మీ మధుమేహం గురించి జాగ్రత్త తీసుకోవడం అంటే మీ గుండె గురించి జాగ్రత్త తీసుకోవడం అని అర్థం

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456


మధుమేహం
మరియు గుండె జబ్బు

మధుమేహం ఉన్నవారికి, గుండె జబ్బు తీవ్రమైన ఆరోగ్య సమస్య కావచ్చు. మధుమేహం వుండడం అంటే అర్థం గుండె పోటు లేక గుండె నొప్పి లాంటి సమస్యలు రావడానికి మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది అని చాలా మందికి తెలియదు. మీ మధుమేహానికి జాగ్రత్త తీసుకోవడం అనేది మీ గుండెకు జాగ్రత్త తీసుకోవడానికి కూడా సహాయపడగలదు. ఈ చిట్కాల షీట్ లోని ఉపకరణాలను ఉపయోగించండి. అవి ఏమిటంటే:

  • ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం మరియు మరింత చురుకుగా అవ్వడం వంటి మీరు చేయగల కొన్ని విషయాల యొక్క ఒక జాబితా.
  • మీ A1C, రక్తపోటు, మరియు కొలెస్ట్రాల్ విలువలు వ్రాయడానికి మరియు ట్రాక్ చేయడానికి ఒక ఫారమ్.

ఇప్పుడు మీరు ఏమి చెయ్యగలరు

మీ ఆరోగ్య రక్షణ జట్టును ప్రశ్నలను అడగండి:

  • నాకు గుండె జబ్బు వచ్చే అవకాశాలను తగ్గించుకొనుటకు నేను ఏమి చెయ్యగలను?
  • A1C, రక్తపోటు, మరియు కొలెస్ట్రాల్ కొరకు నా యొక్క లక్ష్యాలు ఏమి ఉండాలి?
  • ఈ లక్ష్యాలను చేరుకోవడానికి నేను ఏమి చెయ్యగలను?
  • నేను ఆస్పిరిన్ లేదా స్టాటిన్ వంటి నా గుండెను కాపాడగలిగే ఔషధం తీసుకోవలసి వుంటుందా?

బాగా తినండి.

  • హోల్ గ్రైన్ బ్రెడ్లు, మరియు తృణధాన్యాలు, బ్రౌన్ రైస్, చిక్కుళ్ళు, బీన్స్, పండ్లు, మరియు కూరగాయలు వంటి పీచు అధికంగా వుండే ఆహారాలు తినండి.
  • చేప, నట్స్, మరియు అవెకాడో వంటి గుండెకు -ఆరోగ్యకరమైన కొవ్వులు వుండే ఆహారాలు తినండి.
  • లీన్ మాంసం, చర్మం లేని కోడి మాంసం, చేప మరియు కొవ్వు-లేని లేదా తక్కువ కొవ్వు గల పాలు, పెరుగు, మరియు వెన్న వంటి సంతృప్త మరియు అసంతృప్త కొవ్వులు తక్కువగా వుండే ఆహారాలు తినండి.
  • ఆహారాన్ని వండే టప్పుడు వెన్న, మీగడ, షార్టేనింగ్, పందికొవ్వు, లేదా స్టిక్ మార్గరిన్ బదులుగా నూనెలను ఉపయోగించండి.
  • కుకీలు మరియు ఐస్ క్రీంను వంటి డెసెర్ట్లను వారానికి 1 లేదా 2 సార్లుకు మాత్రమే పరిమితం చేయండి
  • కొవ్వు, చక్కెర, లేదా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను చిన్న మొత్తాలుగా తినండి. ఉదాహరణకు మీ కు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అనుకుంటే కిడ్ సైజ్ భాగాన్ని ఆర్డర్ ఇవ్వండి.
  • ఆహారాన్ని వేయిండానికి బదులుగా బేక్ చేయండి, బ్రొయిల్ చేయండి, లేదా గ్రిల్ చేయండి .
  • ఆహారానికి ఉప్పును కలుపవద్దు.

ధూమపానం ఆపండి.  

  • సహాయం కోసం అడగండి.

చురుకుగా ఉండండి.

  • ప్రతి రోజు 30 నిమిషాలు లేదా ఎక్కువ సమయం చురుకుగా ఉండండి. ఒక సమయంలో 10 నిముషాల చొప్పున ఒక రోజుకు 3 సార్లు చురుకుగా వుండడం ఫర్వాలేదు.
  • నడవండి, నాట్యం చేయండి, ఈత కొట్టండి, లేక బైక్ నడపండి.

మీ మందును తీసుకోండి.

  • మీ వైద్యుడు లేదా ఆరోగ్య సంరక్షణ జట్టు మీకు చెప్పిన విధంగా మందులను తీసుకోండి.
  • మీరు మీ డాక్టర్ తో మాట్లాడేంత వరకు మీ మందులు తీసుకోవడం ఆపవద్దు.
  • మీ ఫార్మసిస్ట్ లేదా వైద్యుడిని మీ మందుల గురించి మీకు ఏవైనా ప్రశ్నలుంటే అడగండి.

మీకు వీలైనంత వరకు ఒత్తిడిని ఎదుర్కోండి.

  • మీకు నిరుత్సాహంగా అనిపిస్తే సహాయం కోసం అడగండి. మీ సమస్యలను వినే ఒక మానసిక ఆరోగ్య సలహాదారు, మతాధికారి, స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడితో మాట్లాడండి.
  • వారు మీకు ఎంత బాగా సహాయం చేయగలరో మరియు మద్దతు ఇవ్వగలరో మీ కుటుంభ సభ్యులకు మరియు స్నేహితులకు చెప్పండి.

మీ గుండె గురించి జాగ్రత్త తీసుకోవడానికి  మరొక మార్గం ఇక్కడ వుంది :

గుండెపోటు మరియు స్ట్రోక్ యొక్క హెచ్చరిక సంకేతాల గురించి తెలుసుకోండి.

  • గుండె పోటుకు సంకేతాలలో ఒత్తిడి, గట్టిగా ఒత్తినట్టు అనిపించడం, నిండినట్టు అనిపించడం మరియు ఛాతీ  లేదా ఎగువ శరీరంలో నొప్పి ఉండవచ్చు. మీకు శ్వాస ఆడకపోవుట కూడా ఉండవచ్చు.
  • ఒక మహిళకు గుండెపోటు సంకేతాలు ఒక పురుషుడి కంటే వేరుగా ఉండవచ్చు. మహిళకు ఉండే లక్షణాలలో వికారం, మరియు వాంతులు, ఎప్పుడూ అలసినట్టు ఉండటం (కొన్నిసార్లు కొన్నిరోజులపాటు), మరియు వీపు, భుజాలు, మరియు దవడ ఎముకలో నొప్పి ఉండవచ్చు.
  • ఒక స్ట్రోక్ యొక్క సంకేతాలలో ఒక వైపు బలహీనంగా ఉండటం మరియు నడవడం, చూడటం , లేదా మాట్లాడటంలో ఇబ్బంది ఉండటం అనేవి ఉండవచ్చు.

మీకు గుండెపోటు లేదా స్ట్రోక్  వచ్చింది అనుకుంటే వెంటనే 85000 23456 కాల్ చేయండి. వేగంగా స్పందించడం అనేది మీ జీవితాన్ని కాపాడగలదు.

మీ మధుమేహ రికార్డ్ ఫారం

మీ A1C, రక్తపోటు, మరియు కొలెస్ట్రాల్ సంఖ్యలను ట్రాక్ చేయడానికి ఫారంను ఉపయోగించండి పదాలు మధుమేహం రికార్డ్ ఫారం కింద వివరించ బడ్డాయి

  • మీరు చేయించుకున్న ప్రతీ పరీక్ష లేదా రక్తపోటు తనిఖీ యొక్క తేదీ మరియు ఫలితాలను వ్రాయండి.
  • మీరు ఈ ఫారంను ఆరోగ్య సంరక్షణ పరీక్షకు పోయినప్పుడు మీతో తీసుకపోండి. దానిని మీ ఆరోగ్య సంరక్షణ జట్టుకు చూపించండి.
  • మీ లక్ష్యాలు మరియు మీరు ఎలా ఉన్నారు అనే దాని గురించి మాట్లాడండి.
A1C ప్రతి సందర్శనలో  : నా లక్ష్యం
తేదీ
ఫలితం
రక్తపోటు (BP)  ప్రతి సందర్శనలో: నా లక్ష్యం
తేదీ
ఫలితం
కొలెస్ట్రాల్ ప్రతి సందర్శనలో: నా లక్ష్యం
తేదీ
 ఫలితం

 A1C పరీక్ష (A- one-C)

 రక్తపోటు

 కొలెస్ట్రాల్

ఇది ఏమిటి?

A1C అనేది గత మూడు నెలల్లో మీ సగటు రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిని కొలిచే ఒక రక్త పరీక్ష. ఇది మీ ప్రతి రోజు చేసే రక్తంలో చక్కెర తనిఖీలకు భిన్నంగా ఉంటుంది.

అది ఎందుకు ముఖ్యమైనది?

మీరు ఎప్పటికప్పుడు మీ రక్తంలో చక్కెర స్థాయిలను తెలుసుకోవలసిన అవసరం వుంటుంది. మీరు ఆ సంఖ్యలు చాలా అధికం కావద్దని అనుకుంటారు. రక్తంలో చక్కెర యొక్క అధిక స్థాయిలు మీ గుండె, రక్తనాళాలు, మూత్రపిండాలు,  పాదాలు, మరియు కళ్ళకు హాని కలిగించవచ్చు.

A1C లక్ష్యం ఏమిటి?

మధుమేహం కలిగిన చాలా  మంది యొక్క A1C లక్ష్యం 7 కంటే తక్కువ  ఉంటుంది. ఒక వేళ మీరు ఎక్కువ వయస్సు వున్న పెద్దవారు అయితే (65 పైన ), చాలా కాలం నుండి మధుమేహం  వుంటే లేదా మీ రక్తంలో చక్కెర తరచుగా చాలా తక్కువకు చేరుతుంటే, అది వేరుగా ఉండవచ్చు. మీ లక్ష్యం ఏమి ఉండాలని అడగండి.

ఇది ఏమిటి?

రక్తపోటు అనేది మీ రక్త నాళాల గోడలకు వ్యతిరేకంగా పనిచేసే మీ రక్తం యొక్క బలం.

అది ఎందుకు ముఖ్యమైనది?

మీ రక్తపోటు అధికం అయితే, అది మీ గుండెను చాలా కష్టపడి పనిచేసేలా చేస్తుంది. ఇది గుండెపోటు,  స్ట్రోక్, మరియు మీ మూత్రపిండాలు మరియు కళ్ళు దెబ్బతినడానికి కారణం కావచ్చు .

రక్తపోటు లక్ష్యం ఏమిటి?

మధుమేహ వ్యాధితో బాధపడుతున్న చాలా మందికి రక్తపోటు లక్ష్యం 140/90 కంటే తక్కువ ఉంటుంది. అది మీకు వేరుగా  ఉండవచ్చు. మీ లక్ష్యం ఏమి ఉండాలి అని అడగండి.

ఇది ఏమిటి?

మీ రక్తంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి: LDL మరియు HDL

అది  ఎందుకు ముఖ్యమైనది?

LDL లేదా “చెడు” కొలెస్ట్రాల్ పేరుకుపోయి మరియు మీ రక్తనాళాలను మూసివేయవచ్చు. ఇది ఒక  గుండె పోటును లేదా స్ట్రోక్  ను కలిగించవచ్చు. HDL లేదా “మంచి” కొలెస్ట్రాల్ మీ రక్తనాళాలు నుండి “చెడు” కొలెస్ట్రాల్ ను తొలగించడానికి సహాయపడుతుంది.

LDL మరియు HDL లక్ష్యాలు ఏమిటి?

ఈ లక్ష్యాలు భిన్న వ్యక్తులకు భిన్నంగా ఉంటాయి. మీ కొలెస్ట్రాల్ సంఖ్యలు ఏమి ఉండాలి అని అడగండి. మీ  వయస్సు 40 సంవత్సరాలు ఉంటే, మీరు మీ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి మరియు మీ గుండెను రక్షించుకోవడానికి ఒక స్టాటిన్ వంటి ఔషధం తీసుకోవలసిన అవసరం ఉండవచ్చు.

గుర్తుంచుకోవలసిన విషయాలు.

  • మధుమేహం ఉన్న వారికి గుండె వ్యాధి ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య కావచ్చు.
  • మీ మధుమేహం గురించి జాగ్రత్త తీసుకోవడం అంటే అర్థం మీకు గుండె పోటు లేదా స్ట్రోక్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అని.
  • మీ ఆరోగ్య సంరక్షణ జట్టుతో మాట్లాడండి మరియు మీ గుండె గురించి ఎటువంటి ఉత్తమ శ్రద్ధ తీసుకోవాలి అనే దాని గురించి ప్రశ్నలు అడగండి.
  • బాగా తినండి, చురుకుగా వుండండి, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోండి, మరియు మీ మందులను తీసుకోండి.
  • ధూమపానాన్ని మానివేయండి.
  • గుండెపోటు మరియు స్ట్రోక్ యొక్క హెచ్చరిక సంకేతాలను తెలుసుకోండి.
  • మీ A1C, రక్త పోటు, మరియు కొలెస్ట్రాల్ సంఖ్యలను వ్రాయుటకు మధుమేహం కేర్ రికార్డును ఉపయోగించండి.

 తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు