అనుభూతులు
మీ వంటి అనేక మంది టీన్స్ మధుమేహంను ప్రతి రోజూ ఎదుర్కొంటారు. చాలా సార్లు, ఇది సమస్య కాదు, మీరు దానిని ఎదుర్కొంటారు. కాకపోతే కొన్ని సార్లు, మీరు అది దూరంగా వెళ్లాలని అనుకుంటారు.
మీరు ఎప్పుడైనా…
- “ఎందుకు నేను” అడిగారా?
- మీరు ఒక్కరు మాత్రమే బాధగా, తిక్కగా, ఒంటరిగా, భయంగా, లేక భిన్నంగా ఉన్నారని భావిస్తున్నారా?
- మీరు అధిక బరువు ఉంటే మిమ్మల్ని ఎగతాళి చేయడం వలన ఇతరులతో విసిగి పోయారా?
- మీ మధుమేహం గురించి మిమ్మల్ని లేదా మీ కుటుంబంను నిందిస్తారా?
ఈ భావాలు అన్నీ సాధారణమైనవి. మధుమేహం కలిగిన టీన్స్ చాలామంది ఇదే విధంగా భావిస్తారు. ఎప్పుడైనా ఒకసారి కోపం తెచ్చుకోవడం, బాధ పడడం, లేక మీరు భిన్నమైనవారు అని భావించడం పర్వాలేదు. కానీ అప్పుడు మీరు బాధ్యత తీసుకొని మంచిగా భావించడానికి ఏదో ఒక్కటి చేయండి.
అందరూ కొన్నిసార్లు కృంగిపోయినట్లుగా భావిస్తారు. మీరొక్కరే కాదు.
ఇప్పటికీ కృంగిపోయే వున్నారా?
సహాయం కోసం చేరుకోండి. మీ కుటుంబంలో ఒకరితో లేక మీరు పూజించే ప్రదేశంలో ఒకరితో, ఒక స్నేహితునితో, ఒక స్కూల్ కౌన్సిలర్, టీచర్, లేక మీ వైద్యునితో, లేక మధుమేహం ఎడ్యుకేటర్ తో మాట్లాడండి. ఇది ఒక పత్రికలో మీ భావాలు వ్రాయడానికి సహాయపడగలదు. మీకు ఇప్పటికీ కృంగి పోయినట్లు లేదా విచారంగా అనిపిస్తే, మీరు ఒక కౌన్సిలర్ ను కనుగొనేందుకు సహాయం చేయమని మీ తల్లిదండ్రులను అడగండి.
సహాయం కోసం అడగడం పర్వాలేదు.
మాట్లాడండి
మీ గురించి శ్రద్ధ వహించడానికి మరియు మీరు ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండడానికి మీకు సహాయం చేయడానికి అనేక మంది ఉన్నారు. మీ ఆరోగ్య సంరక్షణ జట్టు (మధుమేహ అధ్యాపకుడు, డైటిషియన్, వైద్యుడు , నర్స్, మనస్తత్వవేత్త, మరియు సామాజిక కార్యకర్త) ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు తయారు చేసుకొనుట, మరింత చురుకుగా, మీ గురించి మీరు మంచిగా అనుకొనుటకు ఎలా అనే దాని గురించి నేర్చుకొనుటకు మీకు సహాయం చేస్తుంది. మీరు వారితో సన్నిహితంగా ఉండండి. మీరు ఏవిధంగా భావిస్తున్నారు మరియు మీకు ఏది అవసరమో మీ ఆరోగ్య సంరక్షణ జట్టుకు తెలుపండి.
ఏం జరుగుతోంది అని మీ పాఠశాలకు తెలియజేయండి
పాఠశాల నర్స్, ఉపాధ్యాయుడు, లేదా ఇతర పాఠశాల సిబ్బందికి మీరు లేదా మీ తల్లి దండ్రులు మీ మధుమేహ కేర్ ప్రణాళిక యొక్క ఒక కాపీని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీ పాఠశాల వద్ద ప్రజలు మీకు మధుమేహం వుందని మరియు మీరు ఆరోగ్యకరమైన ఆహారాలు తినాల్సిన, సమయానికి మీ భోజనం తినాల్సిన, మందులు తీసుకోవాల్సిన మరియు శారీరకంగా హుషారుగా ఉండాల్సిన అవసరం వుందని తెలుసుకోనివ్వండి.
పాఠశాల కార్యక్రమాలల్లో పాల్గొనడానికి మీ మధుమేహం మిమ్మల్ని ఆపడాన్ని అనుమతించవద్దు. మీ స్నేహితుడు చేసే పనులన్నింటిని మరియు ఆపై కొన్నింటిని మీరు చేయవచ్చు.
తల్లి, తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు,దానికి అలవాటు పడాలి!
మీ మొత్తం కుటుంబం మీతో పనిచేసినప్పుడు, మధుమేహంను నిర్వహించడం సులభం. కాబట్టి …
మీ కుటుంబాన్ని మీరు తినే ఆరోగ్యకర ఆహారాలనే ఎంపిక చేసుకోమని అడగండి –పండ్లు మరియు కూరగాయలు; హోల్ గ్రైన్స్ బ్రెడ్లు; మరియు తక్కువ కొవ్వు గల మాంసాలు, పాలు, మరియు వెన్న. ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారాలను ఉంచమని మరియు కుకీస్, కేక్, క్యాండి, లేక రెగ్యులర్ సోడాలతో టెంప్ట్ చేయవద్దని అడగండి.
ప్రతి ఒక్కరినీ శారీరకంగా మరింత చురుకుగా వుంచడం ద్వారా కదల్చండి. బాగా ఆడండి. సూట్ హూప్స్, త్రోబాల్, బైక్స్ రైడ్, లేక నడకకు పోవడం– ఒకటిగా. హుషారుగా వుండడం ద్వారా సేదదీరడానికి మరియు తక్కువ ఒత్తిడి.
మీకు ఏది ఆరోగ్యకరమో మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ అదే ఆరోగ్యకరము.
మీ లాగా భావించే ఇతర టీన్స్ తో కలవాలనుకుంటున్నారా?
క్లినిక్లు, ఆరోగ్య కేంద్రాలు, లేదా ఆసుపత్రులలో మధుమేహంతో ఉన్న టీన్స్ కొరకు కార్యక్రమాలు మరియు సపోర్ట్ గ్రూపులను చూడవచ్చు. మీకు పని చేసే ఒకదానిని కనుగొనడానికి సహాయం కోసం మీ మధుమేహ అధ్యాపకుడు లేదా వైద్యుడిని అడగండి.
మధుమేహం లేదా బరువు తగ్గే ఒక వేసవి శిబిరానికి వెళ్ళండి. మీరు ఇతర క్యాంపర్లు చేసే అన్ని పనులు చేస్తారు: ఈత, నడక, నాట్యం, మరియు ఇతరములు. మీలాగే ప్రతి ఒక్కరికీ మధుమేహం ఉంది లేదా బరువు కోల్పోవటానికి అక్కడ ఉన్నారు అనేది అన్నిటికంటే ఉత్తమమైన విషయం. వేసవి శిబిరాలకు హాజరయ్యేందుకు టీన్స్ కోసం చెల్లించడంలో సహాయపడటానికి కొన్ని సమూహాలు నిధులను కలిగి ఉండవచ్చు.
ఇతర మధుమేహంతో వున్న టీన్స్ యొక్క ఒక ఆన్లైన్ మద్దతు సమూహం లేదా ఇతర ఆన్లైన్ కమ్యూనిటీని కనుగొనండి. కొన్నిసార్లు వేరొకరితో మధుమేహం వుండడం గురించి మీరు ఎలా భావిస్తున్నారో అని పంచుకోవడం మంచిది.
ఈ చిట్కా షీట్ చివరిలో ఉన్న రిసోర్సెస్ ను చూడండి.
ఇప్పటికీ నా స్నేహితుడేనా?
ఎప్పుడైనా మీ స్నేహితులు మధుమేహం గురించి తప్పు ఆలోచనలు కలిగి ఉంటే ఆందోళన చెందుతారా?
- మీకు మధుమేహం వుందని వారికి చెప్పండి. దానిని మీలో మీరే ఉంచుకోవలసిన అవసరం లేదు. మధుమేహం గురించి ఎంత ఎక్కువ తెలిస్తే వాళ్ళు అంత ఎక్కువ అర్థం చేసుకుంటారు. మీరు తీసుకునే ఆహారంను ఉపయోగించడానికి మీ శరీరానికి సహాయం అవసరమని వివరించండి.
- మధుమేహాన్ని మీ నుండి ఎవరూ తీసుకోలేరని ప్రతి ఒక్కరికి తెలుసునని నిర్థారించండి.
- మంచి స్నేహితులు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. వాళ్ళు మీ అవసరాలను అర్థం చేసుకొంటారు మరియు మద్దత్తు అందిస్తారు. మీరు బయట తింటున్నప్పుడు ఆరోగ్య ఆహారాల ఎంపికలలో మీకు సహాయం చేసే స్నేహితుల మీద ఆధార పడండి.
ఎప్పుడైనా పిల్లలు మీ మధుమేహం లేదా బరువు గురించి మిమ్మల్ని ఎగతాళి చేసారా?
ఆపమని వారికి చెప్పండి. ఒకవేళ వారు అలా చెయ్యకపోతే సహాయం కోసం అడగండి.
ఎవరితోనైనా మాట్లాడండి… ఒక స్నేహితునికి ఇమెయిల్ చేయండి … ఒక పత్రికలో మీ భావాలు వ్రాయండి… టచ్ లో ఉండండి
చర్య తీసుకోండి!
ఇది మీరు మీ మధుమేహం సంరక్షణ గురించి ఏదైనా చేయాల్సిన సమయం.
మీరు ఏమి చేస్తారు అనే దాని కోసం లక్ష్యాలను ఏర్పాటు చేయండి. చిన్నగా ప్రారంభించండి మరియు మీ మార్గంలో పనిచేయండి. ఉదాహరణకు: “నేను సాధారణ సోడా తగ్గిస్తాను మరియు బదులుగా నీరు త్రాగుతాను.” అది బాగా జరుగుతున్నప్పుడు … తర్వాతి అడుగు వేయండి. ఇంకొక లక్ష్యాన్ని జత చేయండి– “నేను వారానికి కొన్ని సార్లు నాట్యం చేస్తాను లేక బైక్ రైడ్ చేస్తాను”. అప్పుడు ఒక క్రొత్త లక్ష్యాన్ని జత చేయండి— “నేను చిన్న సర్వింగ్స్ కుకీలు, బర్గర్లు, మరియు వేపుళ్ళను తింటాను.”
ప్రతి కొత్త లక్ష్యాన్ని కొంచెం కష్టమైనదిగా చేయడానికి ప్రయత్నించండి. మీరు ఒక వారానికి రెండుసార్లు హూప్స్ ఆడిన తరువాత మిగతా ఇతర మూడు రోజులకు మరొక కార్యక్రమాన్ని జోడించడానికి ప్రయత్నించండి. మీకు సరిపోయే ఒక స్థాయి చేరుకునే వరకు లక్ష్యాన్ని పెంచండి.
చేరుకోవడానికి చాలా కష్టమైన లక్ష్యాలను వదిలి వేయండి. ఉదాహరణకు, ఇకపై మరల నేను బర్గర్ లేక క్యాండి బార్ తినను అని చెప్పడానికి బదులు, వారానికి ఒక్కటి మాత్రమే తింటాను అని చెప్పండి.
మీ లక్ష్యాల గురించి మీ కుటుంబం లేదా స్నేహితులతో చెప్పండి. బహుశా వారు మీతో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదా ఇంకొక మార్గంలో సహాయం చేస్తారు.
మీరు ప్రతి లక్ష్యం చేరినప్పుడు మిమ్మల్ని మీరు అభినందించుకోండి. బహుమతులు ఏవైనా కావచ్చు– ఆహారం మాత్రమే కాదు అని మనసులో పెట్టుకోండి. మీరు ఒకేసారి అన్ని మీ లక్ష్యాలను చేరుకోవ లసిన అవసరం లేదు. ఒకటి లేదా రెండిటితో ప్రారంభించండి, ఆ తర్వాత మరిన్నిటిని జోడించండి.
మీ మొదటి మూడు లక్ష్యాలను వ్రాయండి– వెనుక పేజీలో వున్న చార్టును ఉపయోగించండి.
మీ మొదటి మూడు లక్ష్యాలను వ్రాయండి
మీరు నిజంగా చేరుకోగల లక్ష్యాలను ఎంచుకోండి. మీ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న మరియు మీరు దానిని చేరుకున్న తేదీని వ్రాయండి.
అర్థం అయ్యిందా
ఒక సమయంలో ఒక స్టెప్ మాత్రమే తీసుకోండి. ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను చేసుకోండి, మరింత చురుకుగా వుండండి, మరియు సరైన బరువు కోసం పనిచేయండి. త్వరలో మీరు పురోగతి చూస్తారు మరియు గొప్పగా అనుభూతి చెందుతారు.