మూత్ర పిండాల వ్యాధి కొరకు టెస్టింగ్

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456

తొలిదశ మూత్రపిండాల వ్యాధికి సాధారణంగా సంకేతాలు ( మీ శరీరం లో ఒక మార్పు) లేదా లక్షణాలు (మీ భావనలో ఒక మార్పు) వుండవు. టెస్టింగ్ మాత్రమే మీ మూత్రపిండాలు ఎలా పని చేస్తున్నాయో తెలిపే ఒక మార్గం. ఒక వేళ  మీకు ముఖ్య ప్రమాద కారకాలైన మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బు, లేక మూత్రపిండాల వైఫల్యం గల కుటుంబ చరిత్ర వుంటే, మూత్రపిండాల వ్యాధి కొరకు  మీరు పరీక్ష చేయించుకోవడం మీకు ముఖ్యమైనది.

మూత్రపిండాల వ్యాధి కొరకు తనిఖీ చేయడానికి రెండు పరీక్షలు అవసరమవుతాయి:

  1. మీ మూత్రపిండాలు ఎంత బాగా ఫిల్టర్ చేస్తున్నాయో చెప్పే ఒక రక్త పరీక్ష మీ GFR ను తనిఖీ చేస్తుంది. GFR అంటే గ్లోమైర్యులర్ ఫిల్టరేషన్ రేట్.
  2. ఒక మూత్ర పరీక్ష మీ మూత్రంలో అల్బుమిన్ కొరకు తనిఖీ చేస్తుంది. అల్బుమిన్ అనేది మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు మూత్రంలోకి చేరగల ఒక ప్రోటీన్.

మీ రక్తపోటును తనిఖీ చేయించుకోవడం  కూడా ముఖ్యమైనది. అధిక రక్తపోటు మూత్రపిండాల జబ్బు యొక్క ఒక లక్షణం కావచ్చు. మీ రక్తపోటును మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాత నిర్ణయించిన లక్ష్యం వద్ద లేదా క్రింద ఉంచండి. చాలా మందికి, రక్తపోటు లక్ష్యం 140/90 mmHg కంటే తక్కువగా ఉంటుంది. మూత్రపిండాలు పాడై పోయిన చరిత్ర వుంటే, మీరు ఎంత తరుచుగా పరీక్ష చేయించుకోవాలో మీ ప్రొవైడర్  తో మాట్లాడండి.

మీరు ఎంత త్వరగా మీకు మూత్రపిండాల వ్యాధి వుందని తెలుసుకుంటే,  మూత్రపిండాల వైఫల్యాన్ని పొడిగించేందుకు లేక నివారించేందుకు సహాయపడడానికి అంత త్వరగా మీరు చికిత్సను పొందగలరు. మీకు మధుమేహం ఉంటే, ప్రతి సంవత్సరం పరీక్ష చేయించుకోండి.  మీకు అధిక రక్తపోటు, గుండె జబ్బు, లేక మూత్రపిండాల వైఫల్యం గల కుటుంబ చరిత్ర వంటి ఇతర ప్రమాద కారకాలు ఉంటే, ఎంత తరచుగా మీరు పరీక్షించబడాలి అనే దాని గురించి మీ ప్రదాతతో మాట్లాడండి.

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు