మధుమేహానికి మీ గైడ్: టైప్ 1 మరియు టైప్ 2

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456


మధుమేహం
గురించి తెలుసుకోండి

మీరు మీ మధుమేహం గురించి ఎలా జాగ్రత్త తీసుకోవాలో మరియు మధుమేహం కలిగించే కొన్ని తీవ్రమైన సమస్యలను ఎలా నిరోధించాలో తెలుసుకోగలరు. మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటే, అంత బాగా మీరు మీ మధుమేహాన్ని నిర్వహించగలరు.

మధుమేహం అంటే ఏమిటి?

రక్తంలో చక్కెర అని కూడా పిలువబడే మీ రక్తంలో గ్లూకోజ్, చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మధుమేహం అని అంటారు. రక్తంలో గ్లూకోజ్ అనేది మీ రక్తంలో కనిపించే చక్కెర యొక్క ప్రధాన రకం మరియు మీ శక్తి యొక్క  ప్రధాన మూలం. గ్లూకోజ్ మీరు తినే ఆహారం నుండి వస్తుంది మరియు మీ కాలేయం మరియు కండరాలలో కూడా తయారు చేయబడుతుంది. శక్తి కోసం ఉపయోగించడానికి మీ రక్తం మీ శరీరం యొక్క అన్ని కణాలకు గ్లూకోజ్ ను చేరవేస్తుంది.

మీ కడుపు మరియు వెన్నెముక మధ్య ఉండే ఒక అవయవమైన, జీర్ణక్రియకు సహాయపడేటటువంటి, మీ క్లోమం – ఇన్సులిన్ అని పిలువబడే ఒక హార్మోనును మీ రక్తంలోకి విడుదల చేస్తుంది. ఇన్సులిన్ మీ శరీరం యొక్క కణాలు అన్నింటికీ  గ్లూకోజును చేరవేయడానికి మీ రక్తానికి సహాయపడుతుంది. కొన్నిసార్లు మీ శరీరం తగినంత ఇన్సులిన్ తయారు చేయదు లేదా ఇన్సులిన్ అది చేయవలసిన తీరులో పని చేయదు. అప్పుడు గ్లూకోజ్  మీ రక్తంలో ఉండిపోతుంది మరియు మీ కణాలను  చేరుకోదు. మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు చాలా అధికమౌతాయి మరియు మధుమేహం లేదా ప్రీడయాబెటస్ ను కలిగించవచ్చు. కాలక్రమేణా, మీ రక్తంలో చాలా గ్లూకోజ్ ను కలిగి ఉండటం అనేది ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.

ప్రీడయాబెటస్ అంటే ఏమిటి?

మీ రక్తంలో గ్లూకోజు పరిమాణం సాధారణం కంటే ఎక్కువ ఉండి, కానీ మధుమేహం అని పిలిచేంత స్థాయిలో ఇంకా లేనప్పుడు ప్రీడయాబెటస్ అంటారు. ప్రీడయాబెటస్ తో, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బు, మరియు స్ట్రోక్ పొందే అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి. కొంత బరువు కోల్పోవడం మరియు ఒక మోస్తరు శారీరక శ్రమతో మీరు టైప్ 2 మధుమేహాన్ని ఆలస్యం చేయవచ్చు లేదా నిరోధించవచ్చు. మీరు బహుశా ఏ మందులు తీసుకోకుండా, సాధారణ గ్లూకోజు స్థాయిలకు కూడా తిరిగి చేరుకోవచ్చు.

మధుమేహం యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మధుమేహం యొక్క సంకేతాలు మరియు లక్షణాలు:

  • చాలా దాహంగా ఉండటం
  • తరచుగా మూత్ర విసర్జన చేయడం
  • చాలా ఆకలిగా అనిపించటం
  • చాలా అలసటగా అనిపించటం
  • ప్రయత్నం లేకుండా బరువు కోల్పోవడం
  • నిదానంగా నయమయ్యే పుళ్ళు
  • పొడిగా, దురదగా ఉండే చర్మం
  • మీ పాదములలో పిన్నులు మరియు సూదులు ఉన్నట్లు అనిపించడం
  • మీ పాదములలో స్పర్శ కోల్పోవడం
  • అస్పష్ట కంటిచూపు

మధుమేహం ఉండే కొంత మంది వ్యక్తులకు ఈ సంకేతాలు లేదా లక్షణాలు ఏవీ ఉండవు. మీకు ఒకవేళ మధుమేహం ఉందా అని తెలుసుకోవడానికి ఏకైక మార్గం- మీ డాక్టర్ తో రక్త పరీక్ష చేయించడం.

మీకు విధమైన మధుమేహం ఉంది?

మధుమేహం యొక్క మూడు ప్రధాన రకాలు టైప్ 1, టైప్ 2, మరియు గర్భధారణ మధుమేహం. ప్రజలలో ఏ వయసులోనైనా మధుమేహం అభివృద్ధి  కావచ్చు. స్త్రీ మరియు పురుషులు ఇద్దరిలో మధుమేహం అభివృద్ధి కావచ్చు.

టైప్ 1  మధుమేహం

బాల్య మధుమేహం అని పిలవబడుతున్న టైప్ 1 మధుమేహం, యుక్త వయస్సు ఉన్న వారిలో ఎక్కువ తరచుగా అభివృద్ధి చెందుతుంది; అయితే,  టైప్ 1 మధుమేహం పెద్దవారిలో కూడా అభివృద్ధి కావచ్చు. టైప్ 1 మధుమేహంలో, మీ శరీరం ఇకపై ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయదు లేదా తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయదు ఎందుకంటే, సాధారణంగా బ్యాక్టీరియా, వైరస్లు, మరియు ఇతర హానికరమైన పదార్థాలను తొలగించడం  ద్వారా ఇంఫెక్షనుల నుండి మిమ్మల్ని రక్షించే శరీరం యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ  ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే కణాల మీద దాడి చేసి నాశనం చేసింది.

టైప్ 1 మధుమేహం కోసం చికిత్స ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది:

  • ఇన్సులిన్ ఇంజక్షన్లు అని కూడా పిలువబడే, షాట్లను తీసుకోవడం
  • కొన్నిసార్లు నోటి ద్వారా మందులు తీసుకోవడం.
  • ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు చేసుకోవడం.
  • భౌతికంగా చురుకుగా ఉండటం.
  • మీ రక్తపోటు స్థాయిలను నియంత్రించడం. రక్తపోటు అంటే మీ రక్త నాళాల లోపల ఉండే రక్త ప్రవాహం యొక్క శక్తి.
  • మీ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం. కొలెస్ట్రాల్ అంటే మీ రక్తంలో మీ శరీర కణాలలో మరియు అనేక ఆహారాలలో ఉండే ఒక రకమైన కొవ్వు.

టైప్ 2  మధుమేహం

పెద్దల మధుమేహం అని పిలవబడే టైప్ 2 మధుమేహం, ఏ వయసులోని వారినైనా, పిల్లలను  కూడా, ప్రభావితం చేయవచ్చు. అయితే, టైప్ 2 మధుమేహం మధ్య వయస్కులు మరియు ఎక్కువ వయస్సు ఉన్న వారిలో ఎక్కువ తరచుగా అభివృద్ధి చెందుతుంది. అధిక బరువు మరియు చురుకుగా లేకుండా ఉండే వారిలోకూడా టైప్ 2 మధుమేహం అభివృద్ధి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

టైప్ 2 మధుమేహం సాధారణంగా ఇన్సులిన్ నిరోధకతతో ప్రారంభమవుతుంది – అది కొవ్వు, కండరాల, మరియు కాలేయ కణాలు శక్తి కోసం ఉపయోగించడానికి శరీర కణాలలోకి గ్లూకోజ్ ను తీసుకువెళ్ళడానికి ఇన్సులిన్ ను వాడనప్పుడు ఏర్పడే ఒక పరిస్థితి. ఫలితంగా, గ్లూకోజ్ కణాలలోకి ప్రవేశించేందుకు సహాయం చేయడానికి శరీరానికి ఇన్సులిన్ అవసరం అవుతుంది. మొదట, క్లోమం మరింత ఇన్సులిన్ ను తయారు చేయడం ద్వారా అదనపు డిమాండ్ ను నిర్వహిస్తుంది. కాలక్రమేణా, ఆహారం తీసుకున్న తరువాత వంటి సందర్భాలలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, క్లోమం తగినంత ఇన్సులిన్ ను తయారు చేయదు. మీ క్లోమం ఇకపై తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేకుంటే, మీరు మీ టైప్ 2 మధుమేహానికి చికిత్స చేయవలసిన అవసరం ఉంటుంది.

టైప్ 2 మధుమేహం కోసం చికిత్స ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది:

  • మధుమేహ మందులను ఉపయోగించడం
  • ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు చేసుకోవడం
  • భౌతికంగా చురుకుగా ఉండటం
  • మీ రక్తపోటు స్థాయిలను నియంత్రించడం
  • మీ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం

గర్భధారణ మధుమేహం

ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు గర్భధారణ మధుమేహం అభివృద్ధి చెందవచ్చు. గర్భిణీ స్త్రీలు ఇన్సులిన్ నిరోధకతకు దారితీసే హార్మోన్లను ఉత్పత్తి చేస్తారు. అందరు మహిళలకు వారి గర్భధారణ సమయము చివరిలో ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది. గర్భధారణ సమయంలో క్లోమం తగినంత ఇన్సులిన్ ను తయారు చేయనట్లయితే, ఒక మహిళలో  గర్భధారణ మధుమేహం అభివృద్ధి చెందుతుంది.

అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉండే మహిళలకు గర్భధారణ మధుమేహం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే, గర్భధారణ సమయంలో చాలా ఎక్కువ బరువు పెరగడం అనేది కూడా మీకు గర్భధారణ మధుమేహం వచ్చే అవకాశాలను పెంచవచ్చు.

చాలా తరచుగా, బిడ్డ పుట్టిన తర్వాత గర్భధారణ మధుమేహం వెళ్ళిపోతుంది. అయితే, గర్భధారణ మధుమేహం కలిగి ఉండిన ఒక మహిళకు, తరువాతి జీవితంలో టైప్ 2 మధుమేహం అభివృద్ధి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భధారణ మధుమేహం కలిగిన తల్లులకు పుట్టిన పిల్లలలో కూడా ఊబకాయం మరియు టైప్ 2 మధుమేహం అభివృద్ధి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఎందుకు మీరు మీ మధుమేహం గురించి జాగ్రత్త వహించాలి?

కాలక్రమేణా, మధుమేహం మీ రక్తనాళాలు, గుండె, నరాలు, మూత్రపిండాలు, నోరు, కళ్ళు, మరియు కాళ్ళలో తీవ్రమైన సమస్యలకు దారి తీయవచ్చు. ఈ సమస్యలు ఉదాహరణకు, ఒక దెబ్బతిన్న బొటనవేలు, పాదం, లేదా కాలు తొలగించడానికి చేసే శస్త్రచికిత్స అయిన ఒక విచ్ఛేదనానికి దారి తీయవచ్చు.

మధుమేహం వల్ల వచ్చే చాలా తీవ్రమైన సమస్య గుండె వ్యాధి. మీకు మధుమేహం ఉన్నప్పుడు, మధుమేహం లేని వారి కంటే గుండె వ్యాధి లేదా ఒక స్ట్రోక్ ను పొందే అవకాశం మీకు రెండింతలు ఎక్కువగా ఉంటుంది. మధుమేహంతో మీకు గుండెపోటు యొక్క సాధారణ సంకేతాలు లేదా లక్షణాలు ఉండకపోవచ్చు. మీ ఆరోగ్య గురించి శ్రద్ధ వహించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, మీ రక్తంలో గ్లూకోజ్, రక్తపోటు, మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను మీ లక్ష్య పరిధిలో ఉంచడానికి మీ ఆరోగ్య సంరక్షణ టీం తో కలిసి పని చేయడం. టార్గెట్స్ అనేవి మీరు ప్రయత్నించే సంఖ్యలు.

మీ ఆరోగ్య  సంరక్షణ  బృందంలో ఎవరు భాగస్తులు?

మధుమేహం ఉన్న చాలా మంది ఇంటర్నిస్ట్స్, కుటుంబ వైద్యులు, లేదా పీడియాట్రిషియన్స్ వంటి ప్రాధమిక సంరక్షణ అందించేవారి నుండి సంరక్షణ పొందుతారు. ఒక ఆరోగ్య సంరక్షణ బృందం కూడా మీ మధుమేహ సంరక్షణను మెరుగుపరచగలదు.

ఒక ప్రాధమిక సంరక్షణ ప్రదాతతో పాటుగా, మీ ఆరోగ్య సంరక్షణ బృందం ఈ క్రింది వారిని కలిగి ఉండవచ్చు:

  • మరింత ప్రత్యేకత కల్గిన మధుమేహ సంరక్షణకు ఒక మధమేహ వ్యాధి నిపుణుడు
  • మధుమేహం నిర్వహించడం గురించి సమాచారం అందించగల నిపుణులైన ఒక డైటీషియన్, ఒక నర్సు, లేదా ఒక ధ్రువీకృత మధుమేహ అధ్యాపకుడు
  • ఒక కౌన్సిలర్ లేదా మానసిక ఆరోగ్య నిపుణుడు
  • ఒక ఔషధ విక్రేత
  • ఒక దంతవైద్యుడు
  • కంటి సంరక్షణ కోసం ఒక ఆప్తమాలజిస్ట్ లేదా ఒక ఆప్టోమెట్రిస్టు
  • పాద సంరక్షణ కోసం ఒక పాదనిపుణుడు

మధుమేహం మీకు విచారంగా లేదా కోపంగా అనిపించేటట్లు చేస్తే లేదా మిమ్మల్ని ఆందోళనపరిచే ఇతర సమస్యలు మీకు ఉంటే, మీరు ఒక కౌన్సెలర్ లేదా మానసిక ఆరోగ్య నిపుణుడితో మాట్లాడాలి. మీ డాక్టర్ లేదా ధృవీకృత మధుమేహ అధ్యాపకుడు ఒక కౌన్సిలర్ ను కనుగొనేందుకు మీకు సహాయపడగలడు.

అనారోగ్యం పొందకుండా నిరోధించడానికి, మీరు ఏ టీకాలు మరియు వ్యాధి నిరోధకాలు లేదా షాట్లు తీసుకోవాలో అనే దాని గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి. వ్యాధులను నివారించడం  అనేది మీ మధుమేహ సంరక్షణలో తీసుకొనే ఒక ముఖ్యమైన భాగం.

మీరు మీ ఆరోగ్య సంరక్షణ బృంద సభ్యులను చూసినప్పుడు, చాలా ప్రశ్నలు అడగండి. మీ సందర్శనకు ముందు ప్రశ్నల యొక్క ఒక జాబితాను సిద్ధం చేసుకోండి. మీరు మీ మధుమేహం గురించి జాగ్రత్త తీసుకోవడం గురించి తెలుసుకోవలసిన ప్రతిదీ అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి.

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు