డిప్రెషన్ మరియు మధుమేహం

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456


పరిచయం 

డిప్రెషన్ మీ మెదడును మరియు ప్రవర్తనను మాత్రమే ప్రభావితం చేయదు–ఇది మీ మొత్తం శరీరాన్ని  ప్రభావితం చేస్తుంది. డిప్రెషన్ మధుమేహంతో సహా, ఇతర ఆరోగ్య సమస్యలతో ముడిపడి వుంది. ఒకే సమయములో ఒకటి కంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలను నిర్వహించడం కష్టము కావచ్చు, కనుక సరైన చికిత్స ముఖ్యమైనది.

డిప్రెషన్ అంటే ఏమిటి?

మేజర్ డిప్రెసివ్ డిజార్డర్, లేదా డిప్రెషన్, ఒక తీవ్రమైన మానసిక అనారోగ్యం.  డిప్రెషన్ మీ రోజువారీ జీవితం మరియు దినచర్యతో జోక్యం చేసుకుంటుంది మరియు మీ జీవితం యొక్క నాణ్యతను తగ్గిస్తుంది. 18 ఆపైన వయస్సు కలిగిన 6.7 శాతం మంది భారతీయ వయోజనులు  డిప్రెషన్ ను కలిగివున్నారు.

డిప్రెషన్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు

  • కొనసాగే విచారం, ఆత్రుత, లేదా శూన్య భావాలు
  • నిస్సహాయంగా అనిపించడం
  • అపరాధంగా, నిరర్థకంగా, లేదా నిస్సహాయంగా అనిపించడం
  • చికాకుగా లేదా అసహనముగా అనిపించడం
  • ఒకప్పుడు ఆనందించిన కార్యకలాపాలు లేదా హాబీలలో, సెక్స్ తో సహా, ఆసక్తిని కోల్పోవడం
  • ఎప్పుడూ అలసటగా అనిపించడం
  • దృష్టిని కేంద్రీకరించడంలో, వివరాలు గుర్తుపెట్టుకోవడంలో, లేదా నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బంది
  • నిద్రలోకి జారుకోవడానికి లేదా నిద్రపోతూ ఉండడానికి ఇబ్బంది- నిద్రలేమి అని పిలువబడే ఒక పరిస్థితి లేదా అన్ని సమయాలలో నిద్రపోవడం
  • అతిగా తినడం లేదా ఆకలి మందగించటం
  • మరణం మరియు ఆత్మహత్య గురించిన ఆలోచనలు లేక ఆత్మహత్యా ప్రయత్నాలు
  • చికిత్సతో సులభంగా నయం కాని కొనసాగే వేదనలు మరియు నొప్పులు, తలనొప్పులు, తిమ్మిరులు, లేదా జీర్ణ సమస్యలు.

మధుమేహం అంటే ఏమిటి?

మధుమేహం అనేది జీర్ణమైన ఆహారాన్ని శరీరం శక్తి  కోసం ఉపయోగించుకునే పద్ధతిని ప్రభావితం చేసే ఒక జబ్బు.  మనము తినే ఆహారంలోని ఎక్కువ భాగము గ్లూకోజ్  అని పిలువబడే ఒక రకమైన చక్కెర లాగా విచ్ఛిన్నం చేయబడుతుంది. గ్లూకోజ్ శరీరం యొక్క ఇంధనానికి  ఒక ముఖ్యమైన ఆధారం మరియు మెదడు యొక్క ఇంధనానికి  ప్రధాన మూలం. శరీరం కూడా ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. గ్లూకోజ్ ను గ్రహించ డానికి మరియు దానిని శక్తి కోసం ఉపయోగించడానికి శరీర మొత్తంలోని కణాలకు ఇన్సులిన్ సహాయపడుతుంది. మధుమేహం శరీరం యొక్క తయారు చేసే లేక ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగించే సామర్ధ్యాన్ని తగ్గించడమో లేదా నాశనం చేయడమో జరుగుతుంది. ఇన్సులిన్ లేకుండా, గ్లూకోజ్ రక్తంలో  పేరుకుపోతుంది , మరియు శరీర కణాలు శక్తి కోసం పరితపిస్తాయి      .

విధంగా మధుమేహం మరియు డిప్రెషన్ సంబంధం కలిగి ఉంటాయి?

అధ్యయనాలు డిప్రెషన్ మరియు మధుమేహం సంభంధం కలిగి ఉండవచ్చునని సూచిస్తున్నాయి, అయితే డిప్రెషన్ మధుమేహం యొక్క ప్రమాదాన్ని లేక మధుమేహం  డిప్రెషన్ యొక్క ప్రమాదాన్నిపెంచుతుందో లేదో శాస్త్రవేత్తలకు ఇంత వరకు తెలియదు. ప్రస్తుత పరిశోధన రెండు విషయాలు సాధ్యం అని సూచిస్తుంది.

మధుమేహం డిప్రెషన్ యొక్క మీ ప్రమాదాన్ని పెంచే అవకాశంతో పాటు,  డిప్రెషన్ యొక్క లక్షణాలను   మరింత తీవ్రం చేస్తుంది.  ప్రతి రోజు మధుమేహాన్నినిర్వహించడం వల్ల ఒత్తిడి మరియు మెదడు మీద మధుమేహం యొక్క ప్రభావాలు డిప్రెషన్ కు దోహదం చేయవచ్చు. భారతదేశంలో, సగటు మనిషి డిప్రెషన్ తో వుండేదానికంటే మధుమేహం వున్న వారు రెండింతలు వున్నారు.

అదే సమయంలో, డిప్రెషన్ యొక్క కొన్ని లక్షణాలు  శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని తగ్గించవచ్చు,     మధుమేహం యొక్క మీ ప్రమాదాన్ని పెంచడం మాత్రమే కాక మధుమేహ లక్షణాలను మరింత తీవ్రం చేస్తుంది.  ఉదాహరణకు, అతిగా తినడం బరువు పెరుగుటకు కారణం కావచ్చు,  మధుమేహానికి ఒక ప్రధాన ప్రమాద కారకం.  అలసట లేదా నిరర్థకమన్న భావాలు, మీ మధుమేహ లక్షణాలను తీవ్రం చేస్తూ, మీరు మీ మధుమేహాన్ని నియంత్రించడానికి అవసరమైన ప్రత్యేక ఆహారం లేదా మందుల ప్రణాళికను విస్మరించడానికి కారణం కావచ్చు. మధుమేహం మరియు డిప్రెషన్ వున్నవారు మధుమేహం ఒక్కటే  వున్నవారి కంటే మరింత తీవ్రమైన మధుమేహ లక్షణాలను కలిగి ఉంటారని అధ్యయనాలు నిరూపించాయి.

మధుమేహం వున్న వారిలో డిప్రెషన్ విధంగా నయం చేయబడుతుంది?

డిప్రెషన్ ఒక ఆరోగ్య సంరక్షణ ప్రదాత ద్వారా నిర్దారించబడుతుంది మరియు బాగుచేయబడుతుంది. డిప్రెషన్ ను బాగుచేయడం అనేది మధుమేహాన్ని నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది మరియు మీ ఆరోగ్యం మొత్తాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహం మరియు డిప్రెషన్ కలిగి వున్నవారికి, డిప్రెషన్ కు చికిత్స చేయడం అనేది మూడ్ స్థాయిలను పెంచవచ్చు మరియు రక్తంలోని చక్కెర నియంత్రణను పెంచవచ్చు అని శాస్త్రవేత్తలు నివేదించారు . డిప్రెషన్ నుంచి కోలుకోవడానికి సమయం పడుతుంది అయితే  చికిత్సలు ప్రభావవంతముగా వుం టాయి.

ప్రస్తుతం, డిప్రెషన్ కు అత్యంత సాధారణ చికిత్సలు ఈ క్రింది వాటితో కూడి వుంటాయి:

  • ఒక రకమైన మానసిక చికిత్స, లేదా టాక్ థెరపీ అయిన కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT), వారి డిప్రెషన్ కు తోడ్పడే ప్రతికూల ఆలోచన విధానాలను మరియు ప్రవర్తనలను మార్చుకోవడానికి ప్రజలకు సహాయ పడుతుంది.
  • సైటాలోప్రామ్, సర్ట్రలిన్, మరియు ఫ్లక్షెటిన్ లను కలిగి ఉండే ఒక రకమైన యాంటిడిప్రెసెంట్ మందు అయిన సెలెక్టివ్ సెరోటోనిన్ రీ అప్ టేక్ ఇన్హిబిటర్ (SSRI)
  • వెన్లఫాక్జీన్ మరియు డ్యూలక్జటీన్ లను కలిగి ఉండే SSRI ను పోలి ఉండే ఒక రకమైన యాంటిడిప్రెసెంట్ మందు అయిన సెరోటోనిన్ మరియు నొరెపిన్ఫ్రయిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్(SNRI)

కొన్ని యాంటి డిప్రేసంట్స్ ఒక దుష్ప్రభావం లాగా బరువు పెరుగుటకు కారణం కావచ్చు మరియు మీకు డయాబెటిస్ వున్నప్పుడు అవి సమర్థవంతమైన డిప్రెషన్ చికిత్స కాకపోవచ్చు.  అవి ఏమిటంటే:

  • ట్రిసైక్లిక్స్
  • మోనోఅమైన్ ఆక్సిడేస్ ఇన్హిబిటర్స్ (MAOIs)
  • పారోక్సిటైన్
  • మిర్టజాపైన్

ప్రస్తుతం అందుబాటులో వున్న డిప్రెషన్ చికిత్సలు సాధారణంగా బాగా తట్టుకోబడినవి మరియు సురక్షితమైనవి అయినప్పటికీ దుష్ప్రభావాలు, సంభావ్య ఔషధ సంకర్షణలు మరియు ఇతర చికిత్సా విధానాల గురించి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో మాట్లాడండి. అందరూ చికిత్సకు ఒకటే విధంగా ప్రతిస్పందించరు. మందులు పని చేయడానికి చాలా వారాలు పట్టవచ్చు, కొనసాగే టాక్ థెరపీతో కలపవలసిన అవసరం ఉండవచ్చు లేదా దుష్ప్రభావాలు తగ్గించడానికి మరియు ఉత్తమ ఫలితాలను సాధించడానికి మార్చవలసిన అవసరం ఉండవచ్చు లేదా సర్దుబాటు చేయబడవలసిన అవసరం ఉండవచ్చు.

మీరు నిరాశ చెందినట్లు అనిపించినా లేదా అటువంటి వారు ఎవరైనా తెలిసినా ఆశ కోల్పోవద్దు. డిప్రెషన్ కొరకు సహాయాన్ని పొందండి.

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు