పరిచయం
మీరు ఒక బొటనవేలు, పాదము, లేదా కాలును కోల్పోవడానికి దారితీసే అవకాశాలను మీరు తగ్గించు కోవాలనుకుంటున్నారా? మీ పాదాలను సంరక్షించుకోవడం అనేది కీలకం. మీకు ఎక్కువ కాలం నుంచి మధుమేహం ఉన్నట్లయితే, ఈ బుక్లెట్ మీకు మరింత తెలుసుకోవడానికి సహాయపడుతుంది. మీరు మీ పాదాలను శ్రద్దగా చూసుకోడానికి మీ సొంత ప్రణాళికను తయారు చేసుకోడానికి మీకు సహాయం చెయ్యడానికి దీన్ని ఉపయోగించండి. మీ డాక్టర్ మరియు ఆరోగ్య సంరక్షణ జట్టుతో మీ ప్రణాళికను పంచుకోండి మరియు మీకు అది అవసరమైనప్పుడు వారి సహాయాన్ని పొందండి.
రిమైండరు: మీ పాదముల మీద కోత, కురుపు,లేదా కమలడం కొన్ని రోజుల తర్వాత నయం కాకపోతే వెంటనే మీ డాక్టర్ ను కలవండి.
పాద రక్షణ ఎందుకు ముఖ్యం?
కాలక్రమేణా, మధుమేహం మీరు మీ పాదాలలో స్పర్శ కోల్పోవడానికి కారణమవుతుంది. మీరు మీ అడుగులలో స్పర్శ కోల్పోయినప్పుడు, మీ సాక్ లోపల ఒక గులక రాయి లేక మీ పాదం మీద ఒక బొబ్బ ఏర్పడినా కూడా అనుభూతి కలగదు, అది కోతలకు మరియు పుండ్లకు దారి తీయవచ్చు. మధుమేహం మీ పాదములలో రక్త ప్రవాహ పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది. పాదములలో తిమ్మిరి మరియు పాదములలో తక్కువ రక్త ప్రవాహం పాద సమస్యలకు దారితీస్తుంది.
మధుమేహం వున్న అందరికీ పాద సంరక్షణ ముఖ్యమైనది, అయితే ఒకవేళ మీరు ఈ క్రింది వాటిని కలిగి ఉంటే మరింత ఎక్కువ ముఖ్యం:
- మీ పాదాలలో నొప్పి లేదా స్పర్శను కోల్పోవడం (మొద్దుబారడం, జలదరింపు)
- మీ పాదాలలో లేదా కాలి వేళ్ళ ఆకారంలో మార్పులు
- మీ పాదాలలో మీద నయం కాని పుళ్ళు, కోతలు, లేదా కురుపులు
మీరు ప్రతీ రోజు మీ పాదాల గురుంచి శ్రద్ధవహిస్తే, మీరు కాలి వేలు, పాదము, లేదా కాలును కోల్పోయే అవకాశాలు తగ్గించుకోవచ్చు. మీ రక్తంలో చక్కెరను నిర్వహించడం కూడా మీ పాదములను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడవచ్చు.
మీ జీవనశైలికి సరిపోయే మరియు పాద రక్షణ కలిగిన ఒక మధుమేహ ప్రణాళికను తయారు చేయడానికి మీ ఆరోగ్య సంరక్షణ జట్టుతో పని చేయండి. ఆ బృందంలో మీ డాక్టర్, ఒక మధుమేహ అధ్యాపకుడు, ఒక నర్సు, ఒక పాద వైద్యుడు (పాదనిపుణుడు) మరియు మీరు మీ మధుమేహంను నిర్వహించడానికి సహాయపడే ఇతర నిపుణులు ఉండవచ్చు.
- ప్రతి రోజు మీ పాదములను తనిఖీ చేసుకోండి.
- కోతలు, పుళ్ళు, ఎరుపు మచ్చలు, వాపు, మరియు ఇంఫెక్షన్ సోకిన కాలి గోర్ల కోసం మీ పాదములను తనిఖీ చేయండి.మీరు పాద సమస్యలు కలిగి ఉండవచ్చు, కాని మీకు పాదాలలో ఎటువంటి నొప్పి కలుగదు.
- ప్రతి సాయంత్రం మీరు మీ బూట్లు తీసినప్పుడు మీ పాదాలను తనిఖీ చెయ్యండి.
- మీ పాదాలను చూడడానికి వంగడంలో మీకు సమస్య ఉంటే, సహాయం కోసం ఒక అద్దాన్ని ఉపయోగించండి. మీరు మీకు సహాయం చేయమని ఒక కుటుంబ సభ్యుడు లేదా సంరక్షకుని కూడా అడుగవచ్చు.
- ప్రతి రోజు మీ పాదములను కడుక్కోండి.
- వేడి నీటిలో కాకుండా, వెచ్చని నీటిలో మీ పాదములను కడగండి. మీ చర్మం పొడిగా అవుతుంది కాబట్టి మీ పాదములను నానపెట్టవద్దు.
- స్నానం లేదా షవర్ చేసే ముందు, అవి చాలా వేడిగా లేవు అని నిర్ధారించడానికి నీటిని పరీక్షించండి. నీటిని పరీక్షించడానికి మీరు ఒక థర్మామీటర్ (90 ° నుండి 95 ° F సురక్షితం) లేదా మీ మోచేతిని ఉపయోగించవచ్చు.
- ఇంఫెక్షన్ ను నిరోధించడానికి మీ కాలి వేళ్ళ మధ్య చర్మాన్ని పొడిగా ఉంచడానికి టాల్కం పౌడర్ లేదా కార్న్ స్టార్చ్ ను ఉపయోగించండి.
- చర్మంను మృదువుగా మరియు నునుపుగా ఉంచుకోండి.
- పాదాల యొక్క పై భాగాలను మరియు అడుగు భాగాలను లోషన్, క్రీం, లేక పెట్రోలియం జెల్లీతో పలుచగా రుద్దండి.
- మీ కాలి వేళ్ళ మధ్య లోషన్,లేక క్రీంను పూయవద్దు ఇది ఒక ఇన్ఫెక్షన్ కు కారణం కావచ్చు.
- నెమ్మదిగా కార్న్స్ మరియు ఆనెలను మృదువుగా చేయండి.
- కార్న్స్ లేదా ఆనెలు అని పిలువబడే మందపాటి చర్మమచ్చలు పాదాల మీద పెరుగుతాయి. మీ కు కార్న్స్ లేదా ఆనెలు ఉంటే, వాటి కొరకు జాగ్రత్త తీసుకోవడంలో ఉత్తమ మార్గం గురించి మీ పాద వైద్యుడుని సంప్రదించండి.
- స్నానం లేదా షవర్ తర్వాత స్మూత్ కార్న్స్ మరియు ఆనెలకు సానపెట్టు రాయిని ఉపయోగించమని మీ వైద్యుడు మీకు చెబితే, దానిని వాడండి. ఒక సానపెట్టు రాయి అనేది చర్మాన్ని మృదువుగా చేయుటకు ఉపయోగించే ఒక రకమైన రాయి. చర్మం గీసుకుపోకుండా వుండడానికి ఒకే దిశలో, నిదానంగా రుద్దండి.
- కార్న్స్ మరియు ఆనెలను కోయవద్దు.
- రేజర్ బ్లేడ్లు, కార్న్స్ ప్లాస్టర్లు, లేదా లిక్విడ్ కార్న్స్ రిమూవర్స్ మరియు లిక్విడ్ కాల్లస్ రిమూవర్స్ వాడకండి – అవి మీ చ ర్మాన్ని దెబ్బతీయవచ్చు మరియు ఇంఫెక్షన్ కలిగించవచ్చు.
- మీరు మీ పాదములను చూడగలిగితే, చేరుకోగలిగితే, మరియు అనుభూతి చెందగలిగితే, క్రమం తప్పకుండా మీ కాలిగోర్లను ట్రిమ్ చేసుకోండి (కత్తిరించుకోండి).
- మీ పాదాలను కడుగుకొని తుడుచుకున్న తర్వాత మీ కాలి గోళ్ళను నైల్ క్లిప్పర్స్ తో ట్రిమ్ చేసుకోండి.
- మీ కాలి గోర్లను అడ్డంగా తిన్నగా ట్రిమ్ చేయండి మరియు ఎమిరి బోర్డు లేదా నైల్ ఫైల్ తో మూలలను నునుపుగా చేయండి. ఇది మీ గోర్లు చర్మంలోకి పెరగకుండా కాపాడుతుంది. కాలి గోర్లను మూలల వరకు తీయవద్దు.
- ఒక పాద వైద్యుడితో మీ కాలి గోర్లను ట్రిమ్ చేయించుకోండి, ఒకవేళ:
- మీరు మీ పాదాలను చూడలేకపోతే లేదా అనుభూతి చెందలేకపోతే
- మీరు మీ పాదాలను చేరుకోలేకపోతే
- మీ గోర్లు మందంగా లేదా పసుపుపచ్చగా అయితే
- మీ గోర్లు వంపు తిరిగి చర్మంలోకి పెరిగితే
- ఎల్లప్పుడూ బూట్లు మరియు సాక్స్ లను ధరించండి.
- ఎల్లప్పుడూ బూట్లు మరియు సాక్స్ లను ధరించండి. లోపల లేదా బయట ఒట్టి కాళ్ళతో నడవవద్దు. ఏదో ఒక దాని మీద కాలు పెట్టి మీ పాదాలను ఇబ్బంది పెట్టడం సులభం. మీకు బాధ కలగకపోవచ్చు మరియు మిమ్మల్ని మీరే బాధించుకున్నట్లు తెలియకపోవచ్చు.
- బొబ్బలు, మరియు పుళ్ళు రాకుండా ఉండుటకు మీ బూట్లతో సాక్స్, స్టాకింగ్స్, లేదా నైలాన్లను ఖచ్చితంగా ధరించండి.
- బాగా సరిపోయే శుభ్రమైన, కొద్దిగా కప్పబడే సాక్స్ లను ఎంచుకోండి. అతుకులు లేని సాక్స్ లు ఉత్తమం.
- మీరు వాటిని వేసుకునే ముందు బూట్ల లోపల చూడండి. ఖచ్చితంగా లైనింగ్ మృదువుగా వుండేటట్టు మరియు మీ బూట్లలో ఏమి లేకుండా చూసుకోండి.
- బాగా సరిపోయే మరియు మీ పాదాలను రక్షించే బూట్లను ధరించండి.
- వేడి మరియు చలి నుండి మీ పాదాన్ని రక్షించుకోండి.
- బీచ్ లో మరియు వేడి పేవ్మెంట్ మీద బూట్లను ధరించండి. మీరు మీ పాదాలను కాల్చుకోవచ్చు మరియు మీకు తెలియకపోవచ్చు.
- ఎండ వేడిని నిరోధించడానికి మీ పాదాల పైన సన్స్క్రీన్ పూయండి.
- హీటర్లు మరియు ఓపెన్ మంటల నుండి మీ పాదాలను దూరంగా ఉంచండి.
- మీ పాదాల మీద వేడి నీటి బాటిల్స్ మరియు హీటింగ్ ప్యాడ్స్ పెట్టవద్దు.
- మీ పాదాలు రాత్రి పూట చల్లగా అయితే సాక్స్ లను ధరించండి.
- చలి కాలంలో మీ పాదాలను వేడిగా ఉంచుటకు లైన్డ్ బూట్లను ధరించండి.
- మీ పాదాలకు రక్తం ప్రసరించేటట్టు చూడండి.
- మీరు కూర్చోని ఉన్నప్పుడు మీ పాదాలను పైకి ఉంచండి.
- మీ కాలి వ్రేళ్ళని ఒక రోజుకు 2 లేక 3 సార్లు 5 నిముషాల పాటు అటు ఇటు కదిలించండి. మీ పాదాలలో మరియు కాళ్లలో రక్త ప్రసరణ జరుగుటకు సహాయపడడానికి మీ చీలమండలాన్ని పైకి కిందికి మరియు లోపలికి మరియు బయటికి కదిలించండి.
- మీ కాళ్ళను ఎక్కువ సేపు మడుచుకోవద్దు
- మీ కాళ్ళ చుట్టూ బిగుతు సాక్స్ లను, ఎలాస్టిక్, లేక రబ్బర్ బ్యాండ్లను ధరించవద్దు.
- ధూమపానం చేయవద్దు. మీ పాదాలకు రక్తప్రసరణను తగ్గిస్తాయి. ధూమపానంను మానుకొనుటకు సహాయం అడగండి.
- మరింత చురుకుగా ఉండండి.
- చురుకుగా ఉండటం పాదాలకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ప్రతి రోజు మరింత చురుకుగా ఉండడానికి సురక్షిత మార్గాల కొరకు మీ ఆరోగ్య సంరక్షణ జట్టును అడగండి. నడక, నాట్యం, ఈత కొట్టడం, లేక బైక్ రైడింగ్ కు పోవడం ద్వారా మరింత చురుకుగా ఉండండి.
- మీరు చాలా చురుకుగా లేకపోతే, నెమ్మదిగా మొదలు పెట్టండి.
- చురుకుగా ఉండటానికి సురక్షిత ప్రదేశాలు కనుగొనండి.
- మీకు సపోర్ట్ ను ఇచ్చే మరియు మీ కార్యక్రమం కోసం తయారు చేయబడిన అథ్లెటిక్ బూట్లను ధరించండి.
- మీ ఆరోగ్య సంరక్షణ జట్టును ఈ క్రిందివి చేయమని ఖచ్చితంగా అడగండి:
- ప్రతీ సందర్శనలో మీ పాదాలను తనిఖీ చేయమని అడగండి
- కనీసం ఒక సంవత్సరానికి ఒకసారి మీ పాదాలలో స్పర్శ మరియు నాడీ స్పందనలను తనిఖీ చేయమని అడగండి
- మీ పాదాల కొరకు ఎలా శ్రద్ద తీసుకుకోవాలో చూపమని అడగండి.
- అవసరమైతే మిమ్మల్ని ఒక పాద వైద్యుడు దగ్గరికి పంపమని అడగండి.
- మీ పాదాలను రక్షించడానికి ప్రత్యేక బూట్లు సహాయపడవచ్చా అని మీకు చెప్పమని అడగండి.
- మీ మధుమేహం గురించి జాగ్రత్త వహించండి.
- మీ మధుమేహంను నిర్వహించడానికి ఒక ప్రణాళిక తయారు చేయడానికి మీ ఆరోగ్య సంరక్షణ జట్టుతో పని చేయండి.
- మీ రక్తంలో చక్కెర, రక్తపోటు, మరియు కొలెస్ట్రాల్ ను నిర్వహించడానికి లక్ష్యాలను ఏర్పాటు చేయడానికి మరియు వాటిని చేరుకోవడానికి మీకు సహాయం చేయమని మీ ఆరోగ్య సంరక్షణ జట్టును అడగండి.
- మీరు ప్రతి రోజు మరింత చురుకుగా ఉండడానికి సురక్షితమైన మార్గాలు ఎంచుకొనుటకు మరియు తినడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు ఎంచుకోవడానికి సహాయపడమని మీ జట్టును అడగండి.
సరైన పాదరక్షలు ఎంచుకోవడం కొరకు చిట్కాలు
మీ పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన రకం బూట్లను ధరించడం ముఖ్యం. వాకింగ్ బూట్లు మరియు క్రీడాకారుల బూట్లు రోజువారీ ధరించడానికి బాగుంటాయి. అవి మీ పాదాలకు సపోర్ట్ ఇస్తాయి మరియు వాటికి గాలి తగలనిస్తాయి.
ఎప్పుడూ వినైల్ లేదా ప్లాస్టిక్ బూట్లను ధరించవద్దు, ఎందుకంటే అవి సాగవు లేదా “గాలి ఆడనివ్వవు”.
బూట్లు కొనుగోలు చేసేటప్పుడు అవి మంచివి అనిపించాలి అని మరియు మీ కాలి వేళ్ళ కోసం తగినంత స్థలాన్ని కలిగి ఉన్నాయని నిర్ధారించుకోండి.
కూసుగావున్న కాలివేళ్ళతో లేదా ఎత్తు మడమలతో వుండే బూట్లను తరచుగా ధరించవద్దు. అవి మీ కాలి మీద చాలా ఎక్కువ ఒత్తిడిని ఉంచుతాయి.
మీరు ఉత్తమంగా సరిపోయే వాటిని కనుగొనడానికి వీలుగా రోజు చివరలో మీ పాదాలు అతిపెద్దగా ఉన్నప్పుడు బూట్లను కొనుగోలు చేయండి.
గుర్తుంచుకోవలసిన విషయాలు:
- మీ పాదాలను తనిఖీ చేయడానికి ప్రతి రోజు ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకోండి.
- అన్ని సమయాల్లో సాక్స్ మరియు బూట్లు ధరించండి.
- డాక్టర్ వద్దకు మీ తదుపరి సందర్శన యొక్క తేదీని వ్రాసుకోండి. మీ అన్ని అపాయింట్మెంట్లకు వెళ్లి మీకు ఉన్న ఏవైనా ప్రశ్నలు అడగండి.
- మీరు మీ పాదాల గురించి శ్రద్ధ వహించడానికి అవసరమైన వస్తువులను తీసుకు రావడానికి ఒక తేదీని ఏర్పాటు చేసుకోండి: నైల్ క్లిప్పర్స్, ప్యుమిక్ స్టోన్, ఎమిరి బోర్డు, స్కిన్ లోషన్, టాల్కం పౌడర్, ప్లాస్టిక్ అద్దం, సాక్స్, వాకింగ్ బూట్లు, మరియు చెప్పులు.
- ధూమపానం ఆపండి.
- మీరు పాద సమస్యలను నిరోధించగల్గడానికి మీ మధుమేహాన్ని నిర్వహించండి.