మధుమేహ సమస్యలను నిరోధించండి: మీ పాదాలను ఆరోగ్యంగా వుంచుకోండి

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456


మధుమేహం
నా పాదాలను ఎలా ప్రభావితం చేయవచ్చు?

మధుమేహం వలన ఏర్పడిన మీ రక్తంలోని చాలా ఎక్కువ గ్లూకోజ్ (చక్కెర అని కూడా పిలువబడుతుంది) నరాలు నష్టం మరియు పేలవమైన రక్త ప్రవాహాన్ని కలిగించవచ్చు,  ఇది తీవ్రమైన పాదాల సమస్యకు దారి తీయవచ్చు.

నరాలు దెబ్బతినడం

దెబ్బతిన్న నరములు సంకేతాలను పంపడం ఆపివేయవచ్చు లేదా అవి మరీ నెమ్మదిగా లేదా తప్పు సమయాలల్లో సంకేతాలు పంపవచ్చు. నరాలు దెబ్బతినడం మీ పాదాలు స్పర్శను కోల్పోవడానికి కారణం కావచ్చు.  మీ కాళ్ళు మరియు పాదాలల్లో నొప్పి, వేడి లేదా చల్లని అనుభూతిని పొందలేరు. ఒక పుండును కలిగించే మీ సాక్ లోపలి ఒక గులకరాయి  స్పర్శ మీకు తెలియకపోవచ్చు. బూట్లు సరిగ్గా వేసుకోకపోవడం వలన ఏర్పడే బొబ్బల స్పర్శ మీకు తెలియకపోవచ్చు.

మీ పాదాల మీద పుళ్ళు  ఇన్ఫెక్షన్ కు దారి తీయవచ్చు. మీ రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే, అదనపు గ్లూకోజ్ ఆ పుళ్ళ లోని ఇన్ఫెక్షన్ కు ఆహారాన్ని అందిస్తుంది మరియు మరియు ఇన్ఫెక్షన్ మరింత దారుణంగా మారుతుంది.  నరాల నష్టం నొప్పికి కూడా కారణం అవుతుంది మరియు పాద వైకల్యాలు, లేదా మీ పాదాల కండరాలు, ఎముకలు, మరియు ఆకారంలో మార్పులకు దారితీస్తుంది.

పేవలమైన రక్త ప్రవాహం

పేవలమైన రక్త ప్రవాహం అంటే రక్త నాళాల గుండా  తగినంత రక్తం  మీ కాళ్ళకు మరియు పాదాలకు ప్రవహించదు.  పేవలమైన రక్త ప్రవాహం పుండును మరియు ఇన్ఫెక్షన్ మానడాన్ని కఠినతరం చేస్తుంది. ఈ సమస్యను ఫెరిఫేరల్ ఆర్టరీ డిసీజ్, PAD అని కూడా పిలుస్తారు.

కొన్నిసార్లు, చెడు ఇన్ఫెక్షన్ తగ్గదు. ఈ ఇన్ఫెక్షన్ గ్యాంగ్రెనే కలిగించవచ్చు. మీకు గ్యాంగ్రెనే వుంటే, పుండు చుట్టూ ఉన్న చర్మం మరియు టిస్యు చచ్చి పోతుంది. ఆ ప్రాంతం నల్లగా అయి వాసన వస్తుంది.

మధుమేహం వలన ఏర్పడిన మీ రక్తంలోని చాలా ఎక్కువ గ్లూకోజ్ (చక్కెర అని కూడా పిలువబడుతుంది) నరాలు నష్టం మరియు పేలవమైన రక్త ప్రవాహాన్ని కలిగించవచ్చు, ఇది తీవ్రమైన పాదాల సమస్యకు దారి తీయవచ్చు.

మీ బొటనవేలు లేదా పాదం మీది ఏదైనా పుండుకు తక్షణ శ్రద్ద అనేది గ్యాంగ్రెనేను నిరోధించవచ్చు. మీ వైద్యుడు ఇన్ఫెక్టేడ్ కణజాలం కోసి వేయాలని లేక మీకు యాంటి బయోటిక్స్ ఇవ్వాలని నిర్ణ యించవచ్చు. మీ వైద్యుడు రక్తం మీ కాళ్ళకు మరియు పాదాలకు ఎంత బాగా చేరుతుంది అని పరీక్షలు చేయవచ్చు. కొన్ని సార్లు, మీ వైద్యుడు రక్త ప్రసరణ మెరుగు పరుచుటకు మూసుకు పోయిన రక్త నాళాలను శుభ్రం చేయవచ్చు.

ఈ చికిత్సలు పని చేయకపోతే, లేదా మీరు తీవ్రమైన నొప్పి లేదా ఇన్ఫెక్షన్ కలిగి ఉంటే, వైద్యుడు మీ బొటనవేలు, పాదం, లేదా మీ కాలులో ఒక భాగాన్ని విచ్ఛేదనంమీ శరీరంలో ఒక భాగాన్ని తీసివేయడం చేయవలసి రావచ్చు. ఒక సర్జన్ ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ ను నిర్వహిస్తాడు. మీరు అనస్థీషియా అందుకుంటారు మరియు ఆపరేషన్ సమయంలో నిద్రపోతారు.

సాధారణ పాదాల సమస్య లు నొప్పి లేదా ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి?

మీకు మధుమేహం ఉంటే, ఈ క్రింది సాధారణ పాదాల సమస్యలు నడవడంను కష్టతరం చేసే నొప్పి లేదా ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చు. మీకు ఈ సమస్యలలో ఏవైనా ఉంటే, మీ వైద్యుడు నుండి సత్వర చికిత్స తప్పక పొందండి.

 గట్టిపడిన చర్మ భాగాలు మరియు ఆనెలు
గట్టిపడిన చర్మ భాగాలు మరియు ఆనెలు చర్మం యొక్క మందం పొరలు
 • గట్టిపడిన చర్మ భాగాలు మరియు ఆనెలు ఒకే స్థలంలో ఎక్కువ రాసుకోవడం లేక ఒత్తిడి వలన కలుగుతాయి. అవి తరచుగా మొదటి మరియు రెండవ వేళ్ళు ఒక దాని మీద ఒకటి రాసుకున్నప్పుడు ఏర్పడుతాయి.
 • మీరు స్నానం లేదా షవర్ చేసిన తర్వాత ఒక ప్యుమిక్ రాయితో సున్నితంగా తక్కువ స్థాయిలో రుద్దండి.  ఒక ప్యుమిక్ రాయి అనేది చర్మాన్ని నునుపు చేయుటకు ఉపయోగించే ఒక  రకమైన రాయి. అయితే, గట్టిపడిన చర్మ భాగాలు మరియు ఆనెల గురించి జాగ్రత్త వహించడానికి ఉత్తమ మార్గం జాగ్రత్త గురించి మీ వైద్యునితో తనిఖీ చేసుకోండి.
 • గట్టిపడిన చర్మ భాగాలు  మరియు ఆనెల ప్రాంతంలో ఇన్ఫెక్షన్ ఏర్పడితే మీ వైద్యుడు అనారోగ్య కణజాలాన్ని తొలగించి  మీకు యాంటీబయాటిక్స్ ఇవ్వవలసిన అవసరం రావొచ్చు.
బొబ్బ
బొబ్బలు పైకి లేచిన మరియు ద్రవంతో నిండిపోయిన చర్మం యొక్క ప్రాంతాలు.
 • మీ షూ ఎల్లప్పుడూ మీ పాదం మీద ఒకటే స్థానంలో రుద్దుకుంటే ఒక బొబ్బ ఏర్పడవచ్చు.
 • సరిపోని బూట్లు ధరించడం లేదా సాక్స్ లేకుండా బూట్లు ధరించడం అనేవి కూడా బొబ్బలను కలిగించవచ్చు.
 • బొబ్బను నివారించడానికి, రుద్దబడే స్థానం మీద సాక్స్ లేదా బాండేజ్ ను ఉపయోగించండి. సరిగ్గా సరిపోయే బూట్లను ధరించండి.
 • చిన్న బొబ్బలను ఒక బాండేజ్ తో కప్పండి మరియు పెద్ద వాటిని అంటుకునే పదార్ధం లేదా కాగితం టేప్ తో ఉంచిన ఒక సన్నని తీగజాలీతో కప్పండి. మీరు ఒక మందుల దుకాణంలో వివిధ పరిమాణాలలో ఉండే ప్రత్యేక బొబ్బల బాండేజ్ లను కూడా  కొనుగోలు చేయవచ్చు.
 • మీ బొబ్బకు ఇన్ఫెక్షన్ వస్తే, మీ డాక్టర్ బొబ్బ నుండి కారే ద్రవాన్ని తొలగించి మరియు మీకు యాంటీబయాటిక్స్ ఇవ్వవలసిన అవసరం ఉండవచ్చు.
బొటనవేలి లోపలి మూలలకు గోరు పెరగడం.
బొటన వెలి లోపలి మూలలకు గోరు పెరగడం జరిగితే అప్పుడు మీ యొక్క బొటనవేలు గోరు చర్మం మూల ల్లోకి పెరుగుతుంది.
 • మరీ బిగుతైన షూ ధరించడం వలన లేక మీరు ట్రిమ్  చేసేటప్పుడు బొటన వేలిగోర్ల మూలల్లోకి కత్తరిస్తే బొటన వేలి గోర్లు లోపలికి పెరగవచ్చు.
 •  బొటన వేలి గోర్లు లోపలికి పెరగడంను నిరోదించుటకు, సరిగ్గా సరిపోయే బూట్లను ధరించండి.
 • బొటన వేలి గోర్ల అంచులు పదునుగా వుంటే, వాటిని కత్తరించే బదులు నైల్ ఫైల్ తో లేక మెరుగు పెట్టే పొడి పలకతో వాటిని నునుపు చేయండి.
 • మీరు కాలి గోర్లకు చేసే చికిత్స కోసం ఒక సెలూన్ కు వెళ్లితే, వారు మీ కాలి గోర్ల మూలలు కత్తరించకుండా చూసుకోండి. లోపలికి పెరిగిన బొటన వేలి గోర్లకు ఎప్పుడూ ఇంటి దగ్గర చికిత్స చేయవద్దు.  నయం కావడానికి లేక మీ చర్మంలోకి తిరిగి పెరగకుండా సహాయం చేయడానికి వైద్యుడు మీ బొటన వేలి గోటి భాగంను తొలగించవచ్చు. ఒక వేళ కాలివేలికి ఇన్ఫెక్షన్ వస్తే మీకు యాంటిబయోటిక్స్ అవసరం ఉండవచ్చు.
బొటన వ్రేలి మొదట్లో ఉబ్బు
బొటన వ్రేలి మొదట్లో ఉబ్బు మీ పెద్ద బొటనవేలు యొక్క వెలుపల అంచు వద్ద ఉండే ఒక ఉబ్బెత్తు ప్రాంతం .ఆ ఉబ్బెత్తు ప్రాంతం తీవ్రమయ్యే కొద్దీ, అది ఎక్స్ట్రా ఎముకతో మరియు ద్రవంతో నింపబడుతుంది.
 •  మీ బొటనవేలు మీ చిన్న వేలి వైపుకు ఏటవాలుగా వంగినప్పుడు బొటన వ్రేలి మొదట్లో ఉబ్బు ఏర్పడుతుంది. హై హిల్స్, పాయింటెడ్ షూ, లేక మరీ బిగుతుగా వున్న లేక ఇరుకుగా వున్న షూ బొటన వ్రేలి మొదట్లో ఉబ్బును కలిగించవచ్చు.  బొటన వ్రేలి మొదట్లో ఉబ్బు తరుచుగా కుటుంబాలల్లో వంశపారంపర్యంగా వస్తుంది.
 •  బొటన వ్రేలి మొదట్లో ఉబ్బును నిరోదించుటకు సరిగ్గా సరిపోయే షూస్ ధరించండి.
 •  బొటన వ్రేలి మొదట్లో ఉబ్బు తీవ్రమవుటను నిరోదించుటకు మీ వైద్యుడు ప్యాడ్ పెట్టిన షూ ను ఉపయోగించమని మరియు నొప్పి మరియు వాపు తగ్గించుటకు మందులు వాడమని సూచించగలడు. తరచుగా నొప్పికి కారణమైన బొటన వ్రేలి మొదట్లో ఉబ్బును తొలగించుటకు మీకు శస్త్ర చికిత్స అవసరం ఉండవచ్చు.
అరికాలి పులిపురులు
అరికాలి పులిపురులు అనేవి మీ పాదాల అడుగున చిన్న, మాంసం రంగుతో ఉండే పెరుగుదలలు.  కొన్నిసార్లు పులిపురులల్లో చిన్న నల్లని చుక్కలు కనబడుతాయి.
 • అరికాలి పులిపురులు చర్మంలోని సన్న పగుళ్ళ ద్వారా మీ పాదాలలో ప్రవేశించే వైరస్ ద్వారా వస్తాయి .  అరికాలి పులిపురులు నొప్పిగా ఉండవచ్చు  మరియు నడవడాన్నికష్టతరం చేస్తాయి.
 • అరికాలి పులిపురుల వ్యాప్తిని నిరోధించడానికి, మీ పులిపురులను తాకడాన్ని   మానుకోండి మరియు వాటిని తాకిన తర్వాత మీ చేతులను కడుక్కోండి.
 •  మీ పాదాలను శుభ్రంగా మరియు పొడిగా ఉంచుకోండి.
 • పబ్లిక్ ప్రాంతాల్లో పాదరక్షలు ధరించకుండా పోవద్దు.
 •  మీ వైద్యుడు అరికాలి పులిపురులను చిన్న శస్త్రచికిత్స, లేజర్ చికిత్స, ద్రవ నత్రజని, లేదా మందుల ద్వారా తీసివేయవచ్చు.
వంకర వ్రేలు
వంకర వేళ్ళు మీ పాదం కింద  వంపు తిరిగి ఉండే వేళ్ళు.
 • చిన్న కాలి వేళ్ళ యొక్క ఒకటి లేదా రెండు కీళ్ళు మీ పాద కండరాల బలహీనత వలన వంగినప్పుడు వంకర వేళ్ళు ఏర్పడతాయి. మధుమేహ నరాల నష్టం బలహీనతను కలిగించవచ్చు.
 • మీకు మీ పాదాల అడుగున మరియు మీ యొక్క వేళ్ళ మీద ఇన్ఫెక్టెడ్ కాగల పుండ్లు రావచ్చు.
 • మీ పాదాల ఆకారం మారవచ్చు.
 • మీకు నడవడంలో మరియు బాగా సరిపోయే బూట్లను కనుగొనడంలో సమస్యలు   ఉండవచ్చు.
 • హై హిల్స్ ఉండే లేదా మొనతేలిన బూట్లు మానుకోండి.
 • మీ వైద్యుడు మీ షూలలో ఉంచడానికి మీకు ఒక ఆర్తోటిక్ లేక ఇన్సర్ట్ ఇవ్వవచ్చు. మందులు నొప్పిని మరియు వాపును  తగ్గించగలవు. మీ వంకర వ్రేలు దృఢంగా మరియు బాధాకరంగా మారితే లేదా ఒక తెరిచిన పుండు ఏర్పడితే, మీకు మీ కాలివేలును సరి చేయటానికి శస్త్ర చికిత్స అవసరం కావచ్చు.

పొడిబారిన మరియు పగిలిన చర్మం

పొడిబారిన మరియు పగిలిన చర్మం గరుకుగా, పొలుసులుగా, మరియు పెచ్చులుగా వుంటుంది. ఒకవేళ మీరు డార్క్ స్కిన్ కలిగి వుంటే మీ చర్మం గ్రేగా  ఉండవచ్చు. మీ చర్మం ఎరుపు గా లేదా దురదగా ఉండవచ్చు

 • పొడిబారిన మరియు పగిలిన చర్మం అధిక రక్తంలో గ్లూకోజ్, నరాల నష్టం, లేదా క్షీణించిన రక్త ప్రవాహం ద్వారా గాని సంభవించవచ్చు.
 •  పగుళ్లు ఇన్ఫెక్షన్ ప్రారంభవడాన్నిఅనుమతిస్తాయి.
 •  మీ పాదాలను లోషన్ లేదా పెట్రోలియం జెల్లీ తో  తేమగా ఉంచండి.
 • మీ చర్మం ఎండిపోవచ్చు కాబట్టి మీ పాదాలను నాననివ్వవద్దు.
 •  మీరు ఇంట్లో మీ పొడిబారిన మరియు పగిలిన చర్మంకు చికిత్స చేసుకోలేకపోతే, మీ వైద్యున్ని కలవండి.  మీకు ఒక ప్రిస్క్రిప్షన్ ఆయింట్ మెంట్ లేదా క్రీమ్ అవసరం ఉండవచ్చు.

అథ్లెట్’స్ ఫుట్

అథ్లెట్’స్ ఫుట్ అనేది దురద, బర్నింగ్, రెడ్ నెస్, మరియు మీ చర్మం పగుళ్లకు కారణమయ్యే ఒక ఫంగస్. ఈ ఫంగస్ మీ అరికాళ్ళు మరియు మీ వేళ్ళ మధ్య పెరుగుతుంది.

 •  అథ్లెట్’స్ ఫుట్ ను నిరోధించడానికి మీకు వీలైనంత వరకు మీ పాదాలను పొడిగా ఉంచుకోండి.
 • ప్రతీ సారీ ఒకటే బూట్లను ధరించుటకు ప్రయత్నించవద్దు. నూలు లేదా ఊలు సాక్స్ వంటి తేమను పీల్చే సాక్స్ ను ధరించడానికి ప్రయత్నించండి.
 • పబ్లిక్ షవర్లల్లో వాటర్ ప్రూఫ్ బూట్లు లేదా ఫ్లిప్-ఫ్లాప్ ధరించండి.
 • మీరు పాదాలకు చేసే చికిత్స కోసం ఒక సెలూన్ కు పోతే, స్టేరిలైజ్డ్ చేసినట్లు నిర్దారించుకోండి మరియు  మీ సొంత పరికరాలను తీసుకుని వెళ్ళండి.
 •  మీకు అథ్లెట్’స్ ఫుట్ వుంది అని నిర్ధారించుకొనుటకు మీ వైద్యున్ని కలవండి. మీరు ఒక మందుల దుకాణంలో ఫంగస్ కు చికిత్స చేసే స్ప్రేలు మరియు క్రీములను కొనుగోలు చేయవచ్చు; అయితే, మీ వైద్యుడు ఒక బలమైన నోటి ద్వారా తీసుకునే మందును నిర్దేశించవచ్చు.

ఫంగల్ ఇన్ఫెక్షన్

కాలిగోళ్ళపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వాటిని మందంగా చేస్తుంది, కత్తరించడాన్ని కఠినతరం చేస్తుంది, పసుపు పచ్చ, ఆకుపచ్చ, గోధుమ లేదా నల్లగా కనపడేటట్లు చేస్తుంది. ఒక గోరు పడిపోవచ్చు కూడా.

.

 •  గోళ్ళపై ఫంగల్ ఇన్ఫెక్షన్ ను నిరోధించడానికి మీకు వీలైనంత వరకు మీ పాదాలను పొడిగా ఉంచుకోండి.
 • ప్రతీ సారీ ఒకటే బూట్లను ధరించుటకు ప్రయత్నించవద్దు. నూలు లేదా ఊలు సాక్స్ వంటి తేమను పీల్చే సాక్స్ ను ధరించడానికి ప్రయత్నించండి.
 • పబ్లిక్ షవర్లల్లో వాటర్ ప్రూఫ్ బూట్లు లేదా ఫ్లిప్-ఫ్లాప్ ధరించండి.
 • మీరు పాదాలకు చేసే చికిత్స కోసం ఒక సెలూన్ కు పోతే, స్టేరిలైజ్డ్ చేసినట్లు నిర్దారించుకోండి మరియు  మీ సొంత పరికరాలను తీసుకుని వెళ్ళండి.
 • మీకు గోళ్ళపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వుంది అని నిర్ధారించుకొనుటకు మీ వైద్యున్ని కలవండి. మీ వైద్యుడు ఒక బలమైన నోటి ద్వారా తీసుకునే మందును నిర్దేశించవచ్చు.  కొన్నిసార్లు వైద్యుడు శస్త్రచికిత్స ద్వారా లేదా రసాయనికంగా లేదా లేజర్ చికిత్స ద్వారా గోరును తొలగించవచ్చు.  ఒక లేజర్ పుంజం గోరు కణజాలంలోకి లోతుగా వెళ్ళి ఫంగస్ ను నాశనం చేయవచ్చు; అయితే, ఈ చికిత్స ఎంత బాగా పనిచేస్తుందని వైద్యులు  ఇంకా అధ్యయనం చేస్తున్నారు.

మీ పాదాల యొక్క ఇన్ఫెక్షన్ చిహ్నాలలో ఇవి వుంటాయి

 • చీము
 • ఎరుపు
 • పెరుగుతున్న నొప్పి
 • వెచ్చని చర్మం

మీకు ఈ సంకేతాలలో ఏవైనా ఉంటే వెంటనే మీ మీ వైద్యుడికి కాల్ చేయండి లేదా కలవండి.

మధుమేహం నా పాదాల ఆకారంను ఎలా మార్చవచ్చు?

మధుమేహం ద్వారా ఏర్పడే నరాల నష్టం మీ పాదాల ఆకారంలో మార్పులకు దారి తీయవచ్చు. దెబ్బతిన్న నరాలు  మీ పాదాల కండరములకు కదలిక గురించిన సందేశాలను పంపలేవు. మీ పాదాల కండరములు బలహీనమై అసమతుల్యంగా మారుతుంది. మీ పాదాలు మరియు కాలి యొక్క ఎముకలు మారవచ్చు.

మధుమేహం ద్వారా ఏర్పడే నరాల నష్టం చార్కొట్’స్ ఫుట్ కు కూడా కారణం అవుతుంది, దీనిలో మీ పాదాల కీళ్లు మరియు మృదువైన కణజాలం నాశనం అవుతుంది.

చార్కొట్’స్ ఫుట్ ప్రారంభ దశలలో, మీ కీళ్ళు గట్టిగా ఉంటాయి మరియు ద్రవాన్ని సేకరిస్తాయి. సమస్యను త్వరగా తీవ్రతరం కావచ్చు. మీ ఎముకలు స్థలం నుండి పక్కకు జరిగి, మీ కాలు చూసేదానికి వికృతముగా కనపడవచ్చు.

మీకు  నొప్పి అనిపించకపోవచ్చు, కాబట్టి మీరు మీ పాదాల మీద నడుస్తూ ఉండి ఈ సమస్యను అధ్వాన్నంగా చేయవచ్చు. అది తెలియకుండా, మీరు కీళ్ళను గాయపరచవచ్చు మరియు నష్టపరచవచ్చు లేదా మీ పాదాలలోని ఎముక విరుగగొట్టవచ్చు.

చార్కొట్’స్ పాదం లక్షణాలు త్వరగా కనిపిస్తాయి మరియు వీటిలో ఈ క్రిందివి ఉంటాయి

 • వెచ్చని, ఎరుపు చర్మం
 • వాపు
 • నొప్పి

మీ వైద్యుడు మొదట  మీ పాదాలను ఒక పాత్రలో ఉంచి  మరియు మీరు నడవడానికి ఒక వూతకర్ర లేదా ఒక వీల్ చైర్ మాత్రమే ఉపయోగించమని అడగడం ద్వారా చార్కొట్’స్ ఫుట్ కు చికిత్స చేస్తాడు.  మీ ఎముకల స్థానాలను సరి చేయటానికి మీకు శస్త్ర చికిత్స అవసరం కావచ్చు.

చార్కొట్’స్ ఫుట్

ప్రత్యేక బూట్లు లేదా షూ ఇన్సర్ట్స్ నా పాదాలకు ఎలా సహాయపడతాయి?

గాయపడిన పాదాలు లేక ఆకారం మారిన పాదాల చుట్టూ మెత్తగా సరిపోయి మరియు రక్షించే విధంగా  ప్రత్యేక బూట్లు లేదా షూ ఇన్సర్ట్స్ ను తయారు చేయవచ్చు.

నేను ఎంత తరచుగా పాదాల పరీక్ష చేయించుకోవాలి?

పాదాల పరీక్ష కోసం కనీసం సంవత్సరంనకు ఒకసారి లేదా మీకు పాదాల సమస్యలు ఉంటే మరింత తరచుగా మీ వైద్యుడ్ని కలవండి. పరీక్ష సమయంలో, మీ వైద్యుడు

 • సమస్యల యొక్క సంకేతాల కోసం మీ పాదాన్ని చూస్తాడు, ముఖ్యంగా మీకు నరాల నష్టం వుంటే
 • పాదాలలో స్పర్శ అనుభూతిని పరీక్ష చేస్తాడు
 • రక్తం మీ కాళ్ళు మరియు పాదాలలోకి ఎంత బాగా ప్రవహిస్తుందో పరీక్ష చేస్తాడు
 • మీ పాదాల కోసం ఎలా శ్రద్ద తీసుకోవాలో మీకు చూపిస్తాడు
 • ప్రత్యేక బూట్లు లేదా షూ ఇన్సర్ట్స్ మీ పాదాలలను ఆరోగ్యంగా ఉంచుటకు సహాయ పడుతాయా అని నిర్ణయిస్తాడు
 • ఒక వేళ మీరు సొంతంగా గోళ్ళను ట్రిమ్ చేసుకోలేకపోతే ట్రిమ్ చేస్తాడు

ప్రతీ చెకప్ సమయంలో మీ పాదాల సంరక్షణ కోసం మీ వైద్యుడికి సహాయం చేయండి. మీ బూట్లు మరియు సాక్స్ తీసివేసి ప్రతీ తనిఖీని ప్రారంభించండి. మీకు వున్న ఏవైనా పాదాల సమస్యల గురించి మీ వైద్యునికి చెప్పండి.

ధూమపానం నా పాదాలను ఎలా ప్రభావితం చేస్తుంది?

ధూమపానం అనేది ఆమ్లజని మరియు పోషకాలతో మీ నరములను పోషించే రక్త నాళాలను ఇరుకుగా మరియు  గట్టిగా చేయవచ్చు.  నరాల నష్టం మరియు పేవలమైన రక్త ప్రవాహం తీవ్రమైన పాదాల సమస్యలకు కారణమవవచ్చు.

ధూమపానం మరియు మధుమేహం ప్రమాదకరమైన ఒక కలయిక. ధూమపానం పలు మధుమేహ సమస్యల కొరకు మీ ప్రమాదాలను పెంచుతుంది. మీరు ధూమపానంను విడిచి పెడితే,

 • మీరు గుండె పోటు, స్ట్రోక్, నరాల వ్యాధి, కిడ్నీ వ్యాధి, మరియు అంగ విచ్ఛేదనం యొక్క మీ ప్రమాదాన్ని తగ్గిస్తారు
 • మీ కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు స్థాయిలు మెరుగుపడవచ్చు
 • మీ రక్త ప్రసరణ మెరుగు పడుతుంది

నా పాదాలను ఎలా ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు?

మీరు ఈ దశలను పాటించడం ద్వారా మీ పాదాలను ఆరోగ్యవంతంగా ఉండేలా చేయవచ్చు:

 • మీరు పొగ త్రాగుతా ఉంటే, మానుకునేందుకు సహాయం పొందండి.
 • పాదాల పరీక్ష కోసం కనీసం సంవత్సరంనకు ఒకసారి లేదా మీకు పాదాల సమస్యలు ఉంటే మరింత తరచుగా మీ వైద్యుడ్ని కలవండి. మీ పాదాలలో స్పర్శ యొక్క భావం కోసం మరియు రక్తం మీ పాదాలకు ఎంత బాగా ప్రవహిస్తున్నది అని మీ వైద్యుడు తనిఖి చేస్తాడు.
 • మీ రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలు సాధ్యమైనంత వరకు మీ లక్ష్యంనకు దగ్గరగా ఉంచండి. మీ వైద్యుడు మీ లక్ష్య రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలు ఏర్పాటు చేయుటకు మీతో పనిచేస్తాడు మరియు మీ సంఖ్యలు చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉంటే మీరు ఏమి చేయలయును అనేది నేర్పిస్తాడు.
 • కోతలు, పుళ్ళు, బొబ్బలు, ఎరుపు, దద్దులు, ఇన్ఫెక్టేడ్ కాలి గోళ్ళు లేదా ఇతర సమస్యల కొరకు ప్రతీ రోజు మీ పాదాలను తనిఖీ చేసుకోండి. మీకు నొప్పి తెలియకున్నాకూడా, మీరు తీవ్రమైన పాదాల సమస్యలు కలిగి వుండవచ్చు. ఒక వేళ నరాల నష్టం లేదా పేవలమైన రక్త ప్రవాహం కలిగి ఉంటే ప్రతీ రోజు తనిఖీ మరింత ఎక్కువ ముఖ్యం. మీ పాదాలను వంగి చూడటానికి మీకు ఇబ్బందిగా ఉంటే, సహాయంగా ఒక అద్దంను ఉపయోగించండి.

మీరు మీకు సహాయం చేయమని ఒక కుటుంబ సభ్యుడ్ని లేదా స్నేహితుడ్ని కూడా అడగవచ్చు. మీకు ఏదైనా పాద సమస్య వుంటే వెంటనే మీ వైద్యునికి కాల్ చేయండి లేదా కలవండి.

ప్రతీ రోజు మీ పాదాన్ని తనిఖీ చేయండి.

 • మీ పాదాలను వేడి నీటితో కాకుండా వెచ్చని నీటితో ప్రతీ రోజు కడగండి. మోచేయితో లేదా థర్మామీటర్ తో ఉష్ణోగ్రత పరిక్షించుకోండి—90 నుంచి 95 డిగ్రీలు సురక్షితం. మీ చర్మం ఎండిపోతుంది కాబట్టి మీ పాదాలను నాన పెట్టవద్దు. మీ కాలి వేళ్ళ మధ్య పొడిగా ఉండేటట్లు చూసుకోండి. మీ కాలివేళ్ళ  మధ్య పొడిగా ఉంచుకొనుటకు టాల్కం పౌడర్ ను లేదా కార్న్ స్టార్చ్ ను ఉపయోగించండి.
 • మీ చర్మంను మృదువుగా మరియు నునుపుగా ఉంచుకోండి. మీ పాదాల యొక్క పైన కింద స్నానం చేసి తుడుచుకున్న తరువాత లోషన్, క్రీమ్ లేదా పెట్రోలియం జెల్లీ పల్చని పొరగా రుద్దండి. మీకు ఒక ఇన్ఫెక్షన్ రావచ్చు కాబట్టి మీ కాలి వేళ్ళ మధ్యన ఏదీ పెట్టవద్దు.
 • ఆనెలు మరియు కాల్లుసేస్ ను మృదువుగా ఉంచుకోండి. మీ చర్మం చిరిగిపోకుండా నిదానంగా ఒకే దిశలో మాత్రమే రుద్దండి. ఆనెలు మరియు కాల్లుసేస్ ను కోయవద్దు. రేజర్ బ్లేడ్లను, కార్న్ ప్లాస్టర్లు, లేదా ద్రవ కార్న్ మరియు కాల్లుసేస్ రిమూవర్స్ వాడవద్దు-అవి మీ చర్మంను దెబ్బతీయవచ్చు.
 • ప్రతీ వారం లేదా అవసరమైనప్పుడు మీ గోళ్ళను ట్రిమ్ చేయండి. మీ వైద్యుడుతో మీ గోళ్ళను ట్రిమ్ చేయించుకోండి, ఒకవేళ
 • మీకు బాగా కనిపించకపోతే
 • మీరు మీ పాదాలను చేరుకోలేకపోతే
 • మీ గోళ్ళు మందంగా లేదా పసుపు పచ్చగా ఉంటే
 • మీకు లోపలికి పెరిగిన కాలి గోరు ఉంటే

మీ కాలివేలి గోళ్ళను చూడగలిగి చేరుకోగలిగితే, వాటిని క్లిప్పేర్స్ తో స్నానం తర్వాతా ట్రిమ్ చేయండి మరియు మీ పాదాన్ని పొడిగా ఉంచుకోండి. కాలి వేళి గోళ్ళను చక్కగా వంపుగా ట్రిమ్ చేయండి మరియు వాటిని ఎమిరి బోర్డు లేదా నైల్ ఫైల్ తో నునుపుగా చేయండి. మీ కాలివేలి మూలలలోకి కట్ చేయవద్దు.

కాలివేలి గోళ్ళను చక్కగా వంపుగా ట్రిమ్ చేయండి మరియు వాటిని ఎమిరి బోర్డు లేదా నైల్ ఫైల్ తో నునుపుగా చేయండి.

మీ పాదాలను రక్షించుకోవడానికి అన్ని సమయాల్లో బూట్లు మరియు సాక్స్ లను ధరించండి. లోపల కూడా వట్టి కాళ్ళతో నడవవద్దు, ఎందుకంటే ఏదో ఒక దానిపై కాలు వేసి మీ పాదాలను బాధించడం సులభం. బొబ్బలు  మరియు పుండ్ల నుండి రక్షించుకొనుటకు సహాయపడేందుకు ఎల్లప్పుడూ మీ షూలతో  సాక్స్ లను, స్టాకింగ్స్, లేదా నైలాన్లు ధరించండి. బాగా సరిపోయిన శుభ్రమైన, తేలికైన ప్యాడేడ్ సాక్స్ లను ఎంచుకోండి. అతుకులు లేనటువంటి సాక్స్ లు మంచివి. మోకాలు పొడవు వుండే మోకాలు కింద చాలా బిగుతుగా వుండే సాక్స్ లను ధరించవద్దు. షూలు వేసుకునే ముందు వాటిల్లో ఏవైనా పదునైన అంచులు లేదా వస్తువులు లేవని మరియు లైనింగ్ నునుపుగా ఉందని నిర్ధారించడానికి మీ షూల లోపలి భాగాన్ని తనిఖీ చేయండి.

 • బాగా సరిపోయే బూట్లను ధరించండి. బాగా సరిపోయే బూట్లు తీవ్రమైన పాదాల సమస్యలను నిరోధించుటకు మీకు సహాయ పడుతాయి. రోజు చివరలో బూట్లను కొనండి ఎందుకంటే అప్పుడు మీ పాదాలు కొద్దిగా పెద్దగా ఉంటాయి—పాదాలు పగటి సమయాల్లో ఉబ్బిపోగలవు. బూట్లను కొనేటప్పుడు   అవి ప్రారంభం నుండి బాగా అనిపించట్టు మరియు మీ కాలి వేళ్ళ కోసం తగినంత స్థలాన్ని కలిగి ఉండేటట్టు చూసుకోండి.  పాయింటెడ్ టోస్ లేదా హై హీల్స్ గల బూట్లను కొనవద్దు. అవి మీ కాళ్ళ మీద చాలా ఎక్కువ ఒత్తిడిని ఉంచుతాయి. ఓపెన్-టోడ్ బూట్లు లేదా శ్యాండల్స్ వదిలి పెట్టండి. రోజు ధరించడానికి అథ్లెటిక్ లేదా వాకింగ్ షూలు మంచివి. అవి మీ పాదాలకు మద్దతిస్తాయి మరియు షూ లోపలి వైపు చుట్టూ గాలి ఆడడానికి అనుమతిస్తాయి. వినైల్ లేదా ప్లాస్టిక్ బూట్లు ఎప్పుడూ ధరించవద్దు, ఎందుకంటే అవి షూ లోపల గాలి ఆడకుండా చేస్తాయి. బూట్లను నెమ్మదిగా వేసుకోండి. మొదటి కొన్ని వారాలు వాటిని ప్రతీ రోజు 1 నుండి 2 గంటలు ధరించండి.
 • వేడి మరియు చల్లదనం నుండి మీ పాదాలను రక్షించండి. వేడి పేవ్మెంట్ మీద లేదా బీచ్ వద్ద బూట్లు ధరించండి. ఎండ వలన చర్మం కమిలిపోకుండా మీ పాదాల మీద సన్ స్క్రీన్ని పూయండి. మీ పాదాలను రేడియేటర్లు మరియు ఓపెన్ ఫైర్లు నుండి దూరంగా వుంచండి. మీ పాదాల మీద వేడి నీటి సీసాలు లేదా హీటింగ్ ప్యాడ్లు పెట్టవద్దు. మీ పాదాలకు రాత్రి చలి తగిలితే సాక్స్ లను ధరించండి. శీతాకాలంలో మీ పాదాలను వెచ్చగా ఉంచుటకు లైన్డ్ బూట్లను ధరించండి. చలి వాతావరణంలో మంచుతాకిడి నుండి మీ పాదాలను రక్షించుకొనుటకు మీ పాదాలను తరచుగా తనిఖీ చేసుకోండి.
 • మీ పాదాలలో రక్త ప్రవాహం వుండే విధంగా వుంచండి. మీరు కూర్చొని వున్నప్పుడు మీ కాలును పైకి పెట్టండి. మీ కాలి వేళ్ళను 5 నిముషాలు రోజుకు రెండు నుండి మూడు సార్లు పైకి కిందకు తిప్పండి. మీ పాదాలలో మరియు కాళ్ళల్లో రక్త ప్రవాహం పెరుగుటకు మీ మడమను పైకి, కిందకు మరియు లోపలికి, బయటకు కదిలించండి. మీ కాళ్లును ఎక్కువ సమయం పాటు మడచవద్దు.
 • మీ పాదాలకు సులువుగా వుండే శారీరక కార్యక్రమాలను ఎంచుకోండి. వేగంగా నడవడం, నాట్యం, ఈత, మరియు బైస్క్లింగ్ మీ పాదాలకు సులువుగా వుండే శారీరకకు శ్రమకు మంచి రూపాలు. మీ పాదాలకు కఠినంగా వుండే రన్నింగ్ మరియు జంపింగ్ వంటి కార్యకలాపాలను నివారించండి. బాగా సరిపోయే మరియు మంచి మద్దత్తు ఇచ్చే అథెలిటిక్ షూలను ధరించండి.

వేగంగా నడవడం అనేది మీ పాదానికి సులభమైన ఒక మంచి శారీరక కార్యక్రమం.

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు