హైపర్ థైరాయిడిజం అంటే ఏమిటి?
హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంధి శరీర అవసరాలకు కంటే ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ ను తయారు చేసినప్పుడు వచ్చే ఒక రుగ్మత. హైపర్ థైరాయిడిజం కొన్నిసార్లు థైరోటోక్సికోసిస్ అని పిలవబడుతుంది, ఇది రక్తంలోని చాలా ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ కొరకు వాడే సాంకేతిక పదం. థైరాయిడ్ హార్మోన్లు శరీరం అంతటా రక్తప్రవాహంలో ప్రవహిస్తాయి మరియు శరీరంలోని దాదాపు ప్రతి కణజాలం మరియు కణం మీద పనిచేస్తాయి. హైపర్ థైరాయిడిజం శరీరం యొక్క అనేక విధులు వేగవంతం కావడానికి కారణమవుతుంది.
థైరాయిడ్ అంటే ఏమిటి?
థైరాయిడ్ 2 అంగుళాల పొడవు, సీతాకోకచిలుక ఆకారంలో ఉండే, 1 ఔన్స్ కంటే తక్కువ బరువు ఉండే ఒక గ్రంధి. మెడ ముందు స్వరపేటిక లేదా వాయిస్ బాక్స్ క్రింద ఉంటుంది. ఇది వాయు నాళము యొక్క రెండు వైపులా ఒకటి చొప్పున రెండు లంబికలను కలిగి వుంటుంది. థైరాయిడ్ అనేది ఎండోక్రైన్ వ్యవస్థను తయారు చేసే గ్రంధులలో ఒకటి. ఎండోక్రైన్ వ్యవస్థ యొక్క గ్రంధులు హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి మరియు నిల్వ చేస్తాయి మరియు రక్తప్రవాహంలోకి వాటిని విడుదల చేస్తాయి. అప్పుడు హార్మోన్లు శరీరం గుండా ప్రయాణిస్తాయి మరియు శరీరం యొక్క కణాల క్రియాశీలతను నిర్దేశిస్తాయి.
థైరాయిడ్ గ్రంధి ట్రైఅయోడోథైరోనిన్ (T3) మరియు థైరాక్సిన్ (T4) అనే రెండు థైరాయిడ్ హార్మోన్లను తయారు చేస్తుంది. T3 అనేది T4 నుండి తయారు చేయబడిన, మరియు కణజాలాన్ని నేరుగా ప్రభావితం చేసే, ఎక్కువ చురుకైన హార్మోన్. థైరాయిడ్ హార్మోన్లు జీవక్రియ, మెదడు అభివృద్ధి, శ్వాస, గుండె మరియు నాడీ వ్యవస్థ విధులు, శరీర ఉష్ణోగ్రత, కండరాల బలం, చర్మం పొడితనం, ఋతు చక్రాలు, బరువు, మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి.
థైరాయిడ్ యొక్క థైరాయిడ్ హార్మోన్లు అయిన T3 మరియు T4 యొక్క ఉత్పత్తి అనేది మెదడులోని పిట్యూటరీ గ్రంధి ద్వారా తయారు చేయబడిన థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH) ద్వారా నియంత్రించబడుతుంది.
థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అనేది మెదడులోని పిట్యూటరీ గ్రంధి ద్వారా తయారు చేయబడిన థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH) ద్వారా నియంత్రించబడుతుంది. రక్తంలోని థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు, పిట్యూటరీ ఎక్కువ TSH ను విడుదల చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, పిట్యూటరీ TSH ఉత్పత్తిని తగ్గించడం ద్వారా స్పందిస్తుంది.
ఏది హైపర్ థైరాయిడిజంను కలిగిస్తుంది?
హైపర్ థైరాయిడిజం కు ఈ క్రింది వాటితో సహా పలు కారణాలు ఉన్నాయి
- గ్రేవ్స్ వ్యాధి
- థైరాయిడ్ నోడ్యూల్స్
- థైరాయిడైటిస్, లేదా థైరాయిడ్ యొక్క వాపు
- చాలా ఎక్కువ అయోడిన్ తీసుకోవడం
- తక్కువ చురుకైన థైరాయిడ్ ను చికిత్స చేయడానికి ఉపయోగించబడే సింథటిక్ థైరాయిడ్ హార్మోన్ తో ఎక్కువ మందు తీసుకోవడం
అరుదుగా, హైపర్ థైరాయిడిజం ఒక పిట్యూటరీ అడెనోమా వలన కలుగుతుంది, ఇది పిట్యూటరీ గ్రంధి యొక్క కాన్సర్ కాని గడ్డ. ఈ సందర్భంలో, హైపర్ థైరాయిడిజం చాలా ఎక్కువ TSH కారణంగా సంభవిస్తుంది.
గ్రేవ్స్ వ్యాధి
టాక్సిక్ డిఫ్యూస్ గోయిటర్ అని కూడా పిలవబడే గ్రేవ్స్ వ్యాధి, యునైటెడ్ స్టేట్స్ లో థైరాయిడిజం యొక్క అత్యంత సాధారణ కారణం. గ్రేవ్స్ వ్యాధి ఒక స్వయం ప్రతిరక్షక రుగ్మత. సాధారణంగా, రోగనిరోధక వ్యవస్థ బాక్టీరియా, వైరస్లు మరియు ఇతర శక్తివంతమైన హానికారక అన్య పదార్ధాలను గుర్తించి, నాశనం చెయ్యటం ద్వారా శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది. కానీ స్వయం ప్రతిరక్షక వ్యాధులలో, రోగనిరోధక వ్యవస్థ శరీరం యొక్క సొంత కణాలు మరియు అవయవాల పై దాడి చేస్తుంది.
గ్రేవ్స్ వ్యాధి ఉన్నప్పుడు, రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ కణాలకు జోడించబడే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ ఇమ్యునోగ్లోబిన్ (TSI), అనే ఒక ప్రతిరక్షక పదార్థాన్ని తయారు చేస్తుంది. TSI TSH యొక్క చర్యను అనుకరిస్తుంది మరియు చాలా ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ ను తయారు చేసేలా థైరాయిడ్ ను ఉత్తేజితం చేస్తుంది.
థైరాయిడ్ నోడ్యూల్స్
అడెనోమాలు అని కూడా పిలువబడే థైరాయిడ్ నోడ్యూల్స్ అనేవి థైరాయిడ్ లోని గడ్డలు. థైరాయిడ్ నోడ్యూల్స్ సర్వసాధారణం మరియు అవి సాధారణంగా కాన్సర్ కు సంబంధించినవి కావు. సుమారు 3 నుంచి 7 శాతం మంది భారతీయులు వాటిని కలిగి ఉన్నారు. అయితే, నోడ్యూల్స్ అతి ఉత్తేజకరంగా మారి చాలా ఎక్కువ హార్మోన్ ను ఉత్పత్తి చేయవచ్చు.
ఒక ఏకైక అతి ఉత్తేజక నోడ్యూల్ ను ఒక టాక్సిక్ అడెనోమా అని అంటారు. బహుళ అతి ఉత్తేజక నోడ్యూల్స్ ను టాక్సిక్ మల్టీ నోడ్యూలర్ గాయిటర్ అని అంటారు. తరచుగా ఎక్కువ వయస్సున్న పెద్దవారిలో కనుగొనబడే టాక్సిక్ మల్టీ నోడ్యులర్ గాయిటర్, పెద్ద మొత్తంలో అదనపు థైరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేయగలదు.
థైరాయిడైటిస్
నిల్వ చేయబడిన థైరాయిడ్ హార్మోన్ థైరాయిడ్ గ్రంథి నుండి బయటకు లీక్ అయ్యేందుకు థైరాయిడైటిస్ కారణమవుతుంది. మొదట, 1 లేదా 2 నెలల పాటు కొనసాగే హైపర్ థైరాయిడిజంకు దారితీస్తూ, ఆ లీకేజ్ రక్తంలో హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. అప్పుడు థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నప్పుడు, చాలా మందిలో థైరాయిడ్ పూర్తిగా నయం కాకముందు హైపోథైరాయిడిజం అభివృద్ధి అవుతుంది.
హైపోథైరాయిడిజం తరువాత అనేక రకాల థైరాయిడైటిస్ లు హైపర్ థైరాయిడిజంను కలిగించవచ్చు:
సబ్అక్యూట్ థైరాయిడైటిస్. ఈ పరిస్థితి థైరాయిడ్ యొక్క బాధాకరమైన వాపు మరియు వ్యాకోచంను కలిగి ఉంటుంది. సబ్అక్యూట్ థైరాయిడైటిస్ కు కారణం ఏమిటి అని నిపుణులకు ఖచ్చితంగా తెలియదు, కానీ అది వైరల్, లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో సంబంధం కలిగి ఉండొచ్చు.
పోస్ట్ పార్టం థైరాయిడైటిస్. ఈ రకమైన థైరాయిడైటిస్ ఒక మహిళ జన్మనిచ్చిన తర్వాత అభివృద్ధి అవుతుంది. ఎక్కువ సమాచారం కోసం, “గర్భం మరియు థైరాయిడ్ పరిస్థితులతో ఏమవుతుంది?” అనే పేరు గల విభాగాన్ని చూడండి.
సైలెంట్ థైరాయిడైటిస్. థైరాయిడ్ వ్యాకోచించగలిగినప్పటికీ, పోస్ట్ పార్టం థైరాయిడైటిస్ లాగానే, ఇది నొప్పిలేకుండా ఉన్న కారణంగా ఈ రకమైన థైరాయిడైటిస్ ను “సైలెంట్” అని పిలుస్తారు. పోస్ట్ పార్టం థైరాయిడైటిస్ వలె, సైలెంట్ థైరాయిడైటిస్ బహుశా ఒక స్వయం రక్షక స్థితి మరియు కొన్నిసార్లు శాశ్వత హైపోథైరాయిడిజంగా అభివృద్ధి అవుతుంది.
చాలా ఎక్కువ అయోడిన్ ను తీసుకోవడం
థైరాయిడ్ హార్మోన్ ను తయారు చేయడానికి, థైరాయిడ్ అయోడిన్ ను ఉపయోగిస్తుంది, కాబట్టి సేవించబడిన అయోడిన్ యొక్క పరిమాణం, థైరాయిడ్ తయారు చేసే థైరాయిడ్ హార్మోన్ యొక్క పరిమాణాన్ని ప్రభావితం చేస్తుంది. కొందరు వ్యక్తుల్లో, పెద్ద మొత్తాలలో అయోడిన్ ను తీసుకోవటం అనేది థైరాయిడ్ అదనపు థైరాయిడ్ హార్మోన్ ను తయారు చేయడానికి కారణం కావచ్చు.
కొన్నిసార్లు అయోడిన్ యొక్క గుర్తించదగిన పరిమాణాలు గుండె సమస్యల చికిత్సలో ఉపయోగించే అమియోడారోన్ వంటి మందులలో ఉంటాయి లేదా సీవీడ్ (సముద్రపు పాచి) ను కలిగి ఉండే సప్లిమెంట్స్లో ఉంటాయి. కొన్ని దగ్గు మందులు కూడా పెద్ద మొత్తంలో అయోడిన్ ను కలిగి ఉంటాయి.
సింథటిక్ థైరాయిడ్ హార్మోన్ తో ఎక్కువ మందు తీసుకోవడం
హైపో థైరాయిడిజం కొరకు సింథటిక్ థైరాయిడ్ హార్మోన్ ను తీసుకునే కొంతమంది చాలా ఎక్కువ తీసుకోవచ్చు. సింథటిక్ థైరాయిడ్ హార్మోన్ ను తీసుకునే వారు తమ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను తనిఖీ చేయించుకోవడానికి, కనీసం సంవత్సరానికి ఒకసారి వారి వైద్యుడిని కలవాలి మరియు మోతాదు గురించిన డాక్టర్ యొక్క సూచనలను అనుసరించాలి.
కొన్ని ఇతర మందులు కూడా రక్తంలో హార్మోన్ స్థాయిలను పెంచడానికి సింథటిక్ థైరాయిడ్ హార్మోన్ తో కలువవచ్చు. కొత్త మందులను ప్రారంభించేటప్పుడు సింథటిక్ థైరాయిడ్ హార్మోన్ తీసుకునే వారు పరస్పర చర్యల గురించి తమ వైద్యుడిని అడగాలి.
హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలు ఏమిటి?
హైపర్ థైరాయిడిజం వ్యక్తి నుండి వ్యక్తికి మారే అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. హైపర్ థైరాయిడిజం యొక్క కొన్ని సాధారణ లక్షణాలు
- భయము లేదా చికాకు చిహ్నాలు
- అలసట లేదా కండరాల బలహీనత
- వేడి సరిపడక పోవడం
- నిద్రపోవడంలో ఇబ్బంది
- చేతిలో అదిరిపాట్లు
- వేగవంతమైన మరియు క్రమం లేని హృదయ స్పందన
- తరచుగా ప్రేగు కదలికలు లేదా అతిసారం
- బరువు కోల్పోవడం
- మానసిక కల్లోలం
- విస్తరించబడిన థైరాయిడ్ అయిన గాయిటర్, ఇది మెడ ఉబ్బినట్టుగా కనబడటానికి కారణం కావచ్చు మరియు సాధారణ శ్వాస మరియు మింగడంలో జోక్యం చేసుకోగలదు
ఎవరిలో హైపర్ థైరాయిడిజం అభివృద్ధి చెందే అవకాశం ఉంది?
పురుషుల కంటే మహిళలలో హైపర్ థైరాయిడిజం అభివృద్ధి అయ్యే అవకాశం రెండు నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కొన్ని నిర్దిష్ట కారకాలు థైరాయిడ్ వ్యాధులు అభివృద్ధి అయ్యే అవకాశాలను పెంచవచ్చు. ప్రజలకు మరింత క్రమం తప్పని టెస్టింగ్ అవసరం ఉండవచ్చు, ఒకవేళ వారు
- ఇంతకు ముందు గాయిటర్ లేదా థైరాయిడ్ శస్త్రచికిత్స వంటి ఒక థైరాయిడ్ సమస్యను కలిగి ఉండింటే
- థైరాయిడ్ వ్యాధి గల కుటుంబ చరిత్రను కలిగి ఉంటే
- అతిహానికరమైన రక్తహీనత, ఒక B12 లోపం; టైప్ 1 మధుమేహం; లేదా ప్రాథమిక ఎడ్రెనల్ లోపం, ఒక హార్మోన్ సంబంధమైన రుగ్మతను కలిగి ఉంటే
- కెల్ప్ వంటి అయోడిన్ కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తింటే లేదా గుండె మందు అయిన అమియోడారోన్ వంటి అయోడిన్ కలిగిన ఔషధాలను వాడితే
- 60 కంటే పైబడిన వయసు కలవారైతే
- గర్భిణీగా ఉంటే లేదా గత 6 నెలల్లో శిశువుకు జన్మినిచ్చి వుంటే
ప్రజలు థైరాయిడ్ సమస్యలను -ముఖ్యంగా ఉప రోగసంబంధ సమస్యలు-వెలికితీయడంలో సహాయం చేయడానికి తరచూ పరీక్షలు చేయించుకోవాలి. ఉప రోగసంబంధ అంటే ఒక వ్యక్తి స్పష్టమైన లక్షణాలను కలిగి ఉండడు అని అర్థం. కొంతమంది వైద్యులు ఉప రోగసంబంధ హైపర్ థైరాయిడిజంకు తక్షణమే చికిత్స చేస్తారు. ఇతరులు దీనిని చికిత్స చేయకుండా వదిలి పెట్టడానికి ఇష్టపడతారు, కానీ పరిస్థితి తీవ్రమవుతున్నప్పుడు సంకేతాల కొరకు తమ రోగులను పర్యవేక్షిస్తారు.
వయసు పెరిగిన జనాభాలో హైపర్ థైరాయిడిజం
హైపర్ థైరాయిడిజం 60 సంవత్సరాలు పైబడిన వయస్సు వున్న వారిలో సర్వసాధారణం మరియు తరచుగా థైరాయిడ్ నోడ్యూల్స్ వలన కలుగుతుంది. ఎక్కువ వయస్సున్న పెద్దవారిలో ఎల్లప్పుడూ రుగ్మత యొక్క సాధారణ లక్షణాలు కనిపించవు. ఈ కారణం వలన ఈ వయస్సు ఉన్నవారిలో హైపర్ థైరాయిడిజం అనేది కొన్నిసార్లు డిప్రెషన్ లేదా డిమెన్షియా గా — మేధో శక్తులు కోల్పోవడం, కొన్నిసార్లు మానసిక అశాంతి మరియు వ్యక్తిత్వ మార్పులతో —తప్పుగా నిర్ధారణ చేయబడుతుంది.
ఉదాహరణకు, హైపర్ థైరాయిడిజం గల వృద్ధులు అనాసక్తంగా లేదా సామాజికంగా దూరంగా వున్నట్టు కనిపించవచ్చు. హైపర్ థైరాయిడిజం ఉన్న ఎక్కువ వయస్సు గల పెద్దవారు తమ ఆకలిని కోల్పోవచ్చు, అయితే ఈ స్థితిలో ఉన్న తక్కువ వయస్సు గలవారు పెరిగిన ఆకలిని కలిగి ఉండే అవకాశం వుంది. ఎక్కువ వయస్సున్న పెద్దవారు వివిధ శారీరక లక్షణాలను కూడా కలిగి ఉండవచ్చు మరియు ఉప రోగసంబంధ హైపర్ థైరాయిడిజం నుంచి చిన్నవయస్సున్న రోగుల కంటే ఎక్కువ ప్రమాదంలో ఉండవచ్చు.
60 సంవత్సరాల వయస్సు పైబడిన ప్రజల కోసం, ఉప రోగసంబంధ హైపర్ థైరాయిడిజం గుండె ఆగిపోవడం లేదా స్ట్రోక్ కు దారి తీయగల, ఆట్రియల్ ఫిబ్రిలేషన్ అని పిలువబడే ఒక పరిస్థితి అయిన, ఒక వేగవంతమైన, క్రమం లేని హృదయ స్పందన అభివృద్ధి అయ్యే వారి అవకాశాన్ని పెంచుతుంది. చికిత్స చేయబడని హైపర్ థైరాయిడిజం ఎముక సన్నబడే వ్యాధి అయిన ఆస్టియోపొరోసిస్ (బోలు ఎముకల వ్యాధి) ను వేగవంతం చేయగలదు, ముఖ్యంగా మహిళల్లో, మరియు ఎముకలు విరిగే అవకాశములను పెంచుతుంది.
గర్భం మరియు థైరాయిడ్ పరిస్థితులతో ఏం జరుగుతుంది?
హైపర్ థైరాయిడిజం. గర్భధారణ సమయంలో, హైపర్ థైరాయిడిజం సాధారణంగా గ్రేవ్స్ వ్యాధి వలన కలుగుతుంది మరియు ప్రతి 500 గర్భాలలో ఒక దానిలో సంభవిస్తుంది. అనియంత్రిత హైపర్ థైరాయిడిజం గర్భస్రావం, ముందస్తు డెలివరీ మరియు ఆలస్య గర్భధారణ సమయంలో రక్తపోటులో ఒక ప్రమాదకరమైన పెరుగుదల అయిన ప్రీఎక్లంప్సియా యొక్క అవకాశాన్ని పెంచుతుంది.
ఒక నవజాత శిశువులో హైపర్ థైరాయిడిజం అనేది హృదయ వైఫల్యం దారితీయగల వేగవంతమైన హృదయ స్పందన; పుర్రె లోని మెత్తని ప్రదేశము త్వరగా మూసుకోవడం; పేలవమైన బరువు పెరుగుదల; చికాకు చిహ్నాలు; మరియు కొన్నిసార్లు వాయు నాళమును నొక్కి శ్వాస తీసుకోవటంలో అడ్డుపడే విస్తరించబడిన థైరాయిడ్ ను కలిగించవచ్చు.
గ్రేవ్స్ వ్యాధి ఉన్న స్త్రీలు మరియు వారి నవజాత శిశువులు తమ ఆరోగ్య సంరక్షణ జట్టు ద్వారా సునిశితంగా పరిశీలించబడాలి. హైపర్ థైరాయిడిజం ఉన్న స్త్రీలు గర్భవతి అయ్యే ముందు వారి వైద్యుడితో తమ పరిస్థితి గురించి చర్చించాలి.
గర్భధారణ సమయంలో హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలను అంచనా వేయడం కష్టం కావచ్చు. సాధారణంగా, ఆరోగ్యకరమైన మహిళల్లో వారు గర్భవతి అయినప్పుడు థైరాయిడ్ గ్రంధి పెద్దగా అవుతుంది. ఆ సాధారణ వ్యాకోచం, అలసట తో కలిపి, ఒక కొత్త థైరాయిడ్ సమస్యను సులభంగా మిస్ అయ్యేటట్లు చేస్తుంది. ఒక వేగవంతమైన మరియు క్రమం లేని హృదయ స్పందన, కొద్దిగా వణుకు, మరియు వివరణ లేని బరువు క్షీణత లేదా గర్భధారణ సమయంలో ఉండే సాధారణ బరువు పెరుగుదలను కలిగి ఉండడంలో వైఫల్యం అనేవి హైపర్ థైరాయిడిజం అభివృద్ధి అవుతున్నట్లు అనే దానికి సంకేతాలు.
పోస్ట్ పార్టం థైరాయిడైటిస్. థైరాయిడ్ గ్రంథి యొక్క ఈ వాపు, జన్మనిచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో దాదాపు 4 నుండి 9 శాతం మహిళలను ప్రభావితం చేస్తుంది. పోస్ట్ పార్టం థైరాయిడైటిస్ ఒక స్వయం ప్రతిరక్షక పరిస్థితిగా నమ్మబడుతున్నది మరియు సాధారణంగా 1 నుండి 2 నెలలపాటు కొనసాగే హైపర్ థైరాయిడిజం ను కలిగిస్తుంది.
పోస్ట్ పార్టం థైరాయిడిటిస్ కలిగిన మహిళలలో తరచుగా థైరాయిడ్ గ్రంధి పూర్తిగా నయం కావడానికి ముందుగా హైపోథైరాయిడిజం అభివృద్ధి అవుతుంది. ఈ పరిస్థితి భవిష్యత్తులో ఏర్పడే గర్భాలతో తిరిగి సంభవించే అవకాశం ఉంది.
ఈ లక్షణాలను కొన్నిసార్లు డెలివరీ తర్వాత వచ్చే అలసట మరియు మూడీనెస్ వంటి పోస్ట్ పార్టం బ్లూస్ అని పొరపాటు పడడం వలన పోస్ట్ పార్టం థైరాయిడైటిస్ కొన్నిసార్లు నిర్థారించకుండానే వెళ్ళిపోతుంది. అలసట మరియు బద్ధకం యొక్క లక్షణాలు కొన్ని నెలల్లో వెళ్ళకపోతే లేదా ఒక మహిళలో పోస్ట్ పార్టం డిప్రెషన్ అభివృద్ధి అయితే ఆమె తన డాక్టర్ తో మాట్లాడాలి. ఆమెలో ఒక శాశ్వత థైరాయిడ్ పరిస్థితి అభివృద్ధి అయివుండవచ్చు మరియు మందులు తీసుకోవలసిన అవసరం ఉండవచ్చు.
హైపర్ థైరాయిడిజం ఎలా నిర్ధారణ చేయబడుతుంది?
హైపర్ థైరాయిడిజం యొక్క అనేక లక్షణాలు ఇతర వ్యాధుల మాదిరిగానే ఉంటాయి, కాబట్టి కేవలం లక్షణాల మీద ఆధారపడి హైపర్ థైరాయిడిజం ను నిర్దారించడం సాధారణంగా సాధ్యపడదు. అనుమానిత హైపర్ థైరాడిజంతో, వైద్యులు ఒక వైద్య చరిత్రను తీసుకొని పరిపూర్ణ శారీరక పరీక్షను నిర్వహిస్తారు. అప్పుడు వైద్యులు హైపర్ థైరాయిడిజం ను నిర్ధారించుటకు మరియు దాని కారణాన్ని కనుగొనేందుకు ఈ క్రింది వంటి అనేక రక్త పరీక్షలను ఉపయోగించవచ్చు:
TSH పరీక్ష. అల్ట్రాసెన్సిటివ్ TSH పరీక్ష సాధారణంగా డాక్టర్ చేసే మొదటి పరీక్ష. ఈ పరీక్ష రక్తంలోని TSH యొక్క చిన్న పరిమాణాలను కూడా గుర్తిస్తుంది మరియు ఇది అందుబాటులో ఉన్న థైరాయిడ్ కార్యకలాపం యొక్క అత్యంత ఖచ్చితమైన కొలత. TSH పరీక్ష అనేది తేలికపాటి హైపర్ థైరాయిడిజంను గుర్తించడంలో ముఖ్యంగా ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా, మామూలు కంటే తక్కువ వుండే ఒక TSH రీడింగ్ అంటే ఒక వ్యక్తికి హైపర్ థైరాయిడిజం ఉంది అని అర్థం మరియు మామూలు కంటే ఎక్కువ వుండే ఒక రీడింగ్ అంటే ఒక వ్యక్తికి హైపోథైరాయిడిజం ఉంది అని అర్థం.
వైద్యులు హైపర్ థైరాయిడిజం యొక్క నిర్ధారణను ధృవపరచుకోవడంలో లేదా కారణాన్ని గుర్తించేందుకు సహాయం చేయడానికి అదనపు పరీక్షలు నిర్వహించవచ్చు.
T3 మరియు T4 పరీక్ష. ఈ పరీక్ష, రక్తంలోని T3 మరియు T4 స్థాయిలను చూపిస్తుంది. హైపర్ థైరాయిడిజంలో, రక్తంలోని ఈ హార్మోన్లలో ఒకటి లేదా రెండింటి యొక్క స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి.
థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ ఇమ్యునోగ్లోబిన్ (TSI) పరీక్ష. ఒక థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ యాంటి బాడీ టెస్ట్ అని కూడా పిలువబడే ఈ పరీక్ష, రక్తం లోని TSI యొక్క స్థాయిని కొలుస్తుంది. గ్రేవ్స్ వ్యాధి ఉన్న చాలామంది ఈ ప్రతిరక్షక పదార్థాన్నికలిగి ఉంటారు, కానీ ఇతర పరిస్థితుల ద్వారా హైపర్ థైరాయిడిజంను కలిగిన ప్రజలు దీనిని కలిగి ఉండరు.
రేడియోయాక్టివ్ అయోడిన్ అప్టేక్ టెస్ట్. రేడియోయాక్టివ్ అయోడిన్ అప్టేక్ టెస్ట్ అనేది రక్తప్రవాహం నుండి థైరాయిడ్ సేకరించే అయోడిన్ యొక్క పరిమాణాన్ని కొలుస్తుంది. ఒక వ్యక్తి యొక్క థైరాయిడ్ లోని అయోడిన్ పరిమాణాన్ని కొలవడం అనేది డాక్టర్ ఒక వ్యక్తి యొక్క హైపర్ థైరాయిడిజం దేని వలన కలుగుతుంది అని గుర్తించడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, అయోడిన్ అప్టేక్ యొక్క తక్కువ స్థాయిలు థైరాయిడైటిస్ యొక్క ఒక సంకేతం కావచ్చు, అదే సమయంలో అధిక స్థాయిలు గ్రేవ్స్ వ్యాధిని సూచించవచ్చు.
థైరాయిడ్ స్కాన్. ఒక థైరాయిడ్ స్కాన్ అనేది థైరాయిడ్ లో అయోడిన్ ఎక్కడ మరియు ఎలా పంపిణీ చేయబడింది అని చూపిస్తుంది. నోడ్యూల్స్ మరియు ఇతర సంభావ్య అవకతవకల యొక్క చిత్రాలు, ఒక వ్యక్తి యొక్క హైపర్ థైరాయిడిజం యొక్క కారణాన్ని నిర్ధారించడానికి డాక్టర్ కు సహాయం చేస్తుంది.
హైపర్ థైరాయిడిజంకు ఎలా చికిత్స చేస్తారు?
మందులు, రేడియోఅయోడిన్ చికిత్స, లేదా థైరాయిడ్ శస్త్రచికిత్స ద్వారా వైద్యులు హైపోథైరాయిడిజంకు చికిత్స చేస్తారు. చికిత్స యొక్క లక్ష్యం థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను ఒక సాధారణ స్థితికి తేవడం, తద్వారా దీర్ఘకాలిక రుగ్మతలను నివారించడం, మరియు అసౌకర్య లక్షణాల నుండి ఉపశమనం పొందడం. ఏ ఒక్క చికిత్స ప్రతి ఒక్కరికీ పనిచేయదు.
చికిత్స అనేది థైరాయిడిజం యొక్క కారణం మరియు అది ఎంత తీవ్రంగా ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక చికిత్సను ఎంచుకునే సమయంలో, వైద్యులు రోగి యొక్క వయస్సు , మందుల యొక్క సంభావ్య అలెర్జీలు లేదా దుష్ప్రభావాలు, గర్భధారణ లేదా గుండె జబ్బు వంటి ఇతర పరిస్థితులు, మరియు అనుభవజ్ఞుడైన థైరాయిడ్ సర్జన్ యొక్క లభ్యతను పరిగణలోకి తీసుకుంటారు.
చికిత్స కోసం సరైన నిపుణుడిని కనుగొనడం అనేది కీలకమైన మొదటి అడుగు. “ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్” కింద ఇవ్వబడ్డ ప్రొఫెషనల్ సంఘాలు, మరియు స్థానిక బోధన ఆసుపత్రుల్లోని ఎండోక్రినాలజీ విభాగాలు స్థానిక నిపుణుల పేర్లను అందించగలవు.
మందులు
బీటా బ్లాకర్స్. ఇతర చికిత్సలు ప్రభావం చూపే వరకు, వైద్యులు రోగ లక్షణాలను తగ్గించటానికి బీటా బ్లాకర్ అనే ఒక మందును సూచించవచ్చు. అదిరిపాట్లు, వేగంగా గుండె కొట్టుకోవడం, మరియు భయము వంటి థైరాయిడిజం యొక్క అనేక లక్షణాల నుంచి ఉపశమనం పొందేందుకు బీటా బ్లాకర్స్ త్వరగా పని చేస్తాయి, కానీ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని ఆపవు. చాలా మందికి ఈ మందులు తీసుకొన్న గంటల్లోపే బాగా అనిపిస్తుంది.
యాంటి థైరాయిడ్ మందులు. యాంటి థైరాయిడ్ చికిత్స అనేది హైపర్ థైరాయిడిజంకు చికిత్స చేయటానికి సులభమయిన మార్గం. యాంటి థైరాయిడ్ మందులు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిలో జోక్యం చేసుకుంటాయి కానీ సాధారణంగా శాశ్వత ఫలితాలను కలిగి ఉండవు. థైరాయిడ్ వ్యతిరేక మందులు థైరాయిడైటిస్ కు చికిత్స చేయడానికి ఉపయోగించబడవు.
ఒకసారి యాంటి థైరాయిడ్ మందులతో చికిత్స ప్రారంభించిన తరువాత, థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు చాలా వారాలు లేదా నెలల వరకు సాధారణ పరిధి లోకి వెళ్లక పోవచ్చు. సగటు చికిత్సా సమయం దాదాపు 1 నుండి 2 సంవత్సరాలు ఉంటుంది, కానీ చికిత్స అనేక సంవత్సరాల పాటు కొనసాగవచ్చు.
యాంటి థైరాయిడ్ మందులు కొంతమందిలో ఈ క్రింది వాటితో సహా కొన్ని దుష్ప్రభావాలకు కారణం కావచ్చు
- దద్దుర్లు మరియు దురద వంటి అలెర్జీ ప్రతిచర్యలు
- ఇన్ఫెక్షన్ నిరోధకత్వంను తగ్గిం చే శరీరంలోని తెల్ల రక్త కణాల సంఖ్యలో తగ్గుదల
- కాలేయ వైఫల్యం, అరుదైన సందర్భాలలో
యాంటి థైరాయిడ్ మందులు తీసుకునే సమయంలో మీలో ఈ క్రింది వాటిల్లో ఏవైనా అభివృద్ధి అయితే వెంటనే మీ యాంటి థైరాయిడ్ మందులను ఆపివేయండి మరియు మీ డాక్టర్ కు కాల్ చేయండి:
- అలసట
- బలహీనత
- అస్పష్టమైన కడుపునొప్పి
- ఆకలి లేకపోవడం
- చర్మం దద్దుర్లు లేదా దురద
- సులభంగా గాయాలవడం
- కామెర్లు అని పిలువబడే, చర్మం లేదా కళ్ళ యొక్క తెల్ల గుడ్డు పసుపు రంగులోకి మారడం
- నిరంతర గొంతు రాపిడి
- జ్వరం
భారతదేశంలో, చాలా రకాల హైపర్ థైరాయిడిజం కొరకు వైద్యులు యాంటి థైరాయిడ్ మందైన మేతీమెజోల్ ను సూచిస్తారు.
యాంటి థైరాయిడ్ మందులు మరియు గర్భధారణ. గర్భవతులు మరియు తల్లిపాలను పట్టే మహిళలు రేడియోఅయోడిన్ చికిత్స పొందలేరు కాబట్టి, బదులుగా వారు సాధారణంగా ఒక యాంటి థైరాయిడ్ మందుతో చికిత్స చేయబడతారు. అయితే, అరుదుగా సంభవించే గర్భస్థ పిండంనకు కలిగే నష్టం కారణంగా మహిళలు వారి గర్భధారణ యొక్క మొదటి త్రైమాసికంలో మేతీమెజోల్ ను తీసుకోకూడదు అని నిపుణులు అంగీకరిస్తారు. గర్భధారణ యొక్క ఈ దశలో ఉన్న మహిళల కొరకు లేదా మేతీ మేజోల్ అంటే ఎలర్జీ ఉండే లేదా సరిపడని మరియు ఏ ఇతర చికిత్స ఎంపికలు లేని మహిళల కొరకు ఇంకొక యాంటి థైరాయిడ్ మందు, ప్రోపిల్ తాయో యురాసిల్ (PTU), అందుబాటులో ఉంది.
వైద్యులు గర్భధారణ యొక్క మొదటి త్రైమాసికంలో PTU ను సూచించవచ్చు మరియు రెండవ మరియు మూడవ త్రైమాసికాలలో మేతీమేజోల్ కు మారవచ్చు. గర్భధారణ సమయంలో సంభవించే హైపర్ థైరాయిడిజం యొక్క ఉపశమనం (తగ్గుముఖం పట్టడం) కారణంగా కొంతమంది మహిళలు గర్భధారణ యొక్క చివరి 4 నుండి 8 వారాలలో యాంటి థైరాయిడ్ మందులు తీసుకోవడం ఆపగలరు. అయితే ఈ మహిళలు డెలివరీ తరువాత థైరాయిడ్ సమస్యలు యొక్క పునరుక్తి కోసం పర్యవేక్షించబడడం కొనసాగించాలి.
యాంటి థైరాయిడ్ మందులు తీసుకునే తల్లులు సురక్షితంగా తల్లిపాలు పట్టించవచ్చు అని అధ్యయనాలు నిరూపించాయి. అయితే, వారు స్వల్పస్థాయి మోతాదులను తీసుకోవాలి, రోజూ 10-20 మిల్లీగ్రాముల కంటే తక్కువ యాంటి థైరాయిడ్ మందు మేతీమెజోల్ ను తీసుకోవాలి. మోతాదులను విభజించాలి మరియు పాలు పట్టిన తర్వాత తీసుకోవాలి, మరియు శిశువులను దుష్ప్రభావాల కొరకు పరిశీలించాలి.
హైపర్ థైరాయిడిజంను నియంత్రించడానికి యాంటి థైరాయిడ్ మందులు అధిక మోతాదులో అవసరమయ్యే మహిళలు తల్లిపాలు పట్టించకూడదు.
రేడియోఅయోడిన్ థెరపీ
రేడియాక్టివ్ అయోడిన్ -131 అనేది హైపర్ థైరాయిడిజం కొరకు ఒక సాధారణ మరియు ప్రభావవంతమైన చికిత్స. రేడియోఅయోడిన్ చికిత్సలో, రోగులు నోటిద్వారా రేడియోధార్మిక అయోడిన్ -131 ను తీసుకుంటారు. థైరాయిడ్ గ్రంధి, థైరాయిడ్ హార్మోన్ ను తయారు చేయడానికి అయోడిన్ ను సేకరిస్తుంది, కనుక అది రక్తప్రవాహం నుండి రేడియాక్టివ్ అయోడిన్ ను అదే విధంగా సేకరిస్తుంది. రేడియాక్టివ్ అయోడిన్ క్రమంగా థైరాయిడ్ గ్రంథిని ఏర్పరిచే కణాలను నిర్మూలిస్తుంది కానీ ఇతర శరీర కణజాలాన్ని ప్రభావితం చేయదు.
థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని సాధారణ పరిధిలోకి తీసుకుని రావడానికి ఒకటి కంటే ఎక్కువ రౌండ్ల రేడియో అయోడిన్ చికిత్స అవసరం కావచ్చు. ఈలోగా, బీటా బ్లాకర్స్ తో చికిత్స రోగలక్షణాలను నియంత్రించగలదు.
రేడియాక్టివ్ అయోడిన్ చికిత్స పొందే దాదాపు ప్రతి ఒక్కరిలో చివరికి హైపోథైరాయిడిజం అభివృద్ధి అవుతుంది. కానీ వైద్యులు దీనిని ఒక ఆమోదయోగ్యమైన ఫలితం పరిగణిస్తారు, ఎందుకంటే హైపోథైరాయిడిజంకు చికిత్స చేయడం సులభం మరియు ఇది హైపర్ థైరాయిడిజం కంటే తక్కువ దీర్ఘకాల సమస్యలను కలిగి ఉంటుంది. హైపోథైరాయిడిజం అభివృద్ధి అయ్యే వ్యక్తులు సింథటిక్ థైరాయిడ్ హార్మోన్ ను తీసుకోవాలి.
రేడియోఅయోడిన్ మరియు గర్భధారణ. అయోడిన్ -131 పుట్టుక లోపాలు లేదా వంధ్యత్వాన్ని కలిగించదు అని తెలిసినప్పటికీ, రేడియో అయోడిన్ చికిత్సను గర్భిణీ స్త్రీలు లేదా తల్లిపాలు పట్టే స్త్రీలలో ఉపయోగించరు. రేడియాక్టివ్ అయోడిన్ గర్భస్థ పిండం యొక్క థైరాయిడ్ కు హానికరం కావచ్చు మరియు తల్లి పాలలో తల్లి నుండి బిడ్డకు పంపబడవచ్చును. చికిత్స తరువాత గర్భవతి అయ్యేముందు ఒక సంవత్సరం వేచి ఉండమని నిపుణులు మహిళలకు సిఫార్సు చేస్తారు.
థైరాయిడ్ శస్త్రచికిత్స
థైరాయిడ్ గ్రంథి యొక్క ఒక భాగం లేదా అత్యధిక భాగాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స అనేది అత్యంత తక్కువగా ఉపయోగించే చికిత్స. కొన్నిసార్లు శస్త్రచికిత్స ఈ క్రింది వారికి చికిత్స చేయటానికి ఉపయోగించబడవచ్చు
- యాంటి థైరాయిడ్ మందులు తట్టుకోలేని గర్భిణీ స్త్రీలు
- పెద్ద పెద్ద గాయిటర్లు గల వ్యక్తులు
- హైపర్ థైరాయిడిజం క్యాన్సర్ ను కలిగించనప్పటికీ, క్యాన్సర్ సంబంధిత థైరాయిడ్ నోడ్యూల్స్ కలిగిన వ్యక్తులు
శస్త్రచికిత్సకు ముందు, తాత్కాలికంగా రోగి యొక్క థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను సాధారణ పరిధి లోకి తీసుకుని రావడానికి డాక్టర్ యాంటి థైరాయిడ్ మందులను సూచించవచ్చు. ఈ శస్త్రచికిత్స పూర్వ చికిత్స థైరాయిడ్ స్టార్మ్ —అకస్మాత్తుగా, తీవ్ర ంగా లక్షణాలు ప్రకోపించడం—అనే ఒక పరిస్థితిని నిరోధిస్తుంది, అది హైపర్ థైరాయిడ్ రోగులు సాధారణ అనస్థీషియా తీసుకున్నప్పుడు సంభవించవచ్చు.
థైరాయిడ్ యొక్క ఒక భాగం తొలగించబడినప్పుడు—ఉదాహరణకు, టాక్సిక్ నాడ్యుల్స్ కోసం ఒక చికిత్స లాగా— థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తిరిగి సాధారణ స్థితికి చేరుకోవచ్చు. కానీ కొన్ని శస్త్రచికిత్స రోగులలో ఇప్పటికీ హైపోథైరాయిడిజం అభివృద్ధి అవ్వవచ్చు మరియు థైరాయిడ్ తయారు చేసే T4 హార్మోన్ తో సారూప్యత గల ఒక మందైన సింథటిక్ థైరాక్సిన్ ను తీసుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. మొత్తం థైరాయిడ్ తొలగించినట్లయితే, జీవితకాల థైరాయిడ్ హార్మోన్ మందు అవసరం ఉంటుంది. శస్త్రచికిత్స తర్వాత, వైద్యులు రోగుల యొక్క థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను పర్యవేక్షించడం కొనసాగిస్తారు.
అసాధారణం అయినప్పటికీ, థైరాయిడ్ శస్త్రచికిత్సలో కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. పారాథైరాయిడ్ గ్రంథులు థైరాయిడ్ కు చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి అవి దెబ్బతినవచ్చు. ఈ గ్రంధులు శరీరంలోని కాల్షియం మరియు ఫాస్పరస్ స్థాయిలను నియంత్రించటానికి సహాయపడతాయి. స్వరపేటిక నరం (ఇది కూడా థైరాయిడ్ కు దగ్గరగా ఉంటుంది) దెబ్బతినడం అనేది గాత్ర మార్పులు లేదా శ్వాస సమస్యలకు దారి తీయవచ్చు. కానీ శస్త్రచికిత్స అనుభవజ్ఞుడైన సర్జన్ చేసినప్పుడు,1 శాతం కంటే తక్కువ మంది రోగులు శాశ్వత సమస్యలు కలిగి వుంటారు.
తినడం, డైట్, మరియు న్యూట్రిషన్
చాలా పోషకాలను పొందటానికి ప్రజలు సమతుల్య ఆహారం తినాలి అని నిపుణులు సిఫారసు చేస్తారు.
ఆహార అనుబంధములు (డయటరీ సప్లిమెంట్స్)
అయోడిన్ థైరాయిడ్ కోసం అవసరమైన ఒక ఖనిజం. అయితే, ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధి కలిగిన ప్రజలు అయోడిన్ యొక్క హానికరమైన దుష్ప్రభావాలకు సున్నితంగా ఉండవచ్చు. అయోడిన్ డ్రాప్స్ తీసుకోవడం లేదా సీవీడ్, డల్స్ లేదా కెల్ప్ వంటి పెద్ద మొత్తంలో అయోడిన్ ను కలిగి ఉండే ఆహారాలను తినడం అనేవి హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజంను కలిగించవచ్చు లేదా మరింత తీవ్రం చేయవచ్చు.
మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ అయోడిన్ అవసరం-ఒక రోజుకు దాదాపు 250 మైక్రోగ్రాములు-ఎందుకంటే బిడ్డ తల్లి ఆహారం నుండి అయోడిన్ ను పొందుతుంది. యునైటెడ్ స్టేట్స్ లో, గర్భిణీ స్త్రీలలో దాదాపు 7 శాతం మంది తమ ఆహారంలో లేదా ప్రినేటల్ విటమిన్లు ద్వారా తగినంత అయోడిన్ ను పొందకపోవచ్చు. సాదా ఉప్పు కంటే అయోడిన్ ఉప్పు-అయోడిన్ అనుబంధంగా వుండే ఉప్పు- ను ఎంచుకోవడం మరియు అయోడిన్ కలిగిన ప్రినేటల్ విటమిన్లను ఎంచుకోవడం అనేది ఈ అవసరం తీరేలా చూస్తుంది.
సమన్వయం మరియు సురక్షిత సంరక్షణను నిర్ధారించడంలో సహాయపడటానికి, అయోడిన్ వంటి ఆహార అనుబంధాల యొక్క తమ వాడకము గురించి ప్రజలు వారి డాక్టర్ తో చర్చించాలి.
గుర్తుంచుకోవలసిన పాయింట్లు
- హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంధి శరీర అవసరాలకు కంటే ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ ను తయారు చేసినప్పుడు వచ్చే ఒక రుగ్మత.
- హైపర్ థైరాయిడిజం తరచుగా ఒక స్వయం ప్రతిరక్షక రుగ్మత అయిన గ్రేవ్స్ వ్యాధి వల్ల కలుగుతుంది. ఇతర కారణాలలో థైరాయిడ్ నోడ్యూల్స్, థైరాయిడైటిస్, చాలా ఎక్కువ అయోడిన్ తీసుకోవడం మరియు సింథటిక్ థైరాయిడ్ హార్మోన్ తో ఎక్కువ మందు తీసుకోవడం ఉంటాయి.
- హైపర్ థైరాయిడిజం యొక్క కొన్ని సాధారణ లక్షణాలు -భయము లేదా చికాకు చిహ్నాలు, అలసట లేదా కండరాల బలహీనత, వేడి సరిపడక పోవడం , నిద్రపోవడంలో ఇబ్బంది, చేతిలో అదిరిపాట్లు, వేగవంతమైన మరియు క్రమం లేని హృదయ స్పందన, తరచుగా ప్రేగు కదలికలు లేదా అతిసారం, బరువు కోల్పోవడం, మానసిక కల్లోలం మరియు గాయిటర్.
- పురుషుల కంటే మహిళలలో హైపర్ థైరాయిడిజం అభివృద్ధి అయ్యే అవకాశం రెండు నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
- హైపర్ థైరాయిడిజం 60 సంవత్సరాలు పైబడిన వయస్సు వున్న వారిలో సర్వసాధారణం మరియు తరచుగా థైరాయిడ్ నోడ్యూల్స్ వలన కలుగుతుంది. ఈ వయస్సు ఉన్నవారిలో హైపర్ థైరాయిడిజం అనేది కొన్నిసార్లు డిప్రెషన్ లేదా డిమెన్షియా గా తప్పుగా నిర్ధారణ చేయబడుతుంది.
- 60 సంవత్సరాల వయస్సు పైబడిన ప్రజల కోసం, ఉప రోగసంబంధ హైపర్ థైరాయిడిజం గుండె ఆగిపోవడం లేదా స్ట్రోక్ కు దారి తీయగల, ఆట్రియల్ ఫిబ్రిలేషన్ అని పిలువబడే ఒక పరిస్థితి అయిన, ఒక వేగవంతమైన, క్రమం లేని హృదయ స్పందన అభివృద్ధి అయ్యే వారి అవకాశాన్ని పెంచుతుంది.
- హైపర్ థైరాయిడిజం ఉన్న స్త్రీలు గర్భవతి అయ్యే ముందు వారి వైద్యుడితో తమ పరిస్థితి గురించి చర్చించాలి.
- మందులు, రేడియోఅయోడిన్ చికిత్స, లేదా థైరాయిడ్ శస్త్రచికిత్స ద్వారా హైపోథైరాయిడిజంకు చికిత్స చేస్తారు. ఏ ఒక్క చికిత్స ప్రతి ఒక్కరికీ పనిచేయదు.