నిర్వచనం మరియు మలబద్ధకం యొక్క వాస్తవాలు
మలబద్ధకం అంటే ఏమిటి?
మలబద్ధకం అనేది మీరు సాధారణంగా ఈ క్రింది వాటిని కలిగి వుండే ఒక పరిస్థితి:
- వారానికి మూడు కంటే తక్కువ మల విసర్జనలు
- విసర్జించడాన్ని బాధాకరం లేదా కష్టతరం చేసే కష్టమైన, ఎండిపోయిన, మరియు చిన్న విరేచనాలతో కూడిన మల విసర్జనలు
కొంతమంది వారికి ప్రతి రోజూ ఒక మల విసర్జన లేకపోతే తాము మలబద్ధకం చేత ప్రభావితమయినట్లు భావిస్తారు. అయితే, ప్రజలు భిన్నమైన మల విసర్జన నమూనాలను కలిగి ఉండవచ్చు. కొంత మంది వ్యక్తులకు రోజుకు మూడు మల విసర్జనలు ఉండవచ్చు. ఇతర వ్యక్తులకు వారానికి కేవలం మూడు మల విసర్జనలు ఉండవచ్చు.
మలబద్ధకం చాలా తరచుగా కొద్దిసమయం పాటు మాత్రమే కొనసాగుతుంది మరియు ప్రమాదకరమైనది కాదు. మీరు మలబద్ధకాన్ని నిరోధించడానికి లేదా దాని నుంచి ఉపశమనం పొందేందుకు చర్యలు తీసుకోవచ్చు.
మలబద్ధకం అనేది ఎంత సాధారణం?
మలబద్ధకం అనేది అత్యంత సాధారణ గ్యాస్ట్రోఇంటెస్టినల్ (GI) సమస్యల్లో ఒకటి.
ఎవరు మలబద్ధకం చేత ప్రభావితమయ్యే అవకాశం ఉంది?
మలబద్ధకం భారతదేశంలో అన్ని వయసుల వారిలోమరియు జనాభాలలో సర్వసాధారణం, అయితే ఈ క్రింది వారితో సహా కొంతమంది వ్యక్తులు మలబద్ధకం చేత ప్రభావితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి,
- మహిళలు, ముఖ్యంగా గర్భధారణ సమయంలో లేదా జన్మనిచ్చిన తర్వాత
- వృద్ధులు
- కాకాసియన్లు కాని వారు
- తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తులు
- ఈ మధ్యనే శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తులు
- కృంగుబాటుకు చికిత్స చేయడానికి లేదా ఒక విరిగిన ఎముక, ఒక తీసివేయబడిన దంతం, లేదా వెన్నునొప్పి వంటి విషయాల నుండి కలిగే నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు మందులు తీసుకునే వ్యక్తులు
మలబద్ధకం యొక్క సమస్యలు ఏమిటి?
దీర్ఘకాలిక, లేదా దీర్ఘకాలం కొనసాగే మలబద్ధకం అనేది హెర్మరాయిడ్స్, ఆనల్ ఫిషర్, మలాశయ భ్రంశం, లేదా అడ్డుఏర్పడి మలము బంధింపబడుట వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.
హెర్మరాయిడ్స్
హెర్మరాయిడ్స్ అనేవి మీ మలద్వారం చుట్టూ ఉన్న లేదా మీ దిగువ పురీషనాళంలోని వాచిన మరియు ఎర్రబడిన సిరలు. మల విసర్జన కొరకు మీరు శ్రమపడితే మీలో హెర్మరాయిడ్స్ అభివృద్ధి కావచ్చు. మీకు హెర్మరాయిడ్స్ ఉంటే, మీకు మీ పురీషనాళంలో రక్తస్రావం ఉండవచ్చు. మల విసర్జన తరువాత మీరు మీ మలంలో, టాయిలెట్ పేపర్ మీద లేదా టాయిలెట్ లో ముదురు ఎరుపు రక్తం చూస్తే, మీకు పురీషనాళంలో రక్తస్రావం ఉన్నట్టు.
ఆనల్ ఫిషర్స్
ఆనల్ ఫిషర్స్ అనేవి దురద, నొప్పి, లేదా రక్తస్రావం కలిగించ గల మీ మలద్వారంలోని చిన్న చిరుగులు.
మలాశయ భ్రంశం
మీ పురీషనాళం జారి తద్వారా అది మీ మలద్వారానికి బయట అంటుకున్నప్పుడు మలాశయ భ్రంశం జరుగుతుంది. ఇతర కారణాలలో, మీరు మల విసర్జన సమయంలో శ్రమ పడితే మలాశయ భ్రంశం జరుగవచ్చు. మలాశయ భ్రంశం మీ మలద్వారం నుంచి శ్లేష్మం కారడానికి కారణం కావచ్చు. మలాశయ భ్రంశం అనేది మలబద్ధక చరిత్ర కలిగిన వృద్ధులలో సర్వసాధారణం మరియు పురుషుల కంటే మహిళలలో, ముఖ్యంగా ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో కూడా సర్వసాధారణం.
అడ్డుఏర్పడి మలం బంధింపబడుట
మీ పెద్దప్రేగు యొక్క సాధారణ తోసే చర్య మలాన్ని బయటకు తోయడానికి సరిపోనంత గట్టిగా గట్టి మలం మీ ప్రేగు మరియు పురీషనాళంను నింపినప్పుడు, అడ్డుఏర్పడి మలం బంధింపబడుట జరుగుతుంది. అడ్డుఏర్పడి మలం బంధింపబడుట అనేది పిల్లలు మరియు వృద్ధులలో ఎక్కువ తరచుగా సంభవిస్తుంది.
మలబద్ధకం యొక్క లక్షణాలు మరియు కారణాలు
మలబద్ధకం యొక్క లక్షణాలు ఏమిటి?
మలబద్ధకం యొక్క అత్యంత సాధారణ లక్షణాలు
- సాధారణం కంటే తక్కువ మల విసర్జనలు
- విసర్జించడానికి కష్టమైన లేదా బాధాకరమైన మలం
- మీ ఉదరంలో నొప్పి లేదా ఉబ్బరం
ఏది మలబద్ధకంను కలిగిస్తుంది?
మలబద్ధకం అనేక కారణాలతో ఏర్పడవచ్చు మరియు మలబద్ధకానికి ఒక సమయంలో ఒకటి కంటే ఎక్కువ కారణాలు ఉండవచ్చు. మలబద్ధకం యొక్క అత్యంత సాధారణ కారణాలలో ఇవి వుంటాయి
- పెద్దప్రేగు గుండా మలం నెమ్మదిగా కదలడం
- కటి రుగ్మతల ద్వారా పెద్దప్రేగు ఆలస్యంగా ఖాళీ అవటం, ముఖ్యంగా మహిళల్లో
- IBS మరియు మలబద్ధకం రెండింటి లక్షణాలను కలిగి ఉండే, మలబద్ధకంతో కూడిన IBS లేదా IBS-C అని కూడా పిలువబడే ఇరిటబుల్ బోవేల్ సిండ్రోమ్ (IBS) యొక్క ఒక రూపం.
మలబద్ధకం ఈ క్రింది కారకాల కారణంగా తీవ్రం కావచ్చు:
ఫైబర్ (పీచు పదార్ధం) తక్కువ కలిగిన డైట్లు
పీచు మలం మృదువుగా ఉండటానికి సహాయం చేస్తుంది. పీచు మలాన్ని మృదువుగా ఉంచడంలో సహాయం చేయడానికి ద్రవాలు త్రాగండి.
పరిమిత పీచు పదార్థం, శారీరక శ్రమ లేకపోవడం, మరియు మందుల కారణంగా వృద్ధులకు సాధారణంగా మలబద్ధకం ఉంటుంది.
శారీరక శ్రమ లేకపోవడం
మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయకుంటే లేదా చుట్టూ కదలకుంటే మీరు మలబద్ధకం చేత ప్రభావితం కావచ్చు. ఉదాహరణకు, ప్రజలు తక్కువ చురుకుగా ఉండవచ్చు, ఎందుకంటే వారు
- ఇతర ఆరోగ్య సమస్యలను కలిగి ఉన్నారు
- రోజంతా కూర్చుని ఉంటారు మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయరు
- అనారోగ్యం లేదా ప్రమాదం కారణంగా మంచంలో ఎక్కువ సమయం ఉండాల్సి ఉంటుంది
మందులు
ఇతర ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి వైద్యులు సూచించే కొన్ని మందులు మలబద్ధకాన్ని కలిగించవచ్చు. మలబద్ధకం కలిగించు మందులలో ఇవి ఉంటాయి
- అల్యూమినియం మరియు కాల్షియంను కలిగి వుండే యాంటాసిడ్స్—ఉదర ఆమ్లాలను తటస్థీకరించడానికి ఉపయోగించబడేవి
- యాంటికొలినేర్జిక్స్— ప్రేగులలోని కండరాల అనియంత్రిత వ్యాకోచాలకు చికిత్స చేయడానికి ఉపయోగించబడేవి
- యాంటికన్వల్సంట్—ఆకస్మిక మూర్ఛను నిరోధించడానికి మెదడులోని అసాధారణ విద్యుత్ కార్యకలాపాన్ని తగ్గించడానికి ఉపయోగించబడేవి
- యాంటిస్పాస్మాడిక్స్—ప్రేగులలోని కండరాల అనియంత్రిత వ్యాకోచాలను తగ్గించడానికి ఉపయోగించబడేవి
- కాల్షియం ఛానల్ బ్లాకర్స్— అధిక రక్తపోటు మరియు గుండె వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగించబడేవి
- డైయూరిటిక్స్—మూత్రపిండాలు రక్తం నుండి ద్రవాన్ని తొలగించడంలో సహాయం చేయడానికి ఉపయోగించబడేవి
- ఐరన్ సప్లిమెంట్స్—రక్తంలో అధిక ఇనుము స్థాయిలను నిర్మించడానికి ఉపయోగించబడేవి
- పార్కిన్సన్స్ వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగించబడే మందులు
- నార్కోటిక్స్—తీవ్రమైన నొప్పికి చికిత్స చేయడానికి ఉపయోగించబడేవి
- కృంగుబాటుకు చికిత్స చేయడానికి ఉపయోగించే కొన్ని మందులు
జీవితంలో మార్పులు మరియు దినచర్యలో మార్పులు
మీ జీవితం లేదా దినచర్య మారినప్పుడు మలబద్ధకం ఏర్పడవచ్చు. ఉదాహరణకి, మీ మల విసర్జనలు మారవచ్చు
- మీరు ప్రయాణం చేసేటప్పుడు
- మీరు గర్భవతి అయితే
- మీకు వయస్సు పెరిగే కొద్దీ
మల విసర్జన చేయాలనే తపనను విస్మరించడం
మీరు మల విసర్జన చేయాలనే తపనను విస్మరిస్తే, కాలక్రమేణా, మీకు మల విసర్జన చేసే అవసరం ఉందని అనిపించడం ఆగిపోవచ్చు. మీరు మీ ఇంటి వెలుపల ఉండే మరుగుదొడ్లను ఉపయోగించాలని అనుకోవడం లేదు, మీకు ఒక టాయిలెట్ అందుబాటులో లేదు లేదా మీరు చాలా బిజీగా ఉన్నట్లు భావించవచ్చు, కాబట్టి మీరు మల విసర్జన చేయడం ఆలస్యం చేయవచ్చు. ఈ అలవాటు మలబద్ధకానికి దారి తీయవచ్చు.
కొన్ని ఆరోగ్య సమస్యలు
కొన్ని ఆరోగ్య సమస్యలు మీ పెద్దప్రేగు, పురీషనాళం, లేదా మలద్వారం గుండా మలం మరింత నెమ్మదిగా కదిలేటట్లు చేయవచ్చు, దీనివల్ల మలబద్ధకం ఏర్పడవచ్చు. ఈ ఆరోగ్య సమస్యలలో ఈ క్రిందివి ఉంటాయి
- పార్కిన్సన్స్ వ్యాధి వంటి మీ మెదడు మరియు వెన్నెముకను ప్రభావితం చేసే రుగ్మతలు
- వెన్నుపాము లేదా మెదడు గాయాలు
- మధుమేహం
- హైపోథైరాయిడిజం
గ్యాస్ట్రోఇంటెస్టినల్ (GI) నాళ సమస్యలు
మీ పెద్దప్రేగు మరియు పురీషనాళంను కుదించే లేదా తగ్గించే మీ GI భాగం లోని సమస్యలు మలబద్ధకంను కలిగించవచ్చు. ఈ సమస్యలలో ఈ క్రిందివి ఉంటాయి
- కణితులు
- డైవర్టిక్యులైటిస్ లేదా ఇన్ఫ్లేమేటరీ బోవెల్ డిసీజ్ వంటి శోధము లేదా వాపు
క్రియాత్మక జీర్ణకోశ (GI) రుగ్మతలు
ఒక వ్యాధి కారణంగా జరిగిన నష్టం యొక్క ఆధారాలు లేకుండానే మీ GI భాగం ఒక అసాధారణ తీరులో ప్రవర్తించినప్పుడు, క్రియాత్మక GI రుగ్మతలు ఏర్పడతాయి. ఉదాహరణకు, IBS ఒక సాధారణ క్రియాత్మక GI రుగ్మత, మరియు IBS కలిగిన అనేక మంది మలబద్ధకంతో కూడిన IBS ను కలిగి ఉండవచ్చు.
మలబద్ధకం యొక్క నిర్ధారణ
వైద్యులు మలబద్ధకంను ఎలా నిర్ధారిస్తారు?
వైద్యులు ఈ క్రింది వాటి ద్వారా మలబద్ధకంను నిర్ధారిస్తారు
- వైద్యసంబంధ చరిత్ర తీసుకోవడం
- ఒక శారీరక పరీక్ష నిర్వహించడం
- రక్త పరీక్ష వంటి రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం
వైద్య చరిత్ర
వైద్య చరిత్ర ఈ క్రింది వంటి మీ మలబద్ధకం గురించిన ప్రశ్నలను కలిగి ఉంటుంది,
- మీరు ఎంత తరచుగా మలవిసర్జన చేస్తారు
- మీరు ఎంత కాలంపాటు లక్షణాలను కలిగి ఉండినారు
- మీ మలం ఏ విధంగా కనిపిస్తుంది మరియు మీరు మీ మలంలో రక్తాన్ని కలిగి ఉన్నారా లేదా అని
- మీ ఆహారపు అలవాట్లు
- మీ శారీరక శ్రమ యొక్క స్థాయి
- మీరు తీసుకునే మందులు
శారీరక పరీక్ష
శారీరక పరీక్ష డిజిటల్ మలాశయ పరీక్షను కలిగి ఉండవచ్చు. ఒక డిజిటల్ మలాశయ పరీక్ష సమయంలో, మీ వైద్యుడు మిమ్మల్ని టేబుల్ మీదకు వంచుతాడు లేదా మీ మోకాలును మీ ఛాతీకి దగ్గరగా ఉంచుతూ మీ ప్రక్క మీద పడుకోబెడతాడు. ఒక తొడుగు వేసుకున్న తరువాత,సున్నితత్వం, అడ్డంకులు, లేదా రక్తం కోసం తనిఖీ చేయడానికి డాక్టర్ మీ మలద్వారంలోకి ఒక ల్యూబ్రికేటేడ్ వేలును దూరుస్తాడు, మరియు మీ మలద్వార కండరాలను గట్టిగా బిగించుకోమని మిమ్మల్ని అడుగుతాడు.
నిర్ధారణ పరీక్షలు
మీ డాక్టర్ మలబద్ధకం కోసం సూచించగల పరీక్షలు ఈ క్రింది వాటి మీద ఆధారపడి ఉంటాయి
- ఎంత కాలం పాటు మీరు మలబద్ధకం చేత ప్రభావితమయ్యారు
- మీ మలబద్ధకం ఎంత తీవ్రమైనది
- మీ వయస్సు
- మీరు మీ మలంలో రక్తాన్ని కలిగి ఉండినారా అనే విషయం, మీ మల విసర్జన నమూనా, లేదా బరువు తగ్గుదలలోని ఇటీవలి మార్పులు
మలబద్ధకాన్ని నిర్థారించడానికి వైద్యులు ఏ పరీక్షలు ఉపయోగిస్తారు?
ఒక డాక్టర్ మలబద్ధకంను నిర్థారించడానికి ఈ కింది పరీక్షలలో ఒకటి లేదా ఎక్కువ వాటిని ఉపయోగించవచ్చు.
రక్త పరీక్ష
రక్తహీనత లేదా హైపోథైరాయిడిజం వంటి మలబద్ధకాన్ని కలిగించగల కొన్ని పరిస్థితుల కోసం పరీక్షించడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణుడు మీ నుండి ఒక రక్త నమూనా తీసుకోవచ్చు.
ఫ్లెక్సిబుల్ సిగ్మాయిడోస్కోపి లేదా కొలినోస్కోపి (పెద్దప్రేగు పరీక్ష)
ఆ పరీక్షలు ఒకేలాంటివి అయినప్పటికీ, వైద్యులు మీ పురీషనాళం మరియు మొత్తం పెద్దప్రేగును వీక్షించడానికి కోలోనోస్కోపి ఉపయోగించగా, కేవలం మీ పురీషనాళం మరియు దిగువ పెద్దప్రేగును వీక్షించడానికి వారు ఒక ఫ్లెక్సిబుల్ సిగ్మాయిడోస్కోపిని ఉపయోగిస్తారు. ఏ పధ్ధతికైనా, మీరు ఒక టేబుల్ మీద పడుకొని ఉండగా మీ డాక్టర్ మీ మలద్వారంలోకి ఒక అనువైన గొట్టాన్ని ఇన్సర్ట్ చేస్తాడు. గొట్టం మీది ఒక చిన్న కెమెరా మీ ప్రేగు పొర యొక్క ఒక వీడియో చిత్రాన్ని ఒక మానిటర్ కు పంపుతుంది. ఈ పద్దతులు మీ దిగువ జీర్ణశయాంతర (GI) నాళంలోని సమస్యల యొక్క సంకేతాలను చూపవచ్చు.
ఈ రెండు పరీక్షల సమయంలో, మీ డాక్టర్ బయాప్సీ కూడా చెయ్యవచ్చు. డాక్టర్ మీ ప్రేగు పొర యొక్క వివిధ ప్రాంతాల నుంచి కణజాలం యొక్క అనేక చిన్న ముక్కలను తీసుకోవచ్చు. ఒక పాథాలజిస్ట్ ఒక సూక్ష్మదర్శినిని ఉపయోగించి కణజాలాన్ని పరిశీలిస్తారు. మీరు బయాప్సీని అనుభూతి చెందరు.
కొలరెక్టల్ ట్రాన్సిట్ అధ్యయనాలు
కొలరెక్టల్ ట్రాన్సిట్ అధ్యయనాలు అనేవి మీ పెద్దప్రేగు గుండా మలం ఎంత బాగా కదులుతుందో అని చూపించే పరీక్షలు.
- రేడియోపేక్ మార్కర్స్. ఈ పరీక్ష కోసం, వైద్యులు ఒక ఎక్స్-రే లో చూడగల చిన్న రేడియో యాక్టివ్ గుర్తులను కలిగినటువంటి క్యాప్స్యూల్స్ ను మీరు మింగుతారు. మీరు క్యాప్స్యూల్స్ మింగిన మూడు నుండి 7 రోజుల తరువాత, ఒక ఆరోగ్య సంరక్షణ నిపుణుడు మీ పెద్దప్రేగు గుండా మార్కర్ల యొక్క కదలికను ట్రాక్ చేసే మీ ఉదరం యొక్క అనేక ఎక్స్రేలు తీస్తాడు. మలం మరియు మార్కర్లు మీ GI నాళం గుండా కదలడానికి సహాయం చేయడానికి మీరు అధిక ఫైబర్ డైట్ తింటారు. మీరు మలవిసర్జన చేసినప్పుడు మార్కర్లు బయటకు వెళతాయి.
- సింటిగ్రఫీ. ఈ పరీక్ష కోసం, మీరు రేడియోధార్మిక పదార్థాలు కలిగిన భోజనం తింటారు. రేడియోధార్మిక పదార్థాల యొక్క మోతాదు చిన్నది, కాబట్టి సింటిగ్రఫీ మీ కణాలను దెబ్బతీసే అవకాశం లేదు. అవి మీ ప్రేగుల గుండా కదులుతుండగా రేడియోధార్మిక పదార్థాల యొక్క చిత్రాలను సృష్టించడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణుడు కంప్యూటర్లు మరియు మీ ఉదరం మీద మీ శరీరం వెలుపల ఉంచిన ప్రత్యేక కెమెరాలను ఉపయోగిస్తాడు.
ఆనోరెక్టల్ పనితీరు పరీక్షలు
ఆనో రెక్టల్ పనితీరు పరీక్షలు మీ మలద్వారం లేదా పురీషనాళంలోని సమస్యలను చూపగలవు.
- మీ పురీషనాళం ఎంత సున్నితమైనది మరియు ఎంత బాగా పనిచేస్తుంది అని తనిఖీ చెయ్యడానికి ఆనల్ మానోమెట్రి పీడన సెన్సార్లను మరియు ఒక ఆరోగ్య సంరక్షణ నిపుణుడు మీ పురీషనాళం లోపల ఊదే ఒక బెలూన్ ను ఉపయోగిస్తుంది. ఆనల్ మానోమెట్రి మీ మలద్వారం చుట్టూ ఉన్న కండరాల యొక్క బిగుతును మరియు అవి నరాల సంకేతాలకు ఎంత బాగా స్పందిస్తాయి అని కూడా తనిఖీ చేస్తుంది. ఈ పరీక్ష కోసం ఒక ఆరోగ్య సంరక్షణ నిపుణుడు, దాని కొన మీద పీడన సెన్సార్లు మరియు ఒక బెలూన్ ను కలిగి ఉండే ఒక సన్నని గొట్టాన్ని మీ మలద్వారంలోకి ఉంచుతాడు. బెలూన్ మీ పురీషనాళం చేరిన తర్వాత మరియు పీడన సెన్సార్లు మీ మలద్వారంలో ఉన్నప్పుడు, కండరాల స్థాయి మరియు సంకోచనాలను కొలిచేందుకు ఆరోగ్య సంరక్షణ నిపుణుడు గొట్టాన్ని నెమ్మదిగా బయటకు లాగుతాడు. ఈ పరీక్షకు 30 నిమిషాల సమయం పడుతుంది.
- బెలూన్ ఎక్స్పల్షన్ పరీక్షలలో, అతను లేదా ఆమె మీ పురీషనాళం లోకి ఒక బెలూన్ ను ఉంచిన తర్వాత ఆరోగ్య సంరక్షణ నిపుణుడు దానిని వివిధ మొత్తాల నీటితో నింపడం ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ నిపుణుడు మీకు ఒక స్టాప్ వాచ్ మరియు రెస్ట్రూమ్ కు వెళ్ళి బెలూన్ ను బయటకు తోయడానికి మీకు పట్టే సమయం పరిమాణాన్ని కొలువడానికి సూచనలను ఇస్తాడు. లేదా బెలూన్ ను బయటకు తోయడానికి 1 నిమిషం కంటే ఎక్కువ సమయం పడితే, మలాన్ని బయటకు తోయడంలో మీకు ఒక సమస్య ఉండవచ్చు.
దిగువ GI శ్రేణి
ఒక దిగువ GI శ్రేణి అనేది మీ పెద్ద ప్రేగును చూడటానికి వైద్యులు ఉపయోగించే ఒక ఎక్స్- రే పరీక్ష. ఒక ఆరోగ్య సంరక్షణ నిపుణుడు ఆసుపత్రి లేదా అవుట్ పేషెంట్ కేంద్రంలో ఈ ప్రక్రియను నిర్వహిస్తాడు. ఒక ఆరోగ్య సంరక్షణ నిపుణుడు ఈ ప్రక్రియకు ముందు ఇంట్లో ఏమి చేయాలి అనే దాని గురించి వ్రాసిన సూచనలను మీకు ఇవ్వవచ్చు, దీనిని బొవెల్ ప్రెప్ అని పిలుస్తారు.
ఆరోగ్య సంరక్షణ నిపుణుడు ఈ ప్రక్రియకు ముందు 1 నుండి 3 రోజుల పాటు ఒక స్పష్టమైన ద్రవ ఆహారాన్ని అనుసరించమని మిమ్మల్ని అడగవచ్చు. మీరు ప్రక్రియకు ముందు ఒక విరోచనకారి లేదా ఒక ఎనిమ ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉండవచ్చు. విరోచనకారి మరియు ఎనిమా అతిసారం కలిగిస్తాయి, కాబట్టి మీరు బోవేల్ ప్రెప్ సమయంలో బాత్రూంకు దగ్గరగా ఉండాలి.
ఈ ప్రక్రియ కొరకు మీరు ఒక టేబుల్ మీద పడుకొని ఉండగా మీ డాక్టర్ మీ మల ద్వారంలోకి ఒక అనువైన గొట్టాన్ని ఇన్సర్ట్ చేస్తాడు. అప్పుడు మీ డాక్టర్ బేరియంతో మీ పెద్ద ప్రేగును నింపుతాడు, ఇది మలబద్ధకాన్ని కలిగించగల సమస్యల యొక్క సంకేతాలు ఎక్స్-రేలపై మరింత స్పష్టంగా కనపడేటట్లు చేస్తుంది.
మీ పెద్ద పేగులోని బేరియం జాడలు అనేక రోజుల పాటు తెలుపు లేదా లేత రంగు విరేచనమును కలిగించవచ్చు. ఎనిమాలు మరియు మళ్ళీ మళ్ళీ అయ్యే మల విసర్జనలు మల ద్వారం పుండు పడడానికి కారణం కావచ్చు. ఆరోగ్య సంరక్షణ నిపుణుడు ఈ ప్రక్రియ తర్వాత తినడం మరియు త్రాగడం గురించి మీకు నిర్దిష్ట సూచనలను ఇస్తాడు.
డేఫికోగ్రాఫి
డేఫికోగ్రాఫి అనేది మీ మలద్వారం మరియు పురీషనాళం చుట్టూ ఉన్న ప్రాంతం యొక్క ఒక వీడియో ఎక్స్-రే. ఈ ప్రక్రియ మీరు మల విసర్జన ఎలా చేస్తారు అనే దానితో గల సమస్యలను చూపవచ్చు.
ఈ పరీక్ష సమయంలో, ఆరోగ్య సంరక్షణ నిపుణుడు ఎక్స్-రేల పై కనిపించే మరియు మలం లాగా అనిపించే ఒక మృదువైన పేస్ట్ తో మీ పురీషనాళంను నింపుతాడు. మీరు ఒక ఎక్స్- రే మెషిన్ పక్కన ఒక టాయిలెట్ మీద కూర్చుంటారు. ఆరోగ్య సంరక్షణ నిపుణుడు మలాన్ని లోపల ఉంచడానికి మొదట కండరాలను లోపలికి లాగి గట్టిగా బిగించమని మిమ్మల్ని అడుగుతాడు. అప్పుడు, మల విసర్జన చేయడానికి శ్రమపడమని అతను లేదా ఆమె మీకు చెప్తారు. మీరు ఆ పేస్ట్ ను బయటకు తోస్తూ ఉండగా ఏర్పడే సమస్యల కొరకు ఆరోగ్య సంరక్షణ నిపుణుడు గమనిస్తాడు.
మాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ (MRI)
MRI యంత్రాలు మీ శరీరం యొక్క అంతర్గత అవయవాలు మరియు మృదు కణజాలం యొక్క వివరణాత్మక చిత్రాలను ఉత్పత్తి చేయటానికి x రేలు ఉపయోగించకుండా రేడియో తరంగాలు మరియు అయస్కాంతాలను ఉపయోగిస్తాయి.
రోగులకు అనస్థీషియా అవసరం లేదు, అయినప్పటికీ ఒక ఆరోగ్య సంరక్షణ నిపుణుడు పిల్లలకు మరియు చిన్న ప్రదేశాలకు సంబంధించిన భయం గల వ్యక్తులకు నోటితో తీసుకునే తేలికపాటి మత్తు ఇవ్వవచ్చు. ఆరోగ్య సంరక్షణ నిపుణుడు కాంట్రాస్ట్ మీడియం అనే ప్రత్యేక రంగును మీ శరీరంలోకి చొప్పించవచ్చు. చాలా సందర్భాలలో, మీరు ఒక సొరంగం ఆకారంలో ఉండే ఒక పరికరంలోకి జారే ఒక బల్ల మీద మీరు పడుకుంటారు. ఆ సొరంగం తెరుచుకున్న చివరతో ఉండవచ్చు లేదా ఒక చివరన మూసివేయబడవచ్చు. ఒక రేడియాలజిస్టు చిత్రాలను విశ్లేషిస్తాడు. ఒక డాక్టర్ మీకు మలబద్ధకం కలిగించే ఆరోగ్య సమస్యలను నిర్ధారించడానికి MRI చిత్రాలను ఉపయోగించవచ్చు.
కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ (CT) స్కాన్
CT స్కాన్లు చిత్రాలు సృష్టించడానికి ఎక్స్-రేలు మరియు కంప్యూటర్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి. ఒక ఆరోగ్య సంరక్షణ నిపుణుడు మీరు త్రాగడానికి ఒక ద్రావణాన్ని మరియు ఒక కాంట్రాస్ట్ మీడియం ఇంజెక్షన్ ఇవ్వవచ్చు. మీరు ఎక్స్ రేలు తీసుకోబడే ఒక సొరంగం ఆకారంలో ఉండే పరికరంలోకి జారే ఒక బల్ల మీద పడుకుంటారు.రేడియాలజిస్టులు చిత్రాలను సమీక్షిస్తారు. ఒక డాక్టర్ మీకు మలబద్ధకం కలిగించే ఆరోగ్య సమస్యలను నిర్ధారించడానికి MRI చిత్రాలును ఉపయోగించవచ్చు.
రోగులకు అనస్థీషియా అవసరం లేదు, అయినప్పటికీ ఆరోగ్య సంరక్షణ నిపుణులు పిల్లలు పరీక్ష కోసం నిద్రించడంలో సహాయం చేయడానికి వారికి ఒక మత్తును ఇవ్వవచ్చు.
పిల్లలు పుట్టే వయస్సు గల మహిళలు ఒక CT స్కాన్ చేయించుకునే ముందు గర్భధారణ పరీక్ష చేయించుకోవాలి. CT స్కాన్ల నుండి వెలువడే రేడియేషన్ ఒక అభివృద్ధి చెందుతున్న పిండానికి హానికరం కావచ్చు.
మలబద్ధకం కొరకు చికిత్స
వైద్యులు మలబద్ధకానికి ఎలా చికిత్స చేస్తారు?
మలబద్ధకం కోసం చేసే చికిత్స ఈ క్రింది వాటిపై ఆధారపడి ఉంటుంది
- మీకు ఏది మలబద్ధకాన్ని కలిగిస్తుంది
- మీ మలబద్ధకం ఎంత చెడ్డది
- ఎంత కాలం నుండి మీరు మలబద్ధకం చేత ప్రభావితమవుతున్నారు
మలబద్ధకం కోసం చేసే చికిత్సలో ఈ క్రిందివి ఉండవచ్చు:
తినడం, డైట్, మరియు న్యూట్రిషన్ లో మార్పులు
మీ తినడం, డైట్, మరియు న్యూట్రిషన్ లో చేసే మార్పులు మలబద్ధకానికి చికిత్స చేయగలవు. ఈ మార్పులలో ఈ క్రిందివి ఉంటాయి
- రోజంతా ద్రవాలు తాగడం. మీరు ఎంత మరియు ఏ రకమైన ద్రవాలు త్రాగాలి అని ఒక ఆరోగ్య సంరక్షణ నిపుణుడు సిఫార్సు చేయవచ్చు.
- ఎక్కువ పండ్లు మరియు కూరగాయలు తినడం.
- ఎక్కువ ఫైబర్ తినడం.
మలబద్ధకాన్ని నిరోధించడంలో మరియు మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడేందుకు మీరు ఏమి తినాలి అనే దాని గురించి మరియు మీరు మలబద్ధకం చేత ప్రభావితమైతే నివారించవలసిన ఆహారాల గురించి చదవండి.
వ్యాయామం మరియు జీవనశైలి మార్పులు
ప్రతి రోజు వ్యాయామం చేయడం అనేది మలబద్ధకాన్ని నిరోధించడానికి మరియు మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడవచ్చు.
మీరు ప్రతీ రోజు ఒకటే సమయంలో మల విసర్జన చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు. రోజులో ఒక నిర్దిష్ట సమయాన్ని ఎంచుకోవడం అనేది మీరు క్రమం తప్పకుండా మల విసర్జన చేయడంలో సహాయపడవచ్చు. ఉదాహరణకు, కొంతమంది అల్పాహారం చేసిన 15 నుంచి 45 నిమిషాల తర్వాత మల విసర్జన చేయడానికి ప్రయత్నించడం అనేది మల విసర్జన చేయడంలో వారికి సహాయపడుతుంది అని కనుగొంటారు. తినడం మీ పెద్దప్రేగు మలాన్ని కదిలించడంలో సహాయపడుతుంది. మల విసర్జన కొరకు మీకు మీరు తగినంత సమయం ఇవ్వాలని నిర్ధారించుకోండి. మీకు మల విసర్జన చేయాలనే తపన అనిపించిన వెంటనే మీరు బాత్రూమ్ ను కూడా ఉపయోగించాలి.
ఓవర్-ది-కౌంటర్ (ప్రిస్క్రైబ్ చేయని) మందులు
మీరు అన్ని సరైన విషయాలు చేస్తున్నప్పటికీ మలబద్ధకం చేత ప్రభావితమవుతుంటే, కొద్ది కాలం పాటు ఒక విరోచనకారిని ఉపయోగించమని మీ డాక్టర్ సూచించవచ్చు. ఏ రకమైన విరేచనకారి మీ కొరకు ఉత్తమమైనది అని మీ డాక్టర్ మీకు చెబుతాడు. ఓవర్-ది-కౌంటర్ విరోచనకారులు ద్రవ రూపం, టాబ్లెట్, క్యాప్స్యూల్, పొడి, మరియు రేణువులతో సహా పలు రూపాల్లో వస్తాయి.
మీరు మలబద్ధకం కలిగించగల ఒక ఓవర్-ది-కౌంటర్ లేదా ప్రిస్కిప్షన్ మందు లేదా సప్లిమెంట్ తీసుకుంటుంటే, దానిని తీసుకోవడం ఆపమని లేదా మరొకదానికి మారమని మీ డాక్టర్ మీకు సూచించవచ్చు.
బల్క్-ఫార్మింగ్ ఏజెంట్స్. బల్క్-ఫార్మింగ్ ఏజెంట్స్ మీ ప్రేగులలోని ద్రవాన్ని గ్రహించి మీ మలాన్ని పెద్దవిగా చేస్తాయి. పెద్దగా మారిన మలం అనేది కుదించుకుపోవడానికి మరియు మలాన్ని బయటకు తోయడానికి ప్రేగును ప్రేరేపించడంలో సహాయపడుతుంది. బల్క్-ఫార్మింగ్ ఏజెంట్స్ ను నీటితో పాటు తీసుకోవాలని నిర్ధారించుకోండి లేకపోతే అవి మీ ప్రేగు లోఒక అడ్డంకిని లేదా ఒక ప్రతిష్టంభనను కలిగించవచ్చు. అవి మీ ఉదరంలో ఉబ్బరం మరియు నొప్పిని కూడా కలిగించవచ్చు.
ఆస్మాటిక్ ఏజెంట్స్. ఆస్మాటిక్ ఏజెంట్స్ మలం ద్రవాన్ని నిలబెట్టుకోవడంలో సహాయం చేస్తాయి. ఎక్కువ ద్రవం గల మలం మీ మల విసర్జనల సంఖ్యను పెంచుతుంది మరియు మలాన్ని మృదువుగా మారుస్తుంది. ఆస్మాటిక్ ఏజెంట్స్ తీసుకునేటప్పుడు వృద్ధులు మరియు గుండె లేదా మూత్రపిండాల వైఫల్యం గల వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. అవి నిర్జలీకరణం (డీహైడ్రేషన్) లేదా ఒక ఖనిజ అసమతుల్యత (మినరల్ ఇమ్బాలన్స్) ను కలిగించవచ్చు.
స్టూల్ సాఫ్టనర్స్ (మలాన్ని మృదువుగా చేసేవి). మలాలను మదువుగా చేయడానికి వాటిలోకి ద్రవాన్ని కలిపేందుకు స్టూల్ సాఫ్టనర్స్ సహాయం చేస్తాయి. మల విసర్జన చేస్తుండగా శ్రమ పడకూడని వ్యక్తుల కొరకు వైద్యులు స్టూల్ సాఫ్టనర్స్ ను సిఫార్సు చేస్తారు. వైద్యులు తరచుగా శస్త్రచికిత్స తర్వాత లేదా ప్రసవం తర్వాత మహిళల కొరకు స్టూల్ సాఫ్టనర్స్ ను సిఫార్సు చేస్తారు.
లుబ్రికాంట్స్. లుబ్రికాంట్లు మలం యొక్క ఉపరితలంపై పూత పూయడం ద్వారా పని చేస్తాయి, ఇది మలం ద్రవాన్ని పట్టి ఉంచడానికి మరియు మరింత సులభంగా విసర్జించడానికి సహాయపడుతుంది. లుబ్రికాంట్లు సులభమైన, చౌకైన విరోచనకారులు. వైద్యులు ఆనోరెక్టల్ అవరోధం గల వ్యక్తుల కొరకు లుబ్రికాంట్లను సిఫారసు చేయవచ్చు.
ఈ విరోచనకారులు మీకు పని చేయకపోతే, మీ డాక్టర్ ఈ క్రింది వాటితో సహా ఇతర రకాల విరోచనకారులను సిఫారసు చేయవచ్చు
ఉత్తేజకాలు. ఉత్తేజక విరోచనకారులు ప్రేగులు కుదించుకుపోవడానికి కారణం అవుతాయి, ఇది మలాన్ని కదిలిస్తుంది. మీ మలబద్ధకం తీవ్రమైనది అయితే లేదా ఇతర చికిత్సలు పని చెయ్యకపోతే మాత్రమే మీరు ఉత్తేజకాలు వాడాలి.
ప్రజలు ఫీనోఫ్తలైన్ ను కలిగి ఉండే ఉత్తేజక విరోచనకారులను ఉపయోగించరాదు. ఫీనోఫ్తలైన్ కాన్సర్ వచ్చే మీ అవకాశాలను పెంచవచ్చు. భారతదేశంలో అమ్మబడే అధికభాగం విరోచనకారులలో ఫీనోఫ్తలైన్ ఉండదు. మందు యొక్క ప్యాకేజీ లేదా సీసా మీది పదార్థాలను తప్పక తనిఖీ చేయండి.
మీరు చాలా కాలం నుండి విరోచనకారులను తీసుకుంటుంటే మరియు ఒక విరోచనకారి తీసుకోకుండా మల విసర్జన చేయలేకపోతే, మీరు వాటిని ఉపయోగించడం నెమ్మదిగా ఎలా ఆపవచ్చనే దాని గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి. మీరు విరోచనకారులను తీసుకోవడం ఆపివేస్తే, కాలక్రమేణా, మీ పెద్దప్రేగు మలాన్ని సాధారణంగా కదిలించడం ప్రారంభించాలి.
ప్రిస్క్రిప్షన్ మందులు
ఓవర్ ది కౌంటర్ ఔషధాలు మీ వ్యాధి లక్షణాల నుండి ఉపశమనాన్ని ఇవ్వకపోతే, మీ డాక్టర్ ఈ క్రింది మందులలో ఒక దానిని సూచించవచ్చు:
క్లోరైడ్ ఛానల్ యాక్టివేటర్. మీరు దీర్ఘకాల లేదా ఇడియోపథిక్ (కారణం తెలియని) మలబద్ధకంతో కూడిన ఇరిటబుల్ బోవేల్ సిండ్రోమ్ (IBS) ను కలిగి ఉంటే, మీ డాక్టర్ లుబిప్రొస్టోన్ ను సూచించవచ్చు. లుబిప్రొస్టోన్ ఒక ప్రిస్క్రిప్షన్ తో అందుబాటులో ఉన్న క్లోరైడ్ ఛానల్ యాక్టివేటర్. 6 నుంచి 12 నెలల పాటు ఉపయోగించినప్పుడు, లుబి ప్రొస్టోన్ సురక్షితమైనది అని పరిశోధన చూపించింది. ఈ రకం మందు మీ GI భాగంలోని ద్రవాన్ని పెంచుతుంది, ఇది ఈ క్రింది వాటికి సహాయపడుతుంది
- మీ ఉదరంలోని నొప్పి లేదా అసౌకర్య ాన్ని తగ్గించడానికి
- మీ మలాన్ని మృదువుగా చేయటానికి
- మల విసర్జన చేసేటప్పుడు శ్రమ పడాల్సిన మీ అవసరాన్ని తగ్గించటానికి
- మీరు మల విసర్జన చేసే తరచుదనాన్ని పెంచడానికి
గ్వానలేట్ సైక్లాస్-సి అగోనిస్ట్. మీకు దీర్ఘకాల లేదా ఇడియోపథిక్ మలబద్ధకంతో కూడిన IBS ఉంటే, మీ డాక్టర్ మీ మల విసర్జనలను క్రమబద్ధం చేయడంలో సహాయం చేయడానికి లినక్లోటైడ్ ను సూచించవచ్చు. లినక్లోటైడ్ అనేది మీ ఉదరంలోని నొప్పిని సడలించే మరియు మీ మల విసర్జనల తరచుదనాన్ని వేగవంతం చేసే ఒక గ్వానలేట్ సైక్లాస్-సి అగోనిస్ట్.
బయోఫీడ్బ్యాక్ (జీవన క్రియ మార్పుల సూచన)
మీకు మల విసర్జనలను నియంత్రించే కండరాలతో సమస్యలు ఉంటే, మీ డాక్టర్ మీ కండరాలను రీట్రైన్ (కొత్త నైపుణ్యాలను బోధించడం) చేయడానికి బయోఫీడ్బ్యాక్ ను సిఫారసు చేయవచ్చు. శారీరక విధులను కొలిచేందుకు బయోఫీడ్బ్యాక్ ప్రత్యేక సెన్సార్లను ఉపయోగిస్తుంది. ఒక వీడియో మానిటర్ కొలతలను లైన్ గ్రాఫ్లు లాగా చూపిస్తుంది మరియు పరికరాలు నుండి వచ్చే ధ్వనులు మీరు సరైన కండరాలను ఉపయోగిస్తున్నప్పుడు మీకు తెలియజేస్తాయి. మానిటర్ చూడటం మరియు శబ్దాలను వినడం ద్వారా, మీరు కండర పనితీరును ఎలా మార్చాలి అని నేర్చుకుంటారు. ఇంట్లో సాధన చేయడం అనేది కండరాల పనితీరును మెరుగుపరచవచ్చు. మీరు శిక్షణ నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి ముందు 3 నెలలు సాధన చేయవలసి రావచ్చు.
శస్త్రచికిత్స
మలాశయ భ్రంశం కారణంగా సంభవించిన ఆనోరెక్టల్ అవరోధానికి చికిత్స చేయటానికి ఇతర చికిత్సలు పని చేయకపోతే, మీకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. మీ పెద్దప్రేగు కండరాలు సరిగ్గా పని చేయకపోతే, మీ పెద్దప్రేగును తొలగించడానికి మీకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. మీ డాక్టర్ శస్త్రచికిత్స యొక్క ప్రయోజనాలు మరియు ప్రమాదాల గురించి మీకు తెలియచేస్తాడు.
వైద్యులు మలబద్ధకం యొక్క సమస్యలకు ఎలా చికిత్స చేస్తారు?
వైద్యులు మలబద్ధకం యొక్క సమస్యలకు చికిత్స చేస్తారు లేదా ఎలా చికిత్స చేయాలి అని తెలియచేస్తారు. హెర్మరాయిడ్స్, ఆనల్ ఫిషర్స్, మలాశయ భ్రంశం, లేదా అడ్డుఏర్పడి మలము బంధింపబడుట అనే ఈ అన్నిటికీ వేరు వేరు చికిత్సలు ఉన్నాయి.
హెర్మరాయిడ్స్
ఈ క్రింది వాటి ద్వారా మీరు ఇంట్లోనే హెర్మరాయిడ్స్ కు చికిత్స చేయవచ్చు
- మలబద్ధకాన్ని నిరోధించడానికి ఆహార మార్పులు చేయడం
- వెచ్చని టబ్ స్నానాలు చేయడం
- నిద్రవేళకు ముందు ఆ ప్రాంతంలో ఓవర్ ది కౌంటర్ హెర్మరాయిడ్స్ క్రీమ్ ను పూయడం లేదా సప్పోసిటరి—మీరు మీ పురీషనాళంలోకి ఇన్సర్ట్ చేసే ఒక మందు—ను ఉపయోగించడం
ఇంటి వద్ద చేసే చికిత్సలకు స్పందించని హెర్మరాయిడ్స్ గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి.
ఆనల్ ఫిషర్స్
ఈ క్రింది వాటి ద్వారా మీరు ఇంట్లోనే ఆనల్ ఫిషర్స్ కు చికిత్స చేయవచ్చు
- మలబద్ధకాన్ని నిరోధించడానికి ఆహార మార్పులు చేయడం
- ఆ ప్రాంతాన్ని మొద్దుబర్చడానికి లేదా మీ కండరాలను రిలాక్స్ చేయడానికి ఓవర్ ది కౌంటర్ హెర్మరాయిడ్స్ క్రీమ్ ను పూయడం
- స్టూల్ సాఫ్టనర్స్ ను ఉపయోగించడం
- వెచ్చని టబ్ స్నానాలు చేయడం
ఇంటి వద్ద చేసే చికిత్సలకు స్పందించని ఆనల్ ఫిషర్స్ కు చికిత్స చేయడానికి మీ డాక్టర్ శస్త్రచికిత్సను సిఫారసు చేయవచ్చు.
మలాశయ భ్రంశం
మీ డాక్టర్ అతని లేదా ఆమె కార్యాలయంలో మాన్యువల్ గా మీ పురీషనాళంను మలద్వారం గుండా తిరిగి నెట్టడం ద్వారా మీ మలాశయ భ్రంశం కు చికిత్స చేయగలగవచ్చు. మీకు తీవ్రమైన లేదా దీర్ఘకాలిక—ఎక్కువ సేపు ఉండే—మలాశయ భ్రంశం ఉంటే, మీకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. శస్త్రచికిత్స మీ ఆనల్ స్పిన్స్టార్ కండరాలను బలోపేతం చేస్తుంది మరియు బిగిస్తుంది మరియు భ్రంశం చెందిన పొరను మరమ్మతు చేస్తుంది. మీరు మల విసర్జన సమయంలో శ్రమ పడకుండా ఉండడం ద్వారా మలబద్ధకం వలన ఏర్పడిన మలాశయ భ్రంశంను నిరోధించడానికి సహాయం చేయవచ్చు.
అడ్డుఏర్పడి మలము బంధింపబడుట
నోటి ద్వారా లేదా ఒక ఎనిమా ద్వారా తీసుకునే ఖనిజ నూనెతో బందిపబడి నిలిచిపోయున మలాన్ని మీరు మృదువుగా చేయవచ్చు. బందిపబడి నిలచిపోయిన మలాన్ని మృదువుగా చేసిన తరువాత, మీ మలద్వారం లోకి ఒకటి లేదా రెండు తొడుగు వేసుకున్న, లుబ్రికేటేడ్ వేళ్లను ఇన్సర్ట్ చెయ్యడం ద్వారా ఒక ఆరోగ్య సంరక్షణ నిపుణుడు గట్టిపడిన మలం యొక్క ఒక భాగాన్ని విచ్ఛిన్నం చేసి తీసివేయవచ్చు.
మలబద్ధకం కొరకు తినడం, డైట్ మరియు న్యూట్రిషన్
మలబద్ధకాన్నినిరోధించడానికి మరియు మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి మీ డైట్ ఎలా సహాయపడగలదు?
మీ ఆహారంలోని ఫైబర్ మరింత మెరుగ్గా పని చేయడంలో సహాయం చేయడానికి మీరు నీరు మరియు పండ్లు మరియు కూరగాయల రసాలు మరియు పల్చటి సూపులు వంటి ఇతర ద్రవాలను త్రాగండి. ఈ మార్పు మీ మలాన్ని మరింత సాధారణంగా మరియు క్రమబద్ధంగా చేయాలి. మీ ఆరోగ్యం మరియు శ్రమ స్థాయి మరియు మీరు ఎక్కడ నివసిస్తున్నారు అనే వాటి ఆధారంగా మీరు ప్రతి రోజు ఎంత త్రాగాలి అనే దాని గురించి మీ వైద్యుడిని అడగండి.
వారి వయస్సు మరియు సెక్స్ మీద ఆధారపడి, పెద్దలు రోజుకు 22 నుండి 34 గ్రాముల ఫైబర్ ను పొందాలి. వృద్ధులు కొన్నిసార్లు ఆహరంలో ఆసక్తి కోల్పోవచ్చు కాబట్టి వారి ఆహారంలో తగినంత ఫైబర్ ను పొందరు. మీరు ముసలి వారై మరియు ఆహారంలో ఆసక్తి కోల్పోయి ఉంటే, మీ డాక్టర్ తో మాట్లాడండి, ఒకవేళ
- ఒకప్పుడు ఉండే మాదిరిగా ఆహారం అదే విధంగా రుచించకుంటే
- మీకు అంత తరచుగా ఆకలిగా అనిపించకపోతే
- మీకు వండాలని అనిపించకపోతే
- మీకు నమలడం లేదా మింగడంలో సమస్యలు ఉంటే
మీ కొరకు సరైన పరిమాణంలో ఫైబర్ ను కలిగిన ఒక డైట్ ను ప్లాన్ చేయమని మీ డాక్టర్ తో మాట్లాడండి. మీ శరీరం మార్పుకు అలవాటు పడడానికి వీలుగా మీ డైట్ కు ఒకసారికి కొద్ది ఫైబర్ ను జోడించాలని నిర్ధారించుకోండి.
తక్కువ ఆరోగ్యకరమైన ఆహారాలను ఫైబర్ కలిగిన ఆహారాలతో భర్తీ చేయడంలో సహాయం చేయడానికి ఈ పట్టిక ను ఒక పరికరంగా ఉపయోగించండి.
ఫైబర్ కలిగిన ఆహారాల యొక్క ఉదాహరణలు1 | |
బీన్స్, తృణధాన్యాలు, మరియు బ్రెడ్లు | ఫైబర్ |
½ కప్పు బీన్స్ (నావి, పింటో, కిడ్నీ, మొదలైనవి), వండినవి | 6.2–9.6 గ్రాములు |
½ కప్పు తరిగిన గోధుమ, తినడానికి సిద్ధంగా ఉన్న తృణధాన్యాలు | 2.7-3.8 గ్రాములు |
⅓ కప్పు 100% ఊక, తినడానికి సిద్ధంగా వున్న తృణధాన్యాలు | 9.1 గ్రాములు |
1 చిన్న వోట్ బ్రాన్ మఫిన్ | 3.0 గ్రాములు |
1 హోల్-వీట్ ఇంగ్లీష్ మఫిన్ | 4.4 గ్రాములు |
పండ్లు | |
1 చిన్న ఆపిల్, తొక్కతో | 3.6 గ్రాములు |
1 మీడియం పియర్, తొక్కతో | 5.5 గ్రాములు |
½ కప్పు రాస్ప్బెర్రీస్ | 4.0 గ్రాములు |
½ కప్పు వేడినీటితో వండిన ప్రూనే | 3.8 గ్రాములు |
కూరగాయలు | |
½ కప్పు శీతాకాల గుమ్మడికాయ, వండినది | 2.9 గ్రాములు |
1 మీడియం చిలగడదుంప, తొక్కతో బేక్ చేసినది | 3.8 గ్రాములు |
½ కప్పు ఆకుపచ్చ బటానీలు, వండినవి | 3.5-4.4 గ్రాములు |
1 చిన్న బంగాళదుంప, తొక్కతో బేక్ చేసినది | 3.0 గ్రాములు |
½ కప్పు మిశ్రమ కాయగూరలు, వండినవి | 4.0 గ్రాములు |
½ కప్పు బ్రోకలీ, వండినది | 2.6-2.8 గ్రాములు |
½ కప్పు ఆకుకూరలు( పాలకూర, కల్లర్డ్, టర్నిప్ గ్రీన్స్), వండినవి | 2.5-3.5 గ్రాములు |
మీరు మలబద్ధకం చేత ప్రభావితమైతే మీరు వేటిని తినడం మానుకోవాలి?
మీరు మలబద్ధకం చేత ప్రభావితమైతే, ఈ క్రింది వాటి వంటి ఫైబర్ కొద్దిగా గల లేదా ఏమాత్రం ఫైబర్ లేని చాలా ఎక్కువ ఆహారాలు తినడానికి ప్రయత్నించకండి,
- ఛీజ్
- చిప్స్
- ఫాస్ట్ ఫుడ్
- ఐస్ క్రీం
- మాంసం
- కొన్ని ఫ్రొజెన్ మీల్స్ మరియు చిరుతిండ్లు వంటి తయారుచేసిన ఆహారాలు
- హాట్ డాగ్లు లేదా కొన్ని మైక్రోవేవ్ చేయగలిగిన భోజనాలు వంటి ప్రాసెస్ చేయబడిన ఆహారాలు