కార్బోహైడ్రేట్ కౌంటింగ్ అంటే ఏమిటి?
కార్బోహైడ్రేట్ కౌంటింగ్ ను, కార్బ్ కౌంటింగ్ అని కూడా అంటారు. ఇది టైపు 1 మరియు టైపు 2 మధుమేహము వున్న వ్యక్తుల యొక్క భోజన ప్రణాళిక సాధనం. మీరు ప్రతీరోజు తినే ఆహారాలలోని కార్బోహైడ్రేట్ మొత్తాన్ని పర్యవేక్షించడమే కార్బోహైడ్రేట్ కౌంటింగ్.
ఆహారం మరియు పానీయాలలో దొరికే ఒక ముఖ్యమైన పోషకములలో కార్బోహైడ్రేట్లు ఒకటి. ఇతర ప్రధాన పోషకములు ప్రోటీన్ మరియు కొవ్వు. కార్బోహైడ్రేట్స్ లో చక్కర, పిండిపదార్దములు, పీచుపదార్దములు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు ఇతర పోషకాల కంటే మీ రక్తంలో గ్లూకోజ్ ను ఎక్కువ ప్రభావితం చేస్తాయి కాబట్టి రక్తంలో చక్కెర అని కూడా పిలిచే మీ రక్తం గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించటానికి కార్బోహైడ్రేట్ లెక్కింపు మీకు సహాయపడవచ్చు.
తృణధాన్యాలు, పండ్లు, మరియు కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన పిండిపదార్ధాలు, ఒక ఆరోగ్యకరమైన ఆహారం ప్రణాళిక యొక్క ఒక ముఖ్యమైన భాగం ఎందుకంటే అవి శక్తి మరియు విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ వంటి పోషకాలు, రెండింటినీ అందిస్తుంది. పీచుపదార్దములు మీ మలబద్ధకం నిరోధించడానికి, మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, మరియు మీ బరువును నియంత్రించడంలో సహాయపడవచ్చు.
తరచుగా అనారోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు అనేవి అదనపు చక్కెరలు గల ఆహార మరియు పానీయాలు. అనారోగ్య కార్బోహైడ్రేట్లు శక్తిని కూడా అందించగలిగినప్పటికీ , వాటిలో కొద్దిగా పోషకాలు ఉండడం నుండి ఏ పోషకాలు ఉండవు.
ఆహారాలలో కార్బోహైడ్రేట్ల మొతాన్ని గ్రాములలో కొలుస్తారు. మీరు తినే ఆహారాలలో కార్బోహైడ్రేట్ల గ్రాములను లెక్కించడానికి, మీరు చేయాలిసింది
- ఏ ఆహారాలలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో తెల్సుకోవడం
- మీరు తినే ఆహారాలలో కార్బోహైడ్రేట్ గ్రాముల సంఖ్యను అంచనా వేయడం నేర్చుకొవడం
- ఒక రోజుకు మీ మొత్తాన్ని పొందడానికి మీరు తినే ప్రతీ ఆహారంలోని కార్బోహైడ్రేట్ గ్రాముల సంఖ్యను కలపడం
మీ డాక్టర్ మిమ్మల్ని మీ కార్బోహైడ్రేట్ లెక్కింపు ఆధారంగా ఒక ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక అభివృద్ధికి సహాయపడే ఒక డైటిషియన్ లేదా మధుమేహం అధ్యాపకుడికి సూచించవచ్చు.
ఏ ఆహారాలలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి?
కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాలలో ఇవి ఉంటాయి
- ధాన్యాలు, బ్రెడ్, నూడుల్స్, పాస్టా, క్రాకర్లు, తృణధాన్యాలు, బియ్యం
- ఆపిల్, అరటి, బెర్రీలు, మామిడి, పుచ్చకాయలు, మరియు నారింజ వంటి పండ్లు
- పాలు మరియు పెరుగు వంటి పాల ఉత్పత్తులు
- అపరాలు, ఎండబెట్టిన బీన్స్, పప్పులు, మరియు బఠానీలు
- కేకులు, కుకీలు, క్యాండీ మరియు ఇతర డెసెర్ట్లు వంటి ఇతర అల్పాహారాలు మరియు స్వీట్లు
- చక్కెరలు కలిగిన జ్యూసులు, శీతల పానీయాలు, పండ్ల రసాలు, క్రీడా పానీయాలు, మరియు శక్తి పానీయాలు
- కూరగాయలు, ముఖ్యంగా బంగాళాదుంపలు, మొక్కజొన్న మరియు బటానీలు వంటి ” పిండి పదార్ధ” కూరగాయలు
బంగాళదుంపలు, బటానీలు మరియు మొక్కజొన్నలను పిండి పదార్ధ కూరగాయలు అని అంటారు ఎందుకంటే వాటిలో పిండి అధికంగా ఉంటుంది. ప్రతీ సర్వింగ్ లో స్టార్చ్ లేని కూరగాయల కన్నా ఈ కూరగాయలలో కార్బోహైడ్రేట్స్ చాలా అధికంగా ఉంటాయి.
స్టార్చ్ లేని కూరగాయలకు ఉదాహరణలు, ఆస్పరాగస్, బ్రోకలీ, క్యారెట్లు, సెలెరీ, ఆకుపచ్చ బీన్స్, లెటుస్, మరియు సలాడ్ గ్రీన్స్, పెప్పర్స్, పాలకూర, టొమాటోలు, మరియు జుచ్చిని.
కార్బోహైడ్రేట్స్ లేని ఆహారాల్లో మాంసం, చేపలు మరియు పౌల్ట్రీ, చాలా రకాల జున్ను, గింజలు, మరియు నూనెలు మరియు ఇతర కొవ్వులు ఉన్నాయి.
కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాల్లో ధాన్యాలు, పండ్లు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, మరియు చిక్కుళ్ళు ఉన్నాయి.
నేను కార్బోహైడ్రేట్స్ కలిగి ఉన్నటువంటి ఆహారాలు తిన్నపుడు ఏమి జరుగుతుంది?
మీరు కార్బోహైడ్రేట్స్ కలిగి ఉన్న ఆహారాలు తిన్నపుడు, మీ జీర్ణ వ్యవస్థ చక్కెరలు మరియు పిండి పదార్ధాల ను గ్లూకోజ్ లోకి విచ్ఛిన్నం చేస్తుంది. గ్లూకోస్ అనేది చక్కర యొక్క సరళమైన రూపాలలో ఒకటి. అప్పుడు గ్లూకోస్ మీ జీర్ణ వాహిక నుండి మీ రక్తప్రవాహంలోకి ప్రవేశించి మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. క్లోమము నుండి లేదా ఇన్సులిన్ షాట్లు నుండి వచ్చే హార్మోన్ ఇన్సులిన్, మీ శరీరం అంతటా ఉన్న కణాలు గ్లూకోజ్ ను గ్రహించి మరియు దానిని శక్తి కొరకు ఉపయోగించడానికి సహాయపడుతుంది. ఒకసారి గ్లూకోస్, రక్తం నుండి కణాలలోకి కదిలినప్పుడు, మీ రక్తంలోని గ్లూకోస్ స్థాయిలు తిరిగి వెనక్కి తగ్గుతాయి.
కార్బోహైడ్రేట్ కౌంటింగ్ నాకు ఏ విధంగా సహాయపడవచ్చు?
మీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు సాధారణ స్థాయికి దగ్గరగా ఉంచేందుకు కార్బోహైడ్రేట్ కౌంటింగ్ సహాయపడవచ్చు. మీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు సాధ్యమైనంత వరకు సాధారణ స్థాయికి దగ్గరగా ఉంచడం అనేది మీకు ఈ క్రింది వాటికి సహాయపడవచ్చు
- ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండడానికి
- మూత్రపిండాల వ్యాధి, అంధత్వం, నరాల నష్టం, మరియు గుండెపోటు, స్ట్రోకులు, మరియు అంగచ్ఛేదం—ఒక శరీర భాగాన్ని తొలగించడానికి చేసే శస్త్రచికిత్స— దారితీయగల రక్త నాళ వ్యాధి వంటి మధుమేహ సమస్యలను ఆలస్యం చేయడానికి లేదా నిరోధించడానికి
- బాగా మరియు ఎక్కువ శక్తివంతంగా అనిపించడానికి
మీ రక్తం గ్లూకోస్ స్థాయిలను నియంత్రించటానికి మీరు ఇన్సులిన్ షాట్లు లేదా మధుమేహం మందులు కూడా తీసుకోవలసిన అవసరం ఉండవచ్చు. మీ రక్తంలోని గ్లూకోస్ లక్ష్యాలను మీ డాక్టరుతో చర్చించండి. మీరు గురి పెట్టే సంఖ్యలే లక్ష్యాలు. మీ లక్ష్యాలను అందుకునేందుకు, మీరు తీసుకునే కార్బోహైడ్రేట్స్ ను మీ శారీరక శ్రమ మరియు మధుమేహం మందులు లేదా ఇన్సులిన్ షాట్లతో సమతుల్యం చేయవలసిన అవసరం ఉంటుంది.
ప్రతీ రోజు నాకు ఎంత కార్బోహైడ్రేట్ అవసరం?
మధుమేహం గల వ్యక్తుల కొరకు కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మరియు కొవ్వు యొక్క రోజువారీ మొత్తం నిర్వచించబడలేదు ఎందుకంటే ఒక వ్యక్తి కోసం ఉత్తమమైనది మరొకరి కోసం ఉత్తమం కాకపోవచ్చు. శక్తి, విటమిన్లు మరియు ఖనిజాలు, మరియు ఫైబర్ కొరకు శరీరం యొక్క అవసరాలను తీర్చేందుకు, అందరూ తగినంత కార్బోహైడ్రేట్ పొందడం అవసరం.
చాలా మందికి తీసుకునే కార్బోహైడ్రేట్ మొత్తం కేలరీలలో 45 మరియు 65 శాతం మధ్య ఉండాలని నిపుణులు సూచించారు. తక్కువ కేలరీల గల ఆహారాలు తీసుకునే వ్యక్తులు మరియు శారీరకంగా చురుకుగా లేని వ్యక్తులు ఆ శ్రేణి దిగువ ముగింపు కోసం గురిపెట్టాలనుకోవచ్చు.
ఒక గ్రాము కార్బోహైడ్రేట్ దాదాపు 4 కేలరీలు అందిస్తుంది, కాబట్టి మీరు గ్రాముల సంఖ్యను పొందడానికి, మీరు కార్బోహైడ్రేట్ల నుండి పొందాలనుకునే కేలరీల సంఖ్యను 4 చే విభజించాలి. ఉదాహరణకు, మీరు రోజుకు 1,800 కేలరీల మొత్తాన్ని తినాలనుకుంటే, మరియు కార్బోహైడ్రేట్ల నుంచి మీ కేలరీలలో 45 శాతం పొందాలనుకుంటే, మీరు రోజువారీ 200 గ్రాముల కార్బోహైడ్రేట్లకు గురి పెట్టేవారు. మీరు ఆ మొత్తంను ఈ కింది విధంగా లెక్కించేవారు
- .45 x 1,800 కేలరీలు = 810 కేలరీలు
- 810 ÷ 4 = 202.5 గ్రాముల కార్బోహైడ్రేట్స్
మీరు తీసుకునే కార్బోహైడ్రేట్ రోజంతటికీ వ్యాపింపచేయాలి. మీ బరువు, చురుకు స్థాయి, మందులు, మరియు రక్త గ్లూకోజ్ లక్ష్యాల ఆధారంగా మీరు ఏ ఆహారాలు తినాలి, ఎంత తినాలి మరియు ఎప్పుడు తినాలి అని తెలుసుకోవడానికి ఒక డైటిషియన్ లేదా మధుమేహం అధ్యాపకుడు సహాయపడతాడు.
నేను తినే ఆహారాలలో ఎంత మొత్తం కార్బోహైడ్రేట్ ఉంది అని ఎలా తెలుసుకోవాలి?
మీరు సాధారణంగా తినే ఆహారలలో కార్బోహైడ్రేట్ల మొత్తంను అంచనా వేయడం నేర్చుకోవలసిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు, ఈ కింద తెలిపిన ప్రతి కార్బోహైడ్రేట్-రిచ్ ఆహారాల మొత్తాల లో దాదాపు 15 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉంటుంది:
- ఒక బ్రెడ్ స్లైస్
- ఒక చపాతి
- 2 చిన్న పూరీలు
- 1 దోస
- 1 చిన్న ఇడ్లీ
- బియ్యం 1/3 కప్
- ½ కప్ ఉప్మా
- ½ కప్ బిర్యానీ
- 1/2 కప్పు క్యాన్డ్ లేదా తాజా పండ్లు లేదా పండు రసం లేదా చిన్న ఆపిల్ లేదా నారింజ వంటి ఒక చిన్న తాజా పండు ముక్క
- బఠానీలు 1/2 కప్పు బంగాళాదుంపలు,
- ½ కప్ టమోటా ధాల్
- ½ కప్ సాంబార్
- 1 కప్ రసం
- 1/3 కప్ క్యారట్ హల్వా
- ½ చిన్న లడ్డు
- ½ కప్ ఐస్ క్రీం
- 1 టేబుల్ స్పూన్ తేనె
- 1 చిన్న గులాబ్ జామున్
- 1 చిన్న ఆపిల్
- 3 డేట్స్
- 17 ద్రాక్ష
- 1 చిన్న నారింజ
- ½ కప్ మామిడి
- 1 కప్ పాలు
- 1 కప్ మజ్జిగ
- 6 పానీ పూరిలు
- 2 అప్పడాలు
- ¾ వెజ్ సమోసా
మనం ఆహారాలు పెద్ద మొత్తంలో తినప్పుడు తప్ప, కొన్ని ఆహారాలలో కార్బోహైడ్రేట్స్ మనం వాటిని లెక్కించవలసిన అవసరం లేనంత తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, చాలా వరకు స్టార్చ్ లేని కూరగాయలలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఒక 1/2 కప్పు వండిన స్టార్చ్ లేని కూరగాయలు లేదా ఒక కప్పు ముడి కురగాయాలలో కేవలం 5 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉంటుంది.
మీరు ఏ ఆహారాలలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో మరియు మీరు తినే ఆహారాలలో ఎన్ని గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో తెలుసుకున్న తరువాత, కార్బోహైడ్రేట్ కౌంటింగ్ సులభంగా ఉంటుంది.
న్యూట్రిషన్ లేబుల్స్
ఆహార ప్యాకేజెస్ మీద ఉన్న న్యూట్రిషన్ లేబుల్స్ ను తనిఖీ చేయడం ద్వారా మీరు తినే ఆహారాలలో ఎన్ని గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ క్రిందిది న్యూట్రిషన్ లేబుల్ యొక్క ఒక ఉదాహరణ:
న్యూట్రిషన్ లేబుల్స్ మనకు ఇతర పోషణ సమాచారంతో పాటు ప్రతీ సెర్వింగ్ కు కార్బోహైడ్రేట్లు గ్రాముల మొత్తాన్ని మీకు తెలియచేస్తుంది.
న్యూట్రిషన్ లేబుల్స్ మీకు ఈ క్రిందివి తెలియచేస్తుంది
- ఆహారం యొక్క సెర్వింగ్ పరిమాణం – ఒక ముక్క లేదా 1/2 కప్పు వంటివి
- ప్రతి సెర్వింగ్ కు కార్బోహైడ్రేట్ గ్రాముల మొత్తం
- ప్రతి సెర్వింగ్ కు కేలరీలు మరియు ప్రోటీన్ మరియు కొవ్వు మొత్తంతో సహా ఇతర పోషణ సమాచారం
మీ దగ్గర ఒకటికి బదులు రెండు సెర్వింగ్ల కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పుడు, 1/2 కప్పు బదులుగా ఒక కప్పు పింటో బీన్స్ ఉన్నప్పుడు, కార్బోహైడ్రేట్స్ గ్రాముల సంఖ్య మొత్తం పొందడానికి మీరు ఒక సెర్వింగ్ లోని కార్బోహైడ్రేట్స్ గ్రాముల సంఖ్యను 2 తో గుణించాలి, ఉదాహరణకి, 15 ను రెండుతో గుణిస్తే 30.
15 x 2 = 30
ఇంటి వద్ద వండడం
ఇంట్లో తయారు చేసిన ఆహారాలలో కార్బోహైడ్రేట్లు మొత్తం కనుగొనేందుకు మీరు చేయాల్సింది, పదార్ధాల నుండి కార్బోహైడ్రేట్ గ్రాములను అంచనా వేసి జోడించవలసి ఉంటుంది. ఒక సెర్వింగ్ లోని మీరు కార్బోహైడ్రేట్లు మొత్తాన్ని అంచనా వేయడానికి ఇంట్లో తయారు చేసే పదార్దాల సాధారణ కార్బోహైడ్రేట్ శాతం జాబితాపరిచే పుస్తకాలు లేదా వెబ్ సైట్లను ఉపయోగించవచ్చు.
మీరు ఆహారాలను ఒక స్కేల్ తో కూడా కొలువవచ్చు లేదా మీరు కార్బోహైడ్రేట్ మొత్తాన్ని అంచనా వేయడానికి కొలత కప్పులు లేదా స్పూన్ల తో మొత్తాలను కొలవండి . ఉదాహరణకు, ఒక న్యూట్రిషన్ లేబుల్ 1 ½ కప్పుల ధాన్యాలలో 45 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ను చూపిస్తే, అప్పుడు ½ కప్పులో 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ మరియు 1 కప్పులో 30 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.
బయట తినడం
కార్బోహైడ్రేట్స్ గ్రాములను జాబితా పరిచే పోషణ సమాచారాన్ని కొన్ని రెస్టారెంట్లు అందిస్తాయి. మీరు రెస్టారెంట్ భోజనం కార్బోహైడ్రేట్ల మొత్తాన్ని అంచనా వేయడానికి కార్బోహైడ్రేట్ కౌంటింగ్ ఆహార జాబితాలను కూడా ఉపయోగించవచ్చు.
నేను అదనపు చక్కెరలు గల స్వీట్లు మరియు ఇతర ఆహారాలు మరియు పానీయాలు తినవచ్చా?
అవును, మీరు అదనపు చక్కెరలను కలిగిన స్వీట్లు మరియు ఇతర ఆహారాలు మరియు పానీయాలను తినవచ్చు. అయితే, మీరు ఈ అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలు మరియు పానీయాలను తీసుకోవడం పరిమితం చేయాలి ఎందుకంటే తరచుగా వాటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి మరియు విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్లు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉన్న తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు మరియు బీన్స్ మరింత తెలివైన ఎంపికలు.
మీరు పోషణ తక్కువ వుండే ఆహారాల తో కడుపు నింపుకోకుండా ఉండడానికి వీలుగా, ప్రతి రోజు స్వీట్లు తినడానికి బదులుగా, ఎప్పుడైనా ఒకసారి వాటిని చిన్న మొత్తాలలో తినడానికి ప్రయత్నించండి. మీ ఆహార ప్రణాళిక లో స్వీట్ల ను చేర్చడం గురించి మీ డైటిషియన్ లేదా మధుమేహం అధ్యాపకుడును అడగండి.
అదనపు చక్కెరలు అంటే ఏమిటి?
అదనపు చక్కెరలు అనగా ఆహారాలు మరియు పానీయాలలో ప్రాసెసింగ్ లేదా తయారీ సమయంలో చేర్చబడే వివిధ రూపాల చక్కెర. పాలు మరియు పండ్లలో సహజంగా దొరికేటటువంటి చక్కెరలు అదనపు చక్కెరలు కాదు, కానీ అవి కార్బోహైడ్రేట్స్. అమెరికన్లకు అదనపు చక్కెరల యొక్క అత్యంత సాధారణ మూలాలు
- చక్కెర-తీపి శీతల పానీయాలు, పండ్ల రసాలు, క్రీడా పానీయాలు, మరియు శక్తి పానీయాలు
- కేకులు, కుకీలు మరియు డోనట్స్ వంటి ధాన్య ఆధారిత డెజర్ట్లు
- ఐస్ క్రీమ్, తీయ్యని పెరుగు, మరియు తీపి పాలు వంటి పాల-ఆధారిత డెజర్ట్లు మరియు ఉత్పత్తులు,
- క్యాండీ
ఆహారాలు మరియు పానీయాల యొక్క దినుసుల యొక్క జాబితాను చదవడం వలన అదనపు చక్కెరలను కనుగొనడానికి మీకు సహాయపడవచ్చు, ఈ క్రింది వంటివి
- చక్కెర, ముడి చక్కెర, బ్రౌన్ షుగర్ (శుద్ధి చేయని చక్కెర) మరియు ఇన్వర్ట్ షుగర్— ఫ్రక్టోజ్ మరియు గ్లూకోజ్ యొక్క ఒక మిశ్రమం
- కార్న్ సిరప్ మరియు మాల్ట్ సిరప్
- తరచుగా శీతల పానీయాలు మరియు రసాలలో ఉపయోగించే అధిక-ఫ్రూక్టోజ్ కార్న్ సిరప్
- తేనె, మొలాసిస్, మరియు అగేవ్ నేక్టార్ (కిత్తలి తేనె)
- డెక్స్ ట్రోస్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, లాక్టోజ్, మరియు సుక్రోజ్
ఒక ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక కోసం, ఆహారాలు మరియు పానీయాలలో కలిసిన అదనపు చక్కెరలను పరిమితం చేయాలి.
కార్బోహైడ్రేట్ కౌంటింగ్ నాకు పని చేస్తుంది అని నేను ఎలా చెప్పగలను?
మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తనిఖీ చేయడం అనేది మీకు కార్బోహైడ్రేట్ కౌంటింగ్ పని చేస్తుందో లేదో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. మీరు గ్లూకోజ్ మీటర్ ను ఉపయోగించి మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తనిఖీ చేయవచ్చు.
మీరు ఒక A1C రక్త పరీక్ష కూడా కనీసం సంవత్సరానికి రెండు సార్లు చేయించుకోవాలి. A1C పరీక్ష గత 3 నెలల్లో మీ రక్తంలో గ్లూకోజ్ సగటు మొత్తాన్ని ప్రతిబింబిస్తుంది.
మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటే, మీరు మీ ఆహార ప్రణాళిక లేదా ఇతర జీవనశైలిలో మార్పులు చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు, మీరు తెలివైన ఆహార ఎంపికలు చేయవలసి ఉండవచ్చు, మరింత శారీరకంగా చురుకుగా ఉండవలసి ఉండవచ్చు, లేదా మీ మధుమేహ మందులకు మార్పులు చేయవలసి ఉండవచ్చు. మీ రక్తం గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించటానికి, మీరు చేయవలసిన మార్పుల గురించి మీ వైద్యుడితో మాట్లాడండి.
మీరు ఒక ఇన్సులిన్ పంప్ లేదా ఒకటి కంటే ఎక్కువ రోజూవారి ఇన్సులిన్ షాట్ తీసుకుంటే , మీరు మీ సాధారణ ఆహార ప్రణాళికలో లేనిది ఏదైనా తింటే మీ ఇన్సులిన్ ను ఎలా సర్దుబాటు చేసుకోవాలో మీ వైద్యుడిని అడగండి.
నేను గర్భవతి అయి ఉంటే నేను కార్బోహైడ్రేట్ కౌంటింగ్ ఉపయోగించవచ్చా?
మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించటానికి సహాయపడేందుకు కార్బోహైడ్రేట్ కౌంటింగ్ ను ఉపయోగించవచ్చు. గర్భధారణ సమయంలో మీ రక్తం గ్లూకోజ్ లక్ష్యాలను చేరుకోవడం మీ యొక్క మరియు మీ శిశువు ఆరోగ్యానికి ముఖ్యమైనది. గర్భధారణ సమయంలో అధిక రక్త గ్లూకోజ్ శిశువుకు హాని కలిగించి మరియు తరువాతి జీవితంలో టైప్ 2 మధుమేహం కలిగే శిశువు యొక్క అవకాశాలను పెంచవచ్చు.
గర్భధారణ మధుమేహం—గర్భధారణ సమయంలో మాత్రమే అభివృద్ధి చెందే ఒక రకమైన మధుమేహం—నిర్ధారించబడిన మహిళలు కూడావారి రక్త గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి సహయపడటంలో కార్బోహైడ్రేట్ కౌంటింగ్ ను ఉపయోగించవచ్చు.
మీ గర్భధారణ సమయంలో మీ రక్తం గ్లూకోజ్ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయంగా కార్బోహైడ్రేట్ కౌంటింగ్ ను ఉపయోగించడం గురించి మీ వైద్యుడితో మాట్లాడండి.
గుర్తుంచుకోవలసిన పాయింట్లు
- కార్బోహైడ్రేట్ కౌంటింగ్ టైప్ 1 లేదా టైప్ 2 మధుమేహం గల వ్యక్తుల కొరకు ఒక భోజన ప్రణాళిక సాధనం. మీరు ప్రతీరోజు తినే ఆహారాలలోని కార్బోహైడ్రేట్ మొత్తాన్ని పర్యవేక్షించడమే కార్బోహైడ్రేట్ కౌంటింగ్.
- ఆహారం మరియు పానీయాలలో దొరికే ముఖ్యమైన పోషకములలో కార్బోహైడ్రేట్లు ఒకటి. కార్బోహైడ్రేట్స్ లో చక్కర, పిండిపదార్దములు, పీచుపదార్దములు ఉంటాయి.
- కార్బోహైడ్రేట్లు ఇతర పోషకాలు కంటే మీ రక్తంలో గ్లూకోజ్ ను ఎక్కువ ప్రభావితం చేస్తుంది కాబట్టి రక్తంలో చక్కెర అని కూడా పిలిచే మీ రక్తం గ్లూకోజ్ లేదా స్థాయిలను నియంత్రించటానికి మీకు కార్బోహైడ్రేట్ కౌంటింగ్ సహాయపడవచ్చు.
- కార్బోహైడ్రేట్స్ ఒక ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక యొక్క ఒక ముఖ్యమైన భాగం, ఎందుకంటే అవి శక్తిని ఇస్తాయి. కార్బోహైడ్రేట్స్ ఉన్న అత్యధిక ఆహారాలలో ముఖ్యంగా విటమిన్లు మరియు ఖనిజాలు కలిగి ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్ కలిగిన అనేక ఆహారాలు, మీ మలబద్ధకంను నిరోధించడానికి, మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, మరియు మీ బరువును నియంత్రించడానికి సహాయపడే పీచు పదార్ధాల యొక్క మంచి వనరులు.
- కార్బోహైడ్రేట్లు లెక్కించడానికి, మీరు ఏ ఆహారాలు పిండిపదార్ధాలు కలిగి వున్నాయని తెలుసుకోవలసిన అవసరం వుంది మరియు మీరు తినే ఆహారాలలో ఎన్ని గ్రాముల పిండిపదార్థాలు వున్నాయని అంచనా వేయుటను నేర్చుకోవలసిన అవసరం వుంటుంది . అప్పుడు ఒక రోజుకు మీ మొత్తాన్ని పొందడానికి మీరు తినే ప్రతీ ఆహారంలోని కార్బోహైడ్రేట్ గ్రాముల సంఖ్యను కలపాలి.
- పిండిపదార్ధాలు కలిగి ఆహారాలలో ధాన్యాలు, పండ్లు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, చిక్కుళ్ళు, అల్పాహారాలు మరియు స్వీట్లు, మరియు చక్కెర కలిగి పానీయాలు ఉన్నాయి. మీరు కార్బోహైడ్రేట్ల తినేటప్పుడు, మీ జీర్ణ వ్యవస్థ చక్కెరలను మరియు పిండి పదార్ధాలను గ్లూకోస్ లాగా విడగొడుతుంది.
- మీ రక్తంలో గ్లూకోజ్ లక్ష్యాలను చేరుకునేందుకు, మీ తీసుకునే పిండిపదార్థాలను శారీరక శ్రమ మరియు మధుమేహ మందులు లేదా ఇన్సులిన్ షాట్ల తో సమతుల్యం చేసుకోవలసిన అవసరం వుంటుంది.
- ఆహార ప్యాకేజీల మీది న్యూట్రిషన్ లేబుల్స్ ఆహారాల సెర్వింగ్ పరిమాణం, ఒక సెర్వింగ్ కు పిండిపదార్థాల యొక్క గ్రాముల మొత్తం, మరియు ఇతర న్యూట్రిషన్ సమాచారం మీకు చెపుతాయి.
- అదనపు చక్కెరలు గల ఆహారాలు మరియు పానీయాలు అధిక పిండిపదార్థ ఆహారాలు, తరచుగా వీటిలో ఎక్కువ కేలరీలు మరియు తక్కువ విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ వుంటాయి. ఫైబర్ అధికంగా వుండే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, మరియు బీన్స్ మరింత తెలివైనవ ఎంపికలు.
కార్బ్ కౌంటింగ్ ఆహారజాబితా (గుర్తుంచుకోండి 1 కార్బ్ ఎంపిక = 15 గ్రాముల కార్బ్) (యాస్ట్రిక్ * తో గుర్తించబడిన ఆహారాలు కొవ్వు కలిగి వుంటాయి)
బ్రెడ్లు: 15 గ్రా కార్బ్ (1 కార్బ్)
1 స్లైస్ బ్రెడ్, తెలుపు, గోధుమ లేదా హోల్ గ్రైన్
1 చిన్న పౌ/డిన్నర్ రోల్, ½ రోటీ (సజ్జ, మొక్కజొన్న, జొన్న)
1 చపాతీ, 6″ వ్యాసం
¾ పరాటా లేదా థెప్లా, 6 “*
½ పనీర్ పరాటా
¾ బంగాళాదుంప పరాటా, 6 “*
8″x 2″ నాన్ యొక్క ¼ భాగం
½ పిటా బ్రెడ్, 2 పూరీలు 5″
½ హాంబర్గర్/హాట్ డాగ్ బన్
½ 2oz బాగెల్, 1 చిన్న క్రాజంట్*
½ ఇంగ్లీష్ మఫిన్, 1 చిన్న మఫిన్*
1 దోశ సుమారు 10” వ్యాసం
1 చిన్న ఇడ్లీ
2 మినీ రవ్వ ఇడ్లీలు, 25g/3 టేబుల్ స్పూన్లు గోధుమపిండి (హోల్ వీట్) 25g/3 టేబుల్ స్పూన్లు మైదా (ఆల్-పర్పస్ ఫ్లోర్)
1 చిన్న క్రాజంట్*
తృణధాన్యాలు/ధాన్యాలు: 15g కార్బ్ (1 కార్బ్)
½ కప్పు అటుకులు
½ కప్పు డలియా (వండిన)
½ కప్పు ఉప్మా (వండిన)
½కప్పు పాస్తా (వండిన)
½ కప్పు వండిన వేడి ధాన్యం
1/3 కప్పు వండిన అన్నం
1/3 కప్పు వండిన బ్రౌన్ రైస్
1/3 కప్పు పులిహోర
1/3 కప్పు బిసి భెల భాత్
½కప్పు బిర్యానీ/పలావు* మాంసం
½ కప్పు ఖిఛిడి / వండిన ఖిఛిడి
1 చదరపు దోక్ల
½ కప్పు మట్కి ఊశాళ్
½ కప్పు ధన్సాక్*
½ కప్పు అవియాల్
1/3 కప్పు ఉప్మా
½ వెజిటబుల్ ఊతప్పం (చిన్న ది) లేదా 1 చిన్న ఊతప్పం, 4″
2 టేబుల్ స్పూన్లు వండని కర్రపెండలం
½ కప్పు గోధుమ మొలకలు
స్టార్చి కూరగాయలు: 15 గ్రా కార్బ్
1/3 ఆకుపచ్చ అరటికాయ
1కప్పు శీతాకాల గుమ్మడికాయ
½కప్పు బంగాళాదుంప కూర*
1 ఉడికించిన లేదా కాల్చిన చిన్న బంగాళాదుంప
½ బంగాళాదుంపల గుజ్జు
½కప్పు చిలగడదుంపలు
½కప్పు బఠానీలు
½కప్పు మొక్కజొన్న
½కప్పు చిలగడదుంప ఫ్రెంచ్ ఫ్రైస్*
½కప్పు హాష్ బ్రౌన్స్*
1 కప్పు మిశ్రమ వెజ్ (మొక్కజొన్న, బటానీలు)
½ కప్పు కూరగాయల కుర్మా
1¼ వెజ్ టోఫు స్టిర్ ఫ్రై
1 కప్పు ఆలు గోబీ
పప్పు ధాన్యాలు/పప్పులు/ బీన్స్: 15 గ్రా కార్బ్
½కప్పు వండిన కాయధాన్యాలు
½కప్పు వండిన కందిపప్పు
½కప్పు టమోటా పప్పు
½కప్పు వండిన పెసర పప్పు
1కప్పు వండిన సన్నని మిశ్రమ పప్పు
½కప్పు వండిన కిడ్నీ బీన్స్
½కప్పు వండిన ముడిశెనగలు (చిక్పీస్)
½ కప్పు వండిన అలసందలు (బ్లాక్-ఐడ్ పీస్)
1/3 కప్పు శనగ
1 కప్పు రసం
½కప్పు సాంబార్
1/3కప్పు హుమ్ముస్
½కప్పు ధన్సాక్*
¾కప్పు పాలకూర మరియు గర్బంజో బీన్స్ కూర
½కప్పు టమోటా హెర్బ్ సూప్
1 కప్పు పెసర మొలకల సలాడ్
¾కప్పు చికెన్ నూడిల్ సూప్
1 ¼కప్పు కోడి కూర
1 ¼కప్పు చెట్టినాడ్ కోడి కూర
స్వీట్స్: 15 గ్రా కార్బ్ (ఆహారంలో 10% పరిమితి)
5 వెనిల్లా వేఫర్స్
2 చిన్ననంఖటై*
1 చిన్న గులాబ్ జమాన్*
1/3 కప్పు క్యారట్ హల్వా*
¼ కప్పు సూజీ హల్వా*
1 హన్డవ*
6 ముక్కలు ఖండవి*
½కప్పు కుల్ఫీ*
½ చిన్న లడ్డూ
1 మగస్, 1 ½ “x 1 ½” ముక్క
2 సన్నని మతియాలు
1 ముక్క మొహన్తాల్, 1 ½ “x 1 ½”
1 మీడియం రసగుల్లా
1 చిన్న రసమలై
¼కప్పు శ్రీఖండ్
½కప్పు ఐస్ క్రీం*
¾ ఒక గ్రానోలా బార్ *
½ ఒక 2 oz గ్లేజ్డ్ డోనట్ *
1 (3 oz) ఫ్రోజెన్ ఫ్రూట్ జ్యూస్ బార్ (100% పండు)
1 చిన్న బ్రౌనీ (2 అంగుళాల) అన్ ప్రోస్టెడ్*
1 చిన్న కప్ కేక్ అన్ ప్రోస్టెడ్*
½ స్లైస్ కేక్, ప్రోస్టెడ్ (2 అంగుళాల చదరపు) *
2 చిన్న కుకీలు, సాదా లేదా క్రీం నింపబడిన శాండ్విచ్*
1 రోల్ ఫ్రూట్ స్నాక్స్, నమిలే
½కప్పు చక్కెర లేని పుడ్డింగ్*
¼కప్పు పుడ్డింగ్ రెగ్యులర్ *
1 టేబుల్ స్పూన్ తేనె
2 టేబుల్ స్పూన్ లైట్ మాపుల్ సిరప్
1 టేబుల్ స్పూన్ మాపుల్ సిరప్, సాధారణ
½కప్పు ఫ్రోజెన్ పెరుగు*
1కప్పు (8oz) క్రీడ పానీయాలు (గటోరెడ్)
1 టేబుల్ స్పూన్ చక్కెర
½కప్పు చాక్లెట్ పాలు
పాలు / పెరుగు: 15g కార్బ్
1కప్పు మీగడ తీసిన, 1% పాలు
1కప్పు 2%, హోల్ మిల్క్*
1కప్పు మజ్జిగ
½కప్పు బాగా కాచిన మీగడ తీసిన పాలు
1/3కప్పు కొవ్వు తీసిన డ్రై పాల పొడి
1కప్పు సాదా పెరుగు, కొవ్వు లేని
1కప్పు సాదా పెరుగు, సాధారణ*
1కప్పు ఫ్రూట్ ఫ్లేవర్ పెరుగు, కృత్రిమ స్వీటెనర్
1కప్పు లస్సీ*, కృత్రిమ స్వీటెనర్
1కప్పు 1% పాలతో తయారయిన మసాలా చాయ్
పండ్లు / రసాలు: 15g కార్బ్స్
1 చిన్న ఆపిల్ పండు
4 హోల్ ఆప్రికాట్లు (తాజా)
8 అర్థ భాగాలు ఎండిన ఆప్రికాట్లు
½ కప్పు క్యాన్డ్ ఆప్రికాట్లు
1 చిన్న అరటి పండు (4 oz) లేదా ½ మధ్యస్తం
¾ కప్పు బ్లూ బెర్రీస్
1 కప్పు కాంటల్యూప్/ హానీడ్యూ పుచ్చకాయ ముక్కలు
1 మధ్యస్త. చికు (సపోటా)
12 తీపి చెర్రీస్
3 ఖర్జూరాలు
2 మధ్యస్త తాజా అత్తి పండ్లు
1½ ఎండిన అత్తి పండ్లు (డ్రై ఫిగ్స్)
½కప్పు ఫ్రూట్ కాక్టైల్
½ దబ్బపండు (గ్రేప్ ఫ్రూట్)
17 ద్రాక్ష
6 జంబు
4 లోక్వట్ లు
1 కివి
¾కప్పు మాండరిన్ నారింజ
½ చిన్న మామిడి (½ కప్పు)
1 చిన్న నేక్ట్రీన్
½కప్పు క్యాన్డ్ పీచెస్/బేరి
1 చిన్న నారింజ
1 కప్పు బొప్పాయి ముక్కలు
½ మధ్యస్త పాషన్ పండు
½ పెద్ద పియర్ లేదా 1 చిన్నది
1 మధ్యస్త పీచ్
¾కప్పు తాజా పైనాపిల్
½కప్పు కేన్డ్ పైనాపిల్
2 చిన్న ప్లమ్ లు
3 ఎండిన ప్లమ్ లు (ప్రూనే)
3 టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్ష
1కప్పు రాస్ బెర్రీస్
1 ¼కప్పు స్ట్రాబెర్రీలు
1 మధ్యస్త సీతాఫలం
2 చిన్న టాంజేరిన్స్
1 ¼కప్పు పుచ్చకాయ ముక్కలు
½కప్పు ఆపిల్ రసం
1/3కప్పు ద్రాక్ష రసం
½కప్పు ద్రాక్షపండు రసం
1/3కప్పు మామిడి రసం
½కప్పు జామ రసం
½కప్పు నారింజ రసం
½కప్పు పైనాపిల్ రసం
1/3కప్పు ప్రూనే రసం
అల్పాహారాలు: 15g కార్బ్ (1 కార్బ్ ఎంపిక)
1oz. భేల్పూరి
1oz చివ్డ
½కప్పు నమ్కీన్ / నిమ్కో*
6 పానీ పూరి
2 పాపడ్
¾ వెజ్ సమోసా (సమోసా = 21g CHO) *
1 మధ్యస్త వెజ్ కట్లెట్*
3 ముక్కలు పాలకూర పకోడా*
1 కచోరి (వెజ్) *
1 కచోరి (పెసరపప్పు*)
2 ముక్కలు కాలీఫ్లవర్ భజియా
2 ముక్కలు పెరుగు వడ *
1 oz. అరటి చిప్స్
3 స్క్వేర్ గ్రాహం క్రాకర్స్
4-6 గుండ్రని క్రాకర్లు (రిట్జ్ రకం) *
6 ఉప్పు కలిపిన క్రాకర్స్
3కప్పు పాప్కార్న్
2 రైస్ కేకులు 4″
1 ½ కప్పు ముంబ్ర (అటుకులతో)
¾ oz (9-13) చిరుతిండి చిప్స్, బంగాళాదుంప లేదా టోర్టిల్లా *
10 ఫ్రెంచ్ ఫ్రైస్ *