ఇన్సులిన్ తీసుకోవడం కోసం ప్రత్యామ్నాయ పరికరాలు

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456

మధుమేహం ఉన్న చాలా మంది ప్రజలు వారి వ్యాధిని నిర్వహించేందుకు తప్పక ఇన్సులిన్ ను తీసుకోవాలి. ఇన్సులిన్ తీసుకునే చాలా మంది చర్మానికి కొంచెం కింద ఇన్సులిన్ ను ఇంజెక్ట్ చేసుకోడానికి ఒక సూది మరియు సిరంజిని వుపయోగిస్తారు. ఇన్సులిన్ తీసుకోవడం కోసం అనేక ఇతర పరికరాలు అందుబాటులో ఉన్నాయి మరియు కొత్త విధానాలు అభివృద్ధి చేయబడుతున్నాయి. ఇన్సులిన్ తీసుకోవడం కోసం ఒక వ్యక్తి ఏది అవలంభిచాడనేది కాదు, రక్తంలో గ్లూకోస్ స్థాయిల యొక్క స్థిరమైన పర్యవేక్షణ ముఖ్యం.  మంచి రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ మధుమేహ సమస్యలను నిరోధించగలదు.

ఇన్సులిన్ ను తీసుకోవడం కోసం ప్రత్యామ్నాయ పరికరాలు అందుబాటులో ఉన్నాయి?

ఇన్సులిన్ పెన్నులు ఇన్సులిన్ ను ఎక్కించుకోడానికి సౌకర్యవంతమైన సులభమైన పద్ధతిని అందిస్తాయి మరియు  ప్రామాణిక సూది లేదా సిరంజి కంటే తక్కువ భాదాకరమైనవి కావచ్చు. ఒక ఇన్సులిన్ పెన్ చూసే దానికి ఒక కాట్రిడ్జి గల ఒక పెన్ లాగా కనిపిస్తుంది.  ఈ పరికరాలు కొన్ని తిరిగివుంచగల ఇన్సులిన్   క్యాట్రిడ్జ్లను ఉపయోగిస్తాయి.  ఇతర పెన్నులు ఇన్సులిన్ తో ముందే నింపబడి ఉంటాయి మరియు ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసిన తర్వాత పూర్తిగా పారవేయదగినవిగా ఉంటాయి.  ఇన్సులిన్ పెన్ ను ఉపయోగించు వారు ఇంజెక్షన్ ఉపయోగించే ముందు పెన్ కొన మీద ఒక చిన్న, సన్నటి, వాడి పడేసే సూదిని బిగిస్తారు.  . అప్పుడు యూజర్లు, కావలసిన ఇన్సులిన్ మోతాదును ఎంచుకొనుటకు డయల్ ను త్రిప్పుతారు, సూదిని ఎక్కిస్తారు, మరియు చర్మానికి కొంచెం కింద ఇన్సులిన్ ను పంపుటకు ప్లంగెర్ చివర నొక్కుతారు. ఇన్సులిన్ పెన్నులను ఇతర దేశాల కంటే భారతదేశంలో తక్కువ విస్తృతంగా ఉపయోగిస్తారు.

ఎక్స్టర్నల్ ఇన్సులిన్ పంపులు సాధారణంగా ఒక పేకాట కార్డు లేదా సెల్ ఫోన్ పరిమాణంలో ఉంటాయి, సుమారు 3 ఔన్సులు బరువు ఉంటాయి మరియు బెల్ట్ మీద ధరించవచ్చు లేదా జేబులో తీసుకెళ్లవచ్చు. చాలా పంపులు ఒక  వాడి పడేసే ప్లాస్టిక్ కాట్రిడ్జిను ఇన్సులిన్ రిజర్వాయర్ గా ఉపయోగిస్తాయి. గాజు బుడ్డి నుండి క్యాట్రిడ్జ్ల ను ఇన్సులిన్ తో నింపుటకుకు  యూజర్ ను అనుమతించడానికి ఒక సూది మరియు ప్లంగర్ ను క్యాట్రిడ్జ్ల కు తాత్కాలికంగా జతచేస్తారు. యూజర్లు  అప్పుడు సూదిని మరియు ప్లంగర్ ను తీసివేస్తారు మరియు నింపిన క్యాట్రిడ్జ్ల ను పంప్ లోకి ఎక్కిస్తారు.

 

ఇన్సులిన్ పంపులు అనేక రోజుల పాటు తగినంత ఇన్సులిన్ ను కలిగి ఉంటాయి. ఒక ఇన్ఫ్యూషన్ సెట్ వంగే ప్లాస్టిక్ గొట్టం మరియు చర్మం కింద ప్రవేశ పెట్టిన మెత్తని గొట్టం లేక సూది ద్వారా పంప్ నుండి ఇన్సులిన్ ను శరీరానికి తీసుకోనిపోతుంది.

వాడి పడేసే ఇన్ఫ్యూషన్ సెట్లు శరీరం మీద పొట్ట లాంటి ఒక ఇన్ఫ్యూషన్ సైట్ కు ఇన్సులిన్ ను పంపుటకు ఇన్సులిన్ పంపులను ఉపయోగిస్తాయి. ఇన్ఫ్యూషన్ సెట్లలో ఒక కాన్యులా (ఆహారం కడుపులోకి పంపేందుకు ఉపయోగించే గొట్టం)- ఒక సూది లేక ఒక మెత్తని చిన్న గొట్టం- ఉంటుంది, దానిని యూజర్ చర్మ కణజాలం వెనకాల ప్రవేశ పెడతారు. కాన్యులాను ప్రవేశపెట్టుటకు సహాయం చెయ్యడానికి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇరుకైన, అనువైన ప్లాస్టిక్ గొట్టాలు పంపు నుండి ఇన్ఫ్యూషన్ సైట్ కు ఇన్సులిన్ ను తీసుకుపోతాయి. చర్మం యొక్క పై భాగంలో, ఒక అంటుకునే పాచ్ లేదా డ్రెస్సింగ్ ఇన్ఫ్యూషన్ సెట్ ను యూజర్  కొన్ని రోజుల తరువాత దానిని తిరిగి భర్తీ చేసేంత వరకు ఆ స్థలంలో నిలుపుతుంది.

ఇన్సులిన్ యొక్క స్థిరమైన చిన్న ధార (ట్రికెల్ లేదా “బాసల్” ) అంత పరిమాణాన్ని రోజంతా నిరంతరం ఇచ్చుటకు యూజర్లు పంపులను  ఏర్పాటు చేసుకుంటారు. భోజన సమయంలో మరియు  అప్పుడప్పుడు యూజర్లు ద్వారా సెట్ చేయబడిన కార్యక్రమంలో రక్తంలో గ్లూకోజ్ చాలా ఎక్కువగా వున్నప్పుడు-పంపులు ఇన్సులిన్ యొక్క బోలస్ మోతాదులను కూడా ఇవ్వగలవు- ఏక-కాల పెద్ద మోతాదులు. ఇన్సులిన్ మోతాదులను నిర్ణయించటానికి మరియు ఇన్సులిన్ పంపిణీ ని నిర్ధారించడానికి రక్తంలో గ్లూకోజ్  పర్యవేక్షణ తరచుగా అవసరం.

ఇంజెక్షన్ పోర్ట్సు రోజువారీ సూది మందులకు ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పరుస్తాయి. ఇంజెక్షన్ పోర్ట్సు పొడవాటి గొట్టాలు లేని ఇన్ఫ్యూషన్ సెట్లు లాగా ఉంటాయి. ఇన్ఫ్యూషన్ సెట్లు లాగా, ఇంజక్షన్ పోర్ట్సు చర్మం అడుగున కణజాలంలోకి ప్రవేశ పెట్టిన ఒక కాన్యులా ను కలిగి ఉంటాయి. చర్మం యొక్క పై భాగంలో ఒక అంటుకునే పాచ్ లేదా డ్రెస్సింగ్ పోర్ట్ ను ఆ స్థలంలో నిలుపుతుంది. యూజర్లు ఒక సూది మరియు సిరంజితో వున్న పోర్ట్ లేక ఇన్సులిన్ పెన్ ద్వారా ఇన్సులిన్ ను ఎక్కించుకుంటారు. పోర్ట్ అనేక రోజులు ఆ స్థానంలోనే ఉండిపోతుంది మరియు ఆ తరువాత మార్చబడుతుంది. ఒక ఇంజెక్షన్ పోర్ట్ ను ఉపయోగించడం అనేది ప్రతీ కొన్ని రోజులకు ఒక క్రొత్త పోర్ట్ ను అప్లై చేసేందుకు గాట్ల సంఖ్యను ఒక దానికి తగ్గించడానికి ఒక వ్యక్తిని అనుమతిస్తుంది.

ఒక ఇంజెక్షన్ పోర్ట్ ను ఉపయోగించడం అనేది ప్రతీ కొన్ని రోజులకు ఒక క్రొత్త పోర్ట్ ను అప్లై చేసేందుకు గాట్ల సంఖ్యను ఒక దానికి తగ్గిస్తుంది. యూజర్ ఇన్సులిన్ ను పోర్ట్ ద్వారా పంపిస్తాడు.

ఇంజెక్షన్ పరికరాలు స్ప్రింగ్ లోడెడ్ సిరంజి హోల్డర్స్ లేదా స్టెబిలైజింగ్ మార్గదర్శకాలను  ఉపయోగించడం ద్వారా సూదులు మరియు సిరంజిలతో వున్న ఇంజెక్షన్లను ఇచ్చుటకు యూజర్లకు  సహాయం చేసే పరికరాలు. అనేక ఇంజక్షన్ పరికరాలకు ఒక బటన్ వుంటుంది, యూజర్లు ఇన్సులిన్ ను ఎక్కించడానికి దానిని నొక్కుతారు.

ఇన్సులిన్ ను పంపుటకు ఒక సూదిని వుపయోగించడానికి బదులుగా ఇన్సులిన్ జెట్ ఇంజెక్టర్ ఒక సన్నని ఇన్సులిన్ స్ప్రే ను ఎక్కువ ఒత్తిడితో చర్మంలోకి పంపుతుంది.

ఒక కృత్రిమ క్లోమము కొరకు అవకాశాలు ఏమిటి?

ప్రస్తుత ఇన్సులిన్ చికిత్స యొక్క పరిమితులను అధిగమించడానికి, పరిశోధకులు ఒక కృత్రిమ క్లోమం అభివృద్ధి ద్వారా గ్లూకోజ్  పర్యవేక్షణ మరియు ఇన్సులిన్ సరఫరాలను ముడిపెట్టాలని సుదీర్ఘకాలంగా ఎదురుచూసారు. ఒక కృత్రిమ క్లోమం అనేది, ఒక ఆరోగ్యకరమైన క్లోమం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిల్లో మార్పులను గుర్తించే మరియు స్రవించే ఇన్సులిన్ యొక్క సరైన మొత్తాలకు స్వయంచాలకంగా ప్రతిస్పందించే పద్దతిని, సాధ్యమైనంత దగ్గరగా అనుకరించే ఒక వ్యవస్థ. ఒక నివారణ కాకపోయినప్పటికీ, ఒక కృత్రిమ క్లోమం నకు గణనీయంగా డయాబెటిస్ కేర్ మరియు నిర్వహణను మెరుగుపరిచే మరియు రక్తంలో గ్లూకోజ్ ను పర్యవేక్షించే మరియు నిర్వహించే భారాన్ని తగ్గించే సామర్ధ్యం ఉంది.

యాంత్రిక పరికరాల మీద ఆధారపడే ఒక కృత్రిమ క్లోమం నకు కనీసం మూడు భాగాలు అవసరం:

  • ఒక కంటిన్యూయస్ గ్లూకోస్ మానిటరింగ్ (CGM) వ్యవస్థ
  • ఒక ఇన్సులిన్ సరఫరా వ్యవస్థ
  • గ్లూకోజ్ స్థాయిల మార్పుల ఆధారంగా ఇన్సులిన్ సరఫరాను సర్దుబాటు చేసే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్

యు.ఎస్. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) చే ఆమోదించబడిన CGM వ్యవస్థలలో అబోట్, డెక్స్కామ్, మరియు మెడ్ట్రానిక్ చే తయారు చేయబడినవి ఉన్నాయి.  ఒక ఇన్సులిన్ పంప్ తో జతచేయబడిన CGM వ్యవస్థ మెడ్ట్రానిక్ నుండి అందుబాటులో ఉంది. , మినీమెడ్ పారాడిగ్మ్ రియల్- టైం సిస్టం అని కూడా పిలువబడే ఈ ఇంటిగ్రేటేడ్ సిస్టం ఒక కృత్తిమ క్లోమం కాదు, అయితే అందుబాటులో వున్న అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించుకుంటూ గ్లూకోస్ పర్యవేక్షణ మరియు ఇన్సులిన్ సరఫరా వ్యవస్థలను కలపడంలోని మొదటి దశను సూచిస్తుంది.

గుర్తుంచుకోవలసిన పాయింట్లు

  • ఇన్సులిన్ అవసరం వున్న మధుమేహం ఉన్న చాలా మంది చర్మం కింద ఇన్సులిన్ ను ఎక్కించుకొనుటకు ఒక సూది లేదా సిరంజిని ఉపయోగిస్తారు.
  • ఇన్సులిన్ ను సరఫరా చేసేందుకు అత్యంత సాధారణ ప్రత్యామ్నాయ మార్గాలు ఇన్సులిన్ పెన్నులు మరియు ఇన్సులిన్ పంపులు. ఇంజెక్షన్ పోర్ట్సు, ఇంజక్షన్ ఎయిడ్స్, మరియు ఇన్సులిన్ జెట్ ఇంజెక్టర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
  • పరిశోధకులు ఒక కృత్రిమ క్లోమంను అభివృద్ధి చేస్తున్నారు, గ్లూకోజ్ స్థాయిల మార్పుల ఆధారంగా ఆటోమేటిక్ గా ఇన్సులిన్ సరఫరాను సర్దుబాటు చేసే ఒక యాంత్రిక పరికరాల వ్యవస్థ.
  • ఇన్సులిన్ తీసుకుంటున్న వ్యక్తులు క్రమం తప్పకుండా వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పర్యవేక్షించుకోవాలి.
  • మంచి గ్లూకోజ్ నియంత్రణ మధుమేహ సమస్యలను నిరోధించగలదు.

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు