ప్రతి రోజు మీ మధుమేహాన్ని శ్రద్ద వహించండి

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456

మీ గ్లూకోజ్ స్థాయిలను మీరు నిర్ణయించుకున్న లక్ష్య పరిధిలో ఉండడానికి సహాయపడే నాలుగు విషయాలను ప్రతీ  రోజు చేయండి:

  • మీ ఆరోగ్యకర ఆహార ప్రణాళికను అనుసరించండి.
  • శారీరకంగా చురుకుగా ఉండండి.
  • సూచించిన విధంగా మీ మందులు తీసుకొండి.
  • మీ మధుమేహంను గమనిస్తూ వుండండి.

ఈ విషయాలు మొదట చాలా పెద్దవి అనిపింవచ్చు. మీ రోజులో సాదారణ భాగాలుగా మారెంతవరకు కేవలం చిన్నమార్పులను చేయండి.

మీ ఆరోగ్యకర ఆహార ప్రణాళికను అనుసరించండి

మీకు ఒక ఆరోగ్యకర తినే ఆహార ప్రణాళికను, తయారు చేయుటకు సహాయం చేయడానికి శిక్షణ పొందిన డైటీషియన్ లాంటి ఒకరి పేరు ఇవ్వమని మీ వైద్యుడిని అడగండి. తరచుగా మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అని పిలువబడే ఈ ప్రణాళికలో మీ డైటీషియన్ ద్వారా మీరు క్రమంగా తప్పకుండా గమనించబడుతూ ఉంటారు  మరియు అవసరం ప్రకారం మీ ఆహారపు అలవాట్లను ఏ విధంగా సర్దుబాటు చేయాలో నేర్పుతాడు.  మీ వైద్యుడు మిమ్మల్ని రెఫర్ చేసినంత కాలం మెడికల్ న్యూట్రిషన్ థెరపీ సాధారణంగా భీమా లేదా మెడికేర్ ను కలిగి వుంటుంది. మీరు మరియు మీ కుటుంబం ఇష్టపడే మరియు మీకు మంచివి అయిన ఆహార పదార్థాలను కలిగిన భోజనాన్ని ప్లాన్ చేయడంలో మీ డైటీషియన్ మీకు సహాయం చేయగలడు.

మీ ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక వీటిని కలిగి ఉంటుంది

  • బ్రెడ్లు, ధాన్యాలు, బియ్యం, మరియు తృణధాన్యాలు
  • పండ్లు మరియు కూరగాయలు
  • మాంసం మరియు మాంస ప్రత్యామ్నాయాలు
  • పాల ఉత్పత్తులు
  • ఆరోగ్యకరమైన కొవ్వులు

మీ ప్రణాళిక ఆహారం యొక్క సరైన పరిమాణం, లేక భాగాలుగా ఏ విధంగా తినాలి అనేది నేర్పడంలో కూడా సహాయ పడతుంది. మంచి ఆహార ఎంపికలు చేయడం వల్ల

  • మీరు సరైన బరువు పెరుగునట్లు మరియు సరైన బరువులో ఉండునట్లుగా సహాయ పడుతుంది
  • మీ యొక్క రక్తంలోని గ్లూకోజ్, రక్తపోటు, మరియు కొవ్వు స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది
  • గుండె మరియు రక్త నాళ వ్యాధిని నిరోదిస్తుంది

                                                   యాక్షన్ స్టెప్స్

                                           ఒకవేళ మీరు ఇన్సులిన్ తీసుకుంటే

  • మీ ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికను అనుసరించండి.
  • మీ రక్తంలోని గ్లూకోస్ స్థాయిలు చాలా తక్కువకు పడిపోతాయి కాబట్టి భోజనంను దాటవేయవద్దు, ముఖ్యముగా మీరు ఇప్పటికే మీ ఇన్సులిన్ తీసుకొని వుంటే.
  • తక్కువ రక్తంలో గ్లూకోజ్ ను ఎలా నిర్వహించాలో అనే దాని గురించి మరింత తెలుసుకోండి

                                              

యాక్షన్ స్టెప్స్

ఒకవేళ మీరు ఇన్సులిన్ తీసుకోకపోతే

  • మీ ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికను అనుసరించండి
  • మీ రక్తంలోని గ్లూకోస్ స్థాయిలు చాలా తక్కువకు పడిపోతాయి కాబట్టి భోజనంను దాటవేయవద్దు, ముఖ్యముగా మీరు ఇప్పటికే మీ ఇన్సులిన్ తీసుకొని వుంటే.
  • తక్కువ రక్తంలో గ్లూకోజ్ ను ఎలా నిర్వహించాలో అనే దాని గురించి మరింత తెలుసుకోండి
  • రోజులో ఒక పెద్ద భోజనం బదులుగా చాలా చిన్న భోజనాలు తినండి.

శారీరకంగా చురుకుగా వుండండి

శారీరక శ్రమ మీరు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.  మీకు మధుమేహం ఉంటే  శారీరక శ్రమ ముఖ్యంగా మంచిది ఎందుకంటే అది

  • మీరు సరైన బరువు పెరుగునట్లు లేక సరైన బరువులో ఉండునట్లుగా సహాయ పడుతుంది
  • మీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో ఇన్సులిన్ బాగా పనిచేయడానికి సహాయపడుతుంది
  • మీ గుండె మరియు ఊపిరితిత్తులకు మంచిది
  • మీకు మరింత శక్తిని ఇస్తుంది

పనిలో కాని లేక ఇంటి దగ్గర కాని మీరు శారీరకంగా చురుకుగా వున్నప్పుడు చిన్న మొత్తాల శారీరక శ్రమ కూడా మధుమేహంను నిర్వహించడానికి సహాయ పడుతుంది. మధుమేహం ఉన్నవారు వారంలో ఎక్కువ రోజులు 30 నుండి 60 నిమిషాల కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకోవాలి. టైప్ 2 మధుమేహం వున్న 10 నుంచి 17 సంవత్సరాల వయసు వున్న పిల్లలు మరియు కౌమారదశ  వారు ఖచ్చితంగా ప్రతి రోజు 60 నిముషాలు కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకోవాలి. శారీరక శ్రమ అంతా ఒకే సమయంలో జరగదు.

టీవీ చూడడము లేదా కంప్యూటర్ ముందర గడిపే సమయాన్నితగ్గించడము ద్వారా రోజువారీ శ్రమను పెంచండి.  పిల్లలు మరియు యువత స్కూల్ కు సంభంధం లేని స్క్రీన్ టైంను ఒక రోజుకు 2 గంటల కన్నా తక్కువ సమయానికి  పరిమితం చేయండి. పరిమిత స్క్రీన్ సమయం మీ శారీరక శ్రమ లక్ష్యాన్ని చేరుటకు సహాయ పడుతుంది.

మధుమేహం ఉన్నవారు తప్పక

  • ఒక క్రొత్త శారీరక శ్రమ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ప్రతిసారి ఒక వైద్యునితో మాట్లా డాలి.
  • గుండె వేగంగా కొట్టుకోవడానికి ఉపయోగపడే పెద్ద కండరాలకు ఉపయోగపడే బ్రిస్క్ వాక్ (వేగంగా నడవడం) లాంటి ఏరోబిక్ ఆక్టివిటీస్ ను చేయాలి. పెద్ద కండరాలు అంటే ఎగువ మరియు దిగువ చేతులలోనివి మరియు కాళ్ళు మరియు తలను, భుజాలను, మరియు హిప్ కదలికలను నియంత్రించేవి.
  • కండరాలను మరియు ఎముకలను బలోపేతం చేసే గుంజిళ్ళు లేక బరువులు ఎత్తడము లాంటి కార్యక్రమాలు చేయాలి. ఒక వారానికి రెండు సార్లు లక్ష్యంగా పెట్టుకోండి.
  • శారీరక శ్రమ తర్వాత వశ్యతను పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, మరియు కండరాల నొప్పిని నిరోధించేందుకు సహాయపడడానికి సాగతీయాలి.

మీ పిల్లల మరియు మీ కుటుంబ చురుకుగా ఉండడానికి మరియు ఆనందంగా ఉండటానికి అనేక కార్యకలాపాలు సహాయపడుతాయి.  ఈ క్రింద ఇవ్వబడినటువంటి వారు ఆనందించగల మరియు కొనసాగించగల కార్యకలాపాలను పరిగణించండి

  • బాస్కెట్ బాల్ ఆడడం
  • స్నేహితులతో కలసి సంగీతానికి నృత్యం చేయడం
  • నడక లేదా ఒక బైక్ రైడ్ చేయడం

యాక్షన్ స్టెప్స్

ఒకవేళ మీరు ఇన్సులిన్ తీసుకుంటే

  • శారీరకంగా చురుకుగా అయ్యే ముందు మీ వైద్యుడిని కలవండి
  • శారీరక శ్రమ ముందు, చేస్తున్నప్పుడు మరియు తర్వాత మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తనిఖీ చేయండి. మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా వున్నప్పుడు లేదా మీ రక్తంలో లేదా మూత్రంలో మీరు కీటోన్లని కలిగి ఉంటే శారీరక శ్రమ కార్యక్రమాన్ని మొదలు పెట్టకండి.
  • మీరు నిద్రపోయే ముందు వెంటనే శారీరక శ్రమ చేయవద్దు ఎందుకంటే అది మీరు నిద్రపోతున్నప్పుడు తక్కువ రక్తంలో గ్లూకోజ్ కు కారణం కావచ్చు.

యాక్షన్ స్టెప్స్

ఒకవేళ మీరు ఇన్సులిన్ తీసుకోకపోతే

  • శారీరకంగా చురుకుగా అయ్యే ముందు మీ వైద్యుడిని కలవండి.
  • మీరు శారీరకంగా చురుకుగా ఉండడానికి ముందు తినే అవసరం ఉందా అనే దాని గురించి మీ వైద్యుడిని అడగండి.

మీరు శారీరకంగా చురుకుగా ఉండటం చేసినప్పుడు, మీ రక్తంలో గ్లూకోజ్ పూర్తి తక్కువ స్థాయికి  పడిపోయిన పక్షంలో మీతోపాటు గ్లూకోజ్ మాత్రలు లేదా పండు లేదా పానియం లాంటి ఒక కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉండే చిరుతిండి లేక పానీయం తీసుకువెళ్ళండి.

 సూచించిన విధంగా మీ మందులు తీసుకోండి

మీరు టైప్ 2 మధుమేహం కలిగి వుంటే మరియు మీ నిర్దేశిత స్థాయిలో రక్తంలో గ్లూకోజ్ ను చేరుకోలేకపొతే ఒక ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక మరియు శారీరక శ్రమతో, మధుమేహ మందులు సహాయం చేయవచ్చు. మీ డాక్టర్ మీకు మరియు మీ జీవన శైలికి బాగా పనిచేసే మధుమేహ మందులను మీకు సూచించవచ్చు.

ఒకవేళ మీకు టైప్ 1 డయాబెటిస్ వుండి, ఒకవేళ మీ శరీరం ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయడం మానివేస్తే లేక అది తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయకపోతే, మీకు ఇన్సులిన్ షాట్స్ అవసరం.  టైప్ 2 మధుమేహం లేదా గర్భధారణ మధుమేహం ఉన్నకొంతమందికి కూడా ఇన్సులిన్ షాట్లు తీసుకోవడం అవసరం.

మధుమేహ మందులు

చాలా మంది  టైప్ 2 మధుమేహం ఉన్న చాలామంది ఇన్సులిన్ షాట్ల కంటే ఇతర మందులు ఉపయోగిస్తారు.  టైప్ 2 మధుమేహం వున్న ప్రజలు వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వారి యొక్క నిర్దేశిత పరిధిలో ఉంచుకోవడానికి సహాయంగా మందులను వాడుతారు. ఒకవేళ మీ శరీరం ఇన్సులిన్ తయారు చేస్తే మరియు ఆ ఇన్సులిన్ మీ రక్తంలో గ్లూకోజ్  స్థాయిలను తగినంతగా తగ్గించకపొతే, మీరు ఒక్కటి లేదా ఎక్కువ మందులను తీసుకొనవలసిన అవసరం వుంటుంది.

డయాబెటిస్ మందులు గుళిక మరియు షాట్ రూపంలో వస్తాయి. కొంతమంది మధుమేహం మందులను రోజుకు ఒకసారి మరియు ఇతర మందులు పలుమార్లు తీసుకుంటారు. మీరు మీ మధుమేహం మందులు తీసుకోవలసి  వచినప్పుడు మీ ఆరోగ్య సంరక్షణ టీం ను అడగండి.  కొన్నిసార్లు, మధుమేహం మందులు తీసుకునే ప్రజలకు కూడా కొంతకాలం ఇన్సులిన్ షాట్లు అవసరం కావచ్చు.

ఒకవేళ మీ మందులు మీకు జబ్బును కలిగిస్తే లేక ఒకవేళ మీకు ఏదైనా ఇతర సమస్య వుంటే ఖచ్చితంగా మీ వైద్యునికి చెప్పండి. మీరు అనారోగ్యంతో వుంటే లేదా శస్త్రచికిత్స అయివుంటే, మీ రక్తంలో గ్లూకోజ్  ను తక్కువ స్థాయిలలో ఉంచుటకు మీ మధుమేహం మందులు ఇకపై పనిచేయవు. మీ మధుమేహ మందులను మీరు తీసుకోవడం ఆపడానికి ముందు ప్రతిసారి మీ డాక్టర్ తో సంప్రదించండి.

ఇన్సులిన్ షాట్స్

ఒక వైద్యుడు మాత్రమే ఇన్సులిన్ ను సూచించగలరు. మీ డాక్టర్ మీరు ఖచ్చితంగా ఎంత ఇన్సులిన్ ను తీసుకోవలయునో మరియు క్రింది విధానాలలో ఏ రకంగా తీసుకుంటే మీకు మంచిదో చెప్పగలడు.

ఇన్సులిన్ షాట్. మీరు ఒక సిరంజికి జతచేసిన ఒక సూదిని వుపయోగిస్తారు – ఒక హాలో ట్యూబ్  ఒక ప్లన్గర్ తో– దాన్ని మీరు ఒక ఇన్సులిన్ మోతాదుతో నింపుతారు. కొంతమంది ఒక ఇన్సులిన్ పెన్ ను ఉపయోగిస్తారు, ఒక సూది మరియు ఇన్సులిన్ యొక్క ఒక కాట్రిజ్ తో గల ఒక పెన్ను లాంటి డివైజ్. ఎప్పుడూ ఇన్సులిన్ సూదులు లేదా ఇన్సులిన్ పెన్నులను కుటుంబంతో కూడా పంచుకోకండి.

ఇన్సులిన్ పంపు. ఇన్సులిన్ పంప్ అనేది ఇన్సులిన్ తో నింపబడిన ఒక చిన్న డివైజ్, దాన్ని మీరు మీ బెల్ట్ మీద ధరించవచ్చు లేక మీ పాకెట్ లో పెట్టుకోవచ్చు. ఆ పంప్ ఒక చిన్న ప్లాస్టిక్ ట్యూబ్ ను , మరియు ఒక చిన్న సూదితో కలుపుతుంది. ఆ సూదిని మీరు లేదా మీ డాక్టర్ మీ చర్మం క్రింద గుచ్చుతారు. ఆ సూది అక్కడే పలు రోజులు ఉండగలదు.

ఇన్సులిన్ జెట్ ఇంజెక్టర్. ఈ డివైజ్ ఒక సూది బదులుగా మీ చర్మంలోకి అధిక ఒత్తిడి వాయువుతో ఇన్సులిన్ ను ఫైన్ స్ప్రే చేస్తుంది.

ఇన్సులిన్ ఇంజక్ట్ పోర్ట్. మీరు లేదా మీ డాక్టర్ ఒక చిన్న గొట్టం అనేది మీ చర్మానికి కొంచెం క్రిందకు ప్రవేశ పెడుతారు, అది అక్కడే చాలా రోజులు వుంటుంది. మీరు ఇన్సులిన్ ను మీ చర్మం ద్వారా బదులు ఆ గొట్టం చివరలో నుండి ఎక్కించవచ్చు.

ఇతర మందులు    

మీ వైధ్యుడు మధుమేహం నకు సంబంధించిన ఇతర మదులను సూచించవచ్చును, ఈ క్రింది వాటి వంటివి

  • గుండె ఆరోగ్యానికి ఆస్పిరిన్
  • కొవ్వును తగ్గించే మందులు
  • అధిక రక్తపోటు కొరకు మందులు

ప్రతి రోజు సరైన సమయాలకు మందులను తీసుకోవడాన్ని గుర్తుంచుకోవడము అనేది ఒక సవాలు కావచ్చు. ప్రతి రోజు కోసం ప్రత్యేక బాక్సులతో ఒక వారపు పిల్ బాక్స్ ను ఉంచుకోవడం మరియు ఉదయం మరియు సాయంత్రం కొరకు కూడా ప్రత్యేక బాక్సులను ఉంచుకోవడం సహాయం చేయవచ్చని చాలా మంది తెలుసుకొంటారు. ప్రతి సందర్శనకు మీ మందుల జాబితాను అప్డేట్ చెయ్యమని మీ ఆరోగ్య సంరక్షణ బృందాన్ని అడగండి తద్వారా  ఏ మందులు తీసుకోవాలి మరియు ఎప్పుడు తీసుకోవాలి అనే ఒక ఖచ్చితమైన జాబితాను  మీరు ఎల్లప్పుడూ కలిగి వుంటారు.

 తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు