దీర్ఘకాల మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు కొరకు చిట్కాలు – ఫుడ్ లేబుల్ రీడింగ్

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456

ఒక వేళ మీకు CKD  ఉంటే, మీ ఆహారంలో సోడియం, భాస్వరం, లేదా పొటాషియం వంటి కొన్ని పోషకాలను మీరు అదుపు చేసుకొవలసిన అవసరం ఉండవచ్చు. మీరు సాచ్యురేటెడ్ మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ ను చేయడానికి కూడా పరిమితం చేయాలి. మీ మూత్రపిండాల కోసం ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు  చేయడానికి సహాయం కోసం ఫుడ్ లేబుల్ ను చదవండి.

  • న్యూట్రిషన్ ఫాక్ట్స్ లేబుల్ ను సోడియం కొరకు తనిఖీ చేయండి.
  • ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ను అదనపు భాస్వరం మరియు పొటాషియం కొరకు తనిఖీ చేయండి.
  • “లో సాచ్యురేటెడ్ ఫాట్” లేదా “సోడియం ఫ్రీ” వంటి క్లెయిమ్స్ కొరకు లేబుల్ పై చూడండి.

న్యూట్రిషన్ ఫాక్ట్స్ లేబుల్ లో నేను దేనికోసం చూడాలి?

ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో నేను దేనికోసం చూడాలి

  1. భాస్వరం లేక PHOS తో వున్న పదాల కొరకు ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ను చూడండి. అనేక ప్యాక్డ్ ఆహారములు భాస్వరంను కలిగి ఉంటాయి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లేబుల్ మీద PHOS ను కలిగివున్నప్పుడు ఒక వేరే ఆహారాన్ని ఎంచుకోండి.
ఇంగ్రీడియంట్స్: నానబెట్టిన బంగాళాదుంపలు (నీరు, బంగాళ దుంపలు, సోడియం ఆమ్లం పైరోఫాస్ఫేట్), బీఫ్ (గొడ్డు మాంసం, నీరు, ఉప్పు, సోడియం ఫాస్ఫేట్), వైన్ …
ఈ  ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఆహారంలో అదనపు భాస్వరం వుందని చూపిస్తుంది.
  1. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో పొటాషియం కొరకు చూడండి. ఉదాహరణకు, కొన్ని ప్యాక్డ్ ఆహారాలైన క్యాన్డ్ సూప్స్ మరియు టమోటో వస్తువులలో ఉప్పు బదులుగా పొటాషియం క్లోరైడ్ ను ఉపయోగించవచ్చు. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో పొటాషియంతో వున్న ఆహారాలను పరిమితి చేయండి
 ఇంగ్రీడియంట్స్: టమోటా రసం, వెజిటబుల్ రసం మిశ్రమం, పొటాషియం క్లోరైడ్, చక్కెర, మెగ్నీషియం, ఉప్పు, విటమిన్ సి (ఆస్కార్బిక్ ఆమ్లం), సిట్రిక్ యాసిడ్, స్పైస్ ఎక్స్ట్రాక్ట్, సువాసన సామగ్రి, డైసోడియం ఐసోనేట్డైసోడియం గ్వాన్యలేట్.  
ఈ  ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఆహారంలో అదనపు పొటాషియం వుందని చూపిస్తుంది.

మీకు తెలుసా? ఇంగ్రీడియంట్స్ ఆహారంలో వున్న పరిమాణం యొక్క క్రమంలో ఇవ్వబడ్డాయి. ఆహారం జాబితాలోని మొదటి  పదార్ధంను ఎక్కువగా కలిగి వుంది మరియు జాబితాలోని చివరి పదార్ధంను  తక్కువగా కలిగి వుంది.

మీరు ఆహారాలను కనుగొనడానికి సహాయం కోసం ఫుడ్ ప్యాకేజీల మీద వుండే క్లైమ్స్ కొరకు చూడండి:

సాచ్యురేటెడ్/ట్రాన్స్ ఫ్యాట్  లో తక్కువ:

  • సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఫ్రీ
  • లో సాచ్యురేటెడ్ ఫ్యాట్
  • లెస్ సాచ్యురేటెడ్ ఫ్యాట్
  • ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ

సోడియం లో తక్కువ: *

  • సోడియం ఫ్రీ
  • వెరీ లో  సోడియం
  • లో సోడియం
  • రెడ్యూస్డ్ సాల్ట్

* సోడియం క్లోరైడ్ (ఉప్పు) ను కొన్ని ఆహారాలలో పొటాషియం క్లోరైడ్ తో భర్తీ చేస్తారు. ఒక వేళ మీరు   మీ పొటాషియంను గమనించాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ను చూడండి


తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు