ప్రకృతి దానికదే వ్యాధులను నయం చేసుకునే శక్తి వుంది. ప్రకృతి మనిషిని ప్రమాదకరమైన వ్యాధుల నుండి నిరోధించే మూలికలను, కూరగాయలు మరియు పండ్లను ఉత్పత్తి చేయడం అనేది అద్భుతం. మనిషి జీవన మార్గంలో ఒక అత్యంత సర్వసాధారణమైన వ్యాధులలో మధుమేహం ఒకటి. చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయంగా అనేక సహజ నివారిణులు ఉన్నాయి. నోటి ద్వారా మాత్రలు మింగడం కూడా ముఖ్యమైనప్పటికీ, మధుమేహంను సహజ మార్గంలో ట్రాక్ లో ఉంచుకొనుట సులభం.
భారతదేశంలో సీతాఫలం అని కూడా పిలువబడే, కస్టర్డ్ యాపిల్, అన్నోనాసియా కుటుంబానికి చెందిన ఉప ఉష్ణ మండల పండు. ఈ పండు ఒక చిన్న ఆకురాల్చే చెట్టు మీద పెరుగుతుంది మరియు ప్రపంచవ్యాప్తంగా వివిధ పేర్లతో పిలువబడుతుంది. ఈ పండు దాదాపు 8 సెంటీమీటర్ల వ్యాసంతో వుంటుంది మరియు ఒక తీపి మరియు మంచి రుచిని కలిగి వుంటుంది. పండు యొక్క ఆకారం, సమతూకం లేని, సక్రమంగా లేని, గోళాకార, గుండె ఆకారంలో, లేదా గుండ్రంగా ఉండవచ్చు. ఇది విత్తనాల చుట్టూ ఒక గుజ్జు మాదిరి మరియు నూకలు నూకలుగా వుండే కండను కలిగి ఉంటుంది. పండు యొక్క చర్మం పల్చగా మరియు గట్టిగా, ఎక్కువగా నలుపు మరియు ఆకుపచ్చ రంగులో వుంటుంది. ఈ పండు వెస్ట్ ఇండీస్, మధ్య అమెరికా, పెరూ మరియు మెక్సికోలో స్థానిక పండు.
పౌష్టికాహార మరియు వైద్య సంస్థలు పొందుపరచిన వివిధ మార్గదర్శకాల ప్రకారం, ప్రతి వ్యక్తి కనీసం 4-5 సెర్వింగ్ల పండ్లు తీసుకోవలసిన అవసరం వుంటుంది. మీరు మధుమేహగ్రస్థులు అయితే, మీరు పండ్లు తీసుకోవడం సురక్షితమేనా? అనే ఈ ప్రశ్న మీలో తలెత్తుతుంది అని మాకు ఖచ్చితంగా తెలుసు. అవును, మధుమేహగ్రస్థులు పండ్లను తినవచ్చు, అయితే రోగి యొక్క చక్కెర స్థాయి నియంత్రణ లో ఉంది అనే షరతు మీదనే, కానీ ఈ పండ్లు పరిమిత పరిమాణంలో సేవించాలి. మధుమేహగ్రస్థులకు రోజువారి పద్ధతిలో సమానమైన పండ్ల సెర్వింగ్లు అవసరం.
మీరు మధుమేహగ్రస్థులు అయితే జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే చక్కెర స్థాయిలు నియంత్రణలో లేనప్పుడు, ఇతర సంబంధిత సమస్యలు ఉండవచ్చు. ఆహారం తీసుకోవటం మరియు క్రమం తప్పని వ్యాయామం అనేవి ఒక మధుమేహ రోగి కొరకు ఒకేసారి పని చేసే మరియు ఒకదానికొకటి సంబంధమున్న రెండు ముఖ్యమైన కారకాలు. ప్రాసెస్డ్ ఫుడ్ ని పూర్తిగా వదిలి వేయండి, సహజ ఆహారాన్ని మాత్రమే తినడానికి ప్రయత్నించండి.
సహజ ఆహారాన్ని పరిగణలోకి తీసుకోవాలంటే, మధుమేహం కొరకు సీతాఫలం(లేక కస్టర్డ్ యాపిల్ ) ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోమని సిఫార్సు చేయడమైనది. నిజానికి, సీతాఫలంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ అనేక ఆరోగ్య సమస్యలకు ఒక పరిష్కారం కాగల అనేక విత్తనాలతో కూడిన ఒక క్రీమీ డెజర్ట్ పండు. ఇది క్యాన్సర్ తో పోరాడడానికి సహాయపడే అసిటోగేనిన్స్ ను పెద్ద మొత్తంలో కలిగి ఉంటుంది మరియు ఇతర అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది.
యాంటి డయాబెటిక్ గుణాలు
సీతాఫలం (లేదా కస్టర్డ్ యాపిల్) కు యాంటిడయాబెటిక్ లక్షణాలు చాలా ఉన్నాయి. సీతాఫలం (లేదా కస్టర్డ్ యాపిల్) యొక్క యాంటి- డయాబెటిక్ లక్షణాలు, రక్తంలో చక్కెర నిల్వల స్థిరీకరణ కు దారితీస్తూ, ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించుటకు మరియు కండరాలచే గ్లూకోజ్ యొక్క మెరుగుపరచబడిన వినియోగంకు సంబంధించినట్లు కనిపిస్తాయి. ఈ ప్రత్యేక లక్షణం గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది మరియు కండరాలు గ్లూకోజ్ ను తీసుకోవడం మెరుగుపరుస్తుంది. ఇది శరీరం ద్వారా చేయబడే గ్లూకోజ్ వినియోగ ప్రక్రియను నియంత్రించడానికి సహాయపడుతుంది. అందువల్ల, సీతాఫలం(కస్టర్డ్ యాపిల్) యొక్క మధుమేహ లాభాలు, వాటిని రోజువారీ పద్ధతిలో చిన్న భాగాలుగా తీసుకున్నప్పుడు, మధుమేహానికి సహాయపడతాయి.
విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది
విటమిన్ సి ఉండటం అనేది మీ శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించే ప్రాథమిక అంశము; ఇది మీ శరీరంలో ఇన్సులిన్ ను చైతన్య పరచడానికి సహాయపడుతుంది. సీతాఫలాలలో (లేదా కస్టర్డ్ యాపిల్) విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది , తిన్నప్పుడు అవి మీరు తీసుకునే ఏవైనా ఇతర మందుల కంటే బాగా మధుమేహాన్ని నియంత్రిస్తాయి. అందువలన, దాని అధిక విటమిన్ సి పరిమాణం కారణంగా, మనము చాలా సరళంగా సీతాఫలం యొక్క (లేదా కస్టర్డ్ యాపిల్ ) మధుమేహం ప్రయోజనాల ఫలితాన్ని పొందవచ్చు.
మెగ్నీషియం
ఇది మన శరీరంలో అతి ముఖ్యమైన మూడవ ఖనిజం. శరీరంలో తక్కువ మెగ్నీషియం పరిమాణం మధుమేహం అభివృద్ధి అయ్యే ప్రమాదానికి దారితీయవచ్చు అని పరిశోదనలు నిరూపించాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని చాలా ఎక్కువగా ఉంచుతుంది మరియు గ్లూకోజ్ క్రమబద్దికరణలో సహాయపడుతుంది. వాటిలో మెగ్నీషియం సమృద్ధిగా వున్నందున, సీతాఫలం యొక్క (కస్టర్డ్ యాపిల్) ఆరోగ్య ప్రయోజనాలు సులభమైనవి (ఎక్కువ తెలివి అవసరం లేని), ముఖ్యంగా మధుమేహ రోగుల్లో.
పొటాషియం
పొటాషియం తక్కువ స్థాయిలో వుంటే మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. పొటాషియంను సరిగ్గా తీసుకోవడం అనేది మధుమేహంను నిరోధించడానికి సహాయం చేస్తుంది. సీతాఫలం (లేదా కస్టర్డ్ యాపిల్) యొక్క ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి దానిలో వుండే అధిక మెగ్నీషియం మరియు పొటాషియం పరిమాణం. సాధారణంగా పొటాషియం సెల్యులార్ ప్రక్రియకు సహాయపడుతుంది, కానీ సీరమ్ పొటాషియం ఒక మధుమేహ రోగికి అవసరమయిన శరీరంలో ఇన్సులిన్ స్థాయిని క్రమబద్దీకరిస్తుంది.
ఐరన్
సీతాఫలం(లేదా కస్టర్డ్ యాపిల్) యొక్క మధుమేహ ప్రయోజనాల్లో ఒకటి ఏమిటంటే అది అత్యధిక ఐరన్ పరిమాణంను కలిగి ఉంటుంది. ఇది రక్తహీనతకు వ్యతిరేకంగా పోరాడడానికి మరియు మధుమేహంను నియంత్రించడానికి సహాయపడుతుంది. గుండెకు మంచిదైన రక్తం ఉత్పత్తికి కూడా ఐరన్ సహాయపడుతుంది.
పైన ఇవ్వబడినవి మధుమేహం రోగులకు సీతాఫలం (లేదా కస్టర్డ్ యాపిల్) యొక్క ఆరోగ్య ప్రయోజనాలలో కొన్ని.