నా మూత్రపిండాలు అంటే ఏమిటి మరియు అవి ఏమి చేస్తాయి?
మీకు రెండు మూత్రపిండాలు ఉంటాయి. మూత్రపిండాలు బీన్స్ వంటి ఆకారంలో ఉంటాయి. ప్రతి మూత్రపిండం దాదాపు ఒక పిడికిలి అంత పరిమాణంలో ఉంటుంది. అవి మీ పక్కటెముకలకు కొంచెం దిగువన, మీ వెన్నెముకకు ఇరువైపులా ఒకటి ఉంటాయి. మీ మూత్రపిండాలు మీ రక్తాన్ని వడకట్టుతాయి (ఫిల్టర్ చేస్తాయి). ప్రతి మూత్రపిండం 1 మిలియన్ చిన్న ఫిల్టర్లతో తయారు చేయబడింది. ప్రతి రోజూ ప్రతి నిమిషం సమయంలో, ఈ ఫిల్టర్లు మీకు హాని చేయగల వ్యర్థ పదార్థాలను బయటికి తీసుకువెళ్తాయి. అవి మీ రక్తం నుండి అదనపు ద్రవాన్ని కూడా బయటికి తీసుకువెళ్తాయి. వ్యర్ధాలు మరియు అదనపు ద్రవం మూత్రంగా మారుతాయి. మూత్రం మీ మూత్రపిండాల నుండి మూత్ర నాళాలు అని పిలువబడే ట్యూబ్ల ద్వారా మీ మూత్రాశయం నకు ప్రవహిస్తుంది. మీరు మూత్రవిసర్జన చేసే వరకు మూత్రాశయం మూత్రాన్ని నిల్వచేస్తుంది. అప్పుడు, మూత్రం మూత్రమార్గం అనే ట్యూబ్ ద్వారా శరీరాన్ని వదిలిపెడుతుంది.
మూత్రపిండాల వైఫల్యం అంటే ఏమిటి?
మూత్రపిండాల వైఫల్యం అంటే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి మీ మూత్రపిండాలు ఇకపై మీ రక్తాన్ని తగినంత బాగా వడకట్టలేవు అని అర్థం. విఫలమైన మూత్రపిండాలు మీ రక్తం నుండి వ్యర్థాలు మరియు అదనపు ద్రవాన్ని తొలగించే పనిని పేలవంగా చేస్తాయి. వ్యర్ధాలు మరియు అదనపు ద్రవం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. వ్యర్ధాలు పేరుకుపోవడం అనేది మిమ్మల్ని జబ్బుపడేటట్లు చేయవచ్చు. మీరు ఈ క్రింది లక్షణాలను కలిగి ఉండవచ్చు:
- చీలమండ, ముఖం, లేదా కడుపు వాపు
- కడుపులో అనారోగ్యం
- వాంతులు అవ్వడం
- ఆకలి లేకపోవడం
- రుచి యొక్క జ్ఞానాన్ని కోల్పోవడం
- అలసినట్లుగా అనిపించడం
- బలహీనత
- గందరగోళం
- తలనొప్పి
మూత్రపిండాల వైఫల్యానికి అత్యంత సాధారణ కారణాలు ఏమిటి?
మధుమేహం మరియు అధిక రక్తపోటు అనేవి మూత్రపిండముల వైఫల్యానికి అత్యంత సాధారణ కారణాలు. ఇతర కారణాలలో గుండె మరియు రక్త నాళ వ్యాధి మరియు మూత్రపిండాల వైఫల్యం వున్న కుటుంబ చరిత్ర ఉంటాయి.
మూత్రపిండాల వైఫల్యానికి చికిత్సలు ఏమిటి?
మూత్రపిండాల వైఫల్యానికి చికిత్సలు
- హీమోడయాలసిస్
- పెరిటోనియల్ (ఉదరకుహరాన్ని ఆవరించి ఉన్న పొర) డయాలసిస్
- మూత్రపిండ మార్పిడి
- సాంప్రదాయిక నిర్వహణ
హీమోడయాలసిస్ అంటే ఏమిటి?
హీమోడయాలసిస్ అనేది ఒక కేంద్రంలో వారానికి అనేకసార్లు చేయబడే మూత్రపిండాల వైఫల్యానికి చేసే ఒక చికిత్స. కొందరు తమ ఇళ్లలో హీమోడయాలసిస్ చేయడం నేర్చుకుంటారు. మీ మూత్రపిండాలు ఇకమీదట ఫిల్టర్ చేయలేనంతగా జబ్బుపడినప్పుడు హీమోడయాలసిస్ మీ రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి ఒక యంత్రాన్ని ఉపయోగిస్తుంది. హీమోడయాలసిస్ తో, మీ రక్తం మీ శరీరం వెలుపల ఫిల్టర్ చేయబడుతుంది. వడకట్టబడని (ఫిల్టర్ చేయబడని) రక్తం శరీరం నుండి తొలగించబడుతుంది మరియు శుభ్రం చేయబడడానికి డయాలసిస్ చేయు పరికరము లోకి ప్రవహిస్తుంది. ఫిల్టర్ చేయబడిన రక్తం తిరిగి శరీరంలోకి ప్రవహిస్తుంది. మొదట, ఒక డయాలసిస్ నర్సు మీ చేతిలోకి రెండు సూదులు గుచ్చుతుంది. హీమోడయాలసిస్ మెషీన్లోని ఒక పంప్ సూదులలో ఒక దాని ద్వారా మీ రక్తాన్ని ఒక గొట్టంలోకి సేకరిస్తుంది. ఆ గొట్టం రక్తాన్ని డయలైజర్ (డయాలసిస్ చేయు పరికరము) అని పిలువబడే ఒక ఫిల్టర్ కు తీసుకువెళుతుంది. డయలైజర్ లోపల, మీ రక్తం స్ట్రాస్ వంటి సన్నని ఫైబర్స్ గుండా ప్రవహిస్తుంది. వ్యర్ధాలు మరియు అదనపు ద్రవం ఫైబర్స్ లోని చిన్న రంధ్రాల ద్వారా రక్తాన్ని వదిలి పెడతాయి. అప్పుడు, వేరే ట్యూబ్ రెండవ సూది ద్వారా ఫిల్టర్ చేయబడిన రక్తాన్ని తిరిగి మీ శరీరానికి చేరవేస్తుంది. మీ శరీరం మూత్రంను తయారు చేసే విధంగానే హీమోడయాలసిస్ యంత్రం వ్యర్ధాలు మరియు అదనపు ద్రవాన్ని బయటకు పంపిస్తుంది. హీమోడయాలసిస్ మూత్రపిండాలను మెరుగు పరచదు. అయితే, అది మీ మూత్రపిండాలు విఫలమైనప్పుడు మీ రక్తాన్ని ఫిల్టర్ చేయడం ద్వారా మీకు బాగా అనిపించడానికి సహాయపడవచ్చు.
హీమోడయాలసిస్ లో, ఫిల్టర్ చేయబడని రక్తం శరీరం నుండి తొలగించబడుతుంది మరియు శుభ్రం చేయబడడానికి డయలైజర్ కు ప్రవహిస్తుంది. ఫిల్టర్ చేయబడిన రక్తం తిరిగి శరీరానికి ప్రవహిస్తుంది.
పెరిటోనియల్ డయాలసిస్ అంటే ఏమిటి?
పెరిటోనియల్ డయాలసిస్ మీ శరీరం లోపల మీ రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి మీ కడుపు యొక్క పొరను ఉపయోగిస్తుంది. మీరు పెరిటోనియల్ డయాలసిస్ ను ఇంట్లో చెయ్యగలరు ఎందుకంటే అది ఫిల్టర్ చేయడానికి మీ శరీరాన్ని ఉపయోగిస్తుంది. ఒక డాక్టర్ మీరు చికిత్స ప్రారంభించడానికి కొన్ని వారాల ముందు మీ కడుపులో కాథెటర్ అని పిలువబడే ఒక మృదువైన ట్యూబ్ ను ఉంచుతాడు. కాథెటర్ శాశ్వతంగా మీ కడుపులో ఉండిపోతుంది.
ఒక ప్లాస్టిక్ సంచి నుంచి ఒక రకమైన లవణ జలాన్ని మీ కడుపులోకి ఉంచడానికి కాథెటర్ మిమ్మల్ని అనుమతిస్తుంది. అప్పుడు, మీరు అటు ఇటు కదలవచ్చు మరియు రోజంతా మీరు చేయవలసినవి చేయవచ్చు. లవణ జలం మీ కడుపు లోపల ఉన్న సమయంలో, అది మీ శరీరం నుండి వ్యర్ధాలు మరియు అదనపు ద్రవాన్ని గ్రహిస్తుంది. కొన్ని గంటల తర్వాత, మీరు మీ కడుపు నుంచి లవణ జలాన్ని ఒక డ్రెయిన్ బ్యాగ్ లోకి పంపిస్తారు. లవణ జలం మీ శరీరం నుండి వ్యర్ధాలు మరియు అదనపు ద్రవాన్ని తొలగిస్తుంది. లవణ జలాన్ని ఒక టాయిలెట్ లేదా టబ్ లోకి పారవేయవచ్చు. అప్పుడు మీరు తాజా లవణ జలం బ్యాగ్ తో తిరిగి ప్రారంభిస్తారు. మీరు ఒక రోజుకు నాలుగు నుంచి ఆరు సార్లు మీ కడుపును ఖాళీ చేస్తారు మరియు నింపుతారు.
లవణ జలం వ్యర్ధాలు మరియు అదనపు ద్రవాన్ని గ్రహిస్తూ మీ కడుపులో ఎప్పుడూ ఉంటుంది. పెరిటోనియల్ డయాలసిస్ మూత్రపిండాలను మెరుగు పరచదు. అయితే, అది మీ మూత్రపిండాలు విఫలమైనప్పుడు మీ రక్తాన్ని ఫిల్టర్ చేయడం ద్వారా మీకు బాగా అనిపించడానికి సహాయపడవచ్చు.
పెరిటోనియల్ డయాలసిస్ లో, కాథెటర్ శాశ్వతంగా మీ కడుపులో ఉండిపోతుంది.
మూత్రపిండాల వైఫల్యానికి డయాలసిస్ ఒక నివారణా మార్గమా?
కాదు. హీమోడయాలసిస్ మరియు పెరిటోనియల్ డయాలసిస్ మీకు బాగా అనిపించడానికి మరియు ఎక్కువ కాలం జీవించడానికి సహాయ పడుతాయి; అయితే, అవి మూత్రపిండాల వైఫల్యాన్ని నయం చేయవు. మూత్రపిండాల వైఫల్యం గల వ్యక్తులు ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నప్పటికీ, కొన్ని సంవత్సరాలలో, మూత్రపిండాల వ్యాధి గుండె జబ్బులు, ఎముక వ్యాధి, కీళ్ళవాతం, నరాల నష్టం వంధ్యత్వం, మరియు పోషకాహారలోపం వంటి సమస్యలను కలిగించవచ్చు. ఈ సమస్యలు డయాలసిస్ తో వదిలి వెళ్ళవు; అయితే, ప్రస్తుతం వైద్యుల వద్ద వాటిని నిరోధించడానికి లేదా చికిత్స చేయడానికి కొత్త మరియు మెరుగైన మార్గాలు ఉన్నాయి. మీరు మీ డాక్టర్ తో ఈ సమస్యలు మరియూ వాటి చికిత్సల గురించి చర్చించాలి.
మూత్రపిండ మార్పిడి అంటే ఏమిటి?
ఒక మూత్రపిండ మార్పిడి అనేది మరో వ్యక్తి నుండి ఒక ఆరోగ్యకరమైన మూత్రపిండాన్ని మీ శరీరంలో ఉంచుతుంది. మూత్రపిండం అప్పుడే మరణించిన ఎవరో ఒకరి నుండి రావచ్చు. మీ డాక్టర్ ఒక మూత్రపిండం కొరకు వేచి ఉండే వారి జాబితాలో మీ పేరును ఉంచుతాడు. ఒక కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడు మీకు ఒక మూత్రపిండంను ఇవ్వగలగవచ్చు. అప్పుడు మీరు వేచి ఉండనవసరం లేదు.
అది మీ శరీరం లోపల ఉంచబడిన తర్వాత, క్రొత్త మూత్రపిండం మీ రక్తాన్ని ఫిల్టర్ చేయడాన్ని నిర్వహిస్తుంది. పాడైపోయిన మూత్రపిండాలు సాధారణంగా అవి ఉండే చోటనే ఉంటాయి. క్రొత్త మూత్రపిండం మూత్రాశయం యొక్క ఒక వైపున, పొత్తి కడుపు ముందు భాగంలో ఉంచబడుతుంది. మీ శరీరం సాధారణంగా బ్యాక్టీరియా వంటి అక్కడ ఉండకూడని దేని మీదనైనా దాడి చేస్తుంది. శరీరం క్రొత్త మూత్రపిండం అక్కడ ఉండకూడదు అని భావిస్తుంది. క్రొత్త మూత్రపిండం మీద దాడి చేయకుండా మీ శరీరాన్ని ఉంచడానికి మీరు ప్రతిరక్షా నిరోధకాలు అని పిలువబడే మందులను తీసుకుంటారు.
మూత్రపిండ మార్పిడి
సాంప్రదాయిక నిర్వహణ అంటే ఏమిటి?
సాంప్రదాయిక నిర్వహణ అంటే మీ వైద్యులు డయాలసిస్ లేదా మార్పిడి లేకుండా మీ గురించి శ్రద్ధ తీసుకుంటారు అని అర్థం. వైద్యులు మీకు మరింత సౌకర్యవంతంగా అనిపించేటట్లు చేసే మందులను ఇవ్వవచ్చు. మీరు మీ ఇంట్లో సాంప్రదాయిక నిర్వహణను కలిగి ఉండవచ్చు. మీరు నర్సింగ్ సంరక్షణ పొందే ఒక ప్రత్యేక స్థలమైన, ఒక ధర్మశాలకు వెళ్లాలని మీరు అనుకోవచ్చు. డయాలసిస్ లేదా మార్పిడి వారికి ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడనపుడు లేదా వారిని ఎక్కువ కాలం బాధలకు గురిచేసినపుడు కొంతమంది సాంప్రదాయిక నిర్వహణను ఎంచుకుంటారు. డయాలసిస్ లేదా మార్పిడి లేకుండా, మీరు కొన్ని వారాలు లేదా అనేక నెలల పాటు జీవించవచ్చు.
ఏ చికిత్స నాకు సరియైనది అని నేను ఎలా నిర్ణయించుకుంటాను?
మీకు మూత్రపిండం వైఫల్యం ఉంటే, చికిత్సల గురించి తెలుసుకోండి మరియు మీకు ఏది ఉత్తమంగా సరిపోతుంది అనే దాని గురించి ఆలోచించండి. హీమోడయాలసిస్ లేదా పెరిటోనియల్ డయాలసిస్ మీద వున్న వ్యక్తులతో మాట్లాడండి. ప్రతి చికిత్స గురించి మంచి మరియు చెడును అడగండి. మీరు ఒక ఎంపిక చేసి మరియు అది మీకు నచ్చలేదు అని కనుగొంటే, మరొక దానిని ప్రయత్నించడం గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి. మార్పిడి నిరీక్షణ పట్టిక (వెయిటింగ్ లిస్టు) మరియు ఒక మార్పిడి తర్వాత అవసరమయ్యే మందుల గురించి మీ వైద్యుడిని అడగండి. మూత్రపిండ మార్పిడి చేయించుకున్న వ్యక్తులతో మాట్లాడండి మరియు అది వారి జీవితాలను ఎలా మార్చింది అని అడగండి.
మీరు పని చేస్తూ ఉండాలని ప్లాన్ చేస్తే, పని చేయడాన్ని సులభతరం చేసే చికిత్స ఎంపిక గురించి ఆలోచించండి. కుటుంబం మరియు స్నేహితులతో సమయం గడపడం అనేది మీకు చాలా విలువైనది అయితే, ఏ చికిత్స మీకు అత్యంత ఖాళీ సమయాన్ని అందిస్తుంది అని అడగండి. ఏ చికిత్స మీరు ఆరోగ్యంగా మరియు ఎక్కువ కాలం జీవించడానికి ఉత్తమ అవకాశం ఇస్తుంది అని తెలుసుకోండి.
మీరు సాంప్రదాయిక నిర్వహణ గురించి ఆలోచిస్తూ ఉంటే, మీరు నిర్ణయించుకున్న తర్వాత, మీరు మీ కుటుంబం, స్నేహితులు, వైద్యుడు, లేదా మానసిక ఆరోగ్య కౌన్సిలర్ తో మాట్లాడాలని అనుకోవచ్చు.
మీరు మీ డాక్టర్ తో మాట్లాడటం ద్వారా మీ రక్షణను నియంత్రణలోకి తెచ్చుకోగలరు. మీ కొత్త చికిత్సకు అలవాటు పడడానికి మీకు సమయం అవసరం కావచ్చు. మూత్రపిండ వైఫల్యం మీ జీవితాన్ని కష్టతరం చేయవచ్చు. చికిత్సలు మీ జీవితాన్ని మెరుగుపరచడానికి సహాయం చేయవచ్చు.
నేను నా వైద్యుడిని ఎలాంటి ప్రశ్నలు అడగాలి?
మీరు మీ డాక్టర్ ను ఈ ప్రశ్నలను అడగాలనుకోవచ్చు:
- మూత్రపిండాల వైఫల్యం కొరకు ఏ చికిత్స నాకు ఉత్తమ చికిత్స ఎంపిక? ఎందుకు?
- నేను ఒక డయాలసిస్ కేంద్రంలో చికిత్స తీసుకుంటే, నేను నాకు నచ్చిన కేంద్రానికి వెళ్ళవచ్చునా?
- నేను ఒక డయాలసిస్ కేంద్రంలో దేని కొరకు చూడాలి?
- డయాలసిస్ సమయంలో నా కిడ్నీ డాక్టర్ నన్ను చూస్తాడా?
- ఒక హీమోడయాలసిస్ రోగిగా, నేను పని చేస్తూ ఉండగలనా? నేను చికిత్సలు రాత్రి పూట చేయించుకోవచ్చా? నేను నా పిల్లలను చూసుకోగలనా?
- నేను ఎంత వ్యాయామం చేయాలి?
- నేను సమస్యలతో ఎవరిని సంప్రదించాలి?
- నా ఆరోగ్య సంరక్షణ జట్టులో ఎవరెవరు ఉంటారు? నా ఆరోగ్య సంరక్షణ జట్టు సభ్యులు నాకు ఎలా సహాయం చేయగలరు?
- ఎవరితో నేను ఆర్ధిక, సెక్స్, లేదా కుటుంబ సమస్యల గురించి మాట్లాడగలను?
- ఈ నిర్ణయం ఎదుర్కొన్న ఇతర వ్యక్తులతో నేను ఎలా/ఎక్కడ మాట్లాడగలను?
- నా లాంటి ఎవరైనా డయాలసిస్ మీద ఎంతకాలం జీవిస్తారని ఆశించవచ్చు?
తినడం, డైట్, మరియు న్యూట్రిషన్
ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం అనేది మీ శక్తి మరియు బలాన్ని కొనసాగించేందుకు మీకు సహాయం చేయవచ్చు. అన్ని డయాలసిస్ మరియు మార్పిడి కేంద్రాలు ఒక డైటిషియన్ ను కలిగి ఉంటాయి. మూత్రపిండాల వైఫల్యం గల వ్యక్తులకు ఆరోగ్యకరమైన ఆహార ఎంపికల గురించి తెలుసుకోవడానికి డైటిషియన్ సహాయపడతాడు. భోజన పథకాన్ని తయారు చేయడానికి మీరు మీ సెంటర్ యొక్క డైటిషియన్ తో మాట్లాడాలి.
మీరు మీ డాక్టర్ తో మాట్లాడిన తర్వాత, మీ కొరకు ఉత్తమమైన ఆహారం మీరు ఎంచుకునే మూత్రపిండ వైఫల్య చికిత్స మీద ఆధారపడుతుంది.
- హీమోడయాలసిస్
- మీరు త్రాగే ద్రవ మరియు నీటి పరిమాణాన్ని పరిమితం చేయండి. హీమోడయాలసిస్ సెషన్ల మధ్యలో మీ శరీరంలో ద్రవం పేరుకుపోవచ్చు. అలాగే, అనేక ఆహారాలు నీటిని కలిగి ఉంటాయి. మీ శరీరంలోని అదనపు ద్రవం వాపు మరియు అధిక రక్తపోటును కలిగించవచ్చు. మీ శరీరం లో అదనపు ద్రవం మీ గుండె కష్టంగా పని చేసేటట్లు చేస్తుంది.
- సోడియం, లేదా ఉప్పును పరిమితం చేయండి. ఘనీభవించిన ఆహారాలు (ఫ్రోజన్ ఫుడ్స్) మరియు సిద్ధంగా తయారు చేసిన భోజనంలో సోడియం కొరకు చూడండి. క్యాన్డ్ ఆహారాలు, హాట్ డాగ్స్, మరియు ఫాస్ట్ ఫుడ్ లో కూడా మీరు సోడియంను కనుగొనవచ్చు. సోడియం మీకు దాహంను కలిగిస్తుంది, ఇది మీరు తీసుకోవలసిన దాని కంటే ఎక్కువ నీరు మరియు ఇతర ద్రవాలను మీరు తాగేటట్లు చేస్తుంది.
- పొటాషియంను పరిమితం చేయండి. పొటాషియం బంగాళాదుంపలు, టమోటాలు, నారింజ మరియు అరటి వంటి అనేక పండ్లు మరియు కూరగాయలలో కనిపిస్తుంది. చాలా ఎక్కువ పొటాషియం మీ గుండె అసమతుల్యంగా కొట్టుకునేటట్లు చేయవచ్చు. హీమోడయాలసిస్ మీ శరీరం నుండి పొటాషియంను బాగా తొలగించదు.
- మాంసం, చేపలు మరియు గుడ్లు వంటి ప్రోటీన్ అధికంగా వుండే ఆహారాలను తినండి. హీమోడయాలసిస్ మీ శరీరం నుండి ప్రోటీన్ ను తొలగిస్తుంది.
- ఫాస్ఫరస్ ను పరిమితం చేయండి. ఫాస్ఫరస్ మీ ఎముకలు, రక్త నాళాలు, మరియు కండరాలు పని చేయడానికి సహాయపడుతుంది.
- అయితే, చాలా ఎక్కువ ఫాస్ఫరస్ మీ ఎముకలను బలహీనంగా చేయవచ్చు. ఫాస్ఫరస్ ను పరిమితం చేయడం కష్టం అవ్వచ్చు. మాంసం మరియు పాలు వంటి ఫాస్ఫరస్ ను కలిగి ఉన్న ఆహారాలు, మీకు అవసరమైన ప్రోటీన్ ను కూడా కలిగి ఉంటాయి. మీరు తగినంత ప్రోటీన్ తినడానికి జాగ్రత్త పడాలి కానీ మీరు చాలా ఎక్కువ ఫాస్ఫరస్ పొందే అంత ఎక్కువ కాదు. మీరు కోల, టీ, బీన్స్, మరియు నట్స్ వంటి ఫోస్ఫరస్ ను కలిగి ఉండే ఇతర ఆహారాలను దూరంగా ఉంచవచ్చు.
- మీ ఆహారంలో కేలరీలు జోడించడానికి ఆరోగ్యకరమైన మార్గాలను కనుగొనండి. కేలరీలు అన్ని ఆహారాలలో కనిపిస్తాయి మరియు మీ శరీరానికి శక్తిని ఇస్తాయి. హీమోడయాలసిస్ మీద వుండే అనేక మందికి మంచి ఆకలి ఉండదు మరియు తగినన్ని కేలరీలు పొందరు. కూరగాయ నూనెలు కేలరీల యొక్క మంచి వనరులు. కూరగాయ నూనెలలో ఆలివ్ నూనె, కనోలా నూనె మరియు కుసుంభ నూనె ఉంటాయి. బ్రెడ్లు, అన్నం మరియు నూడుల్స్ లో వాటిని ఉపయోగించండి. హార్డ్ క్యాండీ, చక్కెర, తేనె, జామ్, మరియు జెల్లీ కేలరీలు మరియు శక్తిని అందిస్తాయి. అయితే, మీకు మధుమేహం ఉంటే, అదనపు స్వీట్లు తినే ముందు మీ వైద్యుడు లేదా డైటిషియన్ తో మాట్లాడగలరు.
- పెరిటోనియల్ డయాలసిస్
- మీకు అవసరమైనంత నీరు మరియు ఇతర ద్రవాలు త్రాగండి. మీరు చాలా ఎక్కువ ద్రవం లేదా చాలా తక్కువ ద్రవం కలిగి ఉంటే, మీ డాక్టర్ కు తెలియాల్సిన అవసరం ఉంటుంది.
- మీ దాహాన్ని నియంత్రించడానికి మరియు గుండె సమస్యలను నిరోధించడానికి సహాయపడేందుకు సోడియంను పరిమితం చేయండి. మీరు మీ ఆహారాన్ని రుచిగా చేయడానికి ఉప్పు కాకుండా ఇతర సుగంధ ద్రవ్యాలు ఉపయోగించవచ్చు.
- మీరు పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువ తినవలసిన అవసరం ఉండవచ్చు. పెరిటోనియల్ డయాలసిస్ మీ శరీరం నుండి పొటాషియంను తొలగిస్తుంది. మీ కొరకు పొటాషియం యొక్క సరియైన మొత్తాన్ని గురించి మీ వైద్యుడు లేదా డైటిషియన్ తో మాట్లాడండి.
- ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తినండి. పెరిటోనియల్ డయాలసిస్ హీమోడయాలసిస్ కంటే మీ శరీరం నుండి ఎక్కువ ప్రోటీన్ ను తొలగిస్తుంది.
- మీ ఎముకలను బలంగా ఉంచడానికి ఫాస్ఫరస్ ను పరిమితం చేయండి.
- మీరు మీరు తీసుకునే కేలరీలను పరిమితం చేయవలసిన అవసరం ఉండవచ్చు. లవణ జలం కూడా కొంత చక్కెర ను కలిగి ఉంటుంది. మీ శరీరం మీరు బరువు పెరగటానికి కారణమవ్వగల చక్కెరను గ్రహిస్తుంది.
- మూత్ర పిండ మార్పిడి
- ఓ గుండె సమస్యలు నిరోధించడంలో సహాయపడేందుకు సోడియంను పరిమితం చేయండి.
- మీరు ఫాస్ఫరస్ మరియు పొటాషియం యొక్క సాధారణ పరిమాణాలను తినగలగాలి. రక్త పరీక్షలు ఒక సమస్యను చూపిస్తే మీరు పరిమాణాలను సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉండవచ్చు.
- కండరాల విచ్ఛినాన్ని బాగు చేయడానికి మరియు ఇంఫెక్షన్ కు వ్యతిరేకంగా రక్షించడానికి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తినండి.
- మీరు మీ కేలరీలను పరిమితం చేయవలసిన అవసరం ఉండవచ్చు. మీరు తీసుకునే మందులు మిమ్మల్ని బరువు పెరిగేటట్లు చేయవచ్చు.
- సాంప్రదాయిక నిర్వహణ
మీ రక్తంలో వ్యర్ధాల పెరుగుదలను నిరోధించడం కోసం ప్రోటీన్ ను పరిమితం చేయండి.
మీ చికిత్సలు ఎంత బాగా పని చేస్తాయి అనే దాని మీద ఆధారపడి, మీకు ఇతర అవసరాలు మరియు పరిమితులు ఉండవచ్చు.
గుర్తుంచుకోవలసిన పాయింట్లు
- మూత్రపిండాల వైఫల్యం అంటే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి మీ మూత్రపిండాలు ఇకపై మీ రక్తాన్ని తగినంత బాగా వడకట్టలేవు అని అర్థం.
- మూత్రపిండాల వైఫల్యానికి చికిత్సలు
- హీమోడయాలసిస్
- పెరిటోనియల్ (ఉదరకుహరాన్ని ఆవరించి ఉన్న పొర) డయాలసిస్
- మూత్రపిండ మార్పిడి
- సాంప్రదాయిక నిర్వహణ
- మీ మూత్రపిండాలు ఇక మీదట ఫిల్టర్ చేయలేనంతగా జబ్బుపడినప్పుడు హీమోడయాలసిస్ మీ రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి ఒక యంత్రాన్ని ఉపయోగిస్తుంది.
- పెరిటోనియల్ డయాలసిస్ మీ శరీరం లోపల మీ రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి మీ కడుపు యొక్క పొరను ఉపయోగిస్తుంది.
- ఒక మూత్రపిండ మార్పిడి అనేది మరో వ్యక్తి నుండి ఒక ఆరోగ్యకరమైన మూత్రపిండాన్ని మీ శరీరంలో ఉంచుతుంది.
- సాంప్రదాయిక నిర్వహణ అంటే మీ వైద్యులు డయాలసిస్ లేదా మార్పిడి లేకుండా మీ గురించి శ్రద్ధ తీసుకుంటారు అని అర్థం. వైద్యులు మీకు మరింత సౌకర్యవంతంగా అనిపించేటట్లు చేసే మందులను ఇవ్వవచ్చు.
- అన్ని డయాలసిస్ మరియు మార్పిడి కేంద్రాలు ఒక డైటిషియన్ ను కలిగి ఉంటాయి. మూత్రపిండాల వైఫల్యం గల వ్యక్తులకు ఆరోగ్యకరమైన ఆహార ఎంపికల గురించి తెలుసుకోవడానికి డైటిషియన్ సహాయపడతాడు.