ఇన్సులిన్ నిరోధకత మరియు ప్రీడయాబెటస్

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456


ఇన్సులిన్ అంటే ఏమిటి
?

ఇన్సులిన్ కడుపు వెనుక ఉన్న అవయవం అయిన ఒక క్లోమంలో తయారు చేయబడే ఒక హార్మోన్. క్లోమం ఐలెట్స్ అనబడే కణాల సమూహాలను కలిగి వుంటాయి. ఐలెట్స్ లోని బీటా కణాలు ఇన్సులిన్ ను తయారుచేసి మరియు దానిని రక్తంలోకి విడుదల చేస్తాయి.

ఇన్సులిన్ జీవక్రియలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది – శరీరం శక్తి కోసం జీర్ణమయ్యే ఆహారమును ఉపయోగించే పద్ధతి. ఆహార నాళము కార్బోహైడ్రేట్స్ ను- అనేక ఆహారాలలో కనిపించే చక్కెరలు మరియు పిండి పదార్ధాలు- గ్లూకోజ్ గా విడకోట్టుతుంది. గ్లూకోజ్ అనునది రక్తప్రవాహంలోనికి ప్రవేశించే ఒక చక్కర రూపము. ఇన్సులిన్ సహాయంతో శరీరము అంతా వున్న కణాలు గ్లూకోజ్ ను గ్రహించి మరియు దానిని శక్తి కోసం ఉపయోగిస్తాయి.

రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఇన్సులిన్ యొక్క పాత్ర

రక్త గ్లూకోజ్ స్థాయిలు ఒక భోజనం తర్వాత పెరిగినపుడు, క్లోమం రక్తంలోకి ఇన్సులిన్ ను విడుదల చేస్తుంది. అప్పుడు ఇన్సులిన్ మరియు గ్లూకోజ్ రక్తమునుండి శరీరములోని అన్ని కణాల లోనికి ప్రయాణిస్తాయి.

 • ఇన్సులిన్ కండరము, కొవ్వు మరియు కాలేయ కణాలకు రక్త ప్రవాహము నుండి గ్లూకోజ్ ను పీల్చుకోనడానికి సహాయపడుతుంది, దాని వలన రక్త గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి.
 • ఇన్సులిన్ కాలేయము మరియు కండరము కణజాలమును గ్లూకోజ్ ను ఎక్కువగా నిల్వ ఉంచేలా ప్రేరేపిస్తుంది. గ్లూకోజ్ నిల్వ రూపంను గ్లైకోజెన్ అంటారు.
 • ఇన్సులిన్ కాలేయంలో గ్లూకోస్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా రక్త గ్లూకోజ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది.

ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిలో, ఈ విధులు రక్త గ్లూకోజ్ మరియు ఇన్సులిన్ స్థాయిలు సాధారణ స్థాయిలో ఉండటానికి అనుమతిస్తుంది.

క్లోమం ఐలెట్స్ అను కణాల సమూహాలను కలిగి వుంటాయి. ఐలెట్స్ లోని బీటా కణాలు ఇన్సులిన్ ను తయారు చేసి మరియు దానిని రక్తంలోకి విడుదల చేస్తాయి.

ఇన్సులిన్ నిరోధకత అంటే ఏమిటి?

ఇన్సులిన్ నిరోధకత అనేది ఒక పరిస్థితి, దానిలో శరీరం ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది కానీ, దానిని ప్రభావవంతంగా ఉపయోగించలేదు. ప్రజలు ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉన్నప్పుడు, టైప్ 2 మధుమేహం లేదా ప్రీడయాబెటస్ కు దారితీస్తూ, గ్లూకోజ్  కణాల ద్వారా గ్రహించబడడానికి బదులుగా రక్తంలో పేరుకుపోతుంది.

ఇన్సులిన్ నిరోధకత ఉన్న చాలా మందికి వారు అనేక ఏళ్లుగా దానిని కలిగి ఉన్నారని తెలియదు- వారిలో ఒక తీవ్రమైన, జీవితకాల వ్యాధి అయిన టైప్ 2 మధుమేహం అభివృద్ధి అయ్యే వరకు తెలియదు. శుభవార్త ఏమిటంటే, వారు ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉన్నారని ప్రజలు మొదట్లోనే తెలుసుకుంటే, వారి జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా  చాలాసార్లు వారు మధుమేహంను నిరోధించగలరు లేదా ఆలస్యం చేయగలరు.

ఇన్సులిన్ నిరోధకత ఒక వివిధమైన తీవ్రమైన ఆరోగ్య రుగ్మతలకు దారితీస్తుంది. “జీవక్రియ వైపరీత్యం అంటే ఏమిటి? అనే విభాగము ఇన్సులిన్ నిరోధకత లింక్ చేయబడిన ఇతర ఆరోగ్య రుగ్మతల గురించి మరింత సమాచారాన్ని అందిస్తుంది.

ఇన్సులిన్ నిరోధకత వలన ఏమి జరుగుతుంది?

ఇన్సులిన్ నిరోధకతలో, కండరము, కొవ్వు, మరియు కాలేయ కణాలు ఇన్సులిన్ కు సరిగా స్పందించవు, అందువలన రక్తప్రవాహం నుండి గ్లూకోజ్ ను సులభముగా గ్రహించవు. ఫలితంగా, గ్లూకోజ్ కణాలలో చేరటములో సహాయ పడేందుకు శరీరానికి ఇన్సులిన్ అధిక స్థాయిలో కావాలి.

క్లోమములోని బీటా కణాలు ఈ పెరిగిన అవసరము కొరకు మరింత ఉత్పత్తి చేయడం ద్వారా ఇన్సులిన్ కోసం ఈ పెరిగిన డిమాండ్ ను అందుకునేందుకు ప్రయత్నిస్తాయి.ఇన్సులిన్ నిరోధకత అధిగమించడానికి తగినంత ఇన్సులిన్ ను బీటా కణాలు ఉత్పత్తి చేయగలిగినంత కాలము రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఆరోగ్యకరమైన పరిధిలో వుంటాయి.

కాలక్రమేణా, బీటా కణాలు శరీరం యొక్క పెరిగిన ఇన్సులిన్ అవసరంను అందుకొనడానికి విఫలము   కావడం వలన ఇన్సులిన్ నిరోధకత టైప్ 2 మధుమేహం మరియు ప్రీడయాబెటస్ కు దారితీయవచ్చు. తగినంత ఇన్సులిన్ లేకుండా, అధిక గ్లూకోజ్ రక్తప్రవాహంలో నిలువచేయబడి మధుమేహం, ప్రీడయాబెటస్, మరియు ఇతర తీవ్రమైన ఆరోగ్య వ్యాధులకు దారి తీస్తుంది.

ఏది ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తుంది?

ఇన్సులిన్ నిరోధకత యొక్క ఖచ్చితమైన కారణాలు పూర్తిగా అర్థం కానప్పటికీ, ఇన్సులిన్ నిరోధకతకు ప్రధాన కారణాలుగా అదనపు బరువు మరియు శారీరక స్తబ్దత అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అదనపు బరువు

కొందరు నిపుణులు స్థూలకాయం, ముఖ్యంగా నడుము చుట్టూ వున్న అదనపు కొవ్వు, ఇన్సులిన్ నిరోధకత యొక్క ఒక ప్రాథమిక కారణం అని నమ్ముతారు. శాస్త్రవేత్తలు కొవ్వు కణజాలం పూర్తిగా శక్తి నిల్వ చేసే పనికే అనుకునేవారు. అయితే, అధ్యయనాలు కడుపులోని కొవ్వు ఇన్సులిన్ నిరోధకత, అధిక రక్తపోటు, అసమతుల్య కొలెస్ట్రాల్, మరియు కార్డియోవాస్క్యులర్ డిసీజ్ (CVD) వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగించే హార్మోన్లు మరియు ఇతర పదార్థాలను ఉత్పత్తి చేస్తుందని చూపాయి.

కడుపులోని కొవ్వు శరీరంలో దీర్ఘకాలిక లేదా అంతములేని, మంటను అభివృద్ధి చేయడములో ఒక భాగముగా పనిచేస్తుంది. దీర్ఘకాలిక శోథన ఏ చిహ్నాలు లేదా లక్షణాలు లేకుండా, కాలానుగుణంగా శరీరంను దెబ్బతీయగలదు. శాస్త్రవేత్తలు కొవ్వు కణజాలంలోని సంక్లిష్ట  పరస్పర చర్యలు రోగనిరోధక కణాలను ఆ ప్రాంతమునకు  తీసుకొని వచ్చి తక్కువ స్థాయి దీర్ఘకాలిక మంటను ప్రేరేపిస్తాయని కనుగొన్నారు. ఈ మంట ఇన్సులిన్ నిరోధకత, టైప్ 2 మధుమేహం, మరియు CVD అభివృద్ధికి దోహదం చేస్తుంది. బరువు కోల్పోవడం అనేది ఇన్సులిన్ నిరోధకతను తగ్గించగలదు మరియు టైప్ 2   మధుమేహం నిరోధించగలదు లేదా ఆలస్యం చేయగలదు అని పరిశోధనలు చూపిస్తున్నాయి.

శారీరక స్తబ్దత

అనేక అధ్యయనాలు శారీరక స్తబ్దత ఇన్సులిన్ నిరోధకత సంబంధం గలిగి వుండి చాలాసార్లు టైప్ 2   మధుమేహమునకు దారి తీస్తుంది అని చూపించాయి. శరీరంలో, గ్లూకోజ్ ను ఇతర టిష్యూల కన్నా ఎక్కువగా కండరాలు ఉపయోగిస్తాయి.

సాధారణంగా, చురుకైన కండరాలు రక్త గ్లూకోజ్ స్థాయిలను సంతులనముగా ఉంచుతూ  , శక్తి కోసం వాటి నిల్వ చేయబడిన  గ్లూకోజ్ ను  కాల్చి  మరియు రక్తప్రవాహం నుండి తీసుకున్న గ్లూకోజ్ తో వాటి నిల్వలను నింపుతుంది.

అధ్యయనాలు వ్యాయామం తర్వాత  కండరాలు ఇన్సులిన్ పట్ల మరింత సున్నితంగా మారి, నిరోధకతను తిరగేసి మరియు రక్త గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడం జరుగుతుంది.  వ్యాయామం  ఇన్సులిన్ అవసరం లేకుండా ఎక్కువ గ్లూకోజ్ గ్రహించడం కొరకు కూడా కండరాలకు సహాయపడుతుంది. ఒక శరీరం యెంత ఎక్కువగా  కండరములు కలిగివుంటే  రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించటానికి అది అంత ఎక్కువ గ్లూకోజ్ ను కాల్చవచ్చు.

ఇతర కారణాలు                                                                                                                                                       ఇన్సులిన్ నిరోధకత యొక్క కారణాలలో జాతి,  కొన్ని వ్యాధులు; హార్మోన్లు; స్టెరాయిడ్ వినియోగం; కొన్ని మందులు; పెద్ద  వయస్సు, నిద్ర, సమస్యలు ప్రత్యేకంగా  తాత్కాలికంగా నిద్రలో ఊపిరి ఆగిపోవటము మరియు ధూమపానం ఉండవచ్చు.

నిద్రకు ప్రాధాన్యత ఉందా?

అవును. చికిత్స చేయబడని నిద్ర సమస్యలు, ముఖ్యంగా నిద్రలో ఊపిరి ఆగిపోవటము,  స్థూలకాయం, ఇన్సులిన్ నిరోధకత, మరియు టైప్ 2 మధుమేహం యొక్క ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనాలు  చూపుతున్నాయి.  నైట్ షిఫ్ట్ లో పనిచేసే వాళ్లకు కూడా ఈ సమస్యల ప్రమాదం ఎక్కువగా  ఉండవచ్చు. స్లీప్ అప్నియా అనేది నిద్రలో ఒక వ్యక్తి యొక్క శ్వాస ఆగిపోయే ఒక సాధారణ రుగ్మత. ప్రజలు వారి శ్వాసలో అంతరాయము కలిగినపుడు లేదా తగ్గినపుడు తరచుగా వారు వారి గాఢమైన  నిద్ర నుండి బయటకు వచ్చి తేలికైన నిద్రలోనికి పోవడము జరుగుతుంది. ఇది పగటి సమయములో నిద్రమత్తు,  లేదా అధిక అలసటను కలిగించే  తక్కువ నాణ్యత గల నిద్రను  కలిగిస్తుంది.

చాలా మంది వ్యక్తులకు తమ లక్షణాల గురించి తెలియదు మరియు పరీక్ష చేయబడరు.  ప్రజలు తమకు నిద్ర సమస్యలు వున్నాయని అనుకొన్నవారు  తమ ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో  తప్పక  మాట్లాడాలి.

ప్రీడయాబెటస్ అంటే ఏమిటి?

ప్రీడయాబెటస్ అనేది రక్త గ్లూకోజ్ లేదా A1C స్థాయిలు-ఇవి సగటు బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలని ప్రతిబింబిస్తాయి-సాధారణం కంటే ఎక్కువగా వుండి కానీ మధుమేహంగా నిర్ధారణ చేయగలిగినంత ఎక్కువ స్థాయిలో వుండని ఒక పరిస్థితి.  ప్రీడయాబెటస్ భారతదేశంలో సర్వసాధారణమైపోయింది. 2012 లో  20 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు  వున్నవారు 7 కోట్ల మంది ప్రీ డయాబెటిస్  కలిగి వున్నారు.   ప్రీడయాబెటిస్ కలిగివున్న ప్రజలు టైప్ 2 మధుమేహము,  మరియు CVD, అభివృద్ధి అయ్యే ఎక్కువ    ప్రమాదము కలిగివున్నారు మరియు ఇవి గుండెపోటు లేదా స్ట్రోక్ కు దారితీస్తాయి.

ఇన్సులిన్ నిరోధకత అనేది టైప్ 2 మధుమేహం మరియు ప్రీడయాబెటస్ తో ఎలా సంబంధం కలిగివున్నది?

ఇన్సులిన్ నిరోధకత అనేది టైప్ 2 మధుమేహం మరియు ప్రీడయాబెటస్ అభివృద్ధి అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రీడయాబెటస్ సాధారణంగా ఇప్పటికే ఇన్సులిన్ నిరోధకత కలిగిన వ్యక్తుల్లో సంభవిస్తుంది. ఇన్సులిన్ నిరోధకత ఒక్కటే  టైప్ 2 మధుమేహంనకు కారణం కాకపోయినప్పటికీ,  తరచుగా ఇన్సులిన్-ఉత్పాదక బీటా కణాల మీద అధిక డిమాండ్ ఉంచడం ద్వారా వ్యాధికి వేదికను అమర్చుతుంది. ప్రీడయాబెటస్ లో, బీటా కణాలు ఇన్సులిన్ నిరోధకత అధిగమించేంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేక పోవడము వలన రక్త గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థాయి కంటే పెరిగేలా చేస్తాయి.

ఒక వ్యక్తికి ఒకసారి ప్రీడయాబెటస్ వస్తే, నిరంతర బీటా కణాల పనితీరు తగ్గుదల సాధారణంగా టైప్ 2 మధుమేహంనకు దారితీస్తుంది. టైప్ 2 మధుమేహం కలిగిన వ్యక్తులకు అధిక రక్త గ్లూకోజ్ ఉంటుంది. కాలక్రమేణా, అధిక రక్త గ్లూకోజ్  నరములను మరియు రక్త నాళాలను దెబ్బ తీస్తుంది  మరియు  గుండె జబ్బులు, స్ట్రోక్, అంధత్వం, మూత్రపిండాల వైఫల్యం, మరియు దిగువ అంగము  అంగచ్ఛేదం వంటి సంక్లిష్టతలకు దారితీస్తుంది.

వారు వారి జీవన శైలిని మార్చనంత వరకు, ప్రీడయాబెటస్ కలిగిన చాలా మందికి  10 సంవత్సరముల లోపు టైప్ 2  మధుమేహము అభివృద్ధి  చెందుతుంది అని అధ్యయనాలు చూపాయి. జీవనశైలిలో మార్పులలో  వారి ఆహారం మరియు శారీరక శ్రమ స్థాయి మార్పులు చేయడం ద్వారా వారి శరీర బరువులో 5 నుండి 7 కిలోలు తగ్గించుకోవడం– 100 కిలోలు బరువు వున్నవారు 5 నుండి 7 కిలోలు   తగ్గించుకోవడం వుంటాయి.

ఇన్సులిన్ నిరోధకత మరియు ప్రీడయాబెటస్ యొక్క లక్షణాలు ఏమిటి?

ఇన్సులిన్ నిరోధకత మరియు ప్రీడయాబెటస్ సాధారణంగా ఏ లక్షణాలు కలిగి వుండవు.  ప్రజలు వారు వాటిని కలిగి వున్నారని తెలియకుండా అనేక సంవత్సరాలు ఒకటి లేదా రెండు పరిస్థితులు కలిగి ఉండవచ్చు.  లక్షణాలు లేకుండా కూడా , ప్రమాద కారకాలు అని కూడా పిలువబడే వారి భౌతిక లక్షణాలను బట్టి ప్రమాదం గల ప్రజలను ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు గుర్తించగలరు.

ఇన్సులిన్ నిరోధకత యొక్క ఒక తీవ్రమైన రూపముతో వున్న ప్రజలు వారి మెడ చుట్టూ, సాధారణంగా  మెడ వెనుక, నల్లటి  చర్మ పాచెస్ కలిగి ఉండవచ్చు. కొన్నిసార్లు ప్రజలు వారి మెడ చుట్టూ ఒక నల్లటి రింగ్ ను కలిగి వుంటారు. నల్లటి  పాచెస్  మోచేతులు, మోకాళ్లు, మెటికలు, మరియు చంకల మీద కూడా కనిపించవచ్చు. ఈ పరిస్థితిని అకాన్తోసిస్  నిగ్రికాంస్ అని  అంటారు.

ప్రీడయాబెటస్ కొరకు ఎవరిని పరీక్షించాలి?

అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ADA)  ప్రీడయాబెటస్ ను గుర్తించే పరీక్షకు అధిక బరువు లేదా ఊబకాయం మరియు మధుమేహం యొక్క ఒకటి లేదా ఎక్కువ అదనపు ప్రమాద కారకాలను కలిగిన పెద్దలను పరిగణించవచ్చునని  సిఫార్సు చేస్తోంది.  “బాడీ మాస్ ఇండెక్స్ (BMI)” విభాగం ఒక వ్యక్తి అధిక బరువు లేదా ఊబకాయం కలిగి వున్నాడా అని ఎలా గుర్తించాలో వివరిస్తుంది. అయితే, అధిక బరువు ఉన్న ప్రతి ఒక్కరూ టైప్ 2 మధుమేహంను పొందరు. ఈ ప్రమాద కారకాలు లేకుండా వున్న  ప్రజలు 45 సంవత్సరాల వయసులో పరీక్ష ప్రారంభం చేయాలి.

ప్రీ డయాబెటిస్ కు ప్రమాద కారకాలు – అధిక బరువు లేదా ఊబకాయం ఉండటం లేదా 45 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగివుండటముతో పాటు-ఇవి కూడా వుంటాయి:

 • శారీరకంగా చురుకుగా ఉండటం
 • మధుమేహం గల ఒక పేరెంట్ లేదా తోబుట్టువును కలిగిఉండటము
 • 4 కిలోలు కంటే ఎక్కువ బరువు కల ఒక బిడ్డకు జన్మనివ్వడము
 • గర్భధారణ మధుమేహం నిర్ధారణ కావటము – గర్భధారణ సమయములో మాత్రమే అభివృద్ధి చెందే మధుమేహము.
 • అధిక రక్తపోటు-140/90 mmHg లేదా పైన లేదా అధిక రక్తపోటుకు చికిత్స పొందబడటము.
 • 35 mg/dL కంటే తక్కువ వున్న HDL కొలెస్ట్రాల్ స్థాయి లేదా 250 mg/dL కన్నా ఎక్కువ వున్న ఒక ట్రైగ్లిజరైడ్ స్థాయి.
 • పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(PCOS) ను కలిగి ఉండటము.
 • అంతకుముందు పరీక్షలో ప్రీడయాబెటస్, బలహీనమైన నిరాహార గ్లూకోస్ (IFG), లేదా దెబ్బతిన్న గ్లూకోస్ టాలరెన్స్ (IGT) ను కలిగి ఉండటము
 • ఊబకాయం లేదా అకన్తోసిస్ నిగ్రికాన్స్ లాంటి ఇన్సులిన్ నిరోధకతతో సంబంధం కలిగిన ఇతర పరిస్థితులను కలిగిఉండటము
 • CVD ని కలిగి ఉండటము

పరీక్ష ఫలితాలు సాధారణంగా ఉంటే, పరీక్ష కనీసం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పునరావృతం చేయాలి. ప్రారంభ రోగనిర్ధారణ కోసం టెస్టింగ్ ముఖ్యం. ప్రీడయాబెటస్ ను ప్రారంభములోనే కనుగొనడము వలన  ప్రజలకు వారి జీవనశైలిలో మార్పు చేసుకోడానికి మరియు టైప్ 2 మధుమేహం మరియు CVD ని నిరోధించడానికి సమయం ఇస్తుంది. ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు తొలి ఫలితాలను బట్టి  మరియు ప్రమాదం స్థితిని బట్టి ఎక్కువ తరచుగా పరీక్షను సిఫారసు చేయవచ్చు.

బరువుతో  పాటు, శరీరంలో అదనపు కొవ్వు యొక్క స్థానం ముఖ్యమైనది కావచ్చు. పురుషులకు 40 అంగుళాలు లేదా ఎక్కువ మరియు మహిళలకు 35 అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ ఒక నడుము కొలత అనేది ఇన్సులిన్ నిరోధకతతో అనుసంధానించబడుతుంది మరియు టైప్ 2 మధుమేహం కోసం ఒక వ్యక్తి యొక్క ప్రమాదాన్ని పెంచుతుంది. ఒక వ్యక్తి యొక్క శరీర ద్రవ్యరాశి సూచిక (BMI) సాధారణ పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఇది నిజం.

నడుమును ఎలా కొలవాలి?

నడుము కొలవటానికి, ఒక వ్యక్తి ఈ  క్రిందివి చేయాలి

 • తుంటి ఎముక పైననే మామూలు ఉదరం చుట్టూ ఒక టేపు కొలతను ఉంచండి
 • టేప్ సౌకర్యవంతమైనదిగా వుండాలి కానీ చర్మంలోకి చొచ్చుకొని ఉండకుండా మరియు నేలకు సమాంతరంగా ఉండేలా నిర్ధారించుకోండి
 • రిలాక్స్ అవ్వండి, ఊపిరి విడచండి మరియు కొలవండి

 బాడీ మాస్ ఇండెక్స్ (BMI)

బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎత్తుతో సంబంధము కలిగిన శరీర బరువు యొక్క ఒక కొలమానం. పెద్దలు వయస్సు 20 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వున్నవారు సాధారణ బరువు, అధిక బరువు, లేదా ఊబకాయంతో ఉన్నారా అని కనుగొనేందుకు BMI చార్ట్ ఉపయోగించి క్రింది దశలను అనుసరించండి:

 • ఎడమ చేతి కాలమ్ లో వ్యక్తి యొక్క ఎత్తును కనుగొనండి.
 • వ్యక్తి యొక్క బరువు దగ్గరగా వున్న సంఖ్యను కనుగొనేందుకు అడ్డంగా కదలండి
 • అప్పుడు, ఆ కాలమ్ ఎగువన వున్న సంఖ్యను కనుగొనండి

కాలమ్ ఎగువన వున్న సంఖ్య BMI అయి ఉంటుంది. BMI సంఖ్య పైన పదాలు ఆ వ్యక్తి సాధారణ బరువు, అధిక బరువు, లేదా ఊబకాయం కలిగి వున్నాడా అని సూచిస్తాయి. అధిక బరువు లేదా ఊబకాయం గల వ్యక్తులు బరువు కోల్పోవడానికి మరియు మధుమేహ ప్రమాదం తగ్గించడానికి మార్గాల గురించి ఒక ఆరోగ్య సంరక్షణ ప్రదాత లేదా నమోదిత డైటిషియన్ తో విషయము ఆలోచించాలి.

BMI చార్ట్ కు నిర్దిష్ట కొన్ని పరిమితులున్నాయి. చార్ట్ అథ్లెట్లు మరియు ఒక కండరాల శరీరము కల ఇతరుల విషయములో శరీర కొవ్వు ను అతిగా అంచనా వేయవచ్చు మరియు కండరాలు కోల్పోయిన వృద్ధుల మరియు ఇతరుల విషయములో శరీర కొవ్వు ను తక్కువ అంచనా వేయవచ్చు. పిల్లలు మరియు యువకుల కొరకు వయస్సు మరియు సెక్స్ తో పాటు ఎత్తు మరియు బరువు ఆధారంగా BMI ను నిర్ణయించాలి.

బాడీ మాస్ ఇండెక్స్ టేబుల్

జీవక్రియ సిండ్రోమ్ అంటే ఏమిటి?                                                                                                                                                   ఇన్సులిన్ నిరోధకత సిండ్రోమ్ అని కూడా పిలువబడే జీవక్రియ సిండ్రోమ్ అధిక బరువు మరియు ఒబేసిటీతో సంబంధము కలిగిన ఒక విలక్షనాల సమూహము మరియు మెడికల్ పరిస్థితులు కలిగిన వీరికి CVD మరియు టైప్ 2 మధుమేహం రెండింటీ  ప్రమాదము వుంటుంది. జీవక్రియ సిండ్రోమ్ ఈ క్రింది   వాటిలో ఏవైనా మూడింటిని కలిగి ఉండడంగా నిర్వచించబడుతున్నది.

 • పెద్ద నడుము పరిమాణము – పురుషులకు 40 అంగుళాలు లేదా ఎక్కువ మరియు మహిళలకు 35 అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ.
 • రక్తములో ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ – 150 mg/dL  లేదా అంతకన్నా ఎక్కువ  ట్రైగ్లిజరైడ్స్ స్థాయి లేదా పెరిగిన  ట్రైగ్లిజరైడ్ స్థాయిలు కోసం ఔషధాలను వాడడము
 • రక్తములో అసాధారణ స్థాయిలలో కొలెస్ట్రాల్ – పురుషులకు HDL, లేక మంచి, కొలెస్ట్రాల్ స్థాయి 40 mg/dL కన్నా క్రింద మరియు మహిళలకు 50 mg/dl కన్నా క్రింద లేదా తక్కువ HDL కోసం మందులు తీసుకొనడము
 • అధిక రక్తపోటు– రక్తపోటు స్థాయి 130/85 లేక అంతకంటే ఎక్కువ, లేదా పెరిగిన రక్తపోటుకు మందులు తీసుకొనడము
 • సాధారణము కంటే ఎక్కువ రక్త గ్లూకోజ్ స్థాయిలు – ఉపవాస రక్త గూకోజ్ స్థాయి 100 mg/dl లేక అంతకంటే ఎక్కువ లేక  పెరిగిన రక్త గ్లోకోజ్ కు మందులు తీసుకొనడము

టైప్ 2 మధుమేహంతో పాటు జీవక్రియ సిండ్రోమ్ ఈ క్రింది ఆరోగ్య రుగ్మతలకు కూడా జతచేయబడింది:

 • ఊబకాయం
 • CVD
 • PCOS
 • మద్యరహిత ఫ్యాటీ లివర్ వ్యాధి
 • దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి

అయితే, ఈ రుగ్మతలు వున్న ప్రతి ఒక్కరికీ ఇన్సులిన్ నిరోధకత ఉండదు, మరియు కొంతమంది  వ్యక్తులు ఈ లోపాలు లేకుండా ఇన్సులిన్ నిరోధకత కలిగి ఉండవచ్చు.

ఊబకాయం గలవారు లేదా  జీవక్రియ సిండ్రోమ్, ఇన్సులిన్ నిరోధకత,  టైప్ 2 మధుమేహం, లేదా ప్రీడయాబెటస్ గలవారు తరచుగా శరీరము అంతా తక్కువ స్థాయిలో మంట మరియు రక్తము గడ్డ కట్టే లోపాలు కలిగి వుంటారు, అవి ధమనులలో రక్తం గడ్డకట్టడం అభివృద్ధి అయ్యే ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ పరిస్థితులు CVD కు గురయ్యే అధిక ప్రమాదానికి దోహదం చేస్తాయి.

ఇన్సులిన్ నిరోధకత మరియు ప్రీడయాబెటస్ ఎలా నిర్ధారణ చేయబడతాయి?

ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు ఒక వ్యక్తికి ప్రీడయాబెటస్ ఉందో లేదో అని గుర్తించడానికి రక్త పరీక్షలు ఉపయోగిస్తారు. కానీ సాధారణంగా అవి ఇన్సులిన్ నిరోధకత కోసం ప్రత్యేకంగా పరీక్షించవు. ఇన్సులిన్ నిరోధకత రక్తంలో ఇన్సులిన్ స్థాయిని కొలవడం ద్వారా అంచనా వేయబడుతుంది.

అయితే, ఇన్సులిన్ నిరోధకతను చాలా ఖచ్చితంగా కొలిచే యూగ్లీ సెమిక్ క్లామ్ప్ అని పిలువబడే  పరీక్ష చాలా ఖరీదు అయినది మరియు ఆరోగ్య సంరక్షణ ప్రదాతల యొక్క కార్యాలయాలలో ఉపయోగించడానికి సంక్లిష్టము అయినది. క్లాంప్ అనునది గ్లూకోజ్ మెటాబాలిజం గురించి ఎక్కువ తెలుసుకొనడానికి శాస్త్రవేత్తలు వాడే ఒక పరిశోధన సాధనము. రక్త పరీక్షలో ప్రీ డయాబెటిస్ వుందని చూపిస్తే ఇన్సులిన్ నిరోధకత కూడా చాలా వరకు ఉండవచ్చును అని పరిశోధన చూపించింది.

ప్రీడయాబెటస్ కోసం రక్త పరీక్షలు

అన్ని రక్త పరీక్షలు, ఒక ఆరోగ్య సంరక్షణ ప్రదాత యొక్క కార్యాలయం లేదా వాణిజ్య సౌకర్యం వద్ద రక్తం తీయడం మరియు విశ్లేషణ కోసం శాంపుల్ ను ఒక ప్రయోగశాలకు పంపడం వంటి వాటిని కలిగి వుంటాయి.  పరీక్షల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి రక్తం యొక్క ల్యాబ్ విశ్లేషణ అవసరమవుతుంది. ఒక ఆరోగ్య సంరక్షణ ప్రదాత యొక్క కార్యాలయంలో గ్లూకోజ్ ను కొలిచేందుకు  ఉపయోగించే  ఫింగర్-స్టిక్ లాంటి పరికరాలు నిర్ధారణ కోసం తగినంత ఖచ్చితమైనవి కాదు కానీ అధిక రక్త గ్లూకోజ్ యొక్క శీఘ్ర సూచికగా ఉపయోగించవచ్చు.

ప్రీడయాబెటస్ ను క్రింది రక్త పరీక్షలలో ఒకదానితో కనుగొనవచ్చు:

 • A1C పరీక్ష
 • ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ (FPG) పరీక్ష
 • ఓరల్ గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ (OGTT)

A1C పరీక్ష. కొన్నిసార్లు హిమోగ్లోబిన్ A1C, HbA1c, లేదా గ్లైకాల్ హిమోగ్లోబిన్ అని పిలువబడే ఈ పరీక్ష గత 3 నెలల సగటు బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను ప్రతిబింబిస్తుంది. ఈ పరీక్ష ప్రీడయాబెటస్ కొరకు అత్యంత నమ్మకమైన పరీక్ష, కానీ ఇది ఇతర పరీక్షలలాగా సున్నితమైనది కాదు. కొందరు వ్యక్తులలో ఇది ప్రిడయాబెటిస్ కనుగొనలేకపోవచ్చు, దానిని  గ్లూకోజ్ పరీక్షల ద్వారా కనుగొనవచ్చు.

కొందరు ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు త్వరగా వారి కార్యాలయంలో A1C ని లెక్కించగల్గినప్పటికీ, పాయింట్-అఫ్-కేర్ పరీక్ష అని పిలువబడే ఆ రకం కొలత, నిర్ధారణ కోసం నమ్మకమైనదిగా పరిగణించబడదు.  ప్రీడయాబెటస్ నిర్ధారణకు, A1C పరీక్షను  NGSP ద్వారా సర్టిఫికేట్  పొందిన ఒక పద్ధతిని ఉపయోగించి ప్రయోగశాలలో విశ్లేషించాలి.

ఫలితాలతో జోక్యం చేసుకొంటాయని తెలిసిన కొన్ని పరిస్థితులు ఉన్న ప్రజలకు ప్రీడయాబెటస్ ను నిర్థారించడానికి A1C పరీక్ష అవిశ్వసనీయమైనది కావచ్చు. A1C ఫలితాలు రక్త గ్లూకోజ్ పరీక్ష ఫలితాల నుండి చాలా భిన్నంగా కనిపించినప్పుడు, జోక్యాన్ని అనుమానించాలి. ఆఫ్రికన్, మధ్యధరా, లేదా ఆగ్నేయ ఆసియా సంతతికి చెందినవారు  లేదా సికిల్ సెల్ ఎనీమియా లేదా ఒక తలస్సేమియా వున్న ప్రజలు మరియు వారి  కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా జోక్యము యొక్క ప్రమాదము కలిగి వుంటారు. ఈ సమూహాలలో ఉన్న వ్యక్తులు, కొన్ని  A1C పరీక్షలతో జోక్యం చేసుకునే హిమోగ్లోబిన్ వేరియంట్ అని పిలువబడే కొంత తక్కువ సాధారణ రకము హిమోగ్లోబిన్ ను కలిగివుంటారు.

5.7 నుండి 6.4 శాతము వుండే ఒక A1C, ప్రీడయాబెటస్ ను సూచిస్తుంది.

ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష.  ఈ పరీక్ష కనీసం 8 గంటలు ఏమీ తినకుండా వున్న వ్యక్తులలో రక్తంలో గ్లూకోజ్ ను కొలుస్తుంది.  ఈ పరీక్ష ఉదయము సమయములో చేసిన యెడల  నమ్మదగినది. ఈ పరీక్షతో కనుగొనబడిన  ప్రీడయాబెటస్ ను IFG అంటారు.

100 mg నుండి 125 mg/dl వుండే నిరాహార గ్లూకోస్ స్థాయిలు, ప్రీడయాబెటస్ ను సూచిస్తాయి.

OGTT.  ఈ పరీక్ష ప్రజలు గత 8 గంటలనుండి ఏమీ తినకుండా వుండిన తర్వాత మరియు ఒక ఆరోగ్య సంరక్షణ ప్రదాత లేదా ప్రయోగశాల అందించిన ఒక తీపి ద్రవము త్రాగిన రెండు గంటల తర్వాత రక్తంలో గ్లూకోస్ ను కొలుస్తుంది. ఈ పరీక్షతో కనుగొనబడిన  ప్రీడయాబెటస్ ను IGT అంటారు.

140 నుండి 199 mg/dl మధ్య వుండే రక్త గ్లూకోజ్ స్థాయి, ప్రీడయాబెటస్ ను సూచిస్తుంది.

ఈ  క్రింది పట్టిక ప్రీడయాబెటస్ యొక్క రోగ నిర్ధారణ కోసం రక్త పరీక్ష స్థాయిలను లిస్టు చేస్తుంది.

టెస్ట్ ఫలితాలను అర్థము చేసుకోవడము

ఒక రక్త పరీక్ష ప్రీడయాబెటస్ ను  సూచించింది అంటే  క్లోమము లోని బీటా కణాలు ఇకపై భర్తీ చేయలేకపోయే స్థాయికి ఇన్సులిన్ నిరోధకత పెరిగినదని  మరియు ఒక వ్యక్తి యొక్క రక్త గ్లూకోజ్ స్థాయిలు టైప్ 2 డయాబెటిస్ వరకు పెరుగుతున్నాయని అర్థము.  పరీక్ష ఫలితాలు ఎంత ఎక్కువగా వుంటే టైప్ 2 మధుమేహము యొక్క ప్రమాదం అంత ఎక్కువ వున్నట్లు. ఒక వ్యక్తి యొక్క ప్రమాద స్థాయి అతని ఇతర ప్రమాద స్థాయిలపైన ఆధారపడి వుంటుంది. అవి “ఎవరు ప్రీడయాబెటస్ కొరకు పరీక్ష చేయబడాలి?” అనే విభాగములో లిస్టు చేయబడినవి.

టెస్ట్ నెంబర్లు. ఉదాహరణకు, ప్రజలు A1C 5.7 శాతం కంటే దిగువన ఉన్నప్పటికీ వారు టైప్ 2 మధుమేహం యొక్క కుటుంబ చరిత్ర కలిగి లేదా నడుము చుట్టూ అధిక బరువు వుంటే వారు మధుమేహము యొక్క ప్రమాదమును కలిగి వుంటారు. 6.0 శాతం పైన A1C తో వున్నవారిని మధుమేహం బారినపడే ప్రమాదం చాలా అధికంగా వున్నవారిగా పరిగణించాలి.  6.5 శాతం లేదా ఆపై  స్థాయి అంటే మధుమేహం కలిగివున్నారు అని అర్థము.

అనుసరణ. పరీక్ష ఫలితాలలో ప్రీడయాబెటస్ ఉన్నవారుగా గుర్తించబడిన ప్రజలు 1 సంవత్సరం లోపల మరల పరీక్షించబడాలి మరియు టైప్ 2 మధుమేహ ప్రమాదాన్ని తగ్గించేందుకు జీవనశైలి మార్పులు చేయడాన్ని పరిగణించాలి.

విభిన్నమైన ఫలితాలు.  ఈ అన్ని పరీక్షలు ప్రీడయబెటిస్ కొరకు ఉపయోగించబడినప్పటికీ, కొంతమంది ప్రజలలో ఒక పరీక్ష వారు ప్రీడయాబెటీస్  లేక మధుమేహము కలిగి వున్నారని సూచిస్తే మరియొక పరీక్ష చూపించదు. విభిన్నమైన పరీక్ష ఫలితాలు వున్నవారు వ్యాధి ప్రారంభ దశలో ఉండవచ్చు, వారి చక్కర గ్లూకోజ్ స్థాయిలు ప్రతి పరీక్షలో కనపడే స్థాయికి చేరుకోలేదు.

ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు పరీక్ష ఫలితాలను నిర్ధారించేందుకు ప్రయోగశాల పరీక్షలను పునరావృతం చేస్తారు. డయాబెటిస్ కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది,  కాబట్టి  పరీక్ష ఫలితాల్లో వైవిధ్యాలు ఉన్నప్పటికీ, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు మొత్తం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు ఎప్పుడు చాలా ఎక్కువ అవుతాయి అని చెప్పగలరు.

ఇన్సులిన్ నిరోధకత మరియు ప్రీడయాబెటస్ ను తలక్రిందులు చేయగలమా?                                                                                    అవును. శారీరక శ్రమ మరియు శరీరం బరువు తగ్గించు కొనడము వలన ఇన్సులిన్ కు బాగా స్పందించడానికి శరీరానికి సహాయం చేస్తుంది. డయాబెటిస్ నివారణ ప్రోగ్రామ్ (DPP) డయాబెటిస్ అధిక ప్రమాదం గల 3.234 ప్రజల పైన అధ్యయనం చేయబడినది.

DPP మరియు ఇతర పెద్ద అధ్యయనాలు ప్రీడయాబెటస్ తో వున్న ప్రజలు కొవ్వు మరియు కేలరీలను తక్కువుగా వున్న ఆహారమును తీసుకోవడం మరియు శారీరక శ్రమను పెంచడం ద్వారా తగు పరిమాణంలో బరువు కోల్పోపోతే మధుమేహాన్ని నిరోధించగలరు లేదా ఆలశ్యము చేయగలరు – ఉదాహరణకు ఒక రోజుకు 30 నిమిషాలు చొప్పున, వారానికి 5 రోజులు నడవడము.

మధుమేహం కొరకు అధిక ప్రమాదం గల ప్రజలు

DPP అధ్యయనంలో పాల్గొన్న వారు అధిక బరువు మరియు ప్రీడయాబెటస్ కలిగి వుండినారు. చాలా  మంది టైప్ 2 మధుమేహముతో వున్న కుటుంబసభ్యులను కలిగి వుండినవారు.  ప్రీడయాబెటిస్, స్థూలకాయం, మరియు మధుమేహం యొక్క ఒక కుటుంబ చరిత్ర అనేవి టైప్ 2 మధుమేహంనకు బలమైన ప్రమాదకారకాలు.

DPP లో పాల్గొన్నవారిలో గర్భధారణ మధుమేహం చరిత్రగా వున్న స్త్రీలు మరియు 60 ఆ పైన వయస్సు గలవారు వంటి టైప్ 2 మధుమేహ ప్రమాదకారకాలు కలిగిన వారు కూడా వున్నారు.

మధుమేహాన్ని అరికట్టడానికి మార్గాలు

DPP పరీక్షించిన మూడు మధుమేహ నివారణా విధానాలు:

 • జీవనశైలి మార్పులు చేయడము. జీవనశైలి మార్పు విభాగంలోని వ్యక్తులు, సాధారణంగా రోజుకు సుమారుగా 30 నిమిషాల చొప్పున వారానికి అయిదు రోజులు నడవడం ద్వారా వ్యాయామం చేసారు,  మరియు క్రొవ్వు మరియు కెలోరీలు తగ్గించి  తీసుకున్నారు.
 • మధుమేహం మందు మెట్ఫోర్మిన్ తీసుకొనడము. మెట్ఫోర్మిన్ తీసుకున్న వారు కూడా శారీరక శ్రమ గురించి మరియు ఆహారం గురించి సమాచారం అందుకున్నారు.
 • మధుమేహం గురించి నేర్చుకొనడము. మూడవ సమూహం మాత్రమే శారీరక శ్రమ మరియు ఆహారం గురించిన సమాచారం అందుకున్నది మరియు ఒక  ప్లేసిబో తీసుకొన్నది –  అందులో మందులేని ఒక మాత్ర.

జీవనశైలి మార్పు సమూహంలోని ప్రజలు ఉత్తమ ఫలితాలను చూపించారు. అయితే మెట్ఫోర్మిన్ తీసుకున్న వారు కూడా లాభపడ్డారు.  అధ్యయనం యొక్క మొదటి సంవత్సరంలో 7 కిలోలు సగటున నష్టపోవడం ద్వారా, జీవనశైలి మార్పు విభాగంలోని వ్యక్తులు  3 సంవత్సరాలుగా 58 శాతం వరకు టైప్ 2 మధుమేహం అభివృద్ధి చెందే వారి ప్రమాదము తగ్గించుకున్నట్టుగా ఫలితాలు చూపాయి.

జీవనశైలి మార్పు 60 మరియు ఆపైన వయస్సు గలవారిలో మరింత సమర్థవంతంగా వున్నది.  ఈ సమూహములోని ప్రజలు ప్రమాదమును 71 శాతము వరకు తగ్గించుకొన్నారు.

మెట్ఫోర్మిన్ విభాగంలోని వ్యక్తులు కూడా 31 శాతం ప్రమాదమును తగ్గించుకుని లాభపడ్డారు.

శాశ్వత ఫలితాలు

ది డయాబెటిస్ ప్రివెన్షన్  ప్రోగ్రామ్ అవుట్ కమ్స్ స్టడీ (DPPOS) బరువు తగ్గడం మరియు మెట్ఫోర్మిన్ యొక్క ప్రయోజనాలు కనీసం 10 సంవత్సరాల పాటు వుంటాయని చూపించింది. 2001 లో DPP ముగిసినప్పటి నుండి DPP లో పాల్గొన్నవారిని DPPOS అనుసరించడము కొనసాగించింది.  DPP లో నమోదుచేసుకున్న 10 సంవత్సరాల తరువాత ఈ క్రిందివి జరిగాయని DPPOS చూపించింది

 • జీవనశైలి మార్పు విభాగంలోని వ్యక్తులు మధుమేహము అభివృద్ధి చెందే వారి ప్రమాదమును 34 శాతము వరకు తగ్గించుకొన్నారు.
 • జీవనశైలి మార్పు సమూహంలోని 60 లేదా ఎక్కువ వయస్సు వున్నవారు మధుమేహము బారిన పడే వారి ప్రమాదమును 49 శాతము వరకు తగ్గించుకొని మరింత లాభపడ్డారు.
 • జీవన శైలి మార్పు సమూహములో పాలుపంచుకున్నవారు వారి గుండె వ్యాధి ప్రమాదమును నియంత్రించేందుకు తక్కువ మందులు తీసుకోన్నప్పటికీ, తక్కువ రక్తపోటు మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలు సహా తక్కువ గుండె మరియు రక్తనాళ వ్యాధి ప్రమాదకారకాలు కలిగి వుండినారు.
 • మెట్ఫోర్మిన్ గ్రూపులోని వారు మధుమేహము అభివృద్ధి అయ్యే వారి ప్రమాదమును 18 శాతం వరకు తగ్గించుకొన్నారు.

జీవనశైలి మార్పులతో బరువు నియంత్రించడం సవాలు అయినప్పటికీ, ఇది టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం తగ్గించడం, రక్త గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడం, మరియు ఇతర హృదయవ్యాధి ప్రమాద కారకాలు తగ్గించడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు కల్పిస్తుంది.

ఏ చర్యలు  ఇన్సులిన్ నిరోధకత మరియు ప్రీడయాబెటస్ వెనుకకు మళ్లేలా చేయడములో సహాయపడతాయి?

బరువును కోల్పోవడం మరియు మరింత శారీరకంగా చురుకుగా ఉండటం ద్వారా,  ప్రజలు ఇన్సులిన్ నిరోధకత మరియు ప్రీడయాబెటస్ ను వెనుకకు మళ్ళించవచ్చు, తద్వారా టైప్ 2 మధుమేహము నివారించడం లేక ఆలశ్యము చేయవచ్చు. ఈ క్రింది వాటి ద్వారా ప్రజలు వారి ప్రమాదాన్ని తగ్గించవచ్చు

 • ఒక ఆరోగ్యకరమైన ఆహారం తినడం మరియు ఒక ఆరోగ్యకరమైన బరువును చేరడము మరియు కొనసాగించడం
 • శారీరక శ్రమ పెంచడము
 • ధూమపానం చేయకుండా ఉండడము
 • ఔషధాలను తీసుకొనడము

తినడం, డైట్, మరియు న్యూట్రిషన్

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అవలంబించడం అనేది ప్రజలు ఒక మధ్యస్థ పరిమాణంలో బరువు  కోల్పోడానికి మరియు ఇన్సులిన్ నిరోధకతను తిరోగమనము చేయడానికి సహాయపడగలదు. నిపుణులు ప్రజలను తీవ్రమైన వెయిట్-లాస్ పరిష్కారాలకు ప్రయత్నిoచకుండా, వారు నిర్వహించగల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నెమ్మదిగా పాటించడానికి ప్రోత్సహిస్తున్నారు.  ప్రజలు ఒక ఆహార నిపుణుని సహాయము పొందే అవసరం రావచ్చు లేదా మద్దతు కోసం ఒక వెయిట్-లాస్ ప్రోగ్రామ్ లో చేరే అవసరం రావచ్చు.

సాధారణంగా  ప్రజలు, ఆరోగ్యకరమైన ఆహారాలు ఎంచుకోవడం, భాగాలు నియంత్రించటం, తక్కువ కొవ్వు తినడం, మరియు శారీరక శ్రమ పెంచడం ద్వారా బరువు కోల్పోవాలి. ప్రజలు వారికి ఇష్టమైన ఆహారమును ఒక ఆరోగ్యకరమైన ఆహారపు ప్రణాళికకు ఏలా ఆపాదించాలి అని తెలుసుకొన్నప్పుడు వారు సమర్థవంతంగా బరువును కోల్పోగలరు మరియు దానిని నివారిస్తారు.

NIH చే అభివృద్ధి చేయబడిన DASH ( డైయటరీ అప్రోచస్ టు స్టాప్ హైపర్ టెన్షన్) తినే ప్రణాళిక, బరువు తగ్గడము మరియు శారీరక శ్రమతో కలిసినప్పుడు, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడములో ప్రభావవంతమయినవిగా చూపించింది.

డైటరీ సప్లిమెంట్స్

విటమిన్ D అధ్యయనాలు  రక్తములో గ్లూకోజ్ ఆరోగ్యకరమైన స్థాయిలో వుంచడములో ప్రజల సామర్థ్యము మరియు వారి రక్తములో చాలినంత విటమిన్ D ని కలిగివుండడము మధ్య ఒక సంబంధమును చూపిస్తాయి. అయినప్పటికీ, మధుమేహమును నిరోధించడానికి సరయిన విటమిన్ D స్థాయిని నిర్ధారించడానికి అధ్యయనాలు కొనసాగించబడుతున్నాయి; మధుమేహముతో వున్న ప్రజలకొరకు  విటమిన్ D స్థాయిల గురించి లేక సప్లిమెంట్ల గురించి ప్రత్యేకమైన సిఫార్సులు చేయబడలేదు.

ప్రస్తుతం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ (IOM), ప్రస్తుత సైన్సు ఆధారంగా సప్లిమెంటేషన్ స్థాయిలు సిఫార్సులు చేసే ఏజెన్సి, రోజూ విటమిన్ D తీసుకొనడము కొరకు ఈ క్రింది మార్గాదర్శకాలు అందిస్తున్నది:

 • 1 నుండి 70 సంవత్సరములు గల ప్రజలకు 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ (ఐ యూ ఎస్) అవసరము అవవచ్చును.
 • 71 నుండి మరియు ఆపైన వయస్సు గల ప్రజలకు 800 ఐ యూ ఎస్ ల వరకు అవసరము రావచ్చును.

ఐ ఓ ఎం రోజుకు 4000 ఐ యుఎస్ ల కంటే ఎక్కువ  తీసుకోనరాదని కూడా సిఫార్సు చేసినది.

సమన్వయ మరియు సురక్షితంగా సంరక్షణ నిర్ధారించడములో సహాయపడడానికి, ప్రజలు వారి ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో, ఆహార ప్రత్యామ్నాయాలు ఉపయోగంతో సహా పరిపూరకమైన మరియు మరియు ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులు గురించి చర్చించవలసి వున్నది.

శారీరక శ్రమ

క్రమము తప్పని   శారీరక శ్రమ పలు ప్రమాద కారకాలను ఒక్కసారి నిర్వహిస్తుంది.  క్రమము తప్పని శారీరక శ్రమ, శరీరం ఇన్సులిన్ ను సరిగా ఉపయోగించడములో సాయపడుతుంది.

క్రమము తప్పని శారీరక శ్రమ ఒక వ్యక్తికి ఈ విధంగా కూడా సహాయపడుతుంది

 • బరువు కోల్పోడానికి
 • రక్త గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి
 • రక్తపోటును నియంత్రించడానికి
 • కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి

రోజుకు 30 నిమిషాల చొప్పున, వారానికి 5 రోజులు శారీరకంగా చురుకుగా ఉన్న DPP లో ప్రజలు, వారి  టైప్ 2 మధుమేహ ప్రమాదమును తగ్గించుకొన్నారు. చురుకైన వాకింగ్ ను చాలా మంది వారి శారీరక శ్రమగా ఎంచుకున్నారు.

చాలా మంది వారంలో చాలా రోజులు కనీసము రోజుకు 30 నిమిషాల వ్యాయామాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి.  ఉత్తమ ఫలితాల కోసం, ప్రజలు  పెద్ద కండరము సమూహాలకు ఉపయోగించి గుండె వేగంగా కొట్టుకోనే విధంగా చేసే ఏరోబిక్ చర్యలు, మరియు కండరాలను బలపరిచేటటువంటి చర్యలు  రెండూ  చెయ్యాలి.

ఏరోబిక్ చర్యలలో చురుకైన వాకింగ్, మెట్లు ఎక్కడం, స్విమ్మింగ్, డ్యాన్స్, మరియు గుండె రేటు పెంచే ఇతర చర్యలు ఉంటాయి.

కండరాల బలపరిచేటటువంటి కార్యకలాపాలలో బరువులు ఎత్తడం మరియు గుంజీలు లేదా పుష్-అప్స్ చేయడం ఉంటాయి.

ఇటీవల శారీరకంగా చురుకుగా లేని వ్యక్తులు వారి ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో తమకు సరిపోయిన ఉత్తమ  శారీరక శ్రమ గురించి  మాట్లాడి ఎక్సర్ సైజు కార్యక్రమము మొదలు పెట్టేముందు ఒక చెక్ అప్ చేయించుకోవలయును.

ధూమపానం వదలండి

పొగ త్రాగే వారు దానిని  వదలి పెట్టవలయును. ఒక ఆరోగ్య సంరక్షణ ప్రదాత ప్రజలు ధూమపానం వదులుకొనడానికి మార్గాలు కనుగొనేందుకు సహాయపడతారు. అధ్యయనాలు సహాయం పొందే వ్యక్తులు మానివేయడానికి ఒక మంచి అవకాశం కలిగినట్టుగా చూపిస్తున్నాయి.

మందులు  

మెట్ఫోర్మిన్ మందు టైప్ 2  మధుమేహం యొక్క  చాలా అధిక ప్రమాదం గల కొంతమంది వ్యక్తుల యొక్క చికిత్స కోసం సిఫార్సు చేయబడింది. DPP లో, మెట్ఫోర్మిన్ ప్రీడయాబెటస్ తో వున్న యువకులు, ఎక్కువ బరువు వున్న  ప్రజలలో టైప్ 2  మధుమేహం అభివృద్ధిని నివారించడము లేదా   ఆలస్యం చేయడములో అత్యంత ప్రభావవంతంగా వుందని చూపించినది. సాధారణంగా, మెట్ఫోర్మిన్ 60 కంటే తక్కువ వయస్సు ఉన్నవారి మరియు ఈ క్రిందివి వున్న వారి కోసం సిఫార్సు చేయబడుతుంది.

 • IGT మరియు IFG కలిపి
 • 6 శాతం పైన A1C
 • తక్కువ HDL కొలెస్ట్రాల్
 • ఎదిగిన ట్రైగ్లిజరైడ్స్
 • మధుమేహం గలిగిన తల్లి, తండ్రి లేదా సహోదరి, సహోదరుడు
 • కనీసం 35 గల ఒక BMI

మెట్ఫార్మిన్ గర్భధారణ మధుమేహం కలిగిన మహిళల్లో కూడా మధుమేహ ప్రమాదం తగ్గిస్తుంది. అధిక ప్రమాదము కలిగిన ప్రజలు టైప్ 2 మధుమేహము నిరోధించడానికి వారు మేటఫోర్మిన్ తీసుకోనవలసి ఉంటుందా అని వారి ఆరోగ్య సంరక్షణ ప్రదాతని అడగాలి.

అనేక ఔషధాలు అనేక స్థాయిలలో  టైప్ 2 మధుమేహం ప్రమాదం తగ్గించడము చూపబడింది, కానీ టైప్ 2 మధుమేహ నివారణ కోసం ADA ద్వారా సిఫార్సు చేయబడిన మందు మెట్ఫోర్మిన్ మాత్రమే. మధుమేహం రావడము ఆలస్యము చేసిన ఇతర మందులకు దుష్ప్రభావాలు వుంటాయి లేక శాశ్వత ప్రయోజనాలను కలిగించలేదు. మెట్ఫోర్మిన్ తో  సహా ఏ మందులకు, ఇన్సులిన్ నిరోధకశక్తి లేదా ప్రీడయాబెటస్ ను చికిత్స చేయడానికి లేదా టైప్ 2 మధుమేహం నిరోధించడానికి US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి లేదు.

గుర్తుంచుకోవలసిన పాయింట్లు

 • ఇన్సులిన్ శరీరంలోని కణాలు గ్లూకోజ్ గ్రహించడం మరియు శక్తికి ఉపయోగించడంలో సహాయపడే ఒక హార్మోన్. ఇన్సులిన్ నిరోధకత అనేది శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది కాని సమర్థవంతంగా దానిని ఉపయోగించలేని ఒక స్థితి.
 • ఇన్సులిన్ నిరోధకత టైప్ 2 మధుమేహం మరియు ప్రీడయాబెటస్ అభివృద్ధి అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది.
 • ఇన్సులిన్ నిరోధకత యొక్క ప్రధాన కారణాలు అదనపు బరువు, ముఖ్యంగా నడుము చుట్టూ వున్నది, మరియు శారీరక స్తబ్దత.
 • ప్రీడయాబెటస్ అనేది రక్త గ్లూకోజ్ లేదా A1C స్థాయిలు-ఇవి సగటు బ్లడ్ గ్లూకోజ్ స్థాయిని ప్రతిబింభిస్తాయి- సాధారణము కంటే ఎక్కువ, కానీ మధుమేహంగా నిర్దారించేందుకు చాలినంత ఎక్కువగా ఉండని ఒక స్థితి.
 • మధుమేహం నివారణ ప్రోగ్రామ్ (DPP) అధ్యయనం మరియు దాని తదుపరి అధ్యయనం అయిన మధుమేహం నివారణ ప్రోగ్రామ్ ఫలితాల స్టడీ (DPPOS), ప్రీడయాబెటిస్ తో వున్నవారు కొవ్వును మరియు కేలరీలు తగ్గించుకొనడము ద్వారా మధ్యస్థoగా బరువు కోల్పోవడము వలనను మరియు శారీరక శ్రమ పెంచడము వలననూ మధుమేహము నివారించవచ్చు లేదా ఆలస్యము చేయవచ్చునని నిర్ధారించాయి.
 • బరువు కోల్పోవడం మరియు మరింత శారీరకంగా చురుకుగా ఉండటం ద్వారా, ప్రజలు ఇన్సులిన్ నిరోధకతను మరియు ప్రీ డయాబెటిస్ ను రివర్స్ చేసి తద్వారా టైప్ 2 మధుమేహము ను నివారించవచ్చు లేదా ఆలశ్యము చేయవచ్చు.
 • ఇన్సులిన్ నిరోధకత మరియు ప్రీడయాబెటస్ తో వున్న ప్రజలు ఒక ఆరోగ్యకరమైన ఆహారం తినడం మరియు ఒక ఆరోగ్యకరమైన బరువుకు చేరడము మరియు దానిని కొనసాగించడం, శారీరక శ్రమ పెంచడము, ధూమపానం మానడము  వల్ల మధుమేహము యొక్క ప్రమాదమును తగ్గించగలరు.
 • DPP, యువకులు మరియు ఎక్కువ బరువు వున్న వారిలోనూ మరియు గర్భధారణ మధుమేహము కలవారిలోనూ మధుమేహము మందు మేటఫోర్మిన్, టైప్ 2 మధుమేహమును నివారించడము లేక ఆలస్యము చేయడములో చాలా ప్రభావవంతంగా ఉంటుందని చూపినది.

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు