మధుమేహం నా పాదాలను ఎలా ప్రభావితం చేయవచ్చు?
మధుమేహం వలన ఏర్పడిన మీ రక్తంలోని చాలా ఎక్కువ గ్లూకోజ్ (చక్కెర అని కూడా పిలువబడుతుంది) నరాలు నష్టం మరియు పేలవమైన రక్త ప్రవాహాన్ని కలిగించవచ్చు, ఇది తీవ్రమైన పాదాల సమస్యకు దారి తీయవచ్చు.
నరాలు దెబ్బతినడం
దెబ్బతిన్న నరములు సంకేతాలను పంపడం ఆపివేయవచ్చు లేదా అవి మరీ నెమ్మదిగా లేదా తప్పు సమయాలల్లో సంకేతాలు పంపవచ్చు. నరాలు దెబ్బతినడం మీ పాదాలు స్పర్శను కోల్పోవడానికి కారణం కావచ్చు. మీ కాళ్ళు మరియు పాదాలల్లో నొప్పి, వేడి లేదా చల్లని అనుభూతిని పొందలేరు. ఒక పుండును కలిగించే మీ సాక్ లోపలి ఒక గులకరాయి స్పర్శ మీకు తెలియకపోవచ్చు. బూట్లు సరిగ్గా వేసుకోకపోవడం వలన ఏర్పడే బొబ్బల స్పర్శ మీకు తెలియకపోవచ్చు.
మీ పాదాల మీద పుళ్ళు ఇన్ఫెక్షన్ కు దారి తీయవచ్చు. మీ రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే, అదనపు గ్లూకోజ్ ఆ పుళ్ళ లోని ఇన్ఫెక్షన్ కు ఆహారాన్ని అందిస్తుంది మరియు మరియు ఇన్ఫెక్షన్ మరింత దారుణంగా మారుతుంది. నరాల నష్టం నొప్పికి కూడా కారణం అవుతుంది మరియు పాద వైకల్యాలు, లేదా మీ పాదాల కండరాలు, ఎముకలు, మరియు ఆకారంలో మార్పులకు దారితీస్తుంది.
పేవలమైన రక్త ప్రవాహం
పేవలమైన రక్త ప్రవాహం అంటే రక్త నాళాల గుండా తగినంత రక్తం మీ కాళ్ళకు మరియు పాదాలకు ప్రవహించదు. పేవలమైన రక్త ప్రవాహం పుండును మరియు ఇన్ఫెక్షన్ మానడాన్ని కఠినతరం చేస్తుంది. ఈ సమస్యను ఫెరిఫేరల్ ఆర్టరీ డిసీజ్, PAD అని కూడా పిలుస్తారు.
కొన్నిసార్లు, చెడు ఇన్ఫెక్షన్ తగ్గదు. ఈ ఇన్ఫెక్షన్ గ్యాంగ్రెనే కలిగించవచ్చు. మీకు గ్యాంగ్రెనే వుంటే, పుండు చుట్టూ ఉన్న చర్మం మరియు టిస్యు చచ్చి పోతుంది. ఆ ప్రాంతం నల్లగా అయి వాసన వస్తుంది.
మధుమేహం వలన ఏర్పడిన మీ రక్తంలోని చాలా ఎక్కువ గ్లూకోజ్ (చక్కెర అని కూడా పిలువబడుతుంది) నరాలు నష్టం మరియు పేలవమైన రక్త ప్రవాహాన్ని కలిగించవచ్చు, ఇది తీవ్రమైన పాదాల సమస్యకు దారి తీయవచ్చు.
మీ బొటనవేలు లేదా పాదం మీది ఏదైనా పుండుకు తక్షణ శ్రద్ద అనేది గ్యాంగ్రెనేను నిరోధించవచ్చు. మీ వైద్యుడు ఇన్ఫెక్టేడ్ కణజాలం కోసి వేయాలని లేక మీకు యాంటి బయోటిక్స్ ఇవ్వాలని నిర్ణ యించవచ్చు. మీ వైద్యుడు రక్తం మీ కాళ్ళకు మరియు పాదాలకు ఎంత బాగా చేరుతుంది అని పరీక్షలు చేయవచ్చు. కొన్ని సార్లు, మీ వైద్యుడు రక్త ప్రసరణ మెరుగు పరుచుటకు మూసుకు పోయిన రక్త నాళాలను శుభ్రం చేయవచ్చు.
ఈ చికిత్సలు పని చేయకపోతే, లేదా మీరు తీవ్రమైన నొప్పి లేదా ఇన్ఫెక్షన్ కలిగి ఉంటే, వైద్యుడు మీ బొటనవేలు, పాదం, లేదా మీ కాలులో ఒక భాగాన్ని విచ్ఛేదనం—మీ శరీరంలో ఒక భాగాన్ని తీసివేయడం— చేయవలసి రావచ్చు. ఒక సర్జన్ ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ ను నిర్వహిస్తాడు. మీరు అనస్థీషియా అందుకుంటారు మరియు ఆపరేషన్ సమయంలో నిద్రపోతారు.
ఏ సాధారణ పాదాల సమస్య లు నొప్పి లేదా ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి?
మీకు మధుమేహం ఉంటే, ఈ క్రింది సాధారణ పాదాల సమస్యలు నడవడంను కష్టతరం చేసే నొప్పి లేదా ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చు. మీకు ఈ సమస్యలలో ఏవైనా ఉంటే, మీ వైద్యుడు నుండి సత్వర చికిత్స తప్పక పొందండి.
గట్టిపడిన చర్మ భాగాలు మరియు ఆనెలు గట్టిపడిన చర్మ భాగాలు మరియు ఆనెలు చర్మం యొక్క మందం పొరలు |
|
బొబ్బ బొబ్బలు పైకి లేచిన మరియు ద్రవంతో నిండిపోయిన చర్మం యొక్క ప్రాంతాలు. |
|
బొటనవేలి లోపలి మూలలకు గోరు పెరగడం. బొటన వెలి లోపలి మూలలకు గోరు పెరగడం జరిగితే అప్పుడు మీ యొక్క బొటనవేలు గోరు చర్మం మూల ల్లోకి పెరుగుతుంది. |
|
బొటన వ్రేలి మొదట్లో ఉబ్బు బొటన వ్రేలి మొదట్లో ఉబ్బు మీ పెద్ద బొటనవేలు యొక్క వెలుపల అంచు వద్ద ఉండే ఒక ఉబ్బెత్తు ప్రాంతం .ఆ ఉబ్బెత్తు ప్రాంతం తీవ్రమయ్యే కొద్దీ, అది ఎక్స్ట్రా ఎముకతో మరియు ద్రవంతో నింపబడుతుంది. |
|
అరికాలి పులిపురులు అరికాలి పులిపురులు అనేవి మీ పాదాల అడుగున చిన్న, మాంసం రంగుతో ఉండే పెరుగుదలలు. కొన్నిసార్లు పులిపురులల్లో చిన్న నల్లని చుక్కలు కనబడుతాయి. |
|
వంకర వ్రేలు వంకర వేళ్ళు మీ పాదం కింద వంపు తిరిగి ఉండే వేళ్ళు. |
|
పొడిబారిన మరియు పగిలిన చర్మంపొడిబారిన మరియు పగిలిన చర్మం గరుకుగా, పొలుసులుగా, మరియు పెచ్చులుగా వుంటుంది. ఒకవేళ మీరు డార్క్ స్కిన్ కలిగి వుంటే మీ చర్మం గ్రేగా ఉండవచ్చు. మీ చర్మం ఎరుపు గా లేదా దురదగా ఉండవచ్చు |
|
అథ్లెట్’స్ ఫుట్అథ్లెట్’స్ ఫుట్ అనేది దురద, బర్నింగ్, రెడ్ నెస్, మరియు మీ చర్మం పగుళ్లకు కారణమయ్యే ఒక ఫంగస్. ఈ ఫంగస్ మీ అరికాళ్ళు మరియు మీ వేళ్ళ మధ్య పెరుగుతుంది. |
|
ఫంగల్ ఇన్ఫెక్షన్కాలిగోళ్ళపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వాటిని మందంగా చేస్తుంది, కత్తరించడాన్ని కఠినతరం చేస్తుంది, పసుపు పచ్చ, ఆకుపచ్చ, గోధుమ లేదా నల్లగా కనపడేటట్లు చేస్తుంది. ఒక గోరు పడిపోవచ్చు కూడా. . |
|
మీ పాదాల యొక్క ఇన్ఫెక్షన్ చిహ్నాలలో ఇవి వుంటాయి
- చీము
- ఎరుపు
- పెరుగుతున్న నొప్పి
- వెచ్చని చర్మం
మీకు ఈ సంకేతాలలో ఏవైనా ఉంటే వెంటనే మీ మీ వైద్యుడికి కాల్ చేయండి లేదా కలవండి.
మధుమేహం నా పాదాల ఆకారంను ఎలా మార్చవచ్చు?
మధుమేహం ద్వారా ఏర్పడే నరాల నష్టం మీ పాదాల ఆకారంలో మార్పులకు దారి తీయవచ్చు. దెబ్బతిన్న నరాలు మీ పాదాల కండరములకు కదలిక గురించిన సందేశాలను పంపలేవు. మీ పాదాల కండరములు బలహీనమై అసమతుల్యంగా మారుతుంది. మీ పాదాలు మరియు కాలి యొక్క ఎముకలు మారవచ్చు.
మధుమేహం ద్వారా ఏర్పడే నరాల నష్టం చార్కొట్’స్ ఫుట్ కు కూడా కారణం అవుతుంది, దీనిలో మీ పాదాల కీళ్లు మరియు మృదువైన కణజాలం నాశనం అవుతుంది.
చార్కొట్’స్ ఫుట్ ప్రారంభ దశలలో, మీ కీళ్ళు గట్టిగా ఉంటాయి మరియు ద్రవాన్ని సేకరిస్తాయి. సమస్యను త్వరగా తీవ్రతరం కావచ్చు. మీ ఎముకలు స్థలం నుండి పక్కకు జరిగి, మీ కాలు చూసేదానికి వికృతముగా కనపడవచ్చు.
మీకు నొప్పి అనిపించకపోవచ్చు, కాబట్టి మీరు మీ పాదాల మీద నడుస్తూ ఉండి ఈ సమస్యను అధ్వాన్నంగా చేయవచ్చు. అది తెలియకుండా, మీరు కీళ్ళను గాయపరచవచ్చు మరియు నష్టపరచవచ్చు లేదా మీ పాదాలలోని ఎముక విరుగగొట్టవచ్చు.
చార్కొట్’స్ పాదం లక్షణాలు త్వరగా కనిపిస్తాయి మరియు వీటిలో ఈ క్రిందివి ఉంటాయి
- వెచ్చని, ఎరుపు చర్మం
- వాపు
- నొప్పి
మీ వైద్యుడు మొదట మీ పాదాలను ఒక పాత్రలో ఉంచి మరియు మీరు నడవడానికి ఒక వూతకర్ర లేదా ఒక వీల్ చైర్ మాత్రమే ఉపయోగించమని అడగడం ద్వారా చార్కొట్’స్ ఫుట్ కు చికిత్స చేస్తాడు. మీ ఎముకల స్థానాలను సరి చేయటానికి మీకు శస్త్ర చికిత్స అవసరం కావచ్చు.
చార్కొట్’స్ ఫుట్
ప్రత్యేక బూట్లు లేదా షూ ఇన్సర్ట్స్ నా పాదాలకు ఎలా సహాయపడతాయి?
గాయపడిన పాదాలు లేక ఆకారం మారిన పాదాల చుట్టూ మెత్తగా సరిపోయి మరియు రక్షించే విధంగా ప్రత్యేక బూట్లు లేదా షూ ఇన్సర్ట్స్ ను తయారు చేయవచ్చు.
నేను ఎంత తరచుగా పాదాల పరీక్ష చేయించుకోవాలి?
పాదాల పరీక్ష కోసం కనీసం సంవత్సరంనకు ఒకసారి లేదా మీకు పాదాల సమస్యలు ఉంటే మరింత తరచుగా మీ వైద్యుడ్ని కలవండి. పరీక్ష సమయంలో, మీ వైద్యుడు
- సమస్యల యొక్క సంకేతాల కోసం మీ పాదాన్ని చూస్తాడు, ముఖ్యంగా మీకు నరాల నష్టం వుంటే
- పాదాలలో స్పర్శ అనుభూతిని పరీక్ష చేస్తాడు
- రక్తం మీ కాళ్ళు మరియు పాదాలలోకి ఎంత బాగా ప్రవహిస్తుందో పరీక్ష చేస్తాడు
- మీ పాదాల కోసం ఎలా శ్రద్ద తీసుకోవాలో మీకు చూపిస్తాడు
- ప్రత్యేక బూట్లు లేదా షూ ఇన్సర్ట్స్ మీ పాదాలలను ఆరోగ్యంగా ఉంచుటకు సహాయ పడుతాయా అని నిర్ణయిస్తాడు
- ఒక వేళ మీరు సొంతంగా గోళ్ళను ట్రిమ్ చేసుకోలేకపోతే ట్రిమ్ చేస్తాడు
ప్రతీ చెకప్ సమయంలో మీ పాదాల సంరక్షణ కోసం మీ వైద్యుడికి సహాయం చేయండి. మీ బూట్లు మరియు సాక్స్ తీసివేసి ప్రతీ తనిఖీని ప్రారంభించండి. మీకు వున్న ఏవైనా పాదాల సమస్యల గురించి మీ వైద్యునికి చెప్పండి.
ధూమపానం నా పాదాలను ఎలా ప్రభావితం చేస్తుంది?
ధూమపానం అనేది ఆమ్లజని మరియు పోషకాలతో మీ నరములను పోషించే రక్త నాళాలను ఇరుకుగా మరియు గట్టిగా చేయవచ్చు. నరాల నష్టం మరియు పేవలమైన రక్త ప్రవాహం తీవ్రమైన పాదాల సమస్యలకు కారణమవవచ్చు.
ధూమపానం మరియు మధుమేహం ప్రమాదకరమైన ఒక కలయిక. ధూమపానం పలు మధుమేహ సమస్యల కొరకు మీ ప్రమాదాలను పెంచుతుంది. మీరు ధూమపానంను విడిచి పెడితే,
- మీరు గుండె పోటు, స్ట్రోక్, నరాల వ్యాధి, కిడ్నీ వ్యాధి, మరియు అంగ విచ్ఛేదనం యొక్క మీ ప్రమాదాన్ని తగ్గిస్తారు
- మీ కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు స్థాయిలు మెరుగుపడవచ్చు
- మీ రక్త ప్రసరణ మెరుగు పడుతుంది
నా పాదాలను ఎలా ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు?
మీరు ఈ దశలను పాటించడం ద్వారా మీ పాదాలను ఆరోగ్యవంతంగా ఉండేలా చేయవచ్చు:
- మీరు పొగ త్రాగుతా ఉంటే, మానుకునేందుకు సహాయం పొందండి.
- పాదాల పరీక్ష కోసం కనీసం సంవత్సరంనకు ఒకసారి లేదా మీకు పాదాల సమస్యలు ఉంటే మరింత తరచుగా మీ వైద్యుడ్ని కలవండి. మీ పాదాలలో స్పర్శ యొక్క భావం కోసం మరియు రక్తం మీ పాదాలకు ఎంత బాగా ప్రవహిస్తున్నది అని మీ వైద్యుడు తనిఖి చేస్తాడు.
- మీ రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలు సాధ్యమైనంత వరకు మీ లక్ష్యంనకు దగ్గరగా ఉంచండి. మీ వైద్యుడు మీ లక్ష్య రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలు ఏర్పాటు చేయుటకు మీతో పనిచేస్తాడు మరియు మీ సంఖ్యలు చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉంటే మీరు ఏమి చేయలయును అనేది నేర్పిస్తాడు.
- కోతలు, పుళ్ళు, బొబ్బలు, ఎరుపు, దద్దులు, ఇన్ఫెక్టేడ్ కాలి గోళ్ళు లేదా ఇతర సమస్యల కొరకు ప్రతీ రోజు మీ పాదాలను తనిఖీ చేసుకోండి. మీకు నొప్పి తెలియకున్నాకూడా, మీరు తీవ్రమైన పాదాల సమస్యలు కలిగి వుండవచ్చు. ఒక వేళ నరాల నష్టం లేదా పేవలమైన రక్త ప్రవాహం కలిగి ఉంటే ప్రతీ రోజు తనిఖీ మరింత ఎక్కువ ముఖ్యం. మీ పాదాలను వంగి చూడటానికి మీకు ఇబ్బందిగా ఉంటే, సహాయంగా ఒక అద్దంను ఉపయోగించండి.
మీరు మీకు సహాయం చేయమని ఒక కుటుంబ సభ్యుడ్ని లేదా స్నేహితుడ్ని కూడా అడగవచ్చు. మీకు ఏదైనా పాద సమస్య వుంటే వెంటనే మీ వైద్యునికి కాల్ చేయండి లేదా కలవండి.
ప్రతీ రోజు మీ పాదాన్ని తనిఖీ చేయండి.
- మీ పాదాలను వేడి నీటితో కాకుండా వెచ్చని నీటితో ప్రతీ రోజు కడగండి. మోచేయితో లేదా థర్మామీటర్ తో ఉష్ణోగ్రత పరిక్షించుకోండి—90 నుంచి 95 డిగ్రీలు సురక్షితం. మీ చర్మం ఎండిపోతుంది కాబట్టి మీ పాదాలను నాన పెట్టవద్దు. మీ కాలి వేళ్ళ మధ్య పొడిగా ఉండేటట్లు చూసుకోండి. మీ కాలివేళ్ళ మధ్య పొడిగా ఉంచుకొనుటకు టాల్కం పౌడర్ ను లేదా కార్న్ స్టార్చ్ ను ఉపయోగించండి.
- మీ చర్మంను మృదువుగా మరియు నునుపుగా ఉంచుకోండి. మీ పాదాల యొక్క పైన కింద స్నానం చేసి తుడుచుకున్న తరువాత లోషన్, క్రీమ్ లేదా పెట్రోలియం జెల్లీ పల్చని పొరగా రుద్దండి. మీకు ఒక ఇన్ఫెక్షన్ రావచ్చు కాబట్టి మీ కాలి వేళ్ళ మధ్యన ఏదీ పెట్టవద్దు.
- ఆనెలు మరియు కాల్లుసేస్ ను మృదువుగా ఉంచుకోండి. మీ చర్మం చిరిగిపోకుండా నిదానంగా ఒకే దిశలో మాత్రమే రుద్దండి. ఆనెలు మరియు కాల్లుసేస్ ను కోయవద్దు. రేజర్ బ్లేడ్లను, కార్న్ ప్లాస్టర్లు, లేదా ద్రవ కార్న్ మరియు కాల్లుసేస్ రిమూవర్స్ వాడవద్దు-అవి మీ చర్మంను దెబ్బతీయవచ్చు.
- ప్రతీ వారం లేదా అవసరమైనప్పుడు మీ గోళ్ళను ట్రిమ్ చేయండి. మీ వైద్యుడుతో మీ గోళ్ళను ట్రిమ్ చేయించుకోండి, ఒకవేళ
- మీకు బాగా కనిపించకపోతే
- మీరు మీ పాదాలను చేరుకోలేకపోతే
- మీ గోళ్ళు మందంగా లేదా పసుపు పచ్చగా ఉంటే
- మీకు లోపలికి పెరిగిన కాలి గోరు ఉంటే
మీ కాలివేలి గోళ్ళను చూడగలిగి చేరుకోగలిగితే, వాటిని క్లిప్పేర్స్ తో స్నానం తర్వాతా ట్రిమ్ చేయండి మరియు మీ పాదాన్ని పొడిగా ఉంచుకోండి. కాలి వేళి గోళ్ళను చక్కగా వంపుగా ట్రిమ్ చేయండి మరియు వాటిని ఎమిరి బోర్డు లేదా నైల్ ఫైల్ తో నునుపుగా చేయండి. మీ కాలివేలి మూలలలోకి కట్ చేయవద్దు.
కాలివేలి గోళ్ళను చక్కగా వంపుగా ట్రిమ్ చేయండి మరియు వాటిని ఎమిరి బోర్డు లేదా నైల్ ఫైల్ తో నునుపుగా చేయండి.
మీ పాదాలను రక్షించుకోవడానికి అన్ని సమయాల్లో బూట్లు మరియు సాక్స్ లను ధరించండి. లోపల కూడా వట్టి కాళ్ళతో నడవవద్దు, ఎందుకంటే ఏదో ఒక దానిపై కాలు వేసి మీ పాదాలను బాధించడం సులభం. బొబ్బలు మరియు పుండ్ల నుండి రక్షించుకొనుటకు సహాయపడేందుకు ఎల్లప్పుడూ మీ షూలతో సాక్స్ లను, స్టాకింగ్స్, లేదా నైలాన్లు ధరించండి. బాగా సరిపోయిన శుభ్రమైన, తేలికైన ప్యాడేడ్ సాక్స్ లను ఎంచుకోండి. అతుకులు లేనటువంటి సాక్స్ లు మంచివి. మోకాలు పొడవు వుండే మోకాలు కింద చాలా బిగుతుగా వుండే సాక్స్ లను ధరించవద్దు. షూలు వేసుకునే ముందు వాటిల్లో ఏవైనా పదునైన అంచులు లేదా వస్తువులు లేవని మరియు లైనింగ్ నునుపుగా ఉందని నిర్ధారించడానికి మీ షూల లోపలి భాగాన్ని తనిఖీ చేయండి.
- బాగా సరిపోయే బూట్లను ధరించండి. బాగా సరిపోయే బూట్లు తీవ్రమైన పాదాల సమస్యలను నిరోధించుటకు మీకు సహాయ పడుతాయి. రోజు చివరలో బూట్లను కొనండి ఎందుకంటే అప్పుడు మీ పాదాలు కొద్దిగా పెద్దగా ఉంటాయి—పాదాలు పగటి సమయాల్లో ఉబ్బిపోగలవు. బూట్లను కొనేటప్పుడు అవి ప్రారంభం నుండి బాగా అనిపించట్టు మరియు మీ కాలి వేళ్ళ కోసం తగినంత స్థలాన్ని కలిగి ఉండేటట్టు చూసుకోండి. పాయింటెడ్ టోస్ లేదా హై హీల్స్ గల బూట్లను కొనవద్దు. అవి మీ కాళ్ళ మీద చాలా ఎక్కువ ఒత్తిడిని ఉంచుతాయి. ఓపెన్-టోడ్ బూట్లు లేదా శ్యాండల్స్ వదిలి పెట్టండి. రోజు ధరించడానికి అథ్లెటిక్ లేదా వాకింగ్ షూలు మంచివి. అవి మీ పాదాలకు మద్దతిస్తాయి మరియు షూ లోపలి వైపు చుట్టూ గాలి ఆడడానికి అనుమతిస్తాయి. వినైల్ లేదా ప్లాస్టిక్ బూట్లు ఎప్పుడూ ధరించవద్దు, ఎందుకంటే అవి షూ లోపల గాలి ఆడకుండా చేస్తాయి. బూట్లను నెమ్మదిగా వేసుకోండి. మొదటి కొన్ని వారాలు వాటిని ప్రతీ రోజు 1 నుండి 2 గంటలు ధరించండి.
- వేడి మరియు చల్లదనం నుండి మీ పాదాలను రక్షించండి. వేడి పేవ్మెంట్ మీద లేదా బీచ్ వద్ద బూట్లు ధరించండి. ఎండ వలన చర్మం కమిలిపోకుండా మీ పాదాల మీద సన్ స్క్రీన్‌ని పూయండి. మీ పాదాలను రేడియేటర్లు మరియు ఓపెన్ ఫైర్లు నుండి దూరంగా వుంచండి. మీ పాదాల మీద వేడి నీటి సీసాలు లేదా హీటింగ్ ప్యాడ్లు పెట్టవద్దు. మీ పాదాలకు రాత్రి చలి తగిలితే సాక్స్ లను ధరించండి. శీతాకాలంలో మీ పాదాలను వెచ్చగా ఉంచుటకు లైన్డ్ బూట్లను ధరించండి. చలి వాతావరణంలో మంచుతాకిడి నుండి మీ పాదాలను రక్షించుకొనుటకు మీ పాదాలను తరచుగా తనిఖీ చేసుకోండి.
- మీ పాదాలలో రక్త ప్రవాహం వుండే విధంగా వుంచండి. మీరు కూర్చొని వున్నప్పుడు మీ కాలును పైకి పెట్టండి. మీ కాలి వేళ్ళను 5 నిముషాలు రోజుకు రెండు నుండి మూడు సార్లు పైకి కిందకు తిప్పండి. మీ పాదాలలో మరియు కాళ్ళల్లో రక్త ప్రవాహం పెరుగుటకు మీ మడమను పైకి, కిందకు మరియు లోపలికి, బయటకు కదిలించండి. మీ కాళ్లును ఎక్కువ సమయం పాటు మడచవద్దు.
- మీ పాదాలకు సులువుగా వుండే శారీరక కార్యక్రమాలను ఎంచుకోండి. వేగంగా నడవడం, నాట్యం, ఈత, మరియు బైస్క్లింగ్ మీ పాదాలకు సులువుగా వుండే శారీరకకు శ్రమకు మంచి రూపాలు. మీ పాదాలకు కఠినంగా వుండే రన్నింగ్ మరియు జంపింగ్ వంటి కార్యకలాపాలను నివారించండి. బాగా సరిపోయే మరియు మంచి మద్దత్తు ఇచ్చే అథెలిటిక్ షూలను ధరించండి.
వేగంగా నడవడం అనేది మీ పాదానికి సులభమైన ఒక మంచి శారీరక కార్యక్రమం.