మధుమేహగ్రస్తులు చక్కెర తినవచ్చా?

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456

మధుమేహం ఉన్న వారు సాధారణంగా అన్ని రకాల చక్కెరకు దూరంగా ఉండాలి అని భావించబడుతుంది. ఆ భోజనం లేదా అల్పాహారం కోసం కార్బోహైడ్రేట్ యొక్క మొత్తం పరిమాణం స్థిరంగా ఉన్నంత వరకు మరియు చక్కెర ఆహారాలు ఆరోగ్యకరమైన ఆహారం అనే ఇతివృత్త పరిధిలోనే జోడించబడినంత వరకు మధుమేహం ఉన్న చాలా మంది చక్కెర కలిగి ఉన్న ఆహారాలు తినవచ్చు.

చక్కెర కలిగిన భోజనం సమాన స్థాయిల కార్బోహైడ్రేట్  ఉన్న చక్కెర లేని భోజనం కంటే రక్తంలో చక్కెరను ఎక్కువ పెంచదు అని చాలా పరిశోధన అధ్యయనాలు నిరూపించాయి.  అయితే,  చక్కెర కలిగిన ఆహారం ఎక్కువ కార్బోహైడ్రేట్లు కలిగి ఉంటే, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

రక్తంలో చక్కెర మీద ఏది ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది?

____ 1 టీ స్పూన్ చక్కెర లేదా ____ ½ కప్పు బంగాళాదుంపలు

ఒక టీస్పూన్ చక్కెర 4 గ్రాముల కార్బొహైడ్రేట్స్ను మాత్రమే ఇస్తుండగా, బంగాళాదుంపలు 15 గ్రాముల కార్బొహైడ్రేట్స్నుఇస్తాయి. అందువలన, టేబుల్ షుగర్ తో పోలిస్తే బంగాళాదుంపలు రక్తంలో చక్కెర మీద మూడింతల ప్రభావం చూపిస్తాయి.

భోజన ప్రణాళిక అభ్యాసం

కింది ఆహారాలు ఉపయోగించి, సుమారు 45 గ్రాముల కార్బోహైడ్రేట్ కలిగిన రెండు అల్పాహార భోజనాలను ప్లాన్ చేయండి. మీ భోజన పథకంలో “అనుమతించబడవు” అని మీరు భావించగల కొన్ని ఆహారాలు ఈ జాబితాలో ఉన్నాయి అని గమనించండి.  అయితే మళ్ళీ,  మీకు ఇవ్వబడిన మీ వ్యక్తిగత ఆహార భోజన ప్రణాళికలో చూపించిన విధంగా కార్బోహైడ్రేట్లను పరిమిత మొత్తంలో మీరు తిన్నంత కాలం ఈ ఆహారాలలో దేన్నైనా మీరు ఉపయోగించవచ్చు.  (కింది ఉదాహరణలో, దీని అర్థం ఏమిటంటే కార్బోహైడ్రేట్ల మొత్తం 45 గ్రాములను మించనంత వరకు మీకు కావలసిన ఏ ఆహారాన్నైనా మీరు ఎంచుకోవచ్చు).

కార్బ్ కౌంటింగ్ ఆహార జాబితా (గుర్తుంచుకోండి 1 కార్బ్ ఎంపిక = 15 గ్రాముల కార్బ్ ) (యాస్ట్రిక్ * తో గుర్తించబడిన ఆహారాలు కొవ్వు కలిగి వుంటాయి)

బ్రెడ్లు: 15 గ్రా కార్బ్ (1 కార్బ్)

1 స్లైస్ బ్రెడ్, తెలుపు, గోధుమ లేదా హోల్ గ్రైన్

1 చిన్న పౌ/డిన్నర్ రోల్, ½ రోటీ (సజ్జ, మొక్కజొన్న, జొన్న)

1 చపాతీ, 6″ వ్యాసం

¾ పరాటా లేదా థెప్లా, 6 “*

½ పనీర్ పరాటా

¾ బంగాళాదుంప పరాటా, 6 “*

8″x 2″ నాన్ యొక్క ¼ భాగం

½ పిటా బ్రెడ్, 2 పూరీలు 5″

½ హాంబర్గర్/హాట్ డాగ్ బన్

½ 2oz బాగెల్, 1 చిన్న క్రాజంట్*

½ ఇంగ్లీష్ మఫిన్, 1 చిన్న మఫిన్*

1 దోశ సుమారు 10” వ్యాసం

1 చిన్న ఇడ్లీ

2 మినీ రవ్వ ఇడ్లీలు, 25g/3 టేబుల్ స్పూన్లు గోధుమపిండి (హోల్ వీట్) 25g/3 టేబుల్ స్పూన్లు మైదా (ఆల్-పర్పస్ ఫ్లోర్)

1 చిన్న క్రాజంట్*

తృణధాన్యాలు/ధాన్యాలు: 15g కార్బ్ (1 కార్బ్)

½ కప్పు అటుకులు

½ కప్పు డలియా (వండిన)

½ కప్పు ఉప్మా (వండిన)

½కప్పు పాస్తా (వండిన)

½ కప్పు వండిన వేడి ధాన్యం

1/3 కప్పు వండిన అన్నం

1/3 కప్పు వండిన బ్రౌన్ రైస్

1/3 కప్పు పులిహోర

1/3 కప్పు బిసి భెల భాత్

½కప్పు బిర్యానీ/పలావు* మాంసం

½ కప్పు ఖిఛిడి / వండిన ఖిఛిడి

1 చదరపు దోక్ల

½ కప్పు మట్కి ఊశాళ్

½ కప్పు ధన్సాక్*

½ కప్పు అవియాల్

1/3 కప్పు ఉప్మా

½ వెజిటబుల్ ఊతప్పం (చిన్న ది) లేదా 1 చిన్న ఊతప్పం, 4″

2 టేబుల్ స్పూన్లు వండని కర్రపెండలం

½ కప్పు గోధుమ మొలకలు

స్టార్చి కూరగాయలు: 15 గ్రా కార్బ్

1/3 ఆకుపచ్చ అరటికాయ

1కప్పు శీతాకాల గుమ్మడికాయ

½కప్పు బంగాళాదుంప కూర*

1 ఉడికించిన లేదా కాల్చిన చిన్న బంగాళాదుంప

½ బంగాళాదుంపల గుజ్జు

½కప్పు చిలగడదుంపలు

½కప్పు బఠానీలు

½కప్పు మొక్కజొన్న

½కప్పు చిలగడదుంప ఫ్రెంచ్ ఫ్రైస్*

½కప్పు హాష్ బ్రౌన్స్*

1 కప్పు మిశ్రమ వెజ్ (మొక్కజొన్న, బటానీలు)

½ కప్పు కూరగాయల కుర్మా

1¼ వెజ్ టోఫు స్టిర్ ఫ్రై

1 కప్పు ఆలు గోబీ

పప్పు ధాన్యాలు/పప్పులు/ బీన్స్: 15 గ్రా కార్బ్

½కప్పు వండిన కాయధాన్యాలు

½కప్పు వండిన కందిపప్పు

½కప్పు టమోటా పప్పు

½కప్పు వండిన పెసర పప్పు

1కప్పు వండిన సన్నని మిశ్రమ పప్పు

½కప్పు వండిన కిడ్నీ బీన్స్

½కప్పు వండిన ముడిశెనగలు (చిక్పీస్)

½ కప్పు వండిన అలసందలు (బ్లాక్-ఐడ్ పీస్)

1/3 కప్పు శనగ

1 కప్పు రసం

½కప్పు సాంబార్

1/3కప్పు హుమ్ముస్

½కప్పు ధన్సాక్*

¾కప్పు పాలకూర మరియు గర్బంజో బీన్స్ కూర

½కప్పు టమోటా హెర్బ్ సూప్

1 కప్పు పెసర మొలకల సలాడ్

¾కప్పు చికెన్ నూడిల్ సూప్

1 ¼కప్పు కోడి కూర

1 ¼కప్పు చెట్టినాడ్ కోడి కూర

స్వీట్స్: 15 గ్రా కార్బ్ (ఆహారంలో 10% పరిమితి)

5 వెనిల్లా వేఫర్స్

2 చిన్ననంఖటై*

1 చిన్న గులాబ్ జమాన్*

1/3 కప్పు క్యారట్ హల్వా*

¼ కప్పు సూజీ హల్వా*

1 హన్డవ*

6 ముక్కలు ఖండవి*

½కప్పు కుల్ఫీ*

½ చిన్న లడ్డూ

1 మగస్, 1 ½ “x 1 ½” ముక్క

2 సన్నని మతియాలు

1 ముక్క మొహన్తాల్, 1 ½ “x 1 ½”

1 మీడియం రసగుల్లా

1 చిన్న రసమలై

¼కప్పు శ్రీఖండ్

½కప్పు ఐస్ క్రీం*

¾ ఒక గ్రానోలా బార్ *

½ ఒక 2 oz గ్లేజ్డ్ డోనట్ *

1 (3 oz) ఫ్రోజెన్ ఫ్రూట్ జ్యూస్ బార్ (100% పండు)

1 చిన్న బ్రౌనీ (2 అంగుళాల) అన్ ప్రోస్టెడ్*

1 చిన్న కప్ కేక్ అన్ ప్రోస్టెడ్*

½ స్లైస్ కేక్, ప్రోస్టెడ్ (2 అంగుళాల చదరపు) *

2 చిన్న కుకీలు, సాదా లేదా క్రీం నింపబడిన శాండ్విచ్*

1 రోల్ ఫ్రూట్ స్నాక్స్, నమిలే

½కప్పు చక్కెర లేని పుడ్డింగ్*

¼కప్పు పుడ్డింగ్ రెగ్యులర్ *

1 టేబుల్ స్పూన్ తేనె

2 టేబుల్ స్పూన్ లైట్ మాపుల్ సిరప్

1 టేబుల్ స్పూన్ మాపుల్ సిరప్, సాధారణ

½కప్పు ఫ్రోజెన్ పెరుగు*

1కప్పు (8oz) క్రీడ పానీయాలు (గటోరెడ్)

1 టేబుల్ స్పూన్ చక్కెర

½కప్పు చాక్లెట్ పాలు

పాలు / పెరుగు: 15g కార్బ్    

1కప్పు మీగడ తీసిన, 1% పాలు

1కప్పు 2%, హోల్ మిల్క్*

1కప్పు మజ్జిగ

½కప్పు బాగా కాచిన మీగడ తీసిన పాలు

1/3కప్పు కొవ్వు తీసిన డ్రై పాల పొడి

1కప్పు సాదా పెరుగు, కొవ్వు లేని

1కప్పు సాదా పెరుగు, సాధారణ*

1కప్పు ఫ్రూట్ ఫ్లేవర్ పెరుగు, కృత్రిమ స్వీటెనర్

1కప్పు లస్సీ*, కృత్రిమ స్వీటెనర్

1కప్పు 1% పాలతో తయారయిన మసాలా చాయ్

పండ్లు / రసాలు: 15g కార్బ్స్

1 చిన్న ఆపిల్ పండు

4 హోల్ ఆప్రికాట్లు (తాజా)

8 అర్థ భాగాలు ఎండిన ఆప్రికాట్లు

½ కప్పు క్యాన్డ్ ఆప్రికాట్లు

1 చిన్న అరటి పండు (4 oz) లేదా ½ మధ్యస్తం

¾ కప్పు బ్లూ బెర్రీస్

1 కప్పు కాంటల్యూప్/ హానీడ్యూ పుచ్చకాయ ముక్కలు

1 మధ్యస్త. చికు (సపోటా)

12 తీపి చెర్రీస్

3 ఖర్జూరాలు

2 మధ్యస్త తాజా అత్తి పండ్లు

1½ ఎండిన అత్తి పండ్లు (డ్రై ఫిగ్స్)

½కప్పు ఫ్రూట్ కాక్టైల్

½ దబ్బపండు (గ్రేప్ ఫ్రూట్)

17 ద్రాక్ష

6 జంబు

4 లోక్వట్ లు

1 కివి

¾కప్పు మాండరిన్ నారింజ

½ చిన్న మామిడి (½ కప్పు)

1 చిన్న నేక్ట్రీన్

½కప్పు క్యాన్డ్ పీచెస్/బేరి

1 చిన్న నారింజ

1 కప్పు బొప్పాయి ముక్కలు

½ మధ్యస్త పాషన్ పండు

½ పెద్ద పియర్ లేదా 1 చిన్నది

1 మధ్యస్త పీచ్

¾కప్పు తాజా పైనాపిల్

½కప్పు కేన్డ్ పైనాపిల్

2 చిన్న ప్లమ్ లు

3 ఎండిన ప్లమ్ లు (ప్రూనే)

3 టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్ష

1కప్పు రాస్ బెర్రీస్

1 ¼కప్పు స్ట్రాబెర్రీలు

1 మధ్యస్త సీతాఫలం

2 చిన్న టాంజేరిన్స్

1 ¼కప్పు పుచ్చకాయ ముక్కలు

½కప్పు ఆపిల్ రసం

1/3కప్పు ద్రాక్ష రసం

½కప్పు ద్రాక్షపండు రసం

1/3కప్పు మామిడి రసం

½కప్పు జామ రసం

½కప్పు నారింజ రసం

½కప్పు పైనాపిల్ రసం

1/3కప్పు ప్రూనే రసం

అల్పాహారాలు: 15g కార్బ్ (1 కార్బ్ ఎంపిక)

1oz. భేల్పూరి

1oz చివ్డ

½కప్పు నమ్కీన్ / నిమ్కో*

6 పానీ పూరి

2 పాపడ్

¾ వెజ్ సమోసా (సమోసా = 21g CHO) *

1 మధ్యస్త వెజ్ కట్లెట్*

3 ముక్కలు  పాలకూర పకోడా*

1 కచోరి (వెజ్) *

1 కచోరి (పెసరపప్పు*)

2 ముక్కలు కాలీఫ్లవర్ భజియా

2 ముక్కలు పెరుగు వడ *

1 oz. అరటి చిప్స్

3 స్క్వేర్ గ్రాహం క్రాకర్స్

4-6 గుండ్రని క్రాకర్లు (రిట్జ్ రకం) *

6 ఉప్పు కలిపిన క్రాకర్స్

3కప్పు పాప్కార్న్

2 రైస్ కేకులు 4″

1 ½ కప్పు ముంబ్ర (అటుకులతో)

¾ oz (9-13) చిరుతిండి చిప్స్, బంగాళాదుంప లేదా టోర్టిల్లా *

10 ఫ్రెంచ్ ఫ్రైస్ *

నమూనా అల్పాహారం ఒకటి

ఆహారం – కార్బోహైడ్రేట్ గ్రాములు

1 చపాతీ, 6″ వ్యాసం – 15 గ్రాముల కార్బోహైడ్రేట్

1 చిన్న ఇడ్లీ – 15 గ్రాముల కార్బోహైడ్రేట్

1 కప్ పాలు – 15 గ్రాముల కార్బోహైడ్రేట్

కార్బోహైడ్రేట్ మొత్తం = 45గ్రాములు

“నమూనా అల్పాహారం రెండు”

ఆహారం – కార్బోహైడ్రేట్ గ్రాములు

1 చపాతీ, 6″ వ్యాసం – 15 గ్రాముల కార్బోహైడ్రేట్

1 చిన్న ఇడ్లీ – 15 గ్రాముల కార్బోహైడ్రేట్

1 చిన్న గులాబ్ జామ * – 15 గ్రాముల కార్బోహైడ్రేట్

కార్బోహైడ్రేట్  మొత్తం = 45గ్రాములు

రెండవ ఉదయం అల్పాహారం ఒక తీపి కలిగి వున్నప్పటికీ , పై రెండూ అల్పాహారాలు ఒకటి మరియు రెండు ఒకటే స్థాయి వరకు చక్కెరను పెంచుతాయి .

నేను కేక్ తినవచ్చు మరియు దాని గురించి ఆందోళన పడకూడదు ని దాని అర్థంమా?

లేదు! ఒక ముక్క కేక్  చాక్లెట్ ఐసింగ్ తో(1/12 కేక్ మరియు 12 గ్రాముల బరువు) మీకు 300 క్యాలరీలు, 45 గ్రాముల కార్బోహైడ్రేట్స్ మరియు 12 గ్రాముల కొవ్వు ఇస్తుంది. అంటే మూడు స్టార్చ్ సెర్వింగ్స్ మరియు 2 పైగా కొవ్వు సెర్వింగ్స్. మీరు ఒక కేక్ ముక్క తినే ముందు, మీకై మీరే  క్రింది ప్రశ్నలు వేసుకోండి: ఆ చిన్నకేక్ ముక్క సంతృప్తి పరుస్తుందా లేక నేను ఇప్పటికీ ఆకలితో వున్నానా?  ఇది నా భోజన ప్రణాళికలో ఏ విధంగా సరిపోతుంది? నేను దీని పైన 300 క్యాలరీలు “ఖర్చు” పెట్టవలెనా? నేను చేయగల ఇతర తక్కువ కొవ్వులను కంట్రిబ్యూట్ చేసే ఎంపికలు ఏమన్నా ఉన్నాయా? 1/12 ఏంజెల్ ఫుడ్ కేక్ ముక్క 1 గ్రామ్ కంటే తక్కువ కొవ్వును మరియు 30 కార్బోహైడ్రేట్స్ కలిగి వుంటుంది. ఇది ఒక మంచి ఎంపిక.

అన్ని కార్బోహైడ్రేట్స్ ను నియంత్రించటం  

మీరు “నియంత్రణ” చేయవలసిన కార్బోహైడ్రేట్ చక్కెర మాత్రమే కాదు అని తెలుసుకోవటం చాలా ముఖ్యం. శరీరం అన్ని కార్బోహైడ్రేట్లను గ్లుకోస్ గా మారుస్తుంది- అందువలన అన్నం, పాస్తా,  బ్రెడ్, పండ్లు లేదా ఇతర కార్బోహైడ్రేట్ల ఆహారాల యొక్క అదనపు సెర్వింగ్స్  తినడం రక్తంలో చక్కెరను పెంచుతుంది.  అది చక్కెర కలిగి లేనంత మాత్రాన దేనినైనా మీకు కావలసినంత తినవచ్చు అని అర్థం కాదు. మీ భోజనంలోని కార్బోహైడ్రేట్ మొత్తం ప్రతీ రోజు వీలైనంత స్థిరంగా ఉండే విధంగా మీ ఆహార ప్రణాళిక రూపొందించబడింది.

ఒక హెచ్చరిక:

చక్కెర రక్తంలో చక్కెరను ఇతర కార్బోహైడ్రేట్ల కంటే ఎక్కువ పెంచనప్పటికీ,  దానిని ఖచ్చితంగా ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు కలిపి తినాలి.  మీరు ఒక 300 ml చక్కెర-తీపి శీతల పానీయాన్ని త్రాగడానికి ఎంచుకుంటే, అది 45 గ్రాముల కార్బోహైడ్రేట్ల ను ఉపయోగించుకుంటుంది- మరియు మీకు ఎటువంటి పోషకాలు (ప్రోటీన్, విటమిన్లు లేదా ఖనిజాలు) అందకపోవచ్చు. ఎన్ని కేలరీలు వృధా!

అధిక చక్కెర ఆహారాలు ఎక్కువ కార్బోహైడ్రేట్లను కలిగి వుంటాయి. కనుక తక్కువ చక్కెర ఆహారాల కంటే చిన్న పరిమాణం వుంటుంది. మీరు తినే శైలి ఏమిటి? మీ భాగ పరిమాణంను నియంత్రించగలరా – లేదా మీరు అమితంగా తినే అవకాశం ఉందా?  అవి మిమ్మల్ని ఎక్కువ తినడానికి ప్రోత్సహిస్తే అధిక చక్కెర ఆహారాలు ఒక మంచి ఎంపిక కాకపోవచ్చు. ఒక వేళ మీకు ఎక్కువ తినాలని వుంటే, తక్కువ చక్కెర   ఎంపికలను ఎంచుకోండి.

అదనంగా, అనేక చక్కెర- కలిగిన ఆహారాలలో చాలా కొవ్వు కూడా వుంటుంది. ముఖ్యంగా  కొవ్వు పదార్థం కారణంగా మరియు అవి ఎక్కువ న్యూట్రీషనల్ విలువలను పంచని కారణంగా కుక్కీలు, పేస్ట్రీలు, ఐస్ క్రీమ్,  మరియు కేకుల వంటి ఆహారాలను తప్పించాలి.  మీకు ఒక “తీపి” కావాలని అనుకుంటే- తక్కువ-కొవ్వు  ఫ్రోజెన్ పెరుగు, జింజర్ స్నాప్స్, ఫిగ్ బార్స్, లేక గ్రాహం క్రాకర్స్ వంటి ఒక తక్కువ-కొవ్వు ఎంపికను చేయండి మరియు మీ ఆహార ప్రణాళికలో మరొక కార్బోహైడ్రేట్ కు ప్రత్యామ్నాయంగా దానిని వుంచండి.

మీ భోజన ప్రణాళిక కొరకు ఉత్తమ “స్వీట్” ఎంపికలను ఎంచుకోవడానికి  మీ మధుమేహ నిపుణునితో మాట్లాడండి. మీరు గత సంవత్సరం ఒక మధుమేహ నిపుణున్ని కలువకుండా వుంటే లేక ఒక వేళ మీకు ఒక వ్యక్తిగత భోజన ప్రణాళిక లేకుంటే, మధుమేహ నిపుణునితో అపాయింట్మెంట్ తీసుకోవడం అనేది మీకు మరియు మీ యొక్క మధుమేహం నియంత్రణ కొరకు ఈ మార్గదర్శకాలను ఉత్తమమైన రీతిలో పొందుపరచడానికి మీకు సహాయము చేయగలదు.

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు