నాకు టైప్ 2 మధుమేహం ప్రమాదం ఉందా? మధుమేహం పొందే మీ ప్రమాదాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456


టైప్
2 మధుమేహం అంటే ఏమిటి?

గతంలో పెద్దల ప్రారంభం మధుమేహం అని పిలువబడే టైప్ 2 మధుమేహం, టైప్ 1 మధుమేహం యొక్క అత్యంత సాధారణ రకం. మధుమేహం ఉన్న సుమారు 95 శాతం ప్రజలు టైప్ 2 ను కలిగివుంటారు. ప్రజలకు ఏ వయసులోనైన టైప్ 2 మధుమేహం అభివృద్ధి కాగలదు,  బాల్య దశలో కూడా. అయితే, ఈ రకం మధుమేహం మధ్య వయస్సు మరియు అధిక వయస్సు వ్యక్తులలో తరచుగా అభివృద్ధి అవుతుంది. అధిక బరువు గల మరియు చురుకుగా లేని  వ్యక్తులకు కూడా టైప్ 2 మధుమేహం అభివృద్ధి అయ్యే అవకాశం ఎక్కువగా  ఉంది.

టైప్ 2 మధుమేహం మరియు ఇతర రకాలలో, మీరు మీ రక్తంలో చక్కెర అని కూడా పిలువబడే చాలా ఎక్కువ గ్లూకోజ్ ను కలిగి ఉంటారు. మధుమేహం కలిగిన వ్యక్తులకు ఆహారాన్ని శక్తిగా మార్చుకోవడంలో సమస్య వుంటుంది. భోజనం తర్వాత, ఆహారం గ్లూకోజ్  లాగా విడగొట్టబడుతుంది,  దానిని రక్తం ద్వారా శరీరం అంతా వున్న కణాలకు  తీసుకుపోబడుతుంది. హార్మోన్ ఇన్సులిన్ సహాయంతో, కణాలు మీ రక్తం నుండి గ్లూకోజ్ ను గ్రహిస్తాయి మరియు శక్తి కోసం దీనిని ఉపయోగిస్తాయి. ఇన్సులిన్ కడుపు వెనుక ఉన్న అవయవమైన క్లోమములో తయారవుతుంది.

టైప్ 2 మధుమేహం సాధారణంగా, మీ శరీర కణాలు ఇన్సులిన్ ను సరిగా ఉపయోగించని అదనపు బరువుతో ముడిపడి ఉన్న ఒక పరిస్థితి అయిన ఇన్సులిన్ నిరోధకతతో ప్రారంభమవుతుంది. ఫలితంగా కణాలలోకి గ్లూకోజ్ ప్రవేశించుటకు సహాయపడుటకు మీ శరీరంనకు మరింత ఇన్సులిన్ అవసరం. మొదట, మీ క్లోమం ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయడం ద్వారా పెరిగిన డిమాండ్ ను నిర్వహిస్తుంది. కానీ కొద్ది సమయం లోపల మీ క్లోమం తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే సామర్త్యాన్ని కోల్పోతుంది,  మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి.

కాలక్రమేణా, అధిక రక్తంలో గ్లూకోజ్ గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి, అంధత్వం, దంత వ్యాధి, మరియు అంగచ్ఛేదం లాంటి సమస్యలకు దారితీసే నరములను మరియు రక్త నాళాలను నష్టపరుస్తుంది. మధుమేహం యొక్క ఇతర సమస్యలలో ఇతర వ్యాధులు వచ్చే పెరిగిన ప్రమాదం, వయస్సుతో కదలిక లేకపోవడం, నిరాశ, మరియు గర్భ సమస్యలు ఉంటాయి.

చికిత్సలో మధుమేహ మందులు తీసుకోవడం, తెలివైన ఆహార ఎంపికలు చేయడం, రోజూ శారీరకంగా చురుకుగా ఉండటం, రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ ను నియంత్రించడం, మరియు కొందరికి, ఆస్ప్రిన్ తీసుకోవడం అనేవి ఉంటాయి.

టైప్ 2 మధుమేహం ను ఆలస్యం చేయవచ్చా లేదా నివారించవచ్చా?

అవును. మధుమేహం నివారణ కార్యక్రమం (DPP) యొక్క ఫలితాలు మధ్యస్థ  ఆహార మార్పులు మరియు శారీరక శ్రమ ద్వారా బరువు తగ్గడం అనేది టైప్ 2 మధుమేహంను ఆలస్యం చేయవచ్చు లేదా  నిరోధించవచ్చు అని నిరూపించాయి. DPP అనేది  మధుమేహం యొక్క అధిక ప్రమాదం గల 3,234 మంది ప్రజలతో సమాఖ్య నిధులతో చేయబడిన ఒక అధ్యయనం. ఈ అధ్యయనం 5 నుంచి 7  శాతం, అంటే 90 కిలోల ఒక వ్యక్తికి  5-7 కేజీలు బరువు తగ్గడం అనేది  టైప్ 2 మధుమేహ అభివృద్ధిని నిదానపరచవచ్చని చూపించింది.

మధమేహం యొక్క అధిక ప్రమాదం లో వున్న వ్యక్తులు  

DPP  అధ్యయనంలో పాల్గొన్న వారు అధిక బరువు మరియు సాధారణ స్థాయిల కంటే ఎక్కువ రక్తంలో గ్లూకోజ్ కలిగి వుండే ఒక పరిస్థితి అయిన ప్రీడయాబెటస్ ను కలిగి వుండినారు. చాలా మందికి టైప్ 2 మధుమేహం కలిగిన కుటుంబ సభ్యులు వుండినారు. ప్రీ డయాబెటిస్, స్థూలకాయం, మరియు మధుమేహం కలిగిన కుటుంబ చరిత్ర అనేవి టైప్ 2 మధుమేహం యొక్క బలమైన ప్రమాద కారకాలు.

DPPలో పాల్గొన్న వారిలో గర్భధారణ మధుమేహ చరిత్ర కలిగిన స్త్రీలు మరియు 60 మరియు అంతకన్నా ఎక్కువ వయస్సు గల వ్యక్తులు వంటి టైప్ 2 మధుమేహం యొక్క అధిక ప్రమాదం ఉన్న ఇతరులు కూడా ఉండినారు.

మధుమేహంను నివారించడానికి  విధానాలు  

మధుమేహం నివారించడానికి DPP మూడు విధానాలను పరీక్షింది:

 • జీవనశైలి మార్పులు చేయడం. జీవనశైలి మార్పు సమూహంలోని వ్యక్తులు సాధారణంగా రోజుకు 30 నిమిషాల చొప్పున వారానికి 5 రోజులు నడవడం ద్వారా వ్యాయామం చేసారు మరియు క్రొవ్వు మరియు కెలోరీలు తీసుకోవడం తగ్గించారు.
 • మధుమేహ మందు మెట్ఫోర్మిన్ ను తీసుకోవడం. మెట్ఫోర్మిన్ తీసుకున్న వారు శారీరక కార్యక్రమం మరియు ఆహారం గురించి కూడా సమాచారం అందుకున్నారు.
 • మధుమేహం గురించిన పరిజ్ఞానం పొందడం. మూడవ సమూహం శారీరక కార్యక్రమం మరియు ఆహారం మరియు ప్లేస్ బో (మందులేని ఒక పిల్) తీసుకోవడం గురించి మాత్రమే సమాచారం పొందింది.

జీవనశైలి మార్పు సమూహంలోని వ్యక్తులు ఉత్తమ ఫలితాలు చూపించారు. కానీ మెట్ఫోర్మిన్ తీసుకున్న వారు కూడా లాభపడ్డారు. మొదటి సంవత్సర అధ్యయనంలో సగటున 7 కిలోలు తగ్గడం ద్వారా జీవనశైలి మార్పు సమూహంలోని వ్యక్తులు 3 సంవత్సరాలలో టైప్ 2 మధుమేహం వచ్చే వారి ప్రమాదాన్ని 58 శాతానికి తగ్గించుకున్నారు. జీవనశైలి మార్పు 60 మరియు పైబడిన వయసు వారిలో  మరింత ప్రభావవంతంగా ఉండింది. ఈ సమూహంలోని వ్యక్తులు వారి ప్రమాదాన్ని 71 శాతానికి తగ్గించుకున్నారు. అయితే మెట్ఫోర్మిన్ సమూహంలో వ్యక్తులు కూడా వారి ప్రమాదాన్ని 31  శాతానికి తగ్గించుకున్నారు.

కొనసాగే ఫలితాలు 

డయాబెటిస్ ప్రివెన్షన్  ప్రోగ్రామ్ అవుట్ కమ్స్ స్టడీ (DPPOS) బరువు తగ్గడం మరియు మెట్ఫోర్మిన్ యొక్క ప్రయోజనాలు 10 సంవత్సరాల పాటు కొనసాగుతాయని చూపించింది. DPP లో పాల్గొన్న చాలా మందిని అనుసరించుటను, 2001లో ముగిసిన DPP నుండి DPPOS కొనసాగించింది.

DPP లోనమోదుచేసుకున్న10 సంవత్సరాల తరువాత, ఈ క్రిందివి జరిగాయని DPPOS చూపించింది,

 • జీవనశైలి మార్పు సమూహంలోని వ్యక్తులు మధుమేహం వృద్ధి చెందే వారి ప్రమాదాన్ని 34 శాతం వరకు తగ్గించుకున్నారు
 • జీవనశైలి మార్పు సమూహంలోని వయసు 60 లేదా పైబడిన వారు మధుమేహం వృద్ధి చెందే వారి ప్రమాదాన్ని 49 శాతం వరకు తగ్గించుకొనడం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందినారు
 • జీవనశైలి మార్పు సమూహంలోని వారు వారియొక్క గుండె జబ్బు ప్రమాదాన్ని నియంత్రించుటకు కొద్ది మందులు తీసుకున్నా కూడా రక్తపోటు మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలతో సహా గుండె మరియు రక్త నాళ వ్యాధి ప్రమాద కారకాలను కొద్దిగా కలిగి వున్నారు
 • మెట్ఫోర్మిన్ సమూహం మధుమేహం వృద్ధి చెందే ప్రమాదాన్ని 18 శాతం వరకు తగ్గించుకున్నారు

జీవనశైలి మార్పులతో మీ బరువు నియంత్రించడం సవాలుతో కూడుకొన్నది అయినప్పటికీ, అది మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గించడం, మీ టైప్ 2 మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా మరియు ఇతర గుండె వ్యాధి ప్రమాద కారకాలను తగ్గించడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య బహుమతులు ఉత్పత్తి చేస్తుంది.

మధుమేహం యొక్క ఇతర రకాలు

టైప్ 2 తో పాటు, మధుమేహం యొక్క ఇతర ప్రధాన రకాలు  టైప్ 1 మధుమేహం మరియు గర్భధారణ మధుమేహం.

టైప్ 1 మధుమేహం

గతంలో బాల్య మధుమేహం అని పిలువబడే టైప్ 1 మధుమేహం, సాధారణంగా మొదట పిల్లలు, యుక్త వయసు వారు మరియు యువకులలో నిర్ధారణ చేయబడుతుంది. ఈ రకం మధుమేహంలో, మీ క్లోమం ఇన్సులిన్ ను ఇకపై ఉత్పత్తి చేయలేదు ఎందుకంటే మీ శరీరం యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ దానిని తయారు చేసే కణాల మీద దాడి చేసి, నాశనం చేసింది. టైప్ 1 మధుమేహంనకు చికిత్సలోఇన్సులిన్ షాట్లు తీసుకోవడం  లేదా ఒక ఇన్సులిన్ పంప్ ను ఉపయోగించడం, తెలివైన ఆహార ఎంపికలు చేసుకోవడం, రోజూ శారీరకంగా తరచుగా చురుకుగా ఉండటం, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం, మరియు కొందరికి ప్రతీరోజు ఆస్పిరిన్ తీసుకోవడం ఉంటాయి.

గర్భధారణ మధుమేహం

గర్భధారణ మధుమేహం గర్భధారణ సమయంలో మాత్రమే అభివృద్ధి చెందే మధుమేహ రకం. మీ మాయ  మరియు ఇతర గర్భం సంబంధిత అంశాల ద్వారా ఉత్పత్తి అయిన హార్మోన్లు ఇన్సులిన్ నిరోధకతకు దోహద పడతాయి,  ఇది గర్భధారణ చివరలో అందరు మహిళల్లో సంభవిస్తుంది. ఇన్సులిన్ నిరోధకత మీ రక్తంలో గ్లుకోస్ ను నియంత్రించుటకు అవసరమయ్యే ఇన్సులిన్ మొత్తంను పెంచుతుంది. ఒక వేళ మీ క్లోమం తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేకపోతే, గర్భధారణ మధుమేహం సంభవిస్తుంది.

టైప్ 2 మధుమేహం మాదిరిగా, అదనపు బరువు గర్భధారణ మధుమేహంతో ముడిపడి ఉంది. ప్రత్యేకించి అధిక బరువు లేదా ఊబకాయం మహిళలకు అధిక గర్భధారణ మధుమేహ ప్రమాదం వుంది ఎందుకంటే  ఇన్సులిన్ నిరోధకత కారణంగా అధిక ఇన్సులిన్ అవసరంతో గర్భధారణ మొదలుపెట్టుతారు. గర్భధారణ సమయంలో అధిక బరువు పెరగడం ప్రమాదంను పెంచవచ్చు. మధుమేహ కుటుంబ చరిత్ర గల స్త్రీలలో   ఎక్కువ తరుచుగా గర్భధారణ మధుమేహం సంభవిస్తుంది.

బిడ్డ పుట్టిన తర్వాత గర్భధారణ మధుమేహం సాధారణంగా వెళ్ళిపోయినప్పటికీ, గర్భధారణ మధుమేహం గల ఒక స్త్రీకి తరువాతి జీవితంలో టైప్ 2 మధుమేహం అభివృద్ధి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది.  గర్భధారణ మధుమేహం కలిగిన తల్లులకు పుట్టిన పిల్లలకు కూడా ఊబకాయం మరియు టైప్ 2 మధుమేహం అభివృద్ధి  అయ్యే అవకాశం ఎక్కువ ఉంది.

టైప్ 2 మధుమేహం యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

టైప్ 2 మధుమేహం సంకేతాలు మరియు లక్షణాలు మీరు తెలుసుకోలేనంత తేలికపాటిగా ఉండవచ్చు. భారతదేశంలో దాదాపు 7 కోట్ల మందికి టైప్ 2 మధుమేహం ఉంది మరియు వారికి వ్యాధి వున్నట్టు తెలియదు. చాలా మందికి సంకేతాలు లేదా లక్షణాలు వుండవు. కొంతమంది వ్యక్తులకు లక్షణాలు వుంటాయి అయితే  మధుమేహం అని అనుమానించరు.

లక్షణాలలో ఇవి ఉంటాయి

 • పెరిగిన దాహం
 • పెరిగిన ఆకలి
 • అలసట
 • పెరిగిన మూత్రవిసర్జన, ముఖ్యంగా రాత్రి పూట
 • చెప్పలేని బరువు తగ్గుదల
 • అస్పష్టమైన దృష్టి
 • పాదాలు లేదా చేతుల్లో తిమ్మిరి లేదా జలదరింపు
 • నయం కాని పుళ్ళు

చాలా మందికి దృష్టి అస్పష్టత లేదా గుండె సమస్య వంటి మధుమేహ సమస్యలు కలిగేంతవరకు వారికి మధుమేహం వున్నట్లు కనుగొనలేరు. ఒక వేళ మీకు మధుమేహం వున్నట్లు తొందరగా కనుగొంటే మీ శరీరంనకు జరిగే నష్టాన్ని నివారించేందుకు చికిత్స పొందవచ్చు.

నేను మధుమేహం మరియు ప్రీడయాబెటస్ కొరకు పరీక్ష చేయించుకోవాలా?

30 సంవత్సరాలు లేదా పైబడిన వయస్సు గలవారు ఎవరైనా మధుమేహం మరియు ప్రీడయాబెటస్ పరీక్షించబడడాన్ని పరిగణించాలి. ఒక వేళ మీరు 30 లేదా పైబడి వుంటే మరియు అధిక బరువు వుంటే- బాడి మాస్ ఇండెక్స్ చార్ట్  చూడండి- పరీక్ష చేయించుకోవడం గట్టిగా సిఫార్సు చేయబడింది. ఒక వేళ మీరు 30 కంటే తక్కువ వుండి, అధిక బరువు వుంటే మరియు ఒకటి లేదా ఎక్కువ ఇతర ప్రమాద కారకాలు కలిగి ఉంటే, ఖచ్చితంగా మీరు పరీక్ష చేయించుకోవడాన్ని పరిగణించండి. మీ వైద్యుడిని ఒక A1C పరీక్ష, ఉపవాస రక్తంలో గ్లూకోజ్ పరీక్ష లేదా ఒక మౌఖిక గ్లూకోస్ టాలరెన్స్ పరీక్ష కోసం మీ వైద్యుడిని సంప్రదించండి

మీకు సాధారణ రక్తంలో గ్లూకోజ్, మధుమేహం, లేదా ప్రీడయాబెటస్ ఉంటే మీ వైద్యుడు మీకు తెలుపుతాడు. ఒక వేళ మీకు ప్రీడయాబెటస్ వుందని  చెప్పబడితే, టైప్ 2 మధుమేహం ను నిరోధించుటకు చర్యలను తీసుకోండి.  మరియు  1 సంవత్సరం లోపల మళ్ళీ పరీక్ష చేయించుకోవలేనా అని మీ వైద్యుడిని అడగండి.

ప్రీడయాబెటస్ కలిగి వుండడం అంటే అర్థం ఏమిటి?

ప్రీడయాబెటస్ కలిగివుండడం అంటే, మీ రక్తంలో గ్లూకోజ్ సాధారణ కంటే ఎక్కువ ఉంటుంది కానీ మధుమేహం అని నిర్ధారణ చేయడానికి తగినంత అధికంగా కాదు. 2011 లో, కనీసం 7 కోట్ల భారతీయులు   ప్రీడయాబెటస్ కలిగి ఉన్నారని అంచనా వేయబడ్డారు. ప్రీడయాబెటస్ కలిగివుండడం అంటే మీకు టైప్ 2 మధుమేహం మరియు గుండె జబ్బు వచ్చే ప్రమాదం కూడా వుందని అర్థం. అయితే, ఆరోగ్యకరమైన ఆహారము మరియు శారీరకంగా చురుకుగా ఉండటం ద్వారా కొద్దిగా బరువు కోల్పోవడం వలన మీరు మధుమేహం పొందే అవకాశాలు తగ్గించుకోగలరు మరియు రక్తంలో గ్లూకోజ్ ను కుడా తిరిగి సాధారణ స్థాయిలకు పొందవచ్చు.

అంశాలు టైప్ 2 మధుమేహం యొక్క ప్రమాదాన్ని పెంచుతాయి?

టైప్ 2 మధుమేహం యొక్క  మీ ప్రమాదాన్ని తెలుసుకోవడానికి, మీకు వర్తించే ప్రతి అంశాన్ని చెక్ చేయండి.

 • నాకు 35 లేదా ఎక్కువ వయస్సు ఉంది.
 • నేను అధిక బరువు లేదా ఊబకాయం కలిగివున్నాను.
 • నాకు మధుమేహం కలిగిన ఒక పేరెంట్, సోదరుడు, సోదరి ఉంది.
 • నేను గర్భధారణ మధుమేహం కలిగి వుండినాను.
 • నేను కనీసం 4 కిలోలు బరువు కలిగిన ఒక బిడ్డకు జన్మనిచ్చినాను.
 • నా రక్తపోటు 140/90 లేదా ఎక్కువ ఉంది, లేదా నేను అధిక రక్తపోటు కలిగి వున్నానని చెప్పబడ్డాను.
 • నా కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణ కంటే ఎక్కువ వున్నాయి. నా HDL, లేదా మంచి, కొలెస్ట్రాల్ 35 కంటే క్రింద, లేదా నా ట్రైగ్లిజరైడ్ స్థాయి 250 కి పైన వుంది.
 • నేను బొత్తిగా క్రియారహితం.
 • నేను PCOS అని కూడా పిలిచే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ను కలిగి వున్నాను.
 • మునుపటి పరీక్షలో, నేను ప్రీడయాబెటస్ – 7 నుండి 6.4 శాతం వున్న A1C స్థాయి , ఇంపైర్డ్  ఫాస్టింగ్ గ్లూకోస్ (IFG), లేదా ఇంపైర్డ్  గ్లూకోస్ టోలెరెన్స్ (IGT) కలిగి వుండినాను.
 • నేను నా మెడ లేదా చంకలలో చుట్టూ నల్లటి, వెల్వెట్ లాంటి దద్దుర్ల ద్వారా వర్గీకరించబడే అకన్తోసిస్ నిగ్రికన్స్ వంటి ఇన్సులిన్ నిరోధకతతో సంబంధం కలిగిన ఇతర వైద్య పరిస్థితులను కలిగి ఉన్నాను.
 • నేను కార్డియోవాస్క్యులర్ వ్యాధి చరిత్ర కలిగి ఉన్నాను.

మీరు ఎన్ని ఎక్కువ అంశాలను తనిఖీ చేస్తే మీ ప్రమాదం అంత ఎక్కువ.

నిద్రకు ప్రాధాన్యత ఉందా?

అవును. చికిత్స చేయని నిద్ర సమస్యలు, ముఖ్యంగా స్లీప్ అప్నియా, టైప్ 2 మధుమేహం, పెంచగలదని అధ్యనాలు చూపిస్తున్నాయి. స్లీప్ అప్నియా అనేది నిద్ర పోయేటప్పుడు శ్వాసలో అంతరాయాలు లేక నిస్సార శ్వాసలు ఉండే ఒక సాధారణ రుగ్మత.  స్లీప్ అప్నియా కలిగిన చాలా మందికి వారికి అది వున్నట్లు తెలియదు మరియు అది తరచుగా నిర్థారించబడదు. నిద్రమత్తుతో సమస్యలు కలిగి వుండే నైట్ షిఫ్ట్ లో పనిచేసే వారికి ఊబకాయం మరియు  టైప్ 2 మధుమేహం యొక్క పెరిగే ప్రమాదం వుంది.

మీకు నిద్ర సమస్యలు ఉండవచ్చు అని మీరు భావిస్తే, సహాయం కోసం మీ వైద్యుడిని సంప్రదించండి.

నేను నా టైప్ 2 మధుమేహం  యొక్క ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోగలను?

మీరు టైప్ 2 మధుమేహం పొందే మీ ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు చాలా చేయవచ్చు. మరింత శారీరకంగా చురుకుగా ఉండటం, కొవ్వు మరియు కేలరీలను తీసుకోవడం తగ్గించడం, మరియు కొద్దిగా బరువు కోల్పోవడం అనేవి టైప్ 2 మధుమేహం అభివృద్ధి అయ్యే మీ అవకాశాలు తగ్గించుటకు మీకు సహాయప పడగలవు. మధుమేహ మందు మెట్ఫోర్మిన్ తీసుకోవడం కూడా ప్రమాదాన్ని తగ్గించగలదు, ముఖ్యంగా చిన్నవయస్సు మరియు లావు వ్యక్తులు ప్రీడయాబెటస్ మరియు గర్భధారణ మధుమేహం కలిగిన మహిళలలో. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకోవడం కూడా మీరు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.

ఒకవేళ మీరు అధిక బరువు ఉంటే, అప్పుడు చర్యలు తీసుకోండి:

 • ఒక సహేతుకమైన శరీర బరువును చేరుకోండి మరియు నిర్వహించండి. ఒక 5 నుండి 8 కిలోల బరువు తగ్గడం కూడా ఒక పెద్ద తేడా చూపుతుంది.
 • చాలాసార్లు తెలివైన ఆహార ఎంపికలను చేసుకోండి.
 • ప్రతీ రోజూ శారీరకంగా చురుకుగా ఉండండి.

మీరు బొత్తిగా క్రియారహితంగా ఉంటే, అప్పుడు చర్య తీసుకోండి:

 • ప్రతీ రోజూ శారీరకంగా చురుకుగా ఉండండి.

మీ రక్తపోటు చాలా అధికంగా ఉంటే, అప్పుడు చర్యలు తీసుకోండి:

 • ఒక సహేతుకమైన శరీర బరువును చేరుకోండి మరియు నిర్వహించండి
 • చాలాసార్లు తెలివైన ఆహార ఎంపికలను చేసుకోండి.
 • మీరు సోడియం మరియు మద్యం తీసుకోవడం తగ్గించండి.
 • ప్రతీ రోజూ శారీరకంగా చురుకుగా ఉండండి
 • మీ రక్తపోటు నియంత్రణకు మీకు ఔషధం అవసరం ఉందా అనే దాని గురించి మీ వైద్యునితో మాట్లాడండి.

మీ కొలెస్ట్రాల్ లేదా ట్రైగ్లిజరైడ్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటే, అప్పుడు చర్యలు తీసుకోండి:

 • చాలాసార్లు తెలివైన ఆహార ఎంపికలను చేసుకోండి.
 • ప్రతీ రోజూ శారీరకంగా చురుకుగా ఉండండి
 • మీరు మీ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించటానికి ఔషధం అవసరం ఉందా అనే దాని గురించి మీ వైద్యునితో మాట్లాడండి.

నా ప్రమాదంను తగ్గించుకొనుటకు మార్పులు చేయడం

మీ జీవితంలో పెద్ద మార్పులు చేయడం కష్టం, ముఖ్యంగా మీరు ఒకటి కంటే ఎక్కువ మార్పులు ఎదుర్కొన్నప్పుడు. మీరు ఈ చర్యలను పాటించడం ద్వారా దానిని సులభతరం చేయగలరు:

 • ప్రవర్తనను మార్చుకోవడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోండి.
 • మీరు ఏమి చేస్తారు అని ఖచ్చితంగా నిర్ణయించుకోండి మరియు మీకు మీరే ఒక కాలపరిమితిని నిర్ణయించుకోండి.
 • మీరు సిద్ధం కావడానికి మీకు ఏమి కావలెనో ప్రణాళిక చేసుకోండి.
 • ఒక ఫుడ్ అండ్ ఆక్టివిటీ ట్రాకర్ లో మీ లక్ష్యాలను మరియు కార్యక్రమంను ట్రాక్ చేయండి.
 • మీ లక్ష్యాలను చేరుకోకుండా మిమ్మల్ని ఏది నిరోధించవచ్చు అనే దాని గురించి ఆలోచించండి.
 • మీకు మద్దతు ఇచ్చే మరియు ప్రోత్సహించే కుటుంబాన్ని మరియు స్నేహితులను కనుగొనండి .
 • మీరు ప్లాన్ చేసిన దానిని మీరు చేసినప్పుడు మీకు మీరే ఎలా ప్రతిఫలమిచ్చుకోవలేనో నిర్ణయించుకోండి- ఒక షాపింగ్ ట్రిప్, సినిమా టిక్కెట్లు,  మధ్యాహ్నం పార్క్ లో గడపడం.

మీ వైద్యుడు, ఒక నిపుణుడు లేదా ఒక కౌన్సిలర్ మీకు ఒక ప్రణాళిక తయారు చేయుటకు సహాయపడ గలడు.

ప్రతీ రోజూ శారీరికంగా చురుకుగా వుండండి 

క్రమం తప్పని శారీరక శ్రమ అనేది ఒకేసారి పలు ప్రమాద కారకాలను నిర్వహిస్తుంది. శారీరక శ్రమ మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది; మీ రక్తంలో గ్లూకోజ్, రక్తపోటు, మరియు కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుతుంది; మరియు మీ శరీరం ఇన్సులిన్ ను ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. DPP లోని వ్యక్తులు రోజుకు 30 నిమిషాల చొప్పున వారానికి 5 రోజులు శారీరకంగా చురుకుగా వుండే వారు టైప్ 2 మధుమేహం ప్రమాదాన్ని తగ్గించుకున్నారు. చాలామంది బ్రిస్క్ వాక్ ను ఒక శారీరక కార్యక్రమంగాఎంచుకున్నారు.

ఒక వేళ మీరు చాలా చురుకుగా లేకపోతే, మీరు ఒక వ్యాయామ కార్యక్రమంను నెమ్మదిగా మొదలు పెట్టాలి. మొదట మీకు ఏ రకాలైన వ్యాయామం సురక్షితమో మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో మాట్లాడండి.    కనీసం వారానికి చాలా రోజులు రోజుకు 30 నిముషాల చురుకుగా వుండే మీ లక్ష్యం వైపు కార్యక్రమ స్థాయిని పెంచుటకు ఒక ప్రణాళికను తయారు చేయండి. మీరు మీ శారీరక శ్రమ స్థాయిని రెండు ప్రధాన మార్గాల్లో పెంచగలరు.

 1. ఒక వ్యాయామాన్ని ప్రారంభించండి
 2. మీ రోజువారీ శారీరక కార్యక్రమాన్ని పెంచండి.

ఒక వ్యాయామాన్ని ప్రారంభించండి. మీకు సరిపోయే వ్యాయామాలను ఎంచుకోండి. మీతో నడవడానికి ఒక స్నేహితుడిని కనుగొనండి లేదా వ్యాయామ తరగతిలో చేరండి అది మీరు కొనసాగించేదానికి సహాయపడుతుంది.

 • మీ గుండె వేగంగా కొట్టుకునేటట్లు చేయడానికి మీ పెద్ద కండరాలను ఉపయోగించుకునే ఏరోబిక్ కార్యకలాపాలు చేయండి. మీ పెద్ద కండరాలు ఎగువ మరియు దిగువ చేతులు; ఎగువ మరియు దిగువ కాళ్లు; మరియు తల, భుజం, మరియు హిప్ కదలికలను నియంత్రించేవి.
 • బరువులు ఎత్తడం, లేదా సిట్ అప్స్ వంటి కండరాలు మరియు ఎముకను బలోపేతం చేసే చర్యలు వారానికి రెండు నుండి మూడు సార్లు చేయండి. ఈ వ్యాయామాలు ఎలా చేయాలో నేర్చుకొనుటకు సహాయం కనుగొనండి—ఒక వీడియో లేదా ఒక తరగతి వంటివి.

మీ రోజువారీ శారీరక కార్యక్రమాన్ని పెంచండి.

మీరు ఆనందించే కార్యకలాపాలు ఎంచుకోండి. మీరు ఈ క్రింది వాటినిచేయడం ద్వారా మీ రోజువారీ దినచర్యలో అదనపు పని చేయవచ్చు:

 • TV చూడటం లేదా కంప్యూటర్ వద్ద గడిపే సమయం తగ్గించడం ద్వారా రోజువారీ కార్యక్రమాన్ని పెంచండి. ఒక ఆక్టివిటీ బ్రేక్ తీసుకోవడానికి మీ కంప్యూటర్లో ఒక రిమైండర్ ను ఏర్పాటు చేసుకోండి.
 • ఒక ఎలివేటర్ లేదా ఎస్కలేటర్లు బదులు మెట్లను ఉపయోగించండి.
 • పార్కింగ్ కు దూరంగా పార్క్ చేసి నడవండి.
 • కొన్ని స్టాప్ల ముందే దిగండి మరియు మిగతా దారివెంట నడవండి.
 • మీరు చేయగలిగినప్పుడు నడవండి లేదా సైకిల్ తొక్కండి.

మీకు సూచించిన మందులు తీసుకోండి

కొంతమందికి వారి రక్తపోటు లేదా కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించటానికి సహాయంగా ఔషధం అవసరం. ఒక వేళ మీకు అవసరం అయితే, నిర్దేశించిన ప్రకారం మీ మందులు తీసుకోండి. మీరు టైప్ 2 మధుమేహం నిరోధించడానికి మెట్ఫోర్మిన్ తీసుకోవాల్సి ఉంటుందా అని మీ వైద్యుడుని అడగండి. మెట్ఫార్మిన్ ఇన్సులిన్ ను బాగా పని చేయించడానికి మరియు టైప్ 2 మధుమేహం యొక్క ప్రమాదం ను తగ్గించగల ఒక మందు.

తినడం, డైట్, మరియు న్యూట్రిషన్

మీరు తినే, ఆహారం, మరియు న్యూట్రిషన్ ఎంపికలు మధుమేహంను నివారించడానికి లేదా ఆలస్యం చేయడానికి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒక సహేతుకమైన బరువును నిర్వహించడానికి మరియు ఎక్కువ సార్లు తెలివైన ఆహార ఎంపికలను చేయుటకు కింది సూచనలను అనుసరించండి. మీ అలవాట్లను మార్చుకొనుటకు సమయం పడుతుందని గుర్తించుకోండి  మరియు మీరు ఓపికపట్టండి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీకు మద్దతు ఇవ్వడానికి డైటీషియన్ నుండి సహాయం కూడా పొందవచ్చు లేదా బరువు తగ్గే కార్యక్రమం లో చేరవచ్చు.

ఒక సహేతుకమైన శరీర బరువుకు చేరండి మరియు నిర్వహించండి

మీ బరువు మీ ఆరోగ్యంను అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. అధిక బరువు మీ శరీరంను ఇన్సులిన్ తయారు చేయకుండా మరియు సరిగ్గా ఉపయోగించకుండా ఉంచుతుంది. అదనపు శరీర బరువు అధిక రక్తపోటుకు కారణమవుతుంది. మీరు కోల్పోయే ప్రతి పౌండ్ మధుమేహం పొందే ప్రమాదంను తగ్గిస్తుంది.

అధిక బరువుకు తోడు, కొవ్వు శరీరంలో ఏ స్థానంలో వుంది అనేది ముఖ్యమైనదికావచ్చు. మగవారికి 90 సెం.మీ. లేదా అంతకంటే ఎక్కువ నడుము కొలత మరియు ఆడవారికి 80 సెం.మీ. లేదా అంతకంటే ఎక్కువ నడుము కొలత ఇన్సులిన్ నిరోధకతతో ముడిపడి ఉంటుంది మరియు ఒక వ్యక్తి  యొక్క  టైప్ 2 మధుమేహం యొక్క ప్రమాదాన్ని పెంచుతుంది. మీ BMI సాధారణ పరిధిలోకి వచ్చినా కూడా ఇది నిజం.

మీ నడుము కొలత

మీ నడుము కొలవటానికి,

 • తుంటి ఎముక పైననే మామూలు ఉదరం చుట్టూ ఒక టేపు కొలతను ఉంచండి
 • టేప్ సౌకర్యవంతమైనదిగా వుండాలి కానీ చర్మంలోకి చొచ్చుకొని ఉండకుండా మరియు నేలకు సమాంతరంగా ఉండేలా నిర్ధారించుకోండి
 • రిలాక్స్ అవ్వండి, ఊపిరి విడచండి మరియు కొలచండి

మీ BMI కనుగొనండి

BMI (బాడీ మాస్ ఇండెక్స్) అనేది ఎత్తుతో సంబంధము కలిగిన శరీర బరువు యొక్క ఒక కొలమానం.   BMI అనేది మీరు సాధారణ బరువు, అధిక బరువు, లేదా ఊబకాయంతో వున్నారా అనే కనుగొనేందుకు సహాయపడవచ్చు.

 • ఎడమ చేతి కాలమ్ లో వ్యక్తి యొక్క ఎత్తును కనుగొనండి.
 • వ్యక్తి యొక్క బరువు దగ్గరగా వున్న సంఖ్యను కనుగొనేందుకు అడ్డంగా కదలండి
 • రంగు ప్రాంతం వద్ద ఉన్న సంఖ్య మీ మీరు సాధారణ బరువు, అధిక బరువు, లేదా ఊబకాయం వున్నారా అని చూడటానికి మీ BMI పై ఉన్న రంగు బాక్స్ ను చెక్ చేయండి

BMI కి కొన్ని పరిమితులున్నాయి. BMI అథ్లెట్ల  మరియు ఒక కండరాల శరీరము కలవారి విషయములో అతిగా అంచనా వేయవచ్చును మరియు కండరాల కోల్పోయిన వృద్ధులు మరియు ఇతరుల విషయములో తక్కువ అంచనా వేయవచ్చును.

.

పిల్లలు మరియు యువకుల కొరకు వయస్సు, ఎత్తు, బరువు, మరియు సెక్స్ ఆధారంగా BMI నిర్ణయించాలి.

మీకు అధిక బరువు లేదా ఊబకాయం ఉంటే సరైనఆకారం పొందుటకు మార్గాలు ఎంచుకోండి:

 • క్రాష్ డైట్ లను నివారించండి. బదులుగా, మీరు సాధారణంగా తీసుకునే ఆహారాలను తక్కువ తినండి. మీరు తినే కొవ్వును పరిమితం చేయండి.
 • మీ శారీరక కార్యక్రమాన్ని పెంచండి. వారానికి చాలా రోజులు కనీసం 30 నిమిషాల శారీరక శ్రమను లక్ష్యంగా పెట్టుకోండి.
 • కనీసం వారానికి ½ kg బరువు తగ్గే సహేతుకమైన ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. మీ మొత్తం శరీరం బరువులో 5 నుంచి 7 శాతం తగ్గే ఒక దీర్ఘ కాలిక లక్ష్యాన్ని పెట్టుకోండి.

చాలాసార్లు తెలివైన ఆహార ఎంపికలను చేయండి

మీరు ఏమి తింటారు అనేది మీ ఆరోగ్యంపై ప్రభావం కలిగి వుంటుంది. తెలివైన ఆహార ఎంపికలు చేసుకోవడం ద్వారా, మీరు మీ శరీర బరువు, రక్తంలో గ్లూకోజ్, రక్తపోటు, మరియు కొలెస్ట్రాల్ నియంత్రించేందుకు సహాయపడవచ్చు.

 • మీరు తీసుకునే ఆహారాల సెర్వింగ్ పరిమాణాలను పరిశీలించండి. ప్రధాన కోర్సులు, మాంసం, డెసెర్ట్స్, మరియు అధిక క్రొవ్వు గల ఇతర ఆహారాల సెర్వింగ్ పరిమాణాలు తగ్గించండి. మీరు ప్రతి భోజనంలో తినే పండ్లు మరియు కూరగాయల మొత్తాన్ని పెంచండి. ఒక చిన్న ప్లేట్ ను ఉపయోగించడానికి ప్రయత్నించండి.
 • మీ తీసుకునే మొత్తం కొవ్వు కేలరీలను 25 శాతంనకు పరిమితం చేయండి. ఉదాహరణకు, ఒక వేళ మీ ఆహార ఎంపికలు 2,000 కేలరీలు ఒక రోజు వరకు జోడించి ఉంటే, 56 శాతం కంటే ఎక్కువ గ్రాముల కొవ్వు తినకుండా వుండే దానికి ప్రయత్నించండి. మీ వైద్యుడు లేదా ఒక నిపుణుడు మీరు ఎంత కొవ్వును తీసుకోవలెనో గుర్తించడానికి సహాయపడుతాడు. మీరు కొవ్వు కంటెంట్ కోసం ఆహార లేబుల్స్ ను కూడా తనిఖీ చేయవచ్చు.
 • ఉప్పును ప్రతీ రోజూ 2,300 మిల్లీగ్రాముల —1 టీ స్పూన్ ఉప్పు— కంటే తక్కువకు పరిమితం చేయండి.
 • మీరు మద్య పానీయాలు తాగవచ్చో లేదో అనే దాని గురించి మీ వైద్యునితో మాట్లాడండి. మీరు మద్య పానీయాలు తాగడానికి ఎంచుకుంటే, మహిళల కొరకు ఒక పానీయం లేదా పురుషుల కొరకు రోజుకు రెండు పానీయాలు తీసుకోవడం వరకు పరిమితం చేయండి.
 • ప్రతీ రోజు మీరు తీసుకునే కేలరీల సంఖ్యను తగ్గించాలని మీరు అనుకోవచ్చు. DPP జీవనశైలి మార్పు సమూహంలోని వ్యక్తులు సగటున 450 కేలరీలు వారి రోజువారీ క్యాలరీ మొత్తం తగ్గించుకున్నారు. మీ వైద్యుడు లేదా డైటిషియన్ బరువు తగ్గుదల యొక్క ప్రాధాన్యతను ఎత్తి చూపే ఒక ఆరోగ్యకరమైన ఆహారం ప్రణాళికతో మీకు సహాయం చేయవచ్చు.
 • ఆహార మరియు శారీరక కార్యక్రమాన్ని సూచించే లాగ్ ను ఉంచుకోండి. మీరు ఏమి తింటారో మరియు ఎంత శారీరక కార్యక్రమాన్ని చేస్తున్నారో వ్రాయండి. ట్రాక్ ను ఉంచుకున్న వారు బరువు కోల్పోవడంలో మరింత విజయవంతమైనారు.
 • మీరు మీ లక్ష్యాన్ని చేరినప్పుడు, ఒక ఆహారేతర అంశం లేదా సినిమా చూడడం వంటి ఒక కార్యక్రమాన్ని బహుమతిగా ఇచ్చుకోండి.

డయటరీ సప్లిమెంట్స్

విటమిన్ D అధ్యయనాలు, ఆరోగ్యకరమైన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించే ప్రజల యొక్క సామర్ధ్యం మరియు వారి రక్తంలో తగినంత విటమిన్ డి కలిగి ఉండటం మధ్య సంబంధాన్ని చూపిస్తాయి. అయితే, మధుమేహం గల వ్యక్తుల  కొరకు మరియు మధుమేహంను నిరోధించడం కొరకు సరైన విటమిన్ D స్థాయిలు గుర్తించడానికి అధ్యయనాలు నిరంతరం కొనసాగుతున్నాయి; మధుమేహం గల వ్యక్తులకు విటమిన్ D స్థాయిలు లేదా సప్లిమెంట్స్ గురించి ప్రత్యేక సిఫార్సులు చేయబడలేదు.

ప్రస్తుతం, ప్రస్తుత సైన్స్ ఆధారంగా సప్లిమెంట్ స్థాయిలను సిఫార్సు చేసే ఏజెన్సీ అయిన, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ (IOM) రోజువారీ తీసుకునే విటమిన్ D కొరకు క్రింది మార్గదర్శకాలను అందిస్తుంది:

 • 1 నుంచి 70 సంవత్సరాలు వయస్సున్న ప్రజలకు 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ (IU) అవసరం కావచ్చు
 • 71 మరియు ఎక్కువ వయసున్న ప్రజలకు 800 IUS అవసరం కావచ్చు

రోజుకు 4000 IUS కి మించి విటమిన్ D ను తీసుకోకూడదని IOM సిఫార్సు చేసింది.

సమన్వయ మరియు సురక్షిత సంరక్షణను నిర్ధారించడానికి సహాయం చేసేందుకు, ఆహార ప్రత్యామ్నాయ పదార్ధాల యొక్క మీ ఉపయోగం తో సహా కాంప్లిమెంటరి మరియు ప్రత్యామ్నాయ వైద్య పద్ధతుల యొక్క మీ వాడుక గురించి మీరు మీ వైద్యునితో చర్చించాలి.

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు