మధుమేహ సమస్యలను నిరోధించండి: మీ కళ్ళను ఆరోగ్యముగా ఉంచుకోండి

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456


మధుమేహం
ఎలా నా కళ్ళను ప్రభావితం చేయవచ్చు?

మధుమేహం వలన మీ రక్తంలో ఏర్పడే, చక్కెర అని కూడా పిలువబడే, చాలా ఎక్కువ  గ్లూకోజ్ మీ కంటి యొక్క నాలుగు భాగాలను పాడు చేయగలదు.

 • రెటినా. రెటీనా అనేది మీ కంటి వెనుక భాగాన్ని కప్పే ఒక కణజాలం. రెటీనా మీ కంటిలోకి వచ్చే కాంతిని మీ ఆప్టిక్ నెర్వ్ ద్వారా దృశ్య సందేశాలుగా మార్చి మీ మెదడుకు చేరవేస్తుంది. మ్యాకులా అనేది తీక్షణమైన, వివరణాత్మక దృష్టిని ఇచ్చే చిన్న, సున్నితమైన, రెటీనా యొక్క మధ్య భాగం.
 • లెన్స్. మీ కంటి లెన్స్ స్పష్టంగా వుంటుంది మరియు, మీ కంటి రంగుగల భాగమైన ఐరిస్ వెనుక వుంటుంది . కాంతి, లేదా ఒక చిత్రం రెటీనా మీద పడుటకు లెన్స్ సహాయ పడుతుంది.
 • విట్రియోస్ జెల్. విట్రియోస్ జెల్ అనేది రెటీనా మరియు లెన్స్ మధ్య, మీ కంటి వెనుక భాగాన్ని నింపే ఒక స్పష్టమైన, రంగులేని పదార్ధం.
 • ఆప్టిక్ నెర్వ్. ఆప్టిక్ నెర్వ్ అనేది మీ కంటి వెనుక వుండే, మీ కంటి యొక్క అతిపెద్ద ఇంద్రియ సంబంధిత నరము. ఆప్టిక్ నెర్వ్ మీ కన్నును మీ మెదడుతో కలుపుతుంది, రెటీనా నుండి మీ మెదడుకు దృష్టి సందేశాలను తీసుకుపోతుంది, మరియు మీ మెదడు మరియు మీ కంటి కండరాల మధ్య సందేశాలను పంపుతుంది.

మధుమేహ కంటి వ్యాధి అని పిలువబడే-మీ కళ్ళకు మధుమేహం వల్ల ఏర్పడే నష్టం – అల్ప దృష్టి మరియు అంధత్వంతో సహా శాశ్వత దృష్టి నష్టాన్ని కలిగించవచ్చు.  అల్ప దృష్టి అంటే  సాధారణ అద్దాలు, కాంటాక్ట్  లెన్స్ లు, మందులు, లేక శస్త్ర చికిత్సతో కూడా మీ రోజు వారీ విధులను సులభంగా చేసుకొనుటకు సరిపోయినంత బాగా చూడలేరు.

మధుమేహం రెటీనాను ఎలా ప్రభావితం చేస్తుంది?

కాలక్రమేణా, మధుమేహం కారణంగా అధిక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కలిగి వుండడం అనేది రెటీనా మీద వుండే చిన్న రక్తనాళాలను దెబ్బతీయవచ్చు. డయాబెటిక్ రెటినోపతీ అనేది మధుమేహం కారణంగా రెటీనా దెబ్బతినడం అనే దాని కొరకు వాడే మెడికల్ టర్మ్.

రెటీనా దెబ్బతినడం నెమ్మదిగా జరుగుతుంది. మొదట, రెటీనా యొక్క రక్త నాళాలు ఉబ్బుతాయి. రెటీనా దెబ్బతినడం తీవ్రస్థాయికి చేరడంతో, రక్తనాళాలు మూసుకుపోబడి రెటీనాకు సరఫరా అయ్యే ప్రాణవాయువును అడ్డుకుంటాయి. ప్రతిస్పందనగా, కొత్త, బలహీన రక్త నాళాలు రెటీనా మీద మరియు   విట్రియస్ జెల్ ఉపరితలం మీద పెరుగుతాయి. ఈ రక్త నాళాలు సులభంగా విచ్ఛిన్నం అవుతాయి మరియు విట్రియస్ జెల్ లోకి రక్తాన్ని లీక్ చేస్తుంది . కారుతున్న రక్తం కాంతి రెటీనాను చేరకుండా ఉంచుతుంది.

అది జరిగినప్పుడు, మీరు తేలుతున్నట్లుండే మచ్చలు లేదా దాదాపు మొత్తం చీకటి చూడవచ్చు. మీ కళ్ళలో ఒకటి, మరొకదాని కంటే ఎక్కువ నష్టపోయి వుండవచ్చు, లేదా రెండు కళ్ళకు నష్టం ఒకటే  మొత్తంలో జరిగి ఉండవచ్చు. కొన్నిసార్లు రక్తం దానికదే క్లియర్ అవుతుంది. అయినప్పటికీ, మీ రక్తం తొలగించడానికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు.

నష్టం తీవ్రమయేంత వరకు మీ దృష్టితో మీకు ఏరకమైన సమస్యలు ఉండకపోవచ్చు, కాబట్టి మీ దృష్టి బాగునట్టు అనిపించినా కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి కళ్ళ పరీక్ష చేయించుకోండి. మీరు మీ దృష్టి లో ఏవైనా మార్పులను గమనిస్తే వెంటనే మీ కంటి డాక్టర్ ను కలవండి.

కొన్ని సంవత్సరాలకు, వాచిన మరియు బలహీనమైన రక్త నాళాలు మచ్చ కణజాలాన్ని ఏర్పచవచ్చు మరియు మీ కంటి వెనుక నుండి రెటీనా దూరంగా లాగుతుంది. రెటీనా దూరంగా లాగబడితే, డిటాచ్డ్ రెటీనా అని పిలువబడే ఒక పరిస్థితి ఉంటే, మీరు తేలియాడే మచ్చలు లేదా ఫ్లాషింగ్ లైట్లను చూడగలరు. మీరు చూస్తున్న దాని యొక్క ఒక భాగం మీదుగా పరదా వేయబడింది అన్నట్లుగా మీకు అనిపించవచ్చు. మీరు వెంటనే దానిని జాగ్రత్త తీసుకోకపోతే విడగొట్టబడిన రెటీనా చూపు కోల్పోవడం లేదా అంధత్వం నకు కారణమవగలదు. ఒక వేళ మీరు ఈ లక్షణాలు కలిగివుంటే– వెంటనే ఆప్తమాలజిస్ట్      ను కలవండి– అన్నికంటి జబ్బులను పరీక్షించి మరియు వైద్యం చేయగల ఒక డాక్టర్.

సాధారణ దృష్టి

మధుమేహం వల్ల దెబ్బతిన్న రెటీనాతో చూపు

డయాబెటిక్ రెటినోపతీని కలిగిన కొంతమంది మాక్యులర్ ఎడిమా అనే సమస్యను కూడా కలిగి వుంటారు. మాక్యులర్ ఎడిమా లేదా వాపు, రెటినోపతీ ఏ దశలో నైనా జరగవచ్చు. మాక్యులాలో వాపు రక్తనాళాలు దెబ్బతినడం ద్వారా రెటీనా నుండి కారుతున్న ద్రవం కారణంగా వస్తుంది.

మధుమేహంతో వున్న ప్రజలు చూపు కోల్పోవడానికి మాక్యులర్ ఎడిమా అనేది అత్యంత సాధారణ కారణం. ఎడెమాకు చికిత్స చెయ్యకపోతే మీ దృష్టి నష్టం తేలికపాటి నుండి  తీవ్రంగా ఉండవచ్చు, కాబట్టి కనీసం సంవత్సరానికి ఒకసారి ఒక కంటి పరీక్ష చేయించుకోవడం ముఖ్యం. కంటి డాక్టర్ లేక ఆప్టోమెట్రిస్ట్ – అద్దాలను మరియు కాంట్యాక్ట్ లెన్స్లు సూచించే మరియు కంటి యొక్క కొన్ని పరిస్థితులను మరియు వ్యాధులను నిర్ధారణ మరియు చికిత్స చేసే ఒక ప్రాధమిక కంటి సంరక్షణ ప్రదాత- తో  పరీక్ష చేయించుకోవచ్చు.

మధుమేహ రెటినా సమస్యల యొక్క లక్షణాలు ఏమిటి?

తరచుగా, మధుమేహం  రెటీనా సమస్యల యొక్క ప్రారంభ దశలలో ఎటువంటి లక్షణాలు కనపడవు. రెటీనా సమస్యలు తీవ్రమైనపుడు, మీరు ఈ లక్షణాలు కలిగి ఉండవచ్చు.

 • మసకగా లేదా రెండుగా కనబడుట
 • మీ దృష్టి లో వలయాలు, ఫ్లాషింగ్ లైట్లు, లేదా ఖాళీ మచ్చలు
 • మీ దృష్టి లో చీకటి లేదా తేలే మచ్చలు
 • ఒక కంటిలో లేదా మీ రెండు కళ్ళల్లో నొప్పి లేదా ఒత్తిడి
 • మీ కళ్ళ మూలల నుండి విషయాలను చూచుటకు ఇబ్బంది

సాధారణ  చూపు

అస్పష్ట చూపు

నా కంటి వైద్యుడు నాకు మధుమేహ రెటీనా సమస్యలున్నాయా అని ఎలా చెప్పగలడు?

మీ కంటి వైద్యుడు మీకు మధుమేహ రెటీనా సమస్య  ఉందా అని ఒక విప్పారిన కంటి పరీక్ష సమయంలో చెప్పగలడు.  విప్పారిన కంటి పరీక్షలో మీ కంటి వైద్యుడు మీ కనుపాప పెద్దగా అవడానికి కంటి చుక్కల మందును ఉపయోగిస్తాడు. మీ కనుపాప నల్లని గుడ్డు మధ్య భాగములో వుండే రంధ్రం.

మీ కనుపాపలను  పెద్దగా చేయడం అనేది మీ వైద్యుడు మీ వ్యాధి లక్షణాలను పరీక్షించుటకు మరింత లోతుగా మీ కంటిలో చూడడానికి అనుమతిస్తుంది.  దెబ్బతినడము మరియు ఇతర కంటి సమస్యల లక్షణాల కొరకు మీ రెటీనా మరియు కంటి నరమును చూడడానికి మీ కంటి వైద్యుడు ఒక ప్రత్యేక మ్యాగ్నిఫయింగ్ లెన్స్ ను ఉపయోగిస్తాడు.

మీ విప్పారిన కంటి పరీక్ష సమయంలో, ఈ క్రింది వాటిని కొలవటానికి మీ డాక్టర్ ఇతర పరీక్షలను కూడా  నిర్వహిస్తాడు

 • మీ కళ్లలో ఒత్తిడి
 • మీ పక్క, లేదా పరిధీయ దృష్టి
 • మీరు వివిధ దూరాలను ఎంత బాగా చూడగలరు

ఒక వేళ మీ కంటి చూపు బాగున్నా కూడా విప్పారిన కంటి పరీక్షను కనీసం సంవత్సరానికి ఒకసారైనా  చేయించుకోండి. క్రమబద్ధమైన పరీక్షలు చాలా సందర్భాల్లో మధుమేహం నుండి తీవ్రమైన కంటి చూపు కోల్పోవడం లేక గుడ్డితనం లాంటి కంటి సమస్యలను నిరోధించవచ్చు.  ఈ పరీక్షలు మీ దృష్టిని రక్షించేందుకు మరియు మీరు సాధ్యమైనంత వరకు బాగా చూచుటకు మీకు సహాయ పడగలవు.

ఐ ఆంజియోగ్రామ్ అని పిలువబడే పరీక్షను చేయించుకోవడానికి  మీరు ఆప్తమాలజిస్టును కలువవలసిన అవసరం ఉండవచ్చు.

ఈ పరీక్ష కొరకు, మీ కనుపాపలు విప్పారుటకు మీకు కంటి చుక్కల మందు ఇవ్వబడుతుంది. పరీక్ష సమయంలో ఒక కెమెరా యొక్క చిన్ రెస్ట్ వద్ద మీ గడ్డాన్ని మరియు ఒక సపోర్ట్ కడ్డికి  ఎదురుగా నుదురును కదలకుండా పెట్టమని మిమ్మల్ని అడుగుతారు.  మీ ఆప్తమాలజిస్టు మీ కంటి లోపలి చిత్రాలను తీసుకుంటాడు. ఒక డైని మీ చేతి సిరలోకి ఎక్కించబడుతుంది.  డై మీ కళ్ళను చేరి మీ కళ్ళ  రక్త నాళాల గుండా కదులుతున్నప్పుడు కెమెరా మరిన్ని చిత్రాలు తీస్తుంది.

ఈ పరీక్ష మీకు మీ రెటీనా మీద అసాధారణ లేదా కారుతున్న రక్త నాళాలు ఉన్నాయా అని చూపిస్తుంది మరియు ఉత్తమ చికిత్సను ఎంపిక చేయడంలో మీ ఆప్తమాలజిస్టుకు సహాయం చేస్తుంది.

నాకు మధుమేహ రెటీనా సమస్యలు ఉంటాయా?

ఎంత ఎక్కువ కాలం మీరు మధుమేహం కలిగి ఉండినారో, మీకు మధుమేహ రెటీనా సమస్యలు వుండే అవకాశం అంత ఎక్కువ ఉంటుందిమీకు మధుమేహ రెటీనా సమస్యలు వుండే అవకాశం తక్కువ, లేదా మీరు వాటిని కలిగి ఉంటే మీరు మీ రక్తం గ్లూకోజ్ సంఖ్యలను మీ లక్ష్యాలకు దగ్గరగా  ఉంచుకుంటే, తక్కువస్థాయి సమస్యలను కలిగి ఉంటారు. లక్ష్యాలు అంటే మీరు సాధించాలనుకునే సంఖ్యలు.

గర్భధారణ అనేది మధుమేహ రెటీనా సమస్యలను ప్రభావితం చేస్తుందా?

గర్భధారణ సమయంలో మీ శరీరంలోని మార్పులు మధుమేహ రెటీనా సమస్యలు సంభవించడానికి లేదా తీవ్రం అవ్వడానికి కారణం కావచ్చు.

మీకు మధుమేహం వుండి మరియు తొందరలో గర్భధారణ పొందాలనుకునే ప్రణాళిక వుంటే,  మీరు ఖచ్చితంగా విప్పారిన కంటి పరీక్ష చేయించుకోవాలి మరియు మధుమేహ రెటీనా సమస్యల గురించి మీ కంటి వైద్యునితో మాట్లాడండి. మీ కళ్ళకు శస్త్రచికిత్స అవసరం ఉంటే, మీరు గర్భము పొందడానికి ముందే దానిని చేయించుకోవాలనుకోవచ్చు.

మీకు మధుమేహం వుండి మరియు ఇప్పటికే  గర్భ ధారణ పొంది వుంటే మీ గర్భ ధారణ యొక్క మొదటి 3 నెలల సమయంలో లేక వీలైనంత తొందరగా  విప్పారిన కంటి పరీక్ష చేయించుకోండి. మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ గర్భధారణ అంతటిలోఎంత తరుచుగా మీరు విప్పారిన  కంటి పరీక్షలు చేయించుకోవాలి అనే దాని గురించి మీ కంటి వైద్యునితో మాట్లాడండి.

గర్భధారణ సమయంలో మాత్రమే అభివృద్ధి అయ్యే ఒక రకమైన మధుమేహమైన గర్భ ధారణ మధుమేహం మీకు ఉంటే, ఆ మధుమేహం మీ గర్భ ధారణ తర్వాత కొనసాగితే తప్ప మీకు డయాబెటిక్ రేటినోథెరఫి వచ్చే పెరిగిన ప్రమాదం లేదు.

మధుమేహ రెటీనా సమస్యలకు ఎలా చికిత్స చేస్తారు?

మీరు వీటిని నియంత్రించడం ద్వారా మీ మధుమేహం రెటీనా సమస్యలకు సహాయపడగలరు

 • రక్తంలో గ్లూకోజ్
 • రక్తపోటు
 • కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజెరైడ్స్, లేదా రక్తంలోని కొవ్వు రకాలు

మీ రెటినోపతీ ఇప్పటికీ మెరుగు పడకపోతే, అప్పుడు మీకు ఇతర చికిత్సలు అవసరం కావచ్చు. మీకు ఈ క్రింది చికిత్సలలో ఒకటి అవసరం ఉందా అని నిర్ణయించగల ఒక కంటి వైద్యున్ని మీరు కలువవలసిన అవసరం వుంటుంది.

 • మందులు. మీ డాక్టర్ కళ్ళలోకి మందులను ఎక్కించడం ద్వారా మాక్యులర్ ఎడెమాకు వైద్యం చేస్తాడు.  ఈ మందులు  శరీరంలో అసాధారణమైన రక్త నాళ పెరుగుదలకు మరియు ద్రవం కారడానికి కారణమయ్యే  ఒక ప్రోటీన్నునిరోధిస్తాయి.  ద్రవం కారడాన్ని తగ్గించడం అనేది తరచుగా రెటీనా సాధారణ మందమునకు తిరిగి రావడాన్ని అనుమతిస్తుంది. కంటి వైద్యుడు మీ కంటిని మొద్దుబార్చి మరియు అప్పుడు మందును పంపడానికి ఒక చిన్న సూదిని కుచ్చుతాడు.
 • లేజర్ ట్రీట్మెంట్. మీ వైద్యుడు మాక్యులర్ ఎడెమాకు ఫోకల్ లేజర్ ట్రీట్మెంట్ తో కూడా చికిత్స చేయవచ్చు. ఒక సందర్శనలో, కంటి వైద్యుడు మీ కంటికి తిమ్మిరి కలుగజేసి మాక్యులా సమీపంలో ద్రవం కారుతున్న ప్రాంతాల్లో అనేక చిన్న లేజర్ కాలిన గాయాలను ఉంచుతాడు. ఈ కాలిన గాయాలు ద్రవం యొక్క లీకేజీని నెమ్మది పరిచి మీ రెటీనా లో ద్రవం యొక్క మొత్తాన్ని తగ్గిస్తాయి.

కొన్నిసార్లు మీ డాక్టర్ స్కేటర్ లేసర్ ట్రీట్మెంట్ తో కూడా మధుమేహం రెటినోపతీకి వైద్యం చేస్తాడు. రెండు లేక ఎక్కువ సందర్శనలల్లో కంటి వైద్యుడు మీ కంటిని మొద్దుబార్చుతాడు మరియు వేల సార్లు లేసర్ తో కొత్త, బలహీనమైన రక్త నాళాల చుట్టూ మాక్యులా నుండి దూరంగా, అవి కుచించుకపోయేటట్లు కాలుస్తాడు.

లేజర్ చికిత్స రెటీనా దెబ్బతినడం నుండి మీ అంధత్వ అవకాశాలను ఎంతగానో తగ్గించవచ్చు. అయితే, చాలా సార్లు లేజర్ చికిత్స ఇప్పటికే కోల్పోయిన చూపును తిరిగి పునరుద్దరించలేదు. మందులు లేదా లేజర్లతో చికిత్స మీ కంటి వైద్యుడి కార్యాలయంలో చేయొచ్చు.

 • విట్రేక్టమి. మీ కంటి లో రక్తస్రావం తీవ్రంగా ఉంటే, మీరు ఒక విట్రేక్టమి అనే శస్త్రచికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లవలసి ఉండవచ్చు. మీ కంటి వైద్యుడు మీ కంటిని మొద్దుబరుస్తాడు లేదా మీరు నిద్రలోకి జారుకోడానికి సహాయంగా సాధారణ అనస్థీషియా ఇస్తాడు. కంటి వైద్యుడు మీ కంటిలో చాలా చిన్నగా కోసి మరియు రక్తంతో మసక బారిన వెటోరియస్ జెల్ ను తొలగిస్తాడు. కంటి వైద్యుడు ఉప్పు ద్రావణంతో వెటోరియస్ జెల్ ను భర్తీ చేస్తాడు.

మధుమేహం ఉన్న వారిలో ఇతర కంటి సమస్యలు సంభవించవచ్చును?

మధుమేహం ఉన్న వారిలో మరింత తరచుగా మరియు  మధుమేహం లేని వారి కంటే ఒక చిన్న వయసులోనే ఈ క్రింది కంటి సమస్యలు ఉండవచ్చు:

 • కేటరాక్ట్. కేటరాక్ట్ (శుక్లం) అంటే అస్పష్ట చూపుకు కారణం అయ్యే మామూలుగా స్పష్టంగా వుండే లెన్స్ మసకబారడం. శుక్లాన్ని తొలగించుకోవటానికి మీకు శస్త్రచికిత్స అవసరం అవుతుంది. శస్త్రచికిత్స సమయంలో, నేత్ర వైద్యుడు లెన్స్ లను బయటికి తీస్తాడు మరియు కాంట్యాక్ట్ లెన్స్ మాదిరిగా  వుండే ఒక  ప్లాస్టిక్ లెన్స్ ను లోపల వుంచుతాడు. ఆ ప్లాస్టిక్ లెన్స్ శాశ్వతంగా మీ కంటిలో ఉండిపోతాయి.
 • గ్లాకోమా. గ్లాకోమా (నీటికాసులు) అంటే కంటిలో ఒత్తిడి పెరగడంతో సంభవించే ఒక వ్యాధుల సమూహం. గ్లాకోమా కంటి నరాన్ని నష్టపరచవచ్చు మరియు ఫలితంగా చూపు కోల్పోవడం మరియు అంధత్వం ఏర్పడతాయి.  మధుమేహం ఉన్న వారికి అసాధారణ రక్త నాళాలు మీ కంటి ముందు భాగంలో పెరిగే తీవ్రమైన ఒక రకం గ్లాకోమా వచ్చే అవకాశం ఎక్కువ వుంది.  మీ కంటి వైద్యుడు మీ ఒత్తిడిని నియంత్రించడానికి కంటి చుక్కలు, మాత్రలు, లేదా కంటి శస్త్రచికిత్సతో గ్లాకోమాకు చికిత్స చేస్తాడు.
 • న్యూరోపతి. న్యూరోపతి అంటే నరాలు దెబ్బతినడం. మధుమేహం వల్ల పాదాలు లేక కాళ్ళ నరాలు దెబ్బతినడం అనేది అత్యంత సాధారణం. అయితే, మధుమేహం కంటి నరములను కూడా ప్రభావితం చేయవచ్చు. మధుమేహం వలన అధిక రక్తంలో గ్లూకోజ్ ను కలిగి వుండడం అనేది కంటి నరానికి రక్త సరఫరాను తగ్గించడానికి కారణమవుతుంది. హఠాత్తుగా మీకు ద్వంద్వ దృష్టి, మీ కంటి మీద కనురెప్ప కిందికి వేలాడడం, లేదా మీ కంటి మీద నొప్పి ఉండవచ్చు. కొంతమందికి వారి కంటి కండరాలలో పూర్తిగా లేదా పాక్షికంగా పక్షవాతం ఉండవచ్చు. ఈ రకమైన న్యూరోపతి దానికదే కొన్ని వారాల నుండి నెలల సమయంలో మెరుగయ్యే అవకాశం ఉంటుంది . అది కాకపోతే, మీరు ఒక కన్నుమీద ఒక పాచ్  ధరించవలసిన లేదా మీ కళ్ళను సరైన పద్దతిలో ఉంచుటకు ఒక ప్రత్యేకమైన లెన్స్ లను ఉపయోగించవలసిన అవసరం ఉండవచ్చు.

మధుమేహ కంటి సమస్యలను ధూమపానం ఎలా ప్రభావితం చేస్తుంది?

మధుమేహం లాగానే, ధూమపానం మీ కళ్ళలోని సన్నని రక్తనాళాలను నష్టపరుస్తుంది. మీ కంటి లోపల ఒత్తిడి పెరిగేందుకు ధూమపానంనకు కూడా సంబంధం వుంది, అది  గ్లాకోమా మరియు కంటి నరం దెబ్బ తినడానికి దారితీస్తుంది.

ధూమపానం మరియు మధుమేహం ఒక ప్రమాదకరమైన కలయిక. ధూమపానం అనేక మధుమేహం సమస్యల మీ ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు ధూమపానంను వదిలిపెడితే,

 • మీరు గుండెపోటు, గుండె నొప్పి, నరాల వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, మరియు అంగచ్చేదనం, శస్త్ర చికిత్సతో శరీరంలో ఒక భాగం కోసివేయబడటం లాంటి ప్రమాదాన్ని తగ్గిస్తారు
 • మీ కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు స్థాయిలు మెరుగుపడవచ్చు
 • మీ రక్త ప్రసరణను మెరుగు పడుతుంది

నేను ఇప్పటికే మధుమేహం రెటీనా సమస్యల నుండి చూపు కోల్పోయివుంటే నేను ఏమి చేయవలెను?

ఒకవేళ చికిత్స ద్వారా సరిచేయబడుట సాధ్యం కాని మధుమేహ రెటీనా సమస్యల నుండి మీరు ఇప్పటికే కొంత చూపు కోల్పోయివుంటే , మీ మిగిలిన చూపుకు అత్యంత సహాయం చేసే మీ అల్పదృష్టి సేవలు మరియు పరికరాల గురించి మీ కంటి వైద్యున్ని అడగండి. ఒక అల్పదృష్టి నిపుణుడుకు  రిఫెరల్ కోసం అడగండి. ఎన్నో కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ మరియు ఎజన్సీలు అల్పదృష్టి కౌన్సిలింగ్ మరియు శిక్షణ, మరియు అల్పదృష్టి  వ్యక్తుల కొరకు ఇతర ప్రత్యేక సేవల గురించి సమాచారం అందిస్తాయి.

నేను నా కళ్ళను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు?

మీరు ఈ దశలను పాటించడం ద్వారా మీ కళ్ళను ఆరోగ్యకరంగా  ఉంచుకోవచ్చు:

 • మీ రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలను మీ లక్ష్యంకు వీలైనంత దగ్గరగా ఉంచుకోండి. మీ రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలను మెరుగుపరచుకోవడం అనేది రెటినోపతీ కొరకు మీ ప్రమాదాన్నితగ్గిస్తుంది. మీ వైద్యుడు మీ రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలను సరైన స్థితిలో వుంచుట కొరకు మీతో కలసి పని చేస్తాడు మరియు మీ అంకెలు చాలా ఎక్కువ లేక చాలా తక్కువ వుంటే మీరు ఏమి చేయాలి అని మీకు నేర్పుతాడు.
 • మీ రక్తపోటును మీ లక్ష్యంకు వీలైనంత దగ్గరగా ఉంచుకోండి. అధిక రక్తపోటు రెటీనా మీది చిన్న రక్తనాళాలను నష్టపరుచవచ్చు. మీ రక్తపోటును నియంత్రించడానికి మీకు మందులు లేక మందుల కలయిక అవసరమా అని మీ వైద్యుడిని అడగండి. మీ వైద్యుడు రక్తపోటుకు మందులు వ్రాస్తే, వాటిని క్రమం తప్పకుండా తీసుకోండి.
 • మీ రక్తంలో గ్లూకోజ్, రక్తపోటు, కొలెస్ట్రాల్, మరియు ట్రైగ్లిజెరైడ్స్ ను నియంత్రించడానికి మీకు మందుల  అవసరతను తగ్గించుటకు ఆరోగ్యకరమైన ఒక ఆహారాన్ని తీసుకోండి మరియు శారీరకంగా చురుకుగా వుండండి.
 • మీరు పొగ త్రాగితే, పొగ త్రాగడాన్ని ఆపండి.
 • ఒకవేళ మీకు కంటి సమస్యల లక్షణాలుంటే, ప్రత్యేకించి ఆకస్మికంగా చూపు కోల్పోవడం వుంటే, మీ వైద్యున్ని వెంటనే కలవండి.
 • మీ దృష్టి బాగున్నట్టు అనిపించినా కనీసం సంవత్సరానికి ఒకసారి విప్పారిన కంటి పరీక్షను చేయించుకోండి.

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు