మూత్రపిండాలు మరియు అవి ఎలా పనిచేస్తాయి

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456


మూత్రపిండాలు
అంటే ఏమిటి మరియు అవి ఏమి చేస్తాయి?

మూత్రపిండాలు రెండు బీన్- ఆకారంలో వుండే అవయవాలు, ఒక్కోటి దాదాపు ఒక పిడికిలి పరిమాణంలో వుంటాయి. అవి పక్కటెముకకు కొంచెం క్రింద, వెన్నెముకకు ఇరుప్రక్కలా ఒకటి వుంటాయి. ప్రతి రోజు, రెండు మూత్రపిండాలు వ్యర్ధాలు మరియు అదనపు ద్రవాన్ని కలిగిన 1 నుండి 2 లీటర్ల మూత్రమును  ఉత్పత్తి చేయటానికి దాదాపు 120 నుంచి 150 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. మూత్రం మూత్రపిండాల నుండి మూత్రాశయంనకు యురేటర్స్ అని పిలిచే మూత్రాశయంనకు ఇరువైపుల వుండే రెండు సన్నని కండరాల గొట్టాల ద్వారా ప్రవహిస్తుంది. మూత్రాశయం మూత్రంను నిలువ చేస్తుంది. మూత్రాశయ గోడ కండరాలు మూత్రాశయం మూత్రంను నింపునప్పుడు వదులుగా ఉంటాయి.  మూత్రాశయం సామర్థ్యం నిండినాకా, ఒక వ్యక్తికి టాయిలెట్ కు వెళ్ళవలెనని చెప్పుతూ మెదడుకు ఒక సంకేతాన్ని పంపుతుంది.  మూత్రాశయం ఖాళీ అయినప్పుడు, మూత్రం మూత్రాశయం చివర ఉన్నయురేత్రా అని పిలిచే ఒక గొట్టం ద్వారా శరీరం నుండి బయటికి పోతుంది. పురుషుల్లో యురేత్రా పొడవుగా ఉంటుంది, స్త్రీలలో చిన్నగా వుంటుంది.

మూత్రపిండాలు ఎందుకు ముఖ్యమైనవి?     

మూత్రపిండాలు ముఖ్యమైనవి ఎందుకంటే అవి రక్తం యొక్క మేళనము లేదా కూర్పును స్థిరంగా ఉంచుతాయి, ఇది శరీరం పని చెయ్యడానికి వీలు కల్పిస్తుంది. అవి

  • శరీరంలో వ్యర్ధాలు మరియు అదనపు ద్రవం పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి
  • సోడియం, పొటాషియం, మరియు ఫాస్ఫేట్, ఎలెక్ట్రోలైట్స్ యొక్క స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి
  • ఈ క్రింది వాటికి సహాయపడే హార్మోన్లను తయారు చేస్తాయి
  • రక్త పోటును నియంత్రించడానికి
  • ఎర్ర రక్తకణాలను తయారు చేయడానికి
  • ఎముకలను గట్టిగా ఉంచడానికి

మూత్రపిండాలు ఎలా పని చేస్తాయి?

మూత్రపిండం ఒక పెద్ద ఫిల్టర్ కాదు. ప్రతి మూత్రపిండం నేఫ్రోన్స్ అని పిలిచే దాదాపు ఒక మిలియన్ ఫిల్టరింగ్ యూనిట్లతో తయారు చేయబడింది. ప్రతి నేఫ్రోన్  చిన్న మొత్తం రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. నేఫ్రోన్ రక్తకేశనాళికాగుచ్ఛము అని పిలిచే ఒక ఫిల్టర్, మరియు ఒక సూక్ష్మ నాళికను కలిగి ఉంటుంది. నేఫ్రోన్లు ఒక రెండు-దశల ప్రక్రియ ద్వారా పనిచేస్తాయి. రక్తకేశనాళికాగుచ్ఛము ద్రవం మరియు వ్యర్ధ పదార్ధాలని దాని గుండా వెళ్ళడానికి అనుమతిస్తుంది; అయితే, అది రక్త కణాలు మరియు పెద్ద అణువులు, ఎక్కువగా ప్రోటీన్లను వెళ్ళకుండా నిరోధిస్తుంది. ఫిల్టర్ చేయబడిన ద్రవం అప్పుడు సూక్ష్మ నాళిక గుండా వెళుతుంది, అది అవసరమైన ఖనిజాలను తిరిగి రక్త ప్రవాహంలోకి పంపుతుంది మరియు వ్యర్ధాలను తొలగిస్తుంది. అంతిమ ఉత్పత్తి మూత్రంగా అవుతుంది.

గుర్తుంచుకోనవలసిన పాయింట్లు

  • ప్రతి రోజు, రెండు మూత్రపిండాలు వ్యర్ధాలు మరియు అదనపు ద్రవాన్ని కలిగిన 1 నుండి 2 లీటర్ల మూత్రమును ఉత్పత్తి చేయటానికి దాదాపు 120 నుంచి 150 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి.
  • మూత్రపిండాలు ముఖ్యమైనవి ఎందుకంటే అవి రక్తం యొక్క మేళనము లేదా కూర్పును స్థిరంగా ఉంచుతాయి, ఇది శరీరం పని చెయ్యడానికి వీలు కల్పిస్తుంది.
  • ప్రతి మూత్రపిండం నేఫ్రోన్స్ అని పిలిచే దాదాపు ఒక మిలియన్ ఫిల్టరింగ్ యూనిట్లతో తయారు చేయబడింది. నేఫ్రోన్ రక్తకేశనాళికాగుచ్ఛము అని పిలిచే ఒక ఫిల్టర్, మరియు ఒక సూక్ష్మ నాళికను కలిగి ఉంటుంది.
  • నేఫ్రోన్లు ఒక రెండు-దశల ప్రక్రియ ద్వారా పనిచేస్తాయి. రక్తకేశనాళికాగుచ్ఛము ద్రవం మరియు వ్యర్ధ పదార్ధాలని దాని గుండా వెళ్ళడానికి అనుమతిస్తుంది; అయితే, అది రక్త కణాలు మరియు పెద్ద అణువులు, ఎక్కువగా ప్రోటీన్లను వెళ్ళకుండా నిరోధిస్తుంది. ఫిల్టర్ చేయబడిన ద్రవం అప్పుడు సూక్ష్మ నాళిక గుండా వెళుతుంది, అది అవసరమైన ఖనిజాలను తిరిగి రక్త ప్రవాహంలోకి పంపుతుంది మరియు వ్యర్ధాలను తొలగిస్తుంది.

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు