నాకు మధుమేహం ఉంటే గర్భం కోసం సిద్ధమవడం గురించి నేను ఏమి తెలుసుకోవాలి

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456


పరిచయం

మీకు మధుమేహం ఉంటే, రక్తంలో చక్కెర అని కూడా పిలువబడే మీ రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించడానికి ఉత్తమ సమయం మీరు గర్భం పొందడానికి ముందు. అధిక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు గర్భం ధరించిన మొదటి వారాల్లో—మీరు గర్భవతి అని మీకు తెలియడానికి కంటే  కూడా ముందు—మీ బిడ్డకు హానికరం కావచ్చు. గర్భవతి అవ్వడానికి ప్రయత్నిస్తున్న స్త్రీల కోసం రక్తంలో గ్లూకోజ్ లక్ష్యాలు వేరుగా ఉంటాయి. లక్ష్యాలు అనేవి మీరు ప్రయత్నించే సంఖ్యలు.

గర్భధారణ మరియు కొత్త మాతృత్వం ఏ మహిళకైనా గొప్ప ఉత్సాహం మరియు మార్పు ఉండే సందర్భాలు. మీకు టైప్ 1 లేదా  టైప్ 2 మధుమేహం ఉండి మరియు త్వరలోనే గర్భవతి అవ్వడానికి ఆశిస్తూ ఉంటే, మీరు ఒక ఆరోగ్యకరమైన బిడ్డను కనడానికి ఏమి చేయాలి అని తెలుసుకోవచ్చు. మీరు మీ గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో, మరియు గర్భధారణ తరువాత మీ గురించి మరియు మీ మధుమేహం గురించి ఎలా శ్రద్ధ వహించాలి అని కూడా తెలుసుకోవచ్చు. మీకు మధుమేహం ఉండి మరియు ఇప్పటికే గర్భవతి అయితే, భయపడవద్దు! మీ గర్భధారణ సమయంలో మీ గురించి మరియు మీ మధుమేహం గురించి శ్రద్ధ వహించడానికి మీరు చెయ్యగల  ప్రతీదాన్ని మీరు చేస్తున్నారని మాత్రం నిర్ధారించుకోండి.

గర్భధారణ మధుమేహం ఉన్న మహిళల కొరకు

మీకు మధుమేహం ఉంటే, మీ గర్భధారణ అధిక ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది, అంటే మీకు మీ గర్భధారణ సమయంలో సమస్యల యొక్క అపాయం ఎక్కువగా ఉంటుంది. మీరు మీ ఆరోగ్య ం మీద ప్రత్యేక శ్రద్ద వహించవలసిన అవసరం ఉంది మరియు మీరు మధుమేహం లేదా దాని సమస్యలకు చికిత్స చేయడంలో నైపుణ్యం గల  వైద్యులను కలువవలసిన అవసరం ఉండవచ్చు. 35 కంటే ఎక్కువ వయస్సున్న మహిళలు లేదా ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను మోస్తున్న మహిళలలో వుండేటటువంటి లక్షలాది అధిక ప్రమాద గర్భాలు, తల్లి యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేయకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న పిల్లలను ఉత్పత్తి చేస్తాయి.

మీ బిడ్డ మరియు మీ గురించి  జాగ్రత్త తీసుకోవడం  

ఆరోగ్యంగా ఉండడానికి మరియు ఒక ఆరోగ్యకరమైన బిడ్డను కనడానికి, మీ గర్భధారణకు ముందు మరియు గర్భధారణ సమయంలో, మీ రక్తంలో గ్లూకోజ్ ను సాధ్యమైనంత వరకు సాధారణంకు దగ్గరగా ఉంచటం అనేది మీరు చెయ్యగల్గిన అతి ముఖ్యమైన విషయం. మీ ఆరోగ్య సంరక్షణ జట్టు మీరు మీ రక్తం గ్లూకోజ్ లక్ష్యాలను చేరుకోవడానికి భోజన ప్రణాళిక, శారీరక శ్రమ, మరియు మందులను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి సహాయం చేయవచ్చు. మీరు ఇద్దరు కలిసి, మీ గురించి మరియు మీ మధుమేహం గురించి జాగ్రత్త వహించడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తారు.

గర్భధారణ మీ శరీరంలో అనేక మార్పులను కలిగిస్తుంది, కాబట్టి మీరు మీ మధుమేహాన్ని నిర్వహించే విధానాన్ని మార్చవలసిన  అవసరం ఉండవచ్చు. మీరు సంవత్సరాల తరబడి మధుమేహం కలిగి ఉండినా కూడా, మీరు మీ భోజన ప్రణాళిక, శారీరక శ్రమ దినచర్య మరియు మందులను మార్చవలసిన అవసరం ఉండవచ్చు. మీరు మీ డెలివరీ తేదీకి దగ్గరగా వెళ్ళే కొద్దీ, మీ అవసరాలు మళ్ళీ మారవచ్చు.

మధుమేహం మిమ్మల్ని మరియు మీ బిడ్డను ఎలా ప్రభావితం చేయవచ్చు

గర్భధారణకు ముందు మరియు గర్భధారణ సమయంలో అధిక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు

 • కంటి సమస్యలు, గుండె వ్యాధి మరియు మూత్రపిండాల వ్యాధి వంటి మీ దీర్ఘకాల మధుమేహం సమస్యలను తీవ్రతరం చేయవచ్చు
 • మీ బిడ్డ కొరకు చాలా తొందరగా జన్మించుట, చాలా ఎక్కువ బరువు ఉండడం, పుట్టిన వెంటనే శ్వాస సమస్యలు లేదా తక్కువ రక్త గ్లూకోజ్ కలిగి ఉండడం, లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వంటి సమస్యల యొక్క అవకాశాన్ని పెంచవచ్చు
 • మీ బిడ్డ పుట్టుక లోపాలు కలిగి ఉండే ప్రమాదాన్ని పెంచవచ్చు
 • గర్భస్రావం, అంటే 20 వారాల కంటే ముందు బిడ్డను కోల్పోవడం లేదా నిర్జీవ జననం, అంటే 20 వారాల తర్వాత బిడ్డ గర్భంలో మరణించడం, ద్వారా మీ బిడ్డను కోల్పోయే ప్రమాదాన్ని పెంచవచ్చు

అయితే, మధుమేహ వ్యాధితో బాధపడుతున్న మహిళలు గర్భధారణకు ముందు మరియు గర్భధారణ సమయంలో రక్తం గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచినప్పుడు, పుట్టుక లోపాల యొక్క ప్రమాదం దాదాపు మధుమేహం లేని మహిళలకు జన్మించిన పిల్లల వలెనే ఉంటుంది అని పరిశోథనలు చూపించాయి.

మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటే, అప్పుడు మీ బిడ్డ కూడా చాలా ఎక్కువ గ్లూకోజ్ పొందుతాడు.

ఒక గర్భవతి అయిన స్త్రీ .యొక్క రక్తంలోని గ్లూకోజ్ ఆమె గుండా బిడ్డకు వెళుతుంది. మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయి గర్భధారణ సమయంలో చాలా ఎక్కువగా ఉంటే, జననం ముందు మీ బిడ్డ యొక్క గ్లూకోజ్ స్థాయి కూడా అలాగే ఉంటుంది. అయితే, డెలివరీ తర్వాత బిడ్డ యొక్క గ్లూకోజ్ స్థాయి త్వరగా పడిపోయి చాలా తక్కువకు వెళ్లవచ్చు.

మధుమేహం కలిగివుండటం ఈ క్రింది పరిస్థితులు అభివృద్ధి అయ్యే అవకాశాలను కూడా పెంచవచ్చు:

ప్రీఎక్లంప్సియా అనేది మీకు గర్భధారణ రెండవ భాగంలో మూత్రంలో అధిక రక్తపోటు మరియు చాలా ఎక్కువ ప్రోటీన్ అభివృద్ధి అయ్యే ఒక పరిస్థితి. ఈ పరిస్థితి మీకు మరియు మీ బిడ్డకు ప్రాణహాని కలిగించగల తీవ్రమైన సమస్యలను కలిగించవచ్చు. ప్రీఎక్లంప్సియా కొరకు ఏకైక నివారణ జన్మివ్వడమే. మీకు మీ గర్భధారణ చివరలో ప్రీఎక్లంప్సియా అభివృద్ధి అయితే మీరు ముందే మీ బిడ్డను ప్రసవించడానికి—ఒక సిజేరియన్ సెక్షన్ లేదా సి సెక్షన్ అని పిలువబడే—శస్త్రచికిత్స చేయించుకోవలసిన అవసరం ఉండవచ్చు. మీకు  ప్రీఎక్లంప్సియా ముందు అభివృద్ధి అయితే, డెలివరీ ముందు మీ బిడ్డ వీలయినంత అభివృద్ధి కావడానికి అనుమతించేందుకు మీకు బెడ్ రెస్ట్ మరియు మందులు అవసరం కావచ్చు లేదా మీరు ఆస్పత్రిలో చేరవలసిన అవసరం ఉండవచ్చు.

డిప్రెషన్ మీ మధుమేహంను నిర్వహించలేనంతగా మరియు మీ బిడ్డ గురించి జాగ్రత్త వహించలేనంతగా మీరు అలసిపోయేటట్లు చేయవచ్చు. మీ గర్భధారణ సమయంలో లేదా తరువాత మీకు ఆత్రుతగా, విచారంగా అనిపిస్తే లేదా మీరు ఎదుర్కొంటున్న మార్పులకు తట్టుకోలేకపోతే, మీ డాక్టర్ తో మాట్లాడండి. డిప్రెషన్ అనేది చికిత్స చేయగల ఒక వ్యాధి. మీ డాక్టర్ మీరు సహాయం మరియు మద్దతు పొందగల మార్గాలను సూచించగలడు.

మీ మధుమేహం, మీ గర్భధారణ ముందు మరియు మీ గర్భధారణ సమయంలో

మీకు తెలిసినట్టుగా, మధుమేహంలో రక్త గ్లూకోజ్ స్థాయిలు సాధారణంగా కంటే ఎక్కువగా ఉంటాయి. మీకు టైప్ 1 మధుమేహం అయినా లేదా టైప్ 2 మధుమేహం ఉన్నా, మీరు మీ రక్తం గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించవచ్చు మరియు ఆరోగ్య సమస్యల యొక్క ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

ఒక శిశువు యొక్క మెదడు, గుండె, మూత్రపిండాలు, మరియు ఊపిరితిత్తులు గర్భం ధరించిన మొదటి 8 వారాల్లో ఏర్పడతాయి. అధిక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ముఖ్యంగా ఈ ప్రారంభ దశలో హానికరమైనవి. ఇంకా అనేక మంది మహిళలు గర్భం ధరించిన 5 లేదా 6 వారాల తర్వాత వరకు వారు గర్భవతి అయినట్లు గుర్తించరు. మీ శిశువు యొక్క ఆరోగ్యాన్ని రక్షించడానికి, మీరు గర్భవతి అవ్వడానికి ముందు రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలోకి రావడానికి మీ ఆరోగ్య సంరక్షణ జట్టుతో పని చేయండి.

మీరు ఇప్పటికే గర్భవతి అయితే, మీ గురించి మరియు మీ బిడ్డ గురించి జాగ్రత్త వహించడానికి ఒక ప్రణాళికను తయారు చేయడానికి వీలైనంత త్వరగా మీ వైద్యుడిని కలవండి. మీ గర్భధారణలో కొంత కాలం తర్వాత మీరు గర్భవతి అయినట్లు తెలుసుకున్నా కూడా, ఇప్పటికీ మీరు మీ ఆరోగ్యం మరియు మీ బిడ్డ యొక్క ఆరోగ్యం కొరకు చాలా చేయవచ్చు.

ఒక ప్లానింగ్ చెక్ లిస్ట్ ను ఉపయోగించండి

మీ ఆరోగ్య సంరక్షణ జట్టు మీకు కష్టతరమైన పనులలో మీకు సహాయపడవచ్చు.

ముందుగా ప్లాన్ చేసుకోవడం

మీరు గర్భవతిగా అవ్వడానికి ముందు, ఒక బిడ్డను కనడం గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి. మీ డాక్టర్ మీరు మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు లక్ష్యంలో ఉన్నాయని నిర్థారించడానికి సహాయం చేయవచ్చు మరియు మీరు గర్భధారణ కోసం సిద్ధం అవ్వడానికి మీకు అవసరమైన రక్షణ మరియు సమాచారం ఇస్తాడు  .

మీరు గర్భవతి అవ్వటం గురించి ఆలోచిస్తూ ఉంటే, మీరు ఈ చర్యలను చేపట్టవచ్చు:

మీరు ప్రశ్నలు లేదా ఆందోళనలు ఉంటే మీ ఆరోగ్య సంరక్షణ జట్టుతో వాటిని చర్చించండి.

మీరు అధిక బరువు కలిగి ఉంటే, మీరు గర్భవతిగా అవ్వడానికి ముందు అదనపు బరువు కోల్పోవడం గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి.

మీరు గర్భధారణ కోసం సిద్ధంగా లేకపోతే, మీరు సిద్ధమయ్యే వరకు గర్భవతి కావడాన్ని ఎలా ఆలస్యం చేయడం  గురించి మీ డాక్టర్ తోమాట్లాడండి.

నా ఆరోగ్య పరిరక్షక టీం

మధుమేహము మరియు గర్బాధారణ లో నిపుణులు అయిన ఒక ఆరోగ్య పరిరక్షక టీం సభ్యులు క్రమము తప్పని  సందర్శము మీకు అత్యుత్తమ రక్షణ ఇస్తుంది. మీ ఆరోగ్య రక్షణ టీం లో వీరు ఉండవచ్చును.

 • ఒక డయబేటలజిస్ట్ లాంటి మధుమేహ సంరక్షణ లో నైపుణ్యం కలిగిన ఒక మెడికల్ డాక్టర్. మీకు గర్బాధారణ సమయములో మరియు మీ గర్బాధారణ తరువాత గ్లూకోజ్ కంట్రోల్ మోనిటరింగ్ మరియు సలహా అవసరము అవుతుంది.
 • మధుమేహము వున్న స్త్రీలను ట్రీట్ చేయడములో అనుభవము వున్న ఒక ప్రసూతి-గైనకాలజిస్ట్ లేక ఓబి/జి వై ఎన్ . మీ ప్రస్తుతము వున్న  గైనకాలజిస్ట్ ప్రసూతి చేయకపోయిన పక్షములో వారిని వేరొకరిని రెఫర్ చేయమని అడగండి. మీరు ఒక  పెరినాటోలోజిస్ట్ అని కూడా పిలువబడే మాతృ-పిండ సంబంధమైన వైద్య నిపుణుడుకు మీరు రెఫెర్ చేయబడవచ్చును. ఈ డాక్టర్లు అందరూ  ఎక్కువ ప్రమాద గర్భధారణ విషయములో జాగ్రత్తలు తీసుకోనడములో ప్రత్యేకమైన ట్రైనింగ్ పొందిన  ప్రసూతి-గైనకాలజిస్ట్ లు. మీరు పొందిన  ప్రసూతి-గైనకాలజిస్ట్ ను గర్బాధారణ సమయమంతా క్రమము తప్పకుండా వీరిని చూస్తారు.
 • ప్రినేటల్ సంరక్షణ మరియు మధుమేహం మేనేజింగ్ చేయడములో సలహా అందించే ఒక నర్సు అధ్యాపకుడు లేదా నర్స్ ప్రాక్టీషనర్.
 • ఆహార ప్రణాళికకు సహాయం చేయడానికి ఒక నమోదిత నిపుణుడు. ఒక ఆరోగ్యకరమైన ఆహారం – గ్లూకోజ్ నియంత్రణ మరియు పోషణ కొరకు  – ఇప్పుటి కంటే ఎన్నడూ ఎక్కువ ముఖ్యమైనది  కాదు. . “మీరు ఇద్దరి కొరకు తింటూన్నారు” అనే పదబంధం ఆహార ఎంపికల గురించినంత ఎక్కువ  పరిమాణం గురించి కాదు.
 • దృష్టి సమస్యల కొరకు నేత్రవైద్యనిపుణులు మరియు ఆప్టోమెట్రిస్టులు, మూత్రపిండాల వ్యాధి కొరకు నేఫ్రాలజిస్ట్ లు, మరియు గుండె జబ్బుల కొరకు కార్డియాలజిస్ట్ లు వంటి మధుమేహ సంబంధిత సమస్యలను నిర్ధారించే మరియు చికిత్స చేసే నిపుణులు. మీరు ఇప్పటికే మధుమేహం నుండి సమస్యలు ఎదుర్కొంటుంటే, మీరు మీ గర్భం అంతటా ఆ పరిస్థితులు మానిటర్ చేయబడాలి.
 • మీరు ఒత్తిడి,ఆందోళన, మరియు గర్భం యొక్క అదనపు డిమాండ్లను భరించడములో మీకు సహాయ పడడానికి ఒక సామాజిక కార్యకర్త లేదా మనస్తత్వవేత్త . మీరు ఇప్పటికే  ఈ రకమైన మద్దతు  కలిగి ఉండవచ్చు, లేదా మీకు ఇది  అకస్మాత్తుగా అది అవసరం కావచ్చు. మీ యొక్క ఆందోళన పెరిగితే లేక మీరు క్రుంగిపోతే , మీ OB / GYN చెప్పండి. మీరు మీ గర్భధారణ సమయంలో లేదా మీ శిశువు జననం తర్వాత సమస్యలలో పనిచేయడంలో సహాయం అవసరం ఉంటే ఒక రిఫెరల్ కోసం అడగండి.
 • పిల్లల కోసం పట్టించుకొనే ఒక వైద్యుడు అయిన పీడియాట్రీషియన్. మీరు స్నేహితులను, కుటుంబము, లేక మీ ఆరోగ్య రక్షక టీమును సిఫార్సు కొరకు అడగవచ్చును. చాలా మంది పీడియాట్రీషియన్  లు వారి  సరికొత్త  పేషెంట్ లను వారు హాస్పిటల్ లో పుట్టిన వెంటనే కలుస్తారు.
 • నవజాత శిశువులు కోసం పట్టించుకొనే ఒక వైద్యుడు అయిన నియోనటాలజిస్ట్. మీ శిశువు కోసం ఆసుపత్రిలో అత్యవసర సంరక్షణ అవసరమవుతే పసికందుల కొరకు ఆసుపత్రి ఒక నియోనటాలజిస్ట్ ను కేటాయిస్తుంది.
 • తల్లిపాలు ఇవ్వడము లో సహాయం చేయడానికి శిక్షణ పొందిన లాక్టేషన్ కన్సల్టెంట్. ఆమె మీ శిశువు తల్లిపాలు ఇవ్వడము మొదలు పెట్టడములో మీకు సమాచారం మరియు సపోర్ట్ ఇస్తారు.

మీరు జట్టు యొక్క అతి ముఖ్యమైన సభ్యులు. మీ ఆరోగ్య సంరక్షణ జట్టు మీకు నిపుణత కలిగిన  సలహాను ఇస్తుంది, కానీ మీరు ప్రతి రోజు  మీ మధుమేహంను నియంత్రణలో ఉంచుకోవలసిన బాధ్యత మీకు  ఉంటుంది.

నా రక్తం గ్లూకోజ్ స్థాయిలు

గర్భం ముందు రోజువారీ రక్త  గ్లూకోస్ స్థాయిలు

మీరు గర్భవతి  అవ్వటం గురించి ఆలోచిస్తూ ఉంటే, మీరు ఒక శిశువు పొందుటకు సిద్ధం  కా వడానికి మీ రక్తంలో గ్లూకోజ్ లక్ష్యాలు  ఏ స్థాయిలో  ఉండాలి అనే దానిని గురించి మీ డాక్టర్ తో మాట్లాడoడి. మరియు మీరు ఒక రక్త గ్లూకోజ్ మీటర్ తో మీ రోజువారీ రక్త గ్లూకోజ్ స్థాయిలు తనిఖీ ఎంత తరచుగా చేయవలయుననో తెలుసుకోండి. మీరు ఇప్పటికే మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తనిఖీ చేసుకొంటూ ఉంటే,  మీరు ఇప్పుడు కంటే వాటిని మరింత  తనిఖీ చేసే అవసరం కావచ్చు.

కింది చార్టు  గర్భవతులు కావాలని ప్రణాళికాలు వేస్తున్న మధుమేహ మహిళలకు లక్ష్యం టార్గెట్ రక్త గ్లూకోజ్ సంఖ్యలు చూపిస్తుంది.

డయాబెటీస్ వుండి గర్భవతులు కావాలనుకున్న మహిళలకు టార్గెట్ బ్లడ్ గ్లూకోజ్ సంఖ్యలు (mg /dL)
భోజనం ముందు మరియు మీరు లేచినపుడు 80 to 110
తిన్నతరువాత 1 నుండి 2 గంటల తరువాత 100 to 155

 

గర్భధారణ సమయంలో రోజువారీ రక్తం గ్లూకోజ్ స్థాయిలు                

మీ గర్భధారణ సమయంలో, మీరు ఒక రక్త గ్లూకోజ్ మీటర్ ఉపయోగించి మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక రోజులో అనేక సార్లు తనిఖీ చేసుకొంటారు. చాలా మంది  వైద్యులు కనీసం ఒక రోజులో నాలుగు సార్లు పరీక్ష   చేసుకోమని సిఫార్సు చేస్తారు. మీరు మీ రక్తం గ్లూకోజ్ స్థాయిలు ఎప్పుడు తనిఖీ చేసికోనవలేనో అనే దానిని  గురించి మీరు మీ డాక్టర్ తో చర్చచేయండి.

మీ మీటరు నుంచి సరైన ఫలితాలు పొందడం ముఖ్యం. మీ మీటర్ ఉపయోగించడము  కోసం ఆదేశాలు అనుసరించండి మరియు మీ మీటర్ ను జాగ్రత్తగా ఉంచండి. ఒక పరీక్ష ఫలితం ఆఫ్ అని తెలిసినపుడు  మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయి మరల సరిచూడండి. మీకు మీ మీటరు లేదా మీ పరీక్ష ఫలితాలు ఉపయోగించ డం గురించి ప్రశ్నలు ఉంటే సహాయం కోసం మీ ఆరోగ్య సంరక్షణ జట్టును అడగండి.

చాలా గర్భిణీ స్త్రీలు కోసం అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ సిఫార్సు చేసిన రోజువారీ లక్ష్యం రక్త గ్లూకోజ్ సంఖ్యలు క్రింది పట్టికలో ఉన్నాయి.

గర్భిణీ అయిన డయాబెటిస్ మహిళలు కోసం టార్గెట్ బ్లడ్ గ్లూకోజ్ సంఖ్యలు (mg / dL)
భోజనం ముందు, నిద్రవేళలో, మరియు రాత్రిపూట 60 to 99
తిన్న 1 నుండి 2 గంటల తరువాత 100 to 129

మీ కోసం సరియిన లక్ష్యముల కొరకు మీ వైద్యుడిని సంప్రదించండి. మీ లక్ష్యాలను “నా టార్గెట్ బ్లడ్ గ్లూకోజ్ మరియు A1C సంఖ్యలు”లో వ్రాయండి.

మీరు మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను “నా డైలీ బ్లడ్ గ్లూకోజ్ రికార్డ్” ను ఉపయోగించి ట్రాక్ చేయవచ్చు. మీరు మీ రక్తం గ్లూకోజ్ తనిఖీ చేసిన ప్రతిసారీ ఫలితాలు వ్రాయండి. మీ రక్తంలో గ్లూకోజ్ రికార్డులు మీకు మరియు మీ ఆరోగ్య సంరక్షణ జట్టుకు మీ డయాబెటిస్ కేర్ ప్రణాళిక పనిచేస్తుందో  లేదో నిర్ణయించడానికి సహాయపడుతుంది. మీరు ఈ ఫారమును మీ ఇన్సులిన్ మరియు కీటోన్లని గురించి నోట్స్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చును.

A1C టెస్ట్

మీరు మీ లక్ష్యాలను చేరుకోన్నారా అని చూసుకోనడానికి  మరొక మార్గం ఒక A1C రక్త పరీక్ష చేయించుకొనడము.  A1C పరీక్ష ఫలితాలు గత 3 నెలల్లో మీ సగటు రక్త గ్లూకోజ్ స్థాయిలను ప్రతిబింబిస్తాయి. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ఇప్పుడు చాలా మంది మధుమేహం వున్న మహిళలు గర్భవతి అవడానికి ముందు మరియు గర్భధారణ సమయంలో, సాధారణంకు దగ్గరగా ఉండే A1C లక్ష్యంను—7 శాతం క్రింద , మరియు ఆదర్శంగా 6 శాతం క్రింద—లక్ష్యంగా ఉంచుకోవాలని సిఫారసు చేస్తుంది. మీ డాక్టర్ మీకు ఉత్తమమైన  ఒక A1C లక్ష్యంను  ఏర్పరచడములో మీకు సహాయము చేస్తారు.  మీ లక్ష్యం ను “నా టార్గెట్ బ్లడ్ గ్లూకోజ్ మరియు A1C సంఖ్యలు” క్రింద వ్రాయండి

తక్కువ రక్త  గ్లూకోజ్

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు, మీరు తక్కువ రక్త గ్లూకోజ్ ను కలిగి ఉండే పెరిగిన అపాయంతో వున్నారు దీనిని  హైపోగ్లైసెమియా అని కూడా అంటారు. రక్త గ్లూకోజ్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నప్పుడు, మీ శరీరం దానికి అవసరమైన శక్తిని పొందలేదు. హైపోగ్లైసెమియా అకస్మాత్తుగా జరిగినప్పటికీ, ఇది సాధారణంగా తక్కువ స్థాయిలో వుండి మరియు త్వరగా నయం చేయదగినది. కార్బోహైడ్రేట్లు కలిగిన  ఏదైనా తినడము లేక తాగడము అనేది—అనేక ఆహారాలలో కనిపించే చక్కెరలు మరియు పిండిపదార్ధాలు—మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయి తిరిగి సాధారణ స్థాయికి తీసుకొని రావచ్చును.  చికిత్స చేయని  హైపోగ్లైసెమియా మిమ్ములను సృహ తప్పేటట్టు  చేయవచ్చు.

తక్కువ బ్లడ్ గ్లూకోజ్ మీకు ఇవి కలుగచేయవచ్చు

 • ఆకలి
 • తలతిరగడము లేక వణకడము
 • అయోమయం
 • తెల్లపోవడము
 • మరింత చెమట పట్టడము
 • బలహీనం
 • ఆత్రుత లేదా చికాకు
 • తలనొప్పి
 • గుండె ఎక్కువగా కొట్టుకోనడము

తక్కువ బ్లడ్ గ్లూకోజ్ వీటి వలన కలుగవచ్చును

 • భోజనాలు లేదా అల్పాహారాలు చాలా తక్కువ పరిమాణములో తీసుకొనడము లేదా , ఆలస్యంగా తీసుకొనడము లేదా తీసుకొనడము దాటవేయడము
 • అధిక మోతాదులో ఉన్న ఇన్సులిన్
 • పెరిగిన శారీరక చర్య

తక్కువ బ్లడ్ గ్లూకోజ్ చాలా మద్య పానీయాలు తాగడం వలన కూడా  కలుగవచ్చును. అయితే, గర్భం పొందుటకు ప్రయత్నిస్తున్న మహిళలు లేదా ఇప్పటికే గర్భం పొందిన మహిళలు  ఆల్కాహాల్  తాగడము మానాలి.

తీవ్రమైన తక్కువ రక్త గ్లూకోజ్ కోసం గ్లూకాన్ వాడటము  

మీకు తీవ్రమైన తక్కువ రక్త గ్లూకోజ్ మరియు సృహ తప్పడం ఉంటే, మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని త్వరగా సాధారణ స్థాయికి తీసుకురావడానికి మీకు సహాయం అవసరం. మీ ఆరోగ్య సంరక్షణ జట్టు మీ కుటుంబ సభ్యులు మరియు మీ స్నేహితులకు వెంటనే రక్తం గ్లూకోజ్ స్థాయిలను పెంచే ఒక  గ్లుకాగాన్ ఇంజక్షన్ ఎలా ఇవ్వాలో నేర్పించగలరు. గ్లుకాగాన్ అందుబాటులో లేకపోతే, ఎవరైనా మిమ్మల్ని చికిత్స కోసం సమీప అత్యవసర గదికి తీసుకురావడానికి 85000 23456  కు కాల్ చేయాలి.

అధిక  రక్త గ్లూకోజ్

హైపర్గ్లైసీమియా అని కూడా పిలిచే అధిక రక్త గ్లూకోజ్ మీకు  తగినంత ఇన్సులిన్ లేకపోవడము లేదా మీ శరీరం సరిగ్గా ఇన్సులిన్ ఉపయోగించకపోవడము వలన సంభవిస్తుంది. అధిక రక్త గ్లూకోజ్ దీని వలన సంభవించవచ్చు

 • మీ మధుమేహం మందులు తీసుకోకపోవడం
 • సాధారణం కంటే ఎక్కువ ఆహారం తినడం
 • సాధారణం కంటే తక్కువ చురుకుగా ఉండటం
 • అనారోగ్యం
 • ఒత్తిడి

మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఇప్పటికే  ఎక్కువగా ఉంటే మరియు మీరు మీ రక్తం లేదా మూత్రంలో కీటోన్లు అనే రసాయనాలు కలిగి ఉంటే,  శారీరక శ్రమ మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఇంకా అధికం  చేయవచ్చును. అధిక రక్త గ్లూకోజ్ లక్షణాలలో ఇవి ఉంటాయి

 • తరచుగా మూత్రవిసర్జన చేయడము
 • దాహం
 • బరువు తగ్గడము

మీ రక్తంలో గ్లూకోజ్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏమి చేయాలో అనే దానిని  గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి. మీ డాక్టర్ మీ ఇన్సులిన్ మార్పులు, భోజనం ప్రణాళిక, లేదా శారీరక శ్రమ దినచర్యలో మార్పులు సూచించవచ్చు.

నా కీటోన్ స్థాయిలు

మీ రక్తంలో గ్లూకోజ్ చాలా అధికముగా వున్నప్పుడు లేదా మీరు చాలినంత తిననపుడు, మీ శరీరము కీటోన్లను తయారు చేయవచ్చును. మీ మూత్రము లేక రక్తములో కీటోన్లు అనగా మీ శరీరము శక్తి కొరకు గ్లూకోజ్ కు బదులుగా కొవ్వును వాడుతుంది అని అర్థము.  మీ దగ్గర తగినంత ఇన్సులిన్ లేకపొతే లేదా మీరు ఆహారము నుండి తగినంత గ్లూకోజ్ పొందలేని పక్షములో మీ శరీరము శక్తి కొరకు గ్లూకోజ్ ను వాడలేదు, అందువలన అది బదులుగా కొవ్వును వాడుతున్నది. గ్లూకోజ్ కు బదులుగా కొవ్వు వాడకము మీ ఆరోగ్యమునకు మరియు మీ బిడ్డ ఆరోగ్యమునకు  హాని కావచ్చు. ప్రమాదకరమైన  కీటోన్లు మీ నుండి మీ శిశువు లోనికి ప్రవేశించ వచ్చును. మీ ఆరోగ్య సంరక్షక టీం మీరు ఎపుడు మరియు ఏవిధంగా  కీటోన్ల కొరకు రక్త మరియు మూత్ర పరీక్ష చేయించుకొనవలయుననో మీకు బోధించగలరు.

కీటోన్లు మీ శరీరములో పెరుగుతే, మీకు  కీటోసిస్ అనే స్థితి అబివృద్ధి కావచ్చును.  కీటోసిస్ త్వరగా ప్రాణహాని కలిగించగల డైయాబేటిక్ కేటోఅసిడోసిస్ గా మార్పు చెందవచ్చు. కేటోఅసిడోసిస్ యొక్క లక్షణాలు క్రింది విధంగా వుంటాయి

 • కడుపు నొప్పి
 • వికారం మరియు వాంతులు
 • ఒక రోజు లేదా ఎక్కువ రోజులు తరుచుగా మూత్రవిసర్జన చేయటము  లేదా తరచుగా దాహంగా ఉండటము
 • అలసట
 • కండరాలు గట్టిగా లేదా బాధాకరంగా మారడము
 • ఆలోచించలేక పోయినట్లుగా అనిపించడం లేదా షాక్ లో ఉండటము
 • వేగవంతమైన, లోతైన శ్వాస
 • పండ్ల వాసన గల  శ్వాస

మీ మూత్ర లేదా రక్త కీటోన్ స్థాయిలు తనిఖీ చేయడము

మీ డాక్టర్ కీటోన్ల కొరకు మీ మూత్రం లేదా రక్తంను ప్రతీరోజు  లేదా మీ రక్తంలో గ్లూకోజ్ 200 mg / dLవంటి ఒక నిర్దిష్ట స్థాయి పైన ఉన్నప్పుడు,  పరీక్ష  చేయించుకోనమని  మిమ్ములను సిఫార్సు  చేయవచ్చు. మీరు ఒక ఇన్సులిన్ పంప్ ఉపయోగిస్తే, మీ డాక్టర్ మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయి అనుకోకుండా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు కీటోన్ల కోసం పరీక్ష చేసుకోనమని సిఫార్సు చేయవచ్చు.

మీరు సిఫార్సు చేయబడిన ప్రకారం కీటోన్లని కోసం పరీక్ష చేసుకోనడము ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు నిరోధించవచ్చు. మీరు కీటోన్లని కలిగి ఉంటే ఏమి చేయాలనేదానిని గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి. మీరు తీసుకొనబోయే ఇన్సులిన్ లేదా మీరు తీసుకొంటున్న ఇన్సులిన్ పరిమాణములో మార్పులు చేయమని మీ డాక్టర్ సూచించవచ్చు.

నా వైద్య పరీక్షలు

మీ మధుమేహ సంబంధిత ఆరోగ్య సమస్యలు మీ గర్భమును ప్రభావితం చేయవచ్చు. మరియు గర్భం కొన్ని మధుమేహ ఆరోగ్య సమస్యలను మరింత దిగజార్చ గలవు. మీ డాక్టర్  మీ గర్భము  మీకు వున్న మునుపటి లేదా కొనసాగుతున్న సమస్యలను ఎలా ప్రభావితం చేస్తాయి అనేదానిని  గురించి మీతో మాట్లాడగలడు. మీరు కావలసినంత ముందుగానే ఈ సమస్యలను పరిష్కరించుకుంటే, మీరు గర్భము  పొందుటకు ముందు, కంటి సమస్యలకు లేజర్ చికిత్స వంటి చికిత్సల  కోసం ఏర్పాటు చేయడానికి మీరు  మీ వైద్యునితో కలసి పనిచేయడానికి నిర్ణయించుకోవచ్చు.

మీరు గర్భవతి అవ్వడానికి ముందు, ఈ క్రింది వాటి గురించి మీ వైద్యునితో  మాట్లాడండి

 • మీ టీకాలు -వ్యాధులు ఆపటానికి సహాయపడే షాట్లు-నవీనముగా ఉన్నాయా
 • మీ యోనిలోకి తెరుచుకునే గర్భాశయం యొక్క దిగువ భాగమైన మీ సెర్విక్స్ యొక్క కణాలలోని మార్పులను తనిఖీ చేయడానికి పాప్ పరీక్ష చేసికోనడము
 • సుఖ వ్యాధులు మరియు HIV కోసం పరీక్ష చేసుకోనడము

మీరు గర్భవతి కాకముందే  లేక గర్భవతి అయిన మొదట్లో  పూర్తి చెక్ అప్ చేసికొనవలయును. మీ డాక్టరు వీటి కొరకు తనిఖీ చేయాలి

 • హైపర్ టెన్షన్ అని కూడా పిలువబడే అధిక రక్తపోటు
 • డయాబెటిక్ రెటినోపతీ అని కూడా  పిలువబడే కంటి వ్యాధి,
 • కార్డియోవాస్క్యులర్ వ్యాధి అని కూడా పిలువబడే గుండె మరియు రక్త నాళ వ్యాధి
 • డయాబెటిక్ న్యూరోపతి అని కూడా పిలువబడే నరాల నష్టం
 • డయాబెటిక్ నెఫ్రోపతీ అని కూడా పిలువబడే మూత్రపిండాల వ్యాధి,
 • థైరాయిడ్ వ్యాధి

అలాగే, మీ డాక్టర్ కు వీటి  గురించి తెలియజేయండి

 • ముందు గర్భాలు
 • మీ యొక్క లేదా మీ భాగస్వామి యొక్క కుటుంబ ఆరోగ్య  సమస్యలు
 • గృహహింస లేదా మద్దతు లేకపోవడం వంటి మీ యొక్క మరియు శిశువు యొక్క భద్రతను బాధించే కుటుంబ లేదా సాంఘిక పరిస్థితులు
 • సరిగా తినలేకపోవటము లేక క్రుంగి పోవటము లాంటి  ఇతర ఆరోగ్య సమస్యలు

మీరు మీ గర్భం అంతటా సాధారణ చెక్ అప్ లు  కూడా పొందుతారు. ఈ సందర్శనల సమయంలో, మీ ఆరోగ్య సంరక్షణ జట్టు మీ రక్తపోటు మరియు A1C స్థాయిలు తనిఖీ చేస్తుంది మరియు మీ మూత్రంలో ప్రోటీన్ ను మానిటర్ చేస్తుంది.

ధూమపానం

ధూమపానం మీరు ఒక నిర్జీవ శిశువు లేదా చాలా ముందుగానే పుట్టిన శిశువుకు జన్మనిచ్చే మీ అవకాశంను పెంచవచ్చు. ధూమపానం మధుమేహం ఉన్న వారిలో ముఖ్యంగా హానికరమైనది.  ధూమపానం కంటి వ్యాధి, గుండె వ్యాధి, కిడ్నీ వ్యాధి, మరియు అంగచ్ఛేదం వంటి మధుమేహ సంబంధిత ఆరోగ్య సమస్యలను పెంచవచ్చు. మీరు ధూమపానము చేస్తూ వుంటే దానిని ఎలా వదలుకోవాలో అనే దాని గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి.

తినడము,  డైట్,మరియు న్యూట్రిషన్

మీరు గర్భము కొరకు సిద్ధం కావడములోను మరియు గర్భధారణ సమయములోను మీకు  ఒక ఆరోగ్యకరమైన ఆహారం ప్రణాళిక ముఖ్యం. ఒక ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక మీరు మీ రక్త గ్లూకోజ్ స్థాయిలు మరియు బరువు నిర్వహించడానికి సహాయపడుతుంది.

మీరు ఇప్పటికే ఒక డైటీషియన్ ను కలవకపోతే, మీరు గర్భం  పొందుటకు ముందు ఒకరిని  కలవడం మొదలు     పెట్టాలి. మీ డైటీషియన్  మీరు ఒక ఆరోగ్యకరమైన బరువుకు చేరుకోనడానికి లేదా నిర్వహించడానికి ఏమి తినాలి, యెంత తినాలి, ఎప్పుడు తినాలి అనునది నేర్చుకోనడములో మీకు సహాయము చేస్తారు. ఈ అలవాట్లు  మీ యొక్క మరియు మీ బిడ్డ యొక్క భవిష్యత్తు తెలుసుకోవడానికి ముఖ్యమైనవి.   మీరు మరియు మీ ఆహార నిపుణుడు కలిసి మీ అవసరాలు, సాధారణ షెడ్యూల్, ఆహార ప్రాధాన్యతలు , వైద్య పరిస్థితులు, మందులు, మరియు శారీరక శ్రమ దినచర్యకు అనుకూలంగా ఉండే ఒక ఆరోగ్యకరమైన ఆహార  ప్రణాళిక తయారు చేస్తారు.

గర్భధారణ సమయంలో, అనేక స్త్రీలకు అదనపు కేలరీలు మరియు ప్రోటీన్ లాంటి వారి ఆహారంలో మార్పులు, అవసరం. మీరు మీ గర్భధారణ సమయంలో ప్రతి కొన్ని నెలలకు మీ ఆహార నిపుణుని  కలువవలసిన అవసరం ఉండవచ్చు. ఒక సమతుల్య ఆహారం తినడం అనేది మీరు మరియు మీ శిశువు ఆరోగ్యంగా ఉండేలా చూడడానికి సహాయపడుతుంది.

ఎంత తినాలి

ప్రతి భోజనమునకు మరియు స్నాక్స్ కు ఎన్ని సర్వింగులు తీసుకోనవలయును అనే విషయము గురించి మీ ఆహార నిపుణునితో మాట్లాడండి.  మీ ఆహార నిపుణుడు పోర్షన్ సైజుల గురించి కూడా మీకు సలహాలు ఇవ్వగలడు.

మీరు ఒకసారి గర్భవతి అయిన తరువాత మీ ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక అనేది మీకు గర్భము కొరకు ఎన్ని కేలరీలు అవసరము మరియు గర్బాధారణ సమయములో బరువు పెరగడానికి మీ లక్ష్యాలు ఏవి అన్న దానిపై ఆధార పడివుంటుంది.  గర్భధారణ సమయములో మీరు సరియిన బరువు మొత్తమును పొందడానికి మీ ఆరోగ్య సంరక్షణ టీం తో కలసి పనిచేయండి. గర్భధారణ సమయములో మీ బరువు పెరుగుదల గర్భధారణ కంటే ముందు మీరు వున్న బరువు పై ఆధారపడి వుంటుంది:

 • గర్భధారణ కంటే ముందు బరువు తక్కువ వున్న మహిళలు 15 నుండి 20 కిలోల వరకు బరువు పెరగాలి
 • గర్భధారణ కంటే ముందు సాధారణ బరువు వున్న మహిళలు 10 నుండి 15 కిలోల వరకు బరువు పెరగాలి
 • గర్భధారణ కంటే ముందు ఎక్కువ బరువు వున్న మహిళలు 8 నుండి 12 కిలోల వరకు బరువు పెరగాలి
 • గర్భధారణ కంటే ముందు స్థూలకాయము వున్న మహిళలు 5 నుండి 10 కిలోల వరకు బరువు పెరగాలి

అయినప్పటికీ, మీ డాక్టర్ మీకు కొద్దిగా విభిన్నమైన బరువు పెరుగుదల లక్ష్యం ను సిఫార్సు చేయవచ్చు .

గర్బదారణకు ముందు  మీరు తక్కువ బరువు, సాధారణమైన బరువు, అధిక బరువు లేక స్థూలకాయము కలిగి ఉన్నారా అని  తెలుసుకొనుటకు మీరు మీ బాడీ  మాస్ ఇండెక్స్ ( BMI) నెంబరును తెలుసుకొనవలసిన అవసరం ఉంది.

విటమిన్ మరియు మినరల్ సప్లిమెంట్స్

మీరు గర్భధారణ ముందు మరియు గర్భధారణ సమయంలోఒక విటమిన్ మరియు మినరల్ సప్లిమెంట్ తీసుకోవాలసిన అవసరం ఉందా అని మీ డాక్టర్ మీకు చెప్తాడు. వారి ఆహారం ఈ కింది ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలను తగినంత సరఫరా చేయదు కాబట్టి అనేక మంది గర్భిణీ స్త్రీలకు సప్లిమెంట్లు అవసరమవుతాయి:

 • ఐరన్ – గర్భము కొరకు అదనంగా రక్తము చేయుటకు మరియు శిశువు యొక్క ఐరన్ సరఫరా కొరకు
 • ఫోలిక్ ఆసిడ్ – బ్రెయిన్ లోను మరియు వెన్నెముకలోనూ పుట్టుక సమస్యల నివారణకు
 • కాల్షియం – గట్టి ఎముకల నిర్మాణమునకు

ఫోలిక్ ఆసిడ్  ఒక ముఖ్యమైన విటమిన్  మరియు దీని మీరు గర్భమునకు ముందు తరువాత తీసుకొనడము వలన మీ శిశువు యొక్క ఆరోగ్యము కాపాడబడుతుంది. మీరు గర్భము దాల్చక ఒక నెల ముందే ఫోలిక్ ఆసిడ్ సప్లిమెంట్ ను తీసుకొనడము ప్రారంభించవలసిన అవసరము వున్నది. గర్భము పొందే చాలా మంది మహిళలు 400 మైక్రో గ్రాములు ఫోలిక్ ఆసిడ్ కల  ఒక మల్టీ విటమిన్ లేక సప్లిమెంట్ ను తప్పక తీసుకొనవలసి వుంటుంది.  మీరు ఒకసారి గర్భము దాలిస్తే మీరు ప్రతి దినము కనీసము 600 మైక్రోగ్రాముల ఫోలిక్ ఆసిడ్ తప్పక తీసుకోనవలయును.

విటమిన్ డి సప్లిమెంట్లు. మీ రక్తములో సరిపోయినంత విటమిన్ D  కలిగి ఉండడం అనేది  ఆరోగ్యకరమైన  రక్త గ్లూకోజ్ స్థాయిలు మెయిన్ టెయిన్ చేస్తాయి అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే  మధుమేహముతో వున్న ప్రజలకు విటమిన్ D స్థాయిలు లేక సప్లిమెంట్ ల గురించి ప్రత్యేక  సిఫారసులు చేయబోయే ముందు మరింత పరిశోధన అవసరమవుతుంది.

విటమిన్ డి  తీసుకోవడం కొరకు ప్రస్తుతపు సిఫార్సులు

గర్భిణీ స్త్రీలు మరియు కనీసము 1 సంవత్సరము వయస్సు వున్న పిల్లలతో  కలిపి  చాలా మంది ప్రజల కొరకు – ప్రతిదినము 600 అంతర్జాతీయ యూనిట్లు (ఐ యు) విటమిన్ D

1 సంవత్సరము కంటే తక్కువ వయస్సు కల శిశువుల కొరకు- ప్రతిదినము 400 ఐ యు విటమిన్ D

మీ డాక్టరును మీరు విటమిన్ D సప్లిమెంట్ తీసుకోనవలయునేమో అడగండి.

మధ్య పానీయాలు

మీరు గర్భధారణ పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరియు గర్బాధారణ సమయమంతా మీరు మధ్య పానీయాలు  తాగడము మానివేయవలయును.  మీరు త్రాగితే , ఆల్కాహాల్ మీ శిశువును కూడా ప్రభావితము చేస్తుంది. ఆల్కాహాల్ మీ  శిశువుకు ప్రమాదకరమైన, జీవిత కాల ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

కృతిమ తీపి కారకాలు

కృతిమ తీపి కారకాలు మితమైన మొత్తములో తీసుకొనవచ్చును. తీపి కారకాలు  వాడడానికి ఎన్నుకున్నట్లయితే  మీరు మీ ఆహార నిపుణునితో యెంత తీసుకోనవలయునో అనే విషయము మాట్లాడండి.

మీరు “నా రోజువారీ ఆహార రికార్డు” ను వాడుతూ మీరు తిన్నది మరియు త్రాగినది ట్రాక్ చేయవచ్చు. మీ ఆహార రికార్డులు మీకు మరియు మీ ఆరోగ్య సంరక్షక జట్టుకు మీ మధుమేహ సంరక్షక ప్రణాళిక పనిచేస్తున్నదా లేదా అని గమనించడములో సహాయపడవచ్చు.

నా శారీరక శ్రమ దినచర్య

రోజువారీ శారీరక శ్రమ మీరు మీ టార్గెట్  రక్త గ్లూకోజ్ నంబర్లు చేరడానికి సహాయపడవచ్చు. శారీరకంగా చురుకుగా ఉండడము అనేది మీరు మీ లక్ష్య  రక్తపోటు మరియు కొలెస్ట్రాల్  సంఖ్యలకు చేరుకోవడానికి, ఒత్తిడి నుండి ఉపశమనం, కండర టోన్ మెరుగుపరచడానికి,  మీ గుండె మరియు ఎముకలను బలోపేతం చేయడానికి, మరియు మీ కీళ్ళను అనువుగా ఉంచుకోవడానికి కూడా సహాయపడవచ్చు.

గర్భవతి అవడానికి ముందు,  శారీరక శ్రమను  మీ జీవితం యొక్క ఒక క్రమబద్ధమైన భాగంగా చేయండి.  వాకింగ్, స్విమ్మింగ్, సాగతీత, మరియు చేతి బరువులు ఉపయోగించడం వంటి సాధారణ  శారీరక శ్రమ గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి.  మీకు  ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా మరియు పై కార్యకలాపాలలో మీకు ఏది  ఉత్తమమైనదో పరిగణించండి.  గర్భధారణ సమయంలో,  లోతువైపుకు స్కయింగ్ చేయడము లాంటి మీకు పడిపోయే  ప్రమాదమును పెంచే కార్యకలాపాలను నివారించమని మీ డాక్టర్  మీకు సలహా ఇవ్వవచ్చు.

ఎక్కువ మంది మహిళలకు ఒక తెలివైన లక్ష్యం వారములో ఎక్కువ రోజులు రోజుకు 30 నిమిషాలు లేదా ఎక్కువ  శారీరక శ్రమను లక్ష్యంగా పెట్టుకోవడం.  మీరు గర్భం  దాల్చక  ముందు నుండి  చురుకుగా ఉన్నట్లయితే, మీరు గర్భధారణ సమయంలో మీ సాధారణ శారీరక శ్రమ  క్రమణిక యొక్క మరింత ఆధునిక వెర్షన్ ను కొనసాగించ  గలుగవచ్చు. మీరు ఇప్పటికే గర్భవతి అయి మరియు చురుకుగా లేకుండా  ఉంటే, అటువంటి వారు వాకింగ్ వంటి ఒక చర్యతో  మొదలు పెట్టవచ్చు.

మీ శారీరక శ్రమను మీరు “ నా రోజువారీ శారీరక శ్రమ రికార్డు” ను వాడి ట్రాక్ చేయవచ్చు. మీ శారీరక శ్రమ రికార్డు మీరు మరియు మీ ఆరోగ్య సంరక్షణ జట్టు మీ డయాబెటిస్ కేర్ ప్రణాళిక పని చేస్తుందో లేదో చూడడానికి సహాయం చేయవచ్చు.

నా మందులు

మధుమేహము కొరకు మందులు

కొన్ని మందులు గర్భధారణ సమయంలో సురక్షితం కాదు మరియు మీరు గర్భం  పొందుటకు ముందు                              ఆపివేయటము చేయాలి. అధిక కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటు కోసం మీరు ప్రస్తుతం తీసుకొంటున్న అన్ని మందుల గురించి మీ వైద్యుడికి  చెప్పండి. మీ డాక్టర్ ఏ మందులు తీసుకొనడము ఆపాలో చెప్పగలరు..

గర్భధారణ సమయంలో భద్రమైన మధుమేహ వైద్యం ఇన్సులిన్, మీరు ఇప్పటికే ఇన్సులిన్ తీసుకొంటూ ఉంటే, మీరు తీసుకొనే రకము, మొత్తం, లేదా ఎలా మరియు ఎప్పుడు మీరు తీసుకోనవలసినది అనేవి మార్చవలసిన అవసరం ఉండవచ్చు. మీరు తీసుకొనే ఇన్సులిన్ పరిమాణమును మీరు గర్బధారణ సమయములో మీరు పెంచవలసి రావచ్చు ఎందుకంటే ఇన్సులిన్ చర్యకు మీ శరీరము తక్కువగా స్పందిస్తుంది , ఇది ఇన్సులిన్  నిరోధకత అనబడే ఒక పరిస్థితి.  మీ ఇన్సులిన్ అవసరాలు  మీరు మీ డెలివరీ తేదీకి చేరువ అవుతున్న కొలదీ రెండింతలు లేదా మూడింతలు కావచ్చు.   మీ డాక్టర్ వ్యక్తిగతీకరించిన ఇన్సులిన్ రొటీన్ నుతయారు చేయడానికి మీతో పని చేస్తారు.

మీరు మీ రక్తం గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించటానికి ఇన్సులిన్ కంటే ఇతర మందులు తీసుకొంటూ  ఉంటే, మీరు వాటిని తీసుకోవడం ఆపవలసిన అవసరం ఉంటుంది. పరిశోధన అధ్యయనాలు ఇన్సులిన్ కంటే ఇతర మధుమేహం మందులు గర్భధారణ సమయంలో ఉపయోగించడానికి సురక్షితం అని ఇంకా ఋజువు  చేయలేదు.

నా రోజువారీ దినచర్యలో మార్పులు

జబ్బు పడిన రోజులు

మీరు జబ్బుపడి ఉన్నప్పుడు, మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరగగలవు మరియు డయాబెటిక్ కిటోయాసిడోసిస్ సంభవించవచ్చు. మీరు జబ్బుపడినపుడు  మీరు ఏమి చెయ్యాలి అనే దానిని గురించి మీ ఆరోగ్య సంరక్షణ జట్టుతో మాట్లాడండి. క్రింది వాటి  గురించి  మీకు తెలిసిలా నిర్ధారించుకోండి

 • మీకు వికారం లేదా వాంతులు అయితే ఏమి చేయాలి
 • మీరు యెంత తరుచుగా మీ రక్తం గ్లూకోజ్ తనిఖీ చేయాలి
 • మీరు కీటోన్ల కొరకు మీ మూత్రం లేదా రక్తమును యెంత తరుచుగా తనిఖీ చేయాలి.
 • మీరు మీ డాక్టర్ కు ఎప్పుడు కాల్ చేయాలి

ఇంటి నుండి దూరంగా  ఉండడం

మీరు ఇంటి నుండి దూరంగా వున్నప్పుడు -చాలా గంటలు లేదా ఒక సుదీర్ఘ పర్యటన కొరకు – మీరు సమస్యలకు సిద్ధం ఉండాలనుకుంటారు. మీరు వీటిని ఎల్లప్పుడూ మీతో ఉంచుకునేలా చూసుకోండి

 • ఒక అల్పాహారం లేదా భోజనం
 • తక్కువ రక్త గ్లూకోజ్ చికిత్స కొరకు ఆహార లేదా పానీయాలు
 • మీ మధుమేహ మందులు మరియు సప్లయ్ లు
 • మీ రక్తం గ్లూకోజ్ మీటర్ మరియు సప్లయ్ లు
 • మీ గ్లుకాగాన్ కిట్
 • అత్యవసరాలలో మీ ఆరోగ్య సంరక్షణ జట్టు యొక్క ఫోన్ నంబర్లు

నా శిశువుకు తల్లి పాలు ఇచ్చే ప్రణాళిక

మీరు తల్లిపాలను ఇవ్వడం ద్వారా మీ శిశువుకు ఒక ఆరోగ్యకరమైన ప్రారంభం ఇవ్వవచ్చు . రొమ్ము పాలు మీ శిశువుకు  ఉత్తమ పోషణ అందించి కొన్ని అనారోగ్యాల నుండి రక్షిస్తుంది.

తల్లిపాలు ఇవ్వడం కోసం సిద్ధమవడంలో సహాయం చేయడానికి,

 • మీ తల్లిపాలు  ఇచ్చే ప్రణాళికల గురించి మీ ఆరోగ్య సంరక్షణ జట్టుతో మాట్లాడండి. మీరు  మీ శిశువు  ప్రసవము అయే స్థలములో విజయవంతముగా తల్లిపాలు ఇవ్వడంలో మద్దతు ఇవ్వడానికి  సిబ్బంది మరియు ఏర్పాటు ఉన్నదా అని తెలుసుకోనండి.
 • తల్లిపాలు ఇవ్వడం గురించి క్లాసు తీసుకొనండి. తల్లి పాలు ఎలా ఇవ్వవలయునో తెలిసిన గర్భిణి స్త్రీలు, తెలియని వారికంటే విజయవంతమయే అవకాశం ఉంది.
 • తల్లిపాలను ఇవ్వడములో మీకు సహాయం చేయడానికి ఒక లాక్టేషన్ కన్సల్టెంట్ ను  సిఫార్సుచేయమని మీ వైద్యుడిని సంప్రదించండి. ఒక  లాక్టేషన్ కన్సల్టెంట్ తల్లిపాలు ఇవ్వడములో సహాయం చేయుటకు శిక్షణ పొంది వుంటుంది.
 • తల్లిపాలు ఇస్తూ వున్న మీ స్నేహితులతో మాట్లాడండి లేక ఒక తల్లిపాలను మద్దతు గుంపులో చేరేందుకు పరిశీలించండి.

మీ శిశువు జననం తర్వాత

మీరు మీ శిశువును పొందిన తరువాత, ఈ దశలు ఒక గొప్ప ప్రారంభానికి మీకు సహాయపడవచ్చు:

 • పుట్టిన తరువాత సాధ్యమైనంత త్వర గా తల్లిపాలు ఇవ్వండి. చప్పరింపు స్వభావం జీవితం యొక్క మొదటి గంటలో చాలా బలంగా ఉంటుంది.
 • మీకు ఇప్పటికే ఒక లాక్టేషన్ కన్సల్టెంట్ లేకపోతే,  ఆసుపత్రిలో ఉండే ఒకరిని మీకు సహాయంగా రమ్మని అడగండి.
 • అది వైద్యపరంగా అవసరం అయితే తప్ప, మీ బేబీకి ఇతర ఆహారము లేదా ఫార్ములా ఇవ్వకూడదని ఆస్పత్రి సిబ్బందిని అడగండి.
 • మీరు తరచుగా తల్లిపాలను ఇవ్వడానికి వీలుగా మీ బిడ్డ పగలు మరియు రాత్రి అంతా మీ ఆసుపత్రి గదిలో ఉండడానికి అనుమతించండి. లేదా మీరు పాలు ఇవ్వడానికి మీ శిశువును తీసుకుని రమ్మని నర్సులను అడగండి.
 • మీ శిశువు కేవలం మీ రొమ్ము పై తల్లిపాలకు అలవాటు పడటము కొరకు మీ బిడ్డకు ఏ పాసిఫైయ్యర్లను లేదా ఆర్టిఫిషియల్ నిప్పల్స్ నుఇవ్వడం నివారించేందుకు ప్రయత్నించండి.

అనేక ప్రముఖ ఆరోగ్య సంస్థలు మీ బిడ్డకు మొదటి 6 నెలలు  రొమ్ముపాలు  కాకుండా  ఇతర ద్రవాలు, ఆహారాలు ఇవ్వకూడదని  సూచిస్తున్నాయి. మొదటి 6 నెలల తర్వాత, పిల్లలు రొమ్ముపాలతో పాటు ఇతర ఆహారాలు తినడము మొదలు పెట్టవచ్చు.

గర్భము మరియు మధుమేహము :  మీ బిడ్డ యొక్క ఆరోగ్యమును తనిఖీ చేయడము

మీ గర్బధారణ సమయము అంతా మీ బిడ్డ యొక్క ఆరోగ్యం తనిఖీ చేయడం కొరకు మీకు  పరీక్షలు వుంటాయి. మీ ఆరోగ్య సంరక్షణ జట్టు మీకు ఈ క్రింది ఏ పరీక్షలు మీరు మరియు ఎప్పుడు చేసికోనవలసి వుంటుంది చెప్పగలుగుతారు.  మీ డాక్టర్ ఇతర పరీక్షలు కూడా సూచించవచ్చు. కొన్ని వ్యాధులు లేదా పరిస్థితులు మీ కుటుంబంలో వంశపారంపర్యంగా వుంటే , మీరు ఒక జన్యు శాస్త్ర సలహాదారున్ని  కలవవచ్చు. ఆ సలహాదారుడు  మీ కుటుంబ చరిత్ర ఆధారంగా పరీక్షలు సిఫారసు చేయవచ్చు మరియు మీ శిశువు కొరకు  కొన్ని ప్రమాద  పరిస్థితులు  వివరించవచ్చును.

ఈ క్రింది పరీక్షలు సాధారణంగా మీ వైద్యుని కార్యాలయంలో లేదా ఒక ఆసుపత్రి  అవుట్ పేషెంట్  సంరక్షణ సౌకర్యంలో చేయబడతాయి. మీరు ఈ అన్ని పరీక్షలకు మేలుకొనే ఉంటారు; అనస్థీషియా అవసరం లేదు. రక్త పరీక్షల కొరకు, మీ డాక్టర్ కార్యాలయములో గాని లేదా ఒక వాణిజ్య సౌకర్యంలో గాని మీ రక్తం తీయబడుతుంది మరియు ఆ  రక్త నమూనా విశ్లేషణ కోసం ఒక ప్రయోగశాలకు పంపబడుతుంది.

అల్ట్రాసౌండ్

అవయముల నిర్మాణము గురించి ఒక చిత్రమును సృష్టించడానికి వాటికి దూరంగా సురక్షితమైన, నొప్పిలేని  ధ్వని తరంగాలను పంపే  ట్రాన్స్డ్యూసెర్ అని పిలువబడే ఒక పరికరాన్ని అల్ట్రాసౌండ్ ఉపయోగిస్తుంది. అల్ట్రాసౌండ్ ను ప్రత్యేకంగా శిక్షణ పొందిన టెక్నీషియన్ లేదా ఆరోగ్య సంరక్షణ ప్రదాత ద్వారా నిర్వహిస్తారు. సోనోగ్రామ్ అని పిలువబడే చిత్రము  శిశువు యొక్క పరిమాణం, స్థానం, నిర్మాణాలు, మరియు సెక్స్ చూపవచ్చును. ఈ  చిత్రం కూడా వయస్సును అంచనా చేయుటకు, వృద్ధిని అంచనా చేయుటకు , మరియు పుట్టుకతో వచ్చే కొన్ని రకాల లోపాలు చూపించడానికి సహాయపడుతుంది.

మొదటి త్రైమాసిక స్క్రీన్

మొదటి త్రైమాసిక స్క్రీన్ మీరు 11 నుంచి 14 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు చేసే  పరీక్ష. ఈ పరీక్షలో ఒక రక్త పరీక్ష మరియు న్యూకల్ ట్రాన్స్లుసెంసి అనబడే ఒక అల్ట్రా సౌండ్ పరీక్ష చేయవలసి వుంటుంది. ఈ రక్త పరీక్ష మీ రక్తంలో కొన్ని పదార్థాల స్థాయిలు కొలుస్తుంది. పరీక్ష కోసం ఒక టెక్నీషియన్ మీ రక్తమును తీస్తారు.  అల్ట్రాసౌండ్ శిశువు యొక్క మెడ వెనుక భాగం యొక్క మందంను కొలుస్తుంది.

మాటర్నల్ బ్లడ్  స్క్రీనింగ్ టెస్ట్

మాటర్నల్ బ్లడ్  పరీక్షను మల్టిపుల్ మార్కర్ స్క్రీన్ టెస్ట్, ట్రిపుల్ స్క్రీన్, లేదా క్వాడ్ స్క్రీన్ అని కూడా అంటారు. ఈ పరీక్ష మీ రక్తంలో అనేక పదార్థాలను కొలుస్తుంది. ఫలితాలు మీ శిశువుకు వెన్నుపాము మరియు మెదడు సమస్యలు, డౌన్ సిండ్రోమ్, మరియు ఇతర పుట్టుక లోపాల ప్రమాదం ఉంది లేదో మీకు చెప్తాయి. ఈ ఫలితాలు సమస్యలు ప్రమాదం అధికమని చూపిస్తే, అల్ట్రాసౌండ్ లేదా అమ్నియోసెంటేసిస్ లాంటి అదనపు పరీక్షలు మరింత సమాచారం అందించవచ్చు.

ఫీటల్ ఎఖోకార్డియోగ్రామ్ 

ఈ ఫీటల్ ఎఖోకార్డియోగ్రామ్ శిశువు యొక్క గుండె నిర్మాణంలో సమస్యల కోసం అల్ట్రాసౌండ్ ను ఉపయోగిస్తుంది.

ఆమ్నియోసెంటేసిస్

ఆమ్నియోసెంటేసిస్ అనునది శిశువు చుట్టూ వున్న ద్రవాన్ని ఒక చిన్న మొత్తంలో పొందటానికి గర్భాశయంలోకి ఉదరం గుండా చేర్చబడిన ఒక సన్నని సూదిని ఉపయోగిస్తుంది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన టెక్నీషియన్ లేదా ఆరోగ్య సంరక్షణ ప్రదాత ఈ పరీక్ష చేస్తారు.

ద్రవం నుండి తీసుకోబడిన కణాలను ప్రయోగశాలలో పెంచబడతాయి ఆపై విశ్లేషించబడతాయి. ఆమ్నియోసెంటేసిస్ మీ శిశువుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా మరియు మీ శిశువు యొక్క ఊపిరితిత్తులు అభివృద్ధి చెందడము పూర్తిగా అయినదా అని చెప్పడము కొరకు ఉపయోగపడుతుంది.  డెలివరీ తర్వాత సహాయం లేకుండా శిశువు శ్వాస తీసుకొనడము కొరకు పరిపక్వము చెందిన ఊపిరితిత్తులు అవసరమవుతాయి.

కొరియోనిక్ విల్లస్ సాంప్లింగ్

కొరియోనిక్ విల్లస్ సాంప్లింగ్ లో కణాలను పొందటానికి ఒక సన్నని సూది మాయలోనికి చేర్చబడుతుంది. యోని మరియు గర్భాశయ ద్వారం గుండా  లేదా ఉదరం మరియు గర్భాశయం  గుండా గాని సూదికి మాయలోకి మార్గనిర్దేశనము చేయడానికి అల్ట్రాసౌండ్ వాడబడుతుంది. ఈ మాయ శిశువు పోషణ పొందేలా శిశువును  తల్లి గర్భాశయంనకు అతికి వుంచే కణజాలాలు మరియు రక్త నాళాలతో కూడి ఉంటుంది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన టెక్నీషియన్ లేదా ఆరోగ్య సంరక్షణ ప్రదాత ఈ పరీక్ష నిర్వహిస్తారు. అప్పుడు కణాలు ఆరోగ్య సమస్యలు కోసం విశ్లేషించబడతాయి.

గ్రూప్ B స్ట్రిప్టోకాకస్ టెస్ట్

గ్రూప్ B స్ట్రిప్టోకాకస్ పరీక్షలో, మీ యోని మరియు పురీషనాళం నుండి కణాలు తీసుకొనడానికి ఒక స్వాబ్ ను ఉపయోగిస్తారు. మీ డాక్టర్ ఈ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్ష శిశువుల్లో న్యుమోనియా లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్ కలిగించే బాక్టీరియా కొరకు చూడడానికి గర్భధారణ యొక్క 36నుండి 37 వారాలకు  నిర్వహించబడుతుంది.

కిక్ కౌంట్స్/పిండము యొక్క కదలికలను లెక్క పెట్టడము

కౌంటింగ్ కిక్స్ మరియు పిండము కదలికలను లెక్క పెట్టడము అనేదిమీ శిశువు యొక్క చర్యలను  ట్రాక్ చేయడము కొరకు ఒక సులభమైన మార్గం. మీరు ఇంటి వద్ద ఈ పరీక్ష చేయవచ్చు. శిశువు ఒక నిర్దిష్ట కాలంలో ఎన్ని సార్లు కదులుతుంది అని మీరు లెక్కకడతారు.

నాన్ స్ట్రెస్ టెస్ట్

ఒక ఫీటల్ మానిటర్ మీ శిశువు క్రియాశీలంగా ఉన్నప్పుడు గుండె యొక్క రేటు పెరుగుదల ఉండవలసిన విధంగా వున్నదా అని తనిఖీ చేస్తుంది.  మీ డాక్టర్ లేదా మరొక ఆరోగ్య సంరక్షణ ప్రదాత ఈ పరీక్షను నిర్వహిస్తారు.

జీవభౌతిక ప్రొఫైల్

ఒక జీవభౌతిక ప్రొఫైల్  పొందటానికి అల్ట్రాసౌండ్ మీ శిశువు యొక్క కండరాల స్థాయి, శ్వాస, మరియు కదలికను తనిఖీ చేస్తుంది. అల్ట్రాసౌండ్ శిశువు పరిసరములో వున్న అమ్నియోటిక్ ద్రవం యొక్క మొత్తాన్ని కూడా అంచనా వేస్తుంది.

కాంట్రాక్షన్ స్ట్రెస్ టెస్ట్

ఈ పరీక్ష ఫీటల్ మానిటర్ ను ఉపయోగించి సంకోచముల సమయంలో శిశువు యొక్క గుండె రేటును కొలుస్తుంది. మీ డాక్టర్ లేదా మరొక ఆరోగ్య సంరక్షణ ప్రదాత ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఫలితాలు మీ డాక్టర్ శిశువును ముందుగానే ప్రసవించడం అవసరమా అని నిర్ణయించకోనటానికి సహాయపడతాయి.

మధుమేహంతో లేబర్ మరియు ప్రసవము

ప్రసవ సమయం

మీ ఆరోగ్య సంరక్షణ జట్టు  ప్రసవము ఏ విధంగా మరియు ఎపుడు జరగాలో నిర్ణయించడానికి మీ ఆరోగ్యం, మీ శిశువు యొక్క ఆరోగ్యము మరియు మీ గర్భ పరిస్థితిని పరిగణలోనికి తీసుకొంటుంది. మీ డాక్టర్ మీ నిర్ణయించిన  తేదీకి  ముందే  ప్రేరిపిత లేబర్  లేదా  ఒక సిజేరియన్ విభాగం, లేదా సి సెక్షన్ ఉపయోగించి శస్త్రచికిత్సకు సిఫార్సు చేయవచ్చును.  అయితే  చాలా మంది మధుమేహం కలిగిన  మహిళలు యోని ద్వారా ప్రసవము పొందే ఎంపికకు చేరవేసే అవకాశం కలిగి వున్నారు.  మీరు మీ ఎంపికల గురించి మీ ఆరోగ్య సంరక్షణ జట్టుతో చాలా ముందు గానే మాట్లాడలనుకుంటారు.

మీ ఆరోగ్య సంరక్షణ జట్టు  మీకు ఏ రకమైన ప్రసవము ఉత్తమమైనదో  నిర్ణయించడంలో ఈ క్రింది వాటిని  పరిశీలిస్తారు

 • మీ శిశువు యొక్క పరిమాణం మరియు స్థానం
 • మీ శిశువు యొక్క ఊపిరితిత్తుల పరిపక్వత
 • మీ శిశువు యొక్క కదలికలు
 • మీ శిశువు యొక్క హృదయ స్పందన రేటు
 • అమ్నియోటిక్ ద్రవం యొక్క మొత్తము
 • మీ రక్తం గ్లూకోజ్ మరియు రక్తపోటు స్థాయిలు
 • మీ సాధారణ ఆరోగ్యము

లేబర్ మరియు ప్రసవ సమయంలో రక్తం గ్లూకోజ్ నియంత్రణ

మీ రక్త గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచడము వలన మీ శిశువు పుట్టిన వెంటనే  తక్కువ రక్త గ్లూకోజ్ బారిన పడకుండా కాపాడుతుంది. మీరు లేబర్ లో ఉన్నప్పుడు శారీరకంగా చురుకుగా వుంటారు కాబట్టి మీకు  ఎక్కువ ఇన్సులిన్ అవసరం ఉండకపోవచ్చు. ఆస్పత్రి సిబ్బంది తరచుగా మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తనిఖీ చేస్తారు. కొంతమంది మహిళలు లేబర్ సమయంలో ఒక ఇంట్రావీనస్ (IV) లైన్ ద్వారా, ఇన్సులిన్ మరియు గ్లూకోజ్, అలాగే ద్రవాలు తీసుకొంటారు. సిర ద్వారా మీ రక్తప్రవాహంలోనికి  నేరుగా ఇన్సులిన్ మరియు గ్లూకోజ్ ను పంపడం అనేది బ్లడ్ గ్లూకోస్ స్థాయి యొక్క మంచి నియంత్రణ ను అందిస్తుంది. మీరు ఒక ఇన్సులిన్ పంప్ ను ఉపయోగిస్తూ ఉంటే, మీరు లేబర్ సమయమంతా దానిని ఉపయోగించడము కొనసాగించవచ్చు.

మీకు  ఒక C-సెక్షన్ చేయించుకుంటుంటే , మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు శస్త్రచికిత్స ఒత్తిడి వలన పెరగవచ్చును.  మీ ఆరోగ్య సంరక్షణ జట్టు మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు దగ్గరగా మానిటర్ చేసి మరియు మీ స్థాయిల ను నియంత్రణలో   ఉంచడానికి ఇన్సులిన్ మరియు గ్లూకోజ్  కొరకు ఒక IV ను ఉపయోగించవచ్చును.

మీ బిడ్డ  వచ్చిన తరువాత

తల్లిపాలు ఇవ్వడము

మీరు  తల్లిపాలు ఇవ్వడము ద్వారా మీ శిశువుకు ఒక ఆరోగ్యకరమైన ప్రారంభం ఇవ్వవచ్చును. తల్లిపాలు ఇవ్వడము అనేది ఉత్తమ పోషణ అందించి మరియు మీ బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.

 మీ ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక

మీరు తల్లిపాలను ఇస్తూ ఉంటే, మీకు మీ గర్భం సమయంలో ప్రతి రోజు అవసరమైన దానికంటే మరిన్ని కేలరీలు అవసరం ఉండవచ్చు. మీ ఆహార నిపుణుడు వ్యక్తిగతీకరించిన సిఫార్సులను అందించవచ్చు మరియు ఎప్పుడు, ఏమిటి మరియు  ఎంత తినవలయును అనే దాని గురించి మీకు  ఉన్న ఏ ప్రశ్నలకైనా సమాధానము చెపుతారు.

మీ మందులు

మీరు జన్మనిచ్చిన తర్వాత, మీకు అనేక రోజులు మామూలు కంటే తక్కువ ఇన్సులిన్ అవసరం ఉండవచ్చు. తల్లిపాలు ఇవ్వడము అనేది మీకు అవసరమైన ఇన్సులిన్ మొత్తంను కూడా తగ్గిస్తుంది. తల్లిపాలు ఇచ్చే సమయములో ఇన్సులిన్ కంటే ఇతర డయాబెటిస్ మందులు ఇవ్వడము సిఫార్సు చేయబడలేదు.

తక్కువ రక్త  గ్లూకోజ్

మీకు ప్రసవము అయిన తరువాత, ప్రత్యేకించి తల్లిపాలు ఇస్తున్నప్పుడు మీకు తక్కువ రక్త గ్లూకోజ్ యొక్క ప్రమాదం  ఎక్కువగా ఉంటుంది. మీరు మీ శిశువుకు తల్లి పాలు ఇచ్చిన ముందుగా కాని లేదా తరువాత కాని మీకు ఒక అల్పాహారం అవసరం ఉండవచ్చు. మీ ఆరోగ్య సంరక్షణ జట్టు మీకు సాధారణము కంటే మరింత తరచుగా మీ రక్తంలో గ్లూకోజ్ ని తనిఖీ చేసికోనమని సూచించవచ్చు.

మీ గురించి మీరు జాగ్రత్త పడడము

ఒక మంచి తల్లిగా ఉండాలంటే మీరు మీ గురించి  మంచి శ్రద్ధ వహించాలి. మీ మధుమేహం గురించి జాగ్రత్త పడటము మరియు సరియినది తినడమునకు అదనంగా మీ భౌతిక చర్యలకు సమయము తీసుకొనడము ద్వారా కూడా మీ గురించి మీరు జాగ్రత్తలు తీసుకొనవచ్చును. చురుకైన  తల్లులు తమ పిల్లలు అనుసరించడానికి ఒక మంచి ఉదాహరణ అందిస్తారు. ప్రసవము అయిన తరువాత యెంత త్వరగా మీరు సురక్షితంగా  శారీరక శ్రమను ప్రారంభించడానికి వీలవుతుందో మీ ఆరోగ్య సంరక్షణ జట్టుతో  చెక్ చేసుకొనండి.

గుర్తించుకోవలసిన  పాయింట్లు

 • మీకు డయాబెటిస్ ఉంటే మీరు గర్భము పొందుటకు ముందే మీ రక్త చక్కెర అనే మీ రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించడానికి ఉత్తమ సమయం. మీరు గర్బధారణ  పొందినారని తెలుసుకొనడానికి ముందే అనగా  గర్భధారణ మొదటి వారములలో మీ అధిక రక్త గ్లూకోజ్ స్థాయిలు మీ శిశువుకు హానికరం కావచ్చును.
 • గర్భమునకు ముందు మరియు గర్బధారణ సమయములో మీ రక్త గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థాయిలో ఉంచడము అనేది మీరు ఆరోగ్యంగా ఉండడానికి మరియు ఒక ఆరోగ్యకరమైన శిశువు కలుగచేయటకు చాలా ముఖ్యమైన విషయము.
 • మీరు గర్భము పొందుటకు ముందే, మీరు ఆరోగ్యకరమైన గర్భము మరియు ఆరోగ్యవంతమైన బిడ్డ కొరకు మీరు ప్లాన్  చేసి సిద్ధం పడవచ్చును.  మీరు మధుమేహము కలిగి వుండి  మరియు ఇప్పటికే గర్భవతి అయితే, మీరు మీ గర్భధారణ సమయంలో మీ గురించి మరియు మీ మధుమేహం గురించి  శ్రద్ధ వహించడానికి మీరు చేయవలసినవి అన్నీ చేస్తున్నారని నిర్ధారణ చేసుకొనండి.
 • మధుమేహం మరియు గర్బధారణలో నిపుణులైన ఒక ఆరోగ్య సంరక్షణ జట్టు సభ్యులతో రెగ్యులర్ సందర్శన మీరు ఉత్తమ సంరక్షణ పొందడానికి నిర్థారిస్తుంది. మీ ఆరోగ్య సంరక్షణ జట్టు మీకు గర్భధారణ సమయంలో మీ రక్తంలో గ్లూకోజ్ లక్ష్యాలను చేరుకోవడానికి ఒక ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక , శారీరక శ్రమ , మరియు మందులు ఎలా వాడాలో తెలుసుకొనడములో సహాయపడుతుంది.
 • గర్భం సమయంలో, ఇన్సులిన్ సురక్షితమైన మధుమేహ వైద్యం. మీ ఆరోగ్య సంరక్షణ జట్టుఒక వ్యక్తిగతీకరించిన ఇన్సులిన్ రొటీన్ ను తయారుచేయడానికి మీతో కలసి పని చేస్తుంది. కొన్ని మందులు గర్భధారణ సమయంలో సురక్షితం  కాదు మరియు మీరు గర్భవతి అవడానికి ముందు వాటిని నిలిపి వేయాలి. మీ డాక్టర్ మీరు ఏ మందులు తీసుకొనడము ఆపివేయాలో మీకు చెప్పగలరు.
 • మీరు మీ శిశువు యొక్క ఆరోగ్యాన్ని తనిఖీ చేయడం కొరకు మీ గర్బ కాలమంతా పరీక్షలు చేసుకొనవలయును.
 • మీరు మీ శిశువుకు తల్లిపాలు ఇవ్వడము ద్వారా ఒక ఆరోగ్యకరమైన ప్రారంభమును ఇవ్వగలరు.

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు