నేను అంగస్తంభన లోపం గురించి ఏమి తెలుసుకోవసిన అవసరం వుంది

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456


అంగస్తంభన
లోపం (ఇడి) అంటే ఏమిటి?

అంగస్తంభన లోపం అనేది మీరు అంగస్తంభన పొందలేకపోవడం లేదా సెక్స్ చేయటానికి తగినంత గట్టిగా అంగస్తంభనను ఉంచలేకపోవడం. మీకు ED వుండవచ్చు,  ఒకవేళ మీరు

 • కొన్నిసార్లు అంగస్తంభన పొందగలిగితే, అయితే ప్రతీ సమయంలో కాదు
 • అంగస్తంభన పొందగలరు, అయితే అది సెక్స్ కోసం తగినంత ఎక్కువ సేపు వుండకపోతే
 • అస్సలు అంగస్తంభన పొందలేకపోతే

ED ను  కొన్నిసార్లు నపుంసకత్వం అని పిలుస్తారు; అయితే, వైద్యులు ఈ పదాన్ని ఇప్పుడు తక్కువ తరచుగా ఉపయోగిస్తారు.

అంగస్తంభన ఎలా సంభవిస్తుంది?

పురుషాంగంలోకి రక్తం ప్రవాహం పెరిగి, పురుషాంగంను పెద్దగా మరియు గట్టిగా చేసినప్పుడు అంగస్తంభన సంభవిస్తుంది. అంగస్తంభనను కలిగించడానికి  హార్మోన్లు, రక్త నాళాలు, నరాలు మరియు కండరాలు అన్ని కలసి పనిచేస్తాయి.  మీ మెదడు ఒక లైంగిక తపనను అనుభూతి చెందితే, అది పురుషాంగంనకు నాడి సంకేతాలను పంపడం ద్వారా అంగస్తంభనను మొదలు పెడుతుంది. ఈ తపనకు స్పర్శ కారణం కావచ్చు. ఇతర ప్రేరకాలు (ట్రిగ్గర్స్) మీరు చూసే లేదా వినే విషయాలు లేదా లైంగిక చిత్రాలు లేదా ఆలోచనలు కావచ్చు.

మీ మెదడు ఒక లైంగిక తపనను అనుభూతి చెందినప్పుడు, పురుషాంగంనకు నాడి సంకేతాలను పంపడం ద్వారా అంగస్తంభనను మొదలు పెడుతుంది.

నాడి సంకేతాలు పురుషాంగంలోని మెత్తటి కండరాలు రిలాక్స్ కావడానికి కారణమవుతాయి మరియు పురుషాంగంలోని స్పాంజి కణజాలంలోకి రక్తం ప్రవాహంను అనుమతిస్తాయి. నీరు ఒక స్పాంజిని నింపే మాదిరి ఈ కణజాలంలో రక్తం సేకరించబడుతుంది. పురుషాంగం పెద్దగా మరియు గట్టిగా  ఊదిన బెలూన్ మాదిరి అవుతుంది. అప్పుడు రక్తం బయటకు ప్రవహించకుండా  నరాలు మూసివేయబడతాయి. అంగస్తంభనకు ఆరోగ్యవంతమైన రక్త నాళాలు అవసరం.

ఉద్వేగం తర్వాత లేదా పురుషుడు ఇకపై ప్రేరేపించబడలేనప్పుడు, నరాలు తెరచుకుని రక్తం తిరిగి శరీరంలోకి ప్రవహిస్తుంది.

ఏది అంగస్తంభన లోపంను కలిగిస్తుంది?

అంగస్తంభన లోపం తరచుగా ఒకటి కంటే ఎక్కువ కారణాలను కలిగి ఉంటుంది. పలు వ్యాధులు నాడులు, ధమనులు, మరియు కండరములను దెబ్బతీయవచ్చు. ఈ క్రింది వంటి కొన్ని ED కి దారితీయవచ్చు

 • అధిక రక్త పోటు
 • మధుమేహం, రక్తంలో చక్కెర అని కూడా పిలిచే మీ రక్తంలో గ్లూకోజ్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు
 • మూసుకుపోయిన ధమనులు
 • గుండె మరియు రక్త నాళ వ్యాధి
 • దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి
 • మల్టిపుల్ స్క్లేరోసిస్, నరాల మీద దాడి చేసే వ్యాధి
 • ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలు, రేడియేషన్, ప్రోస్టేట్ తొలగించటానికి శస్త్రచికిత్స, మరియు హార్మోన్ చికిత్సల తో సహా
 • పురుషాంగంనకు, వెన్నెముకకు, ప్రొస్టేట్ కు, మూత్రాశయంకు, లేదా కటికి గాయం
 • పిత్తాశయ క్యాన్సర్ కు చికిత్స
 • పెరోనీస్ డిసీజ్, దీనిలో పురుషాంగంలో ప్లేక్యు అని పిలిచే స్కార్ టిష్యూ ఏర్పడుతుంది

అనారోగ్యకరమైన జీవనశైలి ఎంపికలైన ధూమపానం, ఎక్కువ మద్యం తాగడం, అక్రమ మందులు ఉపయోగించడం, అధిక బరువు ఉండటం, మరియు వ్యాయామం చేయకపోవడం వంటివి ED కి దారి తీయవచ్చు.

ఈ క్రింది వంటి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ED ని కూడా కలిగించవచ్చు లేదా తీవ్రతరం చేయవచ్చు:

 • నిస్పృహ
 • లైంగిక వైఫల్య భయం
 • అపరాధభావం
 • తక్కువ ఆత్మగౌరవం
 • ఒత్తిడి
 • ఆందోళన

ED కు ఒక శారీరక కారణం ఉన్నా కూడా, మానసిక ఆరోగ్య సమస్యలు ED ని అధ్వాన్నంగా మార్చగలవు. ఉదాహరణకు, ఒక శారీరక సమస్య మీ లైంగిక ప్రేరేపణను నిదానపరచవచ్చు, ఇది మిమ్మల్ని మరింత ఆందోళన పరుచవచ్చు మరియు మీ యొక్క ED ని తీవ్రతరం చేయవచ్చు.

అదనంగా, ED అనేక సాధారణ మందుల దుష్ప్రభావం అయి ఉండవచ్చు. కొన్ని ED కేసులు తక్కువ  టెస్టోస్టెరాన్, ఒక మగ హార్మోన్  కారణంగా సంభవించవచ్చు.

అంగస్తంభన లోపం ఎవరికి వస్తుంది ?

అంగస్తంభన లోపం ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోని పురుషులను ప్రభావితం చేస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ  పురుషులు ED ని పొందే అవకాశం ఎక్కువ. ఉదాహరణకు, ED వీరిలో సంభవిస్తుంది

 • 60 కంటే తక్కువ వయస్సున్న పురుషులలో దాదాపు 12 శాతం
 • 60 నుంచి 69 కంటే ఎక్కువ వయస్సున్న పురుషులలో దాదాపు 22 శాతం
 • 70 లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న పురుషులలో దాదాపు 30 శాతం

అంగస్తంభన లోపం   ఇతర సమస్యలను కలిగించవచ్చు

ED కలిగి వుండడం అనేది మీకు వ్యాకులతగా లేదా ఆత్రుతగా అనిపించడానికి కారణం కావచ్చు. ED తక్కువ స్వీయ గౌరవంనకు కూడా కారణం కావచ్చు. మీరు ED కలిగి ఉన్నప్పుడు, ఒక సంతృప్తికరమైన సెక్స్ జీవితం మీరు పొందలేరు. మీ లైంగిక భాగస్వామితో అంత దగ్గరగా అనుభూతి పొందకపోవచ్చు, ఇది మీ సంబంధంను వక్రీకరించవచ్చు.

అంగస్తంభన సమస్య అంటే మీరు ఒక తీవ్రమైన పరిస్థితి కలిగి వున్నారు అనే అర్థం కావచ్చు కాబట్టి, మీకు అంగస్తంభన లోపం ఉంటే మీ వైద్యుడ్నికలవండి

మీకు అంగస్తంభన పొందడానికి లేదా కొనసాగించడానికి సమస్యలు ఉంటే, మరియు ఆ సమస్యలు కొన్ని వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే, మీరు మీ వైద్యునితో ఖచ్చితంగా మాట్లాడాలి. ED అనేది మధుమేహం లేదా గుండె జబ్బు వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.

మీరు మీ వైద్యుడుతో కలసినప్పుడు, మీరు “నాకు బెడ్ రూమ్ లో సమస్యలు ఉన్నాయి” లేదా “నేను అంగస్థంభన సమస్యలను కలిగి వుండినాను” వంటి పదబంధాలను ఖచ్చితంగా ఉపయోగించండి. ఒక ఆరోగ్యకరమైన లైంగిక జీవితం ఒక ఆరోగ్యకరమైన జీవితంలో ఒక భాగం అని గుర్తుంచుకోండి. సహాయం కోసం అడగడానికి సిగ్గు పడవద్దు. మీ వైద్యుడు ప్రతీ రోజు వైద్య సమస్యలకు చికిత్స చేస్తాడు.

నా వైద్యుడు నా అంగస్తంభన లోపం యొక్క కారణాన్ని ఎలా కనుగొంటాడు?

మీ ED యొక్క కారణం కనుగొనడానికి, మీ వైద్యుడు

 • మీ వైద్య మరియు లైంగిక చరిత్ర తీసుకోవచ్చు
 • మీ మానసిక ఆరోగ్యం గురించి ప్రశ్నలు అడగవచ్చు
 • మీకు ఒక శారీరక పరీక్ష చేయవచ్చు
 • మీకు రక్త పరీక్ష చేయవచ్చు
 • మీకు రాత్రిపూట అంగస్తంభన పరీక్ష చేయవచ్చు
 • ఒక ఇంజెక్షన్ పరీక్ష చేయవచ్చు
 • ఒక డాప్లర్ పెనైల్ అల్ట్రాసౌండ్ నిర్వహించవచ్చు

వైద్య మరియు లైంగిక చరిత్ర

మీ వైద్యుడు మీ ఆరోగ్యం గురించి సాధారణ ప్రశ్నలు, అలాగే మీ అంగస్థంభన సమస్యలు మరియు మీ లైంగిక భాగస్వామితో మీ సంబంధం గురించి, నిర్దిష్ట ప్రశ్నలు అడుగుతాడు. మీ వైద్యుడు మిమ్మల్ని ఇటువంటి ప్రశ్నలు అడగవచ్చు

 • మీకు ఎప్పుడైనా శస్త్రచికిత్స జరిగి ఉండిందా?
 • మీరు ఏ మందులు తీసుకుంటారు?
 • మీరు అంగస్థంభన పొందగలరు మరియు ఉంచుకోగలరు అని ఎంత ఖచ్చితంగా ఉంటారు?
 • మీకు అంగస్థంభనలు ఎప్పుడు వస్తాయి, అవి ఎంత తరచుగా సెక్స్ కోసం తగినంత గట్టిగా ఉంటాయి?
 • లైంగిక సమయంలో, ఎంత తరచుగా మీరు మీ అంగస్థంభనను వుంచుకొనగలరు?
 • మీరు సంభోగానికి ప్రయత్నించినప్పుడు మీరు ఎంత తరచు లైంగికంగా సంతోషంగా ఉన్నారు?
 • మీ లైంగిక కోరిక స్థాయికి ఎంత రేటింగ్ ఇస్తారు?
 • మీరు ఎంత తరచుగా క్లైమాక్స్ కు చేరుకుని స్ఖలనం చేయగలరు?
 • మీరు ఉదయం మేల్కొన్నప్పుడు మీకు అంగస్థంభన ఉంటుం దా?
 • మీరు అక్రమ మందులు ఉపయోగిస్తారా, మద్యం త్రాగడం, లేదా పొగ త్రాగడం చేస్తారా?

ఈ ప్రశ్నలకు సమాధానాలు మీ వైద్యుడు సమస్య అర్థం చేసుకొనుటకు సహాయం చేస్తాయి.

మీరు తీసుకునే అన్ని మందుల జాబితాను, లేదా అసలు మందుల జాబితాను మీ వైద్యుడికి చూపించటానికి తీసుకురండి.

మానసిక ఆరోగ్య ప్రశ్నలు

మీ వైద్యుడు మీ మానసిక ఆరోగ్యం గురించి మిమ్మల్ని ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు, మీకు ఆందోళనగా  లేదా కుంగిపోయినట్లుగా అనిపిస్తుందా అని మీ వైద్యుడు అడగవచ్చు. అతను లేదా ఆమె కాగితంపై కూడా ప్రశ్నలకు సమాధానం మిమ్మల్ని అడగవచ్చు. సమస్య గురించి మరింత సమాచారం పొందడానికి  వైద్యుడు మీ లైంగిక భాగస్వామి ప్రశ్నలు కూడా అడగవచ్చు.

శారీరక పరీక్ష

శారీరక పరీక్ష ED కి కారణం కనుగొనేందుకు మీ వైద్యుడికి సహాయపడుతుంది. పరీక్షలో భాగంగా, డాక్టర్, మీ వృషణాలు మరియు పురుషాంగంను పరీక్షిస్తాడు, మీ రక్తపోటును తీసుకుంటాడు, మరియు మీ రక్త ప్రవాహంతో ఉండే సమస్యల కోసం తనిఖీ చేస్తాడు.

రక్త పరీక్షలు

రక్త పరీక్షలో భాగంగా ఒక వైద్యుని కార్యాలయంలో లేదా ఒక కమర్షియల్ సౌకర్యం వున్న చోట మీ రక్తం తీసుకుంటారు  మరియు విశ్లేషణ కోసం నమూనాను ఒక ప్రయోగశాలకు పంపుతారు. రక్త పరీక్షలు  మధుమేహం, మూసుకుపోయిన రక్త నాళాలు, లేదా దీర్ఘకాల మూత్రపిండ వ్యాధి లాంటి ED యొక్క సంభావ్య కారణాలను చూపగలవు. మీ రక్తంలోని టెస్టోస్టెరోన్ యొక్క తక్కువ స్థాయిలు మీరు సెక్స్ లో ఎందుకు ఆసక్తి కోల్పోయినారు అనేది వివరించగలవు.

రాత్రివేళ అంగస్థంభన పరీక్ష

రాత్రిపూట అంగస్థంభన పరీక్ష సమయంలో, మీకు రాత్రిపూట అంగస్థంభనలు కలుగుతున్నాయో లేదో అని పరీక్షించడానికి మీరు మీ పురుషాంగం చుట్టూ ఒక ప్లాస్టిక్ బ్యాండ్ ను ధరిస్తారు. మీ పురుషాంగం పెద్దదైతే ఆ బ్యాండ్ సులభంగా విచ్ఛిన్నం అవుతుంది. ఈ పరీక్ష రాత్రి పూట మీకు కనీసం ఒక అంగస్థంభన కలిగినా    చూపిస్తుంది. మరో పరీక్ష ఎన్ని సార్లు అంగస్థంభన కలిగింది, ఎంత సేపు వుండినది, ఎంత గట్టిపడింది అనేది నమోదు చేయగల ఒక ఎలక్ట్రానిక్ పరికరంను ఉపయోగిస్తుంది. ఒక వ్యక్తి నిద్రిస్తుండగా సాధారణంగా మూడు నుంచి ఐదు అంగస్థంభనలు కలుగుతాయి. ఒక వేళ మీకు అంగస్థంభన కలిగితే అది బహుశా మీ ED మానసిక ఆరోగ్య సమస్య అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అని అర్థం. ఒక వేళ మీకు ఈ అంగస్థంభనలు లేకపోతే బహుశా మీకు నరం దెబ్బతిని వుంటుంది లేక మీ పురుషాంగంలోకి పేలవమైన రక్త ప్రవాహం వుంటుంది. మీ ఇంటిలో లేదా ప్రత్యేక నిద్ర ల్యాబ్లో మీరు ఈ పరీక్ష చేసుకోవచ్చు.

ఇంజెక్షన్ పరీక్ష

ఒక ఇంజెక్షన్ పరీక్ష సందర్భంగా, వైద్యుడు అంగస్థంభన కలిగించడానికి ఒక మందును మీ పురుషాంగంలోకి ఎక్కిస్తాడు. ఒక వేళ అంగస్థంభన గట్టిగా లేకపోతే లేదా ఎక్కువ సేపు కొనసాగకపోతే, దాని అర్థం మీకు రక్త ప్రవాహంతో సమస్య ఉండవచ్చు. ఈ పరీక్ష తరచుగా వైద్యుని కార్యాలయంలో జరుగుతుంది.

డాప్లర్ పెనైల్ అల్ట్రాసౌండ్

ఒక X- రే టెక్నీషియన్ డాప్లర్ పెనైల్ అల్ట్రాసౌండ్ ను తరచుగా ఒక వైద్యుని కార్యాలయంలో లేదా ఒక ఔట్ పేషెంట్ సెంటర్ లో చేస్తాడు. డాప్లర్ పెనైల్ అల్ట్రాసౌండ్ చేసే సమయంలో, ఎక్స్-రే టెక్నీషియన్, లేదా మీ పురుషాంగంలోని రక్త నాళాల యొక్క చిత్రాలు సృష్టించడానికి వైద్యుడు మీ పురుషాంగం గుండా లోనికి ఒక పరికరం తేలికగా ప్రవేశపెడతాడు. అంగస్థంభన కలిగించడానికి ఒక ఇంజెక్షన్ ను ఉపయోగిస్తారు. ఒకవేళ మీకు రక్త ప్రవాహ సమస్య ఉంటే ఆ చిత్రాలు చూపగలవు. ఆ చిత్రాలు ఒక కంప్యూటర్ తెరపై కనిపిస్తాయి. రేఖా చిత్రాల వైద్యంలో నిపుణుడైన ఒక రేడియాలజిస్టు సంభావ్య సమస్యలను కనుగొనేందుకు ఆ చిత్రాలను చూస్తారు.

అంగస్ధంభన లోపం నకు ఎలా చికిత్స చేస్తారు?

మీ వైద్యుడు మీకు ED కోసం అనేక చికిత్సలు అందించవచ్చు. అనేక మంది పురుషుల కొరకు సమాధానం అనేది పిల్ తీసుకునేంత సులభమైనది. ఇతర పురుషులు వారికి పనిచేసే ఒక వైద్యాన్ని కనుగొనేముందు వారు రెండు లేదా మూడు ఎంపికలను ప్రయత్నించాల్సి ఉంటుంది. మొదటి చికిత్స పని చేయకపోతే విడిచి పెట్టవద్దు. సరైన చికిత్సను కనుగొనటానికి సమయం పట్టవచ్చు. దంపతులుగా మీకు ఏ వైద్యం బాగా సరిపోతుందో అనే దాని గురించి మీ లైంగిక భాగస్వామితో మాట్లాడలసి ఉండవచ్చు.

ఒక వైద్యుడు ED కి ఈ క్రింది వాటి ద్వారా చికిత్స చేయవచ్చు

 • మీ ED యొక్క కారణం నకు చికిత్స చేయడం:
 • జీవనశైలి మార్పులు
 • మీ ఇతర ఆరోగ్య సమస్యల చికిత్సకు తీసుకునే మందులను మార్చడం
 • కౌన్సిలింగ్
 • మీ ED కు చికిత్స చేయడానికి మందులు సూచించడం
 • నోటి ద్వారా తీసుకునే మందు
 • ఇతర రూపాల మందులు
 • ఒక వాక్యూమ్ పరికరంను సూచించడం
 • శస్త్రచికిత్స చేయడం
 • ఇంప్లాంట్ చేయబడిన (అమర్చబడిన) పరికరాలు
 • రక్త నాళాలను సరిచేయటానికి శస్త్ర చికిత్స

మీ అంగస్థంభన లోపం యొక్కకారణంనకు చికిత్స చేయడం

మీ ED వలన కలిగే ఏవైనా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడం మొదటి అడుగు. చికిత్స చేయని మధుమేహం లేదా అధిక రక్తపోటు మీ ED యొక్క కారణంలో భాగంగా ఉండవచ్చు.

జీవనశైలి మార్పులు. కొంత మంది పురుషులకు, ఈ క్రింది జీవనశైలి మార్పులు సహాయ పడుతాయి:

 • ధూమపానం మానివేయడం
 • తక్కువ మద్యం తాగడం
 • శారీరక శ్రమను పెంచడం
 • అక్రమ మాదకద్రవ్య వినియోగం ఆపడం

ఇతర ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మీరు తీసుకునే మందులలో మార్పు.  ఓవర్ ది కౌంటర్ మందుల తో సహా మీరు తీసుకుంటున్నఅన్ని మందుల గురించి మీ వైద్యునితో మాట్లాడండి. వైద్యుడు మీరు తీసుకుంటున్న ఒక మందు మీ ED కి కారణమని కనుగొనవచ్చు. మీ వైద్యుడు వేరే విధంగా పనిచేసే మరొక మందును మీకు ఇవ్వగలగవచ్చు, లేదా మీ వైద్యుడు తక్కువ మోతాదు యొక్క మందును ప్రయత్నించమని మీకు చెప్పవచ్చు.

కౌన్సిలింగ్. దంపతుల ED యొక్క భావపూరిత ప్రభావాలను ఎదుర్కోవటానికి కౌన్సిలింగ్ సహాయపడ గలదు. కొంతమంది దంపతులు కౌన్సిలింగ్ వారి సంబంధాలను శక్తివంతం చేయడం ద్వారా వైద్య చికిత్సను ఇనుమడింపచేస్తుంది అని కనుగొంటారు.

మీ అంగస్థంభన లోపం నకు చికిత్స చేయుటకు మందులు సూచించడం

మీ వైద్యుడు మీకు ఏ మందు ఇస్తాడు అనేదాని మీద ఆధారపడి, మీరు దానిని నోటి ద్వారా లేదా మీ పురుషాంగంలోకి నేరుగా పెట్టటం ద్వారా తీసుకోవచ్చు.

నోటి ద్వారా తీసుకునే మందు. ED కి  చికిత్స చేయడానికి మీ వైద్యుడు ఒక పిల్ ను సూచించవచ్చు. సాధారణ మందులలో ఇవి ఉంటాయి

 • సిల్ దేనాఫిల్ (వయాగ్రా)
 • వర్డెనఫిల్ (లెవిట్రా, స్టాక్షిన్)
 • తడలఫిల్ (స్యాలిస్)
 • అవనఫిల్ (స్టెన్ డ్రా)

మీ ఆరోగ్యం సాధారణంగా  బాగా ఉంటే, మీ వైద్యుడు ఈ మందులలో ఒకటి నిర్దేశించవచ్చు. మీరు ఏవైనా నైట్రేట్, ఒక రకమైన గుండె మందు తీసుకుంటే, ED వైద్యానికి మీరు ఈ పిల్స్ లలో దేనిని తీసుకోవద్దు.  అన్ని ED పిల్స్ పురుషాంగానికి రక్త ప్రవాహం పెంచడం ద్వారా పని చేస్తాయి. అవి ఆటోమేటిక్ అంగస్తంభనలకు కారణం కావు.  ఎప్పుడు పిల్ తీసుకోవాలో అనే దాని గురించి మీ వైద్యుడితో మాట్లాడండి. పిల్ ప్రభావం ఎంత త్వరగా చూపుతుందని కనుగొనేందుకు మీరు ప్రయోగం చేయవలసిన అవసరం ఉండవచ్చు.

మందు యొక్క ఇతర రూపాలు. అందరు పురుషులకు ఒక పిల్ ను తీసుకోవడం పనిచేయదు. మీరు మీ పురుషాంగంలోకి నేరుగా వెళ్ళే మందును ఉపయోగించవలసిన అవసరం ఉండవచ్చు.  మీరు మీ పురుషాంగం యొక్క షాఫ్ట్ లోకి ఒక ఇంజక్షన్ ను ఉపయోగించవచ్చు, లేదా మీరు మీ పురుషాంగం యొక్క మూత్ర నాళం కొన వద్ద వుంచబడే మందును ఉపయోగించవచ్చు. మూత్ర నాళం మూత్రాన్ని మరియు వీర్యాన్ని శరీరం నుండి బయటకు తీసుకొనిపోయే ఒక గొట్టం. మీ వైద్యుడు మందులను ఏవిధంగా ఉపయోగించాలో మీకు చెప్పుతాడు. అవి చాలా తరచుగా నిముషాలల్లో ఒక అంగస్థంభనకు కారణమవుతాయి. ఒక వేళ ఇతర వైద్యం విఫలమైనా కూడా, ఈ మందులు విజయవంతం కాగలవు.

ఒక వాక్యూమ్ పరికరం ను సూచించడం

అంగస్థంభన సృష్టించడానికి మరొక మార్గం ప్రత్యేకంగా రూపొందించిన ఒక వాక్యూమ్ ట్యూబ్ గల ఒక పరికరాన్ని ఉపయోగించడం. మీరు ఒక పంపుకు అనుసంధానించబడిన ట్యూబ్ లోకి పురుషాంగంను పెడతారు. ట్యూబ్ నుండి గాలి బయటకు సరఫరా అయినప్పుడు, రక్తం మీ పురుషాంగంలోకి ప్రవహించి దానిని పెద్దగా మరియు గట్టిగా చేస్తుంది. అప్పుడు మీరు రక్తం తిరిగి మీ శరీరంలోకి పోనిస్తూ వుంచడానికి, మీరు ప్రత్యేకంగా రూపొందించిన ఎలాస్టిక్ రింగ్ ను ట్యూబ్ చివర నుండి మీ పురుషాంగం యొక్క మొదలుకు జరుపుతారు.వాక్యూమ్ పరికరంను ఉపయోగించడానికి కొంత సాధన అవసరం అని మీరు గుర్తించవచ్చు.

శస్త్రచికిత్స ను నిర్వహించడం

ఒక వేళ ఇతర ఎంపికలు విఫలమైతే, మీ ED కు చికిత్స చేయడానికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు.

అమర్చబడిన పరికరాలు. అంగస్తంభన సృష్టించడానికి యురాలజిస్ట్ ద్రవంతో నింపబడిన ఒక పరికరం లేదా వంగగల కడ్డీలు గల ఒక పరికరంను పురుషాంగం లోపల పెట్టుతారు. ఒక రకమైన ఇంప్లాంట్ ద్రవంతో బెలూన్ మాదిరి నింపబడిన రెండు సిలిండర్లు ను వుపయోగిస్తుంది. ట్యూబులు సిలిండర్లను  ద్రవంను కలిగిఉండే ఒక చిన్న బంతికి కలుపుతాయి.  మీరు మీ వృషణాల ముందు ఉన్న, స్క్రోటమ్ చర్మం కింద యూరాలజిస్ట్ ఉంచిన ఒక చిన్న పంపును గట్టిగా నొక్కడం ద్వారా సిలిండర్లను నింపుతారు. పంపు మీ పురుషాంగంలోని రెండు సిలిండర్లలోకి ద్రవం ప్రవహించడానికి కారణమై,దానిని గట్టిగా చేస్తుంది. ఆ ద్రవం పురుషాంగంను కొంచెం పొడవుగా మరియు వెడల్పుగా చేయవచ్చు. వంచగల రాడ్లకు బదులుగా ద్రవాలను ఉపయోగించే ఒక ఇంప్లాంట్, ఉపయోగంలో లేనప్పుడు పురుషాంగంను మరింత సహజ స్థితిలో ఉంచుతుంది.

యూరాలజిస్ట్ శస్త్ర చికిత్స సమయంలో చాలా తరచుగా వంగే రెండు రాడ్లను  మీ పురుషాంగంలో ప్రక్క ప్రక్కన ప్రవేశ పెట్టుతాడు.  మీ పురుషాంగంను చక్కగా చేయడానికి రాడ్స్ ను సరైన స్థానంలో సర్దుబాటు చేయడానికి మీ చేతులు ఉపయోగిస్తారు.  మీ పురుషాంగం పెద్దగా కాదు. సెక్స్ తర్వాత, మీరు రాడ్లను వంచుతారు.

అమర్చబడిన పరికరాలు శృంగారంలో అనుభూతిని ప్రభావితం చేయలేవు లేదా ఉద్వేగ సామర్థ్యంను  ప్రభావితం చేయవు.

మీరు ఒక అమర్చబడిన పరికరంను కలిగి ఉన్న తరువాత, ప్రతిసారీ అంగస్థంభనకు మీరు ఖచ్చితంగా ఒక పరికరంను ఉపయోగించాలి. ఒక అమర్చబడిన పరికరంను కలిగి ఉండడం యొక్క లాభాలు మరియు నష్టాల గురించి మీ వైద్యుడితో మాట్లాడండి.

రక్త నాళాలను సరిచేయడానికి శస్త్రచికిత్స. వైద్యులు ED యొక్క కొన్ని కేసులలో పురుషాంగంనకు రక్తం తీసుకొని పోవు రక్త నాళాలను సరిచేయడానికి చేసే శస్త్రచికిత్సతో  చికిత్స చేస్తారు. ఈ రకమైన శస్త్రచికిత్స 30 కంటే తక్కువ వయస్సున్న పురుషుల్లో పనిచేసే అవకాశం ఎక్కువ గా ఉంది.

నేను అంగస్ధంభన లోపంను ఎలా నిరోధించవచ్చు?

మీరు ఆరోగ్య జీవనశైలి ఎంపికలు చేయడం ద్వారా ED యొక్క అనేక కారణాలను నిరోధించవచ్చు. ఒక ఆరోగ్యకరమైన డైట్ ను అనుసరించడం అనేది ED ని నిరోధించడానికి సహాయపడవచ్చు. ధూమపానం మానివేయడం మరియు శారీరక శ్రమ పొందడం కూడా ED ని నిరోధించడానికి ముఖ్యమైన విధానాలు.

శారీరక శ్రమ అనేది మీ పురుషాంగంతో సహా, మీ శరీరం అంతటా రక్తం ప్రవాహంను పెంచుతుంది. కొత్త కార్యకలాపాలు ప్రారంభించటానికి ముందు మీ వైద్యునితో మాట్లాడండి.  మీరు చురుకుగా ఉండకపోతే, సాధారణ పేస్ వద్ద నడవడం లేదా గార్డెనింగ్ వంటి సులభమైన పనులతో నెమ్మదిగా మొదలు పెట్టండి. అప్పుడు మీరు బ్రిస్క్లీ వాకింగ్ లేదా ఈత వంటి కష్టతరమైన కార్యకలాపాలు చేయవచ్చు. వారంలో చాలా రోజులు కనీసం 30 నిమిషాల కార్యకలాపాలు లక్ష్యంగా పెట్టుకొనుటకు ప్రయత్నించండి.

 

తినడం,  డైట్, మరియు న్యూట్రిషన్

ED ని నివారించుటకు, మీరు ఒక ఆరోగ్యకరమైన ఆహారం, అనగా సంపూర్ణ ధాన్యం ఆహారాలు, పండ్లు మరియు కూరగాయలు, తక్కువ కొవ్వు పాలు, మరియు లీన్ మాంసాలు తినండి. మీకు అధిక బరువు మరియు గుండె మరియు రక్త నాళ వ్యాధికి కారణమయ్యే ఆహారం ED కి  కూడా దారితీయగలదు. మీరు కొవ్వు మరియు ఉప్పు యొక్క ప్రధాన భాగమైన సోడియం అధికంగా గల ఆహారాలు వదిలిపెట్టాలి.  ధూమపానం, అధికంగా మద్యం తాగడం, లేదా చట్ట సమ్మతం కాని మందులు ఉపయోగించడం కూడా  వదిలిపెట్టాలి.

గుర్తుంచుకోవలసిన పాయింట్లు

 • అంగస్తంభన లోపం అనేది మీరు అంగస్తంభన పొందలేకపోవడం లేదా సెక్స్ చేయటానికి తగినంత గట్టిగా అంగస్తంభనను ఉంచలేకపోవడం. మీకు ED వుండవచ్చు, ఒకవేళ మీరు
 • కొన్నిసార్లు అంగస్తంభన పొందగలిగితే, అయితే ప్రతీ సమయంలో కాదు
 • అంగస్తంభన పొందగలరు, అయితే అది సెక్స్ కోసం తగినంత ఎక్కువ సేపు వుండకపోతే
 • అస్సలు అంగస్తంభన పొందలేకపోతే
 • పురుషాంగంలోకి రక్తం ప్రవాహం పెరిగి, పురుషాంగంను పెద్దగా మరియు గట్టిగా చేసినప్పుడు అంగస్తంభన సంభవిస్తుంది. అంగస్తంభనను కలిగించడానికి హార్మోన్లు, రక్త నాళాలు, నరాలు మరియు కండరాలు అన్ని కలసి పనిచేస్తాయి.
 • ED (అంగస్తంభన లోపం) తరచుగా ఒకటి కంటే ఎక్కువ కారణాలను కలిగి ఉంటుంది. పలు వ్యాధులు నాడులు, ధమనులు, మరియు కండరములను దెబ్బతీయవచ్చు.
 • మీ ED యొక్క కారణం కనుగొనడానికి, మీ వైద్యుడు
 • మీ వైద్య మరియు లైంగిక చరిత్ర తీసుకోవచ్చు
 • మీ మానసిక ఆరోగ్యం గురించి ప్రశ్నలు అడగవచ్చు
 • మీకు ఒక శారీరక పరీక్ష చేయవచ్చు
 • మీకు రక్త పరీక్ష చేయవచ్చు
 • మీకు రాత్రిపూట అంగస్తంభన పరీక్ష చేయవచ్చు
 • ఒక ఇంజెక్షన్ పరీక్ష చేయవచ్చు
 • ఒక డాప్లర్ పెనైల్ అల్ట్రాసౌండ్ నిర్వహించవచ్చు
 • మీ వైద్యుడు మీకు ED కోసం అనేక చికిత్సలు అందించవచ్చు. అనేక మంది పురుషుల కొరకు సమాధానం అనేది పిల్ తీసుకునేంత సులభమైనది. ఇతర పురుషులు వారికి పనిచేసే ఒక వైద్యాన్ని కనుగొనేముందు వారు రెండు లేదా మూడు ఎంపికలను ప్రయత్నించాల్సి ఉంటుంది.
 • మీరు ఆరోగ్య జీవనశైలి ఎంపికలు చేయడం ద్వారా ED కారణాలు అనేకం నిరోధించవచ్చు. ఒక ఆరోగ్యకరమైన ఆహారం ఎంపిక ED ని నిరోధించడానికి సహాయపడవచ్చు. ధూమపానం మానివేయడం మరియు శారీరక శ్రమ పొందడం కూడా ED ని నిరోధించడానికి ముఖ్యమైన విధానాలు.

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు