోసం ఉపయోగించుటకు సిఫార్సు చేయబడలేదు. ఓవర్ ది కౌంటర్ నొప్పి మందులైన ఎసిటమైనోఫెన్ మరియు ఇబుప్రోఫెన్నొప్పి అధిక భాగం నరాల నొప్పికి చికిత్స చేయడం కోసం బాగా పని చేయకపోవచ్చు మరియు తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగి వుండవచ్చు కాబట్టి కొందరు నిపుణులు ఈ మందులను నివారించమని సిఫార్సు చేస్తున్నారు.
చర్మానికి—సాధారణంగా పాదాలకు—పూసే వైద్యాలలో క్యాప్సైసిన్ క్రీమ్ మరియు లిడోకైన్ పాచెస్ ఉంటాయి. పాదాల కొరకు నైట్రేట్ స్ప్రేలు లేదా పాచెస్ నొప్పి నుంచి ఉపశమనం ఇవ్వవచ్చు అని అధ్యయనాలు సూచించాయి. ఒక యాంటిఆక్సిడెంట్ అయిన ఆల్ఫా-లిపోయిక్ ఆసిడ్, మరియు ఈవేనింగ్ ప్రింరోజ్ ఆయిల్ గురించి జరిగిన అధ్యయనములు అవి లక్షణాల నుంచి ఉపశమనం ఇవ్వవచ్చు మరియు కొద్ది మంది రోగులలో నరాల పనితీరును మెరుగుపర్చవచ్చు అని సూచించాయి.
ఒక బెడ్ క్రేడిల్ అనే పరికరం షీట్లు మరియు దుప్పట్లు సున్నితమైన పాదాలను మరియు కాళ్లును తాకకుండా ఉంచుగలదు. కొంతమందిలో నొప్పి నుంచి ఉపశమనంనకు ఆక్యుపంక్చర్, బయోఫీడ్బ్యాక్, లేదా ఫిజికల్ థెరపీ సహాయపడవచ్చు. ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్, అయస్కాంత చికిత్స, మరియు లేజర్ లేదా లైట్ థెరపీలతో కూడి ఉండే చికిత్సలు సహాయకారిగా ఉండవచ్చు అయితే మరింత అధ్యయనం అవసరం. పరిశోధకులు క్లినికల్ ట్రయల్స్లో అనేక కొత్త థెరపీలను కూడా అధ్యయనం చేస్తున్నారు.
గ్యాస్ట్రోపెరెసిస్ సమస్యలు
గ్యాస్ట్రోపెరెసిస్ యొక్క తేలికపాటి లక్షణాల— అజీర్ణం, త్రేనుపు, వికారం, లేదా వాంతులు—నుండి ఉపశమనానికి చిన్న భోజనాలను తరచుగా తినమని; కొవ్వులు తప్పించమని; మరియు తక్కువ ఫైబర్ తినమని వైద్యులు సూచిస్తారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యులు జీర్ణశక్తిని పెంచుటకు ఎరిత్రోమైసిన్, జీర్ణశక్తిని పెంచుటకు మరియు వికారం నుంచి ఉపశమనానికి మెటోక్లోప్రమైడ్ లేదా జీర్ణశక్తిని నియంత్రించడానికి సహాయంగా లేదా ఉదర ఆమ్లం స్రావం తగ్గించేందుకు ఇతర మందులను వైద్యులు సూచించవచ్చు.
అతిసారం లేదా ఇతర ప్రేగు సమస్యలు నుండి ఉపశమనానికి, వైద్యులు టెట్రాసైక్లిన్ వంటి ఒక యాంటీబయాటిక్ లేదా తగిన విధంగా ఇతర మందులను సూచించవచ్చు.
మైకము మరియు బలహీనత
నెమ్మదిగా కూర్చోవడం లేదా నిలబడడం అనేది రక్తపోటు మరియు ప్రసరణ సమస్యలతో సంబంధించిన తలతిరగడం, మగత, లేదా మూర్ఛను నిరోధించడానికి సహాయపడవచ్చు. పరుపు పై భాగాన్ని పైకి లేపడం లేదా ఎలాస్టిక్ స్టాకింగ్స్ ను ధరించడం కూడా సహాయపడవచ్చు. కొంతమంది ఆహారంలో ఉప్పును పెంచుకోవడం వలన మరియు ఉప్పును నిలబెట్టే హార్మోన్లతో చేసే చికిత్స నుండి లాభం పొందుతారు. ఇతరులు రక్తపోటు మందుల నుండి లాభం పొందుతారు. కండరాల బలహీనత లేదా సమన్వయం కోల్పోవడం అనేవి సమస్యలు అయినప్పుడు ఫిజికల్ థెరఫి సహాయపడవచ్చు.
మూత్ర మరియు లైంగిక సమస్యలు
ఒక యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను నివృత్తి చేయడానికి, వైద్యుడు బహుశా ఒక యాంటీబయాటిక్ సూచిస్తారు. ద్రవాలు పుష్కలంగా త్రాగటం అనేది మరో ఇన్ఫెక్షన్ ను నిరోధించడానికి సహాయం చేస్తుంది. ఇన్కంటినెన్స్ (మూత్రంను ఆపుకొనలేని సమస్య) గల వ్యక్తులు, క్రమ అంతరాలలో—ఉదాహరణకు, ప్రతి 3 గంటలకు—మూత్రవిసర్జన చేయడానికి ప్రయత్నించాలి, ఎందుకంటే మూత్రాశయం నిండి వున్నప్పుడు వారు చెప్పడం వీలు కాకపోవచ్చు.
పురుషుల్లో అంగస్థంభన సమస్యకు చికిత్స చేయడానికి, వైద్యుడు మొదట ఒక హార్మోన్ సంబంధమైన కారణంను తోసిపుచ్చడానికి పరీక్షలు చేస్తాడు. న్యూరోపతి వల్ల కలిగిన అంగస్థంభన సమస్యకు చికిత్స చేయడానికి అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. పురుషాంగానికి రక్త ప్రవాహం పెంచడం ద్వారా పురుషులు అంగస్థంభనలు కలిగి ఉండడానికి మరియు నిర్వహించేందుకు సహాయం చేయుటకు మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కొన్ని మౌఖిక మందులు మరియు ఇతరములు పురుషాంగం లోపలికి ఇంజెక్ట్ చేయబడేవి లేదా పురుషాంగం యొక్క కొన వద్ద మూత్రనాళంలోకి చొప్పించబడేవి. మెకానికల్ వాక్యూమ్ పరికరాలు పురుషాంగంనకు రక్త ప్రవాహంను కూడా పెంచుతాయి. మరొక ఎంపిక ఏమిటంటే శస్త్రచికిత్సతో ఒక ఇన్ ఫ్లేటబుల్ లేదా సెమీరిజిడ్ పరికరాన్ని పురుషాంగంలోకి ప్రవేశపెట్టడం.
న్యూరోపతి యోనిపొడి బారడంనకు కారణమైనప్పుడు స్త్రీలకు వజినల్ ల్యుబ్రికేంట్స్ ఉపయోగపడవచ్చు. వైద్యుడు ప్రేరేపణ మరియు ఉద్వేగం సంబంధించిన సమస్యలకు చికిత్స చేయడానికి స్త్రీలను గైనకాలజిస్ట్ కు రెఫెర్ చేయవచ్చు.
పాద సంరక్షణ
న్యూరోపతి గల ప్రజలు వారి పాదాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పాదాలకు వెళ్ళే నరాలు శరీరంలో అత్యంత పొడవైనవి మరియు తరచుగా న్యూరోపతి ద్వారా ప్రభావితం అయ్యేవి. కాళ్ళలో స్పర్శ కోల్పోవడం అంటే అర్థం పుళ్ళు లేదా గాయాలు గుర్తింపబడకపోవచ్చు మరియు వ్రణోత్పత్తి లేదా ఇన్ఫెక్టేడ్ కావచ్చు. ధూమపానం పాదాల యొక్క సమస్యల మరియు విచ్ఛేదనం ప్రమాదాన్ని పెంచుతుంది. ఒక ఆరోగ్య సంరక్షణ ప్రదాత ధూమపానం మానివేయడానికి సహాయం చేయవచ్చు.
భారతదేశంలో 60 శాతం కంటే ఎక్కువ నాన్ ట్రూమాటిక్ కాళ్ళ అంగచ్ఛేదాలు మధుమేహం ఉన్నవారిలో సంభవిస్తాయి. నాన్ ట్రూమాటిక్ అంగచ్ఛేదనాలు అంటే గాయం కారణంగా ఏర్పడినవి కాదు, యాక్సిడెంట్ కారణంగా కలిగిన తీవ్రమైన గాయాల వంటివి. 2004 లో దాదాపు 71,000 నాన్ ట్రూమాటిక్ అంగచ్ఛేదనాలు మధుమేహం ఉన్నవారిలో చేయబడ్డాయి. సమగ్ర పాద రక్షణ కార్యక్రమాలు అంగచ్ఛేదన రేట్లను 45 నుండి 85 శాతం వరకు తగ్గిస్తాయి.
అప్రమత్త పాద సంరక్షణ వీటితో కూడుకుని ఉంటుంది
- గోరువెచ్చటి నీరు(వేడి నీరు కాదు) మరియు తేలికపాటి సబ్బును ఉపయోగించి రోజూ పాదాలను శుభ్రం చేయడం. పాదాలను నీటిలో ఉంచడాన్ని నివారించాలి. పాదాలను మరియు కాలి వేళ్ళ మధ్య పొడిగా ఉంచడానికి ఒక మృదువైన తువ్వాలను ఉపయోగించవచ్చు.
- కోతలు, బొబ్బలు, ఎరుపు, వాపు, దద్దులు, లేదా ఇతర సమస్యల కొరకు పాదాలను మరియు కాలి వేళ్ళను ప్రతీ రోజు పరిశీలించండి. ఒక అద్దంను ఉపయోగించడం—చేతితో పట్టుకొని లేదా నేలపై ఉంచి—పాదాల అడుగును తనిఖీ చేయడానికి సహాయకారిగా ఉండవచ్చు లేదా మరొక వ్యక్తి పాదాలను తనిఖీ చేయడానికి సహాయం చేయవచ్చు. ఏ సమస్యలు వచ్చినా ఒక ఆరోగ్య సంరక్షణ ప్రదాతకు తెలియచేయండి.
- పాదాలకు తేమను ఇవ్వడానికి లోషన్ ను ఉపయోగించడం. కాలి వేళ్ళ మధ్య లోషన్ వెళ్లడాన్ని నివారించాలి.
- కార్న్స్ మరియు కాల్లుసేస్ ను ఒక సానపెట్టు రాయితో సున్నితంగా రుద్ద
- ప్రతి వారం లేదా అవసరమైనప్పుడు కాలి వేలి గోళ్ళను ఒక ఆకృతిలో కటింగ్ చేయడం మరియు ఒక ఎమిరిబోర్డుతో అంచులను సున్నితంగా రుద్దడం.
- ఎల్లప్పుడూ పాదాలను గాయాల నుండి రక్షించడానికి బూట్లు లేదా చెప్పులు ధరించడం. మందపాటి, మృదువైన, అతుకుల లేని సాక్స్ ధరించడం వలన చర్మం చికాకు నిరోధించవచ్చు.
- బాగా సరిపోయే మరియు వేళ్ళు కదిలించడానికి వీలు కల్పించే బూట్లు ధరించడం. మొదట ఒకసారి కేవలం ఒక గంట వాటిని ధరించడం ద్వారా క్రమంగా కొత్త బూట్ల యొక్క కరుకుదనాన్ని తొలగించవచ్చు.
- బూట్లు వేసుకునే ముందు వాటిని జాగ్రత్తగా చూడడం మరియు పాదాలకు హాని కలిగించే చిరుగులు, పదునైన అంచులు, లేదా వస్తువులను లేవని నిర్ధారించుకోడానికి వాటి లోపలి భాగాన్ని తాకి చూడడం.
గుర్తుంచుకోవలసిన పాయింట్స్
డయాబెటిక్ న్యూరోపతీలు అనేవి మధుమేహానికి సర్వసాధారణం అయిన అధిక రక్తంలో గ్లూకోజ్ వంటి అనేక అసాధారణతలు వలన కలిగే నరాల రుగ్మతలు.
న్యూరోపతి శరీరం అంతటా ఉన్న నరములను ప్రభావితం చేసి, చేతులు, భుజాలు, పాదాలు, లేదా కాళ్ళలో తిమ్మిరి మరియు కొన్నిసార్లు నొప్పిని కలిగించవచ్చు మరియు జీర్ణవ్యవస్థ, గుండె, లైంగిక అవయవాలు, మరియు ఇతర శరీర వ్యవస్థలలో సమస్యలను కలిగించవచ్చు.
మొదట చికిత్సలో రక్త గ్లూకోజ్ స్థాయిలను సాధారణ పరిధి లోపలికి తీసుకురావడం ఇమిడి వుంటుంది. మంచి రక్తం గ్లూకోజ్ నియంత్రణ మరిన్ని సమస్యల యొక్క ఆరంభంను నిరోధించడానికి లేదా ఆలస్యం చేయడానికి సహాయపడవచ్చు.
పాద సంరక్షణ చికిత్స యొక్క ఒక ముఖ్యమైన భాగం. న్యూరోపతి కలిగిన వ్యక్తులు, ఏవైనా గాయాల కొరకు ప్రతీరోజు వారి పాదాలను తనిఖీ చెయ్యాలి. చికిత్స చేయని గాయాలు ఇన్ఫెక్షన్ సోకిన పాదాల పుళ్ళు మరియు విచ్ఛేదనం యొక్క ప్రమాదాన్ని పెంచుతాయి.
నరాల నష్టం యొక్క రకాన్ని బట్టి, చికిత్సలో నొప్పి నుండి ఉపశమనం మరియు అవసరమైన విధంగా ఇతర మందులు కూడా ఉంటాయి.
ధూమపానం పాద సమస్యలు మరియు విచ్ఛేదనం యొక్క ప్రమాదాన్ని పెంచుతుంది. ఒక ఆరోగ్య సంరక్షణ ప్రదాత ధూమపానాన్ని వదిలిపెట్టడంలో సహాయం అందించగలగవచ్చు.